
రాంచీ: శనివారం నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, బౌలర్ ఇషాంత్ శర్మ పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ ఆప్షనల్ కావడంతో సారథి కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. నేడు జరిగే ప్రాక్టీస్‌లో జట్టు భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. అంతకు ముందు ఉదయం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొన్నారు.