జోరు కొనసాగనీ... | India And South Africa Ready For The Second Test | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగనీ...

Published Thu, Oct 10 2019 3:11 AM | Last Updated on Thu, Oct 10 2019 4:48 AM

India And South Africa Ready For The Second Test - Sakshi

భారత జట్టు సొంతగడ్డపై 2013నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్కటి ఓడిపోయింది. ఆ ఒక్క పరాజయం పుణే మైదానంలోనే వచి్చంది. 2017లో ఆ్రస్టేలియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఒ కీఫ్‌ దెబ్బకు విలవిల్లాడిన టీమిండియా ఏకంగా 333 పరుగులతో  చిత్తయింది. ఇప్పుడు రెండున్నరేళ్ల విరామం తర్వాత అదే పుణే తర్వాతి టెస్టుకు ఆతిథ్యమిస్తోంది.

భారత జట్టు తాజా ఫామ్, దక్షిణాఫ్రికా ఇటీవలి పేలవ ప్రదర్శన చూస్తే కచి్చతంగా గత ఫలితం మాత్రం పునరావృతం కాదనిపిస్తోంది. తొలి టెస్టులో ఘనవిజయంతో ఆధిక్యంలో నిలిచిన కోహ్లి సేన... ఇక్కడా మ్యాచ్‌ గెలిచి మరో టెస్టుకు ముందే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో చేతులెత్తేసిన సఫారీలు ఇక్కడైనా పోటీనిస్తారేమో చూడాలి.

పుణే: వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ షిప్ మొదలయ్యాక ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయాలు సాధించిన భారత్‌ 160 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు దీనిని మరింత పటిష్టపరచుకునే క్రమంలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమైంది. ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరిగే పోరులో పైచేయి సాధిస్తే 2–0తో టెస్టు సిరీస్‌ భారత్‌ సొంతమవుతుంది. విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన డు ప్లెసిస్‌ బృందం అదే స్ఫూర్తితో పట్టుదల కనబరిస్తే మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఎదురు కావచ్చు.  

అదే జట్టుతో...
వైజాగ్‌ టెస్టులో భారత ప్రదర్శన చూసిన తర్వాత జట్టులో మార్పుల గురించి అసలు ఆలోచనే రాదు. మీడియా సమావేశంలో కోహ్లి కూడా దాదాపు ఇదే మాట చెప్పాడు. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రెండు శతకాలతో చెలరేగిన రోహిత్‌ శర్మ తన దూకుడును కొనసాగిస్తే మళ్లీ పరుగుల వరద పారడం ఖాయం. డబుల్‌ సెంచరీతో సత్తా చాటిన మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా అమితోత్సాహంతో ఉన్నాడు. వైజాగ్‌లో రెండో ఇన్నింగ్స్‌తో పుజారా తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలనని నిరూపించాడు. కెప్టెన్‌ కోహ్లి స్థాయి బ్యాట్స్‌మన్‌ ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా...ఇటీవల టెస్టుల్లో అతడినుంచి భారీ స్కోర్లు రాకపోవడం ఆశ్చర్యకరం.

గత ఐదు టెస్టుల్లో అతని సగటు 36.50 మాత్రమే.ఈ మ్యాచ్‌లో అతను తనదైన శైలిలో పరుగులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విండీస్‌లో సెంచరీ సాధించిన రహానే మరో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌గా జడేజా తన పాత్రకు అద్భుతంగా న్యాయం చేస్తే పునరాగమనంలో అశి్వన్‌ తన విలువేంటో చూపించాడు. తెలుగు ఆటగాడు విహారి కూడా మరో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పేస్‌ బౌలింగ్‌లో షమీ, ఇషాంత్‌ జోడీని ఎదుర్కోవడం సఫారీలకు అంత సులువు కాదు.  

