టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం మిడిల్‌సెక్స్‌తో మ్యాచ్‌లో పూజారా అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు.
ఈ మ్యాచ్‌లో 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. కాగా టెస్టు స్పెషలిస్టు పేరొందిన పుజారా తన సెంచరీ మార్క్‌ను కేవలం 75 బంతుల్లోనే అందుకోవడం గమానార్హం. ఇక ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడికి ఇది మూడో సెంచరీ.
అంతకుముందు వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చేలరేగాడు. అదేవిధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 174 పరుగులు చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు.
A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯
— Sussex Cricket (@SussexCCC) August 23, 2022
Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp
చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే'
Comments
Please login to add a commentAdd a comment