England County Cricket
-
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్‌షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్‌షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్‌షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్‌షైర్ క్లబ్‌కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్‌షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్‌షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్‌షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్‌తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్‌నకు ఐఎల్టి20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్‌లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్‌షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్‌బాల్‌తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను. నాకు కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్‌లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!
ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ (డివిజన్ 2)లో భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సత్తా చాటాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో నార్తాంప్టన్ జట్టుకు ఆడుతున్న అతడు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను 9 వికెట్లతో చెలరేగడం విశేషం. చహల్ అద్భుత ప్రదర్శన కారణంగా మూడు రోజుల మ్యాచ్‌లో నార్తాంప్టన్ 9 వికెట్ల తేడాతో లీసెస్టర్షైర్ను చిత్తు చేసింది.చహల్ @9కాగా రెండో ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ 316 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో చహల్ 5 వికెట్ల పడగొట్టి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు... తొలి ఇన్నింగ్స్‌లో అతడు 4 వికెట్లతో మెరిశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన నార్తాంప్టన్ ముందు.. లీసెస్టర్‌షైర్ 137 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి నార్తాంప్టన్ ఈ స్కోరును ఛేదించింది. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో విఫలమైన మరో భారత ఆటగాడు పృథ్వీ షాకు ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ గడ్డపై చహల్ జోరుఅంతకు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చహల్ తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా... ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ తనదైన ముద్ర వేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.జట్టును వీడిన చహల్నార్తాంప్టన్ తరఫున నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడిన చహల్ మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 వికెట్లు ఆఖరి రెండు మ్యాచ్‌లలో తీయడం విశేషం. తదుపరి అతడు బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది.చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి100 | Five for Yuzi Chahal! 5️⃣Scott Currie's magnificent innings ends on 120 as he feathers behind to McManus.Leicestershire 303/9, leading by 123.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/OM8MMYY0O3— Northamptonshire CCC (@NorthantsCCC) September 19, 2024 -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్‌లో..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు) మెరిశాడు.అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్‌షైర్ ఫేట్ మారిపోయింది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్‌షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 మ్యాచ్‌ల్లో భాగంగా లీసస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. లీసెస్టర్ ఇన్నింగ్స్‌లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు! -
ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్ ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పాట్స్ చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌లో డర్హమ్ ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో పాట్స్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 9) పడగొట్టాడు. 25 ఏళ్ల పాట్స్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 8 టెస్ట్‌ల్లో 28 వికెట్లు.. 4 వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హర్స్ట్ 90 పరుగులతో రాణించాడు. డర్హమ్ బౌలర్లలో బెన్ రెయిన్ 5, మాథ్యూ పాట్స్ 3, బాస్ డి లీడ్ ఓ వికెట్ పడగొట్టారు.బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీడేవిడ్ బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీతో (279), అకెర్మన్ (186) భారీ సెంచరీతో చెలరేగడంతో డర్హమ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. లాంకాషైర్ బౌలర్లలో వెల్స్ 4, ఫిలిప్ 2, బెయిలీ, థామస్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు.తొమ్మిది వికెట్లు పడగొట్టిన పాట్స్345 పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లాంకాషైర్.. మాథ్యూ పాట్స్ తొమ్మిది వికెట్లతో చెలరేగడంతో ఈ ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. పాట్స్ ధాటికి లాంకాషైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు చాపచుట్టేసింది.చదవండి: తొమ్మిది వికెట్లు తీసిన చహల్ -
తొమ్మిది వికెట్లు తీసిన చహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ డెర్బీషైర్‌పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్‌షైర్54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.టార్గెట్ 266266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్‌ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పృథ్వీ షాఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు.చదవండి: ఐదేసిన చహల్ -
ఐదేసిన చహల్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చహల్ ఈ ఫీట్‌ను సాధించాడు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024అంతకుముందు నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షాఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్‌షైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు.అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లో కెంట్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్‌పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. -
సెంచరీతో కదంతొక్కిన రహానే
ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సెంచరీతో (192 బంతుల్లో 102; 13 ఫోర్లు, సిక్స్) కదంతొక్కాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న రహానే.. గ్లామోర్గన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో (73/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన రహానే.. సహచరుడు పీటర్ హ్యాండ్స్కోంబ్తో (126 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రహానే, హ్యాండ్స్కోంబ్ సెంచరీలతో కదంతొక్కడంతో లీసెస్టర్‌షైర్ 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.40వ శతకంఈ మ్యాచ్‌లో రహానే చేసిన సెంచరీ అతనికి ఫస్ట్ కెరీర్లో 40వది. రహానే ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 40 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీల సాయంతో 13,387 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రహానే 1600 ఫస్ట్ క్లాస్ బౌండరీల మార్కును కూడా అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించిన రహానే ఈ మ్యాచ్‌లో రహానే తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. 67 బంతుల్లో 6 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రహానేతో పాటు హ్యాండ్స్కోంబ్ కూడా ఓ మోస్తరు స్కోర్ (46) చేయడంతో లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది.ఇంగ్రామ్ భారీ డబుల్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గ్లామోర్గన్.. కొలిన్ ఇంగ్రామ్ భారీ డబుల్ సెంచరీతో (257 నాటౌట్) విరుచుకుపడటంతో 9 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.కాగా, నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి లీసెస్టర్‌షైర్ 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యాండ్స్కోంబ్, లియామ్ ట్రెవస్కిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. లీసెస్టర్‌షైర్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. -
చహల్ మాయాజాలం.. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్‌తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్‌తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది. కాగా, చహల్ ఈ మ్యాచ్‌తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడేందుకు నార్తంప్టన్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్‌షైర్ ఈ మ్యాచ్‌లో గెలిచినా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
కౌంటీల్లో ఆడనున్న చహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తంప్టన్‌షైర్ కౌంటీ యుజీతో ఓ వన్డే కప్ మ్యాచ్, ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌ల కోసం ఒప్పందం చేసుకుంది. త్వరలో యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ తెలిపాడు. చహల్ గత సీజన్లో కూడా కౌంటీల్లో ఆడాడు. 2023 సీజన్లో అతను కెంట్కు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో చహల్ కౌంటీల్లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. చహల్ తదుపరి భారత్ ఆడబోయే బంగ్లాదేశ్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ గ్యాప్‌లో మాత్రమే అతను కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.Northamptonshire has signed Indian leg-spinner Yuzvendra Chahal for the remainder of the 2024 County Championship and One Day Cup season. pic.twitter.com/XQUcyv02sN— CricTracker (@Cricketracker) August 14, 2024ఇదిలా ఉంటే, చహల్‌కు గత కొంతకాలంగా ఏ ఫార్మాట్లోనూ అవకాశాలు రాని విషయం తెలిసిందే. కుల్దీప్, అక్షర్, రవి భిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. వీరందరికీ బ్యాట్‌తోనూ సత్తా చాటే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు వీరివైపు మొగ్గు చూపుతున్నారు. చహల్ ప్రస్తుతం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 34 ఏళ్ల చహల్ ఐపీఎల్లో 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. చహల్ ఈ ఏడాడంతా ఒక్క వన్డే కానీ టీ20 కానీ ఆడలేదు. చహల్ ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడి 217 వికెట్లు పడగొట్టాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా చహల్‌కు అవకాశం దక్కడం అనుమానమే. దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటితే తప్ప సెలెక్టర్లు ఇతనివైపు చూసే అవకాశం లేదు. -
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్‌తో మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్లో కూడా తన మార్క్‌ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. 10.5 | That's 50 for Prithvi Shaw! 👏The opener brings up his half-century off 33 balls.Steelbacks 75/2.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024 -
వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం
టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటిఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీఐపీఎల్లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.రీఎంట్రీపై దృష్టిఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్‌క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్‌కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్.. ఒక్క బంతి, ఒక్క పరుగు, ఒక్క వికెట్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో భాగంగా గ్లామోర్గన్, గ్లోసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌గా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలుపుకు చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. ఇలాంటి ఉత్కంఠ సందర్భంలో వికెట్‌కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది.MATCH OF THE COUNTY HISTORY.- Glamorgan needs 1 run to win.- One wicket left. - One ball left. Then the wicket-keeper took a Blinder without gloves and the match ended in a tie. 🥶🔥 pic.twitter.com/YtKIDsU00F— Johns. (@CricCrazyJohns) July 3, 2024వివరాల్లోకి వెళితే.. గ్లోసెస్టర్‌షైర్ నిర్ధేశించిన 593 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 592 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా.. అజిత్ డేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేమీ మెకిల్రాయ్ ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 610 పరుగులు చేయగా.. గ్లామోర్గన్ తొలి ఇన్నింగ్స్‌లో 197, రెండో ఇన్నింగ్స్‌లో 592 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో మార్నస్ లబూషేన్ (119), సామ్ నార్త్ఈస్ట్ (187) అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి గ్లామోర్గన్ను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చారు. అయితే వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ నమ్మశక్యం కానీ రీతిలో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని గ్లామోర్గన్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలిచి ఉంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేదనగా రికార్డుల్లోకెక్కేది. ఛేదనలో గ్లామోర్గన్ చేసిన 592 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్‌కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 20 ఫోర్లు, 21 సిక్సర్లతో..!
కౌంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..ససెక్స్‌పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్‌పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్‌షైర్ vs ససెక్స్, 2024తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016ఈ మ్యాచ్‌లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 202417 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్షైర్, 202216 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 199516 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011ఈ మ్యాచ్‌లో మరో ఆల్‌టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆల్‌టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024ఈ మ్యాచ్‌లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్‌షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్‌షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్ 134 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.కాగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లీసస్టర్‌షైర్- ససెక్స్ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా రాబిన్సన్ బౌలింగ్‌లో లీసస్టర్‌షైర్ వికెట్ కీపర్ బ్యాటర్ లూయీస్ కింబర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1బ్రిగ్టన్లోని హోవ్ గ్రౌండ్లో ఓలీ రాబిన్సన్ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని బ్యాట్‌తో అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1 రన్స్ స్కోరు చేశాడు.ఈ ఓవర్లో రెండో బంతి నో బాల్ కాగా.. తదుపరి మూడు డెలివరీల్లో 4, 6, 4 పరుగులు రాబట్టిన లూయీస్ కింబర్.. ఐదో బంతి మళ్లీ నోబాల్‌గా పడగా.. ఆ తర్వాతి డెలివరీని మళ్లీ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత మళ్లీ నో బాల్ పడటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్ కొట్టాడు.అయితే, చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. అలా ఒకే ఓవర్లో మొత్తంగా 43 రన్స్ రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతుల్లోనే 243 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే, లీసస్టర్షైర్ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ససెక్స్ 18 పరుగుల తేడాతో గెలిచింది. కాగా రాబిన్సన్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు1. ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 20242. అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 19983. షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024.LOUIS KIMBER HAS TAKEN 43 OFF AN OVER pic.twitter.com/kQ4cLUhKN9— Vitality County Championship (@CountyChamp) June 26, 2024 -
ఒకే ఓవర్లో 38 పరుగులు
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.బషీర్ వేసిన ఇన్నింగ్స్ 128వ ఓవర్లో సర్రే బ్యాటర్ డాన్ లార్సెన్ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్లో 38 పరుగులు వచ్చాయి. కౌంటీ చరిత్రలో ఓ సింగిల్ ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్లో అలెక్స్ ట్యూడర్ కూడా ఓ ఓవర్లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 34 పరుగులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్ చేసింది. డాన్ లారెన్స్ (175) భారీ సెంచరీతో.. డామినిక్ సిబ్లీ (76), జేమీ స్మిత్ (86), బెన్ ఫోక్స్ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్ లిబ్బీ (61), బెన్ అల్లీసన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్‌గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు. PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్‌లో ఉండగా.. మార్క్ స్టోన్‌మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది. -
కౌంటీల్లో ఆడనున్న సన్‌రైజర్స్ మాజీ బౌలర్
సన్‌రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సిద్దార్థ్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్‌ను నార్తంప్టన్‌షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్‌కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు.. 2016-2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్‌కు ఆడే సిద్దార్థ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్ నాయర్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్ పునఃప్రారంభించిన నాయర్.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. HUNDRED FOR KARUN NAIR....!!! Northamptonshire under big trouble with 151 for 6, against an attack led by Roach - Karun smashed a brilliant hundred in his 2nd match of the season. pic.twitter.com/JcJKDxu9bb — Johns. (@CricCrazyJohns) September 20, 2023 ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్.. తానాడిన తొలి మ్యాచ్‌లో (వార్విక్షైర్) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్‌లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్ క్రికెట్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ నాయర్ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో నార్తంప్టన్‌షైర్ తరఫున కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. A fantastic century by Karun Nair in the County Championship. pic.twitter.com/JwtbAkSOHX — Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 టెస్ట్‌ల్లో టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్.. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్‌ల్లో 162.69 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. భారత్ తరఫున 6 టెస్ట్‌లు, 2 వన్డేలు ఆడిన నాయర్.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్ తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) కావడం విశేషం. -
బ్యాట్‌తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో కాకుండా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్‌తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్‌షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
పుజారాపై సస్పెన్షన్ వేటు
భారత టెస్ట్ ఆటగాడు, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం జట్టు కెప్టెన్ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఓ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్‌ను ససెక్స్ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్ పుజారా బాధ్యుడయ్యాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్ హెయిన్స్, జాక్ కార్సన్‌లపై ససెక్స్ అధికారులు తదుపరి మ్యాచ్‌కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్‌పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్‌తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్ 26న గ్లోసెస్టర్‌షైర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో ప్రస్తుత సీజన్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్ లీడింగ్‌లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్‌లో
టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో నార్తాంప్టన్‌షైర్‌కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్‌షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్షైర్తో జరిగే మ్యాచ్‌తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి.. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వార్విక్షైర్తో ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్-లీసెస్టర్‌షైర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్‌షైర్‌తో తలపడుతుంది. చెలరేగిన లియామ్ డాసన్.. వార్విక్షైర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. డాసన్ తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ను కుప్పకూల్చాడు. డాసన్ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతను 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్‌షైర్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనికి పేసర్ కీత్ బార్కర్ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్షైర్ కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది.వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో బర్నార్డ్ (26), సామ్ హెయిన్ (33 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్ ఔట్ చేశాడు. రాణించిన మిడిల్టన్.. 94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ ఫ్లెచా మిడిల్టన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్ ప్రెస్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ నిక్ గబ్బన్స్ 9 పరుగులు చేసి లింటాట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్‌షైర్ గిబ్బన్స్ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్ ఏళ్ల డాసన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు.