Hampshire
-
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్‌షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్‌షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్‌షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్‌షైర్ క్లబ్‌కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్‌షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్‌షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్‌షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్‌తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్‌నకు ఐఎల్టి20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్‌లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
T20 Blast 2024: క్రికెట్ మైదానంలోకి నక్క
క్రికెట్ మైదానంలోకి పాములు, కుక్కలు రావడం ఇటీవలికాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంట నక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 బ్లాస్ట్ 2024లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో హ్యాంప్‌షైర్, సర్రే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. నక్క మైదానం సిబ్బంది వచ్చేలోపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్క ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలోనే కామ్‌గా వెళ్లిపోయింది. ఇది చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. సామ్ కర్రన్ శతక్కొట్టడంతో (102 నాటౌట్) సర్రే మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ 2024 చివరి దశకు చేరింది. మే 30న మొదలైన ఈ టోర్నీ పలు బ్రేక్‌ల అనంతరం గ్రూప్ దశను ముగించుకుంది. గ్రూప్ దశ అనంతరం మొత్తం ఎనిమిది జట్లు (సర్రే, డర్హమ్, ససెక్స్, లాంకాషైర్, సోమర్సెట్, వార్విక్షైర్, గ్లోసెస్టర్‌షైర్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ దశ సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరుగనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్‌షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్‌షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
బ్యాట్‌తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో కాకుండా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్‌తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్‌షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
రాయల్ లండన్ వన్డే కప్-2023 విజేతగా లీసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్ అయిన రాయల్ లండన్ వన్డే కప్-2023ను లీసెస్టర్‌షైర్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 16) జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. హ్యాంప్‌షైర్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి, తొలిసారి దేశవాలీ వన్డే ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్.. అజేయ శతకంతో విజృంభణ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వికెట్‌కీపర్ హ్యారీ స్విండెల్స్ లిస్ట్-ఏ కెరీర్లో తొలి శతకంతో విజృంభించాడు. 96 బంతులు ఎదుర్కొన్న స్విండెల్స్ 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 117 పరుగులు చేసి, తన జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డాడు. స్విండెల్స్కు శ్యామ్యూల్ ఈవాన్స్ (60), కెప్టెన్ లివిస్ హిల్ (42) సహకరించారు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో బార్కర్, మేసన్ క్రేన్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హోలండ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్ గెలుపు కోసం కడదాకా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవరల్లో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులకు పరిమితమైంది. టామ్ ప్రెస్ట్ (51), లియామ్ డాసన్ (57) అర్ధసెంచరీలతో రాణించి, హ్యాంప్‌షైర్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. వీరికి బెన్ బ్రౌన్ (33), జో వెదర్లీ (40) సహకరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో ముల్దర్, క్రిస్ రైట్, జోష్ హల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొలిన్ అకెర్‌మ్యాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వార్విక్షైర్తో ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్-లీసెస్టర్‌షైర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్‌షైర్‌తో తలపడుతుంది. చెలరేగిన లియామ్ డాసన్.. వార్విక్షైర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. డాసన్ తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ను కుప్పకూల్చాడు. డాసన్ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతను 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్‌షైర్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనికి పేసర్ కీత్ బార్కర్ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్షైర్ కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది.వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో బర్నార్డ్ (26), సామ్ హెయిన్ (33 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్ ఔట్ చేశాడు. రాణించిన మిడిల్టన్.. 94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ ఫ్లెచా మిడిల్టన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్ ప్రెస్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ నిక్ గబ్బన్స్ 9 పరుగులు చేసి లింటాట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్‌షైర్ గిబ్బన్స్ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్ ఏళ్ల డాసన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్-2023లో భాగంగా నిన్న (జూన్ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. విన్స్ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్ డాసన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, హార్మర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. లియామ్ డాసన్ (4-0-21-4), నాథన్ ఇల్లిస్ (2.1-0-10-3), స్కాట్ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (23), డేనియల్ లారెన్స్ (22), పాల్ వాల్టర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న విన్స్.. ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్ ప్రస్తుత టీ20 బ్లాస్ట్ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి