టీమిండియా వెటరన్ ఆటగాడు, ససెక్స్ స్టాండింగ్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మిడిల్సెక్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పుజారా శతకాన్ని నమోదు చేశాడు. కాగా అతడికి కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. ఇక 182 బంతుల్లో 115 పరుగులు చేసిన పుజారా ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 10 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి.
కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారాతో పాటు టామ్ ఆల్సోప్ 135 పరుగులతో రాణించాడు.
చదవండి: Cheteshwar Pujara: పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! అతడిపై నమ్మకం ఉంది!
Pujara doing what he does best, scoring runs. 💯@cheteshwar1 👏 pic.twitter.com/NiKOkV6dct
— Sussex Cricket (@SussexCCC) July 19, 2022
Comments
Please login to add a commentAdd a comment