చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్‌.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు | England Domestic One Day Cup 2023: Hampshire Enters Into Finals, As Liam Dawson Shines With Ball | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్‌.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు

Published Tue, Aug 29 2023 7:12 PM | Last Updated on Tue, Aug 29 2023 7:23 PM

England Domestic One Day Cup 2023: Hampshire Enters Into Finals, As Liam Dawson Shines With Ball - Sakshi

ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023లో హ్యాంప్‌షైర్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వార్విక్‌షైర్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్‌-లీసెస్టర్‌షైర్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్‌ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్‌షైర్‌తో తలపడుతుంది.

చెలరేగిన లియామ్‌ డాసన్‌..
వార్విక్‌షైర్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ డాసన్‌ చెలరేగిపోయాడు. డాసన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో వార్విక్‌షైర్‌ను కుప్పకూల్చాడు. డాసన్‌ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతను 7 వికెట్లు పడగొట్టాడు.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌షైర్‌.. డాసన్‌ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్‌ 6.5 ఓవర్లు బౌల్‌ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్‌షైర్‌ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌షైర్‌.. డాసన్‌ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్‌ 6.5 ఓవర్లు బౌల్‌ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

అతనికి పేసర్‌ కీత్‌ బార్కర్‌ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్‌షైర్‌ కనీసం మూడంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయింది.వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో బర్నార్డ్‌ (26), సామ్‌ హెయిన్‌ (33 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్‌ ఔట్‌ చేశాడు.

రాణించిన మిడిల్టన్‌..
94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్‌.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్‌ ఫ్లెచా మిడిల్టన్‌ (54 నాటౌట్‌) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్‌ ప్రెస్‌ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ నిక్‌ గబ్బన్స్‌ 9 పరుగులు చేసి లింటాట్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్‌షైర్‌ గిబ్బన్స్‌ వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్‌ ఏళ్ల డాసన్‌ ఇంగ్లండ్‌ తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement