Virat Kohli Equals New Zealand Great In Elite List, Eyes Ex-India Captain's Huge Feat - Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి

Published Fri, Jul 28 2023 5:28 PM | Last Updated on Fri, Jul 28 2023 5:54 PM

Virat Kohli Equals NZ-Great In Elite List-Eyes Ex-India Player Huge Feat - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్‌ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. అదెలాగంటే విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిసిన సంగతి తెలిసిందే.

ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్‌ ఆఫ్‌సైడ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ క్రమంలో కోహ్లి వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో రాస్‌ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లి అందుకున్న షెపర్డ్‌ క్యాచ్‌ అతనికి 142వది. ఇక కోహ్లి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ 160 క్యాచ్‌లతో ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక కోహ్లి తన స్థానంలో బ్యాటింగ్‌కు రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో తాము విఫలమైతే బ్యాటింగ్‌ బలం ఎంతనేది తెలుసుకోవడానికి రోహిత్‌, కోహ్లిలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ తెలిపాడు. టార్గెట్‌ను చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయినప్పటికి ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

చదవండి: AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement