Mohammad Azharuddin
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లు అందుకోగా.. విరాట్ కేవలం 298 మ్యాచ్‌ల్లో సరిగ్గా 156 క్యాచ్‌లను తీసుకున్నాడు. కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే అజారుద్దీన్‌ను అధిగమిస్తాడు.హృదయ్ విరోచిత సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాను తౌహిద్ హృదయ్, జాకర్ అలీ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) రాణించాడు. హ్రిదయ్ ఓ వైపు కాలి కండరాలు గాయంతో బాధపడుతున్నప్పటికి.. ఫైటింగ్ నాక్‌తో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అయితే బంగ్లా స్టార్ ప్లేయర్లు సౌమ్యా సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో, ముష్పికర్ రహీం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.ఐదేసిన షమీ..ఇక టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి ఐసీసీ ఈవెంట్లో సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఫైవ్ వికెట్ హాల్‌ను సాధించాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో షమీకి ఇది ఏడో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా వన్డేల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్ షమీ చరిత్ర సృష్టించాడు.షమీ ఈ ఫీట్ సాధించేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. ఇంతకు ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు. కాగా షమీతో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ -
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
-
HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
CWC: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదే: అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్-2023 ఫైనల్ పోరుకు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా అజేయ టీమిండియా- ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో తలపడనుంది. ఇరవై ఏళ్ల క్రితం కంగారూ జట్టు చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, రాజకీయ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేయాలా.. బౌలింగ్ చేయాలా అన్నది పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి భారత జట్టు గెలిచి ప్రపంచ కప్‌ను అందుకుంటుంది. ప్రచారంలో ఉంటూనే తీరికవేళ మ్యాచ్‌ను తిలకిస్తాను’’ అని అజారుద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా మేటి క్రికెటర్‌గా పేరొందిన అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం: ఓజా అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సాక్షితో మాట్లాడుతూ.. ‘‘లీగ్ దశ నుంచి ఒత్తిడిని జయిస్తూ మన భారత క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్ ఫేవరెట్ టీంలను సైతం చిత్తు చేయడం కప్‌ను సాధిస్తామని చెప్పకనే చెప్పారు. బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లో దూసుకుపోతున్న తీరు చూస్తూ ప్రతీ భారతీయుడు ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్నారు. భారత క్రికెట్ ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌కు అతిపెద్ద అభిమానిగా మరోసారి వరల్డ్ కప్ భారత ఒడిలో చేరుతుందని నమ్మకంగా ఉన్నాను’’ అని రోహిత్ సేన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. -
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
బకెట్ చైర్స్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తింపు
-
'టీమిండియాకు ఇదొక మంచి ఛాన్స్.. మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా'
వన్డే ప్రపంచకప్-2023లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస విజయాలతో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో దాయాది పాకిస్తాన్‌ను కూడా భారత్ చిత్తు చేసింది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా 8వ సారి వరల్డ్‌కప్ టోర్నీలో పాక్‌ను భారత్ ఓడించింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా రోహిత్ సేనను ఆకాశానికెత్తాడు. ప్రస్తుత భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే కచ్చితంగా వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకుంటందని అజారుద్దీన్ థీమా వ్యక్తం చేశాడు. "నా విషెస్ ఎల్లప్పుడూ భారత జట్టుకు ఉంటాయి. మా జట్టు ఈ సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ మెగా టోర్నీని మా బాయ్స్ అద్భుతంగా ఆరంభించారు. వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ప్రస్తుత జట్టు అన్ని విధాల సమతూకంగా ఉంది. అదే విధంగా సరైన నాయకుడు కూడా ఉన్నాడు. అతడు జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు అని ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
టీమిండియా మాజీ కెప్టెన్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోజే ఫలితాలు ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మోగిన ఎన్నికల నగారా కాగా వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్‌సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు!
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. మిస్టర్కూల్తో పాటు లంక లెజెండ్ మాదిరిగానే వన్డే మ్యాచ్‌లో 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. అదే విధంగా ఆసియా కప్ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గానూ రోహిత్ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్‌లో సారథిగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ధోనికి అలా సాధ్యం కాలేదు అయితే, ధోని(14 మ్యాచ్‌లలో), రణతుంగ(13 మ్యాచ్‌లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు. అజారుద్దీన్‌తో పాటు.. ధోని, రోహిత్ ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్, 2010, 2016(టీ20 ఫార్మాట్లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని టీ–హోప్ కార్యాలయంలో ఆదివారం అజహరుద్దీన్ ఆ సంస్థ చైర్మన్ ఉపేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ... స్థానికంగా ఉపేందర్‌రెడ్డి ఇప్పటికే ఎన్నోమార్లు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని, ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. అలాంటి నాయకుడు తమకు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే ఇక్కడ కాంగ్రెస్ విజయం తధ్యమవుతుందని అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఉపేందర్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని ఆయన పేర్కొన్నారు. ఇక్కడకు వచి్చన మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఇక కాంగ్రెస్ తిరుగులేదని అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మంచి జరగాలని తపన పడుతున్న ఆయనకు భవిష్యత్‌లో మంచే జరుగుతుందన్నారు. టికెట్ అనేది త్వరలోనే తెలుస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ కలిసి పార్టీకి విజయం చేకూర్చాలనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ... టీ–హోప్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకుని కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... కాంగ్రెస్‌కు పూర్వవైభవం లభించేనా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందనడం నిరి్వవాదాంశం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశనిస్పృహలే కని్పస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీని నడిపించే యోధుడు ఆశించిన స్థాయిలో చురుగ్గా లేకపోవడమే కారణమంటూ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. హైదరాబాద్: ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం అది. జనహృదయ నేత పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) అంటే ఖైరతాబాద్... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అనే విధంగా ఉండేది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ప్రజల నడుమే ఉండేవారనడం.. ప్రజామద్దతు ఆయనకే ఉండేదనడం అతిశయోక్తికాదు. పీజేఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించినా పీజేఆర్‌కు ఉన్న ఓర్పు, నేర్పు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతంలో క్రమేపీ ఆ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికీ పీజేఆర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా ఉన్నా సమర్థవంతంగా నడిపించే నాయకులు లేక పార్టీ చతికిల పడిపోయింది. దీంతో దశాబ్దాలకాలం పాటు వెన్నంటి నడిచిన కేడర్‌కు దిక్కులేకుండా పోయింది. ► అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక మెజారిటీ నాయకులు పార్టీలు మారినా.. ఉన్న కొంత మంది పీజేఆర్‌ను మరువలేక పార్టీని వదలలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ► పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పీవీఆర్ కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీవీఆర్‌కు సత్తా ఉన్నా నియోజకవర్గంలో సమస్యలు, పార్టీలో యువతను సంఘటితం చేస్తూ పార్టీలో చురుకుగా పాల్గొనకపోవడం పెద్ద సమస్యగా మారింది. పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉండి, ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. క్రమేపీ ఆయనలోని మార్పుల వల్ల పార్టీ బలహీనంగా మారింది. ► ఆయన నివాసం కూడా దోమలగూడలో ఉండటంతో కార్యకర్తలు, నేతలకు ఒకింత సమస్యగానే మారింది. దీంతో కొత్త నాయకత్వం వైపు పలువురు సీనియర్ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకూ పెద్దాయనపై ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గం పార్టీ స్థితిగతులపై దృష్టి సారించిన పార్టీ హైకమాండ్ మారుతున్న రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో... దివంగత పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. జాతీయ స్థాయి నాయకుల మన్ననలు పొందారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ తనుయుడు విష్ణువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత నూతనంగా ఏర్పాటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి పి.విషువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా ఏడుగురు కార్పొరేటర్లలో నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో విష్ణువర్ధన్‌రెడ్డి వరుస అపజయాలను మూటగట్టుకున్నారు. ► టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీలో నూతనోత్తేజం వస్తుందని అశించిన పార్టీ కేడర్‌కు నిరాశే మిగిలింది. ► మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పనితీరుతో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీని బతికించుకోవడం కోసం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం కొత్త నాయకత్వం వైపు చూడక తప్పడంలేదని సీనియర్లు భావిస్తున్నారు. ► సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏక పక్షంగా నియామకాలు చేపట్టంపై అసంతృప్తి చెందిన నేతలు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టారు. అజహరుద్దీన్ పర్యటనలో ఆంతర్యమేమిటో? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్య నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపోటముల్లో ముస్లిం ఓట్లే కీలకం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజహరుద్దీన్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకే అజహరుద్దీన్ పర్యటన సాగిందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బరిలో అధిష్టానం మాజీ ఎమ్మెల్యే పీవీఆర్‌కు మరో అవకాశం ఇస్తుందా.. కొత్త నేతలకు అవకాశం ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. -
జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్ వర్సెస్ విష్ణువర్ధన్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి బలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ఇవాళ(బుధవారం) నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీతో పరిస్థితి వేడెక్కింది. అజారుద్దీన్ ఇవాళ రెహమత్ నగర్లో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం అందించకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇదే నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోరాదాబాద్(యూపీ) నుంచి ఎంపీగా నెగ్గారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక కథనాల కోసం క్లిక్ చేయండి -
బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. అదెలాగంటే విండీస్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్ ఆఫ్‌సైడ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ క్రమంలో కోహ్లి వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లి అందుకున్న షెపర్డ్ క్యాచ్ అతనికి 142వది. ఇక కోహ్లి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 160 క్యాచ్‌లతో ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి తన స్థానంలో బ్యాటింగ్‌కు రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో తాము విఫలమైతే బ్యాటింగ్ బలం ఎంతనేది తెలుసుకోవడానికి రోహిత్, కోహ్లిలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ తెలిపాడు. టార్గెట్‌ను చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయినప్పటికి ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Most catches in ODI history: 1) Jayawardena - 218 2) Ponting - 160 3) Azharuddin - 156 4) Taylor - 142 5) Kohli - 142* pic.twitter.com/GjMZGcXiDJ — Johns. (@CricCrazyJohns) July 28, 2023 King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm — FanCode (@FanCode) July 27, 2023 చదవండి: AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
అజహరుద్దీన్ నిర్ణయాలను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజహరుద్దీన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (రిటైర్డ్) ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు తన నివేదిక అందించారు. దీని ప్రకారం కార్యదర్శి విజయానంద్ పదవితో పాటు అడ్హాక్ కమిటీ కూడా రద్దయినట్లే. సెప్టెంబర్ 30తోనే అజహర్ పదవీకాలం ముగిసిందని, ఆపై ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి విలువా లేదని కక్రూ పేర్కొన్నారు. ఆయన నివేదిక ప్రకారం సెలక్టర్లు, కోచ్‌ల ఎంపిక, ఇతర నియామకాలేవీ చెల్లవు. సూపర్వైజరీ కమిటీ పర్యవేక్షణలోనే కొత్త సెలక్టర్లను కూడా ఎంపిక చేయాలని కక్రూ సూచించారు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్ తండ్రి మహ్మద్ యూసఫ్ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
Ind Vs Aus: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్
India Vs Australia 3rd T20 Tickets- Mohammad Azharuddin Comments: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌లో మూడో టీ20 నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో కొంతమంది కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆయన.. అవేమీ నిజం కావన్నారు. పేటీఎం ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరిగాయని... పేటీఎం తన పనిని చక్కగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నాలుగు టికెట్లు కొంటే.. టికెట్ల అమ్మకం, జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అజారుద్దీన్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆన్లైన్లో పారదర్శకంగా టికెట్ల అమ్మకం జరిపినపుడు ఇలాంటి అక్రమాలు జరిగాయని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ ఓ వ్యక్తి ఆన్లైన్లో నాలుగు టికెట్లు కొన్నారనుకోండి. వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేసేటపుడు ఆధార్ కార్డు వంటి ఐడీలను పరిశీలిస్తాం. అంతేగానీ ఆ నాలుగు టికెట్లను వారు ఏం చేస్తున్నారో మాకేం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌లో అమ్మకాలు జరిపారని తెలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల వివరాలివే! కాంప్లిమెంటరీ కిందే ఎక్కువ టికెట్లు ఇచ్చామన్న అజారుద్దీన్.. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన లెక్కలను మీడియాకు వివరించారు. ‘‘సెప్టెంబరు 15 ఆన్లైన్లో పేటీఎం ద్వారా 11,450 టికెట్లు, పేటీఎం కార్పొరేట్ బుకింగ్ 4000, మిగతా ఆన్లైన్ సేల్స్ 2100, ఆఫ్‌లైన్ సేల్స్ సెప్టెంబరు 22న 3000, మిగతా 6 వేల టికెట్లు(ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్స్, కార్పొరేట్స్) అమ్మినట్లు తెలిపారు. చికిత్స చేయిస్తాం జింఖానాలో తొక్కిసలాట దురదృష్టకరమని.. గాయపడిన వారికి తమ వంతు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటనకు హెచ్‌సీఏ మాత్రం కారణం కాదని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ తప్పేమీ లేదని.. తమ పొరపాటు లేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు ఇక హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదన్నారు. ఆ పనిని పేటీఎంకు అప్పగించామని.. తాము మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ప్రతీ వ్యవస్థలోనూ ఇలాంటివి సహజమేనన్నారు. ఏదేమైనా మ్యాచ్ నిర్వహణను విజయవంతం చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తొక్కిసలాటపై స్పందిస్తూ.. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
అజారుద్దీన్ రివర్స్ అటాక్.. మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు..
సాక్షి, హైదరాబాద్: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్.. హెచ్‌సీఏ, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. టికెట్ల గోల్మాల్ వ్యవహారాన్ని అజారుద్దీన్ లైట్ తీసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుటే అజారుద్దీన్ రివర్స్ అటాక్ ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించడం మీటింగ్‌లో కూర్చుని మాట్లాడినంత సులభం కాదని అజారుద్దీన్ అన్నారు. తనకు మ్యాచ్ నిర్వహణ పనులు చాలా ఉన్నాయని.. మీతో మాట్లాడే సమయం లేదంటూ మంత్రితో ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే టిక్కెట్ల మొత్తం అమ్ముడుపోయయాని, ఆన్లైన్లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఇక టికెట్ల గోల్మాల్ అంశంపై ప్రశ్నించగా.. అజారుద్దీన్ సమాధానం చెప్పకుండా దాటేసినట్లు తెలిసింది. కాగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయంటూ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే టికెట్ల అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రికి అందజేస్తామని అజారుద్దీన్ పేర్కొన్నారు. చదవండి: Ind A vs NZ A 1st ODI: ఆల్‌రౌండ్ ప్రతిభ.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం! -
ఆజహార్, వెంగ్సర్కార్లను ఏకి పారేసిన గవాస్కర్.. బుద్ధి ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు
భారత క్రికెట్ దిగ్గజాల్లో ముఖ్యుడైన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన సమకాలీకులైన దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజహారుద్దీన్లను ఏకి పారేశాడు. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్-2022 జట్టుపై ఆ ఇద్దరు చేసిన వ్యతిరేక కామెంట్స్‌కు సన్నీ ఘాటుగా బదులిచ్చాడు. ఆటగాళ్ల ఎంపిక జరిగాక వారిపై వ్యతిరేక కామెంట్లు చేసేందుకు బుద్ధి, జ్ఞానం ఉండాలని పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ధ్వజమెత్తాడు. ఒకరి బదులు ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేసే ముందు ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదని గడ్డిపెట్టాడు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువు దిగజారడంతో పాటు ఆటగాళ్లను నైతికంగా నిరుత్సాహపరిచినవారమవుతామంటూ మొట్టికాయలు వేశాడు. జట్టు ఎంపికపై అసంతృప్తి ఉన్నా దానిపై బహిరంగా కామెంట్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం ఉండాలని వాయించాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన అనుభవమున్న వారు జట్టు ఎంపిక తర్వాత ఆటగాళ్లను నిరుత్సాహపరిచే విధంగా కామెంట్లు చేయడమేంటని నిలదీశాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేప్పుడు సవాలక్ష సమీకరణలు ఉంటాయని, భారతీయులుగా మనం సెలెక్టర్ల ఛాయిస్‌కు గౌరవమివ్వాలి కాని, ఒకరి స్థానంలో ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగేండేదంటూ కామెంట్లు చేయకూడదని చురకలంటించాడు. జట్టు ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగినా వెనకేసుకురావాలి కానీ మన వీక్నెస్ను మనమే బహర్గతం చేసుకోకూడదని సూచించాడు. ఇదే సందర్భంగా సన్నీ రోహిత్ నేతృత్వంలో ఎంపిక చేయబడ్డ భారత వరల్డ్‌కప్ స్క్వాడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత వరల్డ్ కప్ జట్టు సమతూకంగా చాలా బాగుందని, ఈసారి హిట్‌మ్యాన్ సేన ఎలాగైనా టైటిల్ సాధించి మెగా టోర్నీల్లో భారత్ రాణించలేదన్న అపవాదును తొలగించాలని ఆకాంక్షించాడు. ఇందుకు కొద్దిగా లక్ కూడా తోడైతే టీమిండియాను ఆపడం ఎవరి వల్ల కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ వ్యతిరేక కామెంట్లు చేశాడు. వరల్డ్ కప్ మెయిన్ జట్టులో శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, జట్టులో స్థానం పొందిన వారిలో దీపక్ హుడా, హర్షల్ పటేల్‌లను తప్పించి శ్రేయస్, షమీలకు ఛాన్స్ ఇస్తే బాగుండేదని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అజహార్ వ్యాఖ్యలకు వంత పాడుతూ వెంగసర్కార్ సైతం కొద్ది రోజుల తర్వాత ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనైతే షమీ, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్లను ఎంపిక చేసే వాడినని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. -
T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం?
T20 World Cup 2022- India Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పెదవి విరిచాడు. శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. తానైతే దీపక్ హుడా స్థానంలో అయ్యర్‌కు.. హర్షల్ పటేల్ స్థానంలో షమీకి చోటు ఇస్తానని పేర్కొన్నాడు. కొన్ని మార్పులు మినహా అంతా వాళ్లే! కాగా యువ పేసర్ ఆవేశ్ ఖాన్‌పై వేటు వేయడం సహా.. గాయంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో ఆసియా కప్-2022 ఈవెంట్ ఆడిన జట్టునే ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సహా అక్షర్ పటేల్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదు! ఇక షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన అజారుద్దీన్.. శ్రేయస్ అయ్యర్, షమీని ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే, చాలా మంది నెటిజన్లు అజారుద్దీన్‌తో ఏకీభవించడం లేదు. నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ! గత టీ20 ప్రపంచకప్ టోర్నీలో షమీ ఆట తీరును.. ఆస్ట్రేలియా పిచ్‌లపై శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ అజారుద్దీన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ నీకు ఈ విషయాలు తెలియవు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో షమీ ఎకానమీ ఎంతో తెలియదు. అతడు ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలియదు. ఇక శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడనీ తెలియదు. అసలే ఈ ఐసీసీ టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో! కనీసం ఈ విషయమైనా నీకు గుర్తున్నట్లు లేదు! ఇది టీ20 ఫార్మాట్ సర్. దీపక్ హుడా ఆల్‌రౌండర్. అవసరమైనపుడు బౌలింగ్ కూడా చేయగలడు. అయినా.. ‘కెప్టెన్’ నువ్వు ఏ ప్రాతిపదికన ఈ కామెంట్ చేశావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. షమీ అప్పుడు నిరాశపరిచినా.. ఐపీఎల్-2022లో.. కాగా టీ20 ప్రపంచకప్-2021లో షమీ కేవలం ఆరు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో రాణించి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్‌కు షమీ సూట్ కాడన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని స్టాండ్ బైగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక దీపక్ హుడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు కూడా! చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ విచారం క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Shreyas Iyer instead of Deepak Hooda and Md. Shami in the place of Harshal Patel would be my choice. — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Then please teach Iyer how to play short ball becase in Australian bouncy pitches, he cant survive — Ankit Singh (@ankittfit) September 12, 2022 You are just outdated and shami had never been a good T20 bowler. Deepak hooda can bowl pls be aware what is T20 format — Arunkumar06 (@Arunkumar064) September 12, 2022 This man captained India... I don't even know how to react! — Gagan Chawla (@toecrushrzzz) September 12, 2022 -
'ఇంగ్లండ్‌లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..'
టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లోనూ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 341 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి మరింత బలంగా పుంజుకుంటాడని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి 50పైగా పరుగులు చేసినా అతడు విఫలమైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కోహ్లి పెద్దగా ఆడలేదు. ఎటువంటి స్టార్ ఆటగాళ్లైనా ఏదో ఒక దశలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. కోహ్లి కూడా అంతే. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. కోహ్లి ఒక సెంచరీ సాధిస్తే.. అతడిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది" అని అజారుద్దీన్ పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
IPL 2022: పంత్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్‌బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: హెచ్‌సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజారుద్దీన్ గురువారం బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్‌లోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Rishi Dhawan: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..? -
Ind Vs Sa 1st Test: అజహరుద్దీన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లి!
Ind Vs Sa Test Series: మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయాన్ని ఈసారైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారత జట్టుకు శుభారంభం లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియాదే పైచేయిగా నిలిచింది. రెండో రోజూ మన బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయి మరిన్ని పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంటాం. సెంచూరియన్: భారత బ్యాటర్స్ హవాతో దక్షిణాఫ్రికా పర్యటన మొదలైంది. ‘బాక్సింగ్ డే’ టెస్టులో తొలిరోజు ఆటను భారత బ్యాట్స్‌మెన్ శాసించారు. మధ్యలో ఎన్గిడి ఎదురుదెబ్బలు ఎదురైనా... నిలకడైన బ్యాటింగ్‌తో పరుగుల జోరు కొనసాగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించగా... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 బంతుల్లో 60; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ రహానే (40 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం తొలిరోజు ఆట నిలిచే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఎన్గిడి (3/45) ఒక్కడే రాణించాడు. ఓపెనింగ్ అదుర్స్... టాస్ నెగ్గిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు సఫారీ సవాల్‌కు సాధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు సాధించారు. ముందుగా మయాంక్ జోరు కనబరిచాడు. రబడ, ఎన్గిడి, జాన్సెన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మయాంక్ కంటే కాస్తా ఆలస్యంగా 21వ బంతికి ఖాతా తెరిచిన రాహుల్ క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పని చెప్పాడు. జాన్సెన్ వేసిన 10వ ఓవర్లో మయాంక్ మూడు బౌండరీలు బాదాడు. మళ్లీ 18వ ఓవర్ వేసిన జాన్సెన్ బౌలింగ్‌లో మయాంక్ మిడాన్, కవర్స్ మీదుగా రెండు ఫోర్లు బాదాడు. తొలి సెషన్లో భారత బ్యాటర్లు పైచేయి సాధించగా, 83/0 స్కోరు వద్ద లంచ్‌కు వెళ్లారు. మయాంక్ ఫిఫ్టీ... రెండో సెషన్ మొదలవగానే మయాంక్ 89 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా 35వ ఓవర్లో 100 పరుగులను అధిగమించింది. రాహుల్... మల్డర్ వరుస ఓవర్లలో కొట్టిన బౌండరీలతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ దశలో ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. 41వ ఓవర్ వేసిన ఎన్గిడి రెండో బంతికి మయాంక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఊపులో ఎన్గిడి కీలకమైన పుజారా (0)ను డకౌట్ చేశాడు. దీంతో భారత్ వరుస బంతుల్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లి క్రీజులోకి రాగా జాగ్రత్తగా ఆడిన రాహుల్ 127 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. టీమిండియా స్కోరు 157/2 వద్ద రెండో సెషన్ ముగిసింది. రాహుల్ శతకం... టీ విరామం తర్వాత కూడా ఇటు రాహుల్, అటు కెప్టెన్ కోహ్లి నింపాదిగా ఆడటంతో దక్షిణాఫ్రికా బౌలర్లకు కష్టాలే తప్ప... వికెట్లయితే రాలలేదు. కేశవ్ 66వ ఓవర్లో రాహుల్ వరుసగా ఫోర్, సిక్స్ బాది సెంచరీ దిశగా సాగాడు. ఓపెనింగ్ జోడీ తర్వాత మరో పెద్ద భాగస్వామ్యం నమోదు కావడంతో సఫారీ బౌలర్లలపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో ఎన్గిడి... కోహ్లి (94 బంతుల్లో 35; 4 ఫోర్లు) వికెట్‌ను పడేయడం వారికి ఊరటనిచ్చింది. ఆఫ్ స్టంప్ అవతలకు వెళ్తున్న బంతిని ఆడిన కోహ్లి స్లిప్‌లో మల్డర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 82 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే అండతో రాహుల్ 218 బంతుల్లో (14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 80.4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా కొత్తబంతి తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన సానుకూల ఫలితాన్ని అయితే అందిపుచ్చుకోలేకపోయింది. విరాట్ కోహ్లి రికార్డు! ►టెస్టుల్లో అత్యధికసార్లు టాస్ నెగ్గిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు కోహ్లి 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించి 30 సార్లు టాస్ గెలిచాడు. అజహరుద్దీన్ (47 టెస్టుల్లో 29 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. ►వసీమ్ జాఫర్ (2007లో) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన రెండో భారతీయ ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. ►టెస్టుల్లో రాహుల్ ఏడు సెంచరీలు సాధించగా... అందులో ఆరు విదేశీ గడ్డపైనే చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 122; మయాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్గిడి 60; పుజారా (సి) పీటర్సన్ (బి) ఎన్గిడి 0; కోహ్లి (సి) మల్డర్ (బి) ఎన్గిడి 35; రహానే (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–117, 2–117, 3–199. బౌలింగ్: రబడ 20–5–51–0, ఎన్గిడి 17–4–45–3, జాన్సెన్ 17–4–61–0, మల్డర్ 18–3–49–0, కేశవ్ మహరాజ్ 18–2–58–0. చదవండి: Mayank Vs Lungi Ngidi: మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి Car conversations with 'Centurion' @klrahul11 🚗 🗣️ From emotions on scoring ton 💯 to forming partnerships 🤜🤛 & batting mindset 👍. The #TeamIndia opener discusses it all after Day 1 of the 1st #SAvIND Test. 👏 - By @28anand Full interview 🎥 🔽https://t.co/d2DooNWtrG pic.twitter.com/Y0ONWu5vQ3 — BCCI (@BCCI) December 27, 2021 -
సల్మాన్‌తో డేటింగ్..అజహరుద్దీన్‌తో పెళ్లి.. చివరకు బ్రేకప్
అజహరుద్దీన్.. క్రికెట్లో ఓ కొత్త చరిత్ర! సంగీతా బిజ్లానీ.. బాలీవుడ్ తెర మీద మెరిసిన ఒక కొత్త మోడల్! ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే అజహర్ వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. సంగీతా బిజ్లానీది శుభలేఖల దగ్గరే ఆగిపోయిన పెళ్లి. ఆ విరిగిన మనసుకు మళ్లీ ప్రేమతో సాంత్వననిచ్చాడు అజహర్. అదీ శుభం కార్డ్ వేసుకోలేకపోయింది. క్రికెటర్ అజహర్ కంటే ముందు సంగీతా జీవితంలో నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు తన ప్రేమ వర్తమానాన్ని అందించి. కెరీర్లో సల్మాన్ కంటే సంగీతానే సీనియర్. ఆమె అందమో.. అభినయమో.. సల్మాన్‌ను ఆకట్టుకుంది. సంగీతా అంటే ఇష్టం ఏర్పడింది. అదే విషయం ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది. ‘నువ్వంటే నాకిష్టం.. ఒట్టు.. నన్ను నమ్ము’ అన్నాడు అతను. ఆ అభ్యర్థనలో నిజాయితీ కనిపించింది.. వినిపించింది. ‘సరే’ అంది మది నిండా నమ్మకాన్ని నింపుకుంటూ.. కళ్లతో ప్రేమను కురిపిస్తూ! అలా ఆరంభమైన ఆ డేట్ దాదాపు పదేళ్లు కొనసాగింది. ఆ విషయం బాలీవుడ్లో వార్తవడమూ.. దాన్ని సినిమా పత్రికలు మోయడమూ సాధారణమే కదా! నిశ్చితార్థం జరిగింది.. కానీ సల్మాన్ మరో అమ్మాయితో.. వాళ్ల ప్రేమ... పెళ్లి ప్రస్తావననూ తెచ్చింది. దానికి నిశ్చితార్థమూ జరిగింది. శుభలేఖలూ అచ్చయ్యాయట. మరి పెళ్లి సందడి మొదలవలేదు ఎందుకు?సంగీతాను కాదని సల్మాన్ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ నిజం సంగీతాకు చెప్పే ధైర్యం చేయలేదు. ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయితో సంగీతా కంటపడ్డాడు. ‘నా పట్ల నీ ప్రేమ నిజమని నమ్మమన్నావ్?’ కళ్లతోనే నిలదీసింది సంగీతా. సమాధానం లేక తలవంచుకున్నాడు సల్మాన్. అందుకే ఆ పెళ్లి పీటలెక్కలేదు. సల్మాన్ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయింది సంగీతా. ఇద్దరు పిల్లల తండ్రితో సంగీత.. ప్రేమను వెతుక్కుంది ఆ సమయంలోనే అజహరుద్దీన్‌తో ఓ యాడ్ షూట్ చేస్తోంది సంగీతా. తొలిచూపులోనే ఆమెకు ఫిదా అయిపోయాడు అజహర్. ప్రణయంతోనే మొదలైంది ఆ పరిచయం. దాంతో ఆ యాడ్ షూటింగ్ అయిపోయాకా కలుసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. ఏ సినిమా ఈవెంట్‌కైనా అజహర్తోనే హాజరవ సాగింది సంగీతా. అజహర్ కూడా సంగీతా తోడు లేనిదే.. రానిదే పేజ్ త్రీ పార్టీకి అటెండ్ అయ్యేవాడు కాదు. లైఫ్ స్టయిల్ కాలమ్స్ అన్నీ వాళ్ల కబుర్లతోనే కడుపునింపుకొనేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! అయితే.. అప్పటికే అజహరుద్దీన్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లల కూడా ఉండడంతో ఆ ప్రేమ వివాదాస్పదంగా మారింది. భార్యకు తలాక్ చెప్పి..సంగీత చేయి అందుకున్నాడు అజహర్ భార్య నౌరీన్‌కు మనస్తాపాన్ని కలిగించింది. కానీ సంగీతా పట్ల తన ప్రేమ విషయంలో అజహర్ మాత్రం ఒక స్పష్టతతోనే ఉన్నాడు. తతిమా జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలనుకున్నాడు. ఆ నిజాన్నే నౌరీన్‌కు చెప్పాడు. బాధపడింది. ఏడ్చి, ఏడిపించి ప్రేమను లాక్కోలేమని గ్రహించింది నౌరీన్. అజహర్ తలాక్ ప్రపోజల్‌ను మన్నించింది. అతని వైవాహిక జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. సంగీతా చేయి అందుకున్నాడు అజహర్.అప్పటి నుంచి అతని అడుగులో అడుగైంది సంగీతా. అతని కెరీర్ ఒడిదుడుకుల్లో కొండంత ధైర్యంగా నిలబడింది. అతని వ్యక్తిగత దుఃఖాలకు ఓదార్పుగా మారింది. అజహర్ చుట్టే ప్రపంచాన్ని అల్లుకుంది. అతని ఆనందానికి నిమిత్తమైంది. తన నిమిత్తంలేని అతని బాధను పంచుకుంది. అలా పద్నాలుగేళ్లు సాగింది వాళ్ల కాపురం. అదీ బ్రేక్ అయింది దానికీ కారణం నమ్మకద్రోహమే! నౌరీన్‌ను కాదని తనతో ప్రేమలో పడ్డట్టే తనను మరచి మరో అమ్మాయితో అజహర్ ప్రేమలో పడ్డాడని సంగీతా మనసులో బాధ. అది అపోహ మాత్రమే అంటాడు అజహర్. ఎవరిది నిజమో.. ఎవరిది అపోహో ఆ ఆలుమగలకే తెలియాలి. ప్రేమ పంచాయతీకొచ్చిందనేది మాత్రం బయటవాళ్లెరిగిన సత్యం. ఎట్టకేలకు ఆ ప్రేమ విడాకులతో చిత్తగించింది. సంగీతా ఒంటరిగా మిగిలింది. తన బ్లాగ్ రచనలో తలమునకలైంది. ‘ప్రేమలో పడిన మాటను బయటకెవరూ చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను.. తొలిచూపులోనే సంగీతాతో ప్రేమలో పడ్డా. ఇది నిజం’ అని చెప్పాడు అజహరుద్దీన్ ఒక ఇంటర్వ్యూలో. ‘మగవాళ్లెప్పుడూ పలాయనవాదులే. తమ అసంతృప్తులు, ఇబ్బందులకు వైవాహిక బంధానికి ఆవల పరిష్కారాన్ని వెదుక్కోవాలనుకుంటారు’ అని తన బ్లాగ్‌లోని ఓ వ్యాసంలో రాసుకుంది సంగీతా. ఎస్సార్ -
పాపం కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు.. అందుకే
Mohammed Azharuddin Slams Virat Kohli And Ravi Shastri.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాకుండా బుమ్రాను పంపించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా కెప్టెన్ ప్రెస్‌మీట్‌కు రావడం ఆనవాయితీ. కెప్టెన్‌తో పాటు కోచ్ రావడం కూడా సహజంగా కనిపిస్తుంది. ఆటలో ఏం తప్పులు చేశాము.. అవి తర్వాతి మ్యాచ్‌లో రిపీట్ చేయకుండా ఉండేందుకు ఏం చేయాలనేది ప్రణాళిక రచించుకోవాలి. ఒకవేళ కోహ్లి ప్రెస్‌మీట్ రావాలా వద్ద అనేది వదిలేద్దాం. కనీసం కోచ్ పాత్రలో రవిశాస్త్రి అయినా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడితే బాగుండేది. పాపం కోహ్లి, రవిశాస్త్రి తాము కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు అంటూ కామెంట్ చేశాడు. చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! ఇక టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచినప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే
Team India Loss 2 Matches Consecutive After 22 Years ICC Tournies.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. అంతకముందు పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుసగా లీగ్ దశ(సూపర్ 12)లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. చదవండి: IND Vs NZ: ఏందయ్యా ఈ ఆటతీరు.. పాక్‌తో మ్యాచ్ చాలా బెటర్ ఇంతకముందు 1999 వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్ అజారుద్దీన్ సారధ్యంలో టీమిండియా లీగ్ స్టేజీలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఆ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్, (2009, 2010 టి20 ప్రపంచకప్)లలో టీమిండియా గ్రూఫ్ స్టేజీలో వెనుదిరిగినప్పటికీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి పాలవ్వలేదు. అజారుద్దీన్ తర్వాత తాజాగా 22 ఏళ్ల తర్వాత కోహ్లి సారధ్యంలో టీమిండియా ఒక ఐసీసీ టోర్నీలో లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే. చదవండి: దారుణ ఆటతీరు.. టీమిండియా చెత్త రికార్డు ఇక న్యూజిలాండ్‌ను ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడించి 18 ఏళ్లవుతుంది. తాజాగా మరోసారి ఆ రికార్డును బ్రేక్ చేయడంలో విఫలమైంది. ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 8-1 తేడాతో టీమిండియాపై రికార్డును మరింత మెరుగుపరచుకుంది. కాగా న్యూజిలాండ్‌ను చివరగా 2003 వన్డే ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ సారధ్యంలో టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏ వివాదం: హైకోర్టులో అజారుద్దీన్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్..
Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: ‘‘రెండోసారి డైవోర్సీ అయ్యేంత వరకు విడాకులు అనేది చెత్తపదం అనుకున్నా’’ అంటూ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ తాము విడిపోయిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శిఖర్‌తో తన బంధం ఇక ముగిసిపోయిందని ఆమె స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ అన్యోన్యతను ప్రదర్శించే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ఈ విషయంపై గబ్బర్ ఇంతవరకు స్పందించకపోవడంతో ‘‘ఇంతకూ ఇది నిజమేనా’’ అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. ఏదేమైనా.. శిఖర్ విడాకుల అంశం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో గతంలో భార్యలతో విడిపోయిన టీమిండియా స్టార్, మాజీ క్రికెటర్ల గురించి నెటిజన్లు చర్చింకుంటున్నారు. మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ భారత జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ బిగ్గెస్ట్ సెలబ్రిటీ జంటగా పేరొందారు. బాలీవుడ్ నటి అయిన సంగీత అందానికి ఫిదా అయిన అజారుద్దీన్ మొదటి భార్యకు దూరమై.. 1996లో ఆమెను వివాహమాడాడు. అప్పటికే అజారుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు. ఇక సంగీతతో కూడా అతడు సుదీర్ఘకాలం పాటు బంధం కొనసాగించలేకపోయాడు. 2010లో ఈ జంట విడిపోయింది. వినోద్ కాంబ్లీ- నోయెలా లూయిస్ టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, తన చిన్ననాటి స్నేహితురాలు నోయెలా లూయిస్‌ను పెళ్లాడాడు. 1998లో వివాహ బంధంతో ఒక్కటైన జంట అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహమాడిన వినోద్ కాంబ్లీ ఆమెతో జీవనం కొనసాగిస్తున్నాడు. జవగళ్ శ్రీనాథ్- జ్యోత్స భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వైవాహిక బంధం కూడా సాఫీగా సాగలేదు. 1999లో జ్యోత్స అనే మహిళను పెళ్లాడిన శ్రీనాథ్.. తొమ్మిదేళ్ల పాటు ఆమెతో జీవితం పంచుకున్నాడు. కానీ, మనస్పర్దల కారణంగా 2008లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ జర్నలిస్టు మాధవి పాత్రవళిని పెళ్లి చేసుకున్నాడు. దినేశ్ కార్తీక్- నికితా వంజారా టీమిండియా క్రికెటర్ల విడాకుల అంశంలో నేటికీ హాట్‌టాపిక్ అంటే దినేశ్- నికితా జంటదే. చిన్ననాటి స్నేహితురాలైన నికితను పెళ్లాడిన దినేశ్‌కు ఆమె ఊహించని షాకిచ్చింది. దినేశ్ సహ ఆటగాడు, భారత క్రికెటర్ మురళీ విజయ్‌తో ఆమె బంధం కొనసాగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దినేశ్ 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్‌ను వివాహమాడాడు. మరోవైపు.. నికితా.. మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్ -
అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు కె.జాన్ మనోజ్‌తోపాటు పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ గత నెల జూలై 4న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అజారుద్దీన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం అజారుద్దీన్‌కు naహైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్ కౌన్సిల్ స్థానంలో అజహర్ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్‌మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్‌మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
'షోకాజ్ నోటీసుకు జవాబివ్వను.. లీగల్‌గా తేల్చుకుంటా'
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదిరి పాకానా పడుతుంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మనోజ్ ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ''తాత్కాలిక ప్రెసిడెంట్ నియామకంపై నేను స్పందించను. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చేస్తున్నది అక్రమమైన పని. నన్ను ప్రెసిడెంట్ గా తొలగించే అవకాశం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు. అలా తొలగించే అవకాశం ఉంటే... ప్రెసిడెంట్ గా ఉండి నేనే వారిని తొలగించేవాడిని. చాలా ఏళ్ళుగా ఈ సభ్యులు హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలని నేను చూస్తున్నాను. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం ఆ సభ్యులకు ఇష్టం లేదు. నేను లీగల్‌గానే తేల్చుకుంటాను. ఇప్పటికే వాళ్ల మీద అంబుడ్స్‌మెన్ కు కంప్లైంట్ చేసాను. అంబుడ్స్‌మెన్ ఇచ్చే నిర్ణయమే నా తుది నిర్ణయం కూడా..'' అంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ -
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్‌సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్‌సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్‌సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తున్నాడని హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష్ నారాయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' హెచ్‌సీఏను అజారుద్దీన్ భ్రష్టు పట్టిస్తున్నాడు. అజారుద్దీన్‌కు అందరినీ కలుపుకొనిపోయే తత్వం లేదు. హెచ్‌సీఏపై బీసీసీఐ కలగజేసుకునే రోజులు వస్తాయి'' అంటూ ఆయన పేర్కొన్నాడు. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. చదవండి: అజహరుద్దీన్‌పై వేటు! వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్ -
అజహరుద్దీన్‌పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్‌కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
కిరాణా కొట్టులా హెచ్‌సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్‌సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్‌సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్‌సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్‌సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్‌సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్‌సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం! చదవండి: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు -
వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి
లండన్: ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోవచ్చుగానీ.. విదేశీ ఆటగాళ్లు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లలో ఆసీస్‌కే చెందినవారు ఎక్కువగా ఉన్నారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్, వోక్స్, జోస్ బట్లర్‌తో పాటు విండీస్ క్రికెటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్‌లోలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఆస్ట్రేలియా ఏప్రిల్ 15వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. యూకే కూడా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది. ఏప్రిల్ 22 నుంచి ఆ దేశం మీదుగా ఒక్క విమానం కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.' బీసీసీఐ తీసుకున్న ఐపీఎల్ రద్దు అనే నిర్ణయం ప్రస్తుతం సున్నిత అంశంగా కనిపిస్తుంది. బయోబబూల్‌లో ఉంటూ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తున్నా.. కరోనా మహమ్మారి ఐపీఎల్‌లోకి కూడా ఎంటరైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం సరైనదే. అయితే లీగ్ రద్దు వల్ల స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోయినా.. విదేశీ ఆటగాళ్లకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. భారత్ నుంచి విదేశాలకు విమానాల రాకపోకల నిషేధం కొనసాగుతుండడంతో ఏం చేయలేని పరిస్థితి. ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యమని.. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపే బాధ్యత మాది అని బీసీసీఐ చెబుతుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అని చెప్పుకొచ్చాడు. మరో మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ట్విటర్లో స్పందించాడు. '' బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. పటిష్టమైన బయోబబుల్‌లోకి కరోనా మహమ్మారి వచ్చేసింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది కూడా కరోనా బారీన పడ్డారు. లీగ్ ఇలాగే కొనసాగితే కేసులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని నియంత్రించేందుకే బీసీసీఐ ఐపీఎల్ రద్దు నిర్ణయం తీసుకుంది. కరోనా ఉదృతి తగ్గాకా మళ్లీ ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంటుందేమో' అని ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. చదవండి: 'ఐపీఎల్ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది' అయోమయంలో ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి..! Seems a very sensible decision to postpone the IPL .. Now cases have started to appear inside the bubble they had no other option .. Hope everyone stays safe in India and all the overseas players can find a way back to there families .. #IPL2021 — Michael Vaughan (@MichaelVaughan) May 4, 2021 In view of the COVID crisis in India and with players testing positive, the postponement of IPL with immediate effect is the correct course of action taken by @BCCI and the IPL governing council. Hope to see IPL back soon in better & safe environment.#IPL2021 #IndiaFightsCOVID19 — Mohammed Azharuddin (@azharflicks) May 4, 2021 -
హెచ్‌సీఏ ఏజీఎంలో మరోసారి రసాభాస
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుడ్స్‌మన్ అధికారిగా మా అభ్యర్థి కొనసాగుతాడంటే మా అభ్యర్థి కొనసాగుతాడంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్ అజహరుద్దీన్ వర్గం, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గం పరస్పరం మాటల యుద్ధానికి తెరలేపాయి. గత నెల 28న జరిగిన ఏజీఎం గొడవకు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. అజహరుద్దీన్ అధ్యక్షతన మీటింగ్ ఆరంభం కాగా... రిటైర్డ్ జడ్జి దీపక్ వర్మను హెచ్‌సీఏ కొత్త అంబుడ్స్‌మన్‌గా ప్రకటించి... మద్దతు తెలిపే వారు చేతులు పైకి ఎత్తాల్సిందిగా సభ్యులకు సూచించాడు. జాన్ మనోజ్ వర్గం ఇందుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇవేమీ పట్టించుకొని అజహరుద్దీన్ కొత్త అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మ నియామకం పూర్తయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అజహర్ వెళ్లిన అనంతరం ఉపాధ్యక్షుడు మనోజ్ అధ్యక్షతన ఏజీఎం కొనసాగింది. ఈ సమయంలో ఆయన మరో రిటైర్డ్ జడ్జి నిసార్ అహ్మద్ కక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నామని ప్రకటించారు. అయితే అహ్మద్ కక్రూ నియామకం చెల్లదని అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు. -
హెచ్‌సీఏ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మను నియమించాలని అజర్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్‌ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్ హనుమంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ..'' హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.'' అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్‌సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది. -
ఖమ్మం సభ చరిత్రలో జరగని విధంగా ఉండాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోవాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్. షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా ఏప్రిల్ 9న ఖమ్మం సభ జరగాలన్నారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని, ఆ దశగా వ్యూహరచన చేయాలని ఖమ్మం, పార్టీ ముఖ్య నేతలకు ఆమె సూచించారు. ఆ వేదికపైనే పార్టీ విధివిధానాలపై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం సభ కోసం కో–ఆర్డినేషన్ కమిటీని వేశారు. షర్మిలమ్మ రాజ్యం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను ముందుకు వచ్చానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని, ఖమ్మం జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను రెండు కళ్లలా చూసుకునేవారన్నారు. -
ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మినీ వేలం చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. గురువారం నాటి ఈ ఈవెంట్లో సన్‌రైజర్స్ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది. జట్టు కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఈ విషయం మీద స్పందించిన అజారుద్దీన్.. ‘‘హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో, హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది’’ అని ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ వేలంలో భాగంగా హైదరాబాద్ జట్టు నుంచి కె. భగత్ వర్మను రూ. 20 లక్షలు చెల్లించి చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా.. ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.20 లక్షలు), హరిశంకర్ రెడ్డిని (రూ. 20 లక్షలు) చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేశాయి. చదవండి: వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! ఐపీఎల్ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction @SunRisers @IPL — Mohammed Azharuddin (@azharflicks) February 18, 2021 -
మెంటల్ వెకేషన్లో హైదరాబాద్ కోడలు
అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకున్నాక సంగీతా బిజిలానీ హైదరాబాద్ కోడలు అయ్యింది కానీ ఆమె ఇక్కడ ఉండేది తక్కువ. ముంబైలోనే ఎక్కువగా ఉంటారామె. పెళ్లి తర్వాత నటనకు దూరంగా గృహ జీవితానికే పరిమితమైన సంగీత యోగాను బాగా సాధాన చేస్తుంటారు. కుండలినీ శక్తిని జాగృతం చేయడం కోసం యోగా చేయాలని చెబుతుంటారామె. పత్రికల కథనం ఆమె ఆస్తిపాస్తులు 35 కోట్ల వరకూ ఉంటాయని. నటిగా ‘త్రిదేవ్’, ‘హత్యార్’, ‘జుర్మ్’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. అయితే నటిగా కంటే మోడల్‌గా సంపాదించింది ఎక్కువ. 1980లో ‘మిస్ ఇండియా’ అయిన సంగీత కుర్రాళ్ల కలల దేవతగా ఉండేది. ఆమెను గెలుచుకున్న వీరుడు మాత్రం రెండో వివాహానికి సిద్ధపడ్డ అజారుద్దీన్. సంగీతా బిజిలానీకి ప్రకృతి అంటే ఇష్టం. ఆమె ప్రకృతి పరిసరాల్లో తిరుగుతూ ఆ ఫొటోలను తన ఫేస్బుక్ పేజీలో పెడుతూ ఉంటారు. ఆమెకు లోనావాలా దగ్గర ఒక ఫామ్‌హౌస్ ఉంది. అక్కడకు వెళుతుంటారు. ఇటీవల తండ్రితో వెళుతున్న వీడియోను పోస్ట్ చేశారు. లోనావాలకు దగ్గరగా ఉన్న పావ్నా సరస్సు దగ్గర కూడా ఆమె బస చేసిన ఫోటోలు ఉన్నాయి. ఇలా తిరగడాన్ని ఆమె ‘మెంటల్ వెకేషన్స్’ అంటారు. కరీనా కపూర్ వంటి నటీమణులు పెళ్లయిన వ్యక్తితో వివాహానికి సిద్ధపడి సంతానాన్ని కన్నా సంగీతా సంతానానికి దూరంగా ఉన్నారు. -
అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
జైపూర్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్ వేడుకల కోసం అజారుద్దీన్ బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. కారు డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. -
ఇప్పుడు ఆడినా 300 పరుగులు చేస్తారు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్‌కు ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ. అందుకే యాభై ఏడేళ్లు అయినా కూడా వయసు కనబడనీయకుండా ఎంతో ఫిట్‌గా ఉంటూ అందరినీ ఔరా అనిపిస్తారు. తాజాగా ఆయన ఎక్సర్సైజ్ కోసం ఓ విలక్షణమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కరోనా కాలం కాబట్టి జనసమూహాలు అధికంగా ఉండే ప్రాంతం కాకుండా ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి ప్రాంతంలో మెట్లను అవలీలగా ఎక్కుతూ వ్యాయామం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: నా క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?) "నా జీవితంలో ఎక్సర్సైజ్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే హుమాయున్ సమాధులు వంటి ప్రత్యేక ప్రదేశాల్లో చెమటలు చిందిస్తున్నప్పుడు ఇది మరింత వినోదంగా మారుతుంది" అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు 'చాలా బాగుంది, అజ్జూ భాయ్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. "మీ ఫిట్నెస్ గురించి చెప్పడానికి మాటల్లేవు. మీరు ఇప్పటికిప్పుడు టీమిండియాలో ఆడితే మూడు వందల పరుగులు చేస్తారు. దయచేసి మీరు ఇటలీ జట్టుకు కోచింగ్ ఇవ్వండి" అంటూ మరో నెటిజన్ అభ్యర్థించాడు. కాగా అజహర్ గతేడాది నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక క్రికెటర్‌గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించడమే కాక అనూహ్యంగా ముగిసిన కెరీర్ చివరి టెస్టు(99వ)లోనూ ఆయన సెంచరీ బాదడం విశేషం. (చదవండి: ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు) Exercise has always been an important part of my life. It becomes even more fun when it’s around an incredible monument like The Humayun Tombs! pic.twitter.com/KGexifOmTi — Mohammed Azharuddin (@azharflicks) October 26, 2020 -
నా క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రికెట్‌కు, తనను పరిచయం చేసిన వ్యక్తిని హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్లో మీరందరూ అపారమైన ప్రేమను, మద్దతును చూపించారు. కానీ నా క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మొట్టమొదటిసారిగా నేను క్రికెట్ బ్యాట్ పట్టేలే చేసింది నా దివంగత మామయ్య మీర్ జైనులాబిదీన్. క్రికెట్‌కు పరిచయం చేసి నా జీవితాన్నే పూర్తిగా మార్చినందుకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే హైదరాబాద్ వాసి మహ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడిగా, టీమిండియా కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. హైదరాబాద్‌లో పుట్టి... ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగిన ఈ హైదరాబాదీ, ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్సర్‌గా ఆరోపణలు.. పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ.. పెళ్లి.. మళ్లీ విడాకులు.. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలుపు వంటి రకరకాల సవాళ్లు, విజయాలు అజారుద్దీన్ కెరీర్లో కో కొల్లలు. ఇక క్రికెటర్‌గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన అజారుద్దీన్ రికార్డు ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజారుద్దీన్ కొనసాగుతున్నాడు. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. -
అజహర్... తీన్మార్
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్‌లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు. తొలి సెంచరీ (కోల్‌కతా) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్‌ను ఆరంభించిన అజహర్‌పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. రెండో సెంచరీ (మద్రాస్) చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్‌లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు. మూడో సెంచరీ ( కాన్పూర్) అజహర్‌కు ముందు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్‌పై నిలిచింది. అతను మూడో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్‌తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం -
'ఆ థ్రిల్లర్ మ్యాచ్‌ను ఎప్పటికి మరిచిపోను'
సచిన్ టెండూల్కర్.. అప్పట్లో ఈ పేరు వింటేనే అభిమానులకు ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చేవి. మరి అలాంటి సచిన్ బ్యాటింగ్‌కు దిగాడంటే అభిమానులకు పూనకాలు వచ్చేవి. ఒక బ్యాట్స్‌మెన్‌గా తన పేరిట లెక్కలేనన్ని రికార్డులు లిఖించుకున్నాడు. టెస్టు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, అంతేగాక రెండు ఫార్మాట్లలో కలిసి వంద సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డులకెక్కాడు. అయితే సచిన్‌లో మనకు తెలియని మరో కోణం ఉంది.. అతను మంచి బౌలర్ కూడా అన్న సంగతి చాలా మందికి తెలియదు. సచిన్ తన లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో వన్డేల్లో 156 వికెట్లు, టెస్టుల్లో 46 వికెట్లు తీశాడు.జట్టుకు అవసరమైన సందర్బాల్లో బౌలింగ్ వేసి మ్యాచ్‌లను కూడా గెలిపించాడు. అయితే బ్యాట్స్‌మెన్‌గా కాకుండా ఒక బౌలర్‌గా మ్యాచ్ గెలిపించిన సందర్భాల్లో ఏది ఇష్టం అని సచిన్‌ను అడిగితే.. 1993 హీరో కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ను థ్రిల్లర్ మ్యాచ్‌గా గుర్తుపెట్టుకుంటానని చాలా సందర్భాల్లో తెలిపాడు. (తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు) తాజాగా ఐసీసీ మీ జీవితంలో ఒక మొమరబుల్ మూమెంట్‌ను షేర్ చేసుకోవాలని సచిన్ దగ్గర ప్రస్తావించడంతో మరోసారి ఆ థ్రిల్లర్ మ్యాచ్‌ను గుర్తుచేశాడు. '1993 హీరో కప్‌లో భాగంగా ఈడెన్గార్డెన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 196 పరుగులు చేశాము. కెప్టెన్ అజారుద్దీన్ 90 పరుగులతో రాణించడంతో జట్టుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తర్వాత మా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తెచ్చారు. ప్రొటీస్ విజయం సాధించాలంటే చివరి ఓవరలో ఆరు పరుగుల చేస్తే చాలు. క్రీజ్‌లో బ్రియాన్ మెక్‌మిలన్ 48 పరుగులతో ఆడుతున్నాడు. అప్పటివరకు ఒక అద్భుతం జరగనుందని నాకు కూడా తెలియదు. అజారుద్దీన్ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంత ఉత్కంఠ సమయంలో బంతి నాకెందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. నా మనుసులో సరే అనుకొని బౌలింగ్‌కు దిగాను. మొదటి బాల్‌ను ఆడిన మెక్‌మిలన్ రెండో పరుగు కోసం ప్రయత్నించడంతో ఫానీ డివిలియర్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో విజయలక్ష్యం 5 పరుగులుగా మారింది. తర్వాతి మూడు బంతులను డాట్ బాల్స్‌గా వేసాను. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. మెక్‌మిలన్ బలంగానే షాట్ బాదినప్పటికి సింగిల్ రన్ వచ్చింది. అంతే మూడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపే విజయం సాధించడంతో జట్టులో సంబరాలు మొదలయ్యాయి. చివరి బంతి వరకు ఊరించిన విజయం మాకు లభించిదనే దానికన్నా చివరి ఓవర్ నేను వేసి జట్టును గెలిపించానా అన్నదే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్ నాకు చాలా కాలం పాటు గుర్తుందంటూ' సచిన్ చెప్పుకొచ్చాడు. (చిన్నారి ఫుట్‌వర్క్‌కు ఫిదా అవ్వాల్సిందే ) -
‘అక్కడ నువ్వెంత స్టార్ అనేది చూడరు’
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాంతో పలువురు ఆటగాళ్లు భారీ స్థాయిలో తమ ఐపీఎల్ నగదును కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడగా, తమ రీఎంట్రీలపై ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లకు ఇది శాపంలా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఎంఎస్ ధోనికి కూడా రీఎంట్రీ కష్టమైపోయింది. ధోనిని తిరిగి భారత జట్టులోకి తీసుకోవడానికి ఎటువంటి ప్రాతిపదికా అవసరం లేదని కొంతమంది అంటుంటే, అదేలా సాధ్యమని మరికొంతమంది వాదిస్తున్నారు. ఇలా వ్యతిరేక గళం వినిపిస్తున్న వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కూడా చేరిపోయారు. ఏ ప్రాతిపదికన ధోనిని తీసుకుంటారనే అనుమానాన్నే అజహర్ కూడా వ్యక్తం చేశాడు. ఎంతటి స్టార్ ఆటగాడైనా జట్టులో రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా అది మ్యాచ్ప్రాక్టీస్తోనే సాధ్యమని అంటున్నాడు. దాని కోసం ముందుగా కొన్ని మ్యాచ్‌లు ఆడి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?) ‘జాతీయ జట్టు ఎంపికలో నువ్వెంత స్టార్ అనే విషయం సెకండరీ. ప్రస్తుతం నువ్వు ఎంతటి ఫామ్‌లో ఉన్నావ్ అనే అంశాన్ని మాత్రమే మొదటి చూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత ధోని జట్టులోకి రావడం అంత ఈజీ కాదు. స్టార్ ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఇక్కడ కావాల్సింది సాధారణ ప్రాక్టీస్ కాదని, మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్ ఎలా ఉందనేదే చూస్తారు. ఇది ధోని కూడా తెలుసు. ధోని క్రికెట్ భవితవ్యంపై అతనికి క్లారిటీ ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలా.. వద్దా అనేది ధోని ఇష్టం. కానీ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరగాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. ఈ లీగ్‌పై ఇప్పటివరకూ స్పష్టత లేదు. దాంతో ధోని మ్యాచ్ ప్రాక్టీస్‌లకు దూరమైనట్లే. ఇక్కడ ప్రాక్టీస్- మ్యాచ్ ప్రాక్టీస్ అనేవి రెండు వేర్వేరు అంశాలు’ అని అజహర్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ఎంఎస్ ధోని తిరిగి ప్రొషెషనల్ కెరీర్‌ను ఆరంభించడానికి అంతరాయం ఏర్పడింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోని అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.(అలా అయితే ప్రతీసారి సిక్స్ ఇచ్చేవాణ్ని: అక్తర్) -
ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు
ఏప్రిల్ 11, 2000.. క్రికెట్ చరిత్రలో ఈ తేదిని ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెంటిల్మెన్ గేమ్‌గా ఉన్న క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని కుదుపేసింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్జే మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రధాన పాత్ర పోషించడంతో తన కెరీర్‌ను అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. అలాంటి చీకటిరోజు జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం.. ఏప్రిల్ 2000వ సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టు భారత్‌లో పర్యటించింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు హన్సీ క్రోన్జే, టీమిండియా జట్టుకు మహ్మద్ అజారుద్దీన్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు క్రోన్జేపై అభియోగాలు రావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఇండియన్ బూకీ సంజయ్ చావ్లాతో కలిసి క్రోన్జే చర్చలు జరిపినట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు క్రోన్జేను అదుపులోకి తీసుకొని విచారించారు.(అలా వార్నర్‌ను హడలెత్తించా..!) ఈ నేపథ్యంలో వారి విచారణలో క్రోన్జే పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని ఒప్పుకొన్నాడు. అయితే అంతకుముందే భారత్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనను సంజయ్ చావ్లా అనే ఇండియన్ బూకీకి పరిచయం చేశాడంటూ క్రోన్జే పెద్ద బాంబ్ పేల్చాడు. 1996లో టెస్టు సిరీస్ ఆడడానికి ఇండియాలో పర్యటించినప్పుడే సంజయ్ చావ్లా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ తన దగ్గర ప్రపోజల్ తెచ్చాడని క్రోన్జే పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్‌లో మీరు భాగమవ్వాలంటూ క్రోన్జే మాపై ఒత్తిడి తెచ్చాడని అప్పటి దక్షిణాఫ్రికా క్రికెటర్లు హర్షలే గిబ్స్, నికీ బోజే, పాట్ సిమ్‌కాక్స్ కమీషన్ ముందు వాపోవడంతో క్రోన్జే కెరీర్ ప్రమాదంలో పడింది. దీంతో ఐసీసీ కల్పించుకొని క్రోన్జేను జీవితకాలం క్రికెట్ నుంచి నిషేదిస్తున్నట్లు పేర్కొంది. దీంతో అప్పటివరకు విజయవంతమైన కెప్టెన్‌గా ఒక వెలుగు వెలిగిన హన్సీ క్రోన్జే కెరీర్ చివరకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో అర్థంతరంగా ముగిసింది. ఇది జరిగిన రెండు సంవత్సరాలకు జూన్ నెలలో క్రోన్జే ప్రయాణం చేస్తున్న విమానం క్రాష్‌కు గురవ్వడంతో అతను మరణించినట్లు దక్షిణాఫ్రికా మీడియా ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహకరించినందుకు మహ్మద్ అజారుద్దీన్‌పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక బూకీలతో సంబంధాలు నెరిపారన్న కారణంతో అజయ్ జడేజాపై ఐదేళ్లు, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మలపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ తెలిపింది. -
'సిద్దూ ఆడకపోవడంతోనే నాకు చాన్స్ వచ్చింది'
సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా ఎంత సక్సెస్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని కెరీర్లో అగ్రభాగం ఓపెనింగ్ స్థానంలో ఆడిన విషయం విదితమే. అయితే కెరీర్ మొదట్లో పలు మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్ స్థానంలోనూ సచిన్ ఆడాడు. అయితే తాను ఓపెనర్‌గా ప్రమోట్ అయిన విషయాన్ని సచిన్ తన పర్సనల్ యాప్ 100 ఎంబి ద్వారా మరోసారి గుర్తుచేశాడు. అప్పటి ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్దూ న్యూజిలాండ్ పర్యటనలో గాయపడడంతో తనకు ఓపెనర్‌గా ఆడే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అజిత్ వాడేకర్లకు కూడా స్థానం ఉందంటూ అభిప్రాయపడ్డాడు. 'ఆరోజు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌కు అని హోటల్ నుంచి బయలుదేరాను. అయితే ఓపెనర్‌గా ఆడే అవకాశం వస్తుందని మాత్రం అనుకోలేదు. నేను మైదానంలోకి వెళ్లేసరికి అప్పటికే అజహర్, వాడేకర్‌లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. మెడనొప్పి కారణంగా సిద్ధూ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని, ఓపెనర్‌గా ఎవరిని ఆడిద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో తాను కలగజేసుకొని ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే నా ఆటతీరుపై నాకు నమ్మకం ఉండడంతో ఓపెనర్‌గా చెలరేగిపోతాననే నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఓ మూల ఓపెనర్‌గా రాణించగలనా అనే అనుమానం ఉండేది.. ఏది ఏమైనా నా ఆట నేను ఆడుతూనే అటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యమివ్వాలని అనుకున్నా' అంటూ తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సచిన్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన సచిన్ వన్డే కెరీర్లో 463 మ్యాచులాడి 18426 పరుగులు చేశాడు. కాగా ఇందులో 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలు ఉన్నాయి. (డక్‌వర్త్ ‘లూయిస్’ కన్నుమూత) -
ఉప్పల్ స్టేడియంను ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్‌గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్‌సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది. -
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. స్టేడియంలో 40 పెద్ద రూమ్‌లు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటానికి తమ వంతు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
ఆసీస్ బెదిరిపోయిన వేళ..