అదనపు పేసర్‌తో...
ప్రత్యరి్థతో పోలిస్తే దక్షిణాఫ్రికా పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అటు బ్యాటింగ్‌ తడబడుతుండగా, ఇటు బౌలింగ్‌ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అయితే ఆ జట్టుకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను బట్టి చూస్తే పెద్దగా మార్పులకు కూడా అవకాశం లేదు. గత మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ఎల్గర్‌ రెండో ఇన్నింగ్స్‌లో విఫలం కావడం ఆ జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. రెండో ఇన్నింగ్స్‌లో మార్క్‌రమ్‌ పట్టుదలగా ఆడాడు. తొలి టెస్టు అనుభవంతో ఈ ఇద్దరు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలని సఫారీ టీమ్‌ కోరుకుంటోంది. కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో కూడా నమ్మదగ్గ బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం ఆ జట్టు బలహీనతగా కనిపిస్తోంది. డి బ్రూయిన్, బవుమా ఇద్దరూ స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. అవసరమైతే కెపె్టన్‌ డు ప్లెసిస్‌ ఐదో స్థానంనుంచి ముందుకు మారే అవకాశం ఉంది. డి కాక్‌పై కూడా భారం ఉంది.

బౌలింగ్‌లో ఎంతో నమ్ముకున్న రబడ గత టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు.మరో పేసర్‌ ఫిలాండర్‌ కూడా ఆరంభంలో కొద్ది సేపు మినహా ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయాడు. వీరికి తోడు ఈ టెస్టులో ఇన్‌గిడిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన ఆఫ్‌స్పిన్నర్‌ పీట్‌ స్థానంలో ఇన్‌గిడి వస్తాడు. ఆల్‌రౌండర్‌ ముత్తుసామి మరోసారి కీలక ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉన్నాడు. జట్టులో ఆందోళనపరిచే విషయం లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ వైఫల్యం. గత ఏడాది శ్రీలంకలో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి ప్రధాన స్పిన్నర్‌గా మారిన కేశవ్‌... భారత్‌ను దెబ్బ తీయగలగడని ఆ జట్టు భావించింది. కానీ అతను రికార్డు స్థాయిలో పరుగులిచ్చుకున్నాడు. ఇక్కడైనా అతను రాణిస్తే పరిస్థితి మెరుగవుతుంది.  

పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు ముందు రోజైతే పిచ్‌పై కాస్త పచి్చక కనిపిస్తోంది. ఆరంభంలో కొంత సమయం మాత్రం పేసర్లకు సహకరించవచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలం. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. పుణేలో వరుసగా వానలు కురుస్తున్నాయి. బుధవారం సాయం త్రం కూడా నగరంలో భారీ వర్షం పడింది.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, విహారి, సాహా,
జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెపె్టన్‌), ఎల్గర్, మార్క్‌రమ్, డి బ్రూయిన్, బవుమా,
డి కాక్, ఫిలాండర్, రబడ, ఇన్‌గిడి, ముత్తుసామి, మహరాజ్‌

►50కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇది 50వ టెస్టు. అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం  వహించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ (49)ని అధిగమిస్తాడు. 60 టెస్టులతో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.

►వ్యక్తిగత ప్రదర్శనల గురించి జట్టు ప్రయోజనాల గురించి అందరు ఆటగాళ్లు ఆలోచించే విధంగా మా టీమ్‌ ఎదగడం సంతోషంగా ఉంది. షమీకి ఇలా బౌలింగ్‌ చేయాలంటూ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బంతి చేతికిస్తే చాలు పరిస్థితిని బట్టి బౌలింగ్‌ చేయగలడు. జడేజా, అశి్వన్‌ ఉన్నప్పుడు తనకు చోటు దక్కదనే విషయం కుల్దీప్‌కు కూడా తెలుసు. మా జట్టు కూర్పు చాలా బాగుంది కాబట్టి పిచ్‌ ఎలా ఉన్నా పట్టించుకోం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విదేశాల్లో మ్యాచ్‌ గెలిచినప్పుడు రెట్టింపు పాయింట్లు ఇస్తే బాగుంటుందనేది నా సూచన
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement