Ekta Kapoor
-
బిగ్‌బాస్ హోస్టింగ్‌కు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో
బిగ్‌బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్‌బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. బిగ్‌బాస్ షోకు డుమ్మావారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్‌కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్‌బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలుదీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి -
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాతపై పోక్సో కేసు.. ఎందుకంటే?
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడింది. బాలీవుడ్లో ప్రముఖ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న గంధీ బాత్ సీజన్-6కు సంబంధించిన ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో యాక్ట్ కింద ఆమెతో పాటు తల్లి శోభా కపూర్ పేరు కూడా చేర్చారు.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో గంధీ బాత్ సీజన్- 6 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2021 మధ్య ప్రసారం చేశారు. బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సంస్థకు వీరిద్దరు యజమానులు కావడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. మైనర్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు చూపారని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద ఎపిసోడ్ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం కావడం లేదు.కాగా.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఏడాది లవ్, సెక్స్ ఔర్ ధోఖా- 2 మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. -
Ekta-Anita: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్ (ఫొటోలు)
-
Ekta Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!
భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్ అవార్డ్’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్‌లో ఈ అవార్డు బహూకరించారు. ఏక్తా కపూర్ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్ చానల్స్ ప్రైమ్‌టైమ్‌ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్‌ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్‌ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్‌లో కంటెంట్ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ గుర్తింపు అమెరికాలోని ‘ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్ ఆస్కార్స్లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్ ప్రైస్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్ ప్రేక్షకులను, సౌత్ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్ తన సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్‌లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. విభిన్న వ్యక్తిత్వం ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్’ కింద కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీస్తే అన్నీ రిజెక్ట్ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్ పాంచ్’ సీరియల్స్‌తో హిట్స్ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్‌తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్‌భీ కభీ బహూ థీ’ టెలివిజన్ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్పి మరే సీరియల్ పొందలేదు. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్ భాగ్య’ లాంటి 134 సీరియల్స్ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసింది. సరోగసి ద్వారా ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్ చేస్తున్న మా అన్నయ్య తుషార్కపూర్కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్‌ను తయారు చేస్తోంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్
భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'. కరణ్ బూలానీ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ అడల్ట్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో నిర్మాత ఏక్తా కపూర్ ట్విటర్ వేదికగా 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెక్షన్ నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొన్న నెటిజన్స్ నిర్మాతపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?) ఓ నెటిజన్ రాస్తూ..'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే ఏకంగా.. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామంది చెడగొడుతున్నారు.. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణమని పోస్ట్ చేశాడు. దీనికి ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ రాస్తూ..దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఆ ఛాన్సే లేదు.. నేనొక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తా’ అని కౌంటరిచ్చింది. నెటిజన్ల విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. (ఇది చదవండి: హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!) కాగా.. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సినిమాలు, సీరియల్స్‌ను కూడా నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, ది డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. -
నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీం కోర్టు ఫైర్
న్యూఢిల్లీ: బాలాజీ టెలిఫిలింస్ అధినేత, ప్రముఖ టీవీ.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ తెరకెక్కిస్తూ.. యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్‌పై నమోదు అయిన ఓ కేసులో ఏక్తా కపూర్ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం మంచి పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది కోర్టు. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవ్యాఖ్యలు చేసింది. ఏక్తా కపూర్ సమర్పణలో ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీ (ALTBalaji)లో ట్రిపుల్ ఎక్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే xxx సీజన్ 2లో సైనికుని భార్య పోర్షెన్కు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్‌నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని ముకుల్ రోహత్గికు సూచించింది. ప్రజలకు మీరు ఎలాంటి ఛాయిస్‌ను ఇస్తున్నారా? అని నిలదీసింది. అసభ్యకరమైన కంటెంట్‌తో యువతను పాడు చేయాలనుకుంటున్నారా? యువతరం మనసులను కలుషితం చేస్తున్నారంటూ దుయ్యబట్టింది. మంచి న్యాయవాదులు ఉన్నంత మాత్రానా కోర్టులు నోరున్న వారి కోసమే పని చేయవని, నోరు లేని వారి కోసం కూడా పని చేస్తుందని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఆర్డర్‌ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి. హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానిక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తూ.. ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టింది. ఇదీ చదవండి: యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. అవెలా వస్తున్నాయ్? -
కోర్టు ధిక్కరణ? నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లికి బిహార్ కోర్టు షాక్!
బాలీవుడ్ దర్శక-నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. వివరాలు.. ఎక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్ట్ సర్విస్‌మ్యాన్ శంబు కుమార్ 2020లో బీహార్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆ సిరీస్‌లో జవాన్ల భార్యలను అవమానపరిచారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సీన్స్ వారి కుటంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. శంబు కుమార్ ఫిర్యాదు మేరకు ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ అంతేకాదు ఈ విషయమై వారు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు తొలగించినప్పటికి, వారు కోర్టు ఆదేశాలని ధిక్కరించారని, నోటిసులు అందిన ఎక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంబు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని ఆయన వెల్లడించారు. కాగా 2020లో ఎక్తా కపూర్ దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌ను తన సొంత ఓటీటీ సంస్థ ఎఎల్టీబాలజీ (బాలజీ టెలిఫిలింస్ లిమిటెడ్) వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఆమె తల్లి శోభ కపూర్ కూడా చూసుకుంటారు. -
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్‌కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్‌ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్‌కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
హాట్ టాపిక్‌గా భారత్- విండీస్ వన్డే ట్రోపీ.. ఎక్తాకపూర్ తయారు చేసిందా?
భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ట్రోపీని గమనించారా. పాము ఆకారంలో ఉండి కాస్త కొత్తగా కనిపిస్తున్న ట్రోపీ లుక్ అందరిని ఆకట్టుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సైతం ట్రోపీ డిజైన్ చూసి ముచ్చటపడ్డారు. అందుకే భారత్-విండీస్ వన్డే సిరీస్ ట్రోపీ హాట్‌టాపిక్‌గా మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ట్రోపీ ఫోటోలును షేర్ చేస్తూ టెలివిజన్ స్టార్ నిర్మాత.. డైరెక్టర్.. ఏక్తాకపూర్‌ను ట్యాగ్ చేశారు.'' ఏక్తాకపూర్ ఏమైనా ఈ ట్రోపీ తయారు చేసిందా.. సిరీస్ గెలిచిన జట్టుకు పాముకాటు తప్పేలా లేదు'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఏక్తాకపూర్‌ను ట్యాగ్ చేయడం వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. సూపర్‌హిట్ సీరియల్ 'నాగిన్' గుర్తుండే ఉంటుంది. నాగిన్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు.. మన ఏక్తాకపురే. ఇప్పటివరకు నాగిన్ ఫ్రాంచైజీలో ఐదు సీజన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆరో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. అంతేకాదు హిందీలో ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌కు ఏక్తాకపూర్ నిర్మాతగా.. డైరెక్టర్‌గానూ వ్యవహరించింది. ఇక భారత్- విండీస్ వన్డే సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. సీనియర్ల గైర్హాజరీలో ధావన్ నాయకత్వంలో టీమిండియా యువ జట్టు విండీస్‌తో తలపడుతోంది. మూడు వన్డేల సిరీస్ అనంతరం జూలై 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by WINDIES Cricket (@windiescricket) -
కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా
బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా అభిప్రాయపడింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్‌కి కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో కంగనా 'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నా ముఖంపైనే చెప్పేవారు. కానీ, నా నిర్మాత ఏక్తా కపూర్ అలా అన్లేదు. నా కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసిపనిచేశాను. ఆమె చాలా మంచి వ్యక్తి. నాకు ఫస్ట్ హిట్‌ను ఇచ్చింది కూడా ఆమె. నాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.' అని తెలిపింది. -
'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?
Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మోస్ట్ డేరింగ్ హీరోయిన్ హోస్ట్‌గా 'లాకప్' అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్ ఫియర్లెస్ షో అని ప్రచారం చేసిన 'లాకప్' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్ బాలాజీ ఓటీటీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్‌గా నిషా రావల్, రెండో కంటెస్టెంట్‌గా కాంట్రవర్సీ కమెడియన్ మునవర్ ఫరూఖీని రివీల్ చేశారు. తాజాగా ఈ షోలో మూడో పార్టిస్పెంట్గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్‌గా ఉన్నందుకే లాకప్ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్. పాండే షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో పూనమ్ ఆరెంజ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్‌లో ఉన్న ఒక పిక్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
'మోస్ట్ ఫియర్లెస్ షో'కు హోస్ట్‌గా కంగనా రనౌత్ !
Kangana Ranaut Is Confirmed As Host For Ekta Kapoor Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కంగనా టికు వెడ్స్ షెరు సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో సీరియల్ !.. ఒకవేళ హిట్ కాకుంటే
హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్ సీరియల్లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా 'నాగిని' మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ ప్రధాన పాత్రలో అలరించనుంది. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లైఫ్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ సీజన్‌ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. ఒకవేళ ఈ సీజన్ అంతగా హిట్ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తుందట నిర్మాత ఎక్తా కపూర్. ఈ భారీ బడ్జెట్‌తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఎక్తా కపూర్ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ ఛానెల్లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది. Apne bhavya roop aur teeno kaal ki shaktiyon se duniya ko bachane aa rahi hai Naagin. Zaroor dekhiye #Naagin6, 12th February se Sat-Sun, raat 8 baje only on #colors.@itsmetejasswi pic.twitter.com/lEs29HCahX — ColorsTV (@ColorsTV) January 31, 2022 -
ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ
Producer Ekta Kapoor Tested Positive For Covid 19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా తన పంజా విసురుతోంది. కరోనా కలకలం బీటౌన్‌లో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే బీటౌన్ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కొవిడ్ సోకగా వారి ఇంటికి బీఎంసీ అధికారులు సీల్ వేసి శానిటైజ్ చేశారు. కమల్ హాసన్, కరీనా కపూర్, నోరా ఫతేహీతో పాటు తాజాగా జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్ కరోనా చేతికి చిక్కారు. వీరితోపాటు టాలీవుడ్లో మంచు మనోజ్, నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ మహామ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోమవారం కొవిడ్ బారిన పడింది. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కొవిడ్‌కు గురయ్యాను. నేను క్షేమంగా ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అని ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది ఈ 46 ఏళ్ల ఏక్తా కపూర్. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) ఇదీ చదవండి: జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్ -
బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ మరో ప్రయోగం
ముంబై: వీడియో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్‌తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్ తెలిపారు. మొబైల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్మొబీలో భాగమైన గ్లాన్స్కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్, గ్లాన్స్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థ అయిన గ్లాన్స్ కలెక్టివ్ ’ఈకే’ బ్రాండ్ కింద మొట్టమొదటి కలెక్షన్ అందిస్తోందని ఇన్‌మొబి సీఈవో నవీన్ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్‌లో కుషన్ కవర్లు, వాల్ ఆర్ట్ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
నిర్మాతగా మారిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా..'హన్సల్ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏక్తా కపూర్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. యూకేలో షూటింగ్ జరగనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కరీనా అమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. -
1.83 కోట్ల విలువైన కారు కొన్న బుల్లితెర నటుడు
Ram Kapoor New Car: ప్రముఖ బుల్లితెర నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. సుమారు 1.82 కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన పోర్షే 911 కరీరా ఎస్ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని, పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు.. ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? అయినా.. మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా న్యాయ్ సీరియల్‌తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్ కపూర్... హీనా, సంఘర్ష్, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక హిందీ టెలివిజన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్ నిర్మించిన ఘర్ ఏక్ మందిర్‌తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హమ్‌షకల్స్, ఉడాన్, థప్పడ్ వంటి సినిమాల్లో రామ్ కపూర్ నటించాడు. కారు ధర, ముఖ్యమైన ఫీచర్లు: పోర్షే 911 కరీరా ఎస్ ధర- సుమారు 1.83 కోట్లు మైలేజ్- 11.24 కిలోమీటర్/లీటర్ ఇంజన్- 2981సీసీ ఆటోమేటిక్ డ్యుయల్ క్లచ్ పెట్రోల్ వర్షన్ 4 సీటర్ కెపాసిటీ -
ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో విద్యాబాలన్, ఏక్తా కపూర్
ప్రపంచ సినీ రంగంలో అకాడమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది ఏ క్యాటగిరి అయినా అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా క్యాటగిరిల్లో వారిని వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల జాబితాను ఆస్కార్ వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్లు ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులు ఈ ఏడాది ఆస్కార్ సభ్యులుగా ఉన్నారు. ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో ఆస్కార్ ఆకాడమీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆస్కార్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. కాగా ‘మిస్టరీ థ్రిల్లర్ కహానీ’ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతిగా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ‘పా, బూల్‌బులయ్యా, పరిణీత, బాబీ జాసూస్, శకుంతలా దేవి’ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 2011లో వచ్చిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అలాగే బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్లు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులయ్యారు. డ్రీమ్ గర్ల్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలకు వీళ్లు నిర్మాతలుగా వ్యవహరించారు. -
నటుడిపై అత్యాచార కేసు: ఏక్తాకపూర్ సంచలన వ్యాఖ్యలు
మైనర్ బాలికపై అత్యాచార, వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు పరల్ వీ పూరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని బాలిక తల్లి వాదిస్తోంది. దీంతో అక్రమంగా పరల్ను కేసులో ఇరికించారంటూ హిందీ బుల్లితెర అతడికి మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "నేను ఓ బాలిక మీద అత్యాచారం చేసినవాడికి మద్దతిస్తానా? ఎవరినైనా సరే లైంగిక వేధింపులకు గురి చేసేవారికి అండగా నిలబడతానా? కానీ నిన్నరాత్రి నుంచి నాకు ఎదురైన పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంటగలిసినట్లు అనిపిస్తోంది. మరీ ఇంత దిగజారుతారా? ఇద్దరి మధ్య గొడవలుంటే అందులోకి మూడో వ్యక్తిని అన్యాయంగా లాగుతారా? అసలు ఓ మనిషి సాటి మనిషి మీద ఇలా ఎలా చేయగలడు? మైనర్ బాలిక తల్లితో చాలాసార్లు మాట్లాడాను. పిరల్ అమాయకుడని, అతడికి దీంతో ఏం సంబంధం లేదని ఆమె స్పష్టంగా చెప్పేసింది. తన భర్తే కావాలని అతడిని ఇరికిస్తున్నాడని వెల్లడించింది. సెట్లో పని చేసే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇదంతా చేస్తున్నాడని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఘోరమైన తప్పు. మీ టూను అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం చిన్నారిని మానసికంగా హింసిస్తూ ఓ అమాయక వ్యక్తిని దోషిగా నిలబెట్టాలని చూడటం అత్యంత దారుణం. ఈ ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేల్చేందుకు నాకెలాంటి హక్కు లేదు. ఆ విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది. కానీ బాలిక తల్లి చెప్పినదాని ప్రకారం.. పిరల్ ఏమీ తెలియని అమాయకుడని స్పష్టమవుతోంది. ఇక ఉద్యోగం చేసుకునే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇలాంటి చెత్త ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరం. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) పిరల్ మీద మోపిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసేందుకు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మిగతా ఇండస్ట్రీస్లాగానే చిత్ర పరిశ్రమ కూడా కొంత సురక్షితం, మరికొంత సురక్షితం కాకపోవచ్చు. కానీ సొంత ప్రయోజనాల కోసం చిత్రపరిశ్రమకు చెడ్డ పేరు తీసుకురావడం అనేది అత్యంత నీచమైన పని" అని ఏక్తా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. బుల్లితెర సెలబ్రిటీలు సహా పలువురు అభిమానులు ఆమె పోస్టుకు మద్దు తెలుపుతూ పిరల్కు అండగా నిలుస్తున్నారు. చదవండి: అత్యాచారం, వేధింపులు కేసులో ‘నాగిని 3’ నటుడు అరెస్టు -
ఏంటి? నీకు బ్యాగు బరువైతుందా?: నిర్మాతపై సెటైర్లు
-
ఏంటి? నీకు బ్యాగు బరువైతుందా?: నిర్మాతపై సెటైర్లు
ముంబై: కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ముంబైని వీడి ఎక్కడికో పయనమైంది. ఇందుకోసం ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ముందు జాగ్రత్త కొద్దీ రెండు ఫేస్ మాస్క్‌లు ధరించింది. అయితే ఆమె కారు దిగిన వెంటనే తన సామానులను హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. కానీ ఆ బ్యాగును మాత్రం ధరించలేదు. ఆమె అసిస్టెంటు ఆ బ్యాగు మోశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా పలువురు నెటిజన్లు ఆమె తీరును తప్పు పడుతున్నారు. 'తన బ్యాగును తనే మోసుకోలేకపోతుందా?', 'ఆ చిన్న బ్యాగుకు కూడా అసిస్టెంట్ సాయం కావాలా?' అని విమర్శిస్తున్నారు. 'ఎంత ఆటిట్యూడ్ నీకు.. బ్యాగ్ బరువైతుందా? అయినా నువ్వు చాలా తెలివైనదానివి.. టీవీలో ఆదర్శభావాలు చూపించే నువ్వు, వెబ్‌సిరీస్‌లో మాత్రం అసభ్యకరమైన కంటెంట్‌ను చూపిస్తావు' అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా ఈ నిర్మాత ఇటీవలే గోవాలో 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, దిశా పటానీ, అర్జున్ కపూర్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో 'హిస్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది. చదవండి: కార్తీ డబుల్ యాక్షన్ మూవీ: హీరోయిన్గా రాశీ ఖన్నా HBD Samantha: ఒక్క సినిమా సమంత జీవితాన్నే మార్చేసింది -
ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది
జితేంద్ర అసలు పేరు రవికపూర్. కాని సినిమాల్లో రవీంద్ర కపూర్ అనే నటుడు ఉండటంతో తన పేరును జతేంద్ర అని మార్చుకున్నాడు. దాంతో జతిన్ ఖన్నాగా అసలు పేరు కలిగిన రాజేష్ ఖన్నా జితేంద్రకు దగ్గరగా ఉండే తన పేరు కాదని రాజేష్ ఖన్నా అని మార్చుకోవాల్సి వచ్చింది. రవికపూర్ (ఆర్.కె) అలా జితేంద్ర కపూర్ (జె.కె) అయితే జతిన్ ఖన్నా (జె.కె) పేరు మార్చుకుని రాజేష్ ఖన్నా (ఆర్.కె) అయ్యాడు. ఈ తారుమార్ల సంగతి ఇండియన్ ఐడెల్ తాజా ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు జితేంద్ర. మార్చి 14న టెలికాస్ట్ అయిన ఇండియన్ ఐడెల్ ‘జితేంద్ర స్పెషల్’లో పాల్గొన్న ఆయన ముంబైలో ‘చాల్’లో తన 20వ ఏట వరకూ జీవించానని చెప్పారు. దాని వల్ల తాను పంజాబీ అయినా మరాఠి చాలా బాగా నేర్చుకోగలిగానని చెప్పారు. ‘మా ఇంట్లో మొదటిసారి ఫ్యాన్ బిగిస్తే దానిని చూడటానికి చాల్లో ఉన్న 60 ఇళ్ల వాళ్లూ వచ్చారు. అదో వింత. ట్యూబ్‌లైట్ బిగించినా వారికి వింతే. గణపతి పూజను కులమతాలకు అతీతంగా చేసేవారం. ఆ రోజులు మళ్లీ రావు’ అన్నాడాయన.‘నాకు జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. కలలు అనొచ్చు. ఒకటి ఇండియా బ్యాంటింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు నేను బ్యాటింగ్‌కు వెళ్లి ఇండియాను గెలిపించడం. రెండు... మంచి గాయకుణ్ణి కావడం. కాని నా గొంతు చాలా చెడ్డగా ఉంటుంది. పాటల చిత్రీకరణలో నేను పెద్దపెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తాను. కాని సౌండ్‌లో నా కఠినమైన గొంతు ఎవరికీ వినిపించేది కాదు. ఒకసారి ఇలాగే షాట్లో పెద్ద పెద్దగా పాడుతూ నటిస్తున్నాను. ఇంతలో ఏదో వైర్ తెగి పాట ఆగిపోయింది. నా గొంతు మాత్రం అసహ్యంగా అందరికీ వినిపించింది. అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే నాతో పాటు నటిస్తున్న ఆశా పరేఖ్ కూడా నాలాగే పెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తోంది. ఆమె గొంతు నాకన్నా ఘోరంగా ఉంది’ అని నవ్వించారాయన. జితేంద్ర వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చలాకీగా స్టెప్పులేయడం విశేషం. -
ఏక్తా కపూర్.. కష్టాలను ఎత్తి కుదేయండి
చిన్న వయసులో పెళ్లి. భర్త దాష్టీకం. మేరిటల్ రేప్. ఇంటి నుంచి పారిపోయి వస్తే ఎక్కడికీ పారిపోనివ్వని కడుపులో బిడ్డ. డిప్రెషన్. ఇన్ని కష్టాలు చుట్టుముడితే ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? కండలు పెంచుతాను అనుకుంది నైనిటాల్‌కు చెందిన ఏక్తా. ఫిట్నెస్ ప్రోగ్రామ్ ద్వారా తన మనసును, శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుంది. ఇవాళ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యింది. అంతేనా ఉత్తరాఖండ్‌లో మొదటి ఖరీదైన పర్సనల్ ఫిట్నెస్ సెంటర్ యజమాని అయ్యింది. ‘నా పోరాటం తెలిస్తే మీ కష్టాలు చిన్నవైపోతాయి. వాటిని ఎత్తి కుదేస్తారు’ అంటోంది ఏక్తా. ‘నేను నా కథను ఎందుకు చెబుతున్నానంటే కష్టాలు ఉన్నాయని భావించే స్త్రీలు నా కథ విని ధైర్యం తెచ్చుకుంటారనే. కష్టాలు నెత్తి మీద ఎప్పుడూ ఉండే బండరాళ్లు కాదు. వాటిని ఎత్తి కిందకు కుదేయవచ్చు. దాటి ముందుకెళ్లవచ్చు’ అంటుంది 32 ఏళ్ల ఏక్తా కపూర్. ఈ పేరు వినగానే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఏక్తా కపూర్ గుర్తుకు రావచ్చుగాని ఆమెకు ఈమెకు ఏ సంబంధమూ లేదు... ఆమె సీరియల్స్‌లో పెట్టే నాటకీయ కష్టాలు ఈమె నిజ జీవితంలో ఉన్నాయన్న ఒక్క పోలిక తప్ప. పోరాటం మొదలు.. ఏక్తా కపూర్ది నైనిటాల్. స్కూల్ అమ్మాయిగా ఉండగానే తల్లిదండ్రులు విడిపోయారు. ఏక్తా తండ్రితో ఉండిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా ఆమెను పెంచాడు. అతడు స్కూల్ టీచరు. 18 ఏళ్లు రాగానే తల్లితోడు లేని పిల్ల అని పెళ్లి చేశాడు. ‘ఆ పెళ్లితో నా కొత్త జీవితం మొదలవుతుందని అనుకున్నాను’ అంటుంది ఏక్తా. కాని అత్తవారింటిలో ఆమె నరకం చూసింది. భర్తకు వయసు చాలా ఎక్కువ. అబద్ధం చెప్పి చేశారు. పైగా అతను ఆమెను ఏనాడూ భార్యగా చూడలేదు. తాను భర్తగా ఉండలేదు. ‘నాకు ఏమీ తెలియదు. లైంగిక జీవితంపై అవగాహన లేదు. నేను అతన్ని స్వీకరించే లోపే అతను రోజూ మేరిటల్ రేప్ చేసేవాడు. ఆ రోజుల్లో దాని మీద ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అదొక నేరం కూడా కాదు’ అంది ఏక్తా. పారిపోయి ఇల్లు చేరి ఏక్తా అత్తవారింటి నుంచి పారిపోయి ఇల్లు చేరింది. తండ్రి అక్కున చేర్చుకున్నాడు. విడాకులు ఇప్పించాడు. ‘బంధువులందరూ నా వైపు సానుభూతిగా చూడటమే. ఇది చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలు అనేవారు. నాకు డిప్రెషన్ పెరిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాను. హాస్పిటల్లో చేరిస్తే నేను గర్భవతిని అని చెప్పారు. అప్పటికే బాగా వీక్‌గా ఉన్నాను. గర్భం నిలవడం కూడా కష్టమే అన్నారు. కాని కడుపులో ఉన్న నా కూతురిని కాపాడుకున్నాను’ అంది ఏక్తా. కూతురు పుట్టాక బంధువులు మళ్లీ ఆమెను చుట్టుముట్టారు. ఆ పిల్లను ఎవరికైనా దత్తత ఇచ్చేయ్.. అప్పుడే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవు అన్నారు. కాని ఏక్తా ఒప్పుకోలేదు. బిడ్డను తనతోనే ఉంచుకుంది. రకరకాల ప్రయత్నాలు పాపకు మూడేళ్లు వచ్చాక తండ్రికి అప్పగించి ఏక్తా రకరకాల పనుల వెంట తిరిగింది. ఢిల్లీలో కొన్నాళ్లు పని చేసింది. కొన్నాళ్లు ఏక్టింగ్ నేర్చుకుంది. కొన్నాళ్లు టీచర్‌గా పని చేసింది. కాని తనకు ఏదీ సూట్ కాలేదు. అప్పుడే ఒక బంధువు ఆమెకు ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. ‘2014లో ముంబైలో జరిగిన ఆ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాక నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అర్థమైంది. నా ఫిట్నెస్ కోసం నేను చేసిన కృషి నా శరీరాన్నే కాదు మైండ్‌ను కూడా గట్టి పరిచింది. ఏ కష్టమైనా ఎదుర్కొనగలననే ధైర్యం వచ్చింది నాకు.’ అంటుంది ఏక్తా. మలుపు తిరిగిన జీవితం ఫిట్నెస్ ట్రైనింగ్‌లోనే ఆమెకు ప్రస్తుత భర్త శశాంక్ పరిచయం అయ్యాడు. అతను కూడా ఫిట్నెస్ ట్రైనరే. ‘అతని ద్వారా ఫిట్నెస్ మీద నుంచి మెల్లగా నా ఫోకస్ వెయిట్‌లిఫ్టింగ్‌పై పెట్టాను. కాని అది ఎక్కువగా మగాళ్ల ప్రపంచం. నీకు ఇక్కడ ఏం పని అన్నట్టు చూశారు. కాని వెయిట్ లిఫ్టింగ్‌లో నా సత్తా చూపాలనుకున్నాను. జాతీయ స్థాయిలో మెడల్ సాధించాక గాని అందరు మగాళ్ల నోళ్లు మూత పడలేదు’ అంది ఏక్తా. ఆమె సాధించిన విజయాలను చూసి ఒకప్పుడు జాలిగా మాట్లాడినవారు ఇప్పుడు గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. కండలు తిరిగిన ఆమె చేతులను చూసి వినయంగా తప్పుకుంటున్నారు. అంతే కాదు... ఆమె కష్టాలు దాటిన పద్ధతిని చూసి గౌరవిస్తున్నారు. ‘నా ఫిట్నెస్ నేను అందరికీ ఇవ్వాలనుకున్నాను. అందుకే డెహరాడూన్లో అత్యంత అధునాతనమైన ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించాను’ అంటోంది ఏక్తా. భర్త, ఆమె కలిసి ఆ స్టూడియో నిర్వహిస్తున్నారు. కూతురు చదువుకుంటోంది. ‘నా కూతురిని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త దొరికాడు’ అని సంతోషపడుతోంది ఏక్తా. ‘పోరాడండి. గెలుపొందండి. ఆగిపోవద్దు అని స్త్రీలకు నేను చెప్పదలుచుకున్నాను’ అంటున్న ఏక్తా కచ్చితంగా ఒక బలమైన కండలు తిరిగిన స్ఫూర్తి మనకు. – సాక్షి ఫ్యామిలీ -
‘నాగినిలకు నాగ పంచమి శుభాకాంక్షలు’
న్యూఢిల్లీ: ఇవాళ నాగ పంచమి సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన 'నాగిని'లకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక రాబోయే ‘నాగిని’ సీజన్-5 ప్రోమోను ఈ సందర్భంగా ఏక్తా ఆవిష్కరించారు. కానీ ఈ సిజన్లో కనిపించే కొత్త నాగిని ఎవరనేది మాత్రం తెలియకుండా కొత్త పోస్టర్‌ను షేర్ చేసి అభిమానులను అయోమయంలో పెట్టారు. ఏక్తా ఈ పోస్టులో ‘నా నాగినీలకు.. హ్యాపీ నాగ పంచమి’ అంటూ గత సీజన్‌ల్లోని నాగినిలు మోనీ రాయ్, అనిత, కరిష్మా, సురభీ జ్యోతీ, నియా శర్మ తదితరులను ట్యాగ్ చేశారు. (చదవండి: నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం) అయితే ఈ సీజన్లో హినా ఖాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ తను లీడ్రోల్లో నటిస్తుందా లేదా సపోర్టింగ్ క్యారెక్టర్లో నటించనుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ‘నాగినీ-5’లో నటించే ప్రధాన పాత్రల పేర్లను నిర్మాత గోప్యంగా ఉంచారు. 'కుండలి భాగ్య' ఫేమ్ ధీరజ్ ధూపర్ మేల్ లీడ్రోల్లో ఈ సీజన్లో కనిపించనున్నాడు. తన కొత్త సీరియల్‌పై ధీరజ్ అనందం వ్యక్తం చేస్తూ... ‘‘ఇది నాకు చాలా ఉత్తేజకరమైన సమయం. టెలివిజన్‌లో అగ్రశ్రేణి షో అయిన ‘నాగినీ’ వంటి కార్యక్రమంలో నటించాలన్నది ప్రతి నటుడి కల. ఇది నాకు సరికొత్త అనుభవంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందెన్నడు ఇలాంటి పాత్రలు చేయలేదు. ఏక్తా కపూర్‌తో కలిసి పనిచేయడం, కలర్స్‌తో మళ్లీ సంబంధం కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram HAPPY NAAG ‘PAANCHAMI’ ... to all my Naagins @imouniroy @anitahassanandani @adaakhann @karishmaktanna @surbhijyoti @imrashamidesai @niasharma90 A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 24, 2020 at 11:57pm PDT -
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్‌ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్‌కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్‌లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT -
సుశాంత్‌కి తొలి అవకాశం ఇచ్చింది నేనే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమయ్యానంటూ తనపై కేసు పెట్టిన నేపథ్యంలో నిర్మాత ఏక్తాకపూర్ స్పందించారు. సుశాంత్‌కు నటుడిగా తొలి అవకాశమిచ్చింది తానేనని, అలాంటిది తనపైనే కేసు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు చిత్రపరిశ్రమలో పాతుకుపోయిన బంధుప్రీతే కారణమంటూ వెల్లువెత్తున్న విమర్శలపై ఏక్తా ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రిస్తా టీవీ సీరియల్లో సుశాంత్‌కు ఏక్తా కపూర్ తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్‌కు లీడ్ రోల్ ఇవ్వడానికి చానెల్ తొలుత ఒప్పుకోలేదని, చివరికి సదరు చానెల్‌ను కన్విన్స్ చేసి ఒప్పించానని ఏక్తా కొన్ని వారాల క్రితమే తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram Thanku for the case for not casting sushi....when Actually I LAUNCHED HIM. I’m beyond upset at how convoluted theories can b! Pls@let family n frns mourn in peace! Truth shall@prevail. CANNOT BELIEVE THIS!!!!! credit: @jagranenglishnews... A police case has been filed against eight people including Bollywood directors @karanjohar, Sanjay Leela Bhansali and @ektarkapoor along with actor @beingsalmankhan in connection with the death of actor Sushant Singh Rajput, news agency ANI reported on Wednesday . "In the complaint, I have alleged that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released. Such a situation was created which forced him to take the extreme step," Advocate Sudhir Kumar Ojha was quoted as saying . . . #sushantsinghrajput #sushantsinghrajputdeath #sushantsinghrajpurrip #jagranenglish #instawithjagranenglish #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏 #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput🙏🙏 #ripsushantsinghrajput #sushantnomore #salmankhan #salmankhanfans #salmankhanswag #salmankhanmerijaan #salmankhanfilms #salman #salmankhanfanclub #salmankhanfc #karanjohar #karanjoharfilm #karanjoharupdates #karanjoharfan A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 17, 2020 at 1:26am PDT సుశాంత్ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ సహా 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆకస్మి మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ నటుడి ఆకస్మిక మరణంపై పలువురు దిగ్ర్భాంతికి గురయ్యారు. అంతేకాకుండా బాలీవుడ్లో పేరుకుపోయిన నెపోటిజమ్ వల్లనే సుశాంత్ బలయ్యాడంటూ సామాన్యులు సహా కంగనా రనౌత్, ప్రకాశ్‌రాజ్, అభినవ్ కశ్యప్ లాంటి పలువురు ప్రముఖులు బాహాటంగానే ఆరోపణలు చేశారు. -
సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుశాంత్ ఆత్మహత్యపై నిర్మాత కరణ్ జోహార్, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్, సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') సుశాంత్‌ను 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదలకానీయలేదని.. అందువల్లే ఒత్తిడికి గురైసుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్ 306(ఆత్మహత్యకు పాల్పడటం), 504(ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అవమానించడం) 506(నేర బెదిరింపులకు శిక్ష) ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఆయన చెప్పారు. కాగా, సుశాంత్ ఆదివారం(జూన్ 14)న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సుశాంత్ బాధపడుతున్నాడని, దీనికి అతడు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. (‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’) ముసుగులు తొలగించండి -
సుశాంత్ ఆత్మహత్య: నాట్ ఫెయిర్ మై బేబీ!
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అనూహ్య మరణంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ‘ఎంస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతని ఆకస్మిక మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వారిలో సుశాంత్‌కు నటుడిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఉన్నారు. వారం రోజుల్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని, సుశాంత్ అంతటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని ఆమె ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. ‘ఇది సరైన నిర్ణయం కాదు సుశి. ఒక్క వారంలోనే అంతా మారిపోయింది. నాట్ ఫెయిర్ మై బేబీ!’అని ఏక్తా హృద్యంగా రాసుకొచ్చారు. సుశాంత్‌తో చివరగా చేసిన ఇన్‌స్టా పోస్టుల స్క్రీన్ షాట్ పెట్టి ఆమె నివాళి అర్పించారు. అయితే, వారంలో ఏం మారిందో ఆమె చెప్పలేదు. (చదవండి: హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య) కాగా, పవిత్ర రిస్తా టీవీ సీరియల్లో ఏక్తా కపూర్ సుశాంత్‌కు తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్‌కు లీడ్ రోల్ ఇవ్వడంపై జీటీవీ చానెల్ తొలుత ఒప్పుకోలేదట. చివరకు సదరు టీవీ చానెల్‌ను కన్విన్స్ చేసి సుశాంత్‌కు అవకాశమిచ్చామని రెండు వారాల క్రితం ఆమె ఇన్‌స్టాలో తెలిపారు. దీనిపై సుశాంత్ కూడా స్పందించాడు. తనకు అవకాశమిచ్చిన ఏక్తాకపూర్కు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని అతను పేర్కొన్నాడు. ఇక పవిత్ర రిస్తా సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్న సుశాంత్.. అనంతరం బాలీవుడ్‌కు పయనమయ్యాడు. ఏక్తా కపూర్ సోదరుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన కాయ్ పో చే సినిమాతో అతను వెండితెరకు పరిచమయ్యాడు. (చదవండి: సోషల్ మీడియాలో సుశాంత్ చివరి పోస్ట్ ఇదే) View this post on Instagram Not fair sushi ! One week everything changed ! Not fair my baby! A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 14, 2020 at 2:34am PDT -
ఒంటరినైపోయినట్లు అనిపించింది
సుమారు నాలుగు దశాబ్దాలు (1960 నుంచి 2000వరకూ) సినిమాలు చేస్తూ బిజీబిజీగా జీవితాన్ని గడిపారు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు జితేంద్ర. ఆ తర్వాత సినిమాలు తగ్గించారు. సినిమాలు తగ్గించాక ‘ఒంటరినైపోయినట్లు అనిపించింది’ అన్నారు. 2013 నుంచి ఆయన సినిమాల్లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ (బారిష్ 2) చేశారు. ఈ సిరీస్‌తోనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్‌ను జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మించారు. నటుడిగా ఇన్నేళ్లు గ్యాప్ తీసుకోవడం గురించి, సినిమాలు చేయకపోవడం గురించి జితేంద్ర మాట్లాడుతూ – ‘‘సినిమాలు తగ్గించాక నటించడాన్ని పెద్దగా మిస్ అయినట్టు అనిపించలేదు కానీ, షూటింగ్ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. . ఒకేసారి రెండుమూడు సినిమాలు చేస్తుండేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టూడియోలోనే ఉండేవాళ్లం. సెట్లో ఎప్పుడూ సందడి ఉండేది. లొకేషన్లోకి అడుగుపెట్టగానే చాలా మంది కనిపించేవారు. అందరితో మాట్లాడటం, అనుభవాలు పంచుకోవడం.. అలా చుట్టూ మనుషులతో టైమ్ ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఆ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఓ కొత్త అనుభవం ’’ అన్నారు. -
కొత్త కోణం చూస్తారు
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జితేంద్ర త్వరలోనే ఓ వెబ్ సీరిస్ ద్వారా తన అభిమానులను పలకరించనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్స్ నిర్మాత, జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘బారిష్ 2’. ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. జీతూజీ గాంధీ అనే వజ్రాల వ్యాపారి పాత్రలో కనిపించబోతున్నారట. ‘‘మళ్లీ యాక్ట్ చేయడం భలే సరదాగా ఉంది. (2013లో వచ్చిన ‘మహాభారత్ ఔర్ బార్బరీక్’ సినిమాలో చివరిగా అతిథి పాత్రలో మెరిశారాయన. ‘బారిష్’ లాంటి సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. నా అభిమానులు, ప్రేక్షకులు ఈ పాత్రల్లో నాలోని విభిన్న కోణాలను చూసి ఆస్వాదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు జితేంద్ర. -
ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో
నిర్మాత ఎక్తా కపూర్ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. ఒకవేళ ఈ సీరియల్ పేరు ‘క్యుంకీ గ్రీక్ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభారతం తిరిగి వచ్చేసింది) -
ఏడాది జీతాన్ని వదులుకున్న ఏక్తాకపూర్
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ తన సంవత్సర జీతాన్ని వదులుకున్నారు. సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన బాలాజీ టెలిఫిల్మ్స్లో పనిచేస్తున్న తన సహోద్యోగులకు సహాయం చేయడానికి సంవత్సరం జీతం రూ. 2.5 కోట్లు వదులుకుంటున్నట్లు ప్రకటించారు "ఈ విపత్కర సమయంలో బాలాజీ టెలిఫిల్మ్స్లో పనిచేసే వివిధ ఫ్రీలాన్సర్లు, రోజువారీ వేతన కార్మికులను చూసుకోవడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. వరదలు, ఉగ్రవాద దాడులు, బ్యాంక్ సెలవుదినాల్లో కూడా వీళ్లు పనిచేశారు.మా కార్యాలయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి. ఈ కష్టకాలంలో వాళ్లను ఆదుకోవడం చాలా ముఖ్యం. అందుకే నా వంతు సాయంగా ఇది చేస్తున్నాను. ప్రతీ ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. ఆరోగ్యంగా ఉండండి". అంటూ పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా అన్ని షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మార్చి 17న ఏక్తాకపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ కూడా మూతబడింది. ఇక భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 3 వేలు దాటగా, 71 మంది చనిపోయారు. (హై రిస్క్ మహానగరాలకే) -
పద్మశ్రీకి ఏక్తా అర్హురాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె, నిర్మాత ఏక్తా కపూర్‌కి ఇటీవల పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు అభినందనలు తెలియజేశారు దర్శక–నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ‘‘ఈ అవార్డుకి ఏక్తా అర్హురాలు. చిన్న వయసులో పద్మశ్రీ పురస్కారం అందుకోవడానికి ఆమె పట్టుదల, క్రమశిక్షణే కారణం’’ అన్నారు కేతిరెడ్డి. ఆయన తీస్తున్న ‘శశి లలిత’ (జయలలిత బయోపిక్) చిత్రానికి ఆశీస్సుల కోసం షిరిడీ సందర్శించారు కేతిరెడ్డి. -
బాలీవుడ్ పద్మాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మాలు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, టీవీ టైకూన్ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. శనివారం సాయంత్రం పద్మ అవార్డుల జాబితా వెలువడగానే ఈ నలుగురికీ ప్రశంసల వర్షం మొదలైంది. కంగ్రాట్స్ కరణ్ ఇండస్ట్రీకి పరిచయమై.. ఓ పేరు సంపాదించాలని.. ఓ మార్క్ సృష్టించాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. కానీ దర్శకుడు కరణ్ జోహార్ బాలీవుడ్ పరిచయమే ఓ ల్యాండ్‌మార్క్. ఆయన బ్యానర్లో పరిచయం కావడం ఆర్టిస్టులకు ఓ హాల్‌మార్క్. షారుక్ ఖాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కరణ్ జోహార్. రొమాంటిక్ డ్రామాలో ఆ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి స్టార్ కిడ్స్ను కరణ్ ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు. నిర్మాత యశ్ జోహార్, హీరూ జోహార్ దంపతులకు జన్మించారు కరణ్. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే తిరిగారు, పెరిగారాయన. చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం ఆయన మీద ఉంది. షారుక్ ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు కరణ్. ఆ తర్వాత దర్శకుడిగా ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ ఆల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలు తెరకెక్కించారు. కరణ్ జోహార్‌కి స్క్రిప్ట్‌ని కమర్షియలైజ్ చేయడం తెలుసు. ఆడియన్స్ పల్స్ తెలుసు. అందుకే దర్శకుడిగా ఫ్లాప్ చూడలేదాయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు కరణŠ . ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ పేరు కరణ్. 47 ఏళ్ల కరణ్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా (యష్, రూహీ) ఇద్దరు పిల్లలున్నారు. శభాష్ సమీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘ఏ జిల్లా ఏ జిల్లా... ఓ పిల్లా నీదీ ఏ జిల్లా’ పాట విన్న శ్రోతలకు ఆ పాట పాడిన గాయకుడి గొంతు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గొంతు రెగ్యులర్‌గా లేదు. విభిన్నంగా అనిపించింది. కానీ పాడుతుంటే వినాలనుంది. శభాష్.. గొంతు బాగుందన్నారు. ఆ గాయకుడి జిల్లా ఏంటి? అని వాకబు చేశారు. అతని పేరు అద్నాన్ సమీ అని తెలిసింది. లండన్‌లో పుట్టి పెరిగారు అద్నాన్ సమీ. అఫ్ఘాన్ మూలాలున్న తండ్రి, జమ్మూ కశ్మీర్ మూలాలున్న తల్లికి జన్మించారు ఆయన. తొమ్మిదేళ్లకే పియానో వాయించడం మొదలుపెట్టారు సమీ. హాలిడేలో ఇండియాను సందర్శించినప్పుడు క్లాసికల్ మ్యూజిక్‌పై ఆసక్తి ఏర్పరుచుకొని నేర్చుకున్నాడు అద్నాన్. తన చురుకుతనాన్ని గమనించి సంగీతంలోనే కొనసాగమని ప్రముఖ గాయని ఆశా భోంస్లే సూచించారు. అప్పటి నుంచి సంగీతంలో మరింత శ్రద్ధపెట్టారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్‌లో పట్టు సాధించారు. ‘నౌషద్ మ్యూజిక్’ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు అద్నానే. అద్నాన్ తొలి కంపోజిషన్ 1986లో ‘రన్ ఫర్ లైఫ్’ సాంగ్ సూపర్ హిట్ అయింది. 1995లో ‘సర్గం’ అనే పాకిస్థానీ సినిమాకు సంగీతం అందించారు. అందులో నటించారు కూడా. అది బ్లాక్‌బస్టరే. ‘కబీతో నజర్ మిలావో’ అనే ప్రేమ పాటల్ని ఆశా భోంస్లేతో కలసి ఆల్బమ్‌గా చేశారు. శ్రోతల్ని ఉర్రూతలూగించింది. 2001 నుంచి బాలీవుడ్ సినిమాలకు పాడటం, కంపోజ్ చేయడం మొదలుపెట్టారు అద్నాన్ సమీ. 2004లో ‘శంకర్ దాదా’తో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంతా సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), కళ్లూ కళ్ళూ ప్లస్ (100ç% లవ్), ఓ ప్రియా ప్రియా (ఇష్క్), ఓ మధు ఓ మధు (జులాయి) వంటి పాపులర్ పాటలు పాడారాయన. సక్సెస్ఫుల్ క్వీన్ బాలీవుడ్లో కంగనా ఫైర్ బ్రాండ్. అనుకున్నది అనుకున్నట్లే చెబుతుంది. ఏవరేమనుకుంటే ఏంటి? అంటుంది. ఎవరు చిన్నబుచ్చుకున్నా, తన అభిప్రాయాలను వెలిబుచ్చడంలో ఎప్పుడూ సంకోచించదు కంగనా. డాక్టర్ అవ్వాలని ఇంట్లో అన్నారు. యాక్టర్ అవుతాను అంది కంగనా. ఇంట్లో వద్దన్నారు. నా ఆశను వదలనంది కంగనా. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది కంగనా. వచ్చిన అవకాశాలను మెట్లుగా చేసుకుని సూపర్ స్టార్‌గా ఎదిగింది. ‘గ్యాంగ్‌స్టర్’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది కంగనా. 2007లో ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ చిత్రం తనకు కావాల్సిన గుర్తింపుని ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే మధుర్ బండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా. ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగులోనూ పరిచయమైంది. ‘క్వీన్, తను వెడ్స్ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్’ సినిమాకు మాటల రచయితగా, సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ప్రస్తుతం కంగనా చేతిలో ఉన్న రెండూ లేడీ ఓరియంటెడ్ సినిమాలే. ఫోర్బ్స్ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె. ఆమె ఫ్యాషన్ సెన్స్ విచిత్రంగానూ, స్టయిల్ స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. ఆమె స్టెట్మెంట్లు ఎక్కువ శాతం కాంట్రవర్శీలకు దారి తీసిన సందర్భాలున్నాయి. ఈ కాంట్రవర్శీ క్వీన్‌కి తిరుగులేదు. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. టెలివిజన్ స్టార్ నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నది. టెన్షన్స్‌తో కూడుకున్నది. కూడికలు, తీసివేతలతో కూడుకున్నది. మనుషుల్ని డీల్ చేయాలి. టెన్షన్‌ను హ్యాండిల్ చేయాలి. అందులో రాణించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్ నిర్మాణంలో రాణిగా వెలుగుతున్నారు ఏక్తా కపూర్. సీరియల్స్, సినిమాలు, వెబ్ షోలు ఇలా ఎడతెరిపి లేకుండా కంటెంట్‌ని బుల్లితెరపై కురిపిస్తూ టెలివిజన్ క్వీన్‌గా ఉన్నారు ఏక్తా. బాలీవుడ్ నటుడు జితేంద్ర, శోభా కపూర్ కుమార్తె ఏక్తా కపూర్. 15 ఏళ్లకే దర్శకుడు కైలాష్ సురేంద్రనాథ్ దగ్గర చేరింది ఏక్తా. 1994లో తండ్రి ఇచ్చిన కొంత డబ్బును, తన ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ స్థాపించింది ఏక్తా. సీరియల్స్ మీద సీరియల్స్. ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి దిగింది. బాలాజీ టెలీ ఫిలింస్ ద్వారా దాదాపు 130 సీరియల్స్‌ను నిర్మించింది. అందులో కొన్ని సీరియల్స్ పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆమె నిర్మించినవాటిలో ‘హమ్ పాంచ్, కహానీ ఘర్ ఘర్ కీ, జోధా అక్బర్, నాగినీ, కుంకుమ్ భాగ్య, కుందలీ’ వంటి పాపులర్ టీవీ సీరియల్స్ కొన్ని. సినిమాలు స్టయిల్ వేరు, సీరియల్స్ స్టయిల్ వేరు. సీరియల్స్‌లో ఎప్పటికప్పుడు సరుకు తయారవుతూనే ఉండాలి. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ టెలివిజన్ అంటారు. 2017లో ఎల్టీ బాలాజీ డిజిటల్ యాప్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు సుమారు 40 షోలు అందించింది. ‘హమ్ పాంచ్’ సీరియల్ ద్వారా విద్యా బాలన్‌ను పరిచయం చేసింది ఏక్తా. టెలివిజన్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా ఎదిగింది ఏక్తా. 44 ఏళ్ల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి తల్లయ్యారు. – గౌతమ్ మల్లాది -
ఉంగరాల టీనా
తన దశ తిరిగి అదృష్టం కలిసి రావాలని పేరు మార్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. అలాగే చేతి వేళ్లకు ఐదుకు పైగా ఉంగరాలు ధరించారు. కెరీర్ బాగానే ఉన్నా, కొత్తగా అదృష్టం కోసం దిశా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ‘కెటీనా’ సినిమా కోసం. దిశా పటానీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్ సినిమాకు ‘కెటీనా’ అనే పేరు ఖరారు చేశారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే పంజాబీ యువతి టీనా పాత్రలో నటిస్తున్నారు దిశా. ఇది బయోపిక్ అని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఛండీగర్‌లో ప్రారంభమైంది. ‘‘మామూలుగా ఆమె పేరు టీనా. కానీ తన జ్యోతిష్కురాలు చెప్పారని తన పేరు ముందు ‘కె’ చేర్చుకోవడంతో కెటీనాగా మారింది’’ అంటూ ఈ సినిమాలోని దిశా పటానీ లుక్‌ను విడుదల చేశారు చిత్రనిర్మాత ఏక్తా కపూర్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు. -
‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, రాజ్కుమార్ల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన జడ్జిమెంటల్ హై క్యా పోస్టర్‌పై వివాదం చెలరేగింది. తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌ను ఉపయోగించుకున్నారంటూ హంగేరీకి చెందిన ఓ మహిళా ఫొటోగ్రాఫర్ ఆ మూవీ టీంపై విమర్శలు గుప్పించారు.ఎవరి జీవితాన్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్లను కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్ల ఫొటోలతో కూడుకున్న ఓ పోస్టర్లో కంగనా, రాజ్‌కుమార్‌ల ఒక కన్ను స్థానంలో పిల్లి, ఎలుకలు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఈ పోస్టర్‌పై స్పందించిన హంగేరియన్ ఫొటోగ్రాఫర్ ఫ్లోరా బోర్సీ కంగనా, తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ....‘ ఏమైనా పోలికలు ఉన్నాయా? ఇదొక ప్రఖ్యాత బాలీవుడ్ సినిమా జడ్జిమెంటల్ హై క్యా పోస్టర్. వాళ్లు కనీసం నా అనుమతి కోరలేదు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా నా లాంటి ఫ్రీలాన్స్ ఆర్టిస్టుల స్మజనాత్మకతను దొంగిలించడం సిగ్గుచేటు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఈ చిత్ర నిర్మాత ఏక్తాకపూర్, కంగనా టీమ్‌పై మండిపడుతున్నారు. ‘ పర్మిషన్ లేకుండా ఒకరి క్రియేటివిటీని దొంగిలించి మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ‘సినిమా మొత్తం కాపీనే అయి ఉంటుంది.. మా బాలీవుడ్ వాళ్లకు ఇదొక అలవాటు అయిపోయింది. మేము సిగ్గుపడుతున్నాం మేడం’ అంటూ భారత అభిమానులు బోర్సీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం ఇండస్ట్రీని, జన్మభూమిని కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు అంటూ ఆమె హితవు పలికారు. ఇక ఈ విషయంపై జడ్జిమెంటల్ హై క్యా టీం ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించాడు. జూలై 26న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. oh yeah, this image somehow reminds me of.. oh wait. looks like totally my work! 😕😕😕😕 https://t.co/6XhiK317Re — Flora Borsi (@FloraBorsi) July 29, 2019 -
జర్నలిస్ట్‌లకు సారీ చెప్పిన ఏక్తా కపూర్
‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ చిత్ర నిర్మాతలు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల ముంబయిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంగనా రనౌత్, ఓ జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సదరు విలేకరి తన ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని కంగనా సమావేశంలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరలయ్యింది. దాంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేదంటే కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని పేర్కొంది. దాంతో ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ తరఫున నిర్మాత ఏక్తాకపూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. సినిమా పాట విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని ఏక్తా కపూర్ తెలిపారు. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ జులై 26న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరారు. View this post on Instagram #JudgeMentallHaiKya ! Love and respect to all❤️🙏🏼 A post shared by Erk❤️rek (@ektaravikapoor) on Jul 9, 2019 at 11:52pm PDT మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్ చేశారు. ‘కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, కంగన సరైన మార్గంలో పెడుతుంది’ అని పోస్ట్ చేశారు. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు తప్పుపట్టారు. వారి ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు. -
తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు
టీవీ దిగ్గజం ఏక్తా కపూర్ తెరకెక్కిస్తోన్న ‘ఫిక్సర్’ వెబ్ సిరీస్ నటులు, సిబ్బంది మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. నటి మహీ గిల్, నిర్మాత సాకేత్ సాహ్నీ, దర్శకుడు సోహమ్ షాతో ఇతర సిబ్బందిని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. తిగ్మాంషు ధులియా మాట్లాడుతూ.. ‘షూటింగ్ జరుగుతుండగా నలుగురైదుగురు యువకులు కర్రలతో మా దగ్గరకు వచ్చారు. ఉన్నట్టుండి మా మీద దాడి చేయడం ప్రారంభించారు. తొలుత మేం దీన్ని కామెడీగా తీసుకున్నాం. కానీ వారు నిజంగానే మా మీద దాడి చేస్తున్నారని కాసేపటి తర్వాత అర్థమయ్యింది. ఈ దాడిలో మా దర్శకుడు సోహమ్ షా కింద పడిపోయాడు.. ఓ కెమరామ్యాన్కి తీవ్ర గాయాలయ్యి రక్తం వచ్చింద’ని తెలిపారు. తమ మీద దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలుగా చెలామణి అవుతున్నారన్నారు. వారి అనుమతి లేకుండా అక్కడ షూటింగ్ చేయకూడదని సదరు గ్యాంగ్ తమను హెచ్చరించిందన్నారు ధులియా. దర్శకుడు సోహమ్ షా మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి మేం పర్మిషన్ తీసుకున్నాం. అందుకు సంబంధించి డబ్బు కూడా చెల్లించాం. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. వీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వచ్చి ఇక్కడ షూటింగ్ చేయకూడదంటూ మా మీద దాడి చేశార’ని పేర్కొన్నారు. -
‘మాటలు సరిపోవు.. ఏక్తా’
‘నీ చిరునవ్వుతో మా జీవితాలను ప్రకాశింపజేశావు. ఎలాంటి యుద్ధం ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చావు. కాలమే గాయాల్ని మాన్పుతుందనే నీ మాటలు విపత్కర పరిస్థితుల్లో నాకెంతగానో ఊరటనిచ్చాయి. నీ గొప్పతనాన్ని వర్ణించేందుకు ఇరానీ కుటుంబానికి మాటలు సరిపోవు. హ్యాపీ బర్త్‌డే ఏక్తా. రాక్‌స్టార్ మాసీ’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ప్రాణ స్నేహితురాలు ఏక్తా కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏక్తా సోదరుడి కుమారుడు లక్ష్యా కపూర్‌తో ఉన్న ఆమె ఫొటోను షేర్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఏక్తా కపూర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా అక్కాచెల్లెళ్లలా కలిసి ఉండే మీరిద్దరి స్నేహం కలకాలం వర్థిల్లాలి అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా పలు వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్.. ‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నేడు ఆమె 44 వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఇక మోడల్‌గా కెరీర్ ఆరంభించిన స్మృతి ఇరానీ పలు టీవీ సీరియళ్లలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్‌తో లైమ్‌టైమ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన స్మృతి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్రమంత్రి అయ్యారు. ప్రధాన నరేంద్ర మోదీ కేబినెట్లో రెండుసార్లు చోటు దక్కించుకున్న ఆమె...ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మట్టికరిపించిన స్మృతి.. మోదీ 2.0 కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. View this post on Instagram You brighten our lives with your smile, you strengthen our resolve with your support no matter what battles lie ahead, your belief that time will heal all wounds and do justice helped me sail through many turbulent phases, your conversations with God ... there are many ways for us in the Irani family to describe you but words won’t be enough 🙏Happy Birthday @ektaravikapoor rockstar Maasi , anchor , friend ❤️❤️❤️❤️ A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 6, 2019 at 9:03pm PDT -
‘పెళ్లి పిలుపులు రాని తల్లి’
టెలివిజన్ రంగంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ ఏక్తా కపూర్ సాంఘికంగా ‘పెళ్లి కాని తల్లి’గానే గుర్తింపబడుతోంది. ఆమె ఎదురుపడితే మొదలయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు?’ అనే!ఏక్తా కపూర్‌కు 43 ఏళ్లు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆమె బంధువులకు ఎదురు పడటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు హాజరవ్వడానికి ఇంకా ఇబ్బందిపడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ పెళ్లిలో ‘నెక్ట్స్ నీ పెళ్లే’ అని బంధువులు ఆమెతో అంటూ ఉంటారు. అదీ ఆమె భయం. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆమెకు. ‘స్త్రీ ఎన్ని ఘనవిజయాలు సాధించినా పెళ్లితోనే ఆమె జీవితం సంపూర్ణమవుతుందనే సాంఘిక అభిప్రాయానికి కాలం చెల్లాల్సి ఉంది’ అని ఏక్తా అంటుంది. పెళ్ళిళ్లకు తీసుకెళితే పెళ్లి మీద మనసు పుడుతుందేమోనని ఏక్తా తల్లి శోభా కపూర్ గతంలో ఏక్తాను పెళ్ళిళ్లకు పిలుచుకుని వెళ్లేది. కాని అక్కడ ఏక్తాను ఇలా అర్థం లేని ప్రశ్నలు అడుగుతుంటే దానికి ఏక్తా అర్థం లేని సమాధానాలు చెప్పడం చూసి, ఆ సమాధానాలకు ఎదుటివారు హర్ట్ అవడం గమనించి ఏక్తాను పెళ్లిళ్లకే తీసుకెళ్లడం మానుకుంది. ఎలాగూ రాదు కదా అని అసలు పెళ్లి పిలుపులు ఆమెకు పంపడం కూడా మానేశారు బంధువులు.ఏక్తా కపూర్ జనవరి 2019లో సరొగసి ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యింది. ‘నా జీవితంలో నేను చూసిన అన్ని విజయాలకంటే గొప్పది నా కుమారుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం’ అని ఏక్తా అంది. ఏక్తా మొదట తనే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. అయితే అందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో డాక్టర్లు సరొగసి ద్వారా ఆమె తల్లయ్యే ఏర్పాటు చేశారు. ఏక్తా తండ్రి జితేంద్ర, ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ మాత్రమే కాదు ఏక్తా స్నేహితులు కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఏక్తా తన కుమారుడికి ఘనంగా నామకరణం కూడా చేసింది. జితేంద్ర అసలు పేరైన ‘రవి కపూర్’ను తన కుమారుడికి పెట్టుకుంది. తుషార్ కపూర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సరొగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.ఈ ఘట్టం ఇలా ముగిసినా పెళ్లి గురించి వెంటపడే బంధువులు మాత్రం అలాగే ఉన్నారు. ‘మా అమ్మా నేను ఈ విషయమై లక్ష సార్లు మాట్లాడుకున్నాం’ అంటుంది ఏక్తా. ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉండగా పెళ్లెలా చేసుకోను’ అంటుందామె. ‘కాని గత పదేళ్లుగా మా బంధువుల్లో చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు. అది చూసి మా అమ్మ నయం... నీకింకా పెళ్లి కాలేదు... నీ నిర్ణయమే సరైనదిలా ఉంది అని నిట్టూర్చింది’ అని నవ్వింది ఏక్తా.జితేంద్ర బంగ్లా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల కేరింతలతో కళకళలాడుతోంది. అది కోడలు లేని బంగ్లా, అల్లుడు లేని బంగ్లా కావచ్చు. కాని మనుమలు ఉన్న బంగ్లా. వారంతా సంతోషంగా ఉన్నారు. సమాజానికి ఒక కొత్తపద్ధతి చూపించారు. ఈ దారిలో అందరూ నడవక పోవచ్చు.... ఈ దారి ఒకటి అంగీకారం పొందుతోంది అని తెలుసుకుంటే సరిపోతుంది. -
‘తన రాక ఓ అద్భుతం’
‘ఇప్పుడు చిన్న చిన్న షూలను నింపేందుకు మా దగ్గర తన బుజ్జి బుజ్జి పాదాలు ఉన్నాయి! తన అద్భుతమైన రాకతో మా చిన్న కుటుంబం సంపూర్ణమైంది! మా ముద్దుల కూతురు ఇవాను మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సుర్విన్ చావ్లా షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 15న ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె ప్రస్తుతం మాతృత్వపు లాలిత్యాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో భాగంగా తన కూతురి పాదాలతో కూడిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తొలిసారిగా తనను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 2015లోనే వ్యాపారవేత్త అక్షయ్ టక్కర్‌ను పెళ్లాడిన సుర్విన్ రెండేళ్ల వరకు తన పెళ్లికి సంబంధించిన విశేషాలను గోప్యంగా ఉంచారు. 2017లో తాను వివాహితను అని ప్రకటించిన ఆమె... ‘ పెళ్లి చేసుకున్నంత మాత్రాన వృత్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు రావని నా నమ్మకం. పెళ్లి చేసుకున్న తర్వాత నా అందం, శారీరక సౌందర్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పెళ్లైనంత మాత్రాన అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందనే గుడ్డి నమ్మకాన్ని పటాపంచలు చేయడానికే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన పలు టీవీ సీరియళ్లలో నటించిన సుర్విన్.. హేట్‌స్టోరి 2, పర్చేద్ వంటి బాలీవుడ్ సినిమాలతో గుర్తింపు పొందారు. View this post on Instagram We now have her tiny feet to fill the tiny shoes! Blessed by her wonderful arrival in our little family! Welcoming our daughter Eva💝 @akshaythakker A post shared by Surveen Chawla (@surveenchawla) on Apr 19, 2019 at 8:56am PDT -
ఆ సెలబ్రిటీ వెంటపడి ఖాకీలకు చిక్కాడు..
ముంబై : సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారిని చికాకు పెట్టే అభిమానులు కొందరైతే వెంటపడి వేధించే ప్రబుద్ధుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ముంబైలో టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏక్తా కపూర్‌ను గత నెలరోజులుగా అనుసరిస్తూ ఆమె ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షం కావడంతో పాటు ఆమెను సమీపించేందుకు ప్రయత్నించిన 32 ఏళ్ల క్యాబ్‌డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలరోజుల్లో దాదాపు 30 సార్లు నిందితుడు ఏక్తాను ఫాలో అయ్యాడని పోలీసులు చెప్పారు. క్యాబ్ డ్రైవర్‌ను హర్యానాకు చెందిన సుధీర్ రాజేందర్ సింగ్‌గా గుర్తించారు. కొద్ది రోజుల కిందట ఏక్తా కపూర్ జుహులోని ఓ ఆలయం సందర్శించగా, అక్కడికి చేరుకున్న సింగ్ ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని హెచ్చరించి పంపారని పోలీసులు చెప్పారు. ఏక్తా కపూర్ కదలికలను పసిగట్టిన సింగ్ అంథేరి వెస్ట్‌లో తరచూ ఆమె వెళ్లే జిమ్‌లోనే నిందితుడు సభ్యత్వం తీసుకోవడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఈనెల 16న ఏక్తా జిమ్‌కు వెళ్లగా అక్కడ నిందితుడిని చూసిన ఆమె సెక్యూరిటీ గార్డులు అతడిని అడ్డుకున్నారు. ఏక్తా ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్..
క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్‌గా పేరుపొందిన ఏక్తా కపూర్(43) పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ జనవరి 27న సరోగసి (అద్దె గర్భం) ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏక్తా కపూర్ సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. బడే అచ్చే లగ్తీ హై, కుమ్ కుమ్ భాగ్య, కుండలి భాగ్య, యే మోహబ్బతేన్, కసమ్,తెరే ప్యార్ కి, క్యూంకీ సాస్ బీ కబీ బహు థి సీరియల్స్‌తో ఏక్తా కపూర్ బడా నిర్మాతగా పేరొందారు. ఇక పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు. ఆమె నిర్మించిన విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లను వసూలు చేసింది. అనంతరం రాగిణి ఎమ్మెమ్మెస్, వీర్ దే వెడ్డిండ్,హాఫ్ గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తాకపూర్. -
‘మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా..!?’
ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా ఒకటేమిటి వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్‌కు.. ‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ అనే బిరుదు ఎప్పుడో కట్టబెట్టేశారు ఆమె అభిమానులు. కానీ ఇప్పుడు ఆ అభిమానులే ఏక్తాకు అస్సలు టేస్ట్ లేదంటూ పెదవి విరిచేస్తున్నారు. ఇందుకు ఆమె నిర్మించే సీరియళ్లు మాత్రమే కారణం కాదు. అసలు విషయమేమిటంటే... ఓ ప్రముఖ హిందీ చానల్లో ప్రసారమవుతోన్న ‘యే హై మొహబ్బతే’ సీరియల్ 15 వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏక్తా కపూర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో స్లీవ్‌లెస్ మెరూన్ రఫెల్ గౌనుకు జోడీగా బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించిన ఏక్తా.. బ్లాక్ హీల్స్ వేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏక్తా నెటిజన్ల చేతికి చిక్కారు. ఇంకేముంది అప్పటి నుంచి ఏక్తా డ్రెస్ గురించి తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ‘సాగతీత కథనాలతో చిరాకు తెప్పించినా సహిస్తామేమో గానీ.. మీరు ఇలా ఉండటాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాం.. డైనింగ్ హాలు నుంచి వస్తూ వస్తూ కర్టెన్ కప్పుకచ్చుకున్నారా ఏంటి? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఎంత డబ్బు ఉంటే ఏం లాభం..కనీసం ఓ స్టైలిస్ట్‌ను ఐనా పెట్టుకోవచ్చుగా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరో అభిమాని స్పందిస్తూ.. ‘మా అభిమాన తార ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండకపోయినా ఫర్వాలేదు.. మరీ ఇంత దారుణంగా ఉంటే మాత్రం సహించలేమంటూ’వాపోయాడు. అయితే ఏక్తాకు ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా లాజిక్ లేని మాటలు, వెరైటీ డ్రెస్సులతో ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. The queen of tv land arrives #ektakapoor for #yehhainmohabatein 1500 episodes celelberations @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jul 25, 2018 at 11:06am PDT -
ఆ సీరియల్‌ను ఆపేయండి ప్లీజ్...!!
అభిమాన సీరియల్ అయినంత మాత్రాన మా ఓపికని ఇంతలా పరీక్షించాలా అంటున్నారు.. ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ఫ్యాన్స్. ఈ సీరియల్లో ప్రధాన పాత్రలైన రమణ్ బల్లా, డాక్టర్ ఇషితాల పరిచయం.. గొడవలతో మొదలై, రమణ్ కూతురి కోసం వారివురు పెళ్లి చేసుకోవడం వంటి ఆసక్తికర కథనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో మొదలైన ఈ సీరియల్లో ఇషితాగా నటించిన దివ్యాంక త్రిపాఠి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే రాను రాను కథా, కథనాల్లో కొత్తదనం లోపించడంతో ఈ సీరియల్‌ను ఇక ఆపేయాలంటూ అభిమానులు #EndYHM పేరిట ట్విటర్లో ట్రోల్ చేస్తున్నారు. ఇషితా క్యారెక్టర్‌ను అవమానపరుస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరియల్‌ను ఆదరించాలంటూ దివ్యాంక త్రిపాఠి చేసిన ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Dear Balaji, Please Know why and how you started the show..! 🙄🙄🙄Just because you had a good story in hand don’t keep showing us some idiotic repetitive story.! Your CVs have completely forgotten the roots of the show..! 🤷♀️🤷♀️🤷♀️🤷♀️#EndYHM pic.twitter.com/87vrFBF3I0 — Swetha💫 (@swetha_crazy) May 22, 2018 World is full of bullies. We women can't get affected because of them. We show our worth through our actions that speak louder than words. So is #Ishita who's too high on morality to be bothered by anything smaller. Watch her/my upcoming episodes.#LongLiveYHM#YehHaiMohabbatein — Divyanka T Dahiya (@Divyanka_T) May 25, 2018 -
పెట్రోల్ ధరలు.. నిర్మాత ట్వీట్‌పై జోకులు
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన వ్యాఖ్యలపై జోకులు పేలుస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంపై ఏక్తా కపూర్ చేసిన వ్యాఖ్యల అంతరార్థమేమిటో అర్థం కాకపోవడమే ఇందుకు కారణం. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఏక్తా.. ‘ ఒకవేళ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అబ్బాయిలు అమ్మాయిలను లాంగ్‌డ్రైవ్స్‌కి తీసుకెళ్తారు. ఈరోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలను డ్రైవ్‌కి తీసుకెళ్తున్నారు. అయిపోవటానికి ఇదేం సినిమా కాదు. కాబట్టి, మీరు మీ డ్రైవింగ్‌పై తక్కువ ఖర్చు చేయండి. థియేటర్లలో ఎక్కువ సమయం ఉండండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఏక్తా కపూర్ వ్యాఖ్యలను ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ‘ఏక్తా లాజిక్ ఆమె నిర్మించే సీరియళ్లలాగే ఇంకా బేస్మెంట్ లెవల్లోనే ఉందంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ఒకవేళ భవిష్యత్తులో ఆహారం ధరలు పెరిగితే.. అదేమీ స్కూలు ఫీజు కాదు కట్టకుండా ఉండటానికి.. పిల్లల చదువుకు తక్కువ ఖర్చు చేయండి.. ఆహారం కోసం ఎక్కువ డబ్బు వెచ్చించండి’ అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఇలాంటి లాజిక్‌లేని వ్యాఖ్యలు చేసి ఏక్తా కపూర్ నెటిజన్ల చేతికి చిక్కారు. Even if petrol prices are at its highest, men will take women for drives & in today's time, women will take men for drives. This isn't the movie that you're going to stop watching as at this time you need to spend less on driving & more in theatre: Ekta Kapoor on fuel price hike pic.twitter.com/kyhaowGHVN — ANI (@ANI) May 22, 2018 -
తెరపైకి ‘దాదా’ బయోపిక్
కోల్‌కతా : ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ, క్రీడా ప్రముఖ వ్యక్తుల జీవితకథ ఆధారంగా సినిమాలను వరుసగా వచ్చేస్తున్నాయి. తమ ఆరాధ్య హీరోల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథల ఆధారంగా తెరకెక్కిన సినిమా అటు అభిమానులను, ఇటు బాక్సాఫీస్‌ను అలరించిన విషయం తెలిసిందే. త్వరలో మరో బయోపిక్కు రంగం సిద్ధమైంది. టీమిండియా మాజీ సారథి, దాదా సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. సౌరవ్ గంగూలీ ఆటో బయోగ్రఫీ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీ ఫిలింస్‌పై ఏక్తాకపూర్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏక్తా.. దాదాని కలిసి స్టోరీ డిస్కషన్లు చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే గంగూలీ కెరీర్‌తోపాటు.. మరుపురాని ఘట్టాలు ప్రేక్షకుల ముందు కనువిందు చేసే అవకాశం ఉంది. ఇక గంగూలీ పాత్రను పోషించబోయే నటుడెవరన్న చర్చ ఫ్యాన్స్‌లో మొదలైంది. -
దేశీ గేమ్ ఆఫ్ థ్రోన్స్
ఇంగ్లీష్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఎంత క్రేజ్ ఉందో హాలీవుడ్‌ను కొంచెం ఫాలో అయ్యేవాళ్లను కదిలించినా చెబుతారు. ఇప్పుడు ఇలాంటి సిరీస్‌నే ఇండియాకు తీసుకురానున్నారట బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్. ఎప్పటికప్పుడు టీవి, డిజిటల్, సిల్వర్ స్క్రీన్ పై కొత్త ఐడియాలు, సరికొత్త షోలు, న్యూ ఏజ్ సినిమాలు అందించే ఏక్తా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు దేశీ వెర్షన్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్. హాలీవుడ్ వెర్షన్‌కు ఇండియాలో పెరుగుతున్న క్రేజ్ చూసిన ఏక్తా.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిమిలర్ ఐడియాతో దేశీ వెర్షన్ రూపొందించాలనుకుంటున్నట్లు ఏక్తా సన్నిహితులు అంటున్నారు.. మరి దేశీ వెర్షన్ వస్తుందా? వేచి చూద్దాం. -
‘మెంటల్’ వారిదేనట....
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఉండే వారెవరైనా ఈ మధ్యకాలంలో వచ్చిన కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ల ‘మెంటల్ హై క్యా’ సినిమా పోస్టర్లను చూడకుండా ఉండరు. పోస్టర్లతోనే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరుడు సోహాలి ఖాన్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. విషయమేంటంటే ‘మెంటల్’ టైటిల్‌ను ఈ బాలీవుడ్ బ్రదర్స్ చాలా కాలం క్రితమే తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్తాకపూర్ ఈ పేరుకు దగ్గరగా ఉండేలా ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను పెట్టడం వీరి అసంతృప్తికి కారణమైంది. గతంలో సోహాలి తీసిన ‘జయ హో’(2014)కు, కబీర్ ఖాన్ తీసిన ‘ట్యూబ్‌లైట్’కు ముందుగా ‘మెంటల్’ టైటిల్‌నే అనుకున్నారు. ఖాన్ బ్రదర్స్ ఈ టైటిల్‌ను వాడుకునే లోపే ఏక్తా తన సినిమా పేరు ‘మెంటల్ హై క్యా’ అని ప్రకటించింది. అంటే ఆమె వీరి టైటిల్‌ను దొంగిలించిందనే చెప్పవచ్చు. అందుకే వారు ఏక్తాపై అసహనంగా ఉన్నారని, కనీసం ఏక్తా వారిని అడిగి వుంటే ఆమెకు ఇచ్చేవారు అని ఖాన్ కుంటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం గురించి సోహాలి ఖాన్‌ను అడగ్గా ‘మేము ‘మెంటల్’ టైటిల్‌ను ఏక్తాకు ఇవ్వలేదు, ఆమె కనీసం మమ్మల్ని అడగలేదు’ అన్నారు. ‘క్విన్’(2014) సినిమా తర్వాత కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. మానసిక అనారోగ్యం, భ్రమల చూట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ప్రకాశ్ రావ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. -
శ్రీదేవి మృతిపై పుకార్లు.. ఏక్తా ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల వస్తున్న పుకార్లపై బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఘటుగా స్పందించారు. శ్రీదేవి సర్జరీ కారణంగానే మృతి చెందిందని, సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చిందంటూ సోషల్‌మీడియా, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో లేనివి, ఉన్నవి కల్పిస్తూ అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె సూచించారు. ‘చెడ్డ వాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధుల్లేకుండా, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారిలో 1శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పరిశోధకులు తెలిపారని ఓ డాక్టర్ నాకు చెప్పారు. ఇది విధి రాత.. ఉన్నవి లేనివి కల్పిస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని ట్వీట్ చేశారు. శనివారం రాత్రి దుబాయ్‌లో నటి శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె పార్దీవ దేహం తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. Evil ones pls realise one percent ( as fwded as my doc told me) of the population can have an cardiac arrest without any heart condition or any kind of surgery ! It’s destiny not how evil rumour mongers portray!!! — Ekta Kapoor (@ektaravikapoor) 25 February 2018 -
హార్వీ వెయిన్స్టీన్లు బాలీవుడ్‌లోనూ ఉన్నారు!
హార్వీ వెయిన్‌స్టీన్ ఎవరో తెలుసా? తెలియకుండా ఎలా ఉంటాడు? నటీమణుల పట్ల రాక్షసుడిలాంటి వాడని హాలీవుడ్ కోడై కూస్తోంది. అది అన్ని వుడ్స్కీ పాకింది. అంతే.. ఇక్కడ కూడా ఇలాంటి కిరాతకులు ఉన్నారని కొందరు నటీమణులు బాహాటంగా ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ టీవీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ చేరారు. ‘మీటూ’ అంటూ ప్రతి ఇండస్ట్రీలోని నటీమణులు బడా బడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బండారం బయటపెడుతున్న ఈ ఉద్యమం నేపథ్యంలో ఏక్తా కపూర్ కూడా తన గళం విప్పారు. ‘‘కాయిన్‌కి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడాలి’’ అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారామె. ‘‘బాలీవుడ్లో కూడా హార్వీ వెయిన్స్టీన్లు ఉన్నారు. కానీ వారితో పాటు అంతే సమానంగానే కథకు మరోవైపు కూడా హార్వీ వెయిన్‌స్టీన్ (బాధితులు)లు ఉన్నారు. కానీ వారి గురించి మనం ఎవ్వరం మాట్లాడం. అవును పవర్లో ఉన్న కొద్దిమంది నిర్మాతలు వాళ్ల పలుకుబడిని ఉపయోగించి అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. సేమ్ టైమ్ అవకాశం కోసం చూస్తున్న కొందరు యాక్టర్స్ దిగజారి, తమ పనులు జరిగేలా చూసుకుంటున్నారు. నేను నమ్మేదేంటంటే ‘పదవి, పవర్ ఉన్నవాళ్లనే ఎప్పుడూ దోషులుగా చిత్రీకరించకూడదు. అలాగే పవర్లో లేనివాళ్లను బాధితులుగా పరిగణించకూడదు’’ అని పేర్కొన్నారు ఏక్తా కపూర్. కేవలం నటీమణులకే కాదు.. ఓ ప్రొడ్యూసర్‌గా నాకూ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాళ్లు. మరి అలాంటి సిచ్యువేషన్స్‌లో నిందితులు ఎవరు? పవర్లో ఉన్న ప్రొడ్యూసరా? లేక పవర్ లేనివాళ్లా? -
సినిమాల్లో చాన్స్ కోసం ఆ పని..!
ముంబై : సినిమా అవకాశాల సాకుతో లైంగిక వేధింపులకు పాల్పడే దర్శకనిర్మాతల కంటే.. చాన్స్ కోసం అదే లైంగికతను పణంగా పెట్టే నటీనటులు ఇండస్ట్రీలో బోలెడుమంది ఉన్నారని ఫైర్‌బ్రాండ్ ఏక్తా కపూర్ తెలిపారు. సెక్సువాలిటీ మీద చర్చ జరిగిన ప్రతిసారి.. శాసించేస్థితిలో ఉన్నవారినే దోషులుగా చిత్రీకరించడం తగదని, ఒకరి దగ్గర డబ్బు, హోదా, అధికారం లేనంత మాత్రాన వారినే బాధితులుగా భావించాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ నిర్వహించిన షోలో మాట్లాడుతూ ఏక్తా కపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ విన్స్టన్ హార్వీ అకృత్యాలను బయటపెట్టిన ‘మీ టూ’ ఉద్యమం లాంటిది బాలీవుడ్‌లోనూ తలెత్తితే పరిస్థితి ఏమిట’న్న ప్రశ్నకు ఏక్తా తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ‘‘అవును. ఇక్కడ(బాలీవుడ్లో) కూడా లైంగిక వేధింపులకు పాల్పడే విన్స్టన్లు చాలా మంది ఉన్నారు. అయితే అదే లైంగికతను అవకాశంగా మార్చుకున్న యాక్టర్ల సంఖ్య కూడా తక్కువేమీకాదు. చాన్స్ రావడమే ముఖ్యమని వారు భావిస్తారు. అఫ్కోర్స్, వారు తప్పుకాకపోవచ్చు. కానీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం పవర్లో ఉన్నవాళ్లనే దోషులుగా చిత్రీకరించడాన్ని మాత్రం నేను సమర్థించను. ఉదాహరణకి.. ఒక నటి రాత్రి 2 గంటలప్పుడు నిర్మాత దగ్గరికి వెళ్లిందనుకుందాం, కొన్ని రోజుల తర్వాత ఆ నిర్మాత తన సినిమాలో ఆమెకు చాన్స్ ఇవ్వలేదు. ఆ పాత్రకు ఆమె సరిపోదు కాబట్టి అతనలా చేశాడు. పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను వేరుగా చూస్తాడు కాబట్టి అతనా నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉదాహరణలో ఎవరు బాధితులు? శక్తిమంతులే అడ్వాంటేజ్ తీసుకుంటాడనే భావన ఎల్లప్పుడూ సరైందికాదు’’ అని ఏక్తా చెప్పుకొచ్చారు. -
పహ్లాజ్ ఊస్టింగ్‌తో నాకు సంబంధం లేదు
ముంబై: తన కత్తెర పవర్ తో చుక్కలు చూపించి ముప్పుతిప్పలు పెట్టిన పహ్లజ్ నిహ్లానీని తొలగించటంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. ఆ స్థానంలో వివాదరహితుడిగా పేరున్న ప్రసూన్ జోషిని సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ గా నియమించింది కేంద్రం. అయితే పహ్లాజ్ తొలగింపు వెనుక ప్రోడ్యూసర్ ఏక్తా కపూర్ హస్తం ఉందన్న వార్తలు మీడియాలో బలంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, ఏక్తా కపూర్ మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఏక్తా ఒత్తిడి మేరకే పహ్లాజ్ పై స్మృతి వేటు వేసిందని ఆ కథనం సారాంశం. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఈ లేడీ ప్రోడ్యూసర్ చెబుతోంది. ‘అది పూర్తిగా ఆమె(స్మృతి ఇరానీ) తీసుకున్న నిర్ణయం. అందులో నా ప్రమేయం ఏం లేదు. అయినా ఆ క్రెడిట్ అంతా నాకే ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు’ అని ఏక్తా తెలిపింది. పహ్లాజ్ కత్తెర దాటికి బలైన చిత్రాల్లో ఏక్తా నిర్మించిన లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఇలాంటి పుకార్లు వచ్చి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్!
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా హీరోయిన్లు ఎప్పుడు తమను తాము ప్రచారం చేసుకోవడానికి ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామర్ ఫోటోలను అందులో పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంటారు. నటి రియాసేన్ గుర్తుందా? ఈ బాలీవుడ్ బ్యూటీ తన ఫొటోల ద్వారా ప్రైవేట్ విమానయాన సంస్థ అధినేత శివం తివారిని ఆకర్శించింది. రియాసేన్ ఫొటోలు చూసి ఆమెకు వీరాభిమాని అయిపోయాడు. అంతేకాదు ఆమెకు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. మామూలుగా మొదలయిన వీరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకూ చేరింది. వీరి పెళ్లి ఈ నెల చివరి వారంలో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం రియాసేన్, శివం తివారీ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందట. సన్నిహితులు, బంధువుల సమక్షంలో వాళ్లిద్దరూ పూణేలో పెళ్లి చేసుకున్నారంటూ రియా సోదరి రైమా సేన్ సోషల్‌మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఇందులో రియా సేన్, శివం తివారీలు సంప్రదాయ బెంగాళీ పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు. ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రియాసేన్ ఏక్తాకపూర్ వెబ్ సిరీస్ రాగిణి ఎమ్ఎమ్ఎస్2.2లో నటించింది. ఇది రియాసేన్ అభిమానులను చేదు వార్తే. -
పోస్టర్లో మిడిల్ ఫింగర్.. ఎవరికంటే ?
ముంబై : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)తో తమకు ఎలాంటి ఘర్షణలేదని, ఈ సమాజంతోనే అసలు సమస్య అని ఏక్తా కపూర్ అన్నారు. 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్ర పోస్టర్లో కనిపించే మిడిల్ ఫింగర్ సీబీఎఫ్‌సీకి కాదని, మహిళలని పైకి ఎదగకుండా అణగదొక్కుతున్న పితృస్వామ్య సమాజానికని తెలిపారు. తమ వాణి వినకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తూ, మహిళల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే భావజాలం ఉన్న వారికే పోస్టర్‌లోని మిడిల్ ఫింగర్ అని కుండబద్దలు కొట్టినట్టు ఏక్తా చెప్పారు. ఈ చిత్రానికి సమర్పకురాలు, డిస్ట్రిబ్యూటర్‌గా ఏక్తా కపూర్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్ర ట్రైలర్‌ని మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్తా కపూర్‌తో పాటూ దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ, నటులు కొంకనా సేన్ శర్మ, రత్న పాతక్ షా, అహ్నా కుమ్రా, ప్లబితా బోర్తాకుర్లు పాల్గొన్నారు. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించిన విషయం తెలిసిందే. చివరకు 6 నెలల తర్వాత సీబీఎఫ్సీ ఈ చిత్ర ట్రైలర్‌ను ఏ సర్టిఫికెట్తో విడుదలకు అనుమతించింది. స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం పై చిత్రయూనిట్ సెన్సార్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. యూనిట్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్ లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాకు ఎ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
సంచలనాల 'నాగిని' మాట్లాడితే..
ముంబై: అటు హిందీలో సూపర్ హిట్ అయి.. ఇప్పుడు దక్షణాది భాషల్లో ప్రసారం అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది 'వేటాడే నాగిని'(హిందీలో 'నాగిన్') సీరియల్. నాగిన్ లో ప్రధాన పాత్ర పోశించిన మౌనీ రాయ్.. నాగిన్-2లోనూ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మౌనీ రాయ్.. 'నాగిన్' నిర్మాత ఏక్తా కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించింది. 'కథా చర్చ ఉందని ఏక్తా కబురు పెడితే చాలు.. వెంటనే అక్కడ వాలిపోతా. ఎందుకంటే ఏక్తా కథ చెప్పే విధానం, కొత్త పాత్రలను సృష్టించే తీరు అద్భుతంగా ఉంటుంది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్' అంటూ మౌనీరాయ్ గలగలా మాట్లాడేసింది. కలర్స్ చానెల్ లో 2015 నవంబర్ 1 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమైన నాగిన్ సీరియల్.. 2016 జూన్ లో ముగిసింది. దానికి కొనసాగింపుగా రూపొందించిన 'నాగిన్-2' అక్టోబర్ 8 నుంచి అదే చానెల్ లో ప్రసారం కానుంది. జూన్ నుంచి తెలుగు సహా తమిళ, మలయాళ భాషల్లోనూ లో ప్రసారం అవుతోన్న 'వేటాడే నాగిని' ముగియగానే రెండో భాగాన్ని కూడా డబ్ చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రూపొందించారు. తొలి భాగంలానే 'నాగిన్-2'ను కూడా 62 ఎపిసోడ్లుగా ప్రసారంచేయాలనుకుంటున్నట్లు తెలిసింది. -
దివ్యశక్తే ఉంటే అలాంటి సినిమాలే చేస్తా
ముంబై: దశాబ్దం కిందట విడుదలైన 'క్రిష్' ఆతర్వాత వచ్చిన 'క్రిష్-3' తప్ప బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సూపర్ హీరో కథల జోలికిపోలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత ఆ సాహసం చేస్తున్నారు నిర్మాత ఏక్తా కపూర్. 'ఎ ఫ్లయింగ్ జట్' టైటిల్ తో ఆమె రూపొందించిన సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్ లో బాగంగా ఏక్తా ఇటీవల మీడియాతో మాట్లాడారు. సూపర్ హీరో సినిమా తీసిన మీరు.. ఏదైనా సూపర్ పవర్ (దివ్యశక్తి) కోరుకుంటారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. 'ఏది తిన్నా, ఎంత తిన్నా లావెక్కకుండా ఉండే శక్తి ఏదైనా ఉంటే అలాంది నేను కోరుకుంటా. ఇంకా.. పైరసీ చేయడానికి వీలులేని సినిమాలు చేస్తా' అని బదులిచ్చింది ఏక్తా. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా ఇటీవల నిర్మించిన 'ఉడ్తా పంజాబ్', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమాలు పైరసీకి గురైన నేపథ్యంలో ఆమె అలా కోరుకోవడం సహజమే. విడుదలకు సిద్ధంగా ఉన్నసినిమా అయినా పైరసీబారిన పడకూడదని కోరుకుందాం. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఎ ఫ్లయింగ్ జట్' లో హీరో ష్రాఫ్ లీడ్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. -
'అనవసర కామెంట్స్ చేయను'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ నిరాకరించింది. ఈ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్స్ చెప్పడంతో దుమారం రేగింది. సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బహిరంగంగా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అనురాగ్- ఏక్తా కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించేందుకు ఏక్తా నిరాకరించింది. 'మా అభిప్రాయాలను అధికార ప్రతినిధి ద్వారానే వెల్లడించాలని నేను, కశ్యప్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ వివాదంపై నేను మాట్లాడను. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను అనవసరంగా ఎటువంటి కామెంట్స్ చేయన'ని స్పష్టం చేసింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన తన తాజా చిత్రం 'ఎ స్కాండల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొంది. -
ఏక్తా క్వీన్
ఏక్తా కపూర్ పర్ఫెక్షనిస్ట్. సినిమా అయినా, టీవీ సీరియల్ అయినా తను అనుకున్నట్టు రావాల్సిందే. అందుకోసం ఆమె ఎన్నిసార్లయినా స్క్రిప్టు మారుస్తారు. హీరోయిన్ చేత ఎన్ని డ్రెస్సులైనా మార్పిస్తారు. అంత ‘పట్టింపు’లోనూ ప్రేక్షకాదరణ తగ్గకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్నారు. అందుకే ఆమె ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్. సినిమాలు మూడు కారణాల వల్ల నడుస్తాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్. రెండు ఎంటర్టైన్మెంట్. మూడు ఎంటర్టైన్మెంట్. ‘డర్టీపిక్చర్’లోని డైలాగ్ ఇది. సినిమాలోని ైడె లాగ్ మాత్రమే కాదు. సినిమాను నడిపించిన సూత్రం కూడా అదే. ఆ సినిమా నిర్మాణసంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ (బి.ఎం.పి.)ని హిట్ చేసిందీ అదే ఎంటర్టైన్మెంట్. బి.ఎం.పి. 2001లో మొదలైంది. అది జితేంద్ర కంపెనీ. అంతకు ఏడేళ్ల క్రితం (1994) నుండీ ‘బాలాజీ టెలీ ఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ నిర్మిస్తున్న టీవీ సీరియల్స్‌కు టీఆర్పీ టాప్ రేటింగ్స్ ఇస్తున్నది కూడా ఎంటర్టైన్మెంటే. 1995 నుండి జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ దీనిని నడిపిస్తున్నారు. కాదు. పరుగెత్తిస్తున్నారు. టీవీ ధారావాహికలకు ఒక చెడ్డపేరు ఉంది. నత్తనడక నడుస్తాయని! నత్తల్లా కదలొచ్చుగాక... ఏక్తా స్క్రీన్ ప్లేలో ఆ నడక పరుగులా ఉంటుంది. అదే ఆమె స్పెషాలిటీ. కథ ఏదైనా.. ఏక్తానే క్వీన్! పేరుకు తండ్రి కంపెనీలే కానీ... బాలాజీ టెలీఫిలిమ్స్, బాలాజీ పిక్చర్స్.. ఈ రెండిటికి తెరవెనుక ప్రధాన నాయిక ఏక్తా కపూర్. గ్లిజరిన్ అమ్మకందార్లకు విపరీతంగా గిరాకీ పెంచిందని ఆమె మీద పెద్ద సెటైర్. దాన్ని ఆమె ఏనాడూ లెక్క చేయలేదు. తను తీయాలనుకున్నది తీశారు. ఏక్తా తీసిన వాటిల్లో 25 టీవీ సీరియళ్లు సూపర్ హిట్. అందుకే... ప్రేక్షకాదరణ ఏమాత్రం చెక్కుచెదరకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్న ఏక్తా ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్. తొలినాళ్ల థీమ్‌లు వేరు నిజజీవితంలో ఎక్కడా లేని, ఎక్కడా జరగని సన్నివేశాలతో ఏక్తా సీరియళ్లు తీస్తారని ఆమెపై ఇంకో విమర్శ. ఏక్తా లెక్క చేయలేదు. తను నమ్మిన ఎంటర్టైన్మెంట్ ఫార్ములానే ఫాలో అయ్యారు. అవుతున్నారు. ప్రతిసారి ఒక కొత్త సక్సెస్‌ని ఒక కొత్త కిరీటంలా ధరిస్తున్నారు. 2010లో ఫోర్బ్స్ పత్రిక విజయవంతమైన పారిశ్రామిక మహిళల్లో ఏక్తాకు మూడో స్థానం ఇచ్చింది. అది ఆమెకు ఫోర్బ్స్ ఇచ్చిన స్థానమే అయుండొచ్చు. ఇచ్చేలా చేసింది మాత్రం టీవీ ప్రేక్షకులే. ‘‘ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో ‘పెళ్లి తర్వాతి ప్రేమ..’ అనే థీమ్‌తో కొన్ని సీరియల్స్ తీశాను. టీఆర్పీ రేస్‌లో అవి చివరన ఉన్నాయి. అప్పుడర్థమైంది నాకు.. వీక్షకులకు కావల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనని. అంతే నా రూట్ మార్చుకున్నాను.. కథాంశాలను మార్చేశాను’ - విమర్శకులకు ఏక్తా సమాధానం. నాడి పట్టుకున్నారు ఏక్తా. క్యోంకీ సాస్ భీ... 1997లో సీరియళ్ల నిర్మాణంలోకి అడుగుపెట్టినా.. అసలైన విజయంతో ఏక్తా వేలమందికి తెలిసింది మాత్రం 2000 సంవత్సరంలో మొదలైన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ అనే సీరియల్‌తోనే. ఈ కథతో ఆమె టెలివిజన్ సీరియళ్ల చరిత్రనే తిరగరాశారు. కనిపించకుండా పోతున్న ఉమ్మడి కుటుంబాలు, ఆ కుటుంబాల్లో నిరంతరం కనిపిస్తుండే కలహాలు, ఆస్తుల తగాదాలు, దాయాదుల పగలు, పంతాలు, కుట్రలు వీటన్నింటినీ ఏక్తా తన సీరియల్స్‌కు కథాంశాలుగా ఎంచుకున్నారు. విపరీతమైన డ్రామా! ఏళ్లకు ఏళ్లుగా ఎపిసోడ్లు. చివరికి తమ సీరియళ్లతోనే ఇంట్లో ఆడవాళ్లు టీవీ చూసే టైమ్‌ను సెట్ చేసుకునే పరిస్థితి కల్పించింది బాలాజీ టెలీఫిలిమ్స్! తన ప్రొడక్షన్స్‌తో జీటీవీ ఛానల్‌ను పాపులర్ చేసింది. ఒక దశలో స్టార్ ప్లస్, సోనీ, జీటీవీ లాంటి ప్రముఖ చానళ్లంటిలోనూ.. బాలాజీ టెలీఫిలింస్ సీరియల్సే ప్రసారమయ్యేంత డిమాండ్‌ని సంపాదించిపెట్టింది. తొణకలేదు.. బెణకలేదు! సరిగ్గా ఈ సమయంలోనే ఏక్తా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. స్త్రీని విలన్‌గా చూపిస్తోందని.. అత్తాకోడళ్లను ఆగర్భ శత్రువులుగా చిత్రీకరిస్తోందని విమర్శకులు ధ్వజమెత్తారు. అయినా ఏక్తా తొణకలేదు..బెణకలేదు. అలాంటి సీరియళ్ల కొనసాగింపును ఆపలేదు. దటీజ్ ఏక్తా! ఆమె సాహసాన్ని, ధైర్యాన్ని తెలిపే సంగతులు చాలానే ఉన్నాయి. మచ్చుకు సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ! రాగిణీ ఎంఎంఎస్2 అనే సినిమాతో ఎక్కడో బ్రిటన్‌లో పోర్న్‌స్టార్‌గా ఉన్న సన్నీలియోన్‌ను ఏక్తా బాలీవుడ్‌కి తెచ్చారు. రాగిణీ ఎంఎంఎస్2 కు ఏక్తానే నిర్మాత. ఎందరు ముక్కున వేలేసినా.. సన్నీలియోన్‌కు కొత్త ఇమేజ్నిచ్చేందుకు చేసిన ఆమె ప్రయత్నాన్ని కొందరు మెచ్చుకున్నారు. ఇదీ ఎక్తాకపూర్ వ్యక్తిత్వం. బిజినెస్.. ప్రొడక్షన్ విషయాల్లో ఎంత నిక్కచ్చిగా.. ధైర్యంగా ఉంటారో.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆమె అంతే భయస్తురాలు అని ఏక్తా తమ్ముడు, ప్రముఖ బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ చెప్తాడు. ‘అక్కకు ఎత్తయిన ప్రదేశాలన్నా, చీకటి అన్నా, హెలికాప్టర్ ఎక్కడమన్నా చాలా భయం’ అంటాడు. స్క్రిప్టు మార్చాల్సిందే! పనిలో పర్ఫెక్షన్ లేకపోతే ఏక్తాకు ఎక్కడలేని కోపం. ఈ స్వభావంతోనే ఆమె చాలామందికి శత్రువు అయ్యారు ‘కుమ్కుమ్ భాగ్య’ అనే సీరియల్లో ఒక సన్నివేశం కోసం హీరోయిన్‌కి 19 డ్రెస్‌లు మార్పించారట ఏక్తా! ఆ అమ్మాయి ఓపిక నశించి ఇక నా వల్ల కాదు అన్నా వినలేదట. అంతేకాదు స్క్రిప్ట్‌ను ఎంచుకునేటప్పుడు.. దాన్ని ఖరారు చేసే విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారు ఏక్తా.. ఒక్కోస్క్రిప్ట్ను కనీసం 20 సార్లయినా మార్చందే ఫైనలైజ్ చేయదనే దర్శకుల కినుకా ఆమె మీద ఉంది. పెళ్లిపై ఏక్తా అభిప్రాయం ‘వైవాహిక జీవితంలో ఇమడాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. నాకు అవి లేకే పెళ్లికి దూరంగా ఉన్నా’ అని ఏక్తా (40) అంటారు. ‘పెళ్లి చేసుకున్నాక మగాడు మగాడిగానే ఉంటాడు. కానీ స్త్రీ జీవితమే మారిపోతుంది. భార్య, కూతురు, కోడలు, తల్లి పాత్రలో ఒదగాల్సి వస్తుంది. ఆ బాధ పురుషుడికి లేదు. భర్త అనే పేరు వస్తుంది తప్ప బాధ్యత ఉండదు. పురుషుడు.. పురుషుడు అనే స్వేచ్ఛతోనే ఉంటాడు. స్త్రీగా నేను అన్ని పాత్రలు పోషించలేను’ అని ఏక్తా కపూర్ ముగించారు. నాన్నంటే ఇష్టం... చిన్నప్పుడు ఏక్తా తన తండ్రి జితేంద్ర పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేదట. జితేంద్రతోపాటే షూటింగ్‌కి వెళ్లి కాపుకాసేదట. షూటింగ్లో భాగంగా తండ్రి హీరోయిన్‌తో నటిస్తుంటే ‘ మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అంటూ హీరోయిన్ను వెంబడించేదట ఏక్తా.. పనిలో ఎంత కఠినంగా ఉంటారో.. మూగజీవాల పట్ల అంతగా దయతో ఉంటారు. బాలివుడ్ ప్రముఖులంతా ఫారిన్ బ్రీడ్ కుక్కలను లక్షలు పెట్టి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటుంటే.. ఏక్తా మాత్రం ముంబైలోని తమ ఇంటి దగ్గర్లో ఉన్న ఓ పది వీధి కుక్కలను చేరదీసి పెంచుతున్నారు. వాటిలో ఒకటి రెండు శునకాలు ఎప్పుడూ ఆమె వెంటే ఉంటాయి. ఆఖరుకు ఆమె షూటింగ్‌కి వెళ్లేటప్పుడు కూడా వదలవు. సినిమాలు, సీరియల్సే కాకుండా ఫ్యాషన్ప్రపంచంలోకీ అడుగుపెట్టారు ఏక్తా. తన పేరులోని రెండు పొడి అక్షరాలు ’ఉఓ’ అనే బ్రాండ్‌నేమ్‌తో ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తున్నారు ఏక్తా టీనేజ్‌లోకి వచ్చేదాకా చాక్లెట్లు విపరీతంగా తినేదట. ఇప్పటికీ చాక్లెట్లంటే పడిచస్తుంది అని ఆమె స్నేహితులు చెబుతారు. ఆమె చేత చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ మాన్పించడానికి ఆమె తండ్రి జితేంద్ర చాలా కష్టపడ్డారట. పొగరు.. పరిణతి.. పట్టుదల ఈ మూడూ కలిస్తే.. ఏక్తా. నుదుటి మీద నిలువెత్తు నామం.. విరబోసుకున్న జుత్తు... నవ్వీనవ్వని పెదాలు.. ఏక్తా రూపానికి ఆకర్షణలు. బాంబే స్కాటిష్ స్కూల్లో బాల్యవిద్య, మితిభాయి కాలేజ్‌లో కామర్స్ డిగ్రీ. అక్కడితో ఆగిపోయారు ఏక్తా. పై చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. నిజానికి ఆమె బ్రిలియంట్ కాదు. క్రియేటివ్. ఇంకా చెప్పాలంటే.. బ్రిలియంట్లీ క్రియేటివ్. ఈ విషయాన్ని తండ్రి జితేంద్ర కనిపెట్టారు. ఆమెను టీవీ రంగం వైపు ప్రోత్సహించారు. ‘బాలాజీ టెలీఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ను ప్రారంభించారు. క్రియేటివ్ డెరైక్టర్‌గా కూతురికి బాధ్యతలు అప్పగించాడు. తండ్రి ఇంత చేసినా తన విజయానికి స్ఫూర్తి మాత్రం తల్లి శోభాకపూరే అని చెప్తారు ఏక్తా. సెట్లో అమ్మ వెన్నంటే ఉండాలని కోరుకుంటారు ఆమె. శోభ కపూర్ ఇప్పుడు బాలాజీ టెలీఫిలింస్ మేనేజింగ్ డెరైక్టర్. ‘కె’ సెంటిమెంట్ ఒక వ్యూహం! ‘జారినా ఆఫ్ టీవీ’గా పేరున్న ఏక్తా స్వయంశక్తిని ఎంతగా నమ్ముకున్నారో జాతకాలనూ అంతకన్నా బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ మీద నమ్మకం జాస్తి. తన సీరియల్స్‌లో చాలా వాటికి ‘కె’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్స్‌నే ఆమె పెట్టారు. ‘మా ప్రొడక్షన్ హౌజ్‌కి ఓ బ్రాండ్‌నేమ్ స్థిరపడడానికే నేను ఈ కె సెంటిమెంట్‌ను వాడుకున్నా. అందుకే మొదట్లో మేం తీసిన సీరియల్స్ అన్నిటికీ కెతో టైటిల్స్ పెట్టాం. ఎప్పుడైతే ఆ సీరియల్స్ అన్నీ బాలాజీ వాళ్లవని జనాల్లో ఓ ముద్ర పడిపోయిందో అప్పుడు నెమ్మదిగా కెని వెనక్కి నెట్టా. తర్వాత నుంచి అలాంటి సెంటిమెంట్ లేకుండా కథాంశానికి అనుగుణంగా టైటిల్స్ పెట్టడం స్టార్ట్ చేశా’ అని చాలాసార్లు చెప్పారు ఏక్తా. ఏక్తా టీవీ సీరియల్స్ తెలుగు డబ్బింగ్ బడే అచ్చే లగ్తే హై (నువ్వు నచ్చావ్), పరిచయ్ (అభినందన), బైరీ పియా (నువ్వే కావాలి) తెలుగులో వచ్చినవి కళ్యాణి, బ్రహ్మముడి, కన్నవారి కలలు, కొత్త బంగారం, కార్తీకదీపం, కాళరాత్రి, కంటే కూతుర్నే కనాలి, కలవారి కోడలు, పవిత్రబంధం, కుటుంబం, అనుబంధం, పెళ్లికానుక, కలిసుందాం రా, కావ్యాంజలి. ఇప్పుడు వస్తున్నవి యే హే మొహొబ్బతే (మనసు పలికే మౌనగీతం), కుంకుమ్ భాగ్య (కుంకుమభాగ్య), జోథాఅక్బర్ (జోథాఅక్బర్). సావధాన్ ఇండియా - క్రైమ్స్టోరీస్ సిరీస్ (లైఫ్ ఓకే చానెల్లో వస్తోంది. తెలుగులోనూ ఇదే పేరుతో వస్తోంది) - సరస్వతి రమ -
నగ్నంగా... నాకు ఓ.కె!
‘ఎక్స్ఎక్స్ఎక్స్’... ప్రస్తుతం హిందీ రంగంలో గురించి ఈ చిత్రం గురించి మాట్లాడుకోనివాళ్లు లేరు. కెన్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పూర్వ కార్యక్రమాల సమయంలోనే వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఈ చిత్రం కోసం ఏక్తా ప్రవేశపెట్టిన ‘న్యూడిటీ క్లాజ్’. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారామె.కథానాయిక పాత్ర పోషించే తార ఈ న్యూడిటీ క్లాజ్‌లో సంతకం పెట్టాలన్న మాట. ఈ పని ఎవరు చేస్తారా? అని హిందీ రంగంలో చాలామంది ఎదురుచూశారు. చివరికి మోడల్ కైరా దత్ దీనికి ఒప్పుకున్నారు. సన్నివేశాన్ని బట్టి అవసరమైతే నగ్నంగా నటిస్తానంటూ సంతకం పెట్టేశారు. ఇప్పటివరకూ మన తెరపై రానంత ‘హాట్ మూవీ’ ఇదని సమాచారం. పెద్దలకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రంలో శృంగారం పాళ్లు తారస్థాయిలో ఉంటాయట. తీరా చిత్రీకరణ మొదలుపెట్టాక, హాట్ సీన్స్‌లో నటించడానికి తారలు ససేమిరా అంటే! అందుకే ముందు జాగ్రత్తగా సంతకం పెట్టించుకున్నారు. కానీ, కైరా మాత్రం ఈ చిత్రంలో నటించడం తన అదృష్టం అంటున్నారు. కత్తి లాంటి దేహాన్ని ప్రదర్శించే వీలుందని సంబరపడిపోతున్నారు. ఐదు కథల సమాహారంగా సాగే ఈ చిత్రంలో అన్ని కథల్లోనూ కైరానే నాయిక. ఓ మంచి దర్శకుడి చేతిలో పడ్డాననీ, నగ్న దృశ్యాలను ఆయన అద్భుతంగా చూపిస్తారనే నమ్మకం ఉందనీ ఆమె వ్యాఖ్యానించారు. కథానాయికలు ఎంతకాలం పక్కింటి అమ్మాయిలా కనిపించాలని కూడా అంటున్నారు. -
మన దగ్గర మహిళా టెక్నీషియన్లు కాస్త తక్కువే!
ఏక్తాకపూర్ అనే మహిళా నిర్మాత హిందీ సీరియల్ రంగాన్ని ఏలుతోంది. మిథాలీ మహాజన్ లాంటి రచయిత్రులు, అపర్ణారైనా లాంటి ఆర్ట్ డెరైక్టర్లు, ప్రీతి శర్మ లాంటి కాస్ట్యూమ్ డిజైనర్లు అక్కడ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. మరి తెలుగు సీరియళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ నటీమణులు ఉన్నంతగా ఇతర విభాగాల్లో మహిళలు ఎందుకు లేరు?! ఈ విషయం గురించి టెలివిజన్ స్టార్ రైటర్ బిందునాయుడుతో చిన్నపాటి చిట్‌చాట్... బిందునాయుడు హిందీలో మాదిరిగా తెలుగు సీరియళ్లలో మహిళా టెక్నీషియన్లు ఎందుకు ఎక్కువ ఉండటం లేదు? నిజమే. మన దగ్గర నటీమణులు ఉన్నంతగా మహిళా స్క్రిప్టు రైటర్లు, డెరైక్టర్లు, ప్రొడ్యూసర్లు లేరు. అయితే హిందీ ఫీల్డ్ చాలా పెద్దది. దానితో తెలుగు రంగాన్ని పోల్చడం సరికాదు. అసలు హిందీలో జరిగినంత సీరియల్ ప్రొడక్షన్, మరే ఇతర భాషలోనూ జరగదు. అందుకే అక్కడ మహిళలకు అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఇక్కడ అవకాశాలు లేవనా లేక మహిళల్లో ఆయా అంశాలపై ఆసక్తి తక్కువ ఉందా? అవకాశాలు లేవని అనలేం. ఇటీవల మీడియాలో మనకు చాలామంది మహిళలు కనిపిస్తున్నారు. అదే సీరియళ్ల దగ్గరకు వచ్చేసరికి నటన మీద ఆసక్తితో బోలెడంతమంది వస్తుంటారు కానీ మిగతా విభాగాల్లో పని చేయాలనుందంటూ అంతమంది రారు. ఇతర ప్రొడక్షన్స్ గురించి నాకు తెలియదు కానీ, మా వరకూ అయితే అలా వచ్చేవాళ్లు చాలా తక్కువే. నిజానికి టీవీ ఒక్కటే కాదు... మన తెలుగు సినిమా రంగంలో కూడా మహిళా డెరైక్టర్లు, రచయిత్రులు తక్కువే ఉన్నారు కదా! ఒకవేళ ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని భయపడి.. ఆ మాటను నేను ఒప్పుకోను. ఈ రంగం ఆడాళ్లకు అనుకూలంగా ఉండదు, ఇబ్బందులుంటాయి, అందువల్లే ఆడవాళ్లు రావడానికి భయపడతారు అని చాలామంది అంటుంటారు. అదే నిజమైతే ఇంతమంది నటీమణులు ఎందుకుంటారు చెప్పండి! మేమైతే మా ప్రొడక్షన్లో ఉండే మహిళలకు టైమింగ్స్ అడ్జస్ట్ చేయడం, ఇబ్బందిగా ఫీలైతే సన్నివేశాల్లో మార్పులు చేయడం వంటి వెసులుబాటు కల్పిస్తాం. అయినా ఇబ్బందులు ఏ రంగంలో ఉండవు?! నిజాయతీగా శ్రమిస్తే, ఎవరైనా ఇక్కడ సక్సెస్ అవుతారు. దానికి ఆడా మగా తేడా లేదు. మహిళలు సీరియళ్లకు అడిక్ట్ అవుతున్నారని, వాళ్ల మీద చెడు ప్రభావం పడ్తోం దనే కామెంట్‌కి మీ స్పందన? సినిమా అయినా సీరియల్ అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. మనం దేన్ని తీసుకుంటామనేదాన్ని బట్టి ఉంటుంది. నిజానికి ఇంతకుముందు కంటే ఇప్పుడు కాస్త అత్తాకోడళ్ల గొడవలవీ తగ్గించి డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. అది మంచి మార్పే కదా! ఆ మార్పొక్కటే సరిపోతుందా? అలా అని కాదు. ఇంతకుముందు కంటే కాస్త మెరుగుపడిందని నా ఉద్దేశం. అయితే ఇంకా అక్కడక్కడా ఆడవాళ్లను మరీ క్రూరంగాను, మగవాళ్ల వెంటపడి వాళ్ల కోసం పాకులాడు తున్నట్టుగాను, ఒక్కోసారి కాస్త అసభ్యం గానూ చూపించడం జరుగుతోంది. నాకది నచ్చదు. అందుకే అక్క మంజు, నేను మా సీరియల్స్‌లో వీలైనంత వరకూ అను బంధాలను, వాటి విలువలను ఎక్కువగా చూపించడానికి ప్రయత్ని స్తుంటాం. ఆ విషయం నేను కాస్త గర్వంగానే చెప్పుకుంటాను! డబ్బింగ్ సీరియళ్ల గొడవ ఎంతవరకూ వచ్చింది? పరిస్థితి ఇంకా అలాగే ఉంది. వాటి వల్ల ఇక్కడ ఎంత మంది జీవనోపాధికి గండిపడుతుందో ఎవరూ ఆలోచించట్లేదు. అంతవరకూ ఎందుకు? మీరు మన మహిళల సాధికారత గురించి అడుగుతున్నారు కదా! ఎంతోమంది నటీమణులు సీరియళ్ల మీద ఆధార పడి జీవిస్తున్నారు. డబ్బింగ్ సీరియళ్లు పెరిగి పోతే వాళ్లందరూ రోడ్డున పడరా? ఇంకెక్కడొస్తుంది సాధికారత?! -
కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!
చేతన్ భగత్ నవల ఆధారంగా త్వరలోనే సినిమా తెరకెక్కనుంది. ఈ నవల బుధవారం విడుదల కానుంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ కీర్తి సనాన్కు దక్కనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర ఆలియా భట్ ధరించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ పాత్ర కీర్తి సనాన్కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘హీరోపత్ని’ విడుదల తర్వాత కీర్తికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. -
డెయిలీ సీరియల్లో సోనాలీ బింద్రే
న్యూఢిల్లీ: అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ లో నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు. -
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
-
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
మళయాళం, కన్నడం, తెలుగు భాషల్లో భారీగా హిట్టయిన చిన్న సినిమా 'దృశ్యం' ఇప్పుడు సరికొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ సినిమాను తమిళంలో తీయాలని సుప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్ భావించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావించారు. 'ఎర్ర గులాబీలు', 'వసంత కోకిల' లాంటి చిత్రాల్లో హిట్ పెయిర్‌గా నటించిన కమల్‌హాసన్, శ్రీదేవి ఈ సినిమాలో కూడా ఉంటున్నారు. కానీ శ్రీదేవి మాత్రం ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిన్గా కాకుండా.. తెలుగులో నదియా పోషించిన పోలీసు ఆఫీసర్ పాత్ర పోషించబోతోందని సమాచారం. మలయాళం సినిమాకి దర్శకత్వం వహించన జీతూ జోసెఫ్ ఈ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకత్వం వహించారు.అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇతర టెక్నీషియన్లు, తారాగణం ఎంపిక జరగవలసి ఉంది. ఈ సినిమాను రాజ్ కుమార్ థియటర్స్ మరియు వైడ్ యాంగిల్ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఘిబ్రన్ అందిస్తున్నారు. అయితే, మళయాళంలో తీసిన మాతృక గురించి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కోర్టుకెక్కింది. తాను కొన్న జపాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇందులో కాపీ చేశారంటూ మళయాళ చిత్ర రచయిత, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. ఈ వివాదం సమసిపోకుండానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ కథ తనదని, తాను రాసిన 'ఒరు మజకళాటు' నవలను కాపీ చేశారని ఆరోపిస్తూ.. మలయాళ రచయిత సతీష్ పాల్ కోర్టుకి ఎక్కాడు. దీంతో ఈ సినిమా తమిళ వెర్షన్ షూటింగ్ నిలుపుదల చేయాలంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
కథ ఒకటే... సీరియళ్లు అనేకం!
టీవీ ప్రముఖురాలు ఏక్తా కపూర్ అనగానే టీవీలోని ఏడుపులు పెడబొబ్బల సీరియళ్ళు, అత్తా కోడళ్ళ కథలే గుర్తుకొస్తాయి.‘సెక్స్, లవ్ ఔర్ ధోకా’, ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ లాంటి సినిమాలతో తరచూ వార్తల్లోకి వస్తున్న ఏక్తా సర్వసాధారణంగా సుదీర్ఘమైనఇంటర్వ్యూలు ఇవ్వరు. పెపైచ్చు, ఎంతటి ప్రశ్నకైనా మూడు ముక్కల్లో జవాబు తేల్చేస్తారు. ఆ చెప్పే సమాధానం కూడా ఇట్టే ఊహించగలిగే రీతిలో ఉంటుంది. అలాంటి ఏక్తా తాజాగా ఓ మాట ఒప్పుకున్నారు. తాను తీసే టీవీ సీరియళ్ళలో చాలా వాటి కథలు దాదాపు ఒకేలా ఉంటాయని అంగీకరించారు. తప్పనిసరి విజయసూత్రమైన కుటుంబ కథల ఫార్ములాతోనే సీరియళ్ళు తీస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారం ప్రసారం ప్రారంభం కానున్న తన తాజా టీవీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ప్రమోషన్లో పాల్గొంటూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా తన మీద వస్తున్న విమర్శలను ఒక రకంగా ఒప్పుకున్నారు. అయితే, ‘‘కథలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కానీ, మనం వాటిని చెప్పే తీరు వల్ల ఆ కథలు కొత్తగా కనిపిస్తాయి. అలాగే, అందులోని పాత్రల వల్ల కూడా కొత్తదనం వస్తుంది. కానీ, పాత కథనే విభిన్నంగా కనిపించేలా తెరకెక్కించడం అంత తేలికేమీ కాదు’’ అని ఏక్తా చెప్పారు. ఒకప్పటి ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్ టి.ఆర్.పి.ల కోసం టీవీ కథలను సాగదీస్తానంటూ నిజాయతీగా చెప్పారు. ‘‘నా సీరియళ్ళలో కొన్ని ఆరేడేళ్ళు నడిచినవి కూడా ఉన్నాయి. వీక్షకులకు నచ్చిన సీరియల్ వీలుంటే 20 ఏళ్ళు నడపమన్నా, నాకు ఓ.కె’’ అని ఏక్తా వ్యాఖ్యానించింది. జేన్ ఆస్టెన్ రచన ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా తాజా సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ను నిర్మిస్తున్నారామె. ‘‘ఏ సీరియల్ అయినా హిట్టవ్వాలంటే పాత్ర చిత్రణ చాలా ముఖ్యం. ఆ పాత్రలను పోషిస్తున్న నటీనటులు వాటిలో పూర్తిగా జీవించాలి. అప్పుడు ఆ సీరియల్ జనాకర్షణీయంగా వస్తుంది’’ అని ఏక్తా ముక్తాయించారు. తీస్తున్న కథలే తీస్తూ, బుల్లితెరపై విజయం సాధిస్తున్న ఆమె మాటలు మన సీరియల్ దర్శక, రచయితలు పైకి ఒప్పుకోని నిజాలు కదూ! -
బైకు మీద వెళ్లడం చాలా కష్టం: ఏక్తా కపూర్
బైకు మీద వెళ్లడం అంటే సినిమాలు, సీరియళ్లు తీసినంత సులభం కాదని ఏక్తా కపూర్ తెలుసుకుంది. 'మై తేరా హీరో' సినిమా ప్రమోషన్ కోసం అందులో హీరో వరుణ్ ధావన్ ఆమెను తన బైకుమీద ఎక్కించుకుని ముంబైలో తిప్పాడు. అయితే అలనాటి హీరో జితేంద్ర కూతురు కావడంతో ఏక్తాకు చిన్నప్పటినుంచి కార్లు మాత్రమే అలవాటు. బైకు ఎక్కడం అంటే ఏంటో ఇప్పటివరకు తెలియదు. దాంతో మొదటిసారి ఎక్కిందో ఏమో గానీ, చాలా భయంగా అనిపించిందని చెప్పింది. చిన్నప్పుడు రెండుసార్లు సైకిల్ ఎక్కినా, రెండుసార్లూ పడిపోయానని, నాన్న పట్టుకుని తొక్కిస్తే తప్ప సైకిల్ తొక్కేదాన్ని కాదని ఏక్తా తెలిపింది.ఆయన వదిలేయగానే వెంటనే పడిపోయేదాన్నని.. దాంతో అసలు సైకిల్ అన్నా, బైకు అన్నా భయమని అంటోంది. తొలిసారి తాను వరుణ్ ధావన్ నడిపిన బైకు ఎక్కినందుకు అనేక మహిళా సంఘాల నుంచి తనను తిడుతూ ఈ మెయిళ్లు వచ్చాయని కూడా ఏక్తా తెలిపింది. అయితే వరుణ్ ధావన్ మీద మాత్రం 38 ఏళ్ల ఏక్తా ప్రశంసలు కురిపించేసింది. ఇప్పటివరకు అంత ముద్దొచ్చే కుర్రాణ్ని చూడలేదని, ఎస్కిమోకు కూడా ఐస్ క్రీం అమ్మేయగల చాతుర్యం అతడికి ఉందని చెప్పింది. బైకు విషయం పక్కన పెడితే.. చంద్రుడిమీదకు తీసుకెళ్తానన్నా అతడితో వెళ్లిపోతానని తెలిపింది. ఇక ఏక్తా ఈ సినిమాకు సహ నిర్మాత కాకపోయినా.. తన తండ్రి డేవిడ్ ధావన్ చెప్పకపోయినా ఈ సినిమాలో తాను ఇంతలా చేయగలిగేవాడిని కానని వరుణ్ ధావన్ అన్నాడు. వాళ్లిద్దరికీ సినిమాలంటే చెప్పలేనంత మమకారం ఉందని, ఏక్తా లేకపోతే అసలు తాను ఇదంతా చేసే సమస్యే లేదని చెప్పాడు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన 'మై తేరా హీరో'లో వరుణ్ సరసన నర్గీస్ ఫక్రీ, ఇలియానా ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 4న విడుదల కానుంది. -
సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్
పాజిటివ్ పాయింట్స్: చిత్ర తొలి భాగం కామెడీ, ఎమోషన్స్ క్లైమాక్స్ నెగిటివ్ పాయింట్స్: రెండవ భాగంలో కథనం మందగించడం రొటీన్ సీన్లు నటీనటులు: ఫరాన్ అక్తర్, విద్యాబాలన్, ఇలా అరుణ్ తదితరులు సంగీతం: ప్రీతమ్ నిర్మాతలు: ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ దర్శకత్వం: సాకేత్ చౌదరీ ఆనందంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ప్రేమికుల్లాంటి దంపతులు. కెరీర్ లో ఇంకా పూర్తిగా స్థిర పడని పరిస్థితులు. జీవితంలో ఏదో సాధించాలనే వర్కింగ్ కపుల్స్ తాపత్రయం. ప్రతి రోజు దంపతుల మధ్య ఏదో విషయంపై వాగ్యుద్దం జరగడం.. అభిప్రాయబేధాలు చోటు చేసుకోవడం..మాట్లాడుకోవడం ఆపివేయడం ఇవన్ని మన జీవితంలో చోటుచేసుకోవడం వారి జీవితంలో కనిపించే సర్వసాధారణమైన అంశాలు. జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా సాగాలంటే ఆమె తప్పైనా అతను సారీ చెప్పడం, తనది తప్పైనా అతనే సారీ చెప్పడం తప్పనిసరవుతాయి. సారీతో మళ్లీ మామూలు పరిస్థితి ఏర్పడటం. ఆతర్వాత మళ్లీ ఏదో గొడవ ప్రారంభం కావడం ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చోటు చేసుకునే అంశాలు కొనసాగుతునే కనిపిస్తాయి, మనకు కూడా ఎదురవుతాయి. నిత్య జీవితంలో ఒక విషయాన్ని దాచి పెట్టడానికి ఓ అబద్ధం. ఆ అబద్దాన్ని దాచడానికి మరో అబద్ధం ఆడటం దంపతుల మధ్య కామన్. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుకొని సంఘటన వారి మధ్య ఎడబాటుకు గురి చేస్తే ఎమిటనేది.. ఒకరికొకరు దగ్గరకు కావడానికి దంపతులు ఎలాంటి మార్గాలను అన్వేషించారనే ఇతివృత్తానికి, హాస్యం, ఎమోషన్స్ జోడించి 'షాదీ కే సైడ్ ఎఫ్టెక్ట్స్' చిత్రానికి దర్శకుడు సాకేత్ చౌదరీ తెరరూపం కలిగించాడు. కథ: సిద్ (ఫరాన్ అక్తర్), త్రిష(విద్యబాలన్) దంపతులు. సిద్ కెరీర్ లో పూర్తిగా స్థిరపడని సంగీత కళాకారుడు. త్రిష ఓ కంపెనీలో ఉద్యోగిని. జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడటానికి, తమ కలలకు వాస్తవ రూపం ఇవ్వడానికి సగటు కుటుంబంలానే పోరాటం చేస్తుంటారు. అయితే సరైన జాగ్రత్త పాటించకపోవడంతో త్రిష ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సిద్ కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో త్రిష ఇష్టం లేకున్నాఅబార్షన్ కు ప్లాన్ చేస్తాడు. కాని ఓ సంఘటన సిద్ అబార్షన్ ఆలోచనకు బ్రేక్ వేస్తుంది. అయితే వారి జీవితంలో మిలీ అనే బుల్లి పాప ప్రవేశిస్తుంది. ఆతర్వాత వారి వ్యక్తిగత, వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? చివరికి ఎలా పరిష్కరించుకున్నారనే ప్రశ్నలకు తెర రూపం 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం. ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలో సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న ఫరాన్ ఈ చిత్రంలో సిద్ పాత్రతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని మిల్కా పాత్రతో జాతీయ అంతర్జాతీయ సినీ విమర్శకులను మెప్పించిన ఫరాన్ సిద్ పాత్రతో మరోసారి విజృంభించాడు. ఈ చిత్రంలో ఓ మధ్య వయస్కుడైన వివాహితుడుగా కనిపించి తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే 'బెస్ట్ ఫాదర్'గా ప్రూవ్ చేసుకోవడానికి, ఓ మంచి భర్త అనే నమ్మకం కలిగించే, ఓ మ్యూజిక్ కంపోజర్ గా స్థిర పడటమే లక్ష్యంగా శ్రమించే సిద్ పాత్రను పోషించి నూరు మార్కులు కొట్టేశాడు. త్రిష పాత్రలో నటించిన విద్యబాలన్ తో నువ్వా నేనా అనే రీతిలో ఫెర్మార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక త్రిష పాత్రలో ఓ గృహిణి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఎలా ఆలోచిస్తారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ తల్లి ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఓ బిడ్డకు తల్లిగా, భార్యగా రెండు కోణాలున్న పాత్ర మధ్య జరిగే మానసిక సంఘర్షణను విద్యాబాలన్ చక్కగా పలికించారు. కహానీ, డర్టీ పిక్చర్ తర్వాత మరోసారి త్రిష పాత్రలో విద్యబాలన్ తన ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను ఆలరించారు. ఈ చిత్రంలో ఫరాన్, విద్యబాలన్ లు సగం బలంగా మారితే.. సాకేత్ చౌదరీ స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో క్రెడిట్ కొట్టేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి చిత్రం 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ద్వారా ప్రేక్షకులు, విమర్శకుల దృష్టిని తనపైకి తిప్పుకున్న సాకేత్ .. రెండవ చిత్రంతో తనపై నెలకొన్నఅంచనాలను పూర్తిగా అధిగమించాడు. ఫరాన్, విద్యబాలన్ ల మధ్య చక్కటి కెమిస్ట్రీని డిజైన్ చేయడంలో, ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా రూపొందించడంలో దర్శకుడిగా సాకేత్ సఫలమయ్యాడు. భార్య, భర్తల మధ్య రిలేషన్స్ చాలా సహజంగా చిత్రీకరించి తన సత్తాను చాటుకున్నాడు. 'ఎలక్ట్రిఫైయింగ్' ఆరంభాన్ని అందించిన సాకేత్...అదే జోష్ తో హై ఓల్టేజ్ కథనంతో తొలిభాగాన్ని పరుగులెత్తించాడు. అయితే కథలో ఉండే పరిమితుల వల్ల అదే వూపును సాకేత్ రెండవ భాగాన్ని కొనసాగించలేకపోవడం ప్రేక్షకుడ్ని కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. కాని ఓ చక్కటి క్లైమాక్స్ తో ముగించడంతో ప్రేక్షకుడిలో కలిగిన అసంతృప్తి దూరం చేయగలిగాడు. దర్శకుడి కథ, కథనాలకు తోడు ప్రీతం సంగీతం, ఫోటోగ్రఫీ అదనపు ఎస్సెట్ గా నిలిచాయి. 'హ్యారీస్ నాట్ ఏ బ్రహ్మచారి', 'యాహా వహా', దేశీ రొమాన్స్, 'తౌబా మే' పాటలు బాగున్నాయి. ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. -రాజబాబు అనుముల -
'రాజకీయాల్లో రాణించే సత్తా సల్మాన్ లో ఉంది'
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రాజకీయాల్లో మంచి నేతగా రాణించడానికి అవకాశం ఉందని నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ తెరపై విభిన్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్న సల్లూభాయ్ కి రాజకీయాల్లో కూడా నిజాయితో కూడిన స్టార్ గా ఎదిగే సత్తా ఉందని ఆమె జోస్యం చెప్పారు. మై తేరా హీరో అనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ పేరును ఏక్తా వెల్లడించింది. అంతేకాకుండా సల్మాన్ ఆమ్ ఆద్మీ అని.. ప్రజల మనిషి అని కితాబిచ్చారు. జై హో చిత్రంలో సల్మాన్ పోషించిన పాత్ర కామన్ మ్యాన్ లో ఉండే పవర్ చూపిస్తుందన్నారు. అవినీతి రాజకీయనేతకు వ్యతిరేకంగా పోరాడిన ఓ సాధారణ పౌరుడి పాత్రను సల్మాన్ పోషించారని ఏక్తా తెలిపింది. -
బాలీవుడ్ తెరపై అజారుద్దీన్ గా అజయ్ దేవగన్?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథా చిత్రాల జోరు పెరిగింది. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అయితే అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ లో ఏ హీరోతో చేయించాలనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. తెరపై అజారుద్దీన్ పాత్రను పోషించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ పాత్ర అజయ్, ఇమ్రాన్ లలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
‘ఏక్తాతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌తో కలిసి మూడు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్శకుడు మిలన్ లుథ్రియా తెలిపారు. ఆమెతో కలిసి పనిచేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ఇద్దరి కాంబినేషనల్ వచ్చే చిత్రాలు అద్భుతమైన సృజనాత్మకతను సంతరించుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సోమవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన లుథ్రియా.. ఇప్పటి వరకూ తమ ఇద్దరి కాంబినేషనల్ నిర్మితమైన చిత్రాలు విజయవంతమైనట్లు తెలిపారు గతంలో లూథారియా దర్శకత్వం వహించిన ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి’, ద థర్టీ పిక్చర్ చిత్రాలను ఏక్తాక పూర్ తన సొంత బ్యానర్ అయిన బాలాజీ టెలిఫిలింస్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి దోబరా’ తో కలిపి మూడో ప్రాజెక్టును ఏక్తా బ్యానర్లో పూర్తి చేసినట్లు మిలన్ తెలిపారు. చిత్రీకరణ సమయంలో ఒకరి నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. కొన్ని సమయాల్లో తమ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నా, విరుద్ధమెన భావాలు సంతరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏక్తాకపూర్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవిల్స్ తనకు బాగా నచ్చుతాయని లూథారియా అన్నారు. ‘ మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని’ పేర్కొన్నారు.