
భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ట్రోపీని గమనించారా. పాము ఆకారంలో ఉండి కాస్త కొత్తగా కనిపిస్తున్న ట్రోపీ లుక్ అందరిని ఆకట్టుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సైతం ట్రోపీ డిజైన్ చూసి ముచ్చటపడ్డారు. అందుకే భారత్-విండీస్ వన్డే సిరీస్ ట్రోపీ హాట్‌టాపిక్‌గా మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ట్రోపీ ఫోటోలును షేర్ చేస్తూ టెలివిజన్ స్టార్ నిర్మాత.. డైరెక్టర్.. ఏక్తాకపూర్‌ను ట్యాగ్ చేశారు.'' ఏక్తాకపూర్ ఏమైనా ఈ ట్రోపీ తయారు చేసిందా.. సిరీస్ గెలిచిన జట్టుకు పాముకాటు తప్పేలా లేదు'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
ఇక ఏక్తాకపూర్‌ను ట్యాగ్ చేయడం వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. సూపర్‌హిట్ సీరియల్ 'నాగిన్' గుర్తుండే ఉంటుంది. నాగిన్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు.. మన ఏక్తాకపురే. ఇప్పటివరకు నాగిన్ ఫ్రాంచైజీలో ఐదు సీజన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆరో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. అంతేకాదు హిందీలో ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌కు ఏక్తాకపూర్ నిర్మాతగా.. డైరెక్టర్‌గానూ వ్యవహరించింది.
ఇక భారత్- విండీస్ వన్డే సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. సీనియర్ల గైర్హాజరీలో ధావన్ నాయకత్వంలో టీమిండియా యువ జట్టు విండీస్‌తో తలపడుతోంది. మూడు వన్డేల సిరీస్ అనంతరం జూలై 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment