ఉంగరాల టీనా | disha patani new film Ktina first look release | Sakshi
Sakshi News home page

ఉంగరాల టీనా

Oct 26 2019 12:25 AM | Updated on Oct 26 2019 12:25 AM

disha patani new film Ktina first look release - Sakshi

దిశా పటానీ, ‘కెటీనా’లో దిశా పటానీ

తన దశ తిరిగి అదృష్టం కలిసి రావాలని పేరు మార్చుకున్నారు హీరోయిన్‌ దిశా పటానీ. అలాగే చేతి వేళ్లకు ఐదుకు పైగా ఉంగరాలు ధరించారు. కెరీర్‌ బాగానే ఉన్నా, కొత్తగా అదృష్టం కోసం దిశా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ‘కెటీనా’ సినిమా కోసం.  దిశా పటానీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు ‘కెటీనా’ అనే పేరు ఖరారు చేశారు.

ఆషిమా చిబ్బర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే పంజాబీ యువతి టీనా పాత్రలో నటిస్తున్నారు  దిశా. ఇది బయోపిక్‌ అని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఛండీగర్‌లో ప్రారంభమైంది. ‘‘మామూలుగా ఆమె పేరు టీనా. కానీ తన జ్యోతిష్కురాలు చెప్పారని తన పేరు ముందు ‘కె’ చేర్చుకోవడంతో కెటీనాగా మారింది’’ అంటూ ఈ సినిమాలోని దిశా పటానీ లుక్‌ను విడుదల చేశారు చిత్రనిర్మాత ఏక్తా కపూర్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement