జమైకా : క్రికెట్ ప్రపంచానికి బ్రియాన్ లారా పరిచయం అవసరం లేని పేరు. సమాకాలీన క్రికెట్‌లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ధీటుగా పరుగులు సాధించిన వ్యక్తి. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400*నాటౌట్) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి లారా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లోనూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501*పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ అద్భుతం జరిగి నేటికి 26 ఏళ్లవుతుంది.(ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 30,000 మంది..)
జూన్ 6, 1994లో వార్విక్‌షైర్ తరపున ప్రాతినిధ్యం వహించిన లారా ఎడ్జ్‌బాస్టడ్ వేదికగా దుర్హమ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో పాకిస్తాన్‌కు చెందిన హనీఫ్ మహ్మద్ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును లారా బద్దలుకొట్టాడు. మొత్తం 474 నిమిషాల పాటు క్రీజులో ఉన్న లారా 427 బంతులెదుర్కొని 501 పరుగులు చేశాడు. కాగా ఇన్నింగ్స్ మధ్యలో లారా 12, 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభతర క్యాచ్‌లను అప్పటి వికెట్ కీపర్ క్రిస్ స్కాట్ వదిలివేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఫలితంగా లారా జాన్ మోరిస్ బౌలింగ్‌లో కవర్‌డ్రైవ్ కొట్టి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. అంతేగాక ఆ సీజన్‌లో వార్విక్‌షైర్ తరపున లారా 8 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లలో 7 శతకాలతో 89.82 సగటుతో మొత్తం 2006 పరుగులు సాధించాడు.
అయితే అప్పటికే విండీస్ జట్టులో సభ్యుడైన లారా రెండు నెలల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. సిరీస్‌లో చివరి టెస్టులో లారా 538 బంతులెదుర్కొని 375 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 45 ఫోర్లు ఉన్నాయి. సమకాలీన క్రికెట్‌లో అద్భుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించిన లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థశతకాలు ఉన్నాయి. కాగా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా 261 ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.(గల్లీ క్రికెట్: గేల్‌కు పాండ్యా ఛాన్స్)
Comments
Please login to add a commentAdd a comment