Rings
-
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
ఉంగరాల సింగరాజు రింగులో ఫింగరు!
పదిహేనేళ్ల నుంచీ రాజకీయాలు చేస్తున్నా తనకు రాజకీయ నాయకుడి ముద్ర, ఆ గుర్తింపు లేకపోవడం, ఎంతసేపూ తనను సినిమా హీరోగానే ప్రజలు చూస్తుండడం.. అటు టీడీపీ, వైఎస్సార్సీపీ కేడర్, ఆ పార్టీ నాయకులు సైతం తనను ప్యాకేజీ స్టార్ అని అవమానిస్తుండడంతో.. ఇక లాభం లేదు, ఎలాగైనా తన జాతకం మార్చాలని.. మార్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడైన పవన్ కళ్యాణ్ ఓ రోజు బురఖా వేసుకుని టాంక్ బండ్ మీద చిలక జోతిష్యం చెప్పే వారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చెట్టుకు చేరబడి బీడీ కాలుస్తున్న జ్యోతిష్యం గంగరాజు ఒక్కసారి ఈ బురఖా చూసి ఎలర్ట్ అయ్యాడు. బేరం తగిలిందని సంబరపడుతూ రామ్మా..చిలకమ్మా మంచి బేగం బేరం వచ్చిందమ్మా అంటూ పవన్‌ను చాపమీద కూర్చోబెట్టాడు. చేతిని చూసి అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయి కానట్లుంది.. మీకు మగ లక్షణాలే ఉన్నాయి దానికితోడు మీకు మూడునాలుగు పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రాజకీయంగా కూడా ఎదుగుదల లేదు. ఎంతసేపూ వేరేవారి ఎదుగుదలకు మీరు పనికొస్తారు తప్ప మీ క్రేజీ మీకు పనికిరాదు. మీరు పోటీ చేసినా ఓడిపోయే ప్రమాదాలు ఉన్నాయి.. మీకు కళారంగమే పనికొస్తుంది..అందులు ట్రై చేయండి అంటూ చెబుతున్నాడు. దీంతో లోపలున్న పవన్ చిరాకుపడుతూనే బయటికి మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. గొంతు మార్చి ‘‘మరి నాకు విరుగుడు చెప్పండి స్వామీ.. ఏమి చేయాలో చిలుకను అడగండి’’ అన్నాడు. మళ్లీ గంగరాజు చిలుకను రావమ్మా సోనాలి బింద్రే.. ఈ బురఖా బుజ్జమ్మకు మంచి కార్డ్ తీసి ఫ్యూచర్ చూపించమ్మా అన్నాడు. అంతసేపూ లోపల జామకాయ తింటూ ఏదో మూడ్‌లో ఉన్న చిలక.. షిరాగ్గా మొహం పెట్టి ‘ఎన్నిసార్లు పిలుస్తావురా?..’ అన్నట్లు చూసింది. దాని శిరాకు చూసి గంగరాజుకు భయమేసింది. అయినా సరే ‘ఒసే సోనాలి.. మనిద్దరం పొట్లాడుకుంటే వచ్చే బేరం పోతుంది . ఈసారికి వచ్చి ఏదో కార్డ్ తీసి మొహాన కొట్టిపోవే’ అన్నాడు వేరే భాషలో. దీంతో సరే అడుక్కుంటున్నవు కాబట్టి వస్తున్నా అన్నట్లు చూసి మెల్లగా బయటికి వచ్చి ఓ పాము బొమ్మ ఉన్న కార్డ్.. తాబేలు బొమ్మ కార్డు తీసి బయట గిరాటేసి. ‘ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే పారిపోతాను’ అన్నట్లు వార్నింగ్ లుక్కేసి పెట్టెలో దూరింది. దీంతో బురఖా లోపలున్న పవన్ ఆ కార్డులు చూసి ఇదేంటి స్వామి పాములు తాబేళ్లు అంటోంది(అంటాడు). ‘‘నేనేమైనా వాటి యపారం చెయ్యాలా?’’ అన్నాడు కంగారుగా!. దీంతో గంగరాజు చిరునవ్వు నవ్వి ‘లేదు అమ్మా.. మీరు ఈ రెండు బొమ్మలున్న ఉంగరాలు పెట్టుకోండి. ఇక మీకు తిరుగే ఉండదు.. మా సోనాలి మీద ఒట్టు’ అన్నాడు.. హమ్మయ్య బ్రతికించాడు అనుకుని పవన్ వెంటనే రెండువేలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే చేతికి ఉంగరాలు వచ్చాయి.. తాబేలు.. పాము ఉన్న ఉంగరాలతో జనంలోకి వచ్చి చేతులు తిప్పుతున్నారు. అదన్నమాట పవన్ గారి ఉంగరాల కథ! ✍️ సిమ్మాదిరప్పన్న -
అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఎంగేజ్మెంట్ రింగ్స్
-
ఉంగరాల టీనా
తన దశ తిరిగి అదృష్టం కలిసి రావాలని పేరు మార్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. అలాగే చేతి వేళ్లకు ఐదుకు పైగా ఉంగరాలు ధరించారు. కెరీర్ బాగానే ఉన్నా, కొత్తగా అదృష్టం కోసం దిశా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ‘కెటీనా’ సినిమా కోసం. దిశా పటానీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్ సినిమాకు ‘కెటీనా’ అనే పేరు ఖరారు చేశారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే పంజాబీ యువతి టీనా పాత్రలో నటిస్తున్నారు దిశా. ఇది బయోపిక్ అని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఛండీగర్‌లో ప్రారంభమైంది. ‘‘మామూలుగా ఆమె పేరు టీనా. కానీ తన జ్యోతిష్కురాలు చెప్పారని తన పేరు ముందు ‘కె’ చేర్చుకోవడంతో కెటీనాగా మారింది’’ అంటూ ఈ సినిమాలోని దిశా పటానీ లుక్‌ను విడుదల చేశారు చిత్రనిర్మాత ఏక్తా కపూర్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు. -
గుజరాత్ డైమండ్ వ్యాపారులకు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన దంపతులు గుజరాత్ వ్యాపారులకు టోకరా వేశారు. కమీషన్ పద్ధతిలో విలువైన ఉంగరాలు అమ్మిపెడతామంటూ ఎర వేశారు. వారి నుంచి రూ.1.6 కోట్లు ఖరీదు చేసే ఆరు ఉంగరాలు తీసుకుని మోసం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. గురువారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి కొన్నేళ్లుగా హైదరాబాద్ వచ్చిపోతూ వ్యాపారం చేస్తున్నాడు. వజ్రాలతో పాటు ఖరీదైన రాళ్లు పొదిగిన ఆభరణాలు, ఉంగరాలకు తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సిటీకి చెందిన దంపతులతో పరిచయం ఏర్పడింది. నగరంలో తామూ వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నామంటూ వారు అతడితో చెప్పారు. తమకు అనేక మంది పరిచయస్తులైన వారు, సంపన్న వర్గాలకు చెందిన కస్టమర్లు ఉన్నారని, తమకు కొన్ని ఉంగరాలు ఇస్తే అమ్మి పెడతామంటూ ఎర వేశారు. అలా చేస్తే కమీషన్ సైతం ఇస్తానంటూ చెప్పిన గుజరాత్ వ్యాపారి కొన్ని నెలల క్రితం రూ.1.5 కోట్ల విలువైన నాలుగు ఉంగరాలు (ఒకటి వజ్రం, మిగిలిన మూడు ఖరీదైన రాళ్లు పొదిగినవి) ఇచ్చాడు. వీటికి సంబంధించిన నగదు చెల్లించమని దంపతుల్ని వ్యాపారి కోరగా.. ఇంకా అమ్ముడుపోలేదంటూ కొన్నాళ్లుగా నమ్మబలుకుతూ వస్తున్నారు. ఆపై ఖరీదు చేసిన వారి నుంచి డబ్బు రావాల్సి ఉందని మరికొన్ని రోజులు తప్పించుకున్నారు. చివరకు అతడికి అందుబాటులో లేకుండా ఉంటున్నారు. ప్రతి నెలా సిటీకి వస్తున్న గుజరాత్ వ్యాపారి ఇక్కడి ఓ సమాజ్‌లో ఉంటూ నగదు వసూలు కోసం రెండుమూడు రోజులు ప్రయత్నించి వెళ్లేవాడు. ఇలా ఆ సమాజ్‌లో ఈయన ఉన్నప్పుడే గుజరాత్‌కు చెందిన మరో వ్యక్తీ వచ్చి ఉండేవాడు. కొన్నాళ్లకు వీరిద్దరికీ పరిచయం కావడంతో వ్యాపార విషయాలతో పాటు ఇతర అంశాలూ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో మొదటి వ్యాపారి నుంచి రూ.1.5 కోట్ల విలువైన నాలుగు ఉంగరాలు తీసుకున్న దంపతులే.. దీనికి కొన్నాళ్ల ముందే మరో వ్యాపారి నుంచి రూ.15 లక్షల విలువైన రెండు ఉంగరాలు తీసుకుని మోసం చేసినట్లు ఇద్దరూ తెలుసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ కలిసి నగరానికి వస్తూ డబ్బు వసూలుకు ప్రయత్నాలు చేసేవారు. వీరు వచ్చి సమాజ్‌లో ఉంటున్న నాలుగు రోజూలూ ఆ దంపతులు సిటీలో లేకుండా.. ఉన్నా అందుబాటులో ఉండకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టారు. కొన్ని రోజులుగా కనీసం వీరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. దీంతో ఇద్దరు వ్యాపారులూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరువురినీ మోసం చేసింది ఒకరే కావడంతో కలిసి కొన్ని రోజుల క్రితం సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆధారాలు సేకరించిన అధికారులు సిటీకి చెందిన దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వలయాలకు సెలవిక!
బ్యూటిప్స్ తాజా టొమాటోను మెత్తని పేస్ట్‌లా చేసి... అందులో కాస్త నిమ్మరసం, చిటికెడు పసుపు, చెంచాడు శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కళ్ల కింది నల్లటి వలయాల మీద రాస్తే మంచి ఫలితముంటుంది.పుదీనా ఆకుల్ని మెత్తగా నూరి, కాసింత పాల క్రీమ్ చేర్చి కళ్లకింద బాగా రుద్దాలి. వారానికి రెండుమూడు సార్లు ఇలా చేస్తే... డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా పసుపు వేసి కలపాలి. దీన్ని పడుకునేముందు కళ్ల కింది వలయాలపై పూసి, ఉదయం లేచిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో వలయాలు మాయమైపోతాయి. బాదంపప్పుల్ని నానబెట్టి, తోలు తీసి, మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీనిలో కాసింత క్రీమ్, కొద్దిగా పసుపు వేసి కలిపి వారినికోసారైనా రాస్తూ ఉంటే... డార్క్ సర్కిల్స్ ఏర్పడవు. -
మోమే వనం...ముక్కెరే సుమం
తగరపువలస : ఆడవాళ్లకు ముక్కెర(నత్తు) ఓల్డ్ ఫ్యాషన్. ప్రస్తుతం అమ్మవారి విగ్రహాలకు తప్ప ముక్కెర ఎవరూ ధరించడంలేదు. కానీ ఇప్పటికీ ముక్కెరను సంప్రదాయంగా ధరిస్తున్న భీమిలి మండలం మజ్జిపేట గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరికి ముక్కెర అలంకారప్రాయంగా కనిపిస్తుంది. -
శవాన్ని కూడా వదలని ఘరాన కిలాడి దొంగ
టెక్సాస్: అమెరికాలో ఓ మహిళా దొంగ మృతదేహాన్ని దోచుకుంది. అంత్యక్రియలకు తీసుకొచ్చిన ఓ 88 ఏళ్ల మహిళ మృతదేహం చేతికి ఉన్న బంగారపు ఉంగరాలను గుట్టుచప్పుడుకాకుండా దొంగిలించి కారులో పారిపోయింది. అయితే, ఆ దొంగతనం దృశ్యం మాత్రం దహన సంస్కారాలు పూర్తి చేసే భవనంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీని ప్రకారం పశ్చిమ టెక్సాస్ లోని ఒడెస్సాలో 88 ఏళ్ల మహిళ చనిపోయింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి స్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసే భవనంలో పెట్టి వెళ్లారు. వారికి తెలియకుండానే వెనుక వచ్చిన ఓ మహిళ ఎవరూ లేనిది చూసి ఆ పెట్టెను తెరిచి ఆ మృతదేహం చేతి వేలి ఉంగరాలను దొంగిలించుకొని పారిపోయింది. తర్వాత వచ్చి చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను గుర్తించేందుకు ఫొటోలు, వీడియో విడుదల చేశారు. ఆ మహిళను తాము ఇంతవరకు చూడలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
