
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత మీడియాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ తప్పుబట్టాడు. ఒక కెప్టెన్‌గా తన నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి కానీ మాటలతో ఎదురుదాడి చేయడం కోహ్లికి ఎంతమాత్రం తగదన్నాడు.
'కోహ్లి ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి గుర్తుంచుకోవాలి. జట్టు గురించి ఏ నిర్ణయమైనా తీసుకునేది అతడే కాబట్టి ఎవరైనా అతడ్నే ప్రశ్నిస్తారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పు. మీడియా అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వు. ఆ క్రమంలోనే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. అంతేకానీ సహనాన్ని కోల్పోవడం ఎంతమాత్రం సరికాదు. సమాధానం చెప్పలేకపోతే కూల్‌గా ఉండాల్సింది' అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment