Cheteshwar Pujara
-
BGT: ‘నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచిన టీమిండియా దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత మైదానంలో దిగనుంది. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌లో వెళ్లనున్న ఈ టూర్లో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.వరుస ఓటములుకెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit Sharma)కు, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇది విషమ పరీక్ష కానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ అత్యుత్తమంగా కొనసాగుతున్నా.. కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం తేలిపోతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో సత్తా చాటితేనే రోహిత్- గంభీర్ జోడీకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమని చెప్పాడు. అంతేకాదు.. ఆసీస్‌తో టెస్టుల్లో తాను ఆడి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లమని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘క్రికెటర్‌గా జాతీయ జట్టుకు ఆడాలని నాకూ ఉంటుంది. ఇంగ్లండ్‌తో తదుపరి టెస్టు సిరీస్‌కు నేనైతే సిద్ధంగానే ఉన్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తూనే ఉన్నాను.ఒకవేళ జట్టుకు నా అవసరం ఉంటే.. కచ్చితంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. దేశవాళీ క్రికెట్లో నేను విరామం లేకుండా ఆడుతూనే ఉన్నాను. అంతేకాదు.. గత రెండేళ్లుగా కౌంటీల్లోనూ ఆడుతున్నా. భారీ స్థాయిలో పరుగులు రాబడుతున్నా.నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లంకాబట్టి నాకు గనుక ఈసారి అవకాశం వస్తే కచ్చితంగా.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా’’ అని పుజారా రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఆసీస్‌కు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం గురించి ప్రస్తావన రాగా.. ‘‘అవును.. నేను నమ్మకంగా చెప్పగలను.. ఒకవేళ నేను జట్టులో ఉంటే కచ్చితంగా మేము హ్యాట్రిక్ కొట్టేవాళం. ఇందులో సందేహమే లేదు’’ అని పుజారా పేర్కొన్నాడు.ఇక సొంతగడ్డపై ఆడటం ఇంగ్లండ్‌కు సానుకూల అంశమే అయినా ఈసారి టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయిన తర్వాత ఆ జట్టు బలహీనపడింది. వారిద్దరు తుదిజట్టులో లేకుంటే ప్రత్యర్థి జట్టుకు మంచిదే కదా! ఈసారి టీమిండియా కచ్చితంగా మంచి స్కోర్లతో విజయం సాధిస్తుంది’’ అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు.కాగా విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆసీస్‌లో టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గడంలో ఛతేశ్వర్ పుజారాది కీలక పాత్ర. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ ‘నయా వాల్’కు అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా అతడు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఆడాడు. ఆస్ట్రేలియాతో నాటి పోరులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత పుజారా దేశీ, కౌంటీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
పాపం పుజారా.. ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర దిగ్గజం ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క పరుగు దూరంలో 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.పుజారా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఏ బ్యాటర్‌కైనా ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్రను పటిష్ట స్ధితిలో ఉంచాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి పుజారా పెవిలియన్‌కు చేరాడు.కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 109 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 442 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హర్విక్ దేశాయ్(130), చిరాగ్ జానీ(80) రాణించారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్..ఇక ఇప్పటివరకు 276 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 66 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఛతేశ్వర్.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరగా భారత్ తరపున 2023 ఏడాదిలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు.పాపం రహానే..మరోవైపు మేఘాలయతో జరుగుతున్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు. నఫీస్ సిద్ధిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే తన వికెట్‌ను కోల్పోయాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రహానే టీమ్ ప్రస్తుతం 172 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్‌లో ఆఖరిది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసీస్‌తో సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్‌లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్‌లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్‌ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. గత తొమ్మిది టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కేవలం మూడే విజయాలు సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చేదు అనుభవాలు చవిచూసింది.స్వదేశంలో ఘోర పరాభవంస్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి ఇంతటి ఘోర పరాభవం చవిచూసిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ పరాభవాన్ని మరిపించేలా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో రాణించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.ఆసీస్‌లో శుభారంభం చేసినా..ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఆసీస్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. కానీ.. రోహిత్ శర్మ జట్టుతో చేరిన తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.వరుస ఓటములతోఆసీస్తో అడిలైడ్ టెస్టులో ఓడిన టీమిండియా.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే, మెల్బోర్న్ టెస్టులో మాత్రం చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుని.. 184 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా హీటెక్కినట్లు సమాచారం. రోహిత్, గంభీర్‌పై చర్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపక్రమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.అతడి కోసం పట్టుబట్టిన గంభీర్..ఆసీస్ పర్యటనకు టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను ఎంపిక చేయాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. అయితే, సెలక్టర్లు మాత్రం అతడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత అయినా.. పుజారాను పిలిపిస్తే బాగుంటుందని గంభీర్ సూచించినా.. మేనేజ్మెంట్ మాత్రం అతడి మాటను పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్రకాగా పుజారాకు ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర ఉంది. 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పుజారా 1258 బంతులు ఎదుర్కొని.. 521 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21 సీజన్లోనూ రాణించాడు. ఇక ఓవరాల్‌గా కంగారూ గడ్డపై పుజారా పదకొండు మ్యాచ్‌లు ఆడి 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు.ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆఖరిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 14, 27 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీల్లో, దేశీ రంజీల్లో రాణిస్తున్నాడు. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?ఈ నేపథ్యంలోనే పుజారా గురించి గంభీర్ ప్రస్తావించగా.. సెలక్టర్లు మాత్రం అతడి పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గౌతీ మాట చెల్లడం లేదని.. త్వరలోనే అతడిపై వేటు తప్పదనే వదంతులు వ్యాపిస్తున్నాయి.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా
భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా మరోసారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తాచాటాడు. పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 348 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 22 ఫోర్లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 18వ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాకుండా పుజారా ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనతను సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా పూజారా నిలిచాడు. ఈ జాబితాలో పూజారా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అదే విధంగా ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పూజారా నాలుగో స్ధానానికి ఎగబాకాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(37) అగ్రస్ధానంలో ఉండగా .. తర్వాతి స్ధానాల్లో వాలీ హమండ్(36), హెన్రడన్(22), పూజారా(18) కొనసాగుతున్నారు. -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్‌క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
పుజారా మెరుపు సెంచరీ.. రీ ఎంట్రీకి 'సై'
రంజీట్రోఫీ 2023-24 సీజన్లో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజరా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. పుజారా తాజాగా మరో ఫస్ట్ క్లాస్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్దంగా టీ20 తరహాలో ఆడాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ప్రస్తుత సీజన్లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన పుజారా 77 సగటుతో తో 673 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. కాగా పుజారా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చివరిగా భారత తరపున ఆడాడు. అయితే పుజారా ప్రస్తుత ఫామ్‌ను చూస్తే రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా భారత్ తరపున టెస్టుల్లో పుజారాకు ఘనమైన రికార్డు ఉంది. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ఆయనొక టీమిండియా మాజీ కెప్టెన్.. ఇదేనా మీరేచ్చే గౌరవం? -
‘టీమిండియా స్టార్ రవీంద్ర జడేజాకు సన్మానం’
Ind vs Eng Test Series 2024: ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా స్వదేశంలో భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. ఈ క్రమంలో వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఇందుకు బదులు తీర్చుకుంది. బదులు తీర్చుకున్న టీమిండియా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరిగిన టెస్టులో రోహిత్ సేన స్టోక్స్ బృందాన్ని 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టు టీమిండియా- ఇంగ్లండ్‌లకు కీలకంగా మారింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా టీమిండియా స్టార్లు ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలకు ఇది సొంతమైదానం. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) కీలక ప్రకటన చేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు ఈ ఇద్దరు క్రికెటర్లను సన్మానించనున్నట్లు తెలిపింది. ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు పుజారా, జడేజా చేస్తున్న సేవలకు గానూ వారిని సముచితంగా గౌరవించనున్నట్లు తెలిపాడు. 100 టెస్టుల వీరుడు టీమిండియా నయవాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా వందకు పైగా టెస్టులు ఆడాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదమూడో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టెస్టుల్లో టీమిండియా సాధించిన పలు చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయినా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ-2024లో అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా జడేజా టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న రవీంద్ర జడేజా.. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హోంగ్రౌండ్లో జరిగే మూడో మ్యాచ్‌కు జడ్డూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఇలా జడేజా గొప్ప స్థాయిలో ఉండగా.. అతడి తండ్రి అనిరుద్‌సిన్హ జడేజా.. జడ్డూతో తమకు కొన్నేళ్లుగా మాటలే లేవంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కోడలి వల్లే ఇలా జరుగుతోందంటూ ఇంటిగుట్టును రచ్చకెక్కించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: మాజీ కోచ్ వార్నింగ్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న ఈ కుర్ర బ్యాటర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోగా.. గిల్ వన్‌డౌన్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్... మూడో స్థానంలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలోనూ శుబ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలి టెస్టులో మొత్తంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. వైజాగ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పుజారా నుంచి వారి స్థానానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది. రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్‌తో సత్తా చాటుతున్న పుజారా ఎల్లప్పుడూ సెలక్టర్ల దృష్టిలోనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికగా ఆడాల్సి ఉంటుంది. సహనం లేకుంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఆండర్సన్ వంటి క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో ఆడుతున్నపుడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అంటూ గిల్ పేరెత్తకుండానే.. అతడికి పుజారా రూపంలో పోటీ ఉందంటూ రవిశాస్త్రి హెచ్చరికలు జారీ చేశాడు. కాగా వైజాగ్ టెస్టులో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో మూడో స్థానంలో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇటీవలే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇరవై వేల పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్విశతకంతోనూ చెలరేగి సత్తా చాటాడు. గత కొంతకాలంగా తనను పక్కన పెట్టిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆటతో సత్తా చాటుతున్నాడు ఈ నయావాల్. -
అతడి ఖేల్ ఖతం?!.. టీమిండియా సెలక్టర్లు ఏమైనా అనుకోని...
Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం. ఇక తన కెరీర్లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్‌లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్‌ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు. పరుగుల వరద పారించడమే పని ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు. Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5 — Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024 కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
శతక్కొట్టిన పుజారా.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
Ranji Trophy 2023-24- Saurashtra vs Jharkhand: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను సెంచరీతో ఆరంభించాడు. జార్ఖండ్‌తో శనివారం నాటి ఆటలో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ శతక్కొట్టాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ సెంచరీలు బాదుతూ ఎప్పటికప్పుడు తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నో ఛాన్స్ ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న పుజారా.. ఆ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తుదిపోరులో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడి డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. పుజారా టీమిండియా తరఫున ఆడిన ఆఖరి టెస్టు ఇదే. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి ఈ క్రమంలో మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పుజారా.. తాజాగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో శుక్రవారం మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో భాగంగా శనివారం సెంచరీతో మెరిశాడు. వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతున్న ఈ ‘నయా వాల్’ తన శతకాన్ని ద్విశతకంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. పుజారా 157 నాటౌట్ జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో చెలరేగడంతో జార్ఖండ్‌ను 142 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు. వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ అర్ధ శతకం(54)తో రాణించగా.. అర్పిత్ వసవాడ కూడా హాఫ్ సెంచరీ(68) చేశాడు. ఇక పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. అతడికి తోడుగా ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పటిష్ట స్థితిలో ఉనాద్కట్ బృందం ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. పుజారా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా జార్ఖండ్ మీద ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
రంజీ ట్రోఫీకి సర్వం సిద్దం.. బరిలో సీనియర్ క్రికెటర్లు
దేశంలోని వివిధ నగరాల్లో భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి శుక్రవారం తెర లేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. ఎలైట్ డివిజన్లో 32 జట్లు... ప్లేట్ డివిజన్లో 6 జట్లు ఉన్నాయి. ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో విశాఖపట్నంలో బెంగాల్‌తో ఆంధ్ర జట్టు... ప్లేట్ డివిజన్లో నాగాలాండ్ జట్టుతో హైదరాబాద్ తలపడతాయి. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
నిన్న రహానే.. ఇప్పుడు పుజారా! కన్ఫ్యూజన్లో అభిమానులు
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత ఇద్దరు సీనియర్ క్రికెటర్ల పేర్లు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వారెవరో కాదు.. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా. టెస్టు స్పెషలిస్టులైన ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉత్తమంగా రాణించిన రికార్డు వీరికి ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 85 టెస్టులు ఆడిన ముంబై బ్యాటర్ రహానే 5077 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలోనే ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన మ్యాచ్ జరిగింది. ఇక ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా రహానే చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. మరోవైపు.. తన కెరీర్లో ఇప్పటిదాకా భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా జూన్‌లో అతడు ఆఖరిసారి టీమిండియాకు ఆడాడు. అయితే, దేశవాళి క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఆడుతూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరిని గనుక సౌతాఫ్రికాతో టెస్టులకు ఎంపిక చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Ranji Trophy prep mode: 🔛 pic.twitter.com/kFN3PyvTHx — Cheteshwar Pujara (@cheteshwar1) December 30, 2023 ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడేందుకు తాను సన్నద్ధం అవుతున్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో అతడు రెడ్ బాల్‌తో కాకుండా వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. రహానే సైతం శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. ‘‘విశ్రాంతి లేని రోజులు’’ అంటూ రంజీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. కాగా టెస్టుల్లో అపార అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్నా టీమిండియా సెలక్టర్లు తమను పక్కన పెట్టడాన్ని రహానే- పుజారా చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. No rest days 🏏 pic.twitter.com/EM218MqMhK — Ajinkya Rahane (@ajinkyarahane88) December 29, 2023 ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ భారత జట్టులో చోటే లక్ష్యంగా వీరిద్దరు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. చదవండి:Rohit Sharma: ఘనంగా రోహిత్ గారాలపట్టి సమైరా బర్త్‌డే.. వీడియో వైరల్ -
అతడి వల్లే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో టెస్టులు గెలిచాం.. కానీ: భజ్జీ
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసిన విధానం అస్సలు బాగోలేదంటూ పెదవి విరిచాడు. విదేశీ గడ్డపై రాణించగల సత్తా ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను పక్కన పెట్టి తప్పుచేశారని విమర్శించాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేయాలన్న రోహిత్ సేనకు ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడటంతో పాటు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను సెలక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండానే ఛతేశ్వర్ పుజారాను తప్పించారు. వీరిద్దరు ఎలాంటి పిచ్‌లపైనైనా పరుగులు రాబట్టగల సమర్థులు. పుజారా రికార్డులు గమనిస్తే.. కోహ్లి మాదిరే జట్టు కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. అయినా.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి టెస్టు క్రికెట్లో పుజారా కంటే అత్యుత్తమమైన బ్యాటర్ మనకూ ఎవరూ లేరు. అతడు నెమ్మదిగా ఆడతాడన్నది వాస్తవం.. అయితే, మ్యాచ్ చేజారిపోకుండా కాపాడగలుగుతాడు. కేవలం అతడి కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ వల్లే ఈమాత్రం సాధ్యమైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరీ 131 పరుగులే చేసింది. ఒకవేళ కోహ్లి కాంట్రిబ్యూషన్ గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేది. నిజానికి ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది’’ అంటూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 101 పరుగులు చేయగా.. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 76 రన్స్ తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
కోహ్లి సెంచరీపై పుజారా సంచలన వ్యాఖ్యలు! రాహుల్ ఎందుకలా? జట్టుకు నష్టం..
ICC ODI WC 2023- Kohli 78th Century: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023.. బంగ్లాదేశ్‌తో పుణెలో మ్యాచ్.. లక్ష్య ఛేదనలో టీమిండియా జోరు చూస్తే గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సెంచరీ సెంచరీలకు మరో ముందడుగు పడే అవకాశం.. ఛేజింగ్‌లో 36 ఓవర్ల తర్వాత జట్టు విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... కోహ్లి అప్పటికి 68 పరుగుల వద్ద ఉన్నాడు. తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ 6, 4 సహా 12 పరుగులు చేయడంతో ఈ అంతరం మరింత తగ్గింది. మరుసటి ఓవర్ తర్వాత టీమిండియా గెలవాలంటే 28 పరుగులు, కోహ్లి సెంచరీకి 27 పరుగులు కావాలి. ఇద్దరు ప్రధాన బ్యాటర్లు క్రీజ్‌లో ఉంటే ఒక్కడే పరుగులు చేయడం దాదాపుగా జరగదు. కానీ తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో సమస్య లేదు కాబట్టి ఈ దశలో కోహ్లి శతకం పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించాడు. అతడి ఆలోచనకు తగ్గట్లుగా రాహుల్ కూడా పరుగులు చేయకుండా వెనక్కి తగ్గాడు. సింగిల్స్ తీసే అవకాశమున్నా కోహ్లి- రాహుల్ పరస్పర సమన్వయంతో ముందుకు సాగారు. ఫలితంగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 78వ శతకం సాధ్యమైంది. తర్వాతి 32 పరుగుల్లో కోహ్లి ఒక్కడే 30 పరుగులు సాధించగా రాహుల్ సింగిల్ మాత్రమే తీశాడు. మరో పరుగు వైడ్ రూపంలో వచ్చింది. నసుమ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది విరాట్ కోహ్లి శతక(103- నాటౌట్) గర్జన చేశాడు. ఫ్యాన్స్ సంబరాలు.. మరోవైపు విమర్శలు దీంతో కింగ్ కోహ్లి అభిమానులతో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే, రాహుల్ కోహ్లికి సహకరించిన తీరు, వైడ్ విషయంలో అంపైర్ వ్యవహరించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కోహ్లి స్వార్థంగా వ్యవహరించాడని కొందరు.. అంపైర్ కావాలనే టీమిండియా బ్యాటర్‌కు సహకరించాడని మరి కొందరు విమర్శలు గుప్పించారు. కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా భిన్నంగా స్పందించాడు. వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించే కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలంటూ కోహ్లి తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘విరాట్ కోహ్లి శతకం సాధించాలని నేనెంతగా కోరుకున్నానో.. వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించాలని కూడా అంతగా కోరుకున్నాను. ఎందుకంటే.. ఇలాంటి మెగా టోర్నీల్లో నెట్ రన్‌రేటు ఎంతో కీలకం. జట్టు గురించి కూడా ఆలోచించాలి.. త్యాగం చేయాలి అగ్రస్థానంలో నిలవాలంటే... నెట్ రన్‌రేటు కోసం మనం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అలాంటపుడు జట్టు గురించే మనం మొదట ఆలోచించాలి. పరస్పర అవగాహనతోనే ఇలా జరిగి ఉండొచ్చు. అయితే, ఒక్కోసారి జట్టు కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మన కెరీర్లో ఓ మైలురాయిని అందుకునేందుకు జట్టు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు. మైండ్‌సెట్‌ను బట్టే ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్న హక్కు ఆటగాడిగా మనకు ఉంటుంది. అయితే, కొంతమంది తాము ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇదంతా కేవలం ఆటగాడి మైండ్‌సెట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఛతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తనకైతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ కంటే నెట్ రన్‌రేటు పెంచుకోవడమే ముఖ్యమైనదిగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల మైలురాళ్ల కోసం చూస్తే ఒక్కోసారి జట్టు నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లిని ఉద్దేశించి పుజారా చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అయితే.. ‘‘జట్టు ప్రయోజనాల గురించి విరాట్‌కు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ పుజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్‌పై విజయంతో వరల్డ్‌కప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసినప్పటికీ.. న్యూజిలాండ్(4 విజయాలు) కంటే రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Aus: ససెక్స్‌ను వీడి..! రోహిత్, బుమ్రాలతో రాజ్‌కోట్‌కు పుజారా..
Ind vs Aus 3rd ODI- Pujara With Jasprit Bumrah and Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచి టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో జయకేతనం ఎగుర వేసిన భారత జట్టు 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తదితరులు లేకుండానే కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోని దిగిన టీమిండియా.. ఆసీస్‌కు షాకులిచ్చింది. ముఖ్యంగా రెండో వన్డేలో ఫామ్‌లేమితో కొట్టుమిట్టాడుతున్న శ్రేయస్ అయ్యర్ ఏకంగా సెంచరీతో మెరవడం సానుకూలాంశంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో రోహిత్, కోహ్లి, హార్దిక్ తదితరులు విశ్రాంతి విరమించి మైదానంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. రోహిత్‌తో పాటు బుమ్రా... పుజారా కూడా అదే విమానంలో ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా బుధవారం నాటి మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో వారిని కలిశాడు. రోహిత్, బుమ్రా మధ్యన కూర్చున్న పుజ్జీ ఆ ఫొటోను మంగళవారం.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చాలాకాలంగా జట్టుకు దూరమైన పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న విషయం తెలిసిందే. సస్పెన్షన్ కారణంగా ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న పుజారా.. 8 మ్యాచ్‌లలో అతడు 649 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, జట్టు క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా అతడిపై ఇటీవల సస్పెన్షన్ పడింది. దీనిపై ససెక్స్ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన పుజారా ఇంటికి తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విమానంలో వస్తుండగా ఇలా అనుకోకుండా సహచర ఆటగాళ్లను కలిశాడు. చదవండి: WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే! View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) -
సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 113 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో పుజారాకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. పుజారా అద్భుత సెంచరీ ఫలితంగా.. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ససెక్స్ విజయం సాధించింది. 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. పుజారాతో పాటు టామ్ ఆల్సోప్(60) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సోమర్సెట్ బ్యాటర్లలో ఉమీద్, కర్టిస్ కాంఫర్ సెంచరీలతో మెరిశారు. సెలక్టర్లకు వార్నింగ్.. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విఫలమకావడంతో పుజారాపై భారత సెలక్టర్లు వేటు వేశారు. దీంతో వెస్టిండీస్‌తో టెస్టులకు అతడిని ఎంపికచేయలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని పుజారా లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో కూడా పుజారాను జట్టు నుంచి సెలక్టర్లు ఊద్వసన పలికారు. దీతో ఈ కౌంటీల్లోనే అదరగొట్టి.. మళ్లీ భారత జట్టులోకి అతడు పునరాగమనం చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ.. "నేను ఎక్కడ ఆడినా నా వంతు 100 శాతం ఎఫక్ట్ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. భారత్‌కు మరో మూడు నెలల పాటు ఎటువంటి టెస్టు మ్యాచ్‌లు లేవు. డిసెంబర్లో మళ్లీ దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం. అంతకంటే ముందు నేను ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌పై దృష్టిపెడతాను. అక్కడ రాణించి మళ్లీ జట్టులోకి రావడమే నా లక్ష్యమని" పుజారా పేర్కొన్నాడు. రాయల్ లండన్ వన్డే కప్-2023లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పుజారా 302 పరుగులు చేశాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. హెడ్‌కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి? A superstar indeed, @tregs140 🌟 Cheteshwar Pujara is just inevitable.#MBODC23 pic.twitter.com/lG7Tfxx8gg — Metro Bank One Day Cup (@onedaycup) August 11, 2023 -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్‌ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
Ind vs WI: అతడొక్కడే కాదు.. వాళ్లు కూడా విఫలం.. కానీ పాపం..
Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు. స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినపుడు వికెట్ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?! ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్‌ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.. ఛతేశ్వర్ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుబ్‌మన్ గిల్(13, 18) ఆకట్టుకోలేకపోయారు. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన అజింక్యా రహానే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. కాగా అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేది ఎవరనే దానిపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్లులో యశస్వి జైశ్వాల్ అరంగేట్రం ఖాయంగా కనబడుతోంది. పుజారా స్థానమైన మూడో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చేది జైశ్వాల్ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇదే విషయమై రహానే మాట్లాడుతూ.. ''కచ్చితంగా పుజారా స్థానంలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. పుజారా లోటును తీర్చడానికి మూడో స్థానం కాలకం. ఈ కీలక స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఎవరిదనేది చెప్పలేను. కానీ అతనికి(యశస్వి జైశ్వాల్‌కు) మంచి చాన్స్. ఇప్పుడున్న యంగ్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్నవాడు. మొత్తానికి జైశ్వాల్ టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్లో ఆడడం సంతోషం కలిగిస్తోంది. డొమొస్టిక్ క్రికెట్లో ముంబై తరపున.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున బాగా ఆడాడు. గతేడాది దులీప్ ట్రోపీలోనూ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు చూపించాలని కోరుకుంటున్నా. అతని బ్యాటింగ్ తీరు చూడముచ్చటగా ఉంది. స్థానం కాదు ముఖ్యం.. ఏ స్థానంలోనైనా వచ్చి బ్యాటింగ్ చేయగల సత్తా జైశ్వాల్‌ది. చాలా సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రహానేను ఇంటర్య్వూ చేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక 21 ఏళ్ల జైశ్వాల్‌కు ఫస్ట్‌క్లాస్ కెరీర్లో మంచి బ్యాటింగ్ యావరేజ్ ఉంది. గత 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జైశ్వాల్ 1845 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మది సెంచరీలు, రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023లోనూ జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థశతకాలు ఉన్నాయి. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎! When #TeamIndia Captain @ImRo45 turned reporter in Vice-Captain @ajinkyarahane88's press conference 😎 What do you make of the questions 🤔 #WIvIND pic.twitter.com/VCEbrLfxrq — BCCI (@BCCI) July 11, 2023 చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే? -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్‌లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్‌మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్‌లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్‌లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శించాడు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "విండీస్‌తో టెస్టులకు ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు. అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే. పుజారా కెరీర్ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు? -
వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు?: సునీల్ గవాస్కర్
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే విండీస్‌తో టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్, నయావాల్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్లో నయావాల్‌గా పేరుగాంచిన పూజారాను పక్కన పెట్టడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది భారత ఆటగాళ్లు విఫలమైనా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ గవాస్కర్ మండిపడ్డాడు. "పుజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు? టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు? పుజారా భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు సైలెంట్‌గా ఉండి భారత జట్టును ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కేవలం అతనికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పూజారాని తప్పించారని అనిపిస్తోంది. సరే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా సరిగ్గా ఆడలేదని జట్టు నుంచి తప్పించారు.. మరి మిగితా ఆటగాళ్లు కూడా ఫెయిలయ్యారు కదా వారి పరిస్ధితి ఏంటి? అయినా జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. పుజారా గత కొంత కాలంగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి అతడి రెడ్‌బాల్ క్రికెట్లో మరింత అనుభవం పెరిగింది. రెడ్‌బాల్ క్రికెట్‌పై అతడికి పూర్తి అవగహన ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ ఉంటే 39-40 సంవత్సరాల వయస్సు వరకు ఆడవచ్చు. పూజారాకి కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింకా రహానే మినహా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగా ఆడలేదు. అయినా కేవలం పుజారాను మాత్రమే ఎందుకు బలిచేశారో సెలక్టర్లు సమాధానం చెప్పాలంటూ" స్పోర్ట్స్ టూడేతో మాట్లాడుతూ సన్నీ ఫైరయ్యాడు. చదవండి: Ind Vs WI 2023: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ ఆడాడు. కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్‌తో మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్! అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు! -
గిల్ నేర్చుకుంటున్నాడు.. కానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శల వర్షం కురిపించాడు. చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా బౌల్డయ్యాడు. అంతకుముందు అదే రీతిలో బోలాండ్ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. "పుజారా లాంటి సీనియర్ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు. అందుకు తగ్గ ప్రతిఫలం అనువభవించాడు. ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్ స్టంప్పైనే ఉండిపోయింది. కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజరాకు ఏమైంది" అని కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్ ఉందా? కనీసం డ్రా అయినా -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
పుజారా మీదే ఆశలు..!
-
ప్రాక్టీస్‌కు సొంత కారులో వచ్చిన పుజారా.. ఆశ్చర్యపోయిన జడేజా!
జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫైనల్ కోసం రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్లు పుజారా, రవీంద్ర జడేజా మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కాగా పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో సస్సెక్స్ తరపున ఆడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో పుజారా శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అయితే పుజారా మాత్రం ప్రాక్టీస్ చేసే స్టేడియానికి జట్టు ప్రయాణించే బస్సులో కాకుండా.. తన సొంత కారులో చేరుకున్నాడు. అప్పటికే స్టేడియంకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్న రవీంద్ర జడేజా.. కారులో ఒక్కసారిగా పుజారా చూసి ఆశ్చర్యపోయాడు. అతడి దగ్గరికి వెళ్లి నిజంగానే పుజారా భాయ్ వచ్చాడా? అని గట్టిగా నవ్వుతూ అన్నాడు. ఇక పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్ షిప్లో 6 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 545 పరుగులు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా టీమిండియా నిలవాలంటే పుజారా పాత్ర చాలా కీలకం. చదవండి: WTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు Fun fact - Rohit Sharma, Cheteshwar Pujara and Ravindra Jadeja made their List-A debut in the same match and for the same team!! pic.twitter.com/0HCgNB9WZs — Aryan 45 🇮🇳 (@Iconic_Rohit) June 2, 2023 -
ఆసీస్ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం
WTC Final 2021-23- Ind Vs Aus: పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2023 ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్‌తో ఊగిపోయిన అభిమానులకు.. క్రికెట్లోని అసలైన మజా అందించేందుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో మెగా ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 11 వరకు నిర్వహించనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. వారిద్దరే కీలకం ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా.. 15 మందితో కూడిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా, ఆసీస్ మాజీ క్రికెటర్లు తుది జట్లపై అంచనాలు వేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే ఉంటుందని, వారిని త్వరగా పెవిలియన్‌కు పంపే వ్యూహాలతో ముందుకు వస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ అంటే పూనకాలే కాగా టీమిండియా నయావాల్ పుజారాకు ఆస్ట్రేలియా మీద మెరుగైన రికార్డు ఉంది. ఆసీస్‌తో ఆడిన 24 టెస్టుల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 2033 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం. మరోవైపు.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయ క్రికెట్లో ఆసీస్‌తో 24 మ్యాచ్‌లలో కోహ్లి 1979 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అతడి అత్యధిక స్కోరు 186. స్వదేశంలో ఇటీవల జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా కోహ్లి సెంచరీతో మెరిశాడు. విరాట్, పుజారాలను త్వరగా అవుట్ చేయాలని ఇక అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 75 సెంచరీలు నమెదు చేసిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2023లో వరుసగా రెండు శతకాలు బాది ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్లో సత్తా చాటిన అతడు.. టెస్టుల్లోనూ రాణించేందుకు నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా విరాట్ గురించే చర్చిస్తుంది. అతడిని ఎలా అవుట్ చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. అదే విధంగా పుజారా గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరిని త్వరగా పెవిలియన్‌కు పంపాలనే యోచనలో ఉంటారు. ఆస్ట్రేలియా మీద పుజారాకు మంచి రికార్డు ఉంది. నిజానికి ఓవల్ పిచ్ కూడా ఆసీస్ పిచ్‌లలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తారు’’ అని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్లు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్. చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్! -
WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్‌గా అతడే! ద్రవిడ్‌తో కలిసి వాళ్లంతా..
WTC Final 2023: సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా మేటి జట్లు టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. రహానే వచ్చేశాడు ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7-11 మధ్య ఈ మెగా ఫైట్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, వైస్ కెప్టెన్‌గా మాత్రం ఇంత వరకు ఎవరి పేరును ఖరారు చేయలేదు. ఐపీఎల్-2023లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. పుజారాలలో ఎవరో ఒకరిని రోహిత్ డిప్యూటీని చేస్తారంటూ చర్చించుకుంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. అధికారిక ప్రకటన అప్పుడే అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇంతవరకు పుజారా నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఐసీసీకి ఫైనల్ జట్టు గురించి వివరాలు సమర్పించే సమయం(మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్‌గా మెన్షన్ చేయనున్నారు. ససెక్స్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం’’ అని పేర్కొన్నారు. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా పుజారా పేరు ఖరారు కానుందని తెలిపారు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన పుజారా.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్బుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు సెంచరీలతో వరుసగా 115, 35, 18, 13, 151, 136 & 77 పరుగులతో సూపర్ ఫామ్ కనబరిచిన పుజారా.. ససెక్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు సహచర ఆటగాడిగా ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ సందర్భంగా ఎప్పటిలానే ప్రత్యర్థులుగా మారనున్నారు. కాగా మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్‌కు చేరుకోనుండగా.. పుజారా కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న.. శార్దూల్ ఠాకూర్(కేకేఆర్), ఉమేశ్ యాదవ్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తదితరులు ద్రవిడ్ కలిసి మే 23నే లండన్‌కు పయనం కానున్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు -
కెప్టెన్‌గా అదుర్స్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హోవ్ వేదికగా డర్హామ్‌తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్లో బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజరా టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలివర్ కార్టర్(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే!
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులతో దుమ్మురేపిన కోహ్లి.. వన్డేల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడు. తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కోహ్లి రెండో వన్డేలో మాత్రం 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినసంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా బుధవారం ఇరుజట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 షోకి అతిథిగా హజరయ్యాడు. ఈ షోలో విరాట్ కోహ్లికి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు నువ్వు చూసిన వారిలో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరిగెత్తే బెస్ట్ రన్నర్ ఎవరు.. అలాగే వరస్ట్ రన్నర్ ఎవరు అని అడిగాడు. ''నా దృష్టిలో ఎంఎస్ ధోని కంటే ఏబీ డివిలియర్స్ బెస్ట్ రన్నర్ అని చెబుతాను. వాస్తవానికి ధోనికి, నాకు చాలామంచి టెంపో ఉంటుంది. మాహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే నేను సింగిల్ కోసం కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుడ్డిగా కళ్లు మూసుకుని పరిగెత్తొచ్చు. అయితే వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఏబీ డివిల్లియర్స్ తర్వాతే ఎవరైనా అని కచ్చితంగా చెప్పగలను.అతను నాకంటే వేగంగా వికెట్ల మధ్య పరిగెడతాడు. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమోనని భయపడ్డాను. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడంలో వరస్ట్ రన్నర్ అంటే చతేశ్వర్ పూజారా. అతన్ని నమ్మి పరుగెట్టాలంటే భయమేస్తుంది.పూజారాకి ఓపిక చాలా ఎక్కువ. క్విక్ సింగిల్స్ తీయాల్సిన అవసరం ఏముందని అతను నమ్ముతాడు. అందుకే పూజారాతో బ్యాటింగ్ చేస్తే అతను పిలిచే దాకా నాన్‌స్ట్రైయికింగ్‌లో పడుకోవచ్చు.. అంత టైమ్ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించాం. సెంచురియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అనుకుంటా. నేను పెద్దగా పరుగులు చేయకుండానే డగౌట్‌కు చేరాను. నేను అలా వెళ్లి కూర్చొన్నాను లేదో సౌతాఫ్రికా శిబిరంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మిడాన్ దిశగా ఆడిన పుజారా పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. ఎన్గిడి అనుకుంటా పుజారాను ఔట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పార్థివ్ పటేల్ గల్లీ దిశలో ఆడాడు. పుజారా పరుగుకు పిలవడంతో పటేల్ వెళ్లాడు. అయితే క్వినైన్ బంతిని అందుకొని పుజారా క్రీజులోకి రాకముందే బెయిల్స్ ఎగురగొట్టాడు. దీంతో పుజారా ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కు వచ్చిన పుజారాకు చివాట్లు పెట్టాను.'' అంటూ గుర్తుచేసుకున్నాడు. Join me live on “the 360 show” 60min from now. Hit the link below or find it in my bio. We have a cool show lined up! https://t.co/P0fRiTAkiA pic.twitter.com/DhHsZ62ODT — AB de Villiers (@ABdeVilliers17) March 21, 2023 చదవండి: ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం? -
'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా'
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్‌లు శతకాలతో విరుచుకుపడగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్లు సెంచరీలు చేశారు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికి తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. తద్వారా వరుసగా నాలుగోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమిండియా తమవద్దే అట్టిపెట్టుకుంది. ఈ విషయం పక్కనబెడితే ఆట ఆఖరిరోజున చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ స్పెషలిస్ట్‌లుగా ముద్రపడిన పుజారా, గిల్ చేతికి బంతినిచ్చి వారిచేత బౌలింగ్ చేయించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. పుజారా బౌలింగ్‌పై అశ్విన్.. ఇలా అయితే ఎలా.. నేను బౌలింగ్ జాబ్ వదిలేయాలా? అని చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అశ్విన్ కామెంట్‌పై పుజారా స్పందించాడు. ''లేదు.. నాగ్‌పూర్ టెస్టులో నేను ఆడాల్సిన మూడోస్థానంలో నువ్వు బ్యాటింగ్‌కు వచ్చావు. అందుకు కృతజ్ఞత చెప్పాలనే ఇలా చేశాను'' అంటూ ఫన్నీగా స్పందించాడు. ఆ వెంటనే అశ్విన్ మరో ట్వీట్ చేశాడు.. ''పుజారా నీ ఉద్దేశం ప్రశంసించేలా ఉంది.. కానీ ఇలా తిరిగి ఇచ్చేస్తావని నేను ఊహించలేదు'' అని తెలిపాడు. దీనిపై పుజారా మరో ట్వీట్ చేశాడు. ''నీకు మంచి విశ్రాంతినిస్తా.. భవిష్యత్తులో ఎప్పుడైనా వన్‌డౌన్‌లో నువ్వు వచ్చేందుకు సాయపడతా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ జడేజాతో కలిసి సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లు పడగొడితే.. జడేజా 22 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 17 నుంచి ఆరంభం కానుంది. Nahi. This was just to say thank you for going 1 down in Nagpur 😂 https://t.co/VbE92u6SXz — Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023 Giving you enough rest so that you can go 1 down again if needed in the future 😂 https://t.co/E8lt2GOAxJ — Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023 చదవండి: 'ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?' WTC: ఎలాగోలా ఫైనల్‌కు చేరామే కానీ, మన వాళ్లు సాధించిందేమిటి..? -
'ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రా కావడంతో ట్రోఫీ వరుసగా నాలుగోసారి టీమిండియా వద్దే ఉండిపోయింది. ఇక అటు తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం పక్కనబెడితే నాలుగో టెస్టులో చివరి రోజు చివరి సెషన్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందనే ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌తో ప్రయోగాలు చేశాడు. బ్యాటర్లుగా ముద్రపడిన ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాడు. మొదట శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ 77వ ఓవర్ వేయగా.. ఇన్నింగ్స్ 78వ ఓవర్ టెస్టు స్పెషలిస్ట్ పుజారా చేత వేయించాడు. కాగా రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ బౌలర్ అయిన పుజారా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్ కూడా సరిగ్గా పడని పిచ్‌పై పుజారా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో పుజారా బౌలింగ్‌పై అశ్విన్ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించాడు. ''ఇప్పుడు నేనేం చేయాలి.. బౌలింగ్ జాబ్ వదిలేయాలేమో'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6 — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023 Saurashtra Skipper Jaydev Unadkat happy to see teammate Pujara rip a leg break to Smith!! pic.twitter.com/vwtQI8kYr5 — arnav.🏏 (@Cricket_Arnav) March 13, 2023 చదవండి: IND VS Aus 4th Test: అశ్విన్, విరాట్ ఖాతాలో రికార్డులు శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే! -
BGT: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్’గా..
India vs Australia, 4th Test- Cheteshwar Pujara Big Milestones:: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు. ఆసీస్‌పై టెస్టుల్లో మెరుగైన రికార్డు కలిగిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 1793 పరుగులు చేయగా.. అతడి కంటే పుజారా 219 పరుగులు ముందంజలో నిలిచాడు. రన్‌మెషీన్ కోహ్లిని దాటి ఓవరాల్‌గా నాలుగో స్థానం ఆక్రమించాడు. రోహిత్‌తో కలిసి సంయుక్తంగా అంతేకాదు.. టెస్టుల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గానూ పుజారా రికార్డులకెక్కాడు. మహ్మద్ అజారుద్దీన్ (33 ఇన్నింగ్స్) తర్వాత రోహిత్ శర్మ(36 ఇన్నింగ్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్(38), వీరేంద్ర సెహ్వాగ్(39), విరాట్ కోహ్లి(39), రాహుల్ ద్రవిడ్(41)లను పుజారా అధిగమించాడు. 1000 పరుగుల ఘనత అదే విధంగా.. టెస్టుల్లో వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియా మీద సొంతగడ్డపై 1000 పరుగులు చేసుకున్న బ్యాటర్‌గానూ పుజారా ఘనత సాధించాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ2023లో ఇప్పటి వరకు పుజారా మూడు టెస్టుల్లో నమోదు చేసిన స్కోర్లు 7,0,31 నాటౌట్, 59. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు(ఇప్పటి వరకు) సచిన్ టెండుల్కర్- 34 మ్యాచ్‌లలో 3262 పరుగులు వీవీఎస్ లక్ష్మణ్- 29 మ్యాచ్‌లలో 2434 పరుగులు రాహుల్ ద్రవిడ్- 32 మ్యాచ్‌లలో 2143 పరుగులు ఛతేశ్వర్ పుజారా- 24 మ్యాచ్‌లలో 2012 పరుగులు(ఇన్నింగ్స్ కొనసాగుతోంది) విరాట్ కోహ్లి- 24 మ్యాచ్‌లలో 1793 పరుగులు. ఇక ఇప్పటి వరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ అత్యుత్తమ స్కోర్లు వరుసగా.. 241 నాటౌట్, 281, 233 కాగా.. పుజారా 204, కోహ్లి 169 పరుగులు చేశారు. చదవండి: NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ Gambhir- Afridi: గంభీర్ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్! ఫ్యాన్స్ ఏమన్నారంటే! -
పుజారా సిక్సర్.. నవ్విన రోహిత్
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా పరిస్థితి చూస్తుంటే ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఒంటరి పోరాటం చేసిన పుజారా(59 పరుగులు) కూడా ఔటవ్వడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం 67 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉంది. అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నుంచి బయటపడడం కష్టమే. అయితే రెండోరోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అప్పటికే టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయింది. పుజారా 52, అక్షర్ పటేల్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు. బంతి అనూహ్యమైన టర్న్ తీసుకుంటుండడంతో బ్యాటింగ్ ఆడడం కష్టంగా మారింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ రక్షణాత్మక ధోరణిలో ఆడడం కెప్టెన్ రోహిత్‌కు నచ్చలేదు. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌ను పిలిచి అక్షర్‌ను చూపిస్తూ భారీ సిక్సర్ కొడితే బాగుండు అని చెప్పాడు. మరి రోహిత్ సందేశం పుజారా చెవిన పడిందేమో తెలియదు కానీ మరుసటి బంతినే పుజారా మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఇది చూసిన రోహిత్ చిన్నగా నవ్వి..'' యస్'' అంటూ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. Rohit Sharma unhappy with Axar Patel’s batting approach! #IndvsAus pic.twitter.com/gywaPM0VRL — Cricket Junkie (@JunkieCricket) March 2, 2023 Omggg,, looks like we are in multiverse, Pujara is hitting sixes after the message of captain Rohit Sharma. 😭🙏 pic.twitter.com/Kh2ek28I1G — Vishal. (@SPORTYVISHAL) March 2, 2023 -
అన్నీ తానై.. కష్టకాలంలో అర్థసెంచరీ
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. పుజారా టెస్టు కెరీర్లో ఇది 35వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్ అవుతుండడంతో ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం కాక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుజారా మాత్రం తన విలువేంటో చూపిస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 2021 ఏడాది నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా బ్యాటింగ్ సగటు తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లోనే ఎక్కువగా ఉంది. 2021 నుంచి చూసుకుంటే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సగటు 19.04 ఉంటే(22 ఇన్నింగ్స్‌లు).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52.06(19 ఇన్నింగ్స్‌లు) సగటు ఉండడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. పుజారా 52 పరుగులతో ఆడుతూ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్ -
పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్
India vs Australia, 3rd Test: ‘‘టీమిండియాలో కొంత మంది స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలరని విన్నాను. కానీ వాళ్ల ఆట తీరు మాత్రం నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఆస్ట్రేలియన్లు ఇంకాస్త ముందే టీమిండియాను ఆలౌట్ చేస్తారనుకున్నా. పిచ్ సంగతి ఎలా ఉందన్న విషయం కాసేపు పక్కనపెడితే.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు సరైన రీతిలో బౌలింగ్ చేశారు. తమకున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కానీ భారత బ్యాటర్లు మాత్రం ఫెయిలయ్యారు. గత రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా తేలిపోయారో.. వీళ్లు కూడా అలాగే విఫలమయ్యారు. ముఖ్యంగా ఛతేశ్వర్ పుజారా భయపడుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచే అతడు నెర్వస్‌గా కనిపిస్తున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడతాడని విన్నాను. కానీ.. ఇప్పటి వరకు అతడి నుంచి మెరుగైన బ్యాటింగ్ చూడలేకపోయాం. నేనైతే అతడి ఆట తీరుతో అస్సలు కన్విన్స్ కాలేకపోయాను. తనని చూస్తే వట్టి పిరికిపందలా అనిపించాడు’’ అని ఆస్ట్రేలియా టెస్టు దిగ్గజం ఇయాన్ చాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పుజారా భయం భయంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోయారని విమర్శించాడు. అదే సమయంలో.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ చక్కగా సమన్వయం చేసుకుంటూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మార్చి 1న మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడో రోజు నుంచి బంతి స్పిన్‌కు టర్న్ అవుతుందని భావిస్తే.. తొలిరోజే గింగిరాలు తిరిగింది. దీంతో టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. అంతా రివర్స్ ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశారు. దీంతో భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ పుజారా ఒక్క పరుగుకే పరిమితం కాగా.. ఆరోస్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లి 22, శుబ్‌మన్ గిల్ 21 పరుగులు చేయగా.. మిగతా వాళ్లెవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. మరోవైపు.. ఆస్ట్రేలియా రెండో రోజు ఆటలో భాగంగా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఖవాజా 60, లబుషేన్ 31 పరుగులతో రాణించి ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా రాణిస్తుండటం విశేషం. ముందుందిలే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక అయ్యర్ రెండో టెస్టులో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఇయాన్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘వాళ్లిద్దరు విఫలమైన మాట వాస్తవమే! అయినా రెండు టెస్టుల్లో ఏం జరిగిందో చూశారు కదా! ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ముందుంది అసలైన సవాల్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మిగిలిన రెండు టెస్టుల్లో సత్తా చాటాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. చదవండి: BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్‌దేవ్‌ను దాటేసి.. BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్‌దేవ్‌ను దాటేసి.. -
పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్‌గా
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకున్నప్పటికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరగా.. గిల్ 21 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక పుజారా నాలుగు బంతులు ఎదుర్కొన్న అనంతరం లియోన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే పుజారా ఒక చెత్త రికార్డును తన పేరిట లఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన జాబితాలో చేరిపోయాడు. నాథన్ లియోన్ పుజారాను ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు ఔట్ చేయడం విశేషం. ఇంతకముందు సునీల్ గావస్కర్ అండర్వుడ్ చేతిలో 12 సార్లు ఔటయ్యాడు. టీమిండియా తరపున సునీల్ గావస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. -
BGT 2023: నెట్స్‌లో చెమటోడుస్తున్న పుజారా.. భిన్న షాట్లతో! వీడియో
India vs Australia Test Series- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. తన నైపుణ్యాలకు మరింత మెరుగుపెట్టుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత మ్యాచ్‌లలో పొరపాట్లు పునరావృతం కాకుండా బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టి సారించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు పుజారా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా నెట్స్‌లో భిన్న షాట్లు ప్రయత్నిస్తూ ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా తాజాగా షేర్ చేశాడు. ‘‘మూడో టెస్టుకు సిద్ధమవుతున్నా’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. అనుకున్నంత లేదు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాకు బలమవుతాడని భావించిన టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి టెస్టులో ఏడు పరుగులకే పరిమితమైన అతడు.. కెరీర్లో అత్యంత ముఖ్యమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. రెండుసార్లు స్పిన్నర్ల చేతికే ఢిల్లీ మ్యాచ్‌తో వందో టెస్టు పూర్తి చేసుకున్న పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అజేయమైన 31 విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఇప్పటి దాకా పూర్తిస్థాయిలో తన మార్కు చూపలేకపోయాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇక తొలి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి వికెట్ సమర్పించుకున్న పుజారా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో స్పిన్నర్ నాథన్ లియోన్ చేతికి దొరికిపోయాడు. అందుకే మిగిలిన రెండు టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మూడో టెస్టుకు మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో రోహిత్ సేన ముందడుగు వేయగా.. కమిన్స్ బృందం మాత్రం వెనుకబడిపోయింది. నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇండోర్ టెస్టుకు కమిన్స్ దూరం కాగా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) -
శభాష్ హిట్‌మ్యాన్.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్! వీడియో వైరల్
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విషయం పక్కన పెడితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా కోసం రోహిత్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కుహ్నెమన్ బౌలింగ్‌లో.. పుల్ టాస్ బంతిని రోహిత్ స్క్వేర్ ఆన్ సైడ్ ఆడాడు. అయితే తొలి పరుగును వీరిద్దరూ వేగంగా పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పరుగు కోసం నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి రోహిత్ "నో" అని కాల్ ఇచ్చినప్పటికీ.. పూజారా మాత్రం పరిగెత్తూకుంటూ ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలో రోహిత్ తన మనసు మార్చుకుని వెనుక్కి వెళ్లకుండా వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. అంతలోనే ఆసీస్ ఫీల్డర్ హ్యాండ్‌కాంబ్ బంతిని వికెట్ కీపర్ చేతి క్యారీకి చేతికి ఇచ్చాడు. దీంతో క్యారీ బెయిల్స్‌ను పడగొట్టడంతో రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక తన వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్ శర్మపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రోహిత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు. pic.twitter.com/gV6jMtTmuK — MINI BUS 2022 (@minibus2022) February 19, 2023 చదవండి: IND vs AUS: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. 31 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి -
BGT 2023: పుజారా ఖాతాలో చెత్త రికార్డు.. రెండో భారత బ్యాటర్‌గా!
India vs Australia, 2nd Test- Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెరీర్లో వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని భావించిన అతడిని దురదృష్టం వెక్కిరించింది. కాగా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన పుజారాకు ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా వందో టెస్టు ఆడే అవకాశం వచ్చింది. సముచిత గౌరవం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆసీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైన పుజారా.. ఢిల్లీ మ్యాచ్ ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ద్వారా అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. అదే విధంగా బీసీసీఐ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ చేతుల మీదుగా ఈ నయావాల్‌కు ప్రత్యేక క్యాప్‌ను అందించింది. ఇక పుజారా కెరీర్లో అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అతడి కుటుంబం మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసింది. రెండో భారత బ్యాటర్‌గా కానీ వాళ్లతో పాటు అభిమానులను పుజారా నిరాశపరిచాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు వికెట్ సమర్పించుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పుజారా ఖాతాలో చెత్త రికార్డు చేరింది. టెస్టు క్రికెట్లో కొంతమందికి మాత్రమే లభించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ (వందో టెస్టు).. కీలకమైన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన ఎనిమిదో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. వందో టెస్టులో డకౌట్ అయిన క్రికెటర్లు వీరే ►దిలీప్ వెంగ్‌సర్కార్(ఇండియా) ►అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) ►కర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) ►మార్క్ టేలర్(ఆస్ట్రేలియా) ►స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్) ►బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్) ►అలిస్టర్ కుక్(ఇంగ్లండ్) ►ఛతేశ్వర్ పుజారా(ఇండియా) చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. నో అంటున్నా.. బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు -
BGT 2023: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం? ఏంటిది పుజారా!
India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ‘నయావాల్’ ఛతేశ్వర్ పుజారాకు చేదు అనుభవం ఎదురైంది. కెరీర్లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌లో అతడు డకౌట్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే భారంగా పెవిలియన్ చేరాడు. వందో టెస్టులో సెంచరీ బాది సత్తా చాటాలని ఆశపడిన అభిమానులను ఉసూరుమనిపించాడు. లియోన్ దెబ్బకు మూడు వికెట్లు ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 17) ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ఆరంభమైంది. భారత బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా తొలి రోజే 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను నాథన్ లియోన్ అవుట్ చేశాడు. దీంతో అతడి స్థానంలో పుజారా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను బౌల్డ్ చేసిన లియోన్.. అదే ఓవర్లో పుజారాను(19.4 ఓవర్) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు వెనుదిరగక తప్పలేదు. కాగా ఛతేశ్వర్ పుజారా కెరీర్లో ఇది వందో టెస్టు అన్న విషయం తెలిసిందే. వాళ్ల తర్వాత కాగా భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, వెంగ్ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ఒకే ఒక్కడు ఇక అంతర్జాతీయ టి20 ఫార్మాట్ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ పుజారా. చదవండి: IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! Ind Vs Aus 2023 2nd Test: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. బ్యాట్‌ను గట్టిగా బాదుతూ! వీడియో వైరల్ -
పుజారా అరుదైన రికార్డు.. ఘనంగా సత్కరించిన బీసీసీఐ!
టీమిండియా వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పూజారా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలోకి పుజారా చేరాడు. ఈ అరుదైన ఘనత సాధించిన 13వ భారత క్రికెటర్‌గా ఈ "నయావాల్" రికార్డులకెక్కాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా మైదానంలో అడుగు పెట్టిన పూజారా ఈ ఘనతను సాధించాడు. ఈ సందర్భంగా పూజారాను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ చేతుల మీదగా పూజారా ప్రత్యేక క్యాప్‌ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో పూజారా కుటంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన పూజారా అదే విధంగా వందో టెస్టు ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పూజారా.. సహాచర ఆటగాళ్ల నుంచి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. తొలి రోజు ఆట సందర్భంగా పూజారా ఫీల్డింగ్ వస్తుండగా.. టీమిండియా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! A guard of honour and a warm welcome for @cheteshwar1 on his 1⃣0⃣0⃣th Test 😃👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/jZoY1mjctu — BCCI (@BCCI) February 17, 2023 𝗔 𝗺𝗼𝗺𝗲𝗻𝘁 𝘁𝗼 𝗰𝗵𝗲𝗿𝗶𝘀𝗵! 💯 Golden words from the legendary Sunil Gavaskar as he felicitates @cheteshwar1 on his landmark 100th Test 👏🏻👏🏻#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/AqVs6JLO2n — BCCI (@BCCI) February 17, 2023 -
‘టెస్టు క్రికెట్ పూజారి’..చరిత్ర సృష్టించనున్న 'నయా వాల్'
సౌతాంప్టన్‌లో 132 నాటౌట్, అడిలైడ్‌లో 123, మెల్బోర్న్లో 106, జొహన్నెస్‌బర్గ్‌లో 153, సిడ్నీలో 193, కొలంబోలో 145 నాటౌట్, హైదరాబాద్‌లో 204, బెంగళూరులో 92... ఒకటా, రెండా ఎన్ని అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలు... వాటిలో కొన్ని భారత్ విజయాలకు బాటలు వేశాయి... మరికొన్ని ఓటమి ఖాయమనుకున్న దశలో ఆపద్భాంధవుడిగా నిలిచి ఆదుకున్న ఇన్నింగ్స్‌లూ ఉన్నాయి... తనకే సాధ్యమైన శైలితో ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్‌పై చతేశ్వర్ పుజారా తనదైన ముద్ర వేశాడు. పుష్కరకాలంగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన ఈ రాజ్‌కోట్ ప్లేయర్ ఇప్పుడు అరుదైన 100వ టెస్టు మైలురాయిని చేరుకుంటున్నాడు. రేపటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే టెస్టు పుజారాకు వందోది కానుంది. ఈ ఘనత సాధించిన 13వ భారత ఆటగాడిగా అతను నిలుస్తాడు. –సాక్షి క్రీడా విభాగం అక్టోబర్ 9, 2010, బెంగళూరు... భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు... మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు భారత స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా చతేశ్వర్ పుజారా వద్దకు వచ్చాడు. ‘నా వెన్నునొప్పి తగ్గలేదు, ఈ మ్యాచ్ ఆడలేనేమో’ అని పుజారాతో చెప్పాడు. దాంతో పుజారాకు అర్థమైపోయింది ఈ మ్యాచ్‌తో తాను టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయబోతున్నానని. సరిగ్గా ఐదేళ్ల క్రితం అదే తేదీన తాను ఎంతగానో ప్రేమించే, తన కెరీర్ గురించి కలలుగన్న తల్లి చనిపోయిన రోజది! ఒకవైపు ఆనందం, మరోవైపు అమ్మను గుర్తు చేసుకుంటూ మ్యాచ్ బరిలోకి దిగిన పుజారా తొలి ఇన్నింగ్స్ 3 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్‌ను కాదని పుజారాను ధోని మూడో స్థానంలో పంపడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే కీలక అర్ధసెంచరీతో అతను రాబోయే రోజుల గురించి సంకేతాలిచ్చాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మరో మ్యాచ్‌లో చేసిన 159 పరుగులతో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తూ ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న పుజారా ప్రస్థానం పలు చిరస్మరణీయ విజయాల మీదుగా ఇప్పుడు వందో టెస్టు వరకు నిరి్వఘ్నంగా సాగింది. అదే అతడి బలం... పుజారా బ్యాటింగ్ శైలిని చూస్తే సహజంగానే పాతకాలపు క్రికెట్ గుర్తుకొస్తుంది. అసలైన సంప్రదాయ టెస్టును బతికిస్తున్న కొద్ది మందిలో కచి్చతంగా పుజారా పేరు ఉంటుంది. అద్భుతమైన టెక్నిక్ లేకపోయినా తన అసమాన పట్టుదల, ఏకాగ్రతతోనే అతను ప్రపంచ క్రికెట్లో తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో గంటలపాటు క్రీజ్‌లో నిలిచిపోయి బౌలర్ల సహనం పరీక్షించడం, వారు అలసిపోయేలా చేసి ఆపై పరుగులు రాబట్టడం అతని శైలి. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా సుదీర్ఘ సమయం పాటు ఆడే మ్యాచ్ ఫిట్నెస్ ఉంటే చాలు అనే నమ్మే పుజారా తన బలాన్ని నమ్ముకొనే భారత క్రికెట్లో ఇన్నేళ్లు కొనసాగాడు. ‘నా బ్యాటింగ్ శైలి గురించి చర్చ, విమర్శలు అనవసరం. టెస్టుల్లో పరిస్థితిని బట్టి పరుగులు చేయడం ముఖ్యం. ఎలా చేశామన్నది కాదు’ అని దీనిపై అతను స్పష్టతనిచ్చాడు. ఈ క్రమంలోనే టీమిండియా గొప్ప విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు. బ్యాటర్లకు నరకంలా మారిన జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై ఒక టెస్టు లో 54వ బంతికి తొలి పరుగు తీయడం కూడా అలాంటిదే. ఒకప్పుడు సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన తండ్రి అరవింద్ పుజారానే చతేశ్వర్కు తొలి గురువు కాగా, ఆయన పర్యవేక్షణలోనే అతను రాటుదేలాడు. అండర్–14 స్థాయిలోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఆపై అండర్ –19 స్థాయి వరకు వేగంగా పుజారా దూసుకుపోయాడు. రంజీ ట్రోఫీలో నాలుగు సీజన్ల పాటు 50 సగటుతో పరుగులు చేయడంతో 22 ఏళ్ల వయసులో భారత జట్టులో అవకాశం దక్కింది. ఆసీస్ గడ్డపై అద్భుతాలు... సుదీర్ఘ కెరీర్లో ఎన్ని విజయాలు ఉన్నా ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని ప్రత్యేక క్షణాలు కచి్చతంగా ఉంటాయి. అవి వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా జట్టు కోసం సాధించిన ఘనతలు కావచ్చు. అలాంటి ప్రదర్శనలే ఆ ప్లేయర్‌ను అందరూ గుర్తుంచుకునేలా శిఖరాన నిలబెడతాయి. అత్యంత బలమైన ఆ్రస్టేలియా జట్టును వారి సొంతగడ్డపైనే వరుసగా రెండు సిరీస్‌లలో ఓడించడం భారత్‌కు సంబంధించి అసాధారణ ఘనత. ఈ రెండు సందర్భాల్లోనూ పుజారా పాత్ర ప్రత్యేకం. 2018–19 సిరీస్‌లో 3 సెంచరీలు సహా ఏకంగా 521 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. 2020–21 సిరీస్‌లో కూడా పుజారా మళ్లీ కీలకంగా మారాడు. ముఖ్యంగా చారిత్రాత్మక బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 211 బంతుల్లో చేసిన 56 పరుగులు జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఆసీస్ పేసర్ల దెబ్బలను ఓర్చుకుంటూ (9 సార్లు బంతి అతని శరీరాన్ని బలంగా తాకింది) చివరి రోజు అసమాన పోరాటం ప్రదర్శించడం విశేషం. సీనియర్ల గైర్హాజరులో 5 వన్డేలు ఆడే అవకాశం దక్కినా ఆ ఫార్మాట్ తనది కాదనే విషయం పుజారాకు బాగా తెలుసు. అయితేనేం, భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించి పుజారా ఒక అమూల్య వజ్రం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. చదవండి: భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2 -
Ind Vs Aus: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా
India vs Australia- Cheteshwar Pujara: భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తన భార్య పూజతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం న్యూఢిల్లీలో రెండో టెస్టు మొదలవుతుంది. పుజారా కెరీర్లో ఇది 100వ టెస్టు కానుంది. ప్రధాని మోదీని కలిసిన ఫొటోలు పంచుకున్న పుజారా.. ‘‘నా కెరీర్లో ప్రత్యేకమైన వందో టెస్టు ఆడటానికి ముందు గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీజీని కలవడం సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ సైతం.. కెరీర్లో అరుదైన మైలురాయికి చేరువైన పుజారాకు బెస్ట్ విషెస్ చెప్పారు. నయావాల్ 1988, జనవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన పుజారా.. పూర్తి పేరు చతేశ్వర్ అరవింద్ పుజారా. చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల మక్కువ గల అతడు.. అండర్-19 కేటగిరీలో 2005లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. భారత్- ఆస్ట్రేలియా మధ్య 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్టుతో పుజారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. యువరాజ్‌సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4(బౌండరీ) పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో సత్తా చాటాడు. టెస్టు స్పెషలిస్టుగా ఎదిగి.. మిస్టర్ డిపెంబుల్, వాల్ రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందాడు. కాగా పుజారాకు 2013లో పూజా పబరీతో వివాహం జరిగింది. వీరికి కూతురు అతిథి ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పుజారా ఆకట్టుకోలేకపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్ Chetan Sharma: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్ జోరు పెంచిన పుజారా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా పుజారా.. ఇండియా జెర్సీని ధరించి గ్రౌండ్లో తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పుజారా స్వయంగా ట్విటర్లో పంచుకున్నాడు. ''గెట్టింగ్ రెడీ ఫర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. టీమిండియా టెస్టు జట్టులో కీలక ఆటగాడైన పుజారా గతేడాది ఐదు టెస్టులు కలిపి 10 ఇన్నింగ్స్‌లు ఆడి 45.44 సగటుతో 409 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. 1400 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా 54.08 సగటుతో 1893 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 204 పరుగులుగా ఉన్నది. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. ఇక తొలి టెస్టు నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, రెండో టెస్టు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, మూడో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు, నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్నాయి. అనంతరం మూడు వన్డే మ్యాచ్‌లు మార్చి 17, 19, 22 తేదీల్లో జరగనున్నాయి. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. Getting ready for 🇮🇳 vs 🇦🇺 pic.twitter.com/g8c1RRqUbO — Cheteshwar Pujara (@cheteshwar1) January 31, 2023 చదవండి: 'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు' IND Vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
రవీంద్ర జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా..
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్ కోసం..! ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్ బెర్త్ ఖరారు కావడంతో చివరి మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్, సీనియర్ స్టార్ చతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: సౌరాష్ట్ర హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్‌సిన్హ్ దోడియా, జే గోహిల్. తమిళనాడు: సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్. చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
టెస్టు క్రికెట్లో పుజారా అరుదైన ఫీట్! దిగ్గజాల సరసన.. కోహ్లి తర్వాత
Bangladesh vs India, 2nd Test - Cheteshwar Pujara: టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. తద్వారా సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఢాకాలోని షేర్-ఈ- బంగ్లా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ వేసిన బంతి(18.5 ఓవర్)కి మూడు పరుగులు తీసి పుజారా 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో అజేయ సెంచరీతో మెరిసిన పుజారా(90, 102 నాటౌట్) రెండో మ్యాచ్‌లో 24 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించాడు. కాగా సౌతాఫ్రికా టూర్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. కౌంటీల్లో ససెక్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రంమలో ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్టులో జట్టులో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం బంగ్లా టూర్లో స్థాయికి తగ్గట్లు ఆడుతున్నాడు. టెస్టుల్లో 7 వేల పైచిలుకు పరుగులు.. జాబితాలో పుజారా ►సచిన్ టెండుల్కర్- 15,921 ►రాహుల్ ద్రవిడ్- 13265 ►సునిల్ గావస్కర్- 10122 ►వీవీఎస్ లక్ష్మణ్- 8781 ►వీరేంద్ర సెహ్వాగ్- 8503 ►విరాట్ కోహ్లి- 8099* ►సౌరవ్ గంగూలీ- 7212 ►ఛతేశ్వర్ పుజారా- 7000* చదవండి: Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్!? ద్రవిడ్, నువ్వూ కలిసి.. వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్‌స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ -
Ind Vs Ban: అదరగొట్టిన అక్షర్ పటేల్... పుజారా, గిల్ సైతం..
ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అక్షర్ 20 స్థానాలు పురోగతి సాధించి 18వ స్థానానికి చేరుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ ప్రస్తుతం 650 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. కుల్దీప్ సైతం మరోవైపు.. ఈ టెస్టులో రాణించిన మరో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 19 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ ఖాతాలో ప్రస్తుతం 455 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, అశ్విన్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. అదరగొట్టిన పుజారా, గిల్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఛతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్‌ల్లో నిలిచారు. బంగ్లాతో మొదటి టెస్టు సందర్భంగా గిల్ సెంచరీ చేయగా... పుజారా సైతం అజేయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జాబితాలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాపర్‌గా ఉన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా విఫలమైనా బ్యాటర్‌గా ఆకట్టుకున్న బాబర్ ఆజం కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. చదవండి: ENG vs PAK: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్‌పై వేటు! బాబర్ కూడా.. Lionel Messi FIFA Winning Photo: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ! -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..?
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడినట్లు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్వయంగా ప్రకటించాడు. నెట్స్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా రాహుల్ చేతికి బంతి బలంగా తాకిందని, నొప్పి భరించలేక రాహుల్ సెషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడని రాథోడ్ తెలిపాడు. అయితే, గాయం అంత తీవ్రమైంది కాదని, రెండో టెస్ట్‌లో రాహుల్ తప్పక బరిలోకి దిగుతాడని డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం రాథోడ్ వివరణ ఇచ్చాడు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ మ్యాచ్‌కు దూరం కావాల్సి వస్తే.. టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాహుల్ గైర్హాజరీలో అతని డిప్యూటీగా ఎంపికైన పుజారా ఆ బాధ్యతలు చేపడతాడా లేక అనుభవజ్ఞుడైన కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పుతారా అని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా రెగ్యలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తదనంతర పర్యటనలో కేఎల్ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ నేతృత్వంలో టీమిండియా మూడో వన్డేలో, అలాగే తొలి టెస్ట్‌లో ఘన విజయాలు నమోదు చేసింది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌లో పుజారా టీమిండియా పగ్గాలు చేపడితే ఈ ఏడాది భారత 8వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ ఏడాది ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ భారత కెప్టెన్లుగా వ్యవహరించారు. కెప్టెన్ సరే రాహుల్ స్థానంలో ఎవరు..? గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైతే, అతని స్థానంలో పుజారానో లేక కోహ్లినో ఆ బాధ్యతలు చేపడతారు. మరి, రాహుల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ప్రస్తుతం ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రాహుల్ స్థానంలో మేనేజ్మెంట్ అభిమన్యు ఈశ్వరన్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈశ్వరన్.. బంగ్లా పర్యటనలో భారత ఏ జట్టు తరఫున 2 భారీ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ గైర్హాజరీలో గిల్‌తో పాటు ఈశ్వరన్ ఓపెనింగ్ చేయవచ్చు. -
Ind Vs Ban: ప్రాక్టీస్ సెషన్లో కనిపించని కోహ్లి! అందరి దృష్టి అతడిపైనే..
Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీసులో తలమునకలైంది. మీర్పూర్ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, మొదటి సెషన్‌కు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి గైర్హాజరు కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ నెట్స్‌లో చెమటోడ్చారు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్ రాహుల్(22, 23 పరుగులు) కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో తన టెక్నిక్‌ను మెరుగుపరచుకునే పనిలో పడ్డాడు. రాహుల్ బ్యాటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన ద్రవిడ్.. లోపాలు సరిదిద్దుతూ.. మెళకువలు నేర్పాడు. అదే విధంగా మొదటి టెస్టులో రాణించిన ఛతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ సైతం ఈ ఆప్షనల్ ప్రాక్టీసు సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్జెంటీనా జెర్సీతో.. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ జట్టు మొత్తం మంగళవారం నాటి ప్రాక్టీసు సెషన్లో పాల్గొంది. ఇందులో భాగంగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అర్జెంటీనా జెర్సీ ధరించి ఫుట్‌బాల్ ఆడటం విశేషం. కాగా ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంది షకీబ్ బృందం. మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్- టీమిండియా మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇక ఈ టెస్టుకు కూడా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ దిశగా దూసుకుపోతోంది. చదవండి: Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్.. అరుదైన జాబితాలో చోటు .@BCCI head coach Rahul Dravid was seen inspecting the pitch and giving batting tips to @klrahul ahead of the 2nd test against @BCBtigers. Watch 👇@AgeasFederal @BoriaMajumdar @debasissen @CricSubhayan #BANvIND #WTC23 pic.twitter.com/hD7ok3dShe — Boria Majumdar (@BoriaMajumdar) December 20, 2022 -
అతడికి ఐపీఎల్ సెట్ కాదు.. భారత స్టార్ ఆటగాడిపై కార్తీక్ సంచలన వాఖ్యలు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు ఛతేశ్వర్ పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన టెస్టు కెరీర్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని పుజారా సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతులు ఎదుర్కొన్న పుజారా 102 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా ఆడుతున్న పుజరాను ఐపీఎల్లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పుజరాకు టీ20 ఫార్మాట్ సెట్ కాదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "నిజం చెప్పాలంటే పుజరాకు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి ఉండేది. అతడు చాలా కాలం పాటు ప్రయత్నించాడు. అయితే టీ20 పార్మాట్ తనకు సెట్ కాదని గ్రహించాడు. అతడు ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతాడు. పుజరా తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటాడు. పుజరా తాను ఎంటో నిరూపించుకోవడానికి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటలేదు. ఏ ఫార్మాట్లో ఆడితే బాగుంటుందో అతడికి స్టృషంగా తెలుసు. ఐపీఎల్ అనేది పుజరా లాంటి వారికి సరిపోదని నేను భావిస్తున్నాను. ఇప్పటికే పుజరాకు కుడా ఈ విషయం అర్థమై ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా పుజారా చివరగా ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ పుజారాకు అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. అయితే ఐపీఎల్- 2022 మెగా వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ అతడిని కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్-2023 మినీ వేలంలో పుజారా తన పేరును నమోదు చేసుకున్నాడు. చదవండి: FIFA World Cup Qatar 2022 Second Final : మెస్సీ VS ఫ్రాన్స్ -
దిగ్గజ బ్యాటర్‌ను అధిగమించిన పుజారా.. నెక్స్ట్ టార్గెట్ కోహ్లినే
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నయా వాల్ చతేశ్వర్ పుజారా.. భారత దిగ్గజ బ్యాటర్ దిలీప్ వెంగసర్కార్ రికార్డును అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి ఔటైన పుజారా.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెంగ్‌సర్కార్‌ను వెనక్కునెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. వెంగ్‌సర్కార్ 116 టెస్ట్‌ల్లో 6868 పరుగులు చేయగా..పుజారా 97 టెస్ట్‌ల్లో 6882 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (15921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8781), వీరేంద్ర సెహ్వాగ్ (8503), విరాట్ కోహ్లి (8075), సౌరవ్ గంగూలీ (7212) పుజారా కంటే ముందున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడతున్న ఆటగాళ్లలో కోహ్లి మాత్రమే పుజారా కంటే ముందున్నాడు. 97 టెస్ట్‌లు ఆడిన పుజారా.. 44.11 సగటున 18 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో రోహిత్ శర్మ (3137) మాత్రమే పుజారాకు కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
పుజారాను చూసి నేర్చుకోండి.. రోహిత్, పంత్ సిగ్గుపడాలి..!
Cheteshwar Pujara: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఘనంగా పునరాగమనం చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 90 పరుగులు చేసిన నయా వాల్.. పూర్వవైభవాన్ని చాటుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో భారీ అర్ధ సెంచరీ సాధించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాని పుజారా.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. పుజారాకు తోడుగా శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, బంగ్లాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పుజారా.. మునుపటి కంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. జట్టులో స్థానం కోల్పోయానని బాధ పడకుండా దేశవాలీ టోర్నీలు, కౌంటీలు ఆడిన పుజారా.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. ఫామ్‌లోకి రావడమే కాకుండా మునుపటి కంటే చాలా మెరుగయ్యాడు. గతంలో పుజారాపై టెస్ట్ ప్లేయర్, నిదానంగా ఆడతాడు అనే ముద్ర ఉండేది. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన లండన్ వన్డే కప్ తర్వాత పుజారాపై ఆ ముద్ర తొలిగిపోయింది. ఆ టోర్నీలో అతను స్టైల్‌కు భిన్నంగా వేగంగా, భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో తనలోని కొత్త యాంగిల్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ సీజన్లో అతను ఏకంగా 3 సెంచరీలు బాదాడు. అందులో ఒకటి 73 బంతుల్లో శతకం కాగా మరొకటి 75 బంతుల సెంచరీ. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారా.. ఆ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో ఉగ్రరూపం దాల్చిన పుజారా.. తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి పరుగుల వరద పారించాడు. తద్వార భారత సెలెక్టర్లకు మరో ఛాన్స్ లేకుండా చేసి జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతి విలువైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఆదుకున్నాడు. ఆటగాళ్లెవరైనా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైతే తనలా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని మెసేజ్ పాస్ చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే క్రమంలో పుజారా ప్రస్తానాన్ని గమనించిన అభిమానులు.. ఫామ్ కోల్పోయినప్పుడు దేశవాలీ టోర్నీలు ఆడకుండా ఇంట్లోనే కూర్చొనే ఆటగాళ్లకు చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న పంత్, రోహిత్ శర్మ.. పుజారాను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఫామ్‌లో లేనప్పుడు స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుని దేశవాలీ టోర్నీలు ఆడాలని గడ్డి పెడుతున్నారు. ఈ విషయంలో పుజారాలోని కసిని చూసి సిగ్గు పడాలని కామెంట్స్ చేస్తున్నారు. -
IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. పర్వాలేదనిపించిన పంత్
IND VS BAN 1st Test Day 1: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. భారత్: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ బంగ్లాదేశ్: జాకీర్ హసన్, నజీముల్ హొస్సేన్ షాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్ -
అతడిని ఏ ప్రాతిపదికన వైస్ కెప్టెన్ చేశారో తెలీదు.. అయితే: రాహుల్
India Vs Bangladesh Test Series 2022: ‘‘ఏ ప్రాతిపదికన అతడికి ఈ బాధ్యతలు అప్పజెప్పారో తెలియదు. జట్టులోకి ఎవరిని తీసుకున్నా వారికి అండగా నిలబడాల్సి ఉంటుంది. నేను కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపికైనపుడు సంతోషపడ్డాను. అదే సమయంలో జట్టు పట్ల నా బాధ్యత కూడా మరింత పెరిగింది’’ అని టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టుకు రాహుల్ సారథిగా ఎంపికయ్యాడు. రోహిత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్ల గాయపడిన నేపథ్యంలో వాళ్ల స్థానాలను భర్తీ చేసిన మేనేజ్మెంట్.. రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా తప్పించింది. ఎందుకిలా? అతడి స్థానంలో నయావాల్ ఛతేశ్వర్ పుజారాను రాహుల్‌కు డిప్యూటీగా నియమించింది. ఈ నిర్ణంయపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేశారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా రాణించకపోయినా అవకాశాలు ఇచ్చారు గానీ.. అసలైన మ్యాచ్‌లో పంత్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం ఏమిటి? భవిష్యత్తులో కెప్టెన్ కావాల్సిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి కదా!’’ అంటూ కామెంట్లు చేశారు. నాకైతే తెలియదు ఇక మ్యాచ్‌కు ముందు ప్రెస్మీట్లో రాహుల్ మాట్లాడుతున్న సమయంలో ఈ విషయమై అతడికి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర, ప్రాధాన్యం ఏమిటో తెలుసనని వ్యాఖ్యానించాడు. అయితే, పుజీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక ఎలా జరిగిందో మాత్రం తనకు తెలియదన్నాడు. ఏదేమైనా జట్టులో పంత్, పుజారా కీలక సభ్యులేనని పేర్కొన్నాడు. ‘‘రిషభ్, పుజీ.. టెస్టు క్రికెట్లో అద్భుత ఆటగాళ్లు. చాలా ఏళ్లుగా జట్టుకు ఆడుతూ.. టీమ్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఎవరికి వారే సాటి. కాబట్టి ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైస్ కెప్టెన్ ఎవరైనా వాళ్ల బాధ్యత ఇంకాస్త పెరుగుతుందే గానీ.. వేరే మార్పులేమీ ఉండవు. పదకొండు మంది ఆటగాళ్లు సమిష్టిగా ఆడితేనే జట్టు గెలుస్తుంది’’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా పంత్ గత కొంతకాలంగా టెస్టుల్లో రాణిస్తుండగా.. పుజారా మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే, ఇటీవల బంగ్లా- ఎ జట్టుతో సిరీస్‌లో పుజీ ఫర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14న తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్- భారత జట్టు ఇదే శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ. చదవండి: Ranji Trophy: రంజీ ట్రోఫీ.. టోర్నీ పుట్టుక వెనుక చరిత్ర ఇదే Babar Azam: అంటే మేం టెస్టులు ఆడటం ఆపేయాలా?: పాక్ కెప్టెన్ అసహనం Ind Vs Ban: పాక్ అవుట్.. మరి టీమిండియా? ఫైనల్ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి! -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు -
సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 248 బంతులు ఎదుర్కొన్న ఈశ్వరన్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 157 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే ముస్ఫిక్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈశ్వరన్‌కు బంగ్లా పర్యటనలో ఇది వరుసగా రెండో సెంచరీ. ఇక అతడితో పాటు చెతేశ్వర్ పుజారా (52), శ్రీకర్ భరత్(77) పరుగులతో రాణించారు. 110 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుకు 159 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. క్రీజులో జయంత్ యాదవ్, సూరభ్ కుమార్ ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు -
2017లో ‘అర్జున’ అవార్డుకు ఎంపిక.. ఇప్పుడు అందుకున్న పుజారా
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తనకు ప్రకటించిన ‘అర్జున’ అవార్డును అందుకున్నాడు. క్రికెట్లో రాణిస్తున్న అతన్ని 2017లోనే భారత ప్రభుత్వం ఆ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఏడాది అందుకోలేకపోయాడు. ఢిల్లీలో ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతనికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘అర్జున’ పురస్కారం బహూకరించారు. దీనిపై స్పందించిన పుజారా తనను ప్రోత్సహించిన బోర్డు (బీసీసీఐ)కు, తన ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! Thankful to @IndiaSports, @BCCI and @ianuragthakur to organise and handover the Arjuna Award belatedly, which I could not collect the year it was awarded to me due to my cricket commitments. Honoured and grateful🙏 pic.twitter.com/Dokz4ZP3Hs — Cheteshwar Pujara (@cheteshwar1) November 19, 2022 -
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈ కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత "ఏ" జట్టు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అయితే బంగ్లాలో పర్యటించే ఏ జట్టుకు భారత వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అతడితో పాటు ఉమేశ్ యాదవ్, శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో భాగం కానున్నట్లు సమాచారం. ఇక ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇక చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ రానున్న రోజుల్లో ఏ-జట్టును ప్రకటించనుంది. కాగా ఈ సిరీస్ నవంబర్ ఆఖరి వారంలో జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్ బంగ్లాదేశ్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్ చదవండి: బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది -
చెలరేగిన ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్
Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. కుప్పకూలిన టాపార్డర్ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ పతనం సాగింది. ఛతేశ్వర్ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్ జడేజా 28 పరుగులతో రాణించారు. 98 పరుగులకే ఆలౌట్ ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్ అయింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ సేన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్ ఉనద్కట్. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! ICYMI! Watch how Mukesh Kumar set the ball rolling for Rest of India 🎥 🔽 #IraniCup | #SAUvROI | @mastercardindia https://t.co/GLg0dQvfNj — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
'టీ20 ప్రపంచకప్ తుది జట్టులో వారిద్దరూ ఉండాలి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 18న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిద్దరూ ప్రధాన జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం ఎవరో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కార్తీక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఆసియా కప్‌కు ఫినిషర్‌గా ఎంపికైన దినేష్ కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. అయితే రిషబ్ పంత్‌కు ఈ మెగా ఈవెంట్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ తుది జట్టులో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య ఎవరుండాలి అనే విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయంపై టీమిండియా వెటరన్ ఆటగాడు చెతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. "వరల్డ్‌కప్ తుది జట్టులో దినేష్ కార్తీక్, పంత్ ఉండాలి. నేను నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7బ్యాటర్లను గనుక ఎంచుకోవాల్సి వస్తే.. వరుసగా పంత్, హార్దిక్ పాండ్యా, కార్తీక్‌కు అవకాశం ఇస్తాను. మా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారాలి. అదే విదంగా భారత్ అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. పంత్ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటే బాగుటుంది. ఒక వేళ హుడా తుది జట్టులోకి వచ్చినట్లయితే.. అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపాలి" అని పుజారా పేర్కొన్నాడు. చదవండి: క్రికెట్‌కు అంగీకరిస్తేనే పెళ్లి.. వరుడి స్నేహితులు డీల్! -
ఇప్పటికే మునిగారు.. ఇకనైనా జాగ్రత్త పడండి
ఆసియా కప్ 2022లో టీమిండియా సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా ఓడింది అంటే బౌలర్ల వైఫల్యం, ఫేలవ ఫీల్డింగ్ వల్లే అని చెప్పొచ్చు. అంతేకాదు ఆల్‌రౌండర్ జడేజా లేని లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పుజారా మాట్లాడాడు. ''ఆసియాకప్ టోర్నమెంట్లో టీమిండియాకు ప్రస్తుత కాంబినేషన్ సరిగ్గా పని చేయడం లేదు. జట్టుకు మరో బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటునే మంచిది. లెగ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పరుగులు చేయగల సమర్థుడు.ఇప్పటికే మునిగాం.. ఇకనైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కనీసం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిస్తే విజయంతో టోర్నీని ముగించినట్లు అవుతుంది. ఇక రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తిక్‌కు అవకాశం ఇవ్వాల్సిందే. బహుశా టి20 ప్రపంచకప్ తర్వాత దినేశ్ కార్తిక్ క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి జట్టులో ఉన్నప్పుడే అతనికి అవకాశాలు ఇవ్వడం సమజసం. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. పేస్ ఆల్ రౌండర్‌ను పూర్తి కోటా బౌలింగ్ వేసేలా అన్ని టైంలలో ప్రయోగించలేము. ఇక 6 నుంచి 15 ఓవర్ల మధ్య సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోతుంది. ఇక స్లాగ్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్ల వరకు సరైన బ్యాటర్లు లేరు. కాబట్టి దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో చాహర్ ఎంట్రీ..! -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్!
ఆసియాకప్-2022లో దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం సాయంత్రం భారత్-పాక్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలవన్ను భారత వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఎంపిక చేశాడు. అతడు ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రాహుల్‌ను ఎంచుకున్నాడు. మూడు నాలుగు స్థానాల్లో వరుసగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాను పుజారా ఎంపిక చేశాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది. ఇక తన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్‌కు భారత టెస్టు స్పెషలిస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి దుమ్ము రేపుతున్న వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను పుజారా ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరో వైపు వెటరన్ స్సిన్నర్ రవి అశ్విన్‌కు కూడా పుజారా ప్రకటించిన జట్టులో చోటు దక్క లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు పుజారా ఎంచకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Ind Vs Pak- Virat Kohli: నాడు ఓపెనర్లు డకౌట్... మిగతా వాళ్లంతా విఫలం.. కోహ్లి ఒక్కడే! ఇప్పుడు కూడా! -
Asia Cup 2022: పాక్ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పుజారా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పుజారా కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉండగా.. మహ్మద్ రిజ్వాన్ ఆసియాకప్ కోసం జట్టుతో పాటు యూఏఈ చేరుకున్నాడు. విషయంలోకి వెళితే.. కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా, మహ్మద్ రిజ్వాన్‌లు ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి కౌంటీ ఆడడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక అభిమాని పుజారాకు ప్రశ్న వేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రిజ్వాన్‌తో కలిసి ఆడిన క్షణాలను పుజారా గుర్తు చేసుకున్నాడు. ''మహ్మద్ రిజ్వాన్ మంచి టాలెంటెడ్ క్రికెటర్. అతనితో కలిసి ఆడిన సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాను. వ్యక్తిగతంగానూ చాల మంచోడు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక వన్డే క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుందని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు అని మరొక అభిమాని ప్రశ్నించాడు. దీనికి పుజారా..'' అవును వన్డే క్రికెట్ ఆదరణ కోల్పోవడం దురదృష్టకరం.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు ముగిసిన అనంతరం కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న పుజారా వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఆ తర్వాత రాయల్ లండన్ వన్డే కప్‌లోనూ పుజారా బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. మంగళవారం మిడిలెసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా కేవలం 90 బంతుల్లోనే 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో పుజారా స్ట్రైక్ రేట్ 146.66 దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత భీకరమైన ఫామ్‌లో ఉన్నాడనేది.. ఇటివలే లిస్ట్-ఏ క్రికెట్లోనూ పుజారా 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. I enjoyed my time with him, he is a very nice guy and a talented cricketer https://t.co/LloU2tG0KT — Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2022 I enjoyed my time with him, he is a very nice guy and a talented cricketer https://t.co/LloU2tG0KT — Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2022 చదవండి: ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. -
విధ్వంసం సృష్టించిన పుజారా.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో!
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో పూజారా అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచ్‌లో 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. కాగా టెస్టు స్పెషలిస్టు పేరొందిన పుజారా తన సెంచరీ మార్క్‌ను కేవలం 75 బంతుల్లోనే అందుకోవడం గమానార్హం. ఇక ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడికి ఇది మూడో సెంచరీ. అంతకుముందు వార్విక్షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చేలరేగాడు. అదేవిధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 174 పరుగులు చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯 Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp — Sussex Cricket (@SussexCCC) August 23, 2022 చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
సెంచరీతో చెలరేగిన పుజారా.. నాలుగేళ్ల కుమార్తె ఏం చేసిందంటే! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ‘రాయల్ లండన్ వన్డే కప్’లో సెంచరీల మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం(ఆగస్టు12) వార్విక్షైర్తో జరగిన మ్యాచ్‌లో మెరుపు శతకం (79 బంతుల్లో 107 పరుగులు) సాధించిన పుజారా.. ఆదివారం సర్రేతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 131 బంతుల్లో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన పుజారా నాలుగేళ్ల కుమార్తె అదితి మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేసింది. పుజారా 174 పరుగులు సాధించి ఔటైన తర్వాత డగౌట్‌కు తిరిగి వస్తుండగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. ఇదే సమయంలో అదితి కూడా తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) చదవండి: Ms Dhoni: సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై! ఐసీసీ స్పెషల్ వీడియో -
తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా అంటేనే నెమ్మదైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో గ్రూఫ్-ఏలో వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ 'నయావాల్' 73 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేసిన పుజారా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో పుజారా ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. లియామ్ నార్వెల్ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా ఔట్ కావడం జట్టు కొంపముంచిందనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాబర్ట్ యేట్స్ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్ రోడ్స్ 76, మైకెల్ బర్గెస్ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్షైర్ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్షైర్ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది. 4 2 4 2 6 4 TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI — Sussex Cricket (@SussexCCC) August 12, 2022 చదవండి: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్ దిశగా వెస్టిండీస్ -
పుజారానా 'మజాకా'.. ఒకే సీజన్లో వెయ్యి పరుగులు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వరుస డబుల్ సెంచరీలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్న పుజారా ఈ సీజన్లో ససెక్స్ తరపున ఒకే సీజన్లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో పుజారా ససెక్స్ తరపున 8 మ్యాచ్‌లాడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఈ సీజన్లో డెర్బీషైర్, డుర్హమ్, మిడిలెసెక్స్ జట్లపై పుజారా ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్లామోర్గాన్ ఆటగాడు సామ్ నార్త్ఈస్ట్ 10 మ్యాచ్‌ల్లో 1127 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ 401*పరుగులు రికార్డు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా 8 మ్యాచ్‌ల్లో 1095 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. డెర్బీషైర్ ఆటగాడు షాన్ మసూద్ 8 మ్యాచ్‌ల్లో 1074 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా వ్యక్తిగత రికార్డుతో మెరిసినప్పటికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ 256 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. జట్టు అంతా విఫలం కాగా.. పుజారా 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 301 పరుగులకు ఆలౌటై ససెక్స్‌కు 398 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. అయితే ససెక్స్ మరోసారి ఘోరమైన ఆటతీరును ప్రదర్శిస్తూ 142 పరుగులకే కుప్పకూలింది. ఈసారి కూడా పుజారా ఒక్కడే నిలబడ్డాడు. పుజారా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ ఓటమితో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ 11 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. భారీ విజయంతో నాటింగ్హమ్షైర్ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. నాటింగ్హమ్షైర్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఒక ఓటమితో తొలి స్థానంలో ఉంది. చదవండి: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? -
పుజారా డబుల్ సెంచరీ.. 118 ఏళ్లలో తొలి ఆటగాడిగా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజరా కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ససెక్స్‌కు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ ఫీట్ అందుకున్నాడు. 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారాకు ససెక్స్ తరపున ఈ ఏడాది ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే పుజారా ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 118 ఏళ్లలో సింగిల్ కౌంటీ డివిజన్లో ససెక్స్ తరపున మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో మరో డబుల్ సెంచరీ బాదాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ముచ్చటగా మూడో డబుల్ శతకం సాధించాడు. ఇక కౌంటీల్లో మిడిల్సెక్స్ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాళ్లలో పుజారా(231 పరుగులు, ససెక్స్) తొలి స్థానంలో నిలిచాడు. పుజారా తర్వాత వీరేంద్ర సెహ్వాగ్(130 పరుగులు, లీస్టర్‌షైర్), రవిశాస్త్రి(127 పరుగులు, గ్లామ్), అబ్దుల్ ఖాదీర్(112 పరుగులు, వార్విక్షైర్), పియూష్ చావ్లా( 112 పరుగులు, సోమర్సెట్) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పుజారా 231 పరుగులు చేసి ఔట్ కాగానే ససెక్స్ ఇన్నింగ్స్ 523 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మిడిలెసెక్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో పుజారా కౌంటీలు ఆడేందుకు వెళ్లి ససెక్స్ తరపున సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇంతకముందు మిడిలెసెక్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారాకు ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. A batting masterclass at Lord's. 🌟 Superb, @cheteshwar1. 👏 2⃣0⃣0⃣ pic.twitter.com/IQ0e3G25WD — Sussex Cricket (@SussexCCC) July 20, 2022 చదవండి: కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం -
కెప్టెన్‌గా పుజారా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు..!
టీమిండియా వెటరన్ ఆటగాడు, ససెక్స్ స్టాండింగ్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మిడిల్సెక్స్తో జరుగుతోన్న మ్యాచ్‌లో పుజారా శతకాన్ని నమోదు చేశాడు. కాగా అతడికి కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. ఇక 182 బంతుల్లో 115 పరుగులు చేసిన పుజారా ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 10 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారాతో పాటు టామ్ ఆల్సోప్ 135 పరుగులతో రాణించాడు. చదవండి: Cheteshwar Pujara: పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! అతడిపై నమ్మకం ఉంది! Pujara doing what he does best, scoring runs. 💯@cheteshwar1 👏 pic.twitter.com/NiKOkV6dct — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! ఏ మ్యాచ్‌లో అంటే?
టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో భాగంగా ససెక్స్ జట్టుకు సారథిగా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గత వారం లీసెస్టెర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో గాయపడ్డాడు. అతడి స్థానంలో పేసర్ స్టీవెన్ ఫిన్ కెప్టెన్సీ చేశాడు. అయితే, టామ్ చేతి ఎముక విరగడంతో ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో టామ్ స్థానంలో మిడిల్సెక్స్తో మ్యాచ్‌కు పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా సస్సెస్ హెడ్‌కోచ్ ఇయాన్ సలిస్బరీ మాట్లాడుతూ.. పుజారా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. పుజారాపై నమ్మకం ఉంది! ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘పూజ్.. టామ్ స్థానాన్ని భర్తీ చేయగలడు. జట్టులో చేరిన నాటి నుంచే తన అపార అనుభవంతో సహజంగానే నాయకుడిగా ఎదిగాడు. టామ్ గాయపడిన నేపథ్యంలో కెప్టెన్సీ చేపట్టాడు. గత మ్యాచ్‌లో ఫిన్నీ సారథిగా ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు మాత్రం ఓ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేయాలనుకున్నాం. ఎందుకంటే ఫిన్ బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించడంపై దృష్టి సారిస్తాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అనువజ్ఞుడైన పూజ్.. కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భావించాము’’ అని పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా ససెక్స్, మిడిల్సెక్స్ మధ్య మంగళవారం(జూలై 19) టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. మిడిల్సెక్స్ జట్టులో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 168 బంతులు ఎదుర్కొన్న నయావాల్ 66 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రాడ్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్ స్టో అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్ టైటిళ్లు గెలిచేది! Following the news of Tom Haines' injury, Cheteshwar Pujara has been named as interim captain. © Good luck to @cheteshwar1 and the team. 👏 #GOSBTS — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
Ind Vs Eng: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు: సిరాజ్
India Vs England 5th Test- Mohammed Siraj: ‘‘తనొక యోధుడు. ఆస్ట్రేలియాలో తానేంటో నిరూపించుకున్నాడు. ఇక్కడ కూడా అదే పునరావృతం చేస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి తను అండగా నిలబడతాడు. కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి తానున్నానని ధీమా ఇస్తాడు’’ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. అందుకు గల కారణాన్నీ వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. సీమర్ల దూకుడుకు తోడు పుజారా, రిషభ్ పంత్ పట్టుదలగా ఆడటంతో బుమ్రా సేనకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఆలౌట్ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా పుజారా, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి పుజారాకు బౌలింగ్ చేయడం కష్టం. ఎందుకంటే తను అటాక్ చేయడు. బంతులు వదిలేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నెట్స్‌లో బౌలింగ్ చేస్తుంటే విసుగు వస్తుంది. తను వారియర్. జట్టుకు అవసరమైనపుడు కచ్చితంగా రాణిస్తాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఆటగాడిగా అయినా, కెప్టెన్‌గా అయినా బుమ్రాలో ఎలాంటి మార్పూ ఉండదని.. అన్ని వేళలా అతడు తనకు అండగా నిలబడ్డాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేసిన ప్రతిసారి వాటిని సరిదిద్ది.. ఏ పరిస్థితుల్లో ఎలా బౌల్ చేయాలో నేర్పించేవాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి రిషభ్ పంత్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు. చదవండి: IND VS ENG: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ An action-packed day of Test cricket 🏏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/jbiekFiJ7H — England Cricket (@englandcricket) July 4, 2022 -
Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం!
India Vs England 5th Test: ‘‘257 పరుగుల ఆధిక్యం అంటే కాస్త కష్టమే! లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ జట్టు చాలా కష్టపడాలి’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియా మరో 150 పరుగులు చేస్తే అప్పుడు కొండంత లక్ష్యం ఆతిథ్య జట్టు ముందు ఉంటుందని.. స్టోక్స్ బృందానికి తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా సేన 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్ స్టో(106 పరుగులు) మినహా ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. The glorious summer of Jonny Bairstow 😍 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/Ycl8Odq8ur — England Cricket (@englandcricket) July 3, 2022 పుజారా పట్టుదల! ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ గిల్ విఫలమైనా.. మరో ఓపెనర్ ఛతేశ్వర్ పుజారా అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత్. దీంతో పర్యాటక జట్టుకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ టీమిండియా నయా వాల్ పుజారా ఆడిన తీరు అమోఘమని ప్రశంసించిన వాన్.. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారని పెదవి విరిచాడు. An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 మైకేల్ వాన్(ఫైల్ ఫొటో) టీమిండియాదే విజయం! ‘‘ఇలాంటి పిచ్ వాతావరణ పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి 139 బంతులు ఎదుర్కొని 50 పరుగులు(నాటౌట్) చేయడం అంత సులభమేమీ కాదు. నిలకడగా రాణిస్తూ ముందుకు సాగిన విధానం అమోఘం. పుజారా, పంత్ వంటి ఆటగాళ్లు ఉంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. వాళ్లిద్దరూ ఒక్కసారి పైచేయి సాధించారంటే అంతే సంగతులు. ఇప్పుడు 257 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈజీగా మరో 150 పరుగులు చేస్తుంది. అప్పుడు టార్గెట్ ఇంచుమించు 400. మిగిలింది రెండ్రోజుల ఆట. ఇంగ్లండ్ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియానే విజయం వరిస్తుందని జోస్యం చెప్పాడు. చదవండి: Ind Vs Eng 5th Test: వాళ్లేమో అదరగొడుతున్నారు.. వీళ్లేమో ఇలా.. ఛాన్స్ ఇస్తే జట్టులో పాతుకుపోవాలి! కానీ.. IND VS Northamptonshire: హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం -
ENG vs IND: ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’.. చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీ
గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. బర్మింగ్‌హామ్: ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’ బిగించింది. భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. సీమర్ల ఉత్సాహానికి బ్యాటర్లు జతకలవడంతో ఇంగ్లండ్ ముందు లక్ష్యం కొండంతలా పెరుగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. కోహ్లి 20 పరుగులే చేసి నిష్క్రమించగా, మరో ఓపెనర్ చతేశ్వర్ పుజారా (139 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్ల ముందు గోడలా నిలబడ్డాడు. హిట్టర్ రిషభ్ పంత్ (46 బంతుల్లో 30 బ్యాటింగ్; 4 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్ బిల్లింగ్స్ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 257 పరుగులకు చేరగా... చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది. భళా బెయిర్‌స్టో రెండో రోజు సగం వికెట్లను కోల్పోయి కుదేలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఆదివారం బెయిర్‌స్టో వెన్నెముకగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 84/5తో ఆట కొనసాగించిన బెయిర్‌స్టో, స్టోక్స్ కాసేపటికే జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. 81 బంతుల్లో 7 బౌండరీలతో బెయిర్‌స్టో ఫిఫ్టీ పూర్తికాగా... కాసేపటికే స్టోక్స్ (25; 3 ఫోర్లు) బుమ్రా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బిల్లింగ్స్ అండతో బెయిర్‌స్టో యథేచ్ఛగా బౌండరీలు బాదాడు. 119 బంతుల్లో (14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని షమీ అవుట్ చేయగా, టెయిలెండర్లలో పాట్స్ (19; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆలౌట్‌ను కాస్త ఆలస్యం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284. భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (బ్యాటింగ్) 50; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (బ్యాటింగ్) 30 ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75. బౌలింగ్: అండర్సన్ 14–5–26–1, బ్రాడ్ 12–1– 38–1, పాట్స్ 8–2–20–0, లీచ్ 1–0–5–0, స్టోక్స్ 7–0–22–1, రూట్ 3–1–7–0. -
'ఇంగ్లండ్ పిచ్‌లపై అతడి కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు'
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్ కౌంటీల్లో అడి తన ఫామ్‌ను తిరిగి పొందాడని అతడు కొనియాడాడు. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను పుజారా ఆరంభించే అవకాశం ఉంది. "పుజారాకు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లు మెరుగ్గా ఉండవచ్చని మీరు భావించవచ్చు. కానీ కౌంటీ క్రికెట్లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. కౌంటీ క్రికెట్లో ఆడి పుజారా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. అతడు ఎప్పడూ భారత జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడు. ఇక మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడు. ఇంగ్లండ్ వంటి బౌన్సీ పిచ్‌లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది కౌంటీల్లో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు. చదవండి: SL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8 -
షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా..
మనం ఇంటిదగ్గర ఆడుకునే క్రికెట్లో అవతలి జట్టులో ఎవరైనా వ్యక్తి తక్కువైతే మన జట్టులో నుంచి ఒక వ్యక్తిని అక్కడ సర్దుబాటు చేయడం చూస్తుంటాం. ఇలాంటివి గల్లీ క్రికెట్లో ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే లీస్టర్‌షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో జరిగింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వార్మప్ మ్యాచ్‌లో రెండు జట్ల తరపున బ్యాటింగ్‌కు వచ్చాడు. మొదట లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా పెవిలియన్ వెళ్తున్న పుజారాను వెనుక నుంచి హగ్ చేసుకొని వింత సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే మహ్మద్ షమీని ఎదుర్కోవడం కష్టంగా ఉందని భావించాడేమో రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీమిండియా తరపున బ్యాటింగ్‌కి వచ్చాడంటూ అభిమానులు పేర్కొన్నారు. కానీ అసలు సంగతి అది కాదు. వార్మప్ మ్యాచ్ నాలుగు రోజులే కావడం.. రోజు వర్షం కురుస్తుండడంతో ఆటకు అంతరాయం ఏర్పడుతుంది. మూడో రోజు ఆటలో కూడా ఉదయం పూట వర్షం అడ్డుపడింది. దీంతో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. ఒకవేళ నాలుగో రోజు లీస్టర్‌షైర్ తరపున ఆడితే వర్షం వల్ల పుజారాకు బ్యాటింగ్ అవకాశం రాకపోవచ్చని టీమిండియా భావించింది. అందుకే పుజారాను టీమిండియా తరపున బ్యాటింగ్‌కు దించింది.అయితే పుజారా మరోసారి విఫలమయ్యాడు. 22 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీగానే పరుగులు రాబడుతుంది. జట్టులో ప్రతీ ఒక్క బ్యాట్స్‌మన్ తలా ఇన్ని పరుగులు చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి అర్థసెంచరీతోనే సరిపెట్టాడు. ఇక ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన కోన శ్రీకర్ భరత్ 43 పరుగులు చేసి ఆకట్టుకోగా.. గిల్ 38, హనుమ విహారి 20 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 52, రవీంద్ర జడేజా 22 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోనున్న మధ్యప్రదేశ్..! కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్
కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో సున్నాకే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరీకి పుజారా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. పుజారా, షమీ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న పుజారా వైపు పరిగెత్తుకొచ్చిన షమీ వెనుక నుంచి అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజును 246/8తో ముగించిన టీమిండియా.. లీస్టర్షైర్లోని మిగతా టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం కోసం అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. అయితే ఉదయం సెషన్లో లీస్టర్‌షైర్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సామ్ ఇవన్స్, పుజారాలు ఔటయ్యాకా.. మరో ఓపెనర్ లుయిస్ కింబర్(31), జోయ్ ఎవిసన్(22) ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించారు. వీరిద్దరు ఔట్ కాగా.. ప్రస్తుతం లీస్టర్‌షైర్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 16, రిషి పటేల్ 13 పరుగులతో ఆడుతున్నారు. ☝️ | 𝐏𝐮𝐣𝐚𝐫𝐚 𝐛 𝐒𝐡𝐚𝐦𝐢. A second wicket for Shami. He dismisses his @BCCI teammate, as Pujara drags on. Evison joins Kimber (28*). 🦊 LEI 34/2 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/APL4n65NFa 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/ANf2NfhUAy — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022 చదవండి: Virat Kohli: రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా! రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..! -
Ind Vs Eng: నా రీ ఎంట్రీకి ప్రధాన కారణం అదే: పుజారా
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన నయావాల్ రంజీ ట్రోఫీ, ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరగబోయే ఏకైక టెస్టుకు పుజారాను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తిరిగి జట్టులోకి రావడంపై అతడు తాజాగా స్పందించాడు. రంజీ ట్రోఫీలో ఆడడం వల్ల తిరిగి తన ఫామ్‌లోకి వచ్చానని తెలిపాడు. "నేను ససెక్స్ జట్టులో చేరడానికి ముందు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో కలిసొచ్చింది. రంజీ ట్రోఫీలో నేను సౌరాష్ట్ర తరపున ఆడిన మూడు మ్యాచ్లలోను రాణించాను. అక్కడే తిరిగి నా రిథమ్‌ను పొందాను. రంజీ ట్రోఫీలో నా బ్యాటింగ్ టెక్నిక్‌లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నాను. ఇక నా ఫామ్‌ను తిరిగి పొందాక, జట్టులో విజయంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకున్నాను. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను ఆడటానికి ఎక్కువగా ఇష్టపడాతాను. ఇక పై నాకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాడానికి ప్రయత్నిస్తాను" అని బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు. చదవండి: SL vs AUS: కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్! స్టార్ ప్లేయర్ అవుట్! Spending quality time with family ☺️ Getting back into form 👏 Approach for the Test against England 👍 DO NOT MISS as @cheteshwar1 discusses it all in this special chat. 👌 👌 Full interview 🎥 🔽 #TeamIndia | #ENGvIND https://t.co/VFA7hoDgdr pic.twitter.com/q71k2CJbQX — BCCI (@BCCI) June 22, 2022 The grind is 🔛#TeamIndia sweat it out in the nets in the lead up to the rescheduled fifth #ENGvIND Test. 💪 pic.twitter.com/IZhxSLkAwH — BCCI (@BCCI) June 23, 2022 -
'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'
టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన పుజారా ఆ తర్వాత రంజీ ట్రోపీ, కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. కౌంటీలో ససెక్స్ తరపున నాలుగు సెంచరీలతో హోరెత్తించిన పుజారా ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. పూర్తి స్థాయి ఫామ్ అందుకున్న పుజారా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా జూలై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే మహ్మద్ కైఫ్ యువ ఆటగాళ్లనుద్దేశించి పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' పుజారా నుంచి యువ క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కసారి జట్టులో స్థానం కోల్పోతే ఒక బ్యాటర్‌గా మనం చేయాల్సిన పని ఏంటనేది పుజారాను చూసి నేర్చుకోవచ్చు. ఫామ్ కోల్పోయిన మాత్రానా ఆందోళన చెందొద్దు. స్వదేశానికి తిరిగి వెళ్లండి. రంజీల్లో ఆడండి.. లేదంటే కౌంటీల్లో ఆడి పరుగులు సాధించి తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోండి. పుజారా విషయంలో అదే జరిగింది. ఫామ్ కోల్పోయి విమర్శలు మూటగట్టుకున్న అతను కొన్ని నెలల పాటు ఏం చేశాడన్నది ఆసక్తిగా గమనించండి. పుజారా యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం.. అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పుజారా గొప్ప ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వాషింగ్టన్ సుందర్‌కు లక్కీ ఛాన్స్.. ప్రతిష్టాత్మక టోర్నీలో.. థాంక్యూ అంటూ భావోద్వేగం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. తిరిగి జట్టులోకి వస్తాడని ఎవరు ఊహించి ఉండరు'
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాకి తిరిగి జట్టులో చోటు దక్కింది. కాగా పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ఆడుతున్న పుజారా 8 ఇన్నింగ్స్‌లలో 720 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అద్భుతమైన పునరాగమనం చేసిన పుజారాపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుజారా నిబద్ధత, అంకితభావం కలిగిన ఆటగాడని అతడు కొనియాడాడు. "పుజారా భారత జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఇది అతడికి ఆట పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. అతడు మళ్లీ భారత జట్టులోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు. టెస్ట్ క్రికెట్లో తన ఫామ్‌ను తిరిగి పొందడానికి అతడు కౌంటీల్లో ఆడాడు. అక్కడ అత్యుత్తమ ప్రదర్శనలు చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి క్రెడిట్ మొత్తం అతడికే దక్కాలి. అతడు దాదాపు తన కెరీర్లో టెస్ట్ క్రికెటర్‌గానే ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆటగాడు జట్టులో లేకపోతే.. అద్భుతమైన టెస్ట్ క్రికెటర్‌ను కోల్పోతాం. అతడు ఇంగ్లండ్ సిరీస్‌లో బాగా రాణించి భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తే.. పుజారా ఖచ్చితంగా మరో రెండేళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను" అని ఎంస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. చదవండి: Daniel Vettori: ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్.. -
'ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'
ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టు నుంచి ఊధ్వసనకు గురైన వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటానికి పుజరా నిశ్చయించకున్నాడు. ఇక కౌంటీల్లో ఆడుతోన్న పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో పుజారా 720 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కౌంటీల్లో అద్భుతంగా రాణిస్తున్న పుజారాను సెలకెటర్లు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తన ఎంపికపై స్పందించిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆడకపోవడమే తనకు మంచిదైందని పుజారా తెలిపాడు. "మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఒక వేళ నన్ను ఐపీఎల్లో ఏదైనా జట్టు కొనుగోలు చేసి ఉంటే.. నాకు తుది జట్టులో అసలు అవకాశం దొరికేది కాదు. నేను నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకా ఏమి ఉండేది కాదు. అదే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడితే జట్టులో చోటుతో పాటు ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. అందుకే కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాను. నేను నా రిథమ్‌ను పొందడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాను. నేను ఇక్కడకు వచ్చేటప్పడే పాజిటివ్ దృక్పథంతో వచ్చాను. కానీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం మాత్రం నేను ఆడలేదు. నాఫామ్ను తిరిగి పొందడానికి ఒక పెద్ద ఇన్నింగ్స్ సహాయపడుతుందని నాకు తెలుసు" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA T20: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు -
'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. భారత జట్టులోకి తిరిగి వస్తాడు'
భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 717 పరుగులు సాధించాడు. పుజారా ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న పుజారా తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు." టీమిండియా ఇంగ్లండ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు, న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. కాబట్టి వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. దీంతో సౌతాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇప్పడు పుజారా కూడా అదే చేస్తున్నాడు. అక్కడ పరిస్థితుల్లో, ఇంగ్లండ్ బౌలర్లకు తిరేకంగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అయితే కౌంటీ పేస్ అటాక్‌కి, టెస్ట్ బౌలింగ్‌కు చాలా తేడా ఉంటుంది. అయితే ఒక బ్యాటర్ రిథమ్‌లో ఉన్నప్పుడు అదేం పెద్ద సమస్య కాదు. అతడు మళ్లీ తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడన్న నమ్మకం నాకు ఉంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: పుజారా కౌంటీ ఫామ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ -
భారత జట్టు నుంచి ఔట్.. ఇంగ్లండ్‌లో ఆడనున్న పుజారా!
భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు ససెక్స్ జట్టకు పుజారా ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఆస్ట్ల్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ స్థానంలో పుజారాకు చోటు దక్కింది. పుజారా మొదటి కౌంటీ మ్యాచ్ నుంచి టోర్నమెంట్ ముగిసే వరకు ససెక్స్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. “రాబోయే సీజన్లో చారిత్రాత్మక సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. నేను త్వరలో సస్సెక్స్ జట్టుతో చేరేందుకు ఎదురు చూస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. కానీ తొలి సారి సస్సెక్స్ ఆడడం సంతోషంగా ఉంది. అదే విధంగా క్లబ్ విజయానికి నావంతు కృషిచేస్తాను' అని ససెక్స్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఇక గత కొంత కాలంగా టెస్టుల్లో పుజారా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరగుతున్న టెస్టులకు పుజారాతో పాటు, రహానేలపై బీసీసీఐ వేటు వేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా 191 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! -
'రహానే, పుజారాలు జట్టులోకి రావడం కష్టమే'
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు రహానే, పుజారాలను పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం రంజీ సీజన్లో ఆడుతున్న ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ''ఒకటిన్నర దశాబ్దంపాటు రహానే, పుజారాలు టీమిండియా టెస్టు క్రికెట్లో కీలకపాత్ర పోషించారు. మిడిలార్డర్లో వీరిద్దరు కలిసి టీమిండియాకు ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే ప్రస్తుతం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యారు.రంజీల్లో ఆడుతూ ఫామ్ పుణికిపుచ్చుకొని మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది కష్టతరమే అనిపిస్తుంది. సౌతాఫ్రికా టూర్లో మూడు టెస్టుల సిరీస్‌లో ఈ ఇద్దరిలో ఒక్కరు ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ లేదంటే 80-90 పరుగులు చేసినా పరిస్థితి వేరుగా ఉండేది. రహానే ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికి సిరీస్ గెలవడంలో అది ఉపమోగపడలేదు. చదవండి: మౌనం వీడిన సాహా.. నాకు నా తల్లిదండ్రులు అలాంటివి నేర్పించలేదు ఇప్పటికి వారు తిరిగొస్తారా అంటే ఆ చాన్స్ కూడా ఉంది. రంజీ సీజన్లో ఈ ఇద్దరు స్థిరంగా 200- 250 పరుగులు చేస్తే కచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత టీమిండియా ఒకే ఒక్క టెస్టు ఆడనుంది. అది ఇంగ్లండ్ గడ్డపై. ఈ గ్యాప్‌లో ఐపీఎల్‌తో పాటు.. టి20 వరల్డ్‌కప్ జరగనుంది. దీంతో ఈ ఏడాది రహానే, పుజారాలు మళ్లీ టీమిండియాలో కనిపించే అవకాశాలు లేవు. ఇక వచ్చే ఏడాది చూసుకుంటే వీరిద్దరికి ఇప్పటికే 30 ప్లస్ వయసు ఉండడం.. వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఒకవేళ యువ ఆటగాళ్లు సత్తా చాటితే పుజారా, రహానేలకు దాదాపు దారులు మూసుకుపోయినట్లే. ఇప్పటికే ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాల కెరీర్ ముగిసినట్లేనని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రంజీ సీజన్లో రహానే ముంబై తరపున, పుజారా సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగారు. ముంబై తరపున సూపర్ సెంచరీతో రహానే సత్తా చాటగా.. అటు పుజారా సౌరాష్ట్ర తరపున 91 పరుగులతో రాణించాడు. శ్రీలంకతో టీమిండియా మొదట మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది.మొదటి టి20 ఈ నెల 24న లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరుగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహలీ వేదికగా తొలి టెస్టు(మార్చి 4 నుంచి 8 వరకు), బెంగళూరు వేదికగా రెండో టెస్టు(మార్చి 12 నుంచి 16 వరకు) జరగనుంది. చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గరం -
ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా!
Ranji Trophy 2021-22: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో పుజారా డకౌట్ కావడం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్‌ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అత్యధికంగా 91 పరుగులు పుజారా సాధించాడు. చదవండి: Ind Vs Wi 2nd T20: రోహిత్ ఆగ్రహం... అసహనంతో బంతిని తన్నిన హిట్‌మ్యాన్.. పాపం భువీ! -
ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!
టీమిండియా సీనియర్ టెస్టు క్రికెటర్లు రహానే, పుజారా, ఇషాంత్, వృద్ధిమాన్ సాహాలపై వేట పడనుంది. రాబోయే శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి ఈ నలుగురిని తప్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాబ్-ఫోర్ క్రికెటర్లకు వ్యక్తిగతంగానే సమాచారం అందించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నలుగురిని శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవద్దని సెలక్షన్ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ''రహానే, పుజారా, ఇషాంత్, సాహాలపై వేటు నిజమే. వీరి స్థానంలో కొత్త మొహాలకు చాన్స్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఫ్యాబ్-ఫోర్కు పర్సనల్‌గా సమాచారం అందించాం. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టులోని మరికొంతమంది సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయాలు అడిగాకే ఈ నిర్ణయానికి వచ్చామంటూ'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం పుజారా, రహానేలకు బ్రేక్ మాత్రమే.. పుజారా, రహానేలకు ఇది బ్రేక్ మాత్రమే అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరు జట్టుకు భారంగా మారారు. అయితే ఇప్పటికి వీరిద్దరు రాణిస్తారనే నమ్మకం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే ఎంత కాదనుకున్న రహానే, పుజారాలు ప్రస్తుతం టీమిండయా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లు. కాబట్టి రానున్న రంజీ సీజన్లో వీరిద్దరు రాణిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి రంజీ సీజన్ కీలకం. ఇషాంత్, సాహాల కెరీర్ ముగిసినట్లే.. ఇషాంత్, సాహాలను మాత్రం తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు వయసు పైబడడంతో ఫిట్నెస్ను అందుకోలేకపోతున్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. 33 ఏళ్ల వయసు ఉన్న ఇషాంత్ మహా అయితే మరో రెండేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లకు తోడూ సిరాజ్, శార్దూల్ లాంటి కొత్త బౌలర్లు వస్తుండడంతో ఇషాంత్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమై. దీంతో ఇషాంత్ రిటైర్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడున్నారు. పరోక్షంగా బీసీసీఐ కూడా ఇషాంత్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లే. చదవండి: IND Vs WI: కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే.. Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన ఇక సాహా విషయంలోనూ బీసీసీఐ ఇదే అభిప్రాయంతో ఉంది. రెగ్యులర్‌గా కాకున్నా ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తున్నప్పటికి సాహా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడూ వయసు కూడా 37 ఏళ్లు ఉండడం పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు కెరీర్ చరమాంక దశలో సాహా ఉన్నాడు. ఇప్పుడు జట్టులో స్థానం ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకపక్క రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు అన్ని ఫార్మట్లలోనూ రెగ్యులర్‌గా ఆటగాళ్లుగా మారిపోవడం.. వీరిద్దరు వికెట్కీపర్లు కావడంతో సాహాకు అవకాశాలు మరింతగా తగ్గిపోయాయి. కేఎస్ భరత్ లాంటి యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు కూడా వస్తుండడంతో సాహా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అందుకేనేమో ఎలాగూ టీమిండియాకు సెలక్ట్ కావడం లేదని ఈసారి రంజీ సీజన్‌కు దూరంగా ఉండాలని సాహా నిర్ణయం తీసుకున్నాడు. పైకి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నప్పటికి.. అంతర్లీనంగా తనకు అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 25-మార్చి 1 మధ్య తొలి టెస్టు(మొహలీ) మార్చి 5-9 రెండో టెస్టు(బెంగళూరు) తొలి టి20- మార్చి 13, మొహలీ రెండో టి20-మార్చి 15, ధర్మశాల మూడో టి20- మార్చి 18, లక్నో -
రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్!
టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్ లభించనున్నట్లు సమాచారం. తాజాగా ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరికి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2021 వార్షిక ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్‌లో వీరిద్దరు గ్రేడ్-ఏలో ఉన్నారు. కొంతకాలంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు. తమకు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకోకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతుండడంతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తోంది.ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. చదవండి: కేఎల్ రాహుల్ ఏ కోశాన్నైనా కెప్టెన్లా అనిపిస్తున్నాడా: బీసీసీఐ అధికారి అదే సమయంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలకు కాంట్రాక్ట్‌లో డిమోషన్ లభించనుందని వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఈ ఇద్దరు క్రికెటర్లు సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న రహానే, పుజారాలను గ్రేడ్-బి కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 28 మంది ఆటగాళ్లతో జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించేందుకు ముగ్గురు ఆఫీస్ బేరర్స్‌తో పాటు.. ఐదుగురు సెలక్టర్లు... జాతీయస్థాయి కోచ్‌లతో కమిటీ సిద్ధమైంది. త్వరలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఏడాది కాలంగా బౌలర్‌గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహ్మద్ సిరాజ్‌ను గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బికి మార్చే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్‌తో పాటు హనుమ విహారిలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇక ఉమేశ్ యాదవ్, ఇషాంత్శర్మలకు డిమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీసీసీఐ ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ నాలుగు కేటగిరీలు. అవి ఏ ప్లస్, ఏ , బి, సిలుగా ఉన్నాయి. ►ఏ ప్లస్ కేటగిరి కింద ఒక్కో ఆటగానికి వార్షిక కాంట్రాక్ట్‌పై రూ.7 కోట్లు చెల్లిస్తారు ►ఏ కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు. ►బి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.3 కోట్లు చెల్లిస్తారు ►సి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి చెల్లిస్తారు. గత సీజన్ (2021) బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా: ►గ్రేడ్ ఏ ప్లస్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ►గ్రేడ్ ఏ: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ►గ్రేడ్ బి: వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ ►గ్రేడ్ సి: కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. స్పందించిన పుజారా
టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగడంపై టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ట్విటర్ వేదికగా స్పందించాడు. ఏడేళ్లపాటు సారథిగా సేవలు అందించి, జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టాడని ప్రశంసలు కురిపించాడు. అతని సేవలు మరింతకాలం పాటు జట్టుకు అవసరమని అన్నాడు. కోహ్లి విజయవంతమైన కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడని పేర్కొంటూ అభినందనలు తెలిపాడు. సమర్థవంతమైన నాయకుడిగా జట్టుకు ఎనలేని సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని పుజారా చెప్పుకొచ్చాడు. కోహ్లి కెరీర్లో మరింత ఎదగాలని పుజారా ఆకాంక్షించాడు. ఇక ఇప్పటికే టీ20, వన్డే జట్ల నాయకత్వాన్ని వదులుకున్న కోహ్లి.. తనకెంతో ఇష్టమైన టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు అతను శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి కొనసాగాడు. ఎంఎస్ ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను 68 టెస్టులకు నాయకత్వం వహించాడు. వాటిల్లో భారత్ 40 మ్యాచుల్లో విజయం సాధించింది. Congrats @imVkohli, on a captaincy tenure you can truly be proud of! You have driven Indian cricket to greater heights, and am sure have a lot more to contribute. Wishing you the very best! 👍 pic.twitter.com/YeO2NLrFSF — cheteshwar pujara (@cheteshwar1) January 16, 2022 (చదవండి: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై.. అనుష్క ఎమోషనల్ పోస్ట్) -
క్యాచ్ మిస్ చేసిన పుజారా.. ఐదు పరుగుల పెనాల్టీ
కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో మూడో టెస్టులో పుజారా క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్ పంత్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
"టీమ్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు.. వాటిని నేను అసలు పట్టించుకోను"
జోహెన్స్‌బర్గ్ వేదికగా జరగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా నయావాల్ ఛతేశ్వేర పుజారా అర్ధసెంచరీ సాధించాడు. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న పుజారాకి ఈ అర్ధ సెంచరీ కాస్త ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో మూడోరోజు ఆట అనంతరం మాట్లాడిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకపోయినా ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన జట్టు మేనేజ్మెంట్కు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు. గత ఏడాదిగా తనపై వస్తున్న విమర్శలు గురించి పెద్దగా పట్టించుకోలేదని పుజారా చెప్పాడు. "టీమ్ మేనేజ్మెంట్ నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది, కాబట్టి బయట నాపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. మేము కష్టపడి ఆడుతాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పరుగులు చేయలేం. అటువంటి సమయంలో మాపై విమర్శలు రావడం సాధారణం. కానీ ఒక క్రికెటర్‌గా ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకు పోవాలి" అని పుజారా పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 86 బంతులు ఎదుర్కొన్న పుజారా 53 పరుగులు చేశాడు. చదవండి: సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా? -
'గోల్డెన్ డక్'.. ద్రవిడ్‌కు ఎదురుపడిన పుజారా; రియాక్షన్ అదుర్స్
Rahul Dravid Gesture Towards Pujara: టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ అయిన సంగతి తెలిసిందే. తన పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఎన్గిడి బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారాపై ట్రోల్స్ వర్షం మొదలైంది. పుజారను పక్కనబెట్టి శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలా పుజారా డకౌట్‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వక్తమవుతున్న వేళ టీమిండియా హెడ్‌కోచ్ ద్రవిడ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. చదవండి: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! మ్యాచ్‌లో ఔటైన తర్వాత డగౌట్‌కు చేరిన పుజారా కాసేపటి తర్వాత బయటికి వచ్చి బుమ్రా, ప్రియాంక్ పాంచల్ పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో ద్రవిడ్ లేచి డ్రెస్సింరూమ్కు వెళుతున్నాడు. ఇద్దరు ఎదురెదురు పడడంతో ద్రవిడ్... ''ఏం పర్లేదు'' అన్నట్లుగా తన చేతిని పుజారా భుజంపై తట్టడం కెమెరాలో రికార్డయింది. దీనికి రియాక్షన్‌గా పుజారా ఒక నవ్వు మొహం పెట్టడం ఆసక్తి కలిగించింది. ఈ చర్యను చూసిన చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. పుజారా బ్యాటింగ్‌పై తనకు నమ్మకముందని ద్రవిడ్ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియాలో సమావేశంలో పేర్కొన్నాడు. బహుశా ఆ నమ్మకంతోనే అతని బ్యాటింగ్ తీరుపై పుజారాను తిట్టకుండా వెన్నుతట్టి దైర్యం చెప్పాడంటూ పలువురు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ద్రవిడ్ చర్యపై కొందరు మాత్రం ప్రశంసలు గుప్పించారు.'' పుజారాతో వ్యవహరించిన తీరు ద్రవిడ్‌కు మాత్రమే చెల్లుతుందని.. ఎంతైనా కోచ్ కదా''..'' అందరి కోచ్‌ల్లోకెల్లా ద్రవిడ్ భిన్నంగా కనిపిస్తాడనేదానికి ఇదే ఉదాహరణ'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్ #SAvIND pic.twitter.com/SpMO6RtccL — Ashwin Natarajan (@ash_natarajan) December 26, 2021 -
అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్
Cheteswar Pujara Golden Duck 2 Times By Lungi Ngidi.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లో పుజారా అంతగా ఆకట్టుకోలేదు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు కలిపి.. నాలుగు ఇన్నింగ్స్‌లో 0, 47, 26,22 పరుగులు మాత్రమే చేశాడు. తాజగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా అదే పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతికి పుజారా ఔట్ కాగా.. అంతకముందు బంతికే మయాంక్(60) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా డకౌట్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా డకౌట్ కావడం విశేషం. 2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్ రూపంలో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్ డక్ కావడం ఆసక్తి కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పుజారాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొన్న కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రహానే .. ఇప్పుడు ప్రొటీస్ సిరీస్‌లో నువ్వు తయారయ్యావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా! -
Ind Vs Sa: చేసిన తప్పులే మళ్లీ మళ్లీ.. ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి!
Ind Vs Sa: VVS Laxman On Important Not Repeat Same Mistakes Rahane Pujara: తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా పదే పదే.. ఒకే తరహాలో వికెట్ పారేసుకోవడం సరికాదని టీమిండియా బ్యాటర్లకు వీవీఎస్ లక్ష్మణ్ చురకలు అంటించాడు. తప్పిదాలను గమనించి వాటిని పునరావృతం చేయకుండా ఉండాలని హితవు పలికాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించిన రహానే తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో రెండో టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. మరోవైపు.. పుజారాకు ముంబై టెస్టులో ఛాన్స్ వచ్చినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా వీరు అవుటైన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రహానే, పుజారా ఆట తీరుపై పెదవి విరిచాడు. ‘‘ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేయకూడదు. కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే అవుటైన విధానం.. పుజారా కాన్పూర్, ముంబై టెస్టులో పెవిలియన్ చేరిన తీరును గమనిస్తే విషయం అర్థమవుతుంది. ఒకే తరహాలో వారు వికెట్ పారేసుకున్నారు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘గిల్ కూడా అంతే... కాస్త కుదురుకున్నాడు అనుకునే సమయానికి అవుట్ అవుతాడు. శుభారంభాలను భారీ స్కోరుగా మార్చడం చాలా చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఈ లోపాలు సరిదిద్దుకుని... కసిగా ఆడితేనే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా సౌతాఫ్రికాకు పయనం కానుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. చదవండి: Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్! -
మాట నిలబెట్టుకోలేదు.. అజిత్ వాడేకర్ చెత్త రికార్డు సమం
Cheteshwar Pujara Worst Record No Century From 38 Innings In Tests.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ పుజారా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి సెంచరీ సాధిస్తానని చెప్పిన పుజారా కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేక తన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది! టీమిండియా తరపున బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వచ్చే పుజారా 2019లో ఆసీస్ పర్యటనలో ఆఖరిసారి సెంచరీ(193 పరుగులు) కొట్టాడు. అప్పటినుంచి 39 ఇన్నింగ్స్‌లుగా(కివీస్‌తో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లు కలుపుకొని) ఒక్క సెంచరీ చేయలేదు. తద్వారా ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంతకముందు టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ వాడేకర్ టెస్టుల్లో మూడో స్థానంలో వచ్చి 39 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ సాధించలేకపోయాడు. తాజాగా ఆ చెత్త రికార్డును పుజారా సమం చేశాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే ఇక అభిమానులు కూడా పుజారా ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న రహానే ట్రోల్ అయ్యాడు.. ఇప్పుడు పుజారా వంతు వచ్చింది. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో పుజారాపై వేటు పడడం ఖాయం.. రహానే, పుజారాలిద్దరిని తొలగించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. -
Ind Vs Nz Test Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఇదే!
BCCI announces India’s 16-man squad for New Zealand Tests: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. విరాట్ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అతడికి డిప్యూటీగా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా పేరును ప్రకటించింది. ఇక టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కి విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు: అజింక్య రహానే(కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, విరాట్ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి). ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: ►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్. ►రెండో టీ20- నవంబరు 19, రాంచి. ►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా. ►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్. ►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై. చదవండి: T20 World Cup 2021 Final: ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు మరి..అంతేగా అంతేగా!! -
అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు
లీడ్స్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను తన షాట్‌తో భయపెట్టాడు. మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 79వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మొయిన్ అలీ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని పుజారా స్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. అయితే పుజారా బ్యాక్‌ఫుట్ తీసుకొని బంతిని బలంగా బాదడంతో సెకన్ల వ్యవధిలోనే బౌండరీ లైన్‌కు వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కిందకు వంగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ అంపైర్ అలాగే నిల్చొని ఉంటే తల ఖాయంగా పగిలి ఉండేది. పుజారా కొట్టిన ఆ షాట్ గంటకు 98 కిమీ వేగంతో వెళ్లినట్లు తర్వాత మీటర్ రీడింగ్‌లో చూపించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బంతి ఎంత వేగంగా వెళ్లిందనేది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో ఉంది.. మీరు ఒక లుక్కేయండి. చదవండి: పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్ పోయింది: వాన్ ఇక పుజారా తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే ఇచ్చాడు. 11 ఇన్నింగ్స్‌ల నుంచి కనీసం అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయిన పుజారా కీలకదశలో రాణించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచినా పుజారా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనదైన మార్క్ చూపించాడు. ఓపెనర్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా ఆడుతూ 180 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇంకా 139 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా నాలుగోరోజు ఇంగ్లండ్ బౌలర్లను రోజు మొత్తం నిలువరించాల్సి ఉంది. పుజారా 91, కోహ్లి 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ENG Vs IND: స్పిన్ బౌలింగ్.. అందరూ హెల్మెట్లతోనే, కారణం అదే ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో pic.twitter.com/DhC0mwSxdu — Sportzhustle_Squad (@sportzhustle) August 27, 2021 -
ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?!
న్యూఢిల్లీ: టీమిండియా.. ఆస్ట్రేలియా 2020-2021 పర్యటనను అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. సుదీర్ఘ కాలం తర్వాత బ్రిస్బేన్ టెస్టులో గెలుపొంది, బార్డర్ గావస్కర్ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం ఫ్యాన్స్ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఈ టూర్ ద్వారానే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్(89 నాటౌట్) మ్యాచ్‌కే హైలెట్‌గా నిలవగా, పుజారా పట్టుదలగా నిలబడిన విధానం(56) అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ.. పుజారా, పంత్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడంటూ వ్యాఖ్యానించాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మార్కస్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ‘‘అవునా... మరి ఆస్ట్రేలియన్లు, ఆస్ట్రేలియన్లలా బ్యాటింగ్ చేయరు ఎందుకో’’ అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బ్రిస్బేన్ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కస్ వరుసగా 5, 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు సరదాగా స్పందించడం గమనార్హం. చదవండి: ఎన్నో మధుర జ్ఞాపకాలు.. నా గుండె తరుక్కుపోతోంది పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు.. -
పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు..
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్, టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో అతడి పాత్ర మరువలేనిదన్నాడు. గబ్బా టెస్టులో అతడి బ్యాటింగ్ శైలి చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ మాదిరిగానే అనిపించిందని పేర్కొన్నాడు. కాగా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో భాగంగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడా(ఒకటి డ్రా)తో గెలిచిన రహానే సేన అరుదైన ఘనత సాధించింది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన నిర్ణయాత్మక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(56), రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) చెలరేగి ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విషయాల గురించి మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ... ‘‘మ్యాచ్ చివరి రోజు క్రికెట్ ప్రేమికులకు కన్నులపండుగే అయ్యింది. ముఖ్యంగా పంత్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, నాకు మాత్రం పుజారా పట్టుదలగా నిలబడటం నచ్చింది. అతడు బంతులను ఎదుర్కొన్న విధానం చూస్తే ఓ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్ గురించి చెబుతూ.. ‘‘పంత్ సూపర్బ్‌గా ఆడాడు. ప్రతి ఒక్కరు అతడిలో ఉన్న మ్యాజిక్‌ను చూడగలిగారు. సిరీస్ కోల్పోవడం మాకు నిరాశే మిగిల్చింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజం’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు. చదవండి: Matthew Hayden: త్వరలోనే భారత్ మునుపటిలా మారిపోతుంది! -
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలుస్తాం: చతేశ్వర్ పుజారా
ముంబై: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ని టీమిండియా ఓడిస్తుందని టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ జరగనుంది. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిన్లో భాగంగా భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది. అయితే బుధవారం ముంబయికి చేరుకున్న టీమిండియా ముంబయిలో కఠిన నిబంధనల మధ్య ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనుంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్‌కి బయలుదేరనుంది. ఇంగ్లాండ్ టూర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చతేశ్వర్ పుజారా మాట్లాడుతూ.. టీమిండియా విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశాడు. చివరి సారిగా సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా 132 పరుగులు చేసి ఆజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది. (చదవండి:T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ) -
పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్!
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు చతేశ్వర్ పుజారా. సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు పుజారా. ఇది పుజారాకు సదావకాశమనే చెప్పాలి. కేవలం టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా.. ఈ సీజన్లో సత్తాచాటి తాను కూడా టీ20 ఫార్మాట్‌కు సరిపోతాననే సంకేతాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే విషయాన్ని పుజారా చాలాసార్లు చెప్పాడు కూడా. తనను టెస్టు ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారని, టీ20 తరహా దూకుడైన ఆటకు కూడా తాను సరిపోతానని పలుమార్లు విన్నవించుకున్న తర్వాత సీఎస్కే అతన్ని కొనుగోలు చేయడం ఒక మంచి పరిణామం. కాగా, ఈ ఐపీఎల్లో పుజారా ఎలా ఆడబోతాడు అనే దానిపై అటు ప్రేక్షకులు, ఇటు మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటివరకూ 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పుజారా కేవలం 390 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతని యావరేజ్ 21.0 కంటే తక్కువగా ఉంది. ఇదే అనుమానాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా పుజారా ఆటపై ఆసక్తిని ప్రదర్శిస్తూ అనుమానాలు వ్యక్తం చేశాడు. ‘చూద్దాం.. ఈ ఐపీఎల్లో పుజారా ఎంతవరకు రాణిస్తాడో చూడాలని ఉంది. టీ20 ఫార్మాట్లో పుజారా మెరుగ్గా రాణిస్తాడా అనేది నేను కచ్చితంగా చెప్పలేను. పుజారా ఒక గొప్ప బ్యాట్స్‌మన్.. కానీ పొట్టి ఫార్మాట్లో పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్. సాధ్యమైనంత త్వరంగా పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. నేను బ్రెట్ లీ పెద్ద ఫ్యాన్. ఈ ఫార్మాట్లో పుజారా ఏం చేస్తాడో చూడాలి’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో సీఎస్కేతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది! సీఎస్కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం -
పంత్ ఒక ప్రత్యేకం.. అది నా వల్ల కానేకాదు: పుజారా
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు చతేశ్వర్ పుజారా. ఏడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఆడుతుండటంతో పుజారా మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్‌లో కూడా భారీ షాట్లో ఆడుతూ తన ఆటకు పదునుపెడుతున్నాడు. మరికొన్ని ఐపీఎల్‌లు ఆడాలంటే పుజారా తనను తాను నిరూపించుకోవాల్సింది ఉంది. ఇక్కడ హిట్టింగే ప్రధానం. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో శ్రమిస్తున్నాడు. ఏప్రిల్10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో సీఎస్కే బృందంలో పుజారాకు చోటు దక్కుతుందా.. లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, కొన్ని విషయాల్ని షేర్ చేసుకుంటున్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో చాట్ చేసిన పుజారా.. స్కూప్, రివర్స్ స్కూప్ షాట్ల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ప్రధానంగా పంత్ ఆడే రివర్స్ స్కూప్ షాట్ల గురించి పుజారా తన మనసులో మాటను వెల్లడించాడు. ‘ రివర్ప్ స్కూప్ షాట్ల ఆడటంలో పంత్ ఒక ప్రత్యేకం. పంత్ తరహాలో రివర్స్ స్కూప్ ఆడటం నా వల్ల కానేకాదు. అది ఎప్పటికీ జరగదు కూడా. పంత్ ఒక ఫియర్లెస్ క్రికెటర్. అందుకే ఆ షాట్లను చాలా ఈజీగా ఆడుతున్నాడు. పంత్ ఆడే ఆ షాట్లను నేను కచ్చితంగా ఆడలేను. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అనేవాడు రివర్స్ స్కూప్ ఆడటం కష్టమనే నేను అనుకుంటా. నేను స్కూప్ షాట్లను భయం లేకుండా ఆడతా.. కానీ రివర్స్ స్కూప్ షాట్లను ఆడను. థర్డ్ మ్యాన్ పైనుంచి ఆడే ఆ షాట్లతో చాలా రిస్క్. ఆ షాట్లు ఆడటంలో పంత్‌కు అరుదైన టెక్నిక్ ఉందనే చెప్పాలి. పదే పదే ఆ షాట్లను ఆడమన్నా పంత్‌కు ఆ సత్తా ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పంత్ ఆ షాట్లు ఆడుతుంటే మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవాళ్లమంతా షాక్ అయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. మరి సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీతోనే ఆడుతున్న తరుణంలో ఫామ్‌లో ఉన్న పంత్‌ను కట్టడి చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోకతప్పదు. ఇక్కడ చదవండి: మెరుపులాంటి ఫీట్లు.. మతిపోయే క్యాచ్‌లు ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి -
వారు నన్ను తీసుకోలేకపోవడం బాధించింది: పుజారా
చెన్నై: ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు చతేశ్వర్ పుజారా. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు పుజారా సిద్ధమయ్యాడు. ఈసారి వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్కే దక్కించుకుంది. దాంతో అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన పుజారా.. 2011 నుంచి 2013 వరకూ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్‌నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదే పదే మొత్తుకున్నా పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి సీఎస్కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో ఉన్నాడు. అది నన్ను బాధించింది 2014 తర్వాత తాను ఐపీఎల్ ఆడకపోవడం ఒకటైతే, 2016, 2017 సీజన్లలో పాల్గొన్న గుజరాత్ లయన్స్ తనను తీసుకోలేకపోవడం తనను చాలా బాధించిందని పుజారా పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడిన పుజారా.. తన హోమ్ టౌన్(రాజ్‌కోట్)లో ఆడాలనే కోరిక బలంగా ఉండేదని, ఆ క్రమంలోనే గుజరాత్ లయన్స తనను తీసుకుంటుందని ఆశించానన్నాడు. కాకపోతే వారు తనను రెండు సీజన్ల వేలంలో కూడా కొనుగోలు చేయకపోవడం చాలా నిరాశపరిచిందన్నాడు. ఒకవేళ అప్పుడు వారు తనను తీసుకుని హోమ్ టౌన్లో ఆడే అవకాశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదన్నాడు. అదంతా గడిచి పోయిన గతమని, ప్రస్తుతం ఏమి చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నట్లు పుజారా తెలిపాడు. ఇక చివరి గేమ్ ఎవరితో ఆడారో గుర్తుందా అనే ప్రశ్నకు పుజారా సమాధానమిస్తూ.. ‘ నేను కింగ్స పంజాబ్ తరఫున చివరి సారి ఆడాను. ముంబై ఇండియన్స్‌తో వాంఖేడ్‌లో జరిగిన మ్యాచ్ అది. వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్లో తిరిగి ఆడబోతుండటం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: సీఎస్కే లాజిక్ అదేనా? -
ఐపీఎల్ 2021: సీఎస్కే లాజిక్ అదేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఐపీఎల్ సందడి వేలంతోనే ప్రారంభమవుతుందనే విషయం తప్పక ఒప్పుకోవాల్సింది. తమ అభిమాన జట్టు ఇలా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ తమ డ్రీమ్ టీమ్‌ను కూడా ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ అనూహ్యంగా ఎవరైనా జట్టులోకి వస్తే అతన్ని ఎందుకు తీసుకున్నారనే చర్చ, మంచి ఆటగాడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించకపోతే అది ఎందుకు జరిగిందనే వాదన కూడా చేస్తూ ఉంటారు. మరి ఈసారి చతేశ్వర్ పుజారా గురించే ఎక్కువ చర్చ నడిచింది. అసలు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) పుజారాను కొనుగోలు చేయడానికి కారణం ఏమిటనే డౌట్ కూడా వచ్చింది అభిమానులకు. పుజారా టెస్ట్ ప్లేయర్ కదా చెన్నై జట్టు ఎందుకు కొనుగోలు చేసారు..అనేది ఆ ఫ్రాంచైజీ అభిమానులకు అనుమానం. ఇక్కడ సీఎస్కే వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే చెప్పాలి. ధోనితో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటానికి భారత జట్టులో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఉంటారు. చాలా సంవత్సరాల వరకు ధోని యాంకర్ ప్లేయర్ గా ఉన్నారు. కానీ ధోని 5 డౌన్ వచ్చేసరికి …అప్పటికే చాలా వికెట్లు నష్టపోతున్నారు. కాబట్టి టాప్ 3 లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కోసం చెన్నై జట్టు వెతుకుతుంది. మురళి విజయ్ టీం లో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. టాప్ ఆర్డర్ లో ప్రెషర్ అంతా రాయుడు పైనే పడుతుంది. పైగా ఈ సారి వాట్సన్ కూడా రిటైర్ అవ్వడంతో చెన్నై జట్టు స్టాండ్ ఇచ్చే ప్లేయర్ కోసం చూస్తున్నారు. ఇంతకముందు జట్టులో రైనా ఉండడంతో చాలా బలంగా కనిపించింది. కానీ గత సీజన్ లో రైనా దూరమయ్యాడు. తద్వారా సీఎస్కే పటిష్టతను కోల్పోయింది. రితురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ ప్లేయర్స్ తో పార్టనర్ షిప్ బిల్డ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే పుజారాకు అవకాశం ఇచ్చారు అనిపిస్తుంది. టీ20ల్లో కూడా భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమని టీమిండియా కెప్టెన్‌గా ధోని ఉన్న సమయంలో చాలాసార్లు స్పష్టం చేశాడు. వికెట్లు పడిపోతున్నప్పుడు తిరిగి గాడిలో పడాలంటే వికెట్లను కాపాడే ప్లేయర్ ఉండాలనే విషయాన్ని ధోని గట్టిగా నమ్ముతాడు. దాంతోనే పుజారాను సీఎస్కే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిందని చెప్పాలి. కొన్ని ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడటానికి సిద్ధమైన పుజారాను సీఎస్కే తీసుకోవడానికి ఎఫెన్సే కాదు.. డిఫెన్స్ కూడా కావాలనే ధోని బలంగా నమ్మే సూత్రమే కారణం కావొచ్చు. 2014లో చివరిసారి ఐపీఎల్లో కనిపించిన పుజారా.. ఏడేళ్ల అనంతరం వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకూ ఐపీఎల్ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. ఇక్కడ చదవండి: ఐపీఎల్... ప్రేక్షకుల్లేకుండానే! -
ఏడేళ్ల తర్వాత పుజారా
చెన్నై: తాను ఐపీఎల్‌కు సిద్ధమని గత కొన్ని సీజన్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్న చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు మరొకసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పుజారాను 50 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా.. చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడాడు. సుమారు ఏడేళ్ల తర్వాత పుజారా మరొకసారి ఐపీఎల్‌కు ఆడటం విశేషం. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. పుజారా కోసం ఎవరూ పోటీ లేకపోవడంతో సీఎస్కే శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. ఈసారి వేలంలో పుజారా పేరు రాగానే సీఎస్కే కనీస ధరకు బిడ్‌కు వెళ్లింది. కాగా, మిగతా ఫ్రాంచైజీలు ఏవీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో కనీస ధరతోనే ఐపీఎల్-14లో అడుగుపెట్టబోతున్నాడు పుజారా. ఇక్కడ చదవండి: మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
13572 బంతులు.. 18 సెంచరీలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా నేడు 33వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆట పట్ల అతడి నిబద్ధత, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ల వెల్లువ కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ‘‘ హ్యాపీ బర్త్‌డే పుజ్జీ.. నువ్వు ఎల్లప్పుడూ సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్నో గంటల పాటు క్రీజులో ఉండాలి. రాబోయే సంవత్సరం నీకు మరింత గొప్పగా ఉండాలి’’ అని విష్ చేశాడు. ఇక బీసీసీఐ సైతం ఈ నయా ‘వాల్’కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.(చదవండి: 'నాన్నకు దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ముద్దిస్తా') ‘‘81 టెస్టులు, 6111 పరుగులు.. ఎదుర్కొన్న బంతులు 13572, 18 సెంచరీలు.. శరీరానికి ఎన్నో గాయాలవుతున్నా లెక్కచేయడు. ధైర్యంగా నిలబడతాడు. టీమిండియా మిస్టర్ డిపెండబుల్ పుజారా హ్యాపీ బర్త్‌డే’’ అని ట్వీట్ చేసింది. నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై పుజారా సాధించిన చిరస్మరణీయ సెంచరీ(143 పరుగులు) చేసిన అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా బీసీసీఐ షేర్ చేసింది.(చదవండి: పుజారా ఆడకపోయుంటే...) కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. ముఖ్యంగా నిర్ణయాత్మక గబ్బా టెస్టులో, మ్యాచ్‌ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఒంటికి ఎన్ని గాయాలు అవుతున్నా తట్టుకుని నిలబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్ వేసిన బంతులు వేగంగా దూసుకువస్తున్నా ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆసీస్ బౌన్సీ పిచ్‌లపై అంత సేపు క్రీజులో ఉండి మిస్టర్ డిపెండబుల్ అని మరోసారి నిరూపించుకున్నాడు. He takes body blows Grinds it out in the middle Braves it all & stands tall 81 Tests 🏏 6111 runs 👌 13572 balls faced 👏 18 hundreds 👍 Here's wishing #TeamIndia's Mr. Dependable @cheteshwar1 a very happy birthday 🎂 Let's relive one of his fine tons against Sri Lanka 🎥👇 — BCCI (@BCCI) January 25, 2021 -
టార్గెట్ 70; బిగ్ వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ఆసీస్ విధించిన 70 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 5) ఔటైన కాసేపటికే కీలక బ్యాట్స్‌మన్ పుజారా (4 బంతుల్లో 3) వికెట్ కోల్పోయింది. మయాంక్‌ను స్టార్క్ పెవిలియన్ పంపగా.. పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని గల్లీలో ఉన్న గ్రీన్ చేతిలో పడటంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లకు 36 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (8), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నారు. ఇక అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని కృత నిశ్చయంతో ఉంది. మరో 34 పరుగులు చేస్తే టీమిండియా బాక్సింగ్ డే టెస్టును సొంతం చేసుకుంటుంది. -
పుజారా గోడ.. ద్రవిడ్ కంటే బలమైనదట!
అడిలైడ్ : టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటుంది. బ్యాట్స్‌మెన్ తమ ఇన్నింగ్స్‌ను నత్తనడకన సాగిస్తూ బౌలర్లకు చిరాకు తెప్పిస్తుంటారు. కొన్నిసార్లు బ్యాట్స్మెన్లు ఆడే జిడ్డు ఇన్నింగ్స్‌లే జట్టును ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీమిండియా క్రికెట్లో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తర్వాత జిడ్డు క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయిన వ్యక్తి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. ద్రవిడ్ తన 16 ఏళ్ల కెరీర్లో టెస్టు క్రికెట్లో డిఫెన్స్ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పాడు. అతని కాలంలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో ఎన్నో జిడ్డు ఇన్నింగ్స్‌లు ఆడి చాలాసార్లు ఓటమి నుంచి తప్పించాడు. అందుకే 'ది వాల్' అనే పేరును ద్రవిడ్ తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ద్రవిడ్ తరహాలోనే టీమిండియాకు టెస్టుల్లో మరో వాల్‌గా తయారయ్యాడు... చటేశ్వర్ పుజారా.. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన పుజారా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు.(చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) తాజాగా అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతుంది. టెస్ట్ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా మతి పోతుంది. టెస్టు క్రికెట్ అంటే ఎలా ఉంటుందో ఆసీస్ ఆటగాళ్లకు చూపిస్తున్నాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదవ్వకుండానే ఓపెనర్ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పుజారా ఎంతో ఓపికగా ఆడుతూ 145 బంతుల ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా లేకుండా 30 పరుగులు చేశాడు. బహుశా తన కెరీర్లో అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. వాస్తవానికి అది పుజారా తప్పు కాదు.. పిచ్ పరిస్థితి బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అయితే పుజారా ఆటతీరుపై సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. అసలైన టెస్టు క్రికెటర్ అంటే పుజారా.. మా పుజారా సిమెంట్ అంబుజా సిమెంట్ కంటే దృడంగా ఉంటుంది.. పుజారా కట్టే గోడ ద్రవిడ్ గోడ కన్నా బలంగా ఉంటుంది.. ద్రవిడ్ తర్వాత మాకు మరో వాల్ దొరికాడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : వైరల్ : ఒకరినొకరు తోసుకున్న ఆటగాళ్లు) ఇక తొలి టెస్టులో టీమిండియా తన ఇన్నింగ్స్‌ను నత్తనడకన కొనసాగిస్తుంది. మొదటిరోజు రెండో సెషన్లో భాగంగా టీమిండియా 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. పుజారా 31, కోహ్లి 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి,పుజారాలు కలిసి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ లంచ్ విరామానికి వెళ్లారు. Rahul Dravid right now pic.twitter.com/2DAAM0i81V — Millennials United (@90sKids_United) December 17, 2020 -
చరిత్రను రిపీట్ చేస్తాం: పుజారా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో చరిత్ర పునరావృతం అవుతుందని భారత బ్యాట్స్‌మన్ పుజారా నమ్మకంగా చెప్పాడు. వార్నర్, స్మిత్‌లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారినప్పటికీ... భారత పేసర్ల రాణింపుతో మరోసారి ఆసీస్‌ను ఓడించి టీమిండియా సిరీస్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 71 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారిగా 2018–19 పర్యటనలో ఆసీస్‌ను టెస్టుల్లో వారి దేశంలో 2–1తో ఓడించింది. ఈ పర్యటనలో 3సెంచరీలతో కలిపి 500లకు పైగా పరుగులు సాధించిన పుజారా ఈ చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్మిత్, వార్నర్ లేనప్పటికీ భారత్‌కు అప్పటి విజయాలు అంత తేలిగ్గా ఏమీ రాలేదని పుజారా అన్నాడు. ఈసారీ తాను బ్యాట్‌తో రాణిస్తానని విశ్వాసం వెలిబుచ్చాడు. -
‘నా వన్డే జట్టులో పుజారా ఎప్పుడూ ఉంటాడు’
న్యూఢిల్లీ: చతేశ్వర్ పుజారా.. భారత క్రికెట్ జట్టులో టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడిన ఆటగాడు. ఇదే అతనికే తీవ్ర నష్టం చేసింది కూడా. సుదీర్ఘ ఫార్మాట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉండే పుజారా.. వన్డే ఫార్మాట్లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోడనే అపవాదుతో అతన్ని కనీసం ఐపీఎల్లో కూడా పరిశీలించడం లేదు. ఎప్పుడో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న పుజారా.. గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్ వేలానికి అందుబాటులోకి వస్తున్నా అతని వైపు కనీసం ఎవరూ చూడటం లేదు. తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోతానని పదే పదే మొత్తుకున్నా పుజారాకు నిరాశే ఎదురవుతోంది. అయితే పుజారాకు తన వన్డే జట్టులో ఎప్పుడూ చోటు ఉంటుందని అంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ దిలీప్ జోషీ.(ఐపీఎల్ అజెండాగా...) ‘పుజారా నా వన్డే జట్టులో ఎప్పుడూ ఉంటాడు. అతన్ని నా వన్డే జట్టు నుంచి ఎప్పుడూ తీయను కూడా. అవసరమైతే ఇన్నింగ్స్ చివరి వరకూ పుజారానే ఉండమని కూడా అడుగుతా. పుజారా 50 ఓవర్ల పాటు సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేయడంలో పుజారా దిట్ట. టెస్టు క్రికెట్లో అవసరమైన ఆటగాడు, వన్డేలకు ఎందుకు పనికిరాడో అర్థం కావడం లేదు. ఒకే తరహా బ్యాటింగ్ అతనికి శత్రువులా మారింది. పుజారాలాంటి హైప్రొఫైల్ ఆటగాడు చాలా నెమ్మది అంటూ అవకాశాలు ఇవ్వకపోవడం నాకు బాధనిపిస్తోంది. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత గేమ్ స్వరూపమే మారిపోయింది. నాకు తెలిసినంత వరకూ ఒక మంచి క్లబ్ నుంచి వచ్చిన నాణ్యమైన ఆటగాడు టీ20ల్లో ఫిట్ అవుతాడనే విషయం తెలుసుకోవాలి’ అని దిలీప్ జోషీ పేర్కొన్నాడు. అసలు సిసలు చాలెంజ్ అంటే అది టెస్టు క్రికెట్ అని విషయం క్రికెట్ పెద్దలు గుర్తించాలన్నాడు. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా.. వన్డే ఫార్మాట్లో ఐదు మ్యాచ్‌లకే పరిమితిమైనా, టెస్టు ఫార్మాట్లో 77 మ్యాచ్‌లు ఆడాడు. ఇక దిలీప్ జోషీ 33 టెస్టులు, 15 వన్డేలకు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. -
నాపై ద్రవిడ్ ప్రభావం చాలా ఎక్కువ
రాజ్‌కోట్: టెస్టు క్రికెట్లో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు, ప్రస్తుత టీమిండియా సభ్యుడు చతేశ్వర్ పుజారాకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మూడో స్థానంలో ఆడటం నుంచి బ్యాటింగ్ శైలి వరకు చాలా సందర్భాల్లో ఇద్దరి ఆట ఒకే తరహాలో ఉంటుంది. ఈ విషయాన్ని పుజారా కూడా అంగీకరిస్తాడు. నిజానికి ఆటతో పాటు వ్యక్తిగతంగా కూడా తనపై ద్రవిడ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పుజారా చెప్పాడు. చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను చూస్తూ పెరిగానని... తనంతట తానుగా అనుకరించకపోయినా ఆ శైలి వచ్చేసిందని అతను అన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను నేను చాలా బాగా పరిశీలించేవాడిని. పట్టుదలగా క్రీజులో నిలవడం, సులువుగా వికెట్ ఇవ్వకపోవడం నా మనసులో ముద్రించుకుపోయాయి. ఆయనను ఇంతగా అభిమానించినా అనుకరించాలని మాత్రం అనుకోలేదు. ఇద్దరి శైలి ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే. దేశవాళీలో బలహీనమైన సౌరాష్ట్ర తరఫున ఆడటంతో జట్టు కోసం సుదీర్ఘంగా క్రీజ్‌లో పాతుకుపోవాల్సి వచ్చేది. అది అలా అలవాటైంది. భారత జట్టు తరఫున ఆయనతో కలిసి ఆడినప్పుడు మాత్రం పలు సూచనలిచ్చారు. టెక్నిక్‌పై దృష్టి పెడితే సరిపోదని ఇంకా ఇతర అంశాలపై కూడా పట్టు సాధించాలని ద్రవిడ్ నాకు సూచించారు’ అని పుజారా వెల్లడించాడు. క్రికెట్ బయట కూడా జీవితం ఉంటుందని, అప్పుడు ఎలా ఉండాలో ద్రవిడ్ నేర్పించాడని పుజారా గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్ మాత్రమే కాకుండా జీవితం ప్రాధాన్యత ఏమిటో నేను అర్థం చేసుకునేలా ఆయన చేశారు. ఆట ముగిశాక ఎలా ఉండాలో నేర్పించారు. ప్రొఫెషనల్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా భిన్నంగా చూడాలో కౌంటీ క్రికెట్లో నాకు తెలిసింది. ద్రవిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి. నాపై ఆయన ప్రభావం ఏమిటో ఒక్క మాటలో చెప్పలేను’ అని పుజారా తన అభిమానాన్ని ప్రదర్శించాడు. 32 ఏళ్ల పుజారా 10 ఏళ్ల కెరీర్లో 77 టెస్టుల్లో 48.66 సగటుతో 5,840 పరుగులు సాధించాడు. 5 వన్డేల్లో కూడా అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
మళ్లీ బ్యాట్ పట్టిన పుజారా...
న్యూఢిల్లీ: మూడు నెలల విరామం అనంతరం భారత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా మళ్లీ బ్యాట్ పట్టాడు. కరోనా లాక్డౌన్ సడలింపులతో.... రాజ్‌కోట్‌లోని తన క్రికెట్ అకాడమీలో రంజీ జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పుజారా... గత ఏడాది తన జట్టుకు తొలి రంజీ టైటిల్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాడు. రంజీ ఫైనల్ అనంతరం పుజారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. తను ప్రాక్టీస్ చేసే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పుజారా ‘నేనొచ్చేశా... చాలా కాలం దూరంగా ఉన్నట్లు అనిపించింది... అయితే ప్రాక్టీస్ మొదలుపెట్టాక నిన్ననే ప్రాక్టీస్ చేసినట్లు అనిపించింది’ అంటూ దానికి కామెంట్ జత చేశాడు. -
‘అతన్ని ఔట్ చేసే మార్గం కోసం అన్వేషణ’
సిడ్నీ: 2018-19 సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో (ఏడు ఇన్నింగ్స్‌ల్లో) 521 పరుగులు సాధించి భారత్ టెస్టు సిరీస్‌ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో పుజరా అత్యధిక వ్యక్తిగత స్కోరు 193 కాగా మూడు సెంచరీలు సాధించాడు. అయితే ఈసారి అలా కానివ్వని అంటున్నాడు ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్. ప్రస్తుతం నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్‌కు పుజారా బెంగ పట్టుకుంది. దానిలో భాంగా పుజారా బ్యాటింగ్‌పై కసరత్తు చేస్తున్నాడు కమిన్స్. ఈ సీజన్లో చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉండటంతో పుజారా బ్యాటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు కమిన్స్. (నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్) ‘సాధ్యమైనంత వరకూ పుజారా క్రీజ్‌లో ఉండటానికి యత్నిస్తాడు. సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేసినా ఎక్కడ ఆందోళన లేకుండా క్రీజ్‌లో ఉంటాడు. అది అతనిలో ప్రత్యేకత. పుజారాను ఔట్ చేయడానికి మార్గాలు అన్వేషించాలి. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా బ్యాటింగ్‌తో అలరించాడు. అందుకోసం పిచ్‌లను మార్చాల్సిన అవసరం ఏమీ లేదు.. దేన్నీ తయారు చేయాల్సిన అవసరం లేదు. మా బౌలింగ్ బలంతోనే పుజారాను త్వరగా ఔట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వికెట్ బౌన్స్‌కు అనుకూలిస్తే మా వద్ద మరిన్ని ఆప్షన్లు ఉంటాయి. చూద్దాం. ఏమి జరుగుతుందో’ అని కమిన్స్ తెలిపాడు. తాను ఆడే ప్రతీ టెస్టు నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి యత్నిస్తూ ఉంటానన్నాడు. ‘ప్రతీ సిరీస్‌కు మెరుగు పడుతూ ముందుకు సాగడమే నా లక్ష్యం. టెస్టు క్రికెట్ అనేది చాలా కొత్త పాఠాలను నేర్పుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెస్టు క్రికెట్ అనేది ఘోరంగా సాగుతుంది. ప్రత్యర్థి జట్లు మొత్తం రోజంతా బ్యాటింగ్ చేస్తే, మరొక సందర్భంలో వారు బ్యాటింగ్‌ను కుప్పకూల్చడం వంటిది జరుగుతూ ఉంటుంది’ అని కమిన్స్ తెలిపాడు. (ధోనిని ఏనాడు అడగలేదు: రైనా) ఐపీఎల్ -13వ సీజన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు ఉండగా, రూ. 15.50 కోట్లు వెచ్చించీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంచితే, భారత స్పెషలిస్టు టెస్టు ప్లేయర్‌గా ముద్ర సంపాదించుకున్న చతేశ్వర పుజారా.. ఐపీఎల్ ఆడి దాదాపు ఆరేళ్ల అవుతుంది. టెస్టు ఆటగాడిగా ముద్ర పడిన పుజారాను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముందుకు రావడం లేదు. దాంతో తిరిగి ఐపీఎల్ ఆడాలనుకుంటున్న పుజారా కల నెరవేరడం లేదు. తాను పరిస్థితులకు తగ్గట్టు ఆడతానని పదే పదే చెప్పుకుంటున్నా పుజారాపై ఆసక్తి కనబరచడం లేదు. -
‘ఆ భారత బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చాలా కష్టం’
సిడ్నీ: ఐపీఎల్ -13వ సీజన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు ఉండగా, రూ. 15.50 కోట్లు వెచ్చించీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంచితే, భారత స్పెషలిస్టు టెస్టు ప్లేయర్‌గా ముద్ర సంపాదించుకున్న చతేశ్వర పుజారా.. ఐపీఎల్ ఆడి దాదాపు ఆరేళ్ల అవుతుంది. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..!) 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఓపెనర్‌గా దిగిన పుజారా మళ్లీ ఆ లీగ్‌లో కనిపించలేదు. అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో పుజారాను వేలంలో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వేలంలో పదే పదే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా ఏ ఫ్రాంచైజీ కూడా కనీస ధర కూడా తీసుకోవడం లేదు. తాను మూడు ఫార్మాట్లకు సరిపోయే క్రికెటర్‌నని పుజారా చెప్పుకుంటున్నా అతన్ని కొనుగోలు చేయడం లేదు. అయితే టెస్టుల్లో ప్రపంచ నంబర్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్.. పుజారాకు బౌలింగ్ చేయడమే కష్టమంటున్నాడు. భారత జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లునప్పటికీ పుజారాకు బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిందని వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది అనే ప్రశ్నకు తడుముకోకుండా పుజారా అని సమాధానమిచ్చాడు కమిన్స్. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌కు కమిన్స్ పలు ప్రశ్నలకు బదులిచ్చాడు. దీనిలో భాగంగా ‘మీకు ఎదురైన అత్యుత్తమ భారత టెస్టు ఆటగాడు’ ఎవరు అంటే పుజారా అని చెప్పుకొచ్చాడు.(అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..!) ‘ పుజారా ఒక అసాధారణ ఆటగాడు. 2018-19 సీజన్లో జరిగిన సిరీస్‌లో పుజరా కీలక పాత్ర పోషించాడు. నాకు సవాల్‌గా నిలిచిన భారత ఆటగాడు పుజారా. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అసలు ఏ బంతులు వేయాలో అర్థమయ్యేది కాదు. రోజు-రోజుకీ కఠినంగా మారిపోయేవాడు పుజారా’ అని కమిన్స్ తెలిపాడు. ఆ సీజన్ టెస్టు సిరీస్‌లో పుజారా నాలుగు టెస్టు మ్యాచ్‌లు(ఏడు ఇన్నింగ్స్‌ల్లో) 521 పరుగులు సాధించి భారత్ టెస్టు సిరీస్‌ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో పుజరా అత్యధిక వ్యక్తిగత స్కోరు 193 కాగా మూడు సెంచరీలు సాధించాడు. -
పుజారా ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్‌షైర్ రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం ఆ జట్టు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అతను ఏప్రిల్ 12–మే 22 మధ్య నాలుగు రోజుల పాటు సాగే 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ (కోవిడ్–19) విజృంభణతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్డౌన్లో ఉండటంతో అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ దేశంలో మే 28 వరకు జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పుజారాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని... అందుకే రద్దు చేస్తున్నట్లు గ్లౌసెష్టర్‌షైర్ పేర్కొంది. (‘మనసులోని కోరికను బయటపెట్టిన పుజారా’) -
‘మనసులో మాట.. ఆల్‌రౌండర్‌గా మారాలి’
హైదరాబాద్: లాక్‌డౌన్‌లోనూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని క్రికెటర్లు అందిస్తున్నారు. మొన్నటివరకు మైదానంలో తమ ఆటతో ఉర్రూతలూగించిన క్రికెటర్లు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ను కాస్త రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చహల్, రిషబ్ పంత్, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్‌లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో సహచర క్రికెటర్లతో పాల్గొంటున్నారు. తాజాగా టీమిండియా స్పెషలిస్టు టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా కూడా ఇన్‌స్టా లైవ్ చాట్‌లోకి వచ్చాడు. సౌరాష్ట క్రికెట్ జట్టు సారథి జయదేవ్ ఉనాద్కత్‌తో సరాదాగా సంభాంషించాడు. ఈ సందర్భంగా పుజారా తను ఆల్‌రౌండర్ కావాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా రంజీల్లో సౌరాష్ట్ర తరుపున 203 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసిన విషయాన్ని గుర్తుచేశాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న ఉనాద్కత్ ‘సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడానికి నీ బౌలింగే కారణమంటావే ఏంటి?’అని ప్రశ్నించాడు. అయితే తను అలా అనడం లేదని, ప్రస్తుతం పార్ట్ టైమ్ బౌలర్‌గా ఉన్న తను పూర్తి ఆల్‌రౌండర్‌గా మారాలని అనుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఇక రంజీ ట్రోఫీ సౌరాష్ట గెలవడం అత్యంత ఆనందం కలిగించిందన్నాడు. అయితే జ్వరం, గొంతు నొప్పితోనే బెంగాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. లాక్డౌన్ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని సూచించాడు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడే తన భార్యకు సహాయంగా ఉంటానని, ఇప్పుడు ఆమెకు వంటింట్లో, ఇతర పనుల్లో సాయం చేస్తున్నట్లు తెలిపాడు. గతంలో వంట చేసేవాడినని కానీ ప్రస్తుతం ఆ సాహసం చేయట్లేదని తెలిపాడు. ఇక వీరిద్దరికి సంబంధించిన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘క్రీజులో పాతుకపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే పుజారాను ఆదర్శంగా తీసుకొని లాక్డౌన్లో అందరూ ఓపికగా ఇంట్లోనే ఉండాలి’అని ఓ నెటిజన్ పేర్నొన్నాడు. View this post on Instagram The day when I changed my Batsman status to an All-rounder 😂😂 A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on Dec 27, 2019 at 6:32am PST చదవండి: చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు! మహ్మద్ కైఫ్‌కు షోయబ్ అక్తర్ సవాల్ -
లాక్‌డౌన్‌తో ఇద్దరం బిజీ అయిపోయాం: పుజారా
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. కోవిడ్-19 సృష్టించిన సంక్షోభంతో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగమూ కుదేలైంది. చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ వాయిదా పడింది. భారత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ టోర్నీకి అదే గతి పట్టింది. ఏప్రిల్ 15న మొదలు కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడగా.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటివరకు బీసీసీఐ ప్రకటించలేదు. ఈక్రమంలో భారత టెస్టు ఆటగాడు చతేశ్వర్ పుజారా లాక్డౌన్ సంకట స్థితిని ఎలా ఎదుర్కొంటున్నాడో మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. (చదవండి: కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) ‘భారత్‌లో 21 రోజుల లాక్డౌన్ సరైన సమయంలో తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. లాక్‌డౌన్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నా. కీలకమైన లాక్డౌన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరగా తీసుకుంది. లేదంటే అమెరికాలో తలెత్తిన పరిస్థితులు మనకూ ఎదురయ్యేవి కావొచ్చు. మనది అధిక జనభా గల దేశం. లాక్‌డౌన్‌తో మాత్రమే మనం వైరస్‌ను ఎదుర్కోగలం. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి ఇళ్లల్లోనే ఉండండి. ఒక ఆటగాడిగా లాక్‌డౌన్‌తో నాకూ ఇబ్బందులు తప్పవు. కానీ, తప్పదు. సానుకూలంగా ఆలోచించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. View this post on Instagram Let us all unite in fighting corona virus by religiously practising 21 days lockdown. Stay at home and help your family with household chores and practise hobbies whilst practising social distancing. #StayHome #StaySafe #IndiaFightsCorona #IndiaStandTogether A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on Mar 24, 2020 at 8:52am PDT ఇళ్లల్లోనే ఉండి ప్రజలు ఇన్నోవేటివ్‌గా ఆలోచించండి. ఇదివరకు చేయని పనులు చేయండి. కుంటుంబంతో ఎక్కువ సమయం గడపండి. నేనైతే పూర్తి సమయం కుటుంబానికే కేటాయించా. వారికి నా వంతు సాయం చేస్తున్నా. నా రెండేళ్ల కూతురు అదితితోనే రోజంతా గడిచిపోతోంది. చాలా బిజీ అయిపోయాం ఇద్దరం. చిన్నారిని ఫొటోలు తీయడం.. ఆమెతో ఆడుకోవడంతో తెగ సంబరపడిపోతోంది. మామూలుగా అయితే ఆమెకు నేను అందుబాటులో ఉండను. అన్నీ నా భార్యే చూసుకుంటుంది. ఇప్పుడు టైం దొరికింది. చిన్నారి అదితి చాలా హ్యాపీగా ఉందిప్పుడు. ఐసోలేషన్‌లో ఉండటం సమస్యగా భావించకూడదు. ఏదేనీ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చినా కూడా నాకు బోర్ అనిపించదు. బుక్స్ చదవడంతో కాలక్షేపం చేస్తా. లాక్‌డౌన్‌తో టోర్నీలు లేకపోవడంతో అభిమానులకూ నిరాశ తప్పదు. కానీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు దొరికిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని.. కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగుతారు’అని పుజారా చెప్పుకొచ్చాడు. (చదవండి: లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) (చదవండి: ‘నా శైలి అందరికీ తెలుసు’) -
‘నా శైలి అందరికీ తెలుసు’
రాజ్‌కోట్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చతేశ్వర్ పుజారా పలు సందర్భాల్లో బాగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో ఒక సారి జట్టు కోచ్, కెప్టెన్ కూడా అతని స్ట్రయిక్‌రేట్‌ను ప్రశ్నించారు. దూకుడుకు చిరునామాగా మారిన ఈతరం క్రికెట్లో పుజారా బ్యాటింగ్ శైలి చాలా మందిని ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతను ఇదే తరహాలో ఆడాడు. జ్వరంనుంచి కోలుకొని ఇన్నింగ్స్ కొనసాగించిన అతను 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. ‘నా ఆటతీరు గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్‌నుంచి గానీ కోచ్‌నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు’ అని పుజారా వివరణ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లకుండా పుజారా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. నా స్ట్రయిక్‌రేట్ గురించి చర్చ రాగానే అంతా టీమ్ మేనేజ్మెంట్ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు’ అని పుజారా అన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది తనను పరుగులు చేసేందుకు అన్నేసి బంతులు ఎందుకు తీసుకుంటావని అడుగుతుంటావని, అయితే తాను వాటిని పట్టించుకోనని చింటూ చెప్పాడు. ‘అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్‌లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, వాటిలో చేసిన పరుగులు, క్రీజ్‌లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇదే తరహాలో ఆడారని అర్థమవుతుంది’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. అయితే తన గురించి తాను వాస్తవంగా ఆలోచిస్తానని, మరీ దూకుడుతనంతో ఆడలేనని ప్రత్యేకంగా విషయం తనకు తెలుసని కూడా పుజారా వివరించాడు. ‘నేను డేవిడ్ వార్నర్‌లా, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడలేనని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు’ అని అతను చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన పుజారా ఈ ఏడాదిలో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. ఇది తనను కొంత నిరాశకు గురి చేసిందని భారత టెస్టు స్పెషలిస్ట్ చెప్పాడు. ‘అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్‌గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్‌లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్‌కు తనదైన విలువ ఉంది’ అని పుజారా వెల్లడించాడు. ఈతరం క్రికెటర్లు టెస్టులపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్‌లే బయటపెడతాయి’ అని పుజారా అన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తమకు అత్యంత కీలకమన్న భారత టెస్టు మూడో నంబర్ ఆటగాడు... మన పేసర్లు పూర్తి ఫిట్నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. -
పుజారాకు సచిన్ వెరైటీ విషెస్
టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా శనివారం 32వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తాజా, మాజీ సహచర క్రికెటర్లు అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పుజారా బర్త్‌డే సందర్భంగా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుజరాతీ భాషలో పుజారాకు విషెస్ తెలపడం విశేషం. ‘పుజారాను ఔట్ చేయాలంటే పూజారి ఆశీర్వాదాలు కావాలి. హ్యాపీ బర్త్‌డే పుజారా’అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక చతేశ్వర పుజారా గుజరాత్‌కు చెందిన క్రికెటర్ కావడంతో సచిన్ అతడి లాంగ్వేజ్‌లోనే ట్వీట్ చేశాడు. సచిన్‌తో పాటు బీసీసీఐ కూడా పుజారాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్కు, ప్రశాంతతకు మారుపేరైన పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, అశ్విన్, మహ్మద్ కైఫ్, తదితర క్రికెటర్లు పుజారాకు బర్త్‌డే విషెస్ తెలిపారు. పుజారా టీమిండియా తరుపున ఇప్పుటివరకు 75 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. లాంగ్ ఫార్మాట్లో 5741 పరుగులు సాధించగా అందులో 18 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. -
పుజారా 50వ సెంచరీ...
రాజ్‌కోట్: కర్ణాటకతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో భారత టెస్టు ఆటగాడు చతేశ్వర పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌరాష్ట్ర తరఫున బరిలో దిగిన పుజారా తొలి రోజు (162 బ్యాటింగ్; 17 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా ఘనతకెక్కాడు. ఇందులో సునీల్ గావస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68), దివంగత విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్‌సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55), అజహరుద్దీన్ (54) ముందు వరుసలో ఉన్నారు. పుజారా సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. -
మూడో టెస్టు భారత్ ఘన విజయం
-
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి రోజు ఆట ఫోటోలు
-
రోహిత్, కోహ్లి లేకుండా...
రాంచీ: శనివారం నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, బౌలర్ ఇషాంత్ శర్మ పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ ఆప్షనల్ కావడంతో సారథి కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. నేడు జరిగే ప్రాక్టీస్‌లో జట్టు భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. అంతకు ముందు ఉదయం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొన్నారు. -
పుజారాను తిట్టిన రోహిత్
విశాఖ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ రెండు వరుస శతకాలతో రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా దిగిన తొలి టెస్టులోనే రెండు సెంచరీ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే మ్యాచ్‌లో సహచర ఆటగాడు చతేశ్వర పుజారాపై అసభ్య పదజాలంతో దూషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే క్రమంలో రోహిత్ సింగిల్‌కు రమ్మంటూ పిలిచాడు. అయితే దానికి పుజారా నుంచి సరైన స్పందన లేకపోవడంతో రోహిత్ తిట్ల దండకం అందుకున్నాడట. నిరర్దకమైన పదజాలం వాడినట్లు స్ట్రైకింగ్ ఎండ్‌లో మైక్‌లో రికార్డయ్యింది. ఇది తాజాగా వెలుగు చూడటం అంతలోనే వైరల్ కావడం జరిగింది. అయితే పుజారాను రోహిత్ తిట్టిన దాన్ని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ట్వీటర్లో తనదైన శైలిలో చమత్కరించాడు. ‘ ఈసారి రోహిత్ సమయం.. విరాట్‌ది కాదు. ఆ తిట్టు ఏంటో నీకు తెలుసా..? తెలిసే ఉంటుందిలే అంటూ ఎద్దేవా చేశాడు. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరిగిన సమయంలో కోహ్లి ఇలానే దూషించడాన్ని స్టోక్స్ పరోక్షంగా గుర్తు చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రోహిత్‌ను సమర్ధిస్తే, మరికొంతమంది పుజారాను వెనకేసుకొస్తున్నారు. కాగా, బెన్ స్టోక్స్ ట్వీట్ చేయడంపై హర్భజన్ సింగ్ స్మైలీ ఎమోజీలతో స్పందించాడు. -
దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఫోటోలు
-
‘హాఫ్ సెంచరీ’లో 9 ఫోర్లు.. 1 సిక్స్
విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన చతేశ్వర పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 106 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. తొలుత కుదురుగా ఆడిన పుజారా.. ఆపై తన శైలికి భిన్నంగా బౌండరీల మోత మోగించాడు. పుజారా హాఫ్ సెంచరీ సాధించే క్రమంలో 9 ఫోర్లు, 1 సిక్స్ సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పుజారా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఫోర్ కొట్టి మరీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 42 పరుగులు ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడు. అంతకుముందు రోహిత్ శర్మ హాఫ్‌సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌కు జత కలిసిన పుజారా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ లయ తప్పిన బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించారు. ఈ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. -
కొందరు నమ్మరు.. మరికొందరు నవ్వుతారు: గంగూలీ
ముంబై: భారత క్రికెట్ జట్టులో నాలుగో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తర్వాత నాల్గో స్థానం అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సిరీస్‌లో అంబటి రాయుడు విఫలమైతే, విజయ్ శంకర్ కాస్త ఆశలు రేపాడు. రిషభ్ పంత్‌ను సైతం ప్రయోగించినా మంచి ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ స్థానంపై ఎవ్వరిపైనా 100 శాతం నమ్మకం కుదరలేదు. దీంతో మళ్లీ ‘నంబర్ 4’పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారా పేరును భారత మాజీ కెప్టెన్ గంగూలీ తెరపైకి తీసుకొచ్చాడు. కేవలం టెస్టు ఆటగాడిగా ముద్రపడిన పుజారాను వన్డేల్లో నాల్గో స్థానంలో ఆడించాలంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘నేను చెప్పేది విని చాలా మంది నమ్మరు. కొందరు నా సూచన విని నవ్వుతారు. నా వరకైతే వన్డేల్లో ‘నంబర్ 4’కు చతేశ్వర్ పుజారా సరిపోతాడు. ఫీల్డింగ్‌లో అతడు మరీ చురుకు కాదని తెలుసు.. కానీ మంచి బ్యాట్స్‌మన్. నా ప్రతిపాదన విని షాక్ అవుతారని తెలుసు. కానీ టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్. కొన్నిసార్లు వన్డే క్రికెట్లో పటిష్ఠత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా వరకూ అయితే వన్డే ఫార్మాట్లో నాల్గో స్థానంలో పుజారానే మంచి చాయిస్’ అని గంగూలీ పేర్కొన్నాడు. -
అందుకు పుజారా సరిపోడా?
న్యూఢిల్లీ: ఇటీవల క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఖరారు చేసిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌లో చతేశ్వర్ పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కకపోవడాని బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో పుజారాకు న్యాయం జరగలేదనేది బహిరంగంగానే కనబడుతోందంటూ సీఓఏపై మండిపడ్డారు. ఈసారి పుజారాను ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చూస్తానని తాను బలంగా అనుకున్నానని, కానీ అది జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని సౌరాష్ట్రకు సుదీర్ఘ కాలం సెక్రటరీగా పనిచేసిన నిరంజన్ పేర్కొన్నారు. ‘2018-19కి గాను ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కడ పోవడం నిజంగా బాధాకరం. ఇది పూర్తి పారదర్శకతతో ఖరారు చేసిన జాబితా కాదు. ఇక్కడ సీఓఏ టెస్టులకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనడానికి ఇదే నిదర్శనం. పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చోటుకు అన్ని విధాల అర్హుడు. గ్రేడ్లు కేటాయించేటప్పుడు టెస్టుల్లో ఆట తీరు ర్యాంకులు ఆధారంగా చేసుకోవాలి. మరి అటువంటప్పుడు పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఎందుకు దక్కలేదు’ అని నిరంజన్ షా ప్రశ్నించారు. ప్రస్తుతం పుజారా ‘ఎ’ గ్రేడ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీల సాయంతో 521 పరుగులు చేసి భారత్ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక వహించాడు. బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్’ గ్రేడ్ అన్నింటికంటే అత్యుత్తమం. రూ. 7 కోట్లు లభించే ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈసారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్‌లను తప్పించారు. కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐనుంచి తగిన గుర్తింపు లభించింది. అతనికి ‘ఎ’ గ్రేడ్ ఖరారు చేశారు. -
టీ20లో రెచ్చిపోయిన పుజారా
ఇండోర్: తాను పొట్టి ఫార్మాట్‌కు సరిపోననే వాళ్లకు దీటైన సమాధానం చెప్పాడు చతేశ్వర్ పుజారా. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను పక్కను పెట్టి బౌండరీలతో చెలరేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో అజేయ శతకం బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. తొలి దశలో గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (34)తో కలిసి పుజారా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెచ్చిపోయాడు. ఫలితంగా సౌరాష్ట్ర తరఫున టీ20 శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరొకవైపు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ, లిస్-ఎ క్రికెట్లో 150కు పైగా స్కోరు, టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మొదట ఈ రికార్డు అందుకున్నారు. ఇప్పుడు పుజారా వీరి సరసన చేరాడు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో పుజారా ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర ఓటమి పాలవ్వడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. -
ఓవైపు నాన్నకు ఆపరేషన్.. మరోవైపు బ్యాటింగ్
రాజ్‌కోట్ : గత నెలలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. తన టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచి 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అద్వితీయ ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసిక్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక చివరిదైన నాలుగో టెస్టులో పుజారా 193 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు, ఇటు పుజారా ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అవుటవ్వడంతో నిరాశచెందారు. మనందరికీ తెలియని ఇంకో విషయమేమిటంటే.. పుజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో (టెస్టు మొదటి రోజు) అతని తండ్రి అరవింద్ ఆస్పత్రిలో ఉన్నాడు. ఓవైపు తండ్రికి హార్ట్ సర్జరీ కొనసాగుతుండగానే.. పుజారా తన ఆటను కొనసాగించాడు. జట్టుకు భారీ స్కోరునందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. (పుజారా డబుల్ సెంచరీ మిస్) ‘నాన్నకు ఆపరేషన్ జరగుతుండడంతో కొంత ఆందోళన చెందాను. కానీ, ఆయనకేం పరవాలేదు. ఆపరేషన్ సక్సెస్ అవుంతుందని డాక్టర్లు భరోసా ఇచ్చారు. దాంతో కొంత ధైర్యం వచ్చింది. అప్పటికే గత మ్యాచ్‌లలో పరుగులు సాధించడం. సిడ్నీ మైదానంలో ప్రాక్టిస్ చేసి ఉండడం కలిసొచ్చింది. దాంతో ఆటపై దృష్టిపెట్టాను. దేవుడి దయవల్ల నాన్న కోలుకున్నారు’అని పుజారా తన సిడ్నీ టెస్టు అనుభవాలను పంచుకున్నారు. ‘ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు నాన్న మా ఆట చూశారు. నా ఆటచూసి హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడి డాక్టర్లు కంగ్రాట్స్ కూడా చెప్పారు. అయితే, 7 పరుగులతో డబుల్ సెంచరీ మిస్ కావడంపై.. నాన్న స్పందిస్తూ.. మరేం పరవాలేదు. డబుల్ సెంచరీ అనేది ఒక నెంబర్ మాత్రమే. జట్టుకు మంచి స్కోరు అందించావ్. బాధపడొద్దు’ అని తనకు మరింత ధైర్యం ఇచ్చారని పుజారా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పుజారా ఏకంగా 30 గంటలకు పైగా బ్యాంటింగ్ చేసి 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 521 పరుగులు చేశాడు. ఫ్రాంచైజీల ట్రెండ్‌తో.. నోట్ల వర్షమే పరమావధిగా సాగుతున్న టీ20ల కాలంలో.. నిజంగా పుజారా ఆట వెరీ క్లాసిక్ కదా..!! -
పుజారా అజేయ శతకం
బెంగళూరు: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత పొందింది. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా(131 నాటౌట్; 266 బంతుల్లో 17 ఫోర్లు) అజేయంగా శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా షెల్డాన్ జాక్సన్(100 ; 217 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ సాధించడంతో సౌరాష్ట్ర ఘన విజయం నమోదు చేసింది. 224/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర.. మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక విసిరిన 279 పరుగుల లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు ఆదిలోనే షాక్ తగిలింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పుజారా-జాక్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 214 పరుగులు జోడించిన తర్వాత జాక్సన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పుజారా మరింత బాధ్యతాయుతంగా ఆడటంతో సౌరాష్ట్ర ఐదో రోజు ఆట తొలి సెషన్లోనే విజయాన్ని అందుకుంది. ఫలితంగా రంజీ ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 275 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 239 ఆలౌట్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 236 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 279/5 -
టెస్టు బ్యాట్స్‌మెన్‌ని కదా అందుకే : పుజారా
టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా ఎండార్స్మెంట్లతో ఎడాపెడా సంపాదిస్తుంటే.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. పుజారా అడ్వర్టైజ్ ఏజెన్సీలను ఆకర్షించలేకపోతున్నాడు. అయితే ఈ విషయం గురించి తాను ఏనాడు చింతించలేదని , దేశం కోసం ఆడటం మాత్రమే తనకు ముఖ్యమని పుజారా పేర్కొన్నాడు. బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కారణంగా పెద్దగా ఎండార్స్మెంట్ ఆఫర్లు రావన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదించడం మాత్రమే నాకు తెలుసు. స్వప్రయోజనాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మాత్రమే ఆడాలని మా నాన్న చెప్పారు. ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదించడం కంటే కూడా భారత్ తరఫున ఆడటమే గొప్పగా భావిస్తాను’ అని పుజారా వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. ఇక ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి మూడు సెంచరీలు సాధించిన పుజారా 521 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
‘మా బౌలర్లను మోకరిల్లేలా చేశాడు’
సిడ్నీ: టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా అద్భుతమైన ఆట తీరుతో తమ బౌలర్లను మోకరిల్లేలా చేశాడని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కోహ్లి కింగ్డమ్లో అసాధారణ బ్యాటింగ్‌తో పుజారా ఆకట్టుకున్నాడంటూ చాపెల్ ప్రశంసించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చాపెల్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్లో ఇప్పుడు విరాట్ కోహ్లి రాజు కావొచ్చు. కానీ.. ఆ రాజ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని నిరూపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎంతో మంచి జరిగింది. సిరీస్ చేజిక్కించుకోడమే కాదు.. పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ తెలిసింది’ అని కొనియాడాడు. ‘పుజారా అద్భుత బ్యాటింగ్ నుంచి మా జట్టు చాలా నేర్చుకుని ఉంటుంది. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునీల్ గావస్కర్ రికార్డును సమం చేశాడు. ఆసీస్ గడ్డపై ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించి 521 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. పటిష్టమైన మా బౌలింగ్ లైనప్‌ను కకావికలం చేసి మరీ శతకాలపై శతకాలు సాధించాడు’ అని చాపెల్ ప్రశంసలు కురిపించాడు. -
పుజారా డ్యాన్స్ చూశారా..!
సిడ్నీ: ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాన్ని సాధించి కొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ 2-1తో గావస్కర్-బోర్డర్ ట్రోఫీని అందుకుంది. చివరి టెస్టు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయ కల్గించడంతో భారత్‌కు మరో విజయం దూరమైంది. అయినప్పటికీ సిరీస్‌ను సాధించడంతో విరాట్ సేన మంచి జోష్‌తో సంబరాలు చేసుకుంది. గ్రౌండ్లో డ్యాన్స్ చేస్తూ విజయాన్ని ఆస్వాదించింది టీమిండియా క్రికెట్ జట్టు. అయితే ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న చతేశ్వర్ పుజారా మాత్రం డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అంతా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటే పుజారా మాత్రం తన కాలును కదిలించకుండా కేవలం చప్పట్లతో సరిపెట్టబోయాడు. అయితే వెనుక నుంచి మిగతా సభ్యులు పుజారాను ముందుకు తోయడంతో రిషభ్ పంత్‌తో కలిసి డ్యాన్స్ చేయకతప్పలేదు. అలా పుజారా ఇబ్బంది పడుతూనే మిగతా సభ్యులతో భాగస్వామయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. పుజారా బ్యాటింగ్ చేయగలడు కానీ.. డ్యాన్స్ చేయలేడు అంటూ క్యాప్షన్‌లో చమత్కరించింది. Cheteshwar Pujara: can bat, can't dance? 🤣🤣 Celebrations have well and truly begun for Team India! #AUSvIND pic.twitter.com/XUWwWPSNun — cricket.com.au (@cricketcomau) 7 January 2019 చరిత్ర సృష్టించిన కోహ్లి సేన ఇంత గొప్పగా ఎప్పుడూ ఫీల్ కాలేదు: కోహ్లి -
పుజారా డబుల్ సెంచరీ మిస్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అతడు అవుటయ్యాడు. 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. డబుల్ సెంచరీ చేజారడంతో నిరాశగా మైదానాన్ని వీడాడు. టీమిండియా 491/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ అర్ధ సెంచరీ చేశాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా(25) క్రీజ్‌లో ఉన్నాడు. (మొదటి రోజు...మనదే జోరు) టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. టెస్టుల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 206 నాటౌట్. 2012, నవంబర్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు. 2013, మే నెలలో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగులు చేశాడు. 2017, మార్చిలో ఆసీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ(202) కొట్టాడు. -
సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు!
సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేస్తే, పుజారా 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాలో పుజారా నాల్గో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(195) తొలి స్థానంలో ఉండగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మురళీ విజయ్(144), సునీల్ గావస్కర్(132)లు ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని పుజారా ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో తొలి రోజు ఆటలో సచిన్ టెండూల్కర్(124) నమోదు చేసిన రికార్డును పుజారా అధిగమించాడు. కాగా, మళ్లీ సచిన్ తర్వాత స్థానంలో పుజారానే ఉండటం ఇక్కడ మరో విశేషం. ఇదే సిరీస్ తొలి టెస్టులో పుజారా 123 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ పరుగులు కూడా తొలి రోజు ఆటలోనే పుజారా సాధించాడు. ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. అంతకముందు ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్( 2003-04 సీజన్లో 1203 బంతులు), విజయ్ హజారే(1947-48 సీజన్లో 1192 బంతులు), కోహ్లి(2014-15 సీజన్లో 1093 బంతులు)సునీల్ గావస్కర్(1977-78 సీజన్లో 1032 బంతులు) వరుస స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్ గావస్కర్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు. -
సిడ్నీ : భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు చిత్రాలు
-
భారీ స్కోరు దిశగా టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్ పుజారా(130 బ్యాటింగ్; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. గురువారం ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ప్రారంభించారు. అయితే ఆదిలోనే టీమిండియాకు షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి రాహుల్(9) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు మయాంక్. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్ తర్వాత విరాట్ కోహ్లి(23) ఔట్ కావడంతో భారత్ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన రహానే(18; 55 బంతుల్లో 1 ఫోర్) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత హనుమ విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను పుజారా చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడోది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్, లయన్‌లకు తలో వికెట్ దక్కింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పుజారా మళ్లీ కొట్టేశాడు.. కోహ్లి సరసన పుజారా..! మయాంక్ మరో రికార్డు -
పుజారా మళ్లీ కొట్టేశాడు..
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా శతకాలపై శతకాలు బాదేస్తున్నాడు. ఆసీస్‌తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ సాధించాడు. ఇది పుజారా టెస్టు కెరీర్లో 18 వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం సాధించాడు. తొలి టెస్టులో శతకం సాధించిన పుజారా.. మూడో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీలు సాధించిన పుజారా.. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 199 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పుజారా.. మరో 65 బంతుల్లో్ వంద పరుగుల మార్కును చేరాడు. హాఫ్ సెంచరీని ఫోర్‌తోనే సాధించిన పుజారా.. ఫోర్‌తోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్ గావస్కర్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించడంతో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో్ 78 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 262 పరుగులు చేసింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(77) రాణించిన సంగతి తెలిసిందే. రాహుల్(9) తొలి వికెట్‌గా ఔట్ కాగా, మయాంక్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మూడో వికెట్‌గా కోహ్లి(28), నాల్గో వికెట్‌గా రహానే(18) ఔటయ్యారు. కోహ్లి సరసన పుజారా..! మయాంక్ మరో రికార్డు -
కోహ్లి సరసన పుజారా..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకుంటూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌తో నాల్గో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతులాడిన పుజారా అర్థ శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వెయ్యి బంతుల్ని ఆడిన ఘనత నమోదు చేశాడు. అంతకముందు 2014-15 సీజన్లో భాగంగా ఆసీస్‌లో పర్యటించినప్పడు కోహ్లి వెయ్యి బంతుల్ని ఆడాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన పుజారా.. ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. అంతకముందు ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్( 2003-04 సీజన్లో 1203 బంతులు), విజయ్ హజారే(1947-48 సీజన్లో 1192 బంతులు), కోహ్లి(2014-15 సీజన్లో 1093 బంతులు)సునీల్ గావస్కర్(1977-78 సీజన్లో 1032 బంతులు) వరుస స్థానాల్లో ఉన్నారు. మయాంక్ మరో రికార్డు -
మళ్లీ నోరుజారిన ఆసీస్ కామెంటేటర్
మెల్బోర్న్: మూడో టెస్టు తొలి రోజు ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్‌లో రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడంటూ మయాంక్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్ మళ్లీ మాట తూలాడు. తన గత వ్యాఖ్యపై క్షమాపణలు చెప్పిన అతను నాలుగో రోజు అదే తరహాలో భారత ఆటగాళ్ల గురించి పరుషంగా మాట్లాడాడు. జడేజా, పుజారాల పేర్లను సరిగ్గా పలకలేక సహచర కామెంటేటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కీఫ్ ఈ పేర్లపై తన అక్కసు వెళ్లగట్టాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. కీఫ్ వ్యాఖ్యల గురించి భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ...‘ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే కొంత బాధిస్తాయి. కానీ వాటిని మనం నియంత్రించలేం. అయితే ఆ బాధను కసిగా మార్చుకొని మైదానంలో చెలరేగితే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చినట్లే’ అని అభిప్రాయపడ్డారు. లెగ్‌స్పిన్ బౌలర్ అయిన 69 ఏళ్ల కెరీ ఒ కీఫ్ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. -
ఆసీస్.. మీకు అంత ఈజీ కాదు: పుజారా
మెల్బోర్న్: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే బ్యాటింగ్ జోరు కొనసాగించిన టీమిండియా భారీ స్కోరును సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా(106) సెంచరీతో మెరవగా, విరాట్ కోహ్లి(82), మయాంక అగర్వాల్(76), రోహిత్ శర్మ(63 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయితే 2017 జనవరి నుంచి చూస్తే టెస్టు క్రికెట్లో అత్యధిక బంతుల్ని ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా పుజారా గుర్తింపు సాధించాడు. దాదాపు ఏడాది కాలంలో టెస్టు క్రికెట్లో పుజారా ఎదుర్కొన్న బంతులు నాలుగువేలకు పైగానే ఉన్నాయి. ఫలితంగా ప్రపంచ క్రికెట్లో అత్యధిక బంతులను ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంచితే, రెండో రోజు ఆట ముగిసిన అనంతరం పుజారా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత ఈజీ కాదన్నాడు. ‘ తొలి ఇన్నింగ్స్‌లో మాకు సరిపోయేంత స్కోరును బోర్డుపై ఉంచాం. పిచ్ మారుతూ వస్తుంది. సులువుగా పరుగులు చేయడానికి అనుకూలించే పిచ్ కాదు ఇది. ఒక రోజులో 200 పరుగులు సాధించడమంటే టఫ్ టాస్క్‌గానే చెప్పాలి. తొలి రెండు రోజుల ఆటలో నేను చేసిన పరుగులు చూస్తే చాలా తక్కువనే చెప్పాలి. పరుగులు చేయడానికి ప్రతీ బంతి ఒక పరీక్ష పెడుతుంది. ఇప్పటికే పిచ్‌పై బౌన్స్ బాగా వస్తుంది. నేను ఆడిన నిన్న ఒక రకంగా ఉంటే, ఈరోజు మరొక రకంగా ఉంది. పిచ్ అంతగా అనుకూలించడం లేదు. మేము చాలినంత స్కోరును బోర్డుపై ఉంచకలిగాం. మా బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది కాబట్టి.. పరుగులు చేయడం అంత ఈజీ కాదు. రేపట్నుంచి పిచ్ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం. దాంతో ఆసీస్ పరుగులు సాధించడానికి అపసోపాలు పడాల్సిందే’ అని పుజారా హెచ్చరించాడు. -
పుజారా శతకం.. భారీ స్కోరు దిశగా భారత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో ఈ సిరీస్‌లో రెండో శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తిచేసిన పుజారాకు ఆసీస్‌పై ఇది నాలుగో శతకం. విరాట్ కోహ్లి కూడా పుజారాకు చక్కటి తోడ్పాటు అందిస్తున్నాడు. వీరిద్దరు నిలకడగా ఆడుతుండటంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్ దిగిన టీమిండియా లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా(103), కోహ్లి(69) క్రీజులో ఉన్నారు. -
నిలిచారు... నిలిపారు!
సహనం... సంయమనం... సాధికారం... మెల్బోర్న్ టెస్టు మొదటి రోజు భారత ఇన్నింగ్స్‌ను సెషన్ల వారీగా చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది. క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటంతటవే వస్తాయనే టెస్టు నానుడికి తగ్గట్లుగా సాగింది టీమిండియా బ్యాటింగ్. కుర్ర ఓపెనర్ల ఓపికైన ఆరంభానికి సీనియర్ల అర్ధవంతమైన భాగస్వామ్యంతో మన జట్టు ఒడ్డున పడింది. సంతృప్తికర స్కోరుతో ఆటను ముగించింది. రెండో రోజు గురువారం దీనిని కెప్టెన్ విరాట్ కోహ్లి, డిపెండబుల్ చతేశ్వర్ పుజారా ఇంకెంత ముందుకు తీసుకెళ్తారో? రహానే, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తమవంతుగా మరెన్ని పరుగులు చేస్తారో? అనేదానిపై ఈ మ్యాచ్‌లో భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మెల్బోర్న్: అరంగేట్ర ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (161 బంతుల్లో 76; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (200 బంతుల్లో 68 బ్యాటింగ్; 6 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) అద్వితీయ భాగస్వామ్యంతో బాక్సింగ్ డే టెస్టును టీమిండియా ఆశావహంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 89 ఓవర్లలో 215/2 స్కోరుతో నిలిచింది. టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోగా... మయాంక్‌తో పాటు తొలిసారి ఓపెనింగ్‌కు దిగిన ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (66 బంతుల్లో 8) జట్టుకు కావాల్సిన విధంగా ఆడాడు. వీరిద్దరినీ కమిన్స్ (2/40) ఔట్ చేశాడు. ఓపెనర్ల ఓపిక... ప్రారంభ ఇబ్బందులను తట్టుకుంటూ, కొత్త బంతి మెరుపు తగ్గేలా చేసి కీలకమైన మిడిలార్డర్ తగినంత స్వేచ్ఛగా ఆడేలా చూడడం ఓపెనర్ల ప్రథమ కర్తవ్యం. మయాంక్, విహారి మెల్బోర్న్లో అదే చేశారు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతే ఫుల్‌టాస్ పడి విహారి బ్యాట్ వెలుపలి అంచును తాకింది. అప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లు పరీక్షకు గురి చేసినా కుర్రాళ్లిద్దరూ ఓపిక కోల్పోలేదు. ఇద్దరిలో విహారి వికెట్ ఇవ్వకూడదన్నట్లు పట్టుదల చూపగా... మయాంక్ వీలుచిక్కినప్పుడల్లా పరుగులు సాధించాడు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 8వ ఓవర్లోనే స్పిన్నర్ లయన్‌ను దించాడు. అతడిని సులువుగా ఎదుర్కొన్న మయాంక్ బౌండరీలు బాదాడు. అయితే, 19వ ఓవర్ ఐదో బంతికి ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆడక తప్పని విధంగా కమిన్స్ వేసిన బంతి విహారి గ్లోవ్‌ను తాకుతూ స్లిప్‌లోని ఫించ్‌కు క్యాచ్‌గా వెళ్లింది. దీంతో 40 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్, పుజారా అదే నిగ్రహం చూపడంతో భారత్ 57/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం అనంతరం కూడా ఆసీస్ బౌలర్లను వీరు ఆచితూచి ఎదుర్కొన్నారు. లయన్ ఓవర్లో ఫోర్ కొట్టి మయాంక్ అర్ధ శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అతడి బౌలింగ్‌లోనే లాంగాన్‌లోకి సిక్స్ బాదాడు. స్ట్రోక్ ప్లేతో బౌండరీలు బాదుతూ తనను అసహనానికి గురిచేస్తున్న మయాంక్‌ను కమిన్స్ షార్ట్ పిచ్ బంతితో పడగొట్టాడు. దీంతో టీమిండియా టీ బ్రేక్‌కు వెళ్లింది. మయాంక్–పుజారా రెండో వికెట్‌కు 83 పరుగులు జత చేశారు. అప్పటికి స్కోరు 123/2. సీనియర్ల అండ... రెండు సెషన్లు పూర్తయి... స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు లేని స్థితిలో పుజారా, కోహ్లి జత కలిశారు. లోపలి అంచులకు తగిలిన బంతులు, టాప్ ఎడ్జ్ అయిన బంతులు, ఎల్బీ అప్పీళ్లు, సమీక్ష... ఇలా పలు సవాళ్లను ఎదుర్కొంటూనే చివరి సెషన్లో పూర్తి సంయమనంతో ఆడారు వీరు. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో కోహ్లి పూర్తి టచ్‌లోకి రాగా, పుజారా అర్ధశతకం (152 బంతుల్లో) అందుకున్నాడు. మరోవైపు లయన్ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీ కోరిన ఆసీస్ సమీక్ష వృథా చేసుకుంది. ఇక్కడి నుంచి కొంతసేపు ఈ జోడీ సాధికారికంగా ఆడింది. 83వ ఓవర్లో కొత్త బంతి తీసుకున్నాక స్టార్క్ వాడి చూపించాడు. 87వ ఓవర్లో కోహ్లిని తీవ్ర పరీక్షకు గురిచేశాడు. ఓ బంతి ప్యాడ్‌కు తగలగా, మరోటి ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. ఈ క్రమంలో పైన్ క్యాచ్ వదిలేయడంతో భారత కెప్టెన్‌కు లైఫ్ దక్కింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న కెప్టెన్ రోజును సాఫీగా ముగించాడు. కోహ్లి–పుజారా మూడో సెషన్లో అభేద్యంగా 92 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది. ఎలాంటి పిచ్చో? ఏమో? ఎప్పటిలాగే బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు మెల్బోర్న్ మైదానానికి అభిమానులు పోటెత్తారు. 73 వేల మందిపైగా వచ్చారు. దీంతో స్టాండ్స్ అన్నీ నిండిపోయి మైదానం కళకళలాడింది. అయితే, పిచ్ తీరే కొంత భిన్నంగా కనిపించింది. పేసర్లు ప్రభావవంతంగా లేకపోవడంతో ఆస్ట్రేలియా కెప్టె¯Œ టిమ్ పైన్ ఆరంభంలోనే స్పిన్నర్ నాథన్ లయన్‌ను దింపాడు. పేసర్ కమిన్స్ తప్ప మిగతా బౌలర్లెవరూ వికెట్ తీయలేకపోయారు. అయితే, రెండో సెషన్లో కొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చాయి. కొన్ని అనూహ్యంగా పైకి లేచాయి. కొత్త బంతిని తీసుకున్నాక మాత్రం స్టార్క్, హాజల్‌వుడ్ పదును చూపారు. ఇప్పటికి ఉన్న అంచనా అయితే... ఎండ కారణంగా పిచ్ నెర్రెలుబారి మ్యాచ్ మూడు, నాలుగు రోజుల్లో స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా గురువారం మొత్తం ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకుపైగా చేస్తే... మ్యాచ్ ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మయాంక్ హిట్... విహారి పాస్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా దిగిన మయాంక్, విహారి తమ బాధ్యత నెరవేర్చారు. శుభారంభంతో పాటు కొత్త బంతి మెరుపు తగ్గే వరకు ఆడి టీమిండియాకు ఉపశమనం కలిగించారు. ముఖ్యంగా మయాంక్ స్వేచ్ఛగా ఆడిన తీరు ముచ్చట గొలిపింది. సిరీస్‌లో భారత్‌కు సవాలు విసురుతున్న స్పిన్నర్ లయన్‌ను అతడు దెబ్బకొట్టాడు. లయన్ బౌలింగ్‌లో మయాంక్ పరుగులు రాబట్టిన తీరు మిగతా బ్యాట్స్‌మెన్ పైనా ఒత్తిడి లేకుండా చేయనుంది. అరంగేట్రంలోనే సెంచరీ చేజార్చుకున్నా, కావాల్సినంత ఆత్మవిశ్వాసం అయితే మూటగట్టుకున్నాడు. మరోవైపు స్కోరు తక్కువే అయినా విహారి ఇన్నింగ్స్‌నూ చిన్నది చేయలేం. ఎదుర్కొన్న 25వ బంతికి తొలి పరుగు చేసిన విహారి... ఆసీస్ పేసర్లను సమర్థంగా కాచుకున్నాడు. మొత్తానికి తన నుంచి జట్టుకు ఏం కోరుకుంటోందో అది చేసి చూపాడు. ►295 ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 295వ క్రికెటర్‌గా మయాంక్ అగర్వాల్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా మయాంక్ ఘనత వహించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు దత్తు ఫాడ్కర్ (51 పరుగులు–1947లో సిడ్నీలో) పేరిట ఉండేది. ఇది వర్ణించలేని అనుభూతి టీమిండియా టెస్టు క్యాప్ అందుకునే సమయంలో ఉద్వేగానికి గురయ్యా. కానీ, నన్ను నేను అదుపు చేసుకున్నా. మెల్బోర్న్లో అరంగేట్రం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. నేను వేసుకున్న ప్రణాళికను గుర్తుచేసుకుంటూ వాటికి కట్టుబడ్డాను. మరిన్ని పరుగులు చేసి... నాటౌట్‌గా రోజును ముగించాల్సింది. అయినా ఈ ప్రారంభం సంతృప్తినిచ్చింది. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించ లేదు. బ్యాటింగ్‌కు కొంత అనుకూలంగా ఉంది. ఆసీస్ బౌలర్లు పకడ్బందీగా బంతులేశారు. విహారి అద్భుత ఆటగాడు. ఓపెనర్ పాత్రలో చక్కగా సరిపోయాడు. భారీ స్కోర్లు చేయకున్నా పర్లేదు... ఎక్కువ బంతులు ఆడాలని మేం భావించాం. - మయాంక్ అగర్వాల్ -
బాక్సింగ్ డే టెస్ట్ : రాణించిన భారత బ్యాట్స్‌మెన్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా( 200 బంతుల్లో 68 బ్యాటింగ్: 6 ఫోర్లు), విరాట్ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. అంతకు మందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వ్యూహాత్మకంగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. అరంగేట్రంలో అర్థసెంచరీ.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. జట్టు స్కోర్ 40 వద్ద హనుమ విహారీ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో మయాంక్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ గుర్తింపు పొందాడు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లిన మయాంక్(161 బంతుల్లో 76: 8 ఫోర్లు, 1 సిక్స్)ను ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా హాఫ్ సెంచరీ.. మయాంక్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలో దాటిగా ఆడిన కోహ్లి.. అనంతరం నెమ్మదించాడు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్లతో పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి కూడా హాఫ్ సెంచరీ చేరువగా వచ్చినప్పటికి తొలి రోజు ఆట ముగిసింది. -
ప్రతీ ఒక్కరూ పుజారాలు కాలేరు సోదరా..!
అడిలైడ్: ఆసీస్‌తో మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్ సమయంలో యువ ఆటగాడు రిషభ్ పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బౌలర్ కమిన్స్ దగ్గరికొచ్చి ఏదో అనడం కనిపించింది. దీనికి బదులుగా తానేమీ తక్కు వ కాదన్నట్టు రెండోరోజు ఆటలో పంత్ కూడా నోటికి పనిచెప్పాడు. 59 పరుగులకు 3వికెట్లు పడిన దశలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఖవాజా, హ్యాండ్స్కోంబ్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటున్నారు. అయితే ఈ జోడీ ఏకాగ్రతను చెడగొట్టేందుకు వికెట్ల వెనకాల నుంచి కీపర్ పంత్ స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘ప్రతీ ఒక్కరు పుజారా కాలేరు’ అంటూ భిన్నమైన వ్యూహం అనుసరించాడు. ఇది స్టంప్స్ మైక్‌లో వినిపించడంతో రిషభ్ స్లెడ్జింగ్‌కు దిగిన విషయం తెలిసింది. 28 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను పంతే పట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా 123 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు పుజారా ఆదుకోవడంతో భారత్ తేరుకుంది. -
వాటే ఏ త్రో కమిన్స్..
అడిలైడ్: ఆసీస్‌తో మొదలైన తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు చతేశ్వర పూజారా సెంచరీ కొట్టేశాడు. వరుసగా టాపార్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో ఒంటరి పోరాటం చేసిన పుజారా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఆసీస్ బౌలర్లను సహనంతో ఎదుర్కొని తన కెరీర్లో 16వ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ దాటిన తర్వాత దూకుడు పెంచిన పూజారా... 246 బంతులు ఆడి 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాట్ కమిన్స్ చేతులమీదుగా రనౌట్‌కు గురైయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు విసుగుతెప్పించిన పూజారాను ఔట్ చేసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే కమిన్స్ చేసిన అద్భుతమైన రనౌట్‌తో పుజారా తొమ్మిదో వికెట్‌గా నిష్ర్రమించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా హజల్‌వుడ్ వేసిన 88 ఓవర్లో ఐదో బంతిని పుజారా షార్ట్ మిడ్వికెట్లోకి తరలించాడు. అదే సమయంలో సింగిల్ తీసేందుకు యత్నించాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కమిన్స్ గాల్లో డైవ్ కొడుతూనే బంతిని గురి తప్పకుండా వికెట్లపైకి విసిరాడు. ఫలితంగా పుజారా ఇన్నింగ్స్ ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పుజారా ఆదుకోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. -
ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజు
-
పుజారా అరుదైన మైలురాయి..
అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా సెంచరీతో మెరిశాడు. 231 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కకావికలమైన తరుణంలో పుజారా తనదైన మార్కు ఆట తీరుతో అలరించాడు. 153 బంతుల్లో అర్థ శతకాన్ని సాధించిన పుజారా.. మరో 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారా టెస్టు కెరీర్లో 16వ సెంచరీ. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి తన విలువేంటో చూపించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), విరాట్ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్ శర్మ-రిషబ్ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అటు తర్వాత అశ్విన్‌తో కలిసి 52 పరుగుల్ని జత చేసిన పుజారా ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఒకవైపు పేస్ అటాక్‌ను, మరొకవైపు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆటలో తొలి రోజు సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆసియా వెలుపల తొఇలి రోజు ఆటలో సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ తొలి రోజు ఆటలో ఐదుగురు భారత ఆటగాళ్లు మాత్రమే సెంచరీలు సాధించగా, ఇప్పుడు పుజారా సైతం వారి సరసన చేరాడు. ఆసియా వెలుపల తొలి రోజు ఆటలో సెంచరీ చేసిన సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, మురళీ విజయ్‌లు ఉన్నారు. కాగా, విరాట్ కోహ్లి రెండు పర్యాయాలు తొలి రోజు సెంచరీ సాధించడం ఇక్కడ విశేషం. 2013, 2016ల్లో కోహ్లి శతకాలు సాధించాడు. ఐదువేల పరుగుల క్లబ్లో పుజారా చతేశ్వర పుజారా మరో అరుదైన ఘనతను కూడా నమోదు చేశాడు. టెస్టుల్లో ఐదువేల పరుగులు మార్కును అందుకున్నాడు. 108 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో పుజారా ఐదువేల పరుగుల మైలురాయిని సాధించాడు. దాంతో వేగవంతంగా ఈ మార్కును చేరిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. సునీల్ గావస్కర్(95 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్(99 ఇన్నింగ్స్‌లు), సచిన్(103 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లి(105 ఇన్నింగ్స్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. తొలి రోజు ఆలౌట్ కాలేదు.. ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజే టీమిండియా ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. తొలి సెషన్లోనే కీలక వికెట్లను చేజార్చుకున్న టీమిండియా తడబాటుకు గురైంది. కానీ పుజారా పోరాటా స్ఫూర్తితో టీమిండియా తిరిగి తేరుకుంది. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. పుజారా(123; 246 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పుజారా ఆద్యంతం ఆకట్టుకుని ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. అయితే ఇంకా కాసేపట్లో మొదటిరోజు ఆట ముగుస్తుందనగా పుజారా అనవరసర పరుగు కోసం యత్నించి ఔటయ్యాడు. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25), అశ్విన్(25)లు కాస్త ఫర్వాలేదనిపించగా, రహానే(13), కోహ్లి(3), మురళీ విజయ్(11), కేఎల్ రాహుల్(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)