న్యూఢిల్లీ; ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై భారత్ చిరస్మరణీయమైన విజయాల్లో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది 2001లో సాధించిన క్షణాలు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్(281)-రాహుల్ ద్రవిడ్(180)లు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఒక మరచిపోలేని గెలుపును సాధించి పెట్టారు. వీరిద్దరి రికార్డు బ్యాటింగ్‌కు తోడు హర్భజన్ సింగ్ బౌలింగ్ కూడా జత కావడంతో భారత్ 171 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ గెలవడం ఖాయమనుక్ను తరుణంలో ద్రవిడ్-లక్ష్మణ్‌ల జోరు ముందు ఆ జట్టు తేలిపోయింది. ఇక్కడ భారత్ ఓటమి అంచుల వరకూ వెళ్లి ఎప్పటికీ గుర్తిండిపోయే విజయాన్ని సాధిస్తే.. అంతకంటే రెండేళ్లు ముందు ఆసీస్‌ను బెదిరిపోయేలా చేసి భారత్ ‘అతి పెద్ద విజయాన్ని’ సాధించిన సందర్భం ఉంది.(మహ్మద్ కైఫ్ ట్వీట్‌పై మోదీ ఇలా..) అది జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు అయ్యింది. సరిగ్గా ఇదే రోజు(మార్చి 21) 1998లో ఆసీస్‌తో ఈడెన్ గార్డెన్‌లోనే జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో చారిత్రక గెలుపును నమోదు చేసింది. అంత పెద్ద విజయం సాధించడానికి అప్పటి కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కీలక పాత్ర పోషించాడు. 311 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 246 బంతుల్ని ఎదుర్కొన్న అజహర్ 163 పరుగులతో అజేయంగా నిలిచాడు. అది అజహర్ కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని తొలి ఇన్నింగ్స్ 233 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ వా(80), రికీ పాంటింగ్(60)లు మినహా ఎవరూ రాణించలేదు. దాంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు రాలేదు. ప్రధానంగా జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లేలకు జతగా సౌరవ్ గంగూలీ కూడా బౌలింగ్‌లో చెలరేగి ఆసీస్‌ను దెబ్బ తీశారు. ఈ ముగ్గురూ తలో మూడు వికెట్లతో ఆసీస్ హడలెత్తించారు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో రెచ్చిపోయింది. ఓపెనర్లుగా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్(95)-నవజ్యోత్ సింగ్ సిద్ధూ(97)లు తొలి వికెట్‌కు 191 పరుగులు సాధించి చక్కటి పునాది వేశారు. (మోదీ జీ.. మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) ఆపై రాహుల్ ద్రవిడ్(86), టెండూల్కర్(79)లు మరో సొగసైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు. దాన్ని కెప్టెన్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఆరో స్థానంలో వచ్చిన సౌరవ్ గంగూలీ(65) హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ ఆరొందల మార్కును దాటింది. భారత్ స్కోరు 633/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను అజహర్ డిక్లేర్డ్ చేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను పేకమేడలా కూల్చేశారు భారత బౌలర్లు. ప్రధానంగా అనిల్ కుంబ్లే తన లెగ్ బ్రేక్‌లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. కుంబ్లే ఐదు వికెట్లకు జతగా శ్రీనాథ్ మూడు వికెట్లతో రాణించడంతో ఆసీస్ 181 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ మార్క్ టేలర్(45), ఇయాన్ హీలే(38), స్టీవ్ వా(33)లు మాత్రమే మోస్తరుగా ఆడగా.. మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో ఘోర ఓటమిని చవిచూసింది. రెండో వరల్డ్ వార్ తర్వాత ఆసీస్‌కు అదే పెద్ద ఓటమి కాగా, అప్పటికి భారత్‌కు అదే పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. అది ఇప్పటికీ భారత్ సాధించిన(ఇన్నింగ్స్ పరుగుల పరంగా)అతి పెద్ద టెస్టు విజయాల జాబితాలో టాప్-5లో ఉండటం ఇక్కడ మరో విశేషం. -
నిన్ను మిస్సవుతాం.. సానియా భావోద్వేగం
-
ఇది మా పెళ్లి వీడియో.. మిస్సవుతాం!
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో.. ఆనం పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆనం- అసద్‌లు డిసెంబరు 11న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనం తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఒకే ఒక్కసారి జీవితం నీకు అద్భుత క్షణాలను అందిస్తుంది. ఇవి మా ఆనంద క్షణాలు. మా పెళ్లి వీడియో ఇది’ అని క్యాప్షన్ జత చేశారు. ఇక ఇందులో ఆనం- అసద్లతో పాటు సానియా, ఆమె కుమారుడు ఇజహాన్, వరుడి తండ్రి అజారుద్దీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనం తల్లిదండ్రులు, సానియా, అజహరుద్దీన్ చిన్న చిన్న ఇంటర్వ్యూలతో పాటు వధూవరుల మధుర క్షణాలను ఫొటోగ్రాఫర్ కెమెరాలో బంధించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అప్పగింతల కార్యక్రమంలో.. ‘ ఆనం- అసద్‌లు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చారు. ఇప్పుడు నేను, అమ్మా, నాన్నా.. ముఖ్యంగా ఇజ్జూ నిన్ను చాలా మిస్సవుతాం ఆనం’ అంటూ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఆనంకు 2015లో హైదరాబాద్‌కే చెందిన ఓ బిజినెస్‌మన్‌తో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీర్దిదరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. సానియా మీర్జా సోదరి వివాహం..ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైభవంగా సానియా మీర్జా సోదరి వివాహం
-
‘ఆ దేవుడి దయతోనే ఇదంతా జరిగింది’
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహాం బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ టీమిండియా కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్‌తో ఆనం వివాహాం బుధవారం జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వంకాయ రంగు లెహెంగా ధరించిన ఆనం పక్కనే అసద్ బంగారు రంగు షెర్వానీ ధరించి నిలుచుని ఉన్న ఫోటోలను ఆనం తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. వారిద్దరు కలసి ఉన్న చిత్రానికి ‘మిస్టర్ అండ్ మిసెస్’ అంటూ హ్యష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశారు ఆనం మీర్జా. View this post on Instagram Mr and Mrs 🥳 #alhamdulillahforeverything #AbBasAnamHi 📷 @weddingsbykishor @daaemi A post shared by Anam Mirza (@anammirzaaa) on Dec 11, 2019 at 3:55pm PST ఇక ఆనం షేర్ చేసిన తన వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త జంటను చూసి నెటిజన్లంతా ఫిదా అవుతూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని ఇక పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న ఆనంను చూసి ‘చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే సానియా తన సోదరి మెహందీ, ప్రీ వెడ్డింగ్ వేడుక ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. మెహందీ వేడుకలో సానియా నల్లటి, ఎరుపు రంగు దుస్తులను ధరించగా.. ఆమె సోదరి కలర్ ఫుల్ లెహెంగాలో కలిసి దిగిన ఫోటోలో వారిద్దరు అదంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరదాగా కాసేపు...
ఉప్పల్ మైదానం టి20 ఫైట్‌కు సిద్ధమైంది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.గురువారం స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ వారితో సరదాగా మాట్లాడారు. రోహిత్ శర్మ,యజువేంద్ర చహల్, రిషబ్‌పంత్‌లతో ముచ్చటించిన ఈ భారత మాజీ కెప్టెన్‌యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశారు. -
‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’
హైదరాబాద్: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20తో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్‌తో కలిసి హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘కొత్తగా ఏర్పడిన హెచ్‌సీఏ నేతృత్వంలో ఇక్కడ ఇది తొలి మ్యాచ్. దాదాపు 40 వేల మంది అభిమానులు మ్యాచ్ హాజరు కావొచ్చు. 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం. రేపు బ్లాక్ డే కూడా కావడంతో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం నడుమ భారీ భదత్ర ఉంటుంది. అభిమానులకు పార్కింగ్ సదుపాయం కూడా కలదు. రేపు మెట్రో రైల్ సమయం రాత్రి గం. 1.00ల వరకూ వినియోగించుకోవచ్చు. సిగరెట్లు , ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్ధాలు, పెన్స్, ఫర్ఫ్యూమ్స్ స్టేడియంలోకి నిషేధం. జాతీయ జెండా తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవు. షీ టీం బృందాలు కూడా మహిళల రక్షణ కోసం నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు అధీనంలో ఉంటుంది. ఎవరికీ అసౌకర్యం కల్గినా డయల్ 100కి ఫోన్ చేయండి’ అని భాగవత్, అజహర్లు పేర్కొన్నారు. -
‘నా అధ్యక్షతన తొలి క్రికెట్ మ్యాచ్ ఇది’
హైదరాబాద్: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం భారత్-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్ 6వ తేదీన జరగాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపిందట. ఈ విషయాన్ని అజహర్ స్వయంగా తెలియజేశాడు.(ఇక్కడ చదవండి: తొలి టీ20 వేదిక మారింది..) ‘హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను హెచ్‌సీఏ రిక్వస్ట్ మేరకు 6వ తేదీనే నిర్వహిస్తున్నాం. విండీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇది హెచ్‌సీఏలో నా అధ్యక్షతను మొదటి మ్యాచ్. క్రికెట్ అనేది ప్రతిరోజూ నేర్చుకునే గేమ్. క్రికెట్ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సెక్యూరిటితో పాటు ప్రైవేట్ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి’ అని అజహర్ పేర్కొన్నాడు. -
అంబటి రాయుడిపై చర్యలు!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందని క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. హెచ్‌సీఏలోని పెద్దల్ని అవమానపరుస్తూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్‌సీఏలో ముఖ్యడొకరు పేర్కొన్నారు.దాంతో రాయుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి.. ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగించిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటాం. మొదటగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఈవోను ఆదేశిస్తాం. నివేదిక సమర్పించిన తర్వాత అత్యున్నత మండలి అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని సదరు సభ్యుడు పేర్కొన్నారు హెచ్‌సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ట్వీట్ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్‌ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్ సర్... దయచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి. జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్ క్రికెట్‌ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంబటి రాయుడు తీవ్ర అసహనంలో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అయితే దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అజహర్‌కు అంబటి రాయుడు సూచించాడు. హెచ్‌సీఏ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని తెలిపాడు. -
అజహర్.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు: అంబటి రాయుడు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. హెచ్‌సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్‌సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్‌గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని పేర్కొన్నాడు. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు అసహనంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడన్నారు. ఈ విషయంపై తిరిగి స్పందించిన రాయుడు.. ‘హాయ్ అజహర్. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్‌సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రికెటర్లను రక్షించినట్లవుతుంది’ అని తాజా పరిణామాలపై అజహర్‌కు రాయుడు సూచించాడు. -
బ్యూటీ స్టార్
-
ఆనమ్ మీర్జాకు మొదట నేనే ప్రపోజ్ చేశా!
