brian lara
-
భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్‌కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్‌గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్‌లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
సచిన్, నేనూ కాదు.. అత్యుత్తమ క్రికెటర్ అతడే: లారా
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్‌పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.కెప్టెన్‌గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్‌కు అతడు సారథిగా వ్యవహరించాడు.కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది: లారా
క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.దూకుడైన ఆటగాళ్లు తక్కువేఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్‌గా ఆడుతున్నారు.వీరిద్దరికే ఆ సత్తా ఉందిఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్‌తో వ్యాఖ్యానించాడు.కాగా టీమిండియా భవిష్య కెప్టెన్‌గా పేరొందిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్‌ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్‌కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్‌పై లారా వ్యాఖ్యలు
టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోతోందన్నాడు.జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లారా సూచించాడు.పదకొండేళ్లుగా నిరీక్షణకాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.ఇక హెడ్‌కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.మరో అవకాశంఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.వ్యూహాలే లేవుటీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.మీ దగ్గర వరల్డ్‌కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!ఈసారైనా ద్రవిడ్ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
T20 WC: ఆసీస్ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.గావస్కర్ టాప్-4 జట్లు ఇవేఅండర్డాగ్స్గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తాజా వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్‌లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్‌గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలి. వన్‌డౌన్‌లోనే అతడు ఆడాలి.టాపార్డర్‌లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్‌లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
T20 వరల్డ్‌కప్‌కు లారా భారత జట్టు ఇదే.. ఊహించని ప్లేయర్‌కు ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది. ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకున్నారు. వరల్డ్‌కప్ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్, నయా ఫినిషర్ రింకూ సింగ్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అదే విధంగా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లను లారా ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌కు సైతం లారా అవకాశమిచ్చాడు.వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఫాస్ట్ బౌలర్లగా బ్రియాన్ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు. -
కోహ్లిని ఓపెనర్‌గా పంపితే అంతే సంగతులు!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్‌ను పంపితేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అలా కాదని విరాట్ కోహ్లిని గనుక ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 316 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఈ క్రమంలో పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సైతం ప్రస్తుతానికి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 118 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారత టీ20 జట్టుకు దూరం కాగా.. యువ ఆటగాళ్లు వరుసగా అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, రోహిత్ ,కోహ్లి ఇటీవలే రీఎంట్రీ ఇవ్వగా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఐపీఎల్లో మాత్రం అదరగొడుతూ ఇక ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్-2024 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరుణంలో కోహ్లికి భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. యువ ఆటగాళ్లకు చోటిచ్చే క్రమంలో కోహ్లికి ఛాన్స్ రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానమిస్తున్నాడు కోహ్లి. మరోవైపు.. ఈసారి కూడా రోహిత్ శర్మనే ఈ వరల్డ్‌కప్‌లో భారత జట్టును ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా స్టార్ స్పోర్ట్స్ షోలో ‘విరాహిత్’ ద్వయం గురించి తన ఆలోచనలు పంచుకున్నాడు. ‘‘ఈసారి వెస్టిండీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వెళ్తారేమో అనిపిస్తోంది. జట్టును ఎంపిక చేసేటపుడు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు. అయితే, ప్రతి ఒక్కరికి తమదైన స్థానంలో రాణించే సత్తా ఉంటుంది. దాని ఆధారంగానే జట్టు కూర్పు ఉండాలి. ఒకవేళ పవర్ ప్లేలో 70-80 పరుగులు కావాలనుకుంటే దూకుడుగా ఆడే వాళ్లు ఉండాలి. నా దృష్టిలో రోహిత్, విరాట్.. ఇద్దరూ గొప్ప ప్లేయర్లే. అయినా.. వీరిలో ఒక్కరినే ఓపెనర్‌గా పంపాలి. అంటే రోహిత్ ఎప్పటి నుంచే ఈ పని చేస్తున్నాడు. కాబట్టి తనకి జోడీగా యువ ఆటగాడినే పంపాలి. ఎందుకంటే ఒకవేళ కోహ్లిని గనుక ఓపెనర్‌గా పంపితే.. ఆరంభంలోనే వీరిద్దరు అవుటైతే మిడిలార్డర్లో ఉన్న వాళ్లపైనే భారం పడుతుంది. అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలనే ఆలోచన పక్కనపెట్టి మూడో స్థానంలో పంపితేనే బాగుంటుంది’’అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. -
వాళ్లు సచిన్ కంటే లారా బెటర్ అనుకుంటారు.. కానీ: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్. పదహారేళ్ల వయసులో.. 1989లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 2013లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇరవై నాలుగేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు లెక్కకుమిక్కిలి ఘనతలు సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న ఈ లెజెండ్.. అత్యధిక పరుగుల వీరుడిగానూ చెక్కు చెదరని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీటితో పాటు మరెన్నో అరుదైన ఫీట్లు నమోదు చేసి అత్యుత్తమ క్రికెటర్‌గా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, ఆస్ట్రేలియన్లు మాత్రం వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారానే సచిన్ కంటే మెరుగైన ఆటగాడని భావిస్తారట. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్ ఈ మాట అంటున్నాడు. అయితే, తన దృష్టిలో మాత్రం సచిన్.. లారా కంటే ఎంతో గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా అని పేర్కొన్నాడు. అందుకే సచిన్ గొప్ప బ్యాటర్ అంటాను ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘సచిన్ టెండుల్కర్ అసాధారణ ఆటగాడు. అందరిలా కాకుండా.. అతడు వేరొక గ్రహం నుంచి వచ్చాడనే అనుకుంటా. అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ఎన్నో చూశాను. అయితే, వాటన్నింటి కంటే కూడా వ్యక్తిగా అతడు మిగత వారి కంటే ఎంతో ఉత్తముడు. అతడు మైదానంలోపల లేదంటే వెలుపల.. ఎవరితోనైనా వాదనకు దిగడం చూశారా? నేనైతే ఎప్పుడూ అలాంటివి చూడలేదు. అందుకే అతడు మిగతా వాళ్లకంటే గొప్పవాడు. ఆనందజీవి అని చెబుతాను. మీకు తెలుసా.. ఆస్ట్రేలియన్లు సచిన్ కంటే లారా బెటర్ అని భావిస్తారు. నేనైతే ఆ మాటను రబ్బిష్ అని కొట్టిపారేస్తా. బ్రియన్ లారా నాలుగు మిలియన్ల మంది ముందు ఆడితే.. ఈ మనిషి(సచిన్‌ను ఉద్దేశించి) 1.4 బిలియన్ల మంది కోసం ఆడాడు. అలాంటపుడు అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? అదీ అతడి గొప్పతనం’’ అని అలీ బచర్.. సచిన్ టెండుల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అలీ సౌతాఫ్రికా తరఫున పన్నెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. పరుగుల వీరుడు సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ కెరీర్ సచిన్ టెండుల్కర్ టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 18426 రన్స్ తీశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? -
నా ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసే సత్తా గిల్‌కు మాత్రమే ఉంది: లారా
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునిక తరం క్రికెటర్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కేవలం గిల్‌కు మాత్రమే ఉందంటూ అతడిని ఆకాశానికెత్తాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన శుబ్‌మన్ గిల్.. టెస్టు, వన్డే, టీ20లలో ఇప్పటికే సెంచరీలు నమోదు చేశాడు. తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ పంజాబీ బ్యాటర్.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు అద్భుత అర్ధ శతకాల సాయంతో 354 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిల తర్వాత ఈ జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆనంద్‌బజార్ పత్రికతో మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాకుండా టెస్టుల్లోనూ గిల్ ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అంచనా వేశాడు. ‘‘నా పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను శుబ్‌మన్ గిల్ తప్పక బద్దలు కొడతాడు. ప్రస్తుత తరంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో గిల్ ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే సత్తా ఉన్నవాడు. నా మాటలు గుర్తుపెట్టుకోండి.. రాసిపెట్టుకోండి అతడు నా రికార్డులను బ్రేక్ చేస్తాడు. గిల్ ఒకవేళ కౌంటీ క్రికెట్ ఆడితే నా 501 నాటౌట్ రికార్డును.. అదే విధంగా టెస్టుల్లో నా అత్యధిక స్కోరు 400 పరుగులను అతడు దాటేస్తాడు. వరల్డ్‌కప్-2023లో గిల్ సెంచరీ చేయకపోవచ్చు. కానీ అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్ ఇప్పటికే ఆడేశాడు. ప్రతి ఫార్మాట్లోనూ అతడు సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లోనూ ఒంటిచేత్తో ఎన్నోసార్లు తన జట్టును గెలిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లు గెలుస్తాడు’’ అని లారా 24 ఏళ్ల శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా సౌతాఫ్రికా టూర్లో భాగంగా గిల్ టీ20, టెస్టు సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. చదవండి: Ind vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత సులువేం కాదు.. అక్కడ నెగ్గాలంటే: ద్రవిడ్ -
WC 2023: ఒకేరోజు కోహ్లి- రోహిత్ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్
ICC ODI WC 2023- Virat Kohli- Rohit Sharma: వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపునకు పునాది వేస్తే.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం(53)తో దానిని మరింత బలపరిచాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) రోహిత్ దూకుడు.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఇలా పుణెలో బంగ్లాతో మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెడితే.. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కోహ్లి విజయంగా మలిచి మరోసారి ఛేజింగ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో.. రన్‌మెషీన్ కోహ్లి పలు అరుదైన రికార్డులు సాధించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సైతం కోహ్లితో కలిసి ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల లిస్టులో ‘విరాహిట్’ ద్వయం ఒకేరోజు(అక్టోబరు 19) టాప్-5లోకి చేరుకోవడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) లారా, ఏబీడీ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో కోహ్లి, రోహిత్.. వరుసగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను అధిగమించారు. ఈ జాబితాలో ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి.. భారత బ్యాటర్లలో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)- 2278 రన్స్- 44 ఇన్నింగ్స్‌లో ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 1743 రన్స్- 42 ఇన్నింగ్స్‌లో ►కుమార్ సంగక్కర- 1532 రన్స్- 35 ఇన్నింగ్స్‌లో ►విరాట్ కోహ్లి- 1286 రన్స్- 30 ఇన్నింగ్స్‌లో ►రోహిత్ శర్మ- 1243 రన్స్- 21 ఇన్నింగ్స్‌లో ►బ్రియన్ లారా- 1225 రన్స్- 33 ఇన్నింగ్స్‌లో ►ఏబీ డివిలియర్స్- 1207 రన్స్- 22 ఇన్నింగ్స్‌లో. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..
