పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా నిన్న (జనవరి 19) ముగిసిన టెస్ట్ మ్యాచ్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గడ్డపై అత్యంత పొట్టి మ్యాచ్‌గా (బంతుల పరంగా) రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోనే ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై అతి త్వరగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే.
ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌ల జాబితాలో తాజాగా ముగిసిన పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్ 10వ స్థానంలో నిలిచింది.
పాకిస్తాన్ గడ్డపై బంతుల పరంగా అతి పొట్టి టెస్ట్ మ్యాచ్‌లు..
2025- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ముల్తాన్ (1064 బంతుల్లో ముగిసింది)
1990- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ఫైసలాబాద్ (1080 బంతుల్లో)
1986- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, లాహోర్ (1136)
2001- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ముల్తాన్ (1183)
2024- పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, రావల్పిండి (1233)
బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లు..
624- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2023,24, కేప్‌టౌన్)
656- సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (1931-32, మెల్‌బోర్న్)
672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (1934-35, బ్రిడ్జ్‌టౌన్)
788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1888, మాంచెస్టర్)
842- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2020-21, అహ్మదాబాద్)
872- న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1945-46, వెల్లింగ్టన్)
893- పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (2002-03, షార్జా)
920- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (2022, గాలే)
1011- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ (2005, హరారే)
1064- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (2025, ముల్తాన్)ఔ
1069- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (2023-24, మీర్‌పూర్)
1423- ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే (2024, బెల్‌ఫాస్ట్)
కాగా, ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) 20 వికెట్లు పడగొట్టింది.
వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 157 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment