
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో కాకుండా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.
Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023
ఉమేశ్‌తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్‌షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment