Warwickshire
-
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వార్విక్షైర్తో ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్-లీసెస్టర్‌షైర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్‌షైర్‌తో తలపడుతుంది. చెలరేగిన లియామ్ డాసన్.. వార్విక్షైర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. డాసన్ తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ను కుప్పకూల్చాడు. డాసన్ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతను 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్‌షైర్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనికి పేసర్ కీత్ బార్కర్ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్షైర్ కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది.వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో బర్నార్డ్ (26), సామ్ హెయిన్ (33 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్ ఔట్ చేశాడు. రాణించిన మిడిల్టన్.. 94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ ఫ్లెచా మిడిల్టన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్ ప్రెస్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ నిక్ గబ్బన్స్ 9 పరుగులు చేసి లింటాట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్‌షైర్ గిబ్బన్స్ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్ ఏళ్ల డాసన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. -
Viral Video: వింత పద్ధతిలో ఔటయ్యాడు.. సిక్స్ కొట్టి..!
కౌంటీ ఛాంపియన్షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్‌లో మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. What do we make of this one then? Toby Roland-Jones won't want to see that dismissal again 🫣pic.twitter.com/xdaESl3EB0 — Wisden (@WisdenCricket) July 25, 2023 ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ హిగ్గిన్స్ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వార్విక్ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్ తలో 3 వికెట్లు, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (0), విల్ రోడ్స్ (19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్ (26), సామ్ హెయిన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. హెల్మ్, బాంబర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. బాంబర్ (5/20), కెప్టెన్ టోబీ జోన్స్ (3/27), ర్యాన్ హిగ్గిన్స్ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్ వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్నార్డ్‌తో పాటు మైఖేల్ బుర్గెస్ (12), రాబర్ట్ యేట్స్ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్లు చేశారు. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్‌గా రికార్డు
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జూన్ 30) జరిగిన మ్యాచ్‌లో నాటింగ్హమ్ ఆటగాడు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు (తొలి బంతికే ఔట్) ఉన్నాయి. ఫలితంగా వార్విక్షైర్ తొలి ఓవర్లో 7 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA — Vitality Blast (@VitalityBlast) June 30, 2023 వార్విక్షైర్ ఖాతాలో ఉన్న 7 పరుగుల్లో 5 వైడ్ల రూపంలో వచ్చినవి కావడం విశేషం. తొలి బంతికి వైడ్ల రూపంలో 5 పరుగులు రాగా.. ఆతర్వాతి బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బీడబ్ల్యూ, రెండో బంతికి బెంజమిన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యారు. 3, 4 బంతులకు సింగల్స్ రాగా.. ఐదో బంతికి మౌస్లే (1).. ఓలీ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి బర్నార్డ్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఓ బౌలర్ ఈ తరహాలో తొలి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. వన్డేల్లో శ్రీలంక పేస్ దిగ్గజం చమిందా వాస్ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాస్.. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్.. నిర్ణీత ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లింటాట్, హసన్ అలీ తలో 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్ 2, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టగా.. నాటింగ్హమ్ ఇన్నింగ్స్‌లో టామ్ మూర్స్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్షైర్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాబర్ట్ ఏట్స్ (65), జేకబ్ బెథెల్ (27), జేక్ లింటాట్ (27 నాటౌట్) రాణించారు. నాటింగ్హమ్ బౌలర్లలో అఫ్రిది 4, జేక్ బాల్ 3 వికెట్లు పడగొట్టారు. -
టీ20 బ్లాస్ట్‌లో దుమ్మురేపనున్న మ్యాక్స్‌వెల్.. ఏ జట్టుకు అంటే..?
ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. టీ20 బ్లాస్ట్-2023 కోసం వార్విక్షైర్ మ్యాక్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాక్స్‌వెల్ రాబోయే సీజన్లో వార్విక్షైర్ తరఫున ఆడనున్న రెండో ఫారిన్ ప్లేయర్ కానున్నాడు. కొద్ది రోజుల కిందటే వార్విక్షైర్ పాక్ పేసర్ హసన్ అలీతో డీల్ ఓకే చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌తో ఒప్పందాన్ని ధృవీకరిస్తూ వార్విక్షైర్ క్లబ్ నిన్న (ఫిబ్రవరి 14) ఓ ప్రకటనను విడుదల చేసింది. మ్యాక్సీ ఎంపికపై వార్విక్షైర్ హెడ్ కోచ్ మార్క్ రాబిన్సన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న హార్డ్ హిట్టర్స్లో ఒకరైన మ్యాక్స్‌వెల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అనందాన్ని కలిగిస్తుందని అని అన్నాడు. టీ20ల్లో మ్యాక్సీ ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. అతని పవర్ హిట్టింగ్, వైవిధ్యమైన ఆటతీరు తమ క్లబ్ అభిమానులను తప్పక ఎంటర్టైన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాక్సీ ఆడే షాట్లకు ప్రత్యర్ధి జట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేక నానా కష్టాలు పడతారని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు మ్యాక్సీ ఫీల్డింగ్ సామర్థ్యం తమ క్లబ్‌కు అదనపు బలంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే మ్యాక్స్‌వెల్ తమతో కలుస్తాడని పేర్కొన్నాడు. ఈ డీల్‌పై మ్యాక్స్‌వెల్ కూడా స్పందించాడు. వార్విక్షైర్ బేర్స్ తరఫున కొత్త ఛాలెంజ్ స్వీకరించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. టీ20 క్రికెట్ ఆడేందుకు ఎడ్జ్‌బాస్టన్ ఓ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకొచ్చాడు. కాగా, కాలు ఫ్రాక్చర్ కారణంగా గత 3 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ఆడలేదు. ఐపీఎల్‌కు ముందు అతను జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు ఉంటాయి. 34 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తన టీ20 కెరీర్లో 350కి పైగా మ్యాచ్‌ల్లో 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో మ్యాక్సీ ఓ విధ్వంసకర బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. జాతీయ జట్టుతో పాటు పలు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనే మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో హ్యాంప్‌షైర్, సర్రే, యార్క్‌షైర్, లాంకాషైర్ క్లబ్‌ల తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున మ్యాక్సీ.. 7 టెస్ట్‌లు, 127 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో అతను వివిధ జట్ల తరఫున 110 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. -
సిరాజ్‌కు ఐదు వికెట్లు.. అరంగేట్రం అదుర్స్
టీమిండియాకు దూరమైన మహ్మద్ సిరాజ్ కౌంటీల్లో వార్విక్షైర్ తరపున అరంగేట్రం చేశాడు. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సిరాజ్ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 24 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. కాగా సిరాజ్ దెబ్బకు సోమర్సెట్ 219 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 196 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 21 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 13 పరుగులు చేసింది. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమిండియా తరపున టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమైన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో బిజీగా ఉండడం.. టి20 జట్టులో చోటు లేకపోవడంతో అతను కౌంటీ క్రికెట్లో ఆడుతున్నాడు. కౌంటీల్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్ సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలిరోజు ఆటలో 19 ఓవర్లు వేసిన సిరాజ్ 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే పాకిస్తాన్ బ్యాటర్ ఇమాముల్ హక్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. ఇమాముల్ హక్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్‌కు ఆవల ఊరిస్తూ వేసిన బంతిని ఇమాముల్ హక్ అంచనా వేయడంలో పొరబడ్డాడు. అంతే బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి కీపర్ చేతిలో పడింది. అంపైర్ సిగ్నల్ ఇవ్వకముందే సిరాజ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోగా.. బ్యాటర్ మాత్రం క్రీజులోనే ఉన్నాడు. అయితే అంపైర్ కూడా ఓట్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేదేం లేక ఇమాముల్ హక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా పాక్ తరపున 16 టెస్టులు, 54 వన్డేలు, రెండు టి20లు ఆడిన ఇమాముల్ ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by County Championship (@countychampionship) చదవండి: Shane Warne: 'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే సౌతాఫ్రికా క్రికెట్‌కు భారీ షాక్ -
ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న మహ్మద్ సిరాజ్..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022 సీజన్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సిరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మీడియా సమావేశంలో గురువారం వెల్లడించింది. "కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్‌లోని అఖరి మూడు మ్యాచ్‌లకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఒప్పందం చేసుకున్నాము. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 12న సోమర్‌సెట్‌తో మ్యాచ్‌కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడు" అని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే విషయం పై సిరాజ్ మాట్లాడుతూ.. :"కౌంటీ క్రికెట్లో ఆడేందుకు ఆనుమతి ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నాను. వార్విక్షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఆడడానన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. వార్విక్షైర్ జట్టులో చేరేందుకు చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ గడ్డపై సిరాజ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ ఐదో టెస్టులో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs ZIM: వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన! -
Royal London One-Day Cup: పుజారా ప్రతాపం
లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్షైర్తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు. -
తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా అంటేనే నెమ్మదైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో గ్రూఫ్-ఏలో వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ 'నయావాల్' 73 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేసిన పుజారా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో పుజారా ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. లియామ్ నార్వెల్ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా ఔట్ కావడం జట్టు కొంపముంచిందనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాబర్ట్ యేట్స్ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్ రోడ్స్ 76, మైకెల్ బర్గెస్ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్షైర్ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్షైర్ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది. 4 2 4 2 6 4 TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI — Sussex Cricket (@SussexCCC) August 12, 2022 చదవండి: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్ దిశగా వెస్టిండీస్ -
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్‌లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్‌కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్‌షైర్‌కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
వార్విక్షైర్ జట్టుకు ఆడనున్న కృనాల్ పాండ్యా
ఇంగ్లండ్ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ కప్‌లో భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్ వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు. 31 ఏళ్ల కృనాల్ భారత్ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్‌వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్
Tim Bresnan Announces Retirement: ఇంగ్లండ్‌కు తొలి టీ20 ప్రపంచకప్(2010) అందించిన జట్టులో కీలక సభ్యుడు, ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ బ్రేస్నన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం కన్ఫర్మ్ చేసింది. 🧢 685 appearances ☝️ 1,087 wickets 🏏 12,116 runs 🏆 2 Ashes wins Congratulations to former PCA rep Tim Bresnan on a truly outstanding professional career 👏 🤝 All the best with whatever comes next, Tim - the PCA will always be here to support you. pic.twitter.com/F1D0N2gJ3V — PCA (@PCA) January 31, 2022 ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36 ఏళ్ల బ్రేస్నన్.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో 4 అర్ధ సెంచరీలు, 2 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. జాతీయ జట్టుతో పోలిస్తే కౌంటీ జట్టు వార్విక్షైర్తో ఎక్కువ అనుబంధం కలిగిన అతను.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 213 మ్యాచ్‌ల్లో 575 వికెట్లు, 7128 పరుగులు చేశాడు. బ్రేస్నన్ ఇంగ్లండ్ యాషెస్ గెలిచిన రెండు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించాడు. Thank you for the incredible memories, @timbresnan! 🤝#OnceABearAlwaysABear 🐻#YouBears pic.twitter.com/SKHiiioix9 — Warwickshire CCC 🏏 (@WarwickshireCCC) January 31, 2022 చదవండి: Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..! -
విండీస్ పవర్ హిట్టర్‌కు కరోనా..
లండన్: గత రెండేళ్లుగా వెస్టిండీస్ టీమ్‌కి దూరంగా ఉంటూ, విదేశీ టీ20 లీగ్స్‌లో బిజీగా గడుపుతున్న పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న బ్రాత్వైట్కు.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ కౌంటీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో నిన్న నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌కి అతని స్థానంలో రోబ్ యాట్స్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20 బ్లాస్ట్ టోర్నీ నిబంధనల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో జులై 9న జరిగే మ్యాచ్‌కి కూడా ఈ స్టార్ పవర్ హిట్టర్ దూరంగా ఉంటాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. కాగా, ప్రస్తుత టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన బ్రాత్‌వైట్.. 18 వికెట్లు పడగొట్టి, 104 పరుగులు చేశాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించిన కార్లోస్ బ్రాత్‌వైట్.. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా కరీబియన్ జట్టును కూడా నడిపించాడు. అయితే, 2019 నుంచి అతని కెరీర్ గాడి తప్పిడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. -
విహారికి ఎప్పటికీ గుర్తుండిపోయే కౌంటీ అరంగేట్రం!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్‌ల్లో భాగంగా అక్కడ జరిగే కౌంటీ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హనుమ విహారి చెత్త రికార్డు నమోదు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్న విహారికి తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. 40 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 23 బంతుల్ని ఎదుర్కొన్న విహారి డకౌట్ అయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హసీబ్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది విహారికి మరచిపోలేని కౌంటీ అరంగేట్రంగా ఎప్పటికీ గుర్తుండి పోవడం ఖాయం. కాగా, ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు విహారి. నాటింగ్‌హామ్‌షైర్ ఇన్నింగ్స్ చేస్తున్నప్పుడు వన్ హ్యాండెడ్ డైవింగ్ క్యాచ్‌తో అలరించాడు. విల్ రోడ్స్ బౌలింగ్‌లో స్టీవన్ ములానే(31) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్లో నో చాన్స్.. అందుకే కౌంటీ క్రికెట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. వార్విక్షైర్ తరఫున అతను కనీసం మూడు మ్యాచ్‌లు ఆడతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌కు వెళ్లిన విహారి 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. చదవండి: ధోని బాయ్ జట్టుతో తొలి మ్యాచ్.. అది కెప్టెన్‌గా -
లారా ఆ రికార్డు సాధించి 26 ఏళ్లు..
జమైకా : క్రికెట్ ప్రపంచానికి బ్రియాన్ లారా పరిచయం అవసరం లేని పేరు. సమాకాలీన క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ధీటుగా పరుగులు సాధించిన వ్యక్తి. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400*నాటౌట్) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి లారా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501*పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ అద్భుతం జరిగి నేటికి 26 ఏళ్లవుతుంది.(ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 30,000 మంది..) జూన్ 6, 1994లో వార్విక్షైర్ తరపున ప్రాతినిధ్యం వహించిన లారా ఎడ్జ్బాస్టడ్ వేదికగా దుర్హమ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో పాకిస్తాన్‌కు చెందిన హనీఫ్ మహ్మద్ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును లారా బద్దలుకొట్టాడు. మొత్తం 474 నిమిషాల పాటు క్రీజులో ఉన్న లారా 427 బంతులెదుర్కొని 501 పరుగులు చేశాడు. కాగా ఇన్నింగ్స్ మధ్యలో లారా 12, 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభతర క్యాచ్‌లను అప్పటి వికెట్ కీపర్ క్రిస్ స్కాట్ వదిలివేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఫలితంగా లారా జాన్ మోరిస్ బౌలింగ్‌లో కవర్‌డ్రైవ్ కొట్టి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. అంతేగాక ఆ సీజన్లో వార్విక్షైర్ తరపున లారా 8 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లలో 7 శతకాలతో 89.82 సగటుతో మొత్తం 2006 పరుగులు సాధించాడు. అయితే అప్పటికే విండీస్ జట్టులో సభ్యుడైన లారా రెండు నెలల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. సిరీస్‌లో చివరి టెస్టులో లారా 538 బంతులెదుర్కొని 375 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 45 ఫోర్లు ఉన్నాయి. సమకాలీన క్రికెట్లో అద్భుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించిన లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థశతకాలు ఉన్నాయి. కాగా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా 261 ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.(గల్లీ క్రికెట్: గేల్‌కు పాండ్యా ఛాన్స్) -
మృత్యుంజయుడు.. చర్మం లేకుండా పుట్టి..
నాటింగ్హమ్ : చర్మం లేకుండా పుట్టిన ఓ శిశువు ప్రాణాలతో బయటపడి డాక్టర్లను ఆశ్చర్యపరిచాడు. బ్రతకటమే కష్టం అనుకున్న ఆ చిన్నారి ఒంటిపై చర్మంపెరగటంతో డాక్టర్లు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని నాటింగ్హమ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వార్మిక్షేర్కు చెందిన జెస్సికా కిబ్లర్, జాక్ శాటక్ భార్యభర్తలు. గర్భవతిగా ఉన్న జెస్సికా పురిటి నొప్పులతో కొద్దిరోజులక్రితం దగ్గరలోని నాటింగ్హమ్ సిటీ హాస్పిటల్లో చేరింది. అయితే ఆమె చర్మంలేని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. పైగా 10వారాల ముందు పుట్టడంతో బిడ్డ బ్రతకటం కష్టమన్నారు డాక్టర్లు. ఐసీయూలో ఉన్న తమ బిడ్డను మొదటిసారి చూసుకున్న జాక్ దంపతులు షాకయ్యారు. కేవలం ముఖంపై మాత్రమే కొద్దిగా చర్మం ఉండి, మిగిలిన శరీరం మొత్తం.. చర్మంపై పొర లేకుండా మాంసపు ముద్దలా ఉన్న అతడిని చూడగానే వెక్కివెక్కి ఏడ్చారు. వీరిని చూసిన అక్కడి నర్సులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించకుండా ఐసీయూలో ఉంచి పర్యవేక్షించసాగారు డాక్టర్లు. అయితే ఆరు వారాల తర్వాత ఆశ్చర్యకరంగా బాబు ఒంటిపై చర్మం పెరగటం ప్రారంభమైంది. దీంతో డాక్టర్లు అతడిని తల్లిదండ్రులతో పాటు ఇంటికి తీసుకుపోవటానికి అనుమతించారు. ప్రస్తుతం డాక్టర్లు శస్త్రచికిత్సల ద్వారా అతడి ఒంటిపై చర్మాన్ని అవసరమైన చోటకు మార్పు చేస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలతో బయటపడినందుకు జాక్ దంపతులు ఎంతో సంతోషిస్తున్నారు. -
10 ఓవర్లు.. 5 మేడిన్లు.. 6 వికెట్లు!
షాన్ పొలాక్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడీ దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్. తన ప్రతిభా సామర్థ్యాలతో అనేకసార్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2000 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా టీమ్ కు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాదు కౌంటీ క్రికెట్ లోనూ సత్తా చాటాడు. 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో తొలి కౌంటీ మ్యాచ్ ఆడిన పొలాక్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 1996, ఏప్రిల్ 26న లీచెస్టర్ షైర్ టీమ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో 6 వికెట్లు పడగొట్టి వార్విక్ షైర్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 10 ఓవరల్లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి అరడజను వికెట్లు నేలకూల్చాడు. ఇందులో 5 మేడిన్ ఓవర్లు ఉన్నాయి. అంతేకాదు 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను ట్విటర్ ద్వారా పొలాక్ గుర్తు చేశాడు. తొలి కౌంటీ మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు. ఆ రోజు తాను వేసి ప్రతి బంతి, ఎమోషన్ ఇప్పటికీ తనకు గుర్తున్నాయని ట్వీట్ చేశాడు. 20 yrs on!Surreal experience-1st day County nerves, still clearly remember each ball & the emotion that went with it https://t.co/OSTYtKY1VY — Shaun Pollock (@7polly7) 26 April 2016