
లారా మెచ్చిన సందీప్ కిషన్ సినిమా
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి ఫిదా అయ్యారు.
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి ఫిదా అయ్యారు. మరి ఆయనకు తెలుగు రాదు కదా అంటారా.. అసలు ఆ లఘు చిత్రంలో మాటలు ఉంటే కదా! మూగ, చెవిటి అయిన ఓ అమ్మాయికి.. మాట్లాడగల, వినగల ఓ అబ్బాయికి మధ్య జరిగే ఓ స్వీట్ లవ్ స్టోరీ. కునాల్ కౌశిక్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన ఈ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్.
ట్రినిడాడ్లో తన ఇంట్లో ఉండి యూ ట్యూబ్లో ఈ సినిమాని చూస్తున్నట్లు బ్రియాన్ లారా ట్వీట్ చేశారు. అంతటి దిగ్గజం ట్వీట్ చేస్తే ఆగుతారా.. ఆ సినిమా టీం మొత్తం సామాజిక మాధ్యమాల్లో పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ మన టాలీవుడ్ యువ కెరటం సందీప్ కిషన్ నిర్మించిన ఆ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పలేదు కదూ.. 'సైలెంట్ మెలోడీ'.
Home in Trinidad wit @prasanthvarma Indian film director. Watch #silentmelody on YouTube wit @i_Prachi_Thaker @TheKunalKaushik #youropinion
— Brian Lara (@BrianLara) October 26, 2015