‘మా పరిచయం హాయ్‌తో మొదలైంది. కొన్ని రోజులు అలాగే కంటిన్యూ అయింది. ఇక తర్వాత నేనే డేర్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పాను. ఆనమ్ వెంటనే యాక్సెప్ట్ చేసింది. నేను కీప్క్వైట్.. తనేమో హైపర్’ అంటూ చెప్పాడు అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్. క్రికెటర్ అయిన అసద్... టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనమ్మీర్జాతో ప్రేమలో ఉన్నాడు. డిసెంబర్లో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం సిటీ అంతా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ల వివాహం గురించే చర్చ నడుస్తోంది. ఈ జంట ఎప్పుడు ఒక్కటవుతుందంటూ సామాన్యుడి నుంచి స్పోర్ట్స్, కార్పొరేట్ దిగ్గజాల వరకు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా కొనసాగుతున్న ఈ సందిగ్ధానికి తెర పడింది. ఆనమ్, అసదుద్దీన్ల షాదీ వచ్చే డిసెంబర్లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన ది లేబుల్ బజార్ ఎక్స్పో సందర్భంగా మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. – సాక్షి, సిటీబ్యూరో ఆనమ్ మీర్జాకు 2016లో అక్బర్ రషీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్లపాటు కలిసి ఉన్న వీరు 2018లో విడాకులు తీసుకున్నారు. మొదట నుంచి అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఆనమ్ మీర్జా, అసదుద్దీన్లు మంచి మిత్రులుగా మారారు. కొన్నాళ్ల తర్వాత ప్రేమ చిగురించింది. 19 ఏళ్ల సాన్నిహిత్యం.. అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాల మధ్య 19 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో అజారుద్దీన్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–1లో ‘ఈఎస్టీ’ పేరుతో జిమ్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సానియా మీర్జా తన కెరీర్‌ని ప్రారంభించింది. అలా రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ ఉండేది. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఈ స్నేహ, సాన్నిహిత్యాలే తమ మధ్య ప్రేమ చిగురించడానికి కారణమని అసదుద్దీన్ వివరించారు. హాయ్‌తో మొదలైన పలకరింపులు ‘మొదట్లో హాయ్.. అంటూ ఇద్దరం పలకరించుకునేవాళ్లం’ ఆ తర్వాత నేనే డేర్ చేసి ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేశా. వెంటనే షీ యాక్సెప్టెడ్. అలా మా ఇద్దరి లవ్‌కి వన్ ఇయర్ అవుతోంది. నేను చాలా క్వీప్క్వైట్. బట్ ఆనమ్ మీర్జా అలా కాదు ‘షీ ఈజ్ హైపర్’ (నవ్వుతూ). ఆమె అలా ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ఆమె పెద్ద డిజైనర్ ‘లేబుల్బజార్’ లాంటి ఎక్స్‌పోలు చేస్తోంది. ఇన్నోసెంట్‌గా ఉంటే కష్టం కాబట్టి తను హైపర్ (నవ్వుతూ) అని అసదుద్దీన్ తెలిపారు. షాపింగ్ కోలాహలం.. ఆనమ్, అసద్ ప్రేమలో ఉన్నప్పటి నుంచే వీరి వివాహం కోసం అజారుద్దీన్, సానియా మీర్జాలు సన్నాహాలు ప్రారంభించారు. ఇరు కుటుంబాల వారు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చాక పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న డిసెంబర్లో హైదరాబాద్ సిటీలోనే షాదీ జరగనుంది. పెళ్లికి ఇప్పటి నుంచే షాపింగ్ ప్రారంభించారు. ఆనమ్, అసదుద్దీన్ల నేపథ్యం ఇదీ.. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా క్రికెటరే. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్’ (హెచ్‌సీఏ) రంజీ ఆడేందుకు అవకాశం లభించలేదు. దీంతో గత ఏడాది గోవాలో జరిగిన రంజీ(ఫస్ట్‌క్లాస్ డెబ్యూ)లో అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహించాడు. అసదుద్దీన్‌కు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు ఉంది. గత ఏడాది ఐపీఎల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. టీంలో చోటు దక్కలేదు. ఇక ఆనమ్ మీర్జా విషయానికి వస్తే.. ఆమె ఫ్యాషన్ డిజైనర్. సిటీలోని టాప్‌మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్లలో ఆనమ్ మీర్జా ఒకరు. ప్రతి ఏటా ‘ది లేబుల్ బజార్’ పేరుతో అతిపెద్ద ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. హైలెవల్ బజార్ వందకుపైగా స్టాళ్లలో ప్రఖ్యాతిగాంచిన దుస్తులు. కళ్లు జిగేల్మనిపించే జ్యువెలరీ, గాగూల్స్ కొలువుదీరాయి. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ‘ది లేబుల్ బజార్ సీజన్–11’లో ఆకట్టుకుంటున్నాయి. మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో కలిసి ప్రముఖ టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా, అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
అజార్ కుమారుడితో సానియా చెల్లి పెళ్లి
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ వివాహం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి ఆనంతో జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ.. వారి పెళ్లిని సానియా ధృవీకరించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతుందని ఆమె తెలిపారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా ఈ అసద్-ఆనంల పెళ్లి విషయాన్ని ప్రస్తవించారు. కాగా మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనం.. అనంతరం వారి బంధానికి గుడ్‌బై చెప్పారు. ఇటీవల అతని నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. అయితే అతనితో దూరంగా ఉంటున్న సమయంలోనే అసద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి.. డిసెంబర్లో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
అజహర్ నా బాధను తీర్చాడు: హర్భజన్
న్యూఢిల్లీ: ఎప్పుడు ఎదో వివాదాస్పద అంశంతో నిత్యం వార్తల్లో ఉండే భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేశాడు. విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన చర్చలో హర్భజన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మొదటి టెస్ట్‌ను ఆస్ట్రేలియాతో అరంగేట్రం చేశానని గుర్తుచేశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయిన ఆటగాళ్లందరు ఆంగ్లంలో మాట్లాడుతుండగా తనకేమి అర్థం కాలేదని అన్నాడు. తనను సైతం ఆంగ్లంలో మాట్లాడమని సూచించగా తనకు ఆంగ్లం రాదని వారికి తెలిపినట్టు వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తన ఇబ్బందిని గుర్తించి తన మాతృ భాష పంజాబీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారని చెప్పాడు. భారత్ తరుపున హర్భజన్ 103 టెస్ట్‌లు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. కాగా టెస్ట్‌లలో 417వికెట్లు, వన్డేలలో 269 వికెట్లు, టీ20లలో 25వికెట్లు పడగొట్టాడు. అయితే 2007లో టీ20ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో హర్భజన్ సభ్యుడిగా ఉండడం విశేషం. -
హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజహరుద్దీన్ తన బాధ్యతలను స్వీకరించారు. సోమవారం హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు చేపట్టారు. ఇక వైస్ ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్. జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజహర్ మాట్లాడుతూ.. ‘ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను. హెచ్‌సీఏ అవినీతి మరకలు తుడిచేసి పూర్వ వైభవం తీసుకొస్తా. జిల్లాల్లో స్టేడియంలు అభివృద్ధి చేస్తా. అన్ని ప్యానల్‌ను కలుపుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తా’ అని అన్నారు. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన మొత్తం ఓట్ల కంటే అజహర్‌కు వచ్చిన మెజారిటీ ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. -
కేటీఆర్‌తో అజహర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రితో భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ శనివారం భేటీ అయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నికైన అజహరుద్దీన్.. తాను సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌తో అరగంటపాటు ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో అజహరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన ఎందరో యువకులున్నా, సరైన అవకాశాలు రావడం లేదనే విషయంతోపాటు, క్రికెట్ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. హెచ్‌సీఏ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తనతోపాటు నూతనంగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గాన్ని కేటీఆర్‌కు పరిచయం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరిస్తూ.. హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో తాను కేవలం క్రికెట్‌కు సంబంధించిన అంశాలపైనే కేటీఆర్‌ను కలిసినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను ఎప్పుడు కలుస్తారని ప్రశ్నించగా ‘సీఎం రాష్ట్రానికి బాస్.. వీలైనంత త్వరలో ఆయనను కలుస్తా’అని సమాధానం ఇచ్చారు. -
టీఆర్ఎస్లోకి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన టీఆర్ఎస్ నేతలకు దగ్గరయ్యారని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందడానికి వ్యుహాత్మకంగా వ్యవహరించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ మద్దుతుతోనే ఆయన హెచ్‌సీఏ పదవిని కైవసం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక నేత మధ్యవర్తిత్వంలో అజహరుద్దీన్ టీఆర్ఎస్కు దగ్గరయ్యారని తెలుస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందిన అజహరుద్దీన్.. త్వరలో కేసీఆర్‌ను కలవనున్నట్టు చెప్పడం కూడా ఆయన టీఆర్ఎస్లో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. మరోవైపు అజహరుద్దీన్ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సమచారం. ఏడాదిలోపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. టీఆర్ఎస్ అజహరుద్దీన్‌ను బలమైన మైనార్టీ నేతగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించిన.. అజహరుద్దీన్ తాను పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే పార్టీ మార్పుపై వార్తలను ఖండించకపోవడం గమనార్హం. -
అజహరుద్దీన్.. ఇలా గెలిచెన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ మెజారిటీతో అజర్ గెలుపొందడం విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాండ్రా బ్రాన్గాంజా(మహిళా క్రికెటర్), అర్జున్ యాదవ్(ఇండియా సిమెంట్), పి. వెంకటేశ్వర్లు(ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్), శ్రీనివాస్ ఆచార్య(ఉస్మానియా మెడికల్ కాలేజీ) ఓటు వేయలేదు. మొత్తం మూడు ఓట్లు(సంయుక్త కార్యదర్శికి రెండు, కౌన్సిలర్‌కి ఒకటి) చెల్లలేదు. ఫలించిన అజర్ కల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏలో పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌చంద్‌ను చిత్తుగా ఓడించారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం కూడా అజర్‌కు కలిసొచ్చింది. కేసీఆర్‌ను కలుస్తా: అజర్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీఆర్ఎస్ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్‌తో సహా ప్రగతి భవన్‌కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్షం ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. అజహరుద్దీన్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అభినందనలు తెలిపారు. వి.హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్‌లాల్, అఫ్జలుద్దీన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోల్ కాగా, అజహర్‌కు భారీ స్థాయిలో ఓటింగ్ పడింది. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్‌తో పాటు దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్లు పోటీ పడ్డారు. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్ జైన్‌కు 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి. అయితే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్ ఘన విజయం సాధించడంతో అతని కల ఫలించినట్లయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను ఆమోదించలేదు. అయితే హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు. -
మొదలైన పోలింగ్.. అధ్యక్షుడు ఎవరో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 230 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌సీఏ అధ్యక్షపదవి కోసం టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్‌చంద్ జైన్లు ప్రధానంగా పోటీపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవి కోసం జాన్ మనోజ్, సర్దార్ దల్దీత్ సింగ్‌లు రేసులో ఉన్నారు. హాట్ ఫేవరేట్‌గా అజారుద్దీన్.. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నా.. అందరి చూపు టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్‌పైనే ఉంది. అజారుద్దీన్ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే తన నామినేషన్ తిరస్కరణ కావడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ సారి అధ్యక్షుడు ఎవరనే దానిపై అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్, నోయల్ డేవిడ్, సాండ్రా బ్రగాంజ్, రజనీ వేణుగోపాల్, పూర్ణిమా రావు, డయానా డేవిడ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
వివేక్‌కు చుక్కెదురు
హైదరాబాద్: మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం వివేక్ నామినేషన్ వేసే క్రమంలో సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్న్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. వివేక్‌కు సంబంధించిన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాకపోవడంతో వివేక్ హెచ్‌సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏ అధ్యక్ష బరిలో అజహర్
హైదరాబాద్: రెండేళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేశారు. ‘ హెచ్‌సీఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్‌ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరంఉంది. నాకు విక్రమ్ మాన్ సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లు సహకారం ఉంది’ అని అజహర్ తెలిపారు. కాగా, మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పీ మాన్ సింగ్ కుమారుడు విక్రమ్ మాన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను ఆమోదించలేదు. -
నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ నియామకాలు
హైదరాబాద్: హెచ్‌సీఏలో తాజాగా చేపట్టిన నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్, హెచ్‌సీఏ ప్రతినిధి శేష్‌నారాయణ ఈ అంశంపై మాట్లాడారు. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సమావేశంలో సభాధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి అబద్ధాలతో కూడిన సమాచారాన్ని వెల్లడించారన్నారు. హెచ్‌సీఏ తరఫున బీసీసీఐ ప్రతినిధిగా వివేక్ పేరును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించిన సమాచారంలో నిజం లేదని అన్నారు. నిజానికి ఒకసారి అనర్హత వేటు పడిన వ్యక్తిని సిఫార్సు చేయకూడదనే నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. పది మంది కుమ్మక్కై ఇలా చేయడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆదివారం నాటి హెచ్‌సీఏ సమావేశంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఎంఎన్ రావు, ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్‌ను నియమించారు. వీరితో పాటు హెచ్‌సీఏ నుంచి బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానందను, జూనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెటింగ్ కమిటీని ఎంపిక చేశారు. ఈ నియామకాలనే తాజాగా అజహరుద్దీన్ బృందం తప్పుబడుతోంది. -
ఇంగ్లండ్‌కు అంత సీన్ లేదు!
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఆనందం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌పై 125 పరుగులు తేడాతో విజయం సాధించిన తర్వాత మాట్లాడిన అజహర్.. ఈ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. ఇదే జోరును జూలై 14వ తేదీ(ఫైనల్ జరిగే రోజు) వరకూ కొనసాగించాలన్నాడు. ‘ వరల్డ్‌కప్ ఫైనల్ వరకూ భారత్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాల్ని సాధించడం శుభ పరిణామం. ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. దాంతో వరల్డ్‌కప్‌ను భారత్ సాధిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. భారత్ కచ్చితంగా వరల్డ్‌కప్‌తో తిరిగి వస్తుంది’ అని అజహర్ పేర్కొన్నాడు. ఇక హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్ గెలిచే సత్తా లేదన్నాడు. ప్రస్తుత తరుణంలో ఆ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ వరకూ వెళ్లడం చాలా కష్టమన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఆట అంత ఆశాజనంగా లేదన్నాడు. ఆ జట్టు కనీంస సెమీస్ చేరుతుందని తాను కోవడం లేదన్నాడు. ‘ ఇంగ్లండ్ గొప్ప జట్టే.. కానీ ఆ జట్టు పూర్తి స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఇంగ్లండ్ చాలా ఒత్తిడిలో ఉంది. దాంతో సెమీస్‌కు చేరడం చాలా కష్టం. ఇంగ్లండ్ టాప్-4లోఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని అజహర్ అభిప్రాయపడ్డాడు. -
ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి అరెస్టు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రాన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ప్రాంతాల్లో సోదాల సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్‌కార్డులు, 10 పెన్‌డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మెమొరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూరులో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో బుధవారం 35మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూరుకు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉక్కడం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూర్‌కు చెందిన అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్‌పై మే 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. తమిళనాడు, కేరళలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్షించడం వారి లక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది. -
హైదరాబాదీ ఒమన్ క్రికెటర్
ఆ కుర్రాడి కల టీమిండియాకు ఆడటం... ఆ లక్ష్యానికి తగ్గట్లుగానే అడుగులు వేశాడు... ఆ దిశగా ఒక్కో మెట్టు ఎక్కాడు... అవకాశం దొరికినప్పుడల్లా రాణించాడు... కానీ, తాను ఊహించినంతగా ముందుకు వెళ్లలేకపోయాడు... ఈలోగా తండ్రి మరణం రూపంలో వ్యక్తిగత జీవితంలో విషాదం ఎదురైంది... నిరాశ చుట్టుముట్టిన వేళ అనుకోని వరంలా ఓ పిలుపు తలుపు తట్టింది... ఏదైనా మన మంచికే అని దానిని అందిపుచ్చుకున్నాడు...! వెనక్కుతిరిగి చూసుకుంటే ఇప్పుడు అతడు తమ జట్టుకు కీలక సమయంలో విజయం అందించిన ‘ఓ జాతీయ క్రికెటర్’...! అతడే... హైదరాబాదీ ఆల్ రౌండర్, ఒమన్ దేశ క్రికెటర్ శ్రీమంతుల సందీప్ గౌడ్! మన తెలుగువాడు కావడం ఏమిటి? ఎక్కడో గల్ఫ్‌లోని దేశానికి ప్రాతినిధ్యం ఏమిటి? ఈ ఆసక్తికర కథనం మీరే చదవండి...! మనదగ్గరి చాలామంది యువకుల్లాగే సందీప్ గౌడ్ కూడా క్రికెట్ అంటే ప్రాణమిచ్చే రకం. దీనికితోడు హైదరాబాద్ నేపథ్యం. పైగా దిగ్గజ బ్యాట్స్‌మన్, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ చదివిన ఆల్ సెయింట్స్ హైస్కూల్ విద్యార్థి. అతడితోపాటు మరో మేటి ఆటగాడైన వీవీఎస్ లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అడుగులు ఇలా... స్కూల్ స్థాయిలో ప్రతిభ చాటాక సందీప్ చిక్కడపల్లిలోని అరోరా కళాశాలలో బీకామ్ చదువుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు. 2009–10 సీజన్లో అండర్–22 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ నెగ్గిన హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు. ఇదే సీజన్లో అండర్–19 కూచ్ బెహార్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీల్లో హైదరాబాద్‌కు ఆడాడు. 2010–11లో కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ టోర్నీలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్యలో హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ లీగ్ చాంపియన్‌షిప్స్‌లో దక్కన్ క్రానికల్, న్యూ బ్లూస్, ఎవర్ గ్రీన్ క్లబ్‌లకు ఆడాడు. ఇలా వివిధ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ 2013 నుంచి రంజీ ట్రోఫీ అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. 2016లో చాన్స్ దొరుకుతుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. తండ్రి ఆకస్మిక మరణంతో... ఇదే సమయంలో తండ్రి రవీందర్ గౌడ్ ఆకస్మిక మృతి సందీప్‌ను మరింత ఒంటరి చేసింది. అయితే, అనుకోని విధంగా తనతో కలిసి ఆడిన స్నేహితుడు వంశీ నుంచి సందీప్‌కు ఒమన్ అవకాశం గురించి తెలిసింది. తొలుత తటపటాయించినా, వయసు, ఇతర పరిమితులు సడలిస్తూ ఒమన్ అధికారులు సైతం ఆహ్వానించడంతో ఓ ప్రయత్నం చేద్దామని నిర్ణయానికొచ్చాడు. మరోవైపు ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్ కంపెనీ సందీప్‌కు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఆ కల ఇలా తీరింది... ఒమన్ డెవలప్మెంట్ ఎలెవెన్ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడంతో (55 నాటౌట్) సందీప్ ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన అతడు రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2లో గత బుధవారం నమీబియాతో మ్యాచ్‌లో కీలక సమయంలో అజేయ అర్ధ సెంచరీతో రాణించి తమ జట్టుకు ఐసీసీ వన్డే హోదా దక్కేలా చేశాడు. ఈ ప్రతిభతో సందీప్ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టి20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లోనూ ఒమన్ జట్టుకు ఆడటం ఖాయం చేసుకున్నాడు. ‘సందీప్ బంతితో, బ్యాట్‌తో నిలకడైన ప్రదర్శన చేస్తాడు. దురదృష్టం కొద్దీ ఇక్కడ అవకాశం దొరకలేదు. అతడు ఒమన్‌కు ఆడుతుండటాన్నీ నేను సంతోషంగానే స్వీకరిస్తున్నా’ అని ఆల్ సెయింట్స్ కోచ్ డెంజిల్ బామ్ అన్నాడు. ‘ఇక్కడి టోర్నీల్లో తన ప్రదర్శనతో మా సోదరుడు మంచి భవిష్యత్తు ఊహించుకున్నాడు. కానీ, అవకాశం దక్కలేదు’ అని సందీప్ సోదరి శ్రావణి పేర్కొంది. – సాక్షి క్రీడా విభాగం -
‘కోహ్లి 100 సెంచరీలు కొడతాడు’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వంద అంతర్జాతీయ శతకాలు సాధించగలడని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఇదే ఫామ్ కొనసాగిస్తే అతడు వంద సెంచరీలు కొట్టడం ఖాయమన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ చేశాడు. వన్డేల్లో అతడికిది 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటివరకు 64 సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్, పాంటింగ్ తర్వాత మూడో స్థానంలో కోహ్లి ఉన్నాడు. (కోహ్లి సెంచరీ.. ధోని ఫినిషింగ్ టచ్) ‘విరాట్ కోహ్లి నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను కచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లి గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఓడిపోయింద’ని అజారుద్దీన్ పేర్కొన్నాడు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై కూడా అజర్ ప్రశంసలు కురిపించాడు. ధోని బాగా బ్యాటింగ్ చేశాడని, చివరివరకు వికెట్ కాపాడుకుని విన్నింగ్ షాట్ కొట్టడం అతడికే చెల్లిందని మెచ్చుకున్నాడు. దినేశ్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడని, మొత్తంగా టీమిండియా ప్రదర్శన బాగుందని అభిప్రాయపడ్డాడు. -
నేను టీఆర్ఎస్లో చేరడం లేదు : అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : తాను టీఆర్ఎస్లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం ఈ మాజీ క్రికెటర్ కారెక్కడానికి సిద్దమయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో అజార్ ట్విటర్లో స్పందిస్తూ.. తాను టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్ఎస్ కీలక నేతలతో అజార్ చర్చలు జరిపినట్టు, ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్లో అజారుద్దీన్ అధికారికంగా చేరుతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. తాజాగా అజార్ దీన్ని ఖండించడంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లైంది. The news doing the rounds in the media of me joining the TRS party in Telangana is incorrect & false. — Mohammed Azharuddin (@azharflicks) January 2, 2019 -
అజహర్ కొడుకు అరంగేట్రం
పోర్వోరిమ్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ (28) రంజీ ట్రోఫీలో గోవా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. గురువారం సర్వీసెస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అతనికి చోటు దక్కింది. తొలి రోజు అసద్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. హైదరాబాద్‌లో స్థానిక లీగ్‌లు ఆడటం మినహా మరే అనుభవం లేని అసద్‌ను గోవా జట్టు ‘ప్రొఫెషనల్ ప్లేయర్’గా టీమ్‌లోకి తీసుకోవడంపై సీజన్ ఆరంభంనుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. గతంలో యూపీ తరఫున ఆడే ప్రయత్నం చేసినా తుది జట్టులోకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ ట్రయల్స్‌కు వెళ్లినా అసద్ ఎంపిక కాలేకపోయాడు. గోవా జట్టుకు గత ఆగస్టులో హైదరాబాద్‌లోనే శిక్షణా శిబిరం జరిగింది. దీనిని స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి ఫీజు లేకుండా జట్టుకు సలహాదారుడిగా కూడా అజహర్ వ్యవహరించాడు. ఇదే కారణంగా అసద్‌ను చోటిచ్చారని గోవా సీనియర్ క్రికెటర్లు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. -
‘టీమిండియాలా మహాకూటమి బలంగా ఉంది’
సాక్షి, ఖమ్మం : టీమిండియా క్రికెట్ జట్టు తరహాలో మహాకూటమి కూడా బలంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (ఆదివారం) ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మకైనాయని, టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని అజహరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. ముస్లింలకు టీఆర్ఎస్ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ హామీ ఏమైందని అజహరుద్దీన్ ప్రశ్నించారు. నాలుగున్నర ఏండ్ల పాలనలో హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. హామీల గురించి ప్రశ్నించే వారిపై సీఎం కేసీఆర్ అసహనంతో, అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తారని అజహర్ విమర్శించారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు,కోదండరాం కలయిక క్రికెట్ లో తాను, సచిన్ ల భాగస్వాముల మాదిరిగా విజయం సాధిస్తుందన్నారు. ఖమ్మంలో అభివృద్ధి కోసం ప్రజా కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. -
కేసీఆర్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలి: అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని మభ్యపెట్టి మోసం చేసినందుకు ముస్లింలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు సాధ్యం కానప్పుడు ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల సభలో ముస్లిం యువకుడు రిజర్వేషన్‌పై ప్రశ్నిస్తే కేసీఆర్ స్పందించిన తీరు బాగాలేదని, స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు నదీమ్, జావిద్, రాష్ట్ర అధ్యక్షుడు సొహైల్, రాష్ట్ర ఇంచార్జి సలీం అహ్మద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ సమాధానం చెప్పిన విధానాన్ని బట్టే ముస్లిం మైనారిటీల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందన్నారు. తనకు సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయాలని ఉందని అజహరుద్దీన్ తెలిపారు. అయితే ఎక్కడి నుండి పోటీచేయాలన్నది పార్టీ హైకమాండ్æ నిర్ణయిస్తుందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజహర్ సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ నియమితులయ్యారు. మరో 14 మంది నేతలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కగా, ఇందులో పలువురు ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు కూడా ఉన్నారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా తాజా నియామకంపై అజహరుద్దీన్ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షులుగా బి.ఎం.వినోద్‌కుమార్, జాఫర్ జావెద్‌లు నియమితులయ్యారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఎస్.జగదీశ్వరరావు, నగేశ్ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతారాయ్, ఫహీం, కైలాశ్, లక్ష్మారెడ్డి, క్రిశాంక్ నియమితులు కాగా, పీసీసీ కార్యదర్శులుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్‌కుమార్, బాలలక్ష్మి నియమితులయ్యారు. -
అజారుద్దీన్‌కు కీలక పదవి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలకు కీలక పదవులను కట్టబెట్టింది. గతకొంత కాలంగా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్న మాజీ ఎంపీ, మహ్మద్ అజారుద్దీన్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అజరుద్దీన్‌ను కీలక పదవిలో నియమించడంతో మైనార్టీ ఓట్లను దండుకోవచ్చనే వ్యూహంతో ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఇదివరకే అజారుద్దీన్‌ను స్టార్ క్యాంపెయిర్‌గా నియమించినప్పటికీ ఆయన కొంత అసహనంతో ఉన్నారు. దీంతో ఆయన అవసరాలను, సేవలను గుర్తించిన కాంగ్రెస్.. కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించింది. ఆయనతో పాటు పలువురికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ పార్టీలు నేతలు డాక్టర్ బీ.ఎం వినోద్ కుమార్, జాఫర్ జావేద్‌లను పార్టీ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరితోపాటు మరికొందరికి పార్టీ సెక్రటరీలుగా, జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించింది. దేశమంతటా పర్యటిస్తా... పార్టీలో కీలక పదవి దక్కడంపై అజారుద్దీన్ స్పందించారు. పార్టీలో 18 ఏళ్లు చేసిన సేవకుగాను కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడిగా తనకు దక్కిన పెద్ద గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్లో జట్టుగా ఉన్న సమయంలో పెద్ద బాధ్యతను నిర్వర్తించానని.. మరలా ఇప్పుడు ఈ బాధ్యతను మోస్తున్నానని అభిప్రాయపడ్డారు. తనను కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించినందుకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎనలేని సేవచేసిందని గుర్తుచేశారు. క్రికెట్ ఆడేందుకు తనకు శక్తిలేదని, కానీ కాంగ్రెస్ కోసం దేశమంతటా పర్యటిస్తానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
గంభీర్ అసలు ఏమైంది నీకు!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఈడెన్ గార్డెన్స్‌లో గంట మోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంభీర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ, సీఏబీ, సీఓఏల తమ గౌరవాన్ని కూడా కోల్పోయయన్నాడు. అయితే ఈ ట్వీట్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం భగ్గుమంటుంది. ‘గంభీర్ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు’ అని, హైకోర్ట్ అతని నిషేధంపై క్లీన్‌చీట్ ఇచ్చిన విషయం తెలియదా? అని.. అతను ఎంపీ కూడా అయ్యారని మరొకరు కామెంట్ చేశారు. ముందు సీనియర్ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమ్మని, నార్త్ క్రికెటర్లను ఒకలా.. సౌత్ క్రికెటర్లను ఒకలా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు. (చదవండి: అజహర్ బెల్ కొట్టడంపై గంభీర్ గుస్సా!) భారత్ తరపున 99 టెస్ట్‌లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్‌పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్ క్రికెట్ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు. (టాస్ ఓడిపోవాలనే కోరుకుంటారు!) GG, you have disappointed me big time. Politics n all is fine but at least you must had respected the values of that game which gave you everything. #RespectYourSenior — Berbatov (@bbtv9) November 4, 2018 Had great respect for you but this is uncalled for.. #unfollowing — Shahnawaz (@iamshaah5) November 4, 2018 Are u targeting azhar? What has happened to you Gautam, u r disrespecting ur senior. What is the reason for ur changed behaviour in past few months?? — AYUSH PANDEY (@AYP1293) November 4, 2018 -
అజహర్ బెల్ కొట్టడంపై గంభీర్ గుస్సా!
కోల్‌కతా : భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఆదివారం తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో గంట మోగించడంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), సీఓఏలను ట్విటర్ వేదికగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగా నిషేదం ఎదుర్కొన్న క్రికెటర్‌తో ఎలా బెల్ కొట్టిస్తారని పరోక్షంగా ప్రశ్నించాడు. ‘ఈడెన్‌లో భారత్ ఈ రోజు మ్యాచ్ గెలువచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయి. ఆదివారమని అవినీతికి వ్యతిరేకంగా పనిచేయకుండా సెలవుతీసుకున్నట్లు కనబడుతోంది. అతన్ని హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతినిచ్చిన విషయం నాకు తెలుసు. కానీ అతను బెల్కొట్టడమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.’అని గంభీర్ ట్వీట్ చేశాడు. భారత్ తరపున 99 టెస్ట్‌లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్ 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో బీసీసీఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్ క్రికెట్లో అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదంపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. India may have won today at Eden but I am sorry @bcci, CoA &CAB lost. Looks like the No Tolerance Policy against Corrupt takes a leave on Sundays! I know he was allowed to contest HCA polls but then this is shocking....The bell is ringing, hope the powers that be are listening. pic.twitter.com/0HKbp2Bs9r — Gautam Gambhir (@GautamGambhir) 4 November 2018 హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు. తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇక్కడే ఆడి సెంచరీ చేసిన అజహర్ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీని (74 బంతుల్లో) అజహర్ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్‌లోనే నమోదు చేశాడు. 1993లో ఇదే వేదికపై అతని కెప్టెన్సీలో భారత్ వన్డే టోర్నీ ‘హీరో కప్’ నెగ్గింది. -
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్
రాయ్‌పూర్: రాజకీయ నేతలుగా మారిన మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహ్మద్ అజహరుద్దీన్‌లు ఛత్తీస్‌గఢ్ తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులున్నారని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లుండగా, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. -
అజహర్ తర్వాత కోహ్లినే
రాజ్‌కోట్: ఇప్పటికే ఎన్నో ఘనతల్ని సాధించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి జట్లను ఫాలోఆన్ ఆడించడంలో కూడా తన మార్కును చూపెడుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ ఫాలోఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లి ఐదు సార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఏడుసార్లు ఫాలోఆన్ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత క్రికెట్ కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ-ఎంఎస్ ధోనిలను కోహ్లి అధిగిమించాడు. గంగూలీ-ధోనిలు తమ క్రికెట్ కెరీర్లో కెప్టెన్లగా ఉన్న సమయంలో ప్రత్యర్థి జట్టును నాలుగుసార్లు ఫాలోఆన్ ఆడించారు. ఇప్పటివరకూ వీరితో కలిసి కోహ్లి సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, దాన్ని తాజాగా సవరించాడు. ఇక సునీల్ గావస్కర్-రాహుల్ ద్రవిడ్‌లు మూడేసిసార్లు ఫాలోఆన్‌లో భాగస్వామ్యమై నాలోస్థానంలో ఉన్నారు. టీమిండియా రికార్డు ‘ఇన్నింగ్స్’ -
కోహ్లి మరో 37 పరుగులు చేస్తే..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఆసియా కప్‌కు గైర్హాజరీ అయిన విరాట్ కోహ్లి వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలోనే విండీస్‌పై టెస్టుల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ చేసిన 539 పరుగుల రికార్డుకు కోహ్లి 37 పరుగుల దూరంలో నిలిచాడు. మరో రెండు రోజుల్లో విండీస్ ఆరంభయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో అజహరుద్దీన్ పరుగుల రికార్డును కోహ్లి అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ వెస్టిండీస్‌తో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 502 పరుగులు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 38.61 సగుటుతో ఈ పరుగులు సాధించాడు. విండీస్‌పై కోహ్లి చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 200. కాగా, వెస్టిండీస్‌పై అత్యధికంగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ (2746) అగ్రస్థానంలో ఉన్నాడు. గావస్కర్ తర్వాత రాహుల్ ద్రవిడ్ (1978), వీవీఎస్ లక్ష్మణ్ (1715)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే, 1948 నుంచి భారత్-విండీస్ జట్ల మధ్య 94 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 28 మ్యాచ్‌లు గెలవగా, 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. -
జడేజా ఔటైతే భారత్ నెగ్గేది కాదు..
న్యూఢిల్లీ : ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి ఏడోసారి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడని అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కీలక సమయంలో జడేజా(23;33 బంతుల్లో) భువనేశ్వర్(21;31 బంతుల్లో) తో కలిసి ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఈ టోర్నీలో అటు బంతి, ఇటు బ్యాట్‌తో మెరిసిన జడేజాను జట్టులో కొనసాగించాలని అజారుద్దీన్ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. ‘రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయవద్దు. ఆసియాకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో జడేజా త్వరగా పెవిలియన్ చేరుంటే.. భారత్ మ్యాచే నెగ్గేది కాదు. అతను భారత జట్టు 11 మంది సభ్యుల్లో ఎప్పుడు ఒకడే.’ అని తెలిపాడు. సూపర్-4లో బంగ్లాదేశ్పైనే జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే. (మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్) ఇక చివర్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్న జాదవ్ బ్యాటింగ్ చేయడాన్ని కూడా అజారుద్దీన్ కొనియాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసించాడు. అతను చాలా కూల్‌గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ మొర్తజా చెప్పినట్టే ఆ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో 6 పరుగుల అవసరం కాగా.. గాయంతోనే జాదవ్, కుల్దీప్ సాయంతో మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: ‘ఆసియా’ మనదే -
సికింద్రాబాద్ నుంచి బరిలో అజారుద్దీన్..!!
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ అజారుద్దీన్ మనసులో మాటను బయటపెట్టారు. 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన అజారుద్దీన్ గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్-సవాయ్ మాధోపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఈ సారి మాత్రం తన సొంత రాష్ట్రమైన తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఉందని చెప్పారు. అయితే, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలా? లేదా? అన్నది ఉంటుందని స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. రైతులు, మిగతావారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు వివరించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, గెలుపు లేదా ఓటమి గురించి తాను ఆలోచించడం లేదని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, టీ కాంగ్రెస్ పార్టీ నేతలు అజహార్‌ను 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎంపీ స్థానానికి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని గతేడాది కోరిన సంగతి తెలిసిందే. -
యోయో టెస్ట్ ఫెయిలైతే కోహ్లిని తప్పిస్తారా?
న్యూఢిల్లీ : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) తీసుకొచ్చిన యోయో టెస్ట్‌ను భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, ఆకాశ్ చోప్రా, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు తప్పుబట్టారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అంబటి రాయుడు, సంజూ శాంసన్‌లతో పాటు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీలు యోయో టెస్ట్‌లో విఫలమవడంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి యోయో టెస్ట్ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఇండియా టుడే చానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఈ మాజీ క్రికెటర్లు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ పరీక్ష ఫెయిలైతే.. అతడ్ని జట్టులో నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు?. ఈ పద్దతితో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులో నుంచి తీసేయడం సరికాదు. మీరు కోహ్లిని ఆడించాలనుకున్నారు కాబట్టి అతనికి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చి యో యో టెస్టు నిర్వహించారు. మిగతా ఆటగాళ్ల పట్ల అలాగే వ్యవహరించాలి ’అని తెలిపాడు. యోయో అవసరం లేదు.. అసలు క్రికెటర్లకు యోయో అవసరం లేదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.. ‘యో యో టెస్టు ఓ కొత్త డ్రామా. అసలు ఈ పరీక్ష క్రికెటర్లకు అవసరమే లేదు. ఫుట్‌బాల్, హాకీ ఆటగాళ్లకు ఇది అవసరం. వారు మైదానం అంతా పరిగెడుతూ ఉండాలి. కాబట్టి పూర్తి ఫిట్నెస్గా ఉండాలి. క్రికెట్లో అలా కాదు. ఈ పద్దతితో ఫామ్‌లో ఉన్న రాయుడు జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టును ఎంపిక చేసేందుకు యో యో టెస్టు ప్రామాణికంగా ఉండాల్సినవసరం లేదు. ఆటగాడి ఫామ్, ప్రతిభ.. ఈ రెండే ముఖ్యమైనవి’ అని భజ్జీ తెలిపాడు. దిగ్గజ ఆటగాళ్లే ఫెయిలయ్యారు.. ఒక వేళ కోచ్ ఎంపికకు కూడా ఇదే ప్రామాణికంగా తీసుకుంటే రవిశాస్త్రి ఈ పరీక్ష ఎప్పటికి నెగ్గలేడని అజారుద్దీన్ తెలిపాడు. ‘గతంలో ఈ పరీక్షలో ఎంతో మంది భారత దిగ్గజ ఆటగాళ్లు ఫెయిలయ్యారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో విధంగా ఫిట్నెస్ లెవల్స్ ఉంటాయి. నేను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాను. కానీ, నా పాదాలను అందుకోమంటే నేను అందుకోలేను. కానీ మైదానంలో నా వద్దకు బంతి వచ్చినప్పుడు నా శక్తినంతటినీ సమకూర్చుకుని ఆడుతాను. సునీల్ గావస్కర్ కూడా యోయో ఫెయిలైనవాడే. యో యో ఫెయిలైతే జట్టులో చోటు దక్కదన్న విషయాన్ని ఆటగాడికి ముందుగానే చెప్పాలి. జట్టు ఎంపిక చేసిన తర్వాత వారికి టెస్టు నిర్వహించి ఆ తర్వాత ఫెయిలయ్యాడని తప్పించడం పద్దతి కాదు. రవిశాస్త్రికి కూడా ఇదే పరీక్ష పెడితే.. ఆయన ఎప్పటికి ఈ టెస్ట్ నెగ్గలేడు’ అని అజార్ అభిప్రాయపడ్డాడు. -
ఐసీసీ తొందరపడింది: అజహర్
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌కు టెస్టు క్రికెట్ హోదా ఇవ్వడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గాన్‌కు అప్పుడే టెస్టు హోదా ఇవ్వడం తొందరపాటు చర్యగా అజహర్ విశ్లేషించాడు. ఆ జట్టుకు టెస్టు హోదా ఇచ్చి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తప్పు చేసిందన్నాడు. ‘జట్టు విషయానికొస్తే అఫ్గానిస్తాన్ మంచి జట్టే. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు, టెస్టులకు చాలా తేడా ఉంటుంది. అఫ్గాన్‌కు టెస్టు హోదా ఇచ్చి ఐసీసీ తొందరపడింది. వాళ్లకి ఇంకాస్త ఎక్కువ సమయం ఇచ్చి ఉండాల్సింది. భారత్‌తో ఆ జట్టు ఆడిన తొలి టెస్టే రెండు రోజుల్లో ముగిసిపోవడం వాళ్లని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాళ్లు భవిష్యత్తులో చాలా టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమలోని లోపాలను అధిగమించడానికి ఈ టెస్టు వాళ్లకి ఓ పాఠం లాంటిది. టెస్టు ఫార్మాట్ కోసం వాళ్లు ఆటలో మరింత పురోగతి సాధించాలి’ అని అజహర్ పేర్కొన్నాడు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఎదురుదెబ్బ
-
'అది కోహ్లికి సరికాదు'
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత మీడియాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ తప్పుబట్టాడు. ఒక కెప్టెన్‌గా తన నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి కానీ మాటలతో ఎదురుదాడి చేయడం కోహ్లికి ఎంతమాత్రం తగదన్నాడు. 'కోహ్లి ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి గుర్తుంచుకోవాలి. జట్టు గురించి ఏ నిర్ణయమైనా తీసుకునేది అతడే కాబట్టి ఎవరైనా అతడ్నే ప్రశ్నిస్తారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పు. మీడియా అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వు. ఆ క్రమంలోనే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. అంతేకానీ సహనాన్ని కోల్పోవడం ఎంతమాత్రం సరికాదు. సమాధానం చెప్పలేకపోతే కూల్‌గా ఉండాల్సింది' అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. -
'వివేక్ చెప్పేవన్నీ అవాస్తవాలే'
-
యోయో..ఏంటీ..యువీ జట్టులోకి రావాలి..!
దుబాయ్: గత కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్రైనాలు తిరిగి జట్టులోకి రావాలని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆకాంక్షించారు. దుబాయ్‌లోని ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించే యోయో టెస్టుపై తనకు అంత అవగాహన లేదన్నాడు. ‘ఆటగాళ్లు ఫిట్నెస్గా ఉండటం తప్పనిసరి, ఫిట్‌గా లేకుంటే ఆడలేరు. కానీ కెరీర్ మంచి దశలో ఉండి ఆనారోగ్యానికి గురైన కొంత మంది సీనియర్ క్లికెటర్లకు ఈ పరీక్షల నుంచి కొంత మేర మినహాయించాలి. యువరాజ్‌ను తీసుకుంటే 2011 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్‌తో బాధపడ్డాడు. దీంతోనే యోయో టెస్ట్ నెగ్గలేకపోతున్నాడుని అనుకుంటున్నా. ఇక సురేశ్ రైనాకు నేను పెద్ద అభిమానిని. అతను కూడా జట్టులోకి తిరిగి రావాలనొ కోరుకుంటున్నా. గతేడాది అతని కలిసినప్పుడు అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఏదేమైనా తుదినిర్ణయం మాత్రం జట్టుదేనని అజార్ చెప్పుకొచ్చాడు. -
టీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అజహరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని టీపీఎల్ కార్యాలయానికి ఆయన గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా టీపీఎల్ సీఎండీ మన్నె గోవర్ధన్‌రెడ్డి అజహరుద్దీన్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలో ప్రారంభమయ్యే టీపీఎల్ రెండో ఎడిషన్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయన్నారు. మీడియా పార్ట్నర్లుగా ప్రముఖ చానళ్లు వ్యవహరిస్తున్నాయని, ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయన్నారు. టీపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అజహరుద్దీన్ అంగీకరించడం గర్వకారణమన్నారు. -
ఏదైనా ఓకే.. మీరు రావాలంతే
హైదరాబాద్: ప్రముఖ మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ను కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని కోరామన్నారు. కలిసికట్టుగా పోరాడితే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయనకు చెప్పామన్నారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఏదైనా సరే.. అవకాశమిస్తామని ఆయనకు చెప్పామన్నారు. తెలంగాణలో పోటీ చేసేందుకు అజహరుద్దీన్ అంగీకరిస్తే, ఆయనతో పార్టీ తరపున ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అజహర్ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం విదితమే. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. -
ఒకవేళ నేను కెప్టెన్‌గా ఉండుంటే..!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి టీమిండియా సెలక్షన్ సరిగా లేదంటూ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన దేశంతో క్రికెట్ ఆడేటప్పుడు జట్టును ఎంపిక చేయడం ఇలాగేనా అంటూ అజహర్ ప్రశ్నించారు. ప్రధానంగా భారత అగ్రశ్రేణి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆసీస్ తో సిరీస్ కు ఎంపిక చేయకపోవడానికి కారణమేమిటని నిలదీశారు. ' మీరు(సెలక్టర్లు) ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సిరీస్ జరిగేది ఆసీస్‌తో అనే విషయం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అత్యుత్తమ జట్టుతో్ జరిగే సిరీస్ కు ఇదేనా ఎంపిక. ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకమైనది. శ్రీలంకతో సిరీస్ కు అశ్విన్, జడేజాలకు విశ్రాంతినివ్వడాన్ని నేను అర్దం చేసుకోగలను. మరి ఆసీస్ తో సిరీస్ కు కూడా ఆ ఇద్దరి అవసరం లేదా. మన అత్యుత్తమ స్పిన్నర్లను పటిష్టమైన ఆసీస్ పై ఉపయోగించుకోవాలి. అందులోనూ స్వదేశంలో వికెట్ అశ్విన్, జడేజాల బౌలింగ్ శైలికి బాగా సెట్ అవుతుంది. ఆసీస్ తో సిరీస్ కు వారిని ఆడించాల్సింది. ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్ ల్లో అశ్విన్ ఆడటం తప్పులేదు. అతని ఆత్మవిశ్వాసం పెరగడానికి కౌంటీలు బాగా ఉపయోగపడతాయనే విషయం నాకు తెలుసు. అదే సమయంలో ఆసీస్ తో సిరీస్ కూడా ముఖ్యమనే విషయం గ్రహించాలి. ఒకవేళ ఆసీస్ తో సిరీస్ కు నేను కెప్టెన్ గా ఉన్నట్లయితే అశ్విన్, జడేజాలను కచ్చితంగా ఆడించేవాడిని' అని అజహర్ అభిప్రాయపడ్డారు. -
అజహర్‌ను ‘మోసగించారు’
ఎన్నికల్లో పోటీకి దూరమైన మాజీ కెప్టెన్ హైదరాబాద్: గత జనవరిలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయనపై ఉన్న ఫిక్సింగ్ ఆరోపణలను కారణంగా చూపిస్తూ రిటర్నింగ్ అధికారి రాజీవ్ రెడ్డి, అజహర్ నామినేషన్‌ను తిరస్కరించారు. తనను 2012లో హైకోర్టు నిర్దోషిగా తేల్చిందంటూ అజహర్ వాదించినా... బీసీసీఐ నుంచి ఈ విషయంలో స్పష్టత లేదంటూ రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. అయితే ఇది అజహర్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి వర్గం చేసిన కుట్రగా తాజాగా బయట పడింది. పోటీ చేసేందుకు అర్హత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ నాటి అడ్‌హక్ కమిటీ చైర్మన్ ప్రకాశ్ చంద్ జైన్ బీసీసీఐకి వరుసగా ఇ–మెయిల్స్ పంపారు. అయితే తనకు ఎలాంటి జవాబు రాలేదంటూ జైన్ చెప్పడంతో రిటర్నింగ్ అధికారి తన నిర్ణయానికే కట్టుబడ్డారు. కానీ జనవరి 12నే బీసీసీఐ దీని గురించి హెచ్‌సీఏకు మెయిల్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో ‘అజహర్‌పై ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదు కాబట్టి బోర్డు న్యాయ విభాగానికి కూడా అతని విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు’ అని స్పష్టంగా పేర్కొంది. మరో ఐదు రోజుల తర్వాత ఎన్నికలు ఉన్నా... ప్రకాశ్ చంద్ గానీ, రాజీవ్ రెడ్డి గానీ ఈ లేఖను బయట పెట్టకుండా తమకు బోర్డు నుంచి సమాచారం లేదంటూ అజహర్ నామినేషన్‌ను తిరస్కరించారు. అతను అసోసియేషన్లోకి రాకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర జరిగినట్లు కనిపిస్తోంది. అయితే అలాంటి సమయంలో కూడా బీసీసీఐ తమ లేఖను ఎందుకు బయట పెట్టలేదనేది ఆశ్చర్యకర విషయం. ఈ అంశంపై ప్రస్తుత హెచ్‌సీఏ కమిటీ ఇంకా స్పందించలేదు. -
హెచ్‌సీఏపై అజహర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పై భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీఏ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ ధ్వజమెత్తారు. అసలు హెచ్‌సీఏ తీరు సరిగా లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీకి ఎటువంటి అర్హత లేదని విమర్శించారు. ఆ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ క్రికెటర్లకు హెచ్‌సీఏలో గుర్తింపు లేదన్న అజహర్.. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి కొందరు క్రీడాకారులు రంజీకి ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరిగింది.. ఈఎంపిక లోథా కమిటీ సిఫారసుల మేరకే జరిగిందా లేదా అర్ధం కావటం లేదన్నారు. ఎన్నికల తరువాత హెచ్‌సీఏలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇది ఎవరినీ నిందించటానికి కాదన్నారు.హెచ్‌సీఏ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇంకా సమయం ఉంది...అప్పటి వరకు వేచి చూడాలన్నారు. తీర్పు వచ్చాక ఏం చెయ్యాలో చెప్తానన్నారు. -
'అది రవిశాస్త్రికే అవమానం'
న్యూఢిల్లీ: 'భారత క్రికెట్లో గొప్ప పేరున్న అనేక మంది క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఘనతను ప్రస్తుత జట్టు సాధించింది. ఉదాహరణకు శ్రీలంక గడ్డపై 20 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం అలాంటిదే. ఎంతో మంది క్రికెటర్లు 20 ఏళ్ల పాటు భారత్‌కు ఆడారు. అనేక సార్లు లంకలో పర్యటించారు కానీ సిరీస్ గెలవలేకపోయారు. గత జట్లకు సాధ్యం కాని విధంగా ఈ కుర్రాళ్లు వన్డే సిరీస్ కూడా గెలిచారు’ అని ఇటీవల భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రస్తుత భారత క్రికెట్ జట్టును రవిశాస్త్రి ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అదే సమయంలో గత భారత క్రికెట్ జట్టుకు సాధ్యం కానిది అంటూ మాజీలకు కోపం వచ్చే తరహాలో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ గంగూలీ వ్యంగ్యస్త్రాలు సంధించగా, తాజాగా మరో మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రవిశాస్త్రి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదంటూ అజహర్ మండిపడ్డాడు. ప్రధానంగా విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకే మొత్తం క్రెడిట్ ఇవ్వడాన్ని అజహర్ ఇక్కడ తప్పుబట్టాడు. 'శ్రీలంక సిరీస్ తోనే విదేశాల్లో ప్రస్తుత భారత జట్టు ప్రదర్శనపై అంచనాకు రావొద్దు. అక్కడ శ్రీలంక బలహీనంగా ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి కఠినమైన విదేశీ పర్యటనల తరువాత మాత్రమే విరాట్ గ్యాంగ్ పై అంచనా రావాలి. భారత్ కు కఠినమైన విదేశీ టూర్ ముందుంది. మన విదేశాల్లో ప్రదర్శన చూడటానికి అది నాకు ఒక అవకాశం. నేను ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటా. ప్రస్తుత జట్టు అద్భుతాలు చేస్తుందని చెబితే, అంతకుముందు ఎటువంటి అద్భుతాలు చేయలేదనా?, భారత క్రికెట్ లో చాలా వాస్తవాల్ని రవిశాస్త్రి మరచిపోయినట్లు ఉన్నాడు. గతంలో నీవు భారత్ కు ఆడిన సంగతి గుర్తు లేదా?, నిన్ను నీవు అగౌరవపరచుకుంటావా?, గత జట్టులో నీకు భాగం లేదా?', అలా చెప్పడం నీకే అవమానం' అని అజహర్ ధ్వజమెత్తాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ట్రాక్ లపై భారత్ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూద్దాం అని పేర్కొన్న అజహర్.. ప్రస్తుత శ్రీలంక జట్టు చాలా బలహీనమైన జట్టు అనే వాస్తవాన్నిరవిశాస్త్రి అంగీకరించాలంటూ హితబోధ చేశాడు. -
కుంబ్లేకు మాజీ కెప్టెన్ మద్దతు
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లేకు భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ మద్దతుగా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి గుడ్ బై చెప్పి కుంబ్లే సరైన నిర్ణయం తీసుకున్నాడని అజహర్ అభిప్రాయపడ్డాడు. ఈ పదవి నుంచి కుంబ్లే అర్థాంతరంగా వైదొలగడానికి అతను ఆత్మభిమానాన్ని చంపుకుని పని చేయడం ఇష్టలేకపోవడమే ప్రధాన కారణం కావొచ్చన్నాడు. ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వైఖరిని పరోక్షంగా అజహర్ తప్పుబట్టాడు. 'అనిల్ కుంబ్లే ఆత్మాభిమానం చంపుకోకుండా పదవి నుంచి వైదొలిగాడు. కుంబ్లే అలా తప్పుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కల్గిన అతనికి ఈ విధంగా జరిగి ఉండకూడదు. కుంబ్లేది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. బహుశా.. ఆత్మాభిమానం వదులుకోవడం కంటే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడమే మంచిదని కుంబ్లే భావించి ఉంటాడు. ఏది ఏమైనా కుంబ్లే తీసుకున్న నిర్ణయం సరైనదే'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. -
అజహర్ మొబైల్ గేమ్ ఆవిష్కరణ
ముంబై: భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పేరుతో 3–డి మొబైల్ గేమ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బిగ్కోడ్ గేమ్స్’ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. బుధవారం జరిగిన 3–డి గేమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ మాజీ సారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంబ్లే నిష్క్రమణ, రవిశాస్త్రి వ్యాఖ్యలు, తనపై, శ్రీశాంత్‌పై నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. ‘కోచ్‌గా అనిల్ కుంబ్లే అవమానకరంగా నిష్క్రమించడం నన్ను బాధించింది. అనిల్ నాకు బాగా తెలుసు. ఒకరు వేలెత్తి చూపే వ్యక్తిత్వం కాదతనిది. జట్టుకు మేలు చేయాలని తపించేవాడు తప్ప చేటు చేసే వ్యక్తి కాదు. తన ఆత్మ గౌరవం కోసమే స్వయంగా తప్పుకున్నాడు. ఇది మంచి నిర్ణయమే’ అని అన్నాడు. భారత క్రికెట్లో కోహ్లి జట్టే అత్యుత్తమమన్న రీతిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మాట్లాడిన తీరును అజహర్ తప్పుబట్టారు. ‘అప్పటి జట్టు వేరు. ఈ జట్టు వేరు. ఇవి సమకాలీన జట్లు కానే కావు. రెండు భిన్న తరాలకు చెందిన జట్లను పోల్చడం సహేతుకం కాదు. అప్పటి బౌలర్లు, ప్రత్యర్థులు, పరిస్థితులు అన్నీ వేరు. అలాంటి జట్లను పోల్చడమేంటి? నిజానికి శాస్త్రి కూడా అప్పటి జట్టులో సభ్యుడే. అంటే తనను కూడా తక్కువ చేసుకున్నట్లే కదా’ అని అన్నారు.తనకు బోర్డు నుంచి రావాల్సిన పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు సమస్య త్వరలోనే సమసి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోర్డుతో తనకెలాంటి శత్రుత్వం లేదని న్యాయం కోసమే కోర్టుమెట్లు ఎక్కానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ హోదా గల పదవిలో ఉన్న జి.వివేక్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని చెప్పారు. ఇక్కడ జీతం తీసుకుంటున్నారా లేదా అన్నది అనవసరమన్నారు. -
టీమిండియాలో వారిద్దరినీ పక్కనపెట్టాలి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సూచించాడు. తుది జట్టు నుంచి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌లను తొలగించి వారి స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నాడు. 'టీమిండియా సిరీస్‌ను ఓడిపోతుందని చెప్పడం లేదు. భారత్‌కు గెలిచే అవకాశాలున్నాయి. రెండో టెస్టుకు జట్టులో రెండు మార్పులు చేయడం మేలని భావిస్తున్నా. తుది జట్టు నుంచి జయంత్, ఇషాంత్‌లను తొలగించాలి. భారత్ బ్యాటింగ్ ప్రదర్శనను పరిశీలిస్తే ఓ ఎక్స్ ట్రా బ్యాట్స్‌మన్ అవసరం. కరుణ్ నాయర్‌ను ఆడిస్తే బాగుంటుంది. జయంత్ స్థానంలో అతన్ని బరిలో దించాలి. అలాగే మ్యాచ్‌లు ఆడబోయే పిచ్‌లను బట్టి ఇషాంత్‌కు బదులు భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలి' అని అజర్ అన్నాడు. తొలి మ్యాచ్ లో భారత్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. -
ధోనీపై వేటా..? ఇంత అవమానమా??
-
ధోనీపై వేటా..? ఇంత అవమానమా??
రానున్న ఐపీఎల్లో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీపై వేటు వేసిన రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ తీరుపై మాజీ టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది చెత్త నిర్ణయమని, ధోనీని తీవ్రంగా అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు. 'నిర్ణయం తీసుకున్న తీరు, దానిని అమలుపరుచిన విధానం చెత్తగా, తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. భారత క్రికెట్ ఆణిముత్యం ధోనీ. తన 8-9 ఏళ్ల కెప్టెన్సీలో అతను అన్నింటినీ సాధించాడు. మా సొంత డబ్బుతో జట్టును నడిపిస్తున్నామని, కాబట్టి మాకు నచ్చిన నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీ అనుకొని ఉండొచ్చు. కానీ ధోనీని కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికేటప్పుడు అతని ప్రతిష్టను, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. గౌరవప్రదంగా అతనిని తప్పించి ఉంటే బాగుండేది. ఒక మాజీ క్రికెటర్‌గా ఫ్రాంచైజీ తీరు ఆగ్రహం, బాధ కలుగుతోంది' అని అజారుద్దీన్ 'ఆజ్‌తక్'తో పేర్కొన్నారు. -
కెప్టెన్ గానూ కోహ్లి రికార్డులు
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల పరంపర కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో విజయంతో మరో ఘనత అతడి ఖాతాలో చేరింది. మహ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ గా కోహ్లి 15వ విజయం సాధించడంతో ఈ రికార్డు తన పేరిట చేరింది. ఎంఎస్ ధోని, గంగూలీ తర్వాత విజయవంతమైన మూడో భారత కెప్టెన్ గా అతడు నిలిచాడు. కోహ్లి వరల్డ్ సెకండ్ బెస్ట్ కోహ్లి ఇప్పటివరకు 23 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ 23 మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకుంటే భారత కెప్టెన్లలో కోహ్లి ఉత్తమ నాయకుడిగా ఖ్యాతికెక్కాడు. ఓవరాల్ గా సెకండ్ బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. స్టీవ్ వా ముందున్నాడు. 23 టెస్టుల్లో అతడు 15 విజయాలు అందించాడు. రెండిటిలో టీమిండియా ఓడింది. 6 డ్రా అయ్యాయి. స్టీవ్ వా 17 విజయాలు విజయాలు అందించాడు. -
అజహరుద్దీన్ న్యాయ పోరాటం
ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులను కొట్టేయండి కేసు తేలే వరకు ఫలితాలు వెల్లడి కాకుండా చూడండి సాంకేతిక కారణాలతో నా నామినేషన్‌ను తిరస్కరించారు హైకోర్టులో పిటిషన్... విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల విషయంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం అడ్వొకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు జిల్లా, సెషన్స జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తేలేంత వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ జరిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కింది కోర్టు ఉత్తర్వులున్నాయని అజహరుద్దీన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కింది కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో పిటిషనర్ సైతం ప్రతివాదిగా చేరారని వివరించారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పిటిషనర్ హెచ్‌సీఏ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారని, అయితే రిటర్నింగ్ అధికారి సాంకేతిక కారణాలతో నామినేషన్ ఇవ్వడానికి తిరస్కరించారన్నారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు పిటిషనర్ అన్ని విధాలుగా అర్హులని, ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలిపినా అతను పట్టించుకోలేదన్నారు. నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రిటర్నింగ్ అధికారి అందుకు కారణాలను మాత్రం వివరించలేదన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా, ఓటర్ల వివరాలు ప్రచురించకుండా, ఎన్నికల అధికారులను నియమించకుండా, లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి ఎన్నికలను నిర్వహించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కింది కోర్టును తప్పుదోవ పట్టించి ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు తీసుకొచ్చారన్నారు. కోర్టు ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన మాజీ క్రికెటర్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో తన నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ దరఖాస్తును రిటర్నింగ్ అధికారి కే రాజీవ్ రెడ్డి తిరస్కరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అజార్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసిందా? లేదా? ఆయన హెచ్‌సీఏ ఓటరు అవునా? కాదా? అన్నది స్పష్టత లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్టు తెలిపారు. అయితే, దీనిని తప్పుబడుతూ అజార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2000 సంవత్సరంలో భారత క్రికెట్ ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజారుద్దీన్ ప్రమేయం ఉందంటూ ఆయనపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడాలని అజార్ నిర్ణయించారు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి ఎంతవరకు అర్హులన్నది తెలియకపోవడం వల్లే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయినదని ఆయూబ్ ఖాన్ అంటున్నారు. ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికలు కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీపడగా.. అందులో జి వివేకానంద్, విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వివాదాల నేపథ్యంలో హైకోర్టు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముంది. -
అజహర్ నామినేషన్ తిరస్కరణ
కోర్టుకెక్కనున్న మాజీ కెప్టెన్! హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఎన్నికలకు ముందే చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అతను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ప్రకటించారు. ‘తిరస్కరణకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేసిందని రుజువు చేసే పత్రాలేవీ ఆయన ఇవ్వలేకపోయారు. నిషేధం తొలగిస్తున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే ఆయన చూపించారు. కానీ నేను అదే విషయంలో బీసీసీఐ ఇచ్చిన డాక్యుమెంట్లు అడిగాను. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్లో అజహర్ ఓటింగ్ హక్కు గురించి కూడా స్పష్టత లేకపోవడం మరో కారణం’ అని రాజీవ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. అజహర్ తీవ్ర అసంతృప్తి... తన నామినేషన్‌ను తిరస్కరించడం అంటే లోధా ప్యానెల్ సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లే అని అజహర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ టెస్టు క్రికెటర్ ఎవరైనా పదవుల కోసం పోటీ పడవచ్చు. నా దరఖాస్తును తిరస్కరించడం గురించి స్పష్టత ఇవ్వమంటూ రిటర్న్ అధికారిని ఎన్ని సార్లు కోరినా ఆయన స్పందించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో సౌకర్యాలు పొందుతున్న జి.వివేకానంద్‌కు నిబంధనల ప్రకారం అసలు పోటీ పడే అర్హతే లేదు. కానీ ఆయన దరఖాస్తును సరైనదిగా తేల్చారు. భారత మాజీ కెప్టెన్‌తో ఈ రకంగా వ్యవహరించడం దుర్మార్గం. అసలు హెచ్‌సీఏలో మొత్తం ఒక వర్గం కుట్ర జరిపి ప్రజాస్వామ్యవిరుద్ధంగా ఎన్నికలు జరుపుకుంటున్నారు. నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తా. ఈ పరిణామాలపై ఇప్పటికే లోధా కమిటీకి లేఖ రాశా’ అని అజహర్ వ్యాఖ్యానించారు. -
అజారుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌పై అజరుద్దీన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్‌సీఏ నూతన కార్యదర్శి శేషు నారాయణ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తన నామినేషన్ తిరస్కరించారన్న ఆక్రోశంతోనే అజహర్ మాట్లాడుతున్నారన్నారు. వివేక్‌పై అజహర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాగే వివేక్‌కు అనర్హత వర్తించదని శేషు నారాయణ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి అజహర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజహర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. -
'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'
-
'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'
హైదరాబాద్ : హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరించడంపై మొహమ్మద్ అజహరుద్దీన్ స్పందించారు. మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం అజహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. చదవండి...(అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ) తన నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదన్న ఆయన... కేబినెట్ ర్యాంక్ పదవిలో కొనసాగుతున్న వివేక్ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. కార్యదర్శి పదవి విషయంలోనూ నిబంధనలు పక్కనపెట్టారని, లోథా కమిటీ నియమాలు మిగతా వారికి వర్తించవా అంటూ ప్రశ్నలు సంధించారు. క్రికెట్ కు మంచి చేయాలనే తాను నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. తన నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అజహర్ తెలిపారు. కాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
-
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి ఆయన వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. -
హైదరాబాద్ రాతను మారుస్తా!
సాక్షి, హైదరాబాద్: దశాబ్ద కాలం పాటు భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు అందించిన మొహమ్మద్ అజహరుద్దీన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్‌తో బంధం కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్ పరిపాలనపై ఆసక్తితో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో తొలిసారి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల బరిలోకి దిగిన అజహర్ మంగళవారం అధ్యక్ష పదవి కోసం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ రంజీ క్రికెటర్ వంకా ప్రతాప్ తదితరులతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారి రాజీవ్‌రెడ్డికి సంబంధిత పత్రాలు అందజేశారు. హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న ‘నేషనల్ క్రికెట్ క్లబ్’ తరఫున అజ్జూ నామినేషన్ వేశారు. ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్ మళ్లీ వెలగాలి... తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే క్రికెటేతర అంశాలు కాకుండా కేవలం ఆటపైనే దృష్టి పెడతానని అజహర్ అన్నారు. చాలా కాలంగా ఇక్కడ క్రికెట్‌కే ప్రాధాన్యత దక్కడం లేదని, పరిస్థితిని మార్చేందుకే తాను పరిపాలనలోకి అడుగు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ క్రికెట్ ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. నేను క్రికెట్‌కు సేవ చేద్దామనుకుంటున్నాను. హెచ్‌సీఏలో అవినీతి కారణంగా ఆటను పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలనేదే నా కోరిక’ అని అజహర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ముగ్గురు క్రికెటర్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోకుండా హెచ్‌సీఏ ఆపలేకపోయిందన్న అజ్జూ, టెస్టు నిర్వహించేందుకు హెచ్‌సీఏ వద్ద నిధులు లేవంటూ వచ్చిన వార్తల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బోర్డు భారీగా ఇచ్చే నిధులు ఏమయ్యాయో తెలీదు. ఇక్కడ బంధుప్రీతి కూడా చాలా ఎక్కువగా ఉంది. అండర్–14 జట్టులో కూడా ప్రతీ మ్యాచ్‌కు ఆరుగురిని మార్చడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడిదంతా గతం కావాలి. నేను మార్పు తీసుకొస్తా’ అని ఈ మాజీ కెప్టెన్ స్పష్టం చేశారు. బీసీసీఐ అంగీకరిస్తుందా? అజహర్ నామినేషన్ అనగానే ముందుగా చర్చకు వచ్చిన అంశం అతనిపై కొనసాగుతున్న నిషేధం. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో 2000లో అతడిపై బోర్డు నిషేధం విధించింది. 2012లో అది చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినా, బోర్డు మాత్రం నిషేధం ఎత్తివేతపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని బోర్డు కార్యక్రమాలకు అజహర్‌ను ఆహ్వానించినా, గత ఏడాది రంజీ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీలో కొంత మంది క్రికెటర్లు అజహర్‌ను కలవడంతో గట్టిగా మందలించింది కూడా. కాబట్టి అజహర్ భవిష్యత్తు కార్యకలాపాలకు బోర్డు వంద శాతం ఆమోదముద్ర వేయలేదనేది తెలుస్తోంది. అయితే నాటి కోర్టు తీర్పును బోర్డు సవాల్ చేయకపోవడమే నిషేధం తొలగినట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు. ‘హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో బోర్డు నిషేధం అంశం అడ్డు రాదని నమ్ముతున్నా. నాలుగేళ్ల క్రితమే కోర్టు నిషేధాన్ని తొలగించింది కాబట్టి సమస్య లేదు’ అని అజహర్ దీనిపై స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే అజహర్ అర్హతపై స్పష్టత కోరుతూ హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్, లోధా కమిటీకి లేఖ రాయగా, ఇంకా వారి నుంచి స్పందన రాలేదు. అర్హత ఉందా? నిషేధం అంశాన్ని పక్కన పెడితే మరోవైపు ఎన్నికలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు కూడా అజహర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. హెచ్‌సీఏ నియమావళి ప్రకారం అధ్యక్ష పదవికి ముందు సదరు వ్యక్తి ఈసీ సభ్యుడిగా, ఆఫీస్ బేరర్‌గా పని చేసి ఉండాలి. తాను ఏ క్లబ్ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాడో అక్కడి నుంచి అతనికి ఓటు హక్కు ఉండాలి. ఓటర్ల జాబితాకు ఈనెల 8 ఆఖరు తేదీ కాగా... అప్పటికి అజహర్ ఓటర్‌గా నమోదు చేయించుకోకపోగా, సదరు నేషనల్ క్లబ్ నుంచి ఓటరుగా మరో వ్యక్తి పేరు అప్పటికే ఉంది. లోధా సంస్కరణలతో ఇటీవలే పదవి కోల్పోయిన అర్షద్ అయూబ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ పాత నిబంధనలన్నీ చెల్లకుండా పోతాయని, మాజీ ఆటగాళ్లు నేరుగా పోటీ పడవచ్చనే నిబంధనతోనే అజహర్ ముందుకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే సుప్రీం ఆదేశించిన విధంగా ముఖ్యమైన తొమ్మిది అంశాలు మినహా రాష్ట్ర సంఘాలు నియమావళి ఒక్కసారిగా మారిపోదని, వాటిని అమలు చేస్తూనే తమ సొంత నియమావళిని పాటించవచ్చని అయూబ్ చెబుతున్నారు. ఎన్నికలు జరిగేనా? ఒకవైపు ఇంత హడావిడి సాగుతుండగా అసలు ఈ నెల 17న ఎన్నికలు జరగడమే సందేహంగా మారింది. ఈ ఎన్నికను నిలిపేయాలంటూ హెచ్‌సీఏ కార్యదర్శి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎలక్టోరల్ అధికారి నియామకం నుంచి ఈసీ సమావేశం నిర్వహణ, ఓటర్ల జాబితా వెల్లడి తదితర అంశాలన్నింటిలో సుప్రీం నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అందుకే ఎన్నికలు ఆపమని కోరుతున్నాం’ అని జాన్ చెప్పారు. వాస్తవానికి డిసెంబర్ 23న రంగారెడ్డి ఐదో అడిషనల్ చీఫ్ జడ్జి ఉత్తర్వుల మేరకు ఈ ఎన్నిక జరిపేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. కానీ ఆ తర్వాత జనవరి 2న సుప్రీం కోర్టు తీర్పు రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ నెల 19న సుప్రీం కోర్టు బోర్డులో కొత్త అధికారులను నియమించనుంది. ఆ తర్వాతే రాష్ట్ర సంఘాలు ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని, ఆలోగా ఎన్నికలు జరపడం నిబంధనలకు విరుద్ధమని ఒక వర్గం వాదిస్తోంది. తాజా పిటిషన్ నేడు (బుధవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పిటిషన్ వేసిన జాన్ మనోజ్ మాత్రం తన వర్గంతో సహా ముందు జాగ్రత్తగా నామినేషన్లు కూడా దాఖలు చేయడం విశేషం! -
నా గెలుపుపై నమ్మకం ఉంది
-
నా గెలుపుపై నమ్మకం ఉంది:అజహరుద్దీన్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం అజహర్ తన నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అజహరుద్దీన్.. తన గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోవు హెచ్‌సీ ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. లోధా సిఫారుల మేరకే తాను నామినేషన్ వేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఏ అనేది నగరాలకే పరిమితమైందన్న అజహర్.. తన గెలుపు కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు కోరనున్నట్లు తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయకపోవడం గమనార్హం. -
హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ పరిపాలనలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ పడేందుకు అతను సిద్ధమవుతున్నాడు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఇటీవల 500వ టెస్టులో సన్మానం సహా గతంలోనూ కొన్ని బోర్డు కార్యక్రమాలకు ఆహ్వానించినా... అజహర్ పదవులు చేపట్టడంపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎన్నికల్లో పోటీ చేయడం అనే అంశం మళ్లీ వివాదం రేపే అవకాశం ఉంది. మరోవైపు అజహర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడొకరు నిర్ధారించారు. ‘హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని అజహర్ నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు నిర్ణయంపై బోర్డు అప్పీల్‌కు వెళ్లలేదు కాబట్టి ఆ తీర్పును గౌరవించినట్లే. పోటీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. భారత్ తరఫున అజహర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. -
బీసీసీఐ నిర్ణయం భేష్..
న్యూఢిల్లీ:అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేయడంపై మాజీ ఆటగాళ్లు హర్హం వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు భారత మాజీ కెప్టెన్లు మొహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీలు స్పష్టం చేశారు. 'నేను ఆడుతున్న రోజుల నుంచి డీఆర్ఎస్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం డీఆర్ఎస్ విధానం అప్పటికంటే చాలా మెరుగ్గా ఉంది. దాంతో బీసీసీఐ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వెనకడుగు వేయలేదు. అందుకు కారణం కూడా లేదనే అనుకుంటున్నా. ఇంగ్లండ్ తో డీఆర్ఎస్ను పరీక్షించాలనే నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందే' అని గంగూలీ తెలిపాడు. 'భారత జట్టు ఇప్పటికే డీఆర్ఎస్ టెక్నాలజీని వాడుకోవాల్సింది. ఈ టెక్నాలజీకి అప్పట్లో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అనేక మ్యాచ్‌లను దగ్గరగా వచ్చి కోల్పోయాం. కాస్త ఆలస్యమైనా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఇది ఒక మంచి ఆలోచన'అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ ను అమలు చేయాలని నిర్ణయించింది. గతంతో పోలిస్తే డీఆర్ఎస్లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్ఎస్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది.దీనిపై బీసీసీఐ అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. -
అజహర్‌కు ఆలస్యంగా ఆహ్వానం..
కాన్పూర్: మరో ఐదు రోజుల్లో న్యూజిలాండ్‌తో జరుగనున్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌కు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు ఆహ్వానం అందింది. తొలుత ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అజహర్ పేరును పక్కను పెట్టిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).. అనేక తర్జన భర్జనల అనంతరం ఈ మాజీ కెప్టెన్‌ను ఆహ్వానించడానికి నిర్ణయించింది. అజహర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉండటమే అతని పేరును ముందుగా పరిశీలించకపోవడానికి ప్రధాన కారణం. అయితే అజహర్‌ను పిలవకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ పేరెంట్ బాడీ.. ఆలస్యంగా అతనికి ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి ముందుగా మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్, చందు బోర్డే, దిలీప్ వెంగసర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, అజిత్ వాడేకర్లకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. కాగా, అజహర్ ను ఆహ్వానించే క్రమంలో బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని సవరించుకున్నారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు 500వ టెస్టు జరుగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌ను వేడుకలా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత మాజీ కెప్టెన్లను ఆహ్వానించడంతో పాటు '500వ టెస్టు' అని ముద్రించిన వెండి నాణంతో టాస్ వేయాలని నిశ్చయించారు. ఈ మేరకు అజహర్ ను ఆహ్వానించిన విషయాన్ని సీనియర్ బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా ధృవీకరించారు. అజహర్ ను పిలవడంలో ఎటువంటి తప్పిదం జరగలేదంటూ ఆయన తెలిపారు. అయితే చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కు సచిన్, వెంగసర్కార్, శ్రీకాంత్, అజహర్లు హాజరు కావడానికి ఇప్పటికే అంగీకారం తెలపగా, అజిత్ వాడేకర్ మాత్రం అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని బోర్డుకు తెలిపినట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. -
'23 ఏళ్ల తరువాత పెళ్లి చూపులు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన పెళ్లి చూపులు సినిమాకు ఇంకా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లను సాధించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ సినిమాను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి సినిమా చూసిన అజారుద్ధీన్ 'చాలా కాలం నుండి మా అబ్బాయి అబ్బాస్ తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు చూడమని చెపుతున్నాడు. నేను కూడా చాలా రోజులుగా చూద్దామని అనుకున్నా.. కానీ ఇప్పటికి కుదిరింది. పెళ్లిచూపులు సినిమా చాలా బాగుంది. దాదాపు 23 ఏళ్ల తరువాత తెలుగు సినిమా చూశా. చాలా ఏళ్ల క్రితం ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమాను వైజాగ్‌లో చూశా.. తరువాత ఇన్నేళ్లకు పెళ్లి చూపులు చూశాను. నాకు బాగా నచ్చింది' అన్నారు. -
అజహరుద్దీన్ కుమారుడితో... ‘ఇద్దరికీ కొత్తగా’
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అబ్బాస్ హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తగా’. చిత్తూరుకు చెందిన కొత్త దర్శకుడు కె.సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. లొకేషన్లను చూసుకోవడానికి మంగళవారం చిత్తూరులోని పలు ప్రాంతాలను హీరో, దర్శకుడు పరిశీలించారు. హీరో అబ్బాస్ మాట్లాడుతూ, ‘‘మా నాన్న ప్రోత్సాహంతోనే వెండి తెరపైకి వస్తున్నా. సంగీతా బిజ్లానీ ఆంటీ నాకు స్ఫూర్తి. నాన్న బయోగ్రఫీ ఆధారంగా రూపొందించిన ‘అజహర్’కు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. హైదరాబాదీని కావడంతో తొలి సినిమా తెలుగులో చేయాలని దర్శకుడు సురేష్‌బాబు చెప్పిన కథకు ఓకే చెప్పాను’’ అని చెప్పారు. ‘‘తెలుగుతో పాటు హిందీలో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. -
మూడో పెళ్లి వార్తలపై అజారుద్దీన్ స్పందన
-
మాజీ క్రికెటర్ 'అజహర్' షూటింగ్ ప్రారంభం
ముంబై: పేదరికంలో పుట్టాడు.. రోజూ సైకిల్ మీద వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయ జట్టులో స్థానం పొందాడు. విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని జీవితకాల నిషేధానికి గురయ్యాడు..కోర్టు తీర్పుతో విముక్తుడయ్యాడు. ఇలా ట్విస్టుల మీద ట్వీస్టులతో డ్రామాకు ఏమాత్రం తగ్గని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితగాధ 'అజహర్' టైటిల్ తో వెండితెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైనట్లు అజహర్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ ట్విట్ చేశాడు. 'అజహర్ జర్నీని ప్రారంభించాం.. మాకు విజయం చేకూరాలని విష్ చేయండి' అంటూ నెటిజన్లను అభ్యర్థించాడు. మే 13, 2016న విడుదల కానున్న ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఏక్తాకపూర్ నిర్మాత. -
'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు'
ముంబై: తన జీవితంలో మూడు ముఖ్య ఘట్టాలను తెరపై ఆవిష్కరించినా అభ్యంతరం లేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజహర్' సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్, పెళ్లి ఘట్టాలు చూపించారు. అయితే వీటిని చూపించడంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అజహర్ పేర్కొన్నాడు. తన జీవితంలోని మూడు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో తెరక్కించారని తెలిపాడు. ఈ సినిమా స్ర్కిప్ట్ చదివానని చెప్పాడు. టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన 'అజహర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదల చేశారు. అజహరుద్దీన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మి నటించాడు. ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మించారు. -
టీమిండియాకు సెహ్వాగ్ శుభాకాంక్షలు
గుర్గావ్: వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు తమ టైటిల్ నిలబెట్టుకోవాలంటూ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘డిఫెండింగ్ చాంపియన్‌గా మన జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ టోర్నీలోనూ బాగా ఆడి టైటిల్ నిలబెట్టుకుని తద్వారా వంద కోట్లకు పైగా భారతీయులకు అమితానందం కలిగించాలి’ అని స్థానికంగా జరిగిన ప్రపంచకప్ ట్రోఫీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ అన్నాడు. బౌలింగ్ గురించే ఆందోళన: అజహర్ చండీగఢ్: ప్రపంచకప్ కోసం బరిలోకి దిగబోతున్న భారత క్రికెట్ జట్టు సమతూకంతోనే ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగం గురించే ఆందోళనగా ఉందని మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ‘15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టు బాగానే ఉంది. అయితే బౌలింగ్ విభాగం ఏమేరకు రాణిస్తుందనేది ఆసక్తికరం. ముక్కోణపు సిరీస్ కూడా ముగిశాక ఏమేరకు ప్రత్యర్థులకు సవాల్ విసరగలరో తెలిసిపోతుంది’ అని చండీగఢ్‌లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించిన 51 ఏళ్ల అజహర్ సూచించారు. జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు కఠినంగా వ్యవహరించారని అన్నారు. -
ఒక్క మ్యాచ్‌తో నిర్ణయించలేం
కోహ్లి కెప్టెన్సీపై అజహర్ అభిప్రాయం న్యూఢిల్లీ: ఒక్క మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి నాయకత్వ లక్షణాలపై అంచనాలకు రావొద్దని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. రెగ్యులర్ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం వల్ల ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం కావడంతో విరాట్ కోహ్లికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ టెస్టు ఫలితం ద్వారా కోహ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోని గాయం కారణంగా దూరమయ్యాడు కాబట్టే అతడికి ఈ అవకాశం దక్కింది. అందుకే ఈ ఒక్క మ్యాచ్‌తో మనం అతడి కెప్టెన్సీని అంచనా వేయలేం. ముందు కోహ్లిని ఒంటరిగా వదిలేయాలి. అందరికీ తన బ్యాటే సమాధానం చెబుతుంది. వాస్తవానికి ఆసీస్‌కన్నా మన జట్టే బలంగా ఉంది. వార్నర్‌తో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆటగాళ్లు ఆ జట్టులో లేరు. ఇలాంటి పరిస్థితిలో మన జట్టు గెలవకుంటే నేను నిరాశపడతాను’ అని అజహర్ తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడడమే అన్నింటికన్నా ముఖ్యమని భారత ఆటగాళ్లకు సూచించారు. -
రాజస్థాన్ నుంచి అజారుద్దీన్ పోటీ
న్యూఢిల్లీ: 58 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. పలువురు కేంద్ర మంత్రులకు సీట్లు ఖరారు చేశారు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో జైలుకు వెళ్లొచ్చిన సురేష్ కల్మాడీకి మొండిచేయి చూపారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పూణె స్థానాన్ని విశ్వజీత్ కదంకు కేటాయించారు. చాందినీచౌక్ నుంచి కపిల్ సిబల్, న్యూఢిల్లీ నుంచి అజయ్‌మాకెన్, వాయవ్య ఢిల్లీ నుంచి క్రిష్టతీర్థ్ పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఈసారి రాజస్థాన్‌లోని టోంక్ సావా మధోపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొర్దాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత అజిత్జోగీకి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ సీటు కేటాయించారు. మోడీపై వారణాసిలో పోటీ చేసే అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది. -
అజారుద్దీన్ పాత్రలో హష్మి
బాలీవుడ్లో డర్టీ పిక్చర్, పాన్ సింగ్ తోమార్, భాగ్ మిల్కా భాగ్ చిత్రాల తర్వాత జీవిత కథల నేపథ్యం ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకుంది. తాజాగా బాక్సర్ మేరి కోమ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఓ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. అదే ఊపులో క్రికెటర్ అజారుద్దీన్ బయోపిక్‌గా ఓ చిత్రంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అజార్ పాత్రకోసం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మిల పేర్లను పరిశీలించారు. అయితే చిట్టచివరకు ఆ అవకాశం ‘సీరియల్ కిస్సర్’ హష్మీని వరించింది. స్వతహాగా క్రీడలంటే ఇష్టపడే హష్మీ... తనకు అజారుద్దీన్ పాత్ర దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రీడాకారుడిగానే కాకుండా ఎంపీగా సేవలందిస్తున్న అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, భార్యతో విడాకులు, ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోవడం లాంటి అనేక ఆసక్తికర అంశాలు ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రానికి నిర్మాత అని సమాచారం. -
బాలీవుడ్ తెరపై అజారుద్దీన్ గా అజయ్ దేవగన్?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథా చిత్రాల జోరు పెరిగింది. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అయితే అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ లో ఏ హీరోతో చేయించాలనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. తెరపై అజారుద్దీన్ పాత్రను పోషించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ పాత్ర అజయ్, ఇమ్రాన్ లలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.