11:59:59
సందర్భం చెట్టు క్యాలెండర్ చూసుకొని చిగురేస్తుందా? పిట్ట అలారం పెట్టుకొని లేస్తుందా? జంతువులు జనవరి ఫస్ట్ విషెస్ చెప్పుకుంటాయా? పాపం... వాటి మానాన అవి పని చేస్తుంటాయి. తిథులూ, వారాలూ, వర్జ్యాలూ చూసుకోవు. రాహుకాలం, యమ గండం తెలియదు. అందుకే వాటికి దినదిన గండం. అయితే తనకు నూరేళ్లాయుష్షు అని నమ్మే మనిషి పరిస్థితి వేరు. కాలం కీళ్లు విరిచేసి... తేదీలనీ, నెలలనీ, సంవత్సరాలనీ విడ గొట్టాడు. మంచిరోజులూ, అమృత ఘడియలూ నిర్ణయించాడు. వాడెంత తెలివైనవాడంటే... కాలాన్ని ఫిస్టులో పట్టుకోగలనన్నాడు. సెకన్లు, నిమిషాలు, గంటలను మణికట్టుకు తిరిగాడు. కళ్లకు ముళ్లు గుచ్చుకుంటా యేమోనని గడియారంలో నలు చదరమైన డిజిటల్ అంకెలను పేర్చాడు. అలాగే క్యాలెండర్లో మంచిరోజులూ చెడ్డరోజులూ కూర్చాడు. తేదీలు, నెలలు, సంవత్సరాల్ని కాగితం మీద పేర్చాడు. క్యాలెండర్ అనే పేరిచ్చి, వాటితో గోడ కుర్చీ వేయించాడు. అయిపోయిన నెలలను మొదట శీర్షాసనం వేయించి, ఆ తర్వాత వెనక్కు మడిచేసి, చక్రాసన, ధనురాసన ఇత్యాది యోగాసన ప్రక్రియలు చేయి స్తుంటాడు. టేబుల్ క్యాలెండర్ పేరిట కొన్నింటితో బస్కీలు తీయిస్తుంటాడు. ఎర్ర రంగులో ఉన్న తేదీ వచ్చినప్పుడల్లా బడికి సెలవొస్తుందని చిన్నప్పట్నుంచే నేర్పడం మొదలు పెడతాడు. అది నిజమవుతుంది. క్యాలెండరేతర అంశాలపైనా దృష్టి సారిస్తుంటాడు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోడానికి కొందరు బయల్దేరతారు. మోసపోయే విద్యను పనిగట్టుకు నేర్చుకుంటారు. పాపం... చెట్టూ, పుట్టా, పిట్టా, సమస్త జంతుజాలాలకు ఈ విషయాలు తెలియవు కాబట్టి అవి క్యాలెండర్ చూసుకోవు. చెట్లు పైపైకి పెరుగుతాయి. పిట్టలు ముందుకెళ్లడానికి రెక్కల కష్టం చేస్తాయి. జంతుజాల సమస్తమూ ముందుకే నడుస్తాయి. కానీ మనిషి ఎంత తెలివైనవాడంటే... కాలం వెనక్కు నడవదని తెలిసినా, క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని వెనక్కు నడిపిస్తాడు. చరిత్ర తెలి యనివాడు క్రీస్తుపూర్వానికి ముందు డేట్స్ చదువుతుంటే అది ప్రింటింగ్ మిస్టేకా అని పించేలా చేస్తాడు. ముందు కెళ్తున్న రైల్లోని సగం సీట్లు వెనక్కు తిప్పి పెట్టడం అవసరమనీ, ఆ సౌలభ్యం వల్లనే సగం మందిని కూర్చోబెట్టగలుగుతున్నా మని నమ్మబలుకుతాడు. అలా కొందరిని వెనక్కి నడి పించడానికి పూను కుంటాడు. తమకు చాలా తెలుసు అనే కొందరు మనషులకు నిజంగా ఏమీ తెలి యదు. ముఖ్య దినాలనీ, ముహార్తాలనీ కొన్ని రోజులకు సుగంధ పరిమళాలు అద్దితే... ఆ సువాసనలు పీలుస్తున్నట్లు ఊహిస్తారు. మరికొన్ని దినాలను దుర్దినాలుగా ముద్రవేస్తే అవి క్షుద్రమైనవని విశ్వసిస్తుంటారు. వాళ్లు తమకన్నీ తెలుసనే భ్రాంతిలో ఉంటారు. ఇలాంటి వాళ్లను నమ్మించడం చాలా సులువు. కొందరు మహానుభావులు ఏం చెప్పినా వీళ్లు విశ్వసిస్తుంటారు. వీళ్ల కోతలెలా ఉంటాయంటే... మొద్దు నిద్దర పోతుండే కోడికి అలారం పెట్టి పొద్దున్నే లేపడం నేర్పింది తామేనని కూస్తారు. తాము ట్రబుల్ షూటర్లమంటారు. గాలి మోటర్లలో తిరుగుతారు. అల స్వర్గపురాన్ని ఇలాతలంలో నిర్మిస్తున్నామని అరచేయి చూపుతారు. మొక్కా, గిక్కా, పంటా, పసరూ పీకేస్తారు. చెట్లూ గట్రా కొట్టేస్తారు. చదునుగా చేసేస్తారు. ‘‘చూశావా... అడ్డంగా నరికి చూస్తే మొద్దులాంటి చెట్టు లోనూ రింగులు రింగులు కనిపిస్తున్నాయి. ఏడాదికేడాదీ పెరిగే వీటినే యాన్యువల్ రింగ్స్ అంటారు. ఎంత పెద్ద వయసు చెట్టుకు అన్ని రింగులు. కాబట్టి చెట్టూ ఉంగరాలు తొడుగుతుంది’’ అని చెబుతారు. ప్రజల బంగారాన్ని కొల్లగొట్టి చేతి వేళ్లకు తొడుక్కుంటారు. వేళ్లు పదే ఉండబట్టి గానీ... మరిన్ని ఉంటే వీళ్లకు రింగులు సరిపోవు. ఊడ్చేస్తారు, ఊళ్లేలతారు. ‘ఉంగరాలు మేం తొడిగాం, నడుం మీరు కట్టండంటూ మొండేనికి మొలదారం మాత్రమే మిగులుస్తారు. ఇదేంట్రా బాబూ అంటే ‘చెట్టు మొద్దుకూ, నీ మొలకూ ఇదే అందం’ అంటూ మారేడుకు మసిపూస్తారు. నేరేడులోనిది నీలి సిరా అన్ని నమ్మిస్తారు. ఆ సిరాతో విధి రాతలోని హంస పాదులను సరిచేస్తామంటారు. అన్నీ చెప్పాక... సామాన్యులకు అన్నీ దూరం చేసి, గోచీ మాత్రం మిగుల్చుతారు. అదేమిటని అడిగితే తేలికగా ఉండటంలో హాయిని అనుభవించమని సలహా ఇస్తారు. ఏతా వాతా క్యాలెండర్ మారినప్పుడల్లా ఏదో అద్భుతం జరుగుతుందని ఎందరో అనుకుంటారు. ఇంకేదో ఒరుగుతుందని ఆశపడతారు. ఆకాశాన్ని అంబరమనే అంటారంటూ... అనగా అర్థం వస్త్రమేనంటూ వ్యాఖ్యానం చెప్పి, దాని ముక్కను చింపి ఇస్తామంటారు. దానితో కొత్త బట్టలు కుట్టిస్తామంటారు. చమ్మీ ధమ్మీలతో అధికారాలు చెలాయిస్తుంటారు. కాలాన్ని వెళ్లదీస్తుంటారు. క్యాలెండర్ పుట మారితే సరిపోతుందా... కొత్త సంవత్సరాన్ని తిరగస్తే అది ‘త్తకొంరత్సవంస’ అవుతుందేమో గానీ... చేతి గీత ఎన్నడూ మారదు కదా! విధి రాత మారాలంటే కనీసం ఇది ఎన్నికల ఏడాది... 2019 అయినా కాదు కదా! - యాసీన్ -
లిఫ్ట్ ఇచ్చి... ఉంగరాలు లాక్కొన్నాడు
చైతన్యపురి: బైక్‌పై లిఫ్టు ఇచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఉంగరాలు లాక్కొని పరారయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్‌కు చెందిన రవిమోహన్ (58) శుక్రవారం రాత్రి కొత్తపేట కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని తోడల్లుడు ఇంటి వెళుతున్నాడు. ఆటో కోసం కొత్తపేట చౌరస్తాలో నిలబడి ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తా రమ్మని రవిమోహన్‌ను వాహనంపై ఎక్కించుకున్నాడు. నాగోల్ వెళ్లేదరిలో బైక్ ఆపి తన పర్సు పోయిందని అన్నాడు. దీంతో ర విమోహన్తో వాదనకు దిగి బలవంతంగా చేతికి ఉన్న పన్నెండు గ్రాముల రెండు బంగారు ఉంగరాలను లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాదితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. -
నిలువెల్లా బంగారమే..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): సాధారణంగా వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్, మెడలో గొలుసు...సహజంగా పసిడి ప్రియులకు ఉండే ఆభరణాలు. అయితే ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఏకంగా నాలుగు కేజీల బంగారంతో ఏకంగా చొక్కానే కుట్టించి పసిడిపై తనకున్న మమకారాన్ని చెప్పకనే చెప్పాడు. అంతే కాదు... మరో రెండు నెలల్లో పుత్తడి ప్యాంట్ కుట్టించుకొనేందుకు ముచ్చట పడుతున్న విషయాన్ని బైటపెట్టాడు. నాలుగు కేజీల చొక్కాతోపాటు మూడు కేజీల బరువున్న బంగారు బూట్లు, పలు నగలు నగలు ఆయన ఒంటిపై ఉండటం గమనార్హం. ఆయన పేరు పంకజ్ పరేఖ్, వస్త్రవ్యాపారి అయిన అతడు ముంబైలో శివసేన నాయకుడు. సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశం కోసం హైదరాబాద్ వచ్చిన అతడు బుధవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో సందడి చేశాడు. ధరలకు భయపడి జనం వస్త్ర సన్యాసమే చేస్తున్న ఈరోజుల్లో బంగారంతోనే చొక్కా కుట్టించుకున్న పంకజ్ పరేఖ్ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే పోలీసులు మాత్రం ఆందోళనకు గరయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, తనకు చిన్నతనం నుంచే బంగారమంటే మహాపిచ్చి అని పంకజ్ తెలిపారు. ప్యాంట్కూడా రెండు నెలల్లో అందుబాటులోకి వస్తే గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు సెలవిచ్చారు. ఇతనికి రక్షణగా నలుగురు గార్డులు అనుక్షణం వెన్నంటి ఉంటారు. -
'రూపాయి ఉంగరాల' బామ్మ
ఆదిలాబాద్ : ఎవరైనా ముత్యాలు, పగడాలు, వజ్రాలలాంటి రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలను ధరించడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిని ఆసక్తిగా ఆర్డరిచ్చి చేయించుకుంటారు. కానీ ఓ వృద్ధురాలు రూపాయి నాణాలు వేళ్లపై కనబడేలా ఉంగరాలు చేయించుకుని చేతివేళ్లకు ధరించి అందరినీ ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కండెల గ్రామానికి చెందిన రుక్మిణి బాయికి మొదటి నుంచి అలంకరణ మీద అమితమైన ఆసక్తి. ఆమె అలంకరణ కూడా అందరికంటే భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే రూపాయి నాణాలతో ఉంగరాలను తయారుచేయించుకుంది. ఆమె ధరించిన ఆ రూపాయి నాణాలు తన స్వార్జితమని, అవి తన కళ్ల ముందు ఎప్పుడూ కనబడుతూనే ఉండాలని ఇలా చేయించుకున్నానని అందరికీ చూపెడుతూ తెగ మురిసిపోతుంది ఈ రుక్మిణి బామ్మ. -
ఇదీ ఫ్యాషనే..
ఆదిలాబాద్: ఆధునిక తరం ఫ్యాషన్ పేరిట చిత్రవిచిత్రమైన ఉంగరాలను ధరించడం మనం చూస్తునే ఉన్నాం.. ఈ గిరిజనురాలు చూడండి.. పాత రూపాయి నాణేలనే ఉంగరాలుగా మార్చుకుని.. తనదైన ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తోంది. ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోతగూడలో ఈ మహిళ ధరించిన ఉంగరాలను అందరూ చిత్రంగా చూశారు. పోతగూడలో మంత్రి జోగు రామన్న సభకు వచ్చిన ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.