Sachin Tendulkar- history Test cricket: క్రికెట్లో రికార్డులకు మారుపేరు సచిన్ టెండుల్కర్. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ లెక్కనేనన్ని ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నేటికీ కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుత తరం బ్యాటర్లలో ఎవరు ఏ రికార్డు సాధించినా అందులో సగం వరకు సచిన్ పేరుతో ముడిపడి ఉంటాయంటే ఈ టీమిండియా లెజెండ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌ను పెద్దగా ఇష్టపడని వాళ్లకు సైతం ఆయన పేరు సుపరిచితమే. మరి అలాంటి.. మన క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో అక్టోబరు 17కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజు.. 2008లో సరిగ్గా ఇదే రోజు.. మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా సచిన్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా.. కంగారూ జట్టు పేసర్ పీటర్ సిడెల్ బౌలింగ్‌లో.. గల్లీ దిశగా బంతిని తరలించాడు సచిన్. లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్ ఈ క్రమంలో మూడు పరుగులు సాధించిన లిటిల్ మాస్టర్.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 11,953 పరుగులతో లారా అగ్రస్థానంలో ఉండేవాడు. ఇక 2006లోనే ఈ విండీస్ లెజెండ్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా.. 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా సచిన్ టెస్టుల్లో ఆల్‌టైమ్ లీడ్ రన్‌స్కోరర్‌గా అవతరించాడు. ఆసీస్ ఆటగాళ్ల అభినందనలు ఇక కెరీర్లో అరుదైన ఘనత సాధించిన సచిన్ టెండుల్కర్‌కు నాడు మొహాలీ ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. నాటి ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సహా ఇతర ఆటగాళ్లు సచిన్ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపారు. వంద శతకాల వీరుడు.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఘనుడు కాగా 152 టెస్టులో సచిన్ టెండుల్కర్ 11955 పరుగులతో లారాను అధిగమించగా.. లారా 131 మ్యాచ్‌లలోనే 11953 రన్స్ సాధించాడు. అప్పటికి సచిన్ అత్యుత్తమ స్కోరు 248 నాటౌట్ కాగా.. లారా స్కోరు 400- నాటౌట్. ఇక తన 24 ఏళ్ల కెరీర్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 248 కాగా.. వన్డేల్లో 200. టెస్టు సెంచరీలు 51. వన్డే సెంచరీలు 49. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్! RECORDULKAR "Success is a process & during that journey sometimes there're stones thrown at you & you convert them into milestones"#OnThisDay in 2008 at 2.31pm, @sachin_rt became the Highest Run Scorer when he went past Lara's tally of 11,953 Test runspic.twitter.com/5VOdLBrdZu — Cricketopia (@CricketopiaCom) October 17, 2023 -
'అతడొక సంచలనం.. కచ్చితంగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు'
టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్‌ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాప్‌లో లారా కూడా భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్కిల్స్‌ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. అయితే ఉమ్రాన్‌కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్‌తో పాటు కొన్ని ట్రిక్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో డేల్ స్టెయిన్‌తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్ -
IPL 2024: సన్‌రైజర్స్‌లో కీలక పరిణామం.. హెడ్ కోచ్‌కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్‌ను తప్పించి లాంగర్‌ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్‌కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్‌గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్‌ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్‌తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. -
Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి!
India Tour Of West Indies: అనిల్ కుంబ్లే.. ఈ రైట్ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్.. భారత్ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. 1990లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్‌గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే చాలు పూనకాలే! బ్రియన్ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్‌కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట! దవడ పగిలినా దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అనిల్ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్ ధిల్లాన్ షార్ట్ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్‌కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి దిగాడు. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్రియన్ లారా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను. జోక్ చేస్తున్నా అనుకుంది అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్ కట్ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే! జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్ -
టీమిండియాతో వరుస సిరీస్‌లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం!
భారత వేదికగా జరగున్న వన్డే ప్రంపచకప్-2023కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిల్లో ఓటమి పాలై కరీబియన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ ఆడనుంది. ఇక క్వాలిఫయర్స్ ముగిసిన వెంటనే విండీస్ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో విండీస్ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ సిరీస్ ప్రారంభం కానుంది. మెంటార్‌గా బ్రియాన్ లారా ఇక గత కొంత కాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న విండీస్ జట్టును చక్కదిద్దే పనిలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పడింది. టీమిండియాతో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో విండీస్ జట్టు మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విండీస్ ప్రాక్టీస్ సెషన్స్‌కు లారా హాజరవుతోన్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో మునిగి తెలుతోంది. వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: భారత జట్టు హెడ్‌కోచ్‌గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన -
అమెరికాలో.. దిగ్గజ క్రికెటర్లతో సంజూ శాంసన్! ఫొటో వైరల్
Sanju Samson In USA: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య చారులతతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని యూఎస్ఏ ట్రిప్‌లో తన సతీమణితో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య చారులతతో పలు ఫొటోలు షేర్ చేసిన సంజూ.. తాజాగా ఇద్దరు క్రికెటర్ దిగ్గజాలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్, వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘గ్రేట్ కంపెనీ’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. స్టైలిష్ లుక్ ఇందులో షేన్ బాండ్, లారా నడుమ నిలబడ్డ సంజూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కాగా షేన్ బాండ్, బ్రియన్ లారా ఐపీఎల్-2023లో భాగమైన విషయం తెలిసిందే. బాండ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించగా.. లారా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌గా సేవలు అందించాడు. మరోవైపు.. సంజూ.. రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిన విషయం తెలిసిందే. గత సీజన్లో రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. విండీస్‌తో వన్డేలకు ఇక మొత్తంగా 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు ఈ కేరళ బ్యాటర్. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో సంజూకు చోటు దక్కింది. విండీస్‌తో వన్డేలకు అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. 2015లో తొలిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్.. ఇప్పటి వరకు 11 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 330, 301 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు భారత జట్టు వెస్టిండీస్ టూర్‌తో బిజీ కానుంది. వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) -
ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 విజేతగా పాట్ కమ్మిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. మరోవైపు ఐసీసీ టైటిల్ సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేనకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. అంతకుముందు 2021లో ఇదే ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా భారత జట్టు ఓటమి చవిచూసింది. కాగా డబ్ల్యూటీసీ-2025 కూడా ఇంగ్లండ్‌లోనే జరగనుండడం గమనార్హం. అయితే ఈ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను కేవలం ఇంగ్లండ్‌లోనే నిర్వహించడం సరికాదని పలువరు మాజీలు మొదటి నుంచే అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త ఆసహనం వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. "ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలనే రూల్ కూడా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ మ్యాచ్ నిర్వహించవచ్చు. అది కూడా జూన్‌లోనే షెడ్యూల్ చేయాలని లేదు కాదా. సీసీ ట్రోఫీ గెలవడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఈ ఓటమితో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు తీవ్ర నిరాశకు గురయ్యారు" అని అన్నాడు. తాజాగా రోహిత్ వాఖ్యలతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ఎకీభవించాడు. తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను తన స్వదేశం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో నిర్వహించాలని లారా అభిప్రాయపడ్డాడు. "డబ్ల్యూటీసీ-2025ను బార్బడోస్‌లో నిర్వహించాలని నేను భావిస్తున్నాను. అది కూడా జూన్‌లో కాకుండా మార్చిలో జరగాలి. ఫైనల్‌కు చేరే రెండు జట్ల ఐస్లాండ్స్ అందాలను ఆస్వాదించాలని" ఓ యూజర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టుకు లారా రిప్లే ఇచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ (2023–25) సైకిల్లో భాగంగా భారత జట్టు తమ తొలి సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. విండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జులై 12–16 మధ్య తొలి టెస్టు (డొమినికాలో), జులై 20–24 మధ్య రెండో టెస్టు (ట్రినిడాడ్)లో జరుగుతాయి. చదవండి: #RAshwin: బాధ కలిగిన మాట నిజమే.. -
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు!
IPL 2023 SRH Vs MI- Brian Lara Comments: తమ జట్టు మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు సన్‌రైజర్స్‌లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అలా కథ ముగిసింది టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో రైజర్స్ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్ శర్మ..అర్జున్ టెండుల్కర్ చేతికి బంతినిచ్చాడు. అప్పటికి భువనేశ్వర్ కుమార్‌తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్.. చివరి ఓవర్ రెండో బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్.. భువీని పెవిలియన్‌కు పంపడంతో సన్‌రైజర్స్ కథ ముగిసింది. వాళ్లలాంటి ఆటగాళ్లు కావాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రైజర్స్ కోచ్ లారా మాట్లాడుతూ.. ‘‘మేము ఆ విషయం(మిడిలార్డర్)లో ఇంకా కసరత్తులు చేస్తున్నాం. మ్యాచ్ చివరి వరకు ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో ఉండాలి. తెవాటియా, మిల్లర్ లాంటి ప్లేయర్ల అవసరం మాకు ఉంది. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో సన్‌రైజర్స్ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ SRH Vs MI: టెస్టు ప్లేయర్‌తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి? Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్!
Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది. లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఐపీఎల్-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్‌లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు. పేలవమైన ప్రదర్శనతో రైజర్స్ వరుస ఓటములు ఇప్పటికైనా తమ బ్యాటింగ్ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్‌రైజర్స్.. పదహారో ఎడిషన్‌నూ పేలవంగా ఆరంభించింది. సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన రైజర్స్... శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఎయిడెన్ అన్న.. హ్యారీ బ్రూక్ మరీ ఘోరంగా తొలి మ్యాచ్‌లో టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్‌లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్ జట్టుపై రాహుల్ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది. వాళ్లిద్దరు అవుట్ అవడం దెబ్బతీసింది ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత.. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హ్యారీబ్రూక్ వెనువెంటనే పెవిలియన్ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్‌ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు. చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
IPL 2023: ‘పవర్ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్ విషయంలో మా నిర్ణయం సరైందే!
IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఓటమికి రెండు ‘పవర్ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్ పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్‌ప్లేలో పరుగులే చేయలేకపోయాం. 200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్ పేసర్ నటరాజన్ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్.. తన రెండో ఓవర్ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు. ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్ రాయల్స్ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్‌కుమార్ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్ పిచ్‌పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్‌కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు! Nattu in death overs 👉 Always 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvRR pic.twitter.com/DIErNzIWxm — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2023 -
సన్‌రైజర్స్ సరికొత్తగా...
రెండేళ్ల క్రితం ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్లో ఎనిమిదో స్థానం... గత ఏడాది పది జట్లు పాల్గొన్న ఐపీఎల్‌లోనూ ఎనిమిదో స్థానం... ఆట మెరుగుపడలేదని అనుకోవాలా లేక తమకంటే రెండు జట్లు కింద ఉన్నాయి కాబట్టి బాగానే ఆడినట్లా! 2016లో చాంపియన్‌గా నిలిచాక తర్వాతి నాలుగు సీజన్లలో టాప్–4లో ఉంటూ నిలకడ ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట గత రెండేళ్లు పూర్తిగా గతి తప్పింది. సమష్టి వైఫల్యంతో పాటు వార్నర్ వివాదం టీమ్‌ను బాగా ఇబ్బంది పెట్టాయి. 2019 ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే రైజర్స్ తమ సొంత మైదానం హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడబోతోంది. పలువురు ఆటగాళ్ల మార్పులతో పాటు సహాయక సిబ్బందిలోనూ స్వల్ప మార్పుచేర్పులతో కొత్త సీజన్‌కు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కొత్త కెపె్టన్‌గా ముందు నిలబడగా, ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడైన బ్రియాన్ లారా ఈసారి పూర్తి స్థాయిలో జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం కొత్త సీజన్ వేలానికి ముందు హైదరాబాద్ 2022లో ఆడిన వారి నుంచి 12 మంది ఆటగాళ్లను వదిలేసుకుంది. వీరిలో ‘కేన్ మామా’ అంటూ అభిమానులు పిలుచుకున్న విలియమ్సన్తో పాటు నికోలస్ పూరన్ తదితరులు ఉన్నారు. మరో 12 మందిని కొనసాగించగా అందులోంచే దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్రమ్ను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్ యాజమాన్యానికే చెందిన ఈస్టర్న్ కేప్ టీమ్ మార్క్రమ్ సారథ్యంలోనే విజేతగా నిలిచింది. కాబట్టి నాయకత్వం విషయంలో ఫ్రాంచైజీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నా... మార్క్రమ్పైనే యాజమాన్యం విశ్వాసం ఉంచింది. జట్టు తరఫున గత ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతను 12 ఇన్నింగ్స్‌లలో 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. ఈసారి అతడి బ్యాటింగ్‌తో పాటు కెపె్టన్సీ బాధ్యతలు కూడా జట్టుకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ‘హోం గ్రౌండ్’ ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 మ్యాచ్‌ల కోసం జట్టులో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలిగి విజయాలు సాధిస్తే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బ్రూక్ చెలరేగుతాడా... సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లో ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు ఇంగ్లండ్‌కు చెందిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 99 టి20ల్లో విధ్వంసకర స్ట్రయిక్‌రేట్ 148.32తో 2432 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో బ్రూక్ బ్యాటింగ్ రైజర్స్‌కు ‘బూస్ట్’ ఇవ్వగలదు. అయితే భారత గడ్డపై తొలిసారి ఆడనున్న అతను పరిస్థితులను ఎలా వాడుకుంటాడనేది చూడాలి. మిడిలార్డర్లో అతనితో పాటు మార్క్రమ్, వికెట్ కీపర్లు ఫిలిప్స్, క్లాసెన్ (ఇద్దరిలో ఒకరు), ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. గత సీజన్ టీమ్ టాప్ స్కోరర్ అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు టాపార్డర్‌లో వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇతర జట్లతో పోలిస్తే తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసక ఓపెనర్ హైదరాబాద్ వద్ద లేడనేది స్పష్టం. పేసర్ల బృందం... బ్యాటింగ్‌తో పోలిస్తే మరోసారి హైదరాబాద్ బౌలింగ్ కాస్త పదునుగా కనిపిస్తోంది. గత సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లోనూ ‘ఫాస్టెస్ట్ బాల్’ విసిరిన ఉమ్రాన్ మలిక్ ఇప్పుడు కూడా కీలక బాధ్యత పోషించాల్సి ఉంది. పైగా ఈ ఏడాది కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో అతని ఆట మెరుగవడంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. బౌలింగ్‌లో మునుపటి వాడి లోపించడంతో భారత జట్టు చోటుతో పాటు బోర్డు కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన భువనేశ్వర్ ఈసారి ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. అయితే నటరాజన్, కార్తీక్ త్యాగి, జాన్సెన్, ఫజల్ హఖ్లతో పేస్ బృందం పెద్దదిగానే ఉంది. ఆల్‌రౌండర్ సుందర్ ఆఫ్ స్పిన్ జట్టుకు సానుకూలాంశం కాగా, రెగ్యులర్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున గత కొన్నేళ్లుగా వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రషీద్ అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటే గతంలో రషీద్ ఖాన్ తరహాలో లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చు. దేశవాళీ లెగ్‌స్పిన్నర్ మయాంక్ మర్కండే కూడా టీమ్‌లో ఉన్నాడు కానీ గత రెండు సీజన్లుగా అతను రాణించలేకపోయాడు. అయితే ఓవరాల్‌గా చూస్తే ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లు మినహా కొత్తగా జట్టులోకి వచ్చి న యువ ఆటగాళ్లలో మరీ చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు కీలక దశలో సమద్‌పై పూర్తి నమ్మకం ఉంచలేని పరిస్థితి. కాబట్టి తుది జట్టులో వీరిలో ఎవరికి స్థానం దక్కుతుందనేది సందేహమే. సన్‌రైజర్స్ జట్టు వివరాలు మార్క్రమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హఖ్ ఫారుఖీ, హ్యారీ బ్రూక్, క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హొసీన్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, నటరాజన్, ఉమ్రాన్ మలిక్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మర్కండే, వివ్రాంత్ శర్మ, మయాంక్ డాగర్, సమర్థ్ వ్యాస్, సన్వీర్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి. సహాయక సిబ్బంది బ్రియాన్ లారా (హెడ్ కోచ్), డేల్ స్టెయిన్ (పేస్ బౌలింగ్ కోచ్), ముత్తయ్య మురళీధరన్ (స్పిన్ బౌలింగ్ కోచ్), ర్యాన్ కుక్ (ఫీల్డింగ్ కోచ్), సైమన్ హెల్మెట్ (అసిస్టెంట్ కోచ్).