Sundeep Kishan
-
సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025 -
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: రీతూ వర్మ
‘మజాకా’(Mazaka)లో యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో నటించాడు.బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను చేయలేదు. ఆడియన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది’అని అన్నారు రీతూ వర్మ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ(Ritu Varma) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది.→ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.→ ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది→ త్రినాథ్ రావు గత సినిమాల మాదిరే మజాక కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది.→ సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్షు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం తెలుగు క్లాసులు కూడా తీసుకుంది.→ డైరెక్టర్ త్రినాధ్ రావు చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా ఉంటారు.త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.→ నా సీనీ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను. అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది. నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని ఉంది.→ ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. -
‘మజాకా’ చిత్రం లైవ్ సాంగ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ (ఫొటోలు)
-
మజాకాతో పెద్ద హిట్ కొడుతున్నాం: సందీప్ కిషన్
‘‘మజాకా’(Mazaka) సినిమా కోసం నెల రోజులుగా పగలు, రాత్రి చిత్రీకరణ చేస్తున్నాం. ఈ మూవీ కోసం మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. అందులో భాగంగా ఔట్‌డోర్‌లో జరుగుతున్న మా సినిమా షూటింగ్‌కి మీడియా వారు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ నెల 26న ‘మజాకా’ చిత్రంతో పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. కాగా ఈ మూవీలోని ‘రావులమ్మ..’ అంటూ సాగే పాట చిత్రీకరణ షూటింగ్ ప్రస్తుతం ఔట్‌డోర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘రావులమ్మ’ ఫుల్ మాస్ అండ్ ఫోక్ సాంగ్. సందీప్, రీతు అద్భుతమైన డ్యాన్స్‌తో ఇరగదీశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం’’ అని చెప్పారు రీతూ వర్మ. ‘‘మజాకా’తో ఈసారి మళ్లీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘మా బ్యానర్లో ఇది బెస్ట్ సినిమా అని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు రాజేష్ దండా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడారు. -
బ్యాచిలర్స్ కోసం జోరు పెంచిన 'సందీప్ కిషన్'
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మజాకా' (Mazaka Movie) నుంచి బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. (ఇదీ చదవండి: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ')ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. నాగార్జునతో మన్మథుడులో నటించిన అన్షు (Anshu Ambani) చాలా కాలం తర్వాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ధనుంజయ్ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా ఉన్నారు.'మజాకా' సినిమా కోసం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, జీ స్టూడియోస్ వారు కేవలం ఓటీటీ హక్కులను 20 కోట్లకు సొంతం చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే.. సందీప్ కిషన్ సినిమాకు భారీ డీల్ సెట్ అయినట్లే అని చెప్పవచ్చు. థియేటర్ రన్లో రూ. 10 కోట్లు రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు. -
కావాలని మాట్లాడలేదు: దర్శకుడు నక్కిన త్రినాథరావు
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన. త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు. -
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా -
విజయ్ కుమారుడు జేసన్ ఫస్ట్ సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించాడు. తన ఫస్ట్ సినిమాను టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో ఆయన చేయనున్నారు. ఈమేరకు తాజాగా మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ సినిమా తమిళ్, తెలుగులో మాత్రమే విడుదల కానుంది. సందీప్ కిషన్‌కు తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి ప్లస్ కానుంది. రీసెంట్గా రాయన్ చిత్రంలో తనదైన స్టైల్లో సందీప్ కిషన్ మెప్పించారు. సంగీతం థమన్ అందిస్తున్నారు.ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి మా సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది. మనం ఎక్కడా పొగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మనం ఏం వెచ్చిస్తామనేదే ప్రధాన పాయింట్‌గా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన సందీప్ కిషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందని మేం భావిస్తున్నాం' అన్నారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ 'తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే వారి వివరాలను తెలియజేస్తాం. 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం.' అని తెలిపారు. -
కోటిన్నర కారు తల్లికి గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో
తెలుగు యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే సరైన హిట్ పడటం లేదు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ ఉన్నాడు. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న ఇతడు.. ఇప్పుడు తన తల్లికి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఆ విషయాన్నే చెబుతూ తెగ మురిసిపోయాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్)'మా అమ్మకు బర్త్ డేకి ముందే గిఫ్ట్ ఇస్తున్నా. ఇప్పటికీ అమ్మ.. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేందుకు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనివ్వమని అడిగింది. ఇప్పుడు అది నెరవేర్చా. చిన్న కానుకలే బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి' అని సందీప్ కిషన్ రాసుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఈ రేంజ్ రోవర్ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.2010లో 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'మజాకా' అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ పండక్కి చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ మూవీస్ విడుదల కానున్నాయి. సందీప్ మూవీ కూడా అదే టైంకి అంటే కష్టమే.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
సంక్రాంతికి మజాకా
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘మజాకా’ అనే టైటిల్ ఖరారైంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మజాకా’. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రావు రమేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా. -
గొప్పమనసు చాటుకున్న టాలీవుడ్ హీరో
ఇటీవల రాయన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. ఓ వ్యక్తి తల్లికి వైద్యపరమైన ఖర్చుల కోసం సాయమందించారు. తన వంతుగా రూ.50 వేలను పంపి గొప్ప మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన హీరో వెంటనే ఆర్థికసాయం అందించాడు. ఇది చూసిన సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సందీప్ ఇప్పటికే ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తనవంతుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే ఇటీవల రాయన్ మూవీతో అభిమానులను మెప్పించారు. ధనుశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అతని తమ్ముడిగా నటించారు. ఈ సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. హీరో ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. పేదలకు ఉచితంగా ఆహారం..గతంలో రాయన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు.Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024 -
సరోజ్ కుమార్ 'పరాక్రమం'.. 22న గ్రాండ్ రిలీజ్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'పరాక్రమం'. శృతి సమన్వి, నాగ లక్ష్మి కీలక పాత్రధారులు. సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే సినిమా. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున 'పరాక్రమం' రిలీజ్ కానుండటం సంతోషంగా ఉంది. చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారని అన్నాడు.సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లా. ఆయన సినిమాలు యూట్యూబ్‌లో చూసి నేనూ డబ్బులు పంపించాం. పరాక్రమం జెన్యూన్ ఫిల్మ్ అని చెప్పాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Raayan X Review: ధనుష్ 'రాయన్' ట్విటర్ రివ్యూ
తమిళ హీరో ధనుష్ మైల్ స్టోన్ మూవీ 'రాయన్'.ఇతడే దర్శకత్వం వహించిన, హీరోగా నటించాడు. సందీప్ కిషన్, కాళీదాస్ జయరాం, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూసిన వాళ్లు ట్విటర్లో టాక్ ఏంటి?ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ మరింత బాగుందని అంటున్నారు. అలానే ధనుష్ ఎంట్రీ అదిరిపోయిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. పూర్తి రివ్యూ ఏంటనేది మరికాసేపట్లో వచ్చేస్తుంది.#Raayan - ARR Bhai is the second hero of the movie🥶🫶Sema BGM, especially the flashback portions🤌🔥🔥 pic.twitter.com/y8Nl2Q7wiU— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024#Raayan First Half REPORT -Raayan - Raw & Rustic One 🔥💥 . @dhanushkraja 's Transformation 🥵🔥 screen presence ... Fireyyyy One ! #Dhanush 's Direction 🏆🙏🙏 Top Notch ... Literally Witnessed an another Vetrimaran Here 🔥 Casting & their Performance - Perfect 💥… pic.twitter.com/shheQ4m4ir— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2024#Raayan interval 💥💥💥💥💥💥#dhanush naaaaaaaaaaaa 💥💥💥💥💥💥💥💥💥💥💥 Watha edra Dragon Template ah omalae #RaayanFDFS pic.twitter.com/TAUiUjcsPG— Tonystark👊🏽 (@Tonystark2409) July 26, 2024#Raayan First half - ABOVE AVERAGE to GOOD🤝- Takes some to set the phase & establish the characters & the story gears up in the midway of the movie 🔥- A Usual Revenge drama but shies out well with the treatment of Director #Dhanush👌- Goosebumps Interval Portion🔪🥵- ARR… pic.twitter.com/XE9v9Lc0Fv— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024Simple and neat title card with terrific BGM..#Raayan pic.twitter.com/5zt02u4Hhg— R Vasanth (@rvasanth92) July 26, 2024 -
హీరోగా ఉంటూ ఆర్టిస్టుగా కొనసాగాలనుకుంటున్నాను
‘‘కెప్టెన్ మిల్లర్, రాయన్’ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాను. అంత మాత్రాన నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండాలనుకోవడం లేదు. హీరోగా ఉంటూ ఆర్టిస్టుగా కొనసాగాలనుకుంటున్నా. ‘రాయన్’ కథ విని షాక్ అయ్యాను. పైగా ధనుష్‌గారి 50వ సినిమా కాబట్టి గౌరవంతో కూడా ‘రాయన్’ అంగీకరించాను. అలాగే నెగటివ్ రోల్స్ కూడా చేయాలనుకోవడం లేదు. ‘ప్రస్థానం’ సినిమాలో కథలో భాగంగా అక్కను, బావను చంపానని ఆ రోజంతా డిప్రెషన్లోనే ఉండి΄ోయాను. అలాంటి మనస్తత్వం నాది’’ అన్నారు సందీప్ కిషన్. ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ఇందులో సందీప్ కిషన్ ఓ లీడ్ రోల్ చేశారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి ‘రాయన్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు.→ నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ‘రాయన్’. ఈ చిత్రంలో పెద్దన్న కార్తవ రాయన్గా ధనుష్‌గారు, రెండోవాడు ముత్తువేల్ రాయన్గా నేను, మూడోవాడు మాణిక్య వీర రాయన్గా కాళిదాసు, వీరి చెల్లి దుర్గా రాయన్గా దుషార కనిపిస్తాం. ఈ ‘రాయన్’ ఫ్యామిలీలో ఏం జరిగింది? అనేది కథ. నిజానికి ధనుష్‌గారు ‘రాయన్’ కథను వేరే దర్శకుడికి ఇచ్చి, ఇందులో నేను చేసిన పాత్రను ఆయన చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాల్సి రావడం, ఆయన యాభయ్యవ చిత్రం కావడంతో ఆ రోల్ చేసే చాన్స్ నాకు వచ్చింది. ‘రాయన్’లో నా కోసం రాసుకున్న పాత్రకు మిమ్మల్ని అడుగుతున్నానని ధనుష్‌గారు అన్న వెంటనే ఓకే చె΄్పాను. నాది విలన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. → నా కంటే పెద్దవారిని నేనెప్పుడూ గౌరవిస్తాను. అందుకే ‘రాయన్’ ఈవెంట్లో ధనుష్‌గారి కాళ్లను టచ్ చేశాను. తన కోసం రాసుకున్న పాత్రను ధనుష్‌గారు నాకు ఇచ్చారు. ఇప్పటివరకు నేను అందుకున్న అత్యధిక పారితోషికం ‘రాయన్’ నుంచే వచ్చింది. → నేను తమిళ సినిమాలు చేస్తున్నది అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని కాదు. ఇక్కడ దుల్కర్ సల్మాన్, ధనుష్గార్ల లాంటి హీరోలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో అలాంటి ప్రేమ నాకు తమిళంలో దక్కాలని. పద్నాలుగేళ్ల నా కెరీర్లో 29 సినిమాలు చేశాను. వీటిలో చాలా సినిమాలను ఫ్లాప్స్ అన్నారు. కానీ ఆ సినిమాల థియేట్రికల్ కలెక్షన్స్ బాగున్నాయని నాకు తెలుసు. ఒకవేళ అవి ΄్లాఫ్స్ అనుకున్నప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే ఆడియన్స్ నన్ను ప్రేమించి, స΄ోర్ట్ చేస్తున్నట్లే కదా. → నక్కిన త్రినాథరావుతో ‘మాజాకా’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాను. స్వరూప్ డైరెక్షన్లో ‘వైబ్’ షూటింగ్ జరుగుతోంది. ‘ఫ్యామిలీ మేన్ 3’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా. సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘మాయవన్ 2’ ఉంది. ‘ఊరు పేరు భైరవకోన’ సీక్వెల్ ఆలోచన ఉంది. -
టాలీవుడ్ హీరో హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు
జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా తనిఖీలు జరుపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే వందల సంఖ్యలో హెటల్స్ను పరిశీలించారు. పరిశుభ్రత, ఫుడ్ నాణ్యత లేని హోటల్స్‌కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు.ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో చాలా ఏళ్ల క్రితమే భాగస్వామ్యంతో ఒక రెస్టారెంట్‌ను సందీప్ ప్రారంభిచారు. సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నాసిరకం పదార్ధాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగును గుర్తించినట్లుఅధికారులు తెలిపారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను కూడా వారు గుర్తించారు. ముందుగా తయారు చేసి ఉంచిన ఫుడ్ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ఉంచారు. కిచెన్‌లో ఉన్న డస్ట్బిన్లకు ఎక్కడే కానీ మూతల లేవు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ లేవు. వంట తయారీ కోసం వారు ఏ నీరు ఉపయోగిస్తున్నారో తెలిపే రికార్డ్ అందుబాటులో లేదు. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. 𝗩𝗶𝘃𝗮𝗵𝗮 𝗕𝗵𝗼𝗷𝗮𝗻𝗮𝗺𝗯𝘂, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱08.07.2024* FSSAI license true copy was displayed at the premises.* Chittimutyalu Rice (25kg) was found with Best Before date as 2022 and 500gms of Coconut Grates found with synthetic food colours. Stock has been… pic.twitter.com/yY5yWkknk1— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 10, 2024 -
ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగు హీరో సందీప్ కిషన్ అప్పుడెప్పుడో చేసిన ఓ హిట్ సినిమా.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కొన్నాళ్ల ముందు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్ చేయగా, తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)సందీప్ కిషన్ హీరోగా చేసిన 'మాయావన్' అనే తమిళ థ్రిల్లర్ సినిమా.. 2017లో రిలీజై హిట్ అయింది. దీన్ని 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులో డబ్ చేశారు. కానీ పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ఓటీటీలో బాగా రీచ్ వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రాబోతుంది.ఈ వీకెండ్ అంటే మే 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుందనమాట. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటోంది. 'మాయా-వన్' టైటిల్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం)Mystery, suspense, and a gripping thriller! "Project Z" premieres May 31st on @ahavideoIN @sundeepkishan @Itslavanya @bindasbhidu @DanielBalaje @icvkumar @ThirukumaranEnt @GhibranVaibodha @BhavaniHDMovies @bhavanidvd pic.twitter.com/G3s8w9yW2y— ahavideoin (@ahavideoIN) May 27, 2024 -
ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాయావన్'. కోలీవుడ్‌లో 2017లో సి.వి. కుమార్ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. తాజాగా పార్ట్-2 నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో 'ప్రాజెక్ట్ z' పేరుతో మొదటి భాగం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ జానర్లో రాబోతున్న 'మాయావన్' సీక్వెల్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం భారీ హిట్ కావడంతో ఏడేళ్ల తర్వాత మాయావన్ పేరుతోనే సీక్వెల్ రానుంది. -
సందీప్, లావణ్య త్రిపాఠి హిట్ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' గా ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు ఏడేళ్ల తర్వాత తెలుగులో డబ్ అయి విడుదలైంది. ఎప్పుడో 2017లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. 2017లో తమిళ్లో విడుదలైన 'మాయావన్' సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఆ ఏడాదిలో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. నిర్మాతగా పిజ్జా సినిమాను నిర్మించి హిట్ కొట్టిన సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పుడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ‘మాయవన్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో సందీప్ కిషనే హీరోగా నటిస్తుండగా.. సీవీ కుమారే దర్శత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ పార్ట్‌ను తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. కథ అర్థం కావాలంటే మొదటి భాగం చూడాలి. అందుకే ఏడేళ్ల తర్వాత ఈ సినిమా పార్ట్-1ను 'ప్రాజెక్ట్ z' గా రేపు విడుదల చేస్తున్నారు. వాస్తవంగా 'మాయవన్' తమిళంలో రిలీజ్ అయిన సమయంలోనే తెలుగులో 'ప్రాజెక్ట్-జడ్' పేరుతో అనువాదం చేశారు. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పలు కారణాలతో అప్పుడు విడుదల కాలేదు. థ్రిల్లర్ సినిమాలను ఇష్ట పడే వారికి 'ప్రాజెక్ట్ z' తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. మాయవన్ పేరుతో తమిళ్ వర్షన్ యూట్యూబ్‌లో కూడా రన్ అవుతుంది. -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?
హిట్ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే రిలీజ్ ప్లాన్ మారిందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఓటీటీ ప్రేమికులకు పండగే. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు వచ్చే అవకాశముంది? (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) తెలుగు సినిమాలకు ఫిబ్రవరి నెల.. డ్రై సీజన్ లాంటిది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసి కొన్నిరోజులే అయ్యింటుంది. అలానే పిల్లలకు పరీక్షల కాలం దగ్గర పడుతుంది కాబట్టి పేరెంట్స్ బయటకు వచ్చేది తక్కువే. దీంతో స్టార్ హీరోలు ఎవరూ ఫిబ్రవరిలో తమ చిత్రాల్ని ప్లాన్ చేసుకోరు. అలా మీడియం రేంజ్ చిత్రాలు వస్తుంటాయి. ఈసారి అలా వచ్చి హిట్ అయిన సినిమా 'ఊరిపేరు భైరవకోన'. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ నటించిన ఓ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. నాలుగు వారాల ఒప్పందం ప్రకారం మార్చి 15 తర్వాత అలా వచ్చే అవకాశముందని అనుకున్నారు. కానీ ఈ వారం చివర్లో అంటే మార్చి 8 లేదా 9వ తేదీన సర్ప్రైజ్ స్ట్రీమింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్లోనే 'హనుమాన్' కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ ఉందని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్‌పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్‌గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సంక్రాంతి తర్వాత థియేటర్ల దగ్గర చెప్పుకోదగ్గ సౌండ్ అయితే లేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా బాగుంది అనిపించుకున్నాయి. కానీ జనాలు థియేటర్లకు వెళ్లి చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలా అని ఓటీటీలో కొత్త మూవీస్ ఏమన్నా ఉంటాయా అంటే లేదు. ఇలాంటి టైంలో ఓ హిట్ చిత్రం ఓటీటీ రిలీజ్ కానుందని మాట ఇప్పుడు మూవీ లవర్స్‌కి ఆసక్తి రేపుతోంది. (ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన హారర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఫాంటసీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం చాలారోజులు షూటింగ్ జరుపుకొని ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నాయి. సోమవారం వరకు అంటే దాదాపు 10 రోజుల్లో రూ.25.11 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరోనే ట్వీట్ చేశాడు. 'ఊరు పేరు భైరవకోన' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అలానే థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 15న అలా ఓటీటీలోకి రావొచ్చని అంటున్నారు. దీనికంటే ముందు 'హనుమాన్' కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాలపై కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) Thank You All For Your Love ♥️ Indebted Forever … and Promise to put my heart & soul to only keep Getting Better ♥️ Thank you Dear @Dir_Vi_Anand @AnilSunkara1 garu & @RajeshDanda_ for this Big Breath of Energy 🤗#OoruPeruBhairavaKona @VarshaBollamma @KavyaThapar pic.twitter.com/kxHw4qTpGo — Sundeep Kishan (@sundeepkishan) February 26, 2024 -
'ఇద్దరు హీరోయిన్లతో ఎంజాయ్'.. స్మూత్‌గా ఇచ్చిపడేసిన హీరో
టాలెంట్‌తో కాదు, ఈ మధ్య కొందరు తెలివి తక్కువ పనులు చేసి ఫేమస్ అవుతున్నారు. అడ్డదారుల్లో వెళ్తే ఈజీగా క్లిక్ అవ్వొచ్చని భావిస్తున్నారు. కానీ దీనివల్ల విమర్శలపాలవడం తప్ప ఏమీ ఉండదని తెలుసుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని క్లిక్ అయిన మీమర్స్, యూట్యూబర్స్‌ను కూడా ఇటీవల సినిమా ఈవెంట్స్‌కు పిలుస్తున్నారు. దీనివల్ల చిత్రయూనిట్‌కు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. మంచి ప్రశ్నలు వేయకుండా అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడిగి నటీనటులను విసిగిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్‌తో.. అభ్యంతరకర ప్రశ్నలతో హీరోహీరోయిన్స్‌ను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా హీరో సందీప్ కిషన్‌కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఊరుపేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్‌లో ఓ మీమర్ మైక్ అందుకుని పిచ్చి ప్రశ్నలు అడిగాడు. ఇద్దరు హీరోయిన్స్‌తో ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేశావ్.. అంటూ రెచ్చిపోయాడు. ఆకతాయి హద్దులు దాటుతున్నా సందీప్ కిషన్ మాత్రం స్మూత్‌గా హ్యాండిల్ చేశాడు. డబుల్ మీనింగ్ ప్రశ్నలు వద్దని హెచ్చరించాడు. వద్దని చెప్పినా కంటిన్యూ చేస్తున్నావ్.. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు.. స్టేజీపై ఆడవాళ్లు ఉన్నారు.. నేను వద్దని చెప్పినా కంటిన్యూ చేస్తున్నావ్. ఇది కరెక్ట్ కాదు అని చురకలు అంటించాడు. దీంతో అతడు 'సరే, మిమ్మల్ని ఫాలో అవుతాను. మంచి మాటలు చెప్పారు' అంటూ వెటకారంగా నవ్వాడు. 'నువ్వు ఫాలో అవ్వు, అవకపో కానీ.. ఇలాంటివి మాత్రం వద్దు' అని బుద్ధి చెప్పాడు. ఇది చూసిన నెటిజన్లు టెంపర్ లూజ్ అవ్వకుండా సందీప్ చాలా బాగా ఆన్సర్ ఇచ్చాడని, తన మెచ్యూరిటీని మెచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. Confirmation from memers: The person who asked double meaning questions isn't a memer. He's a random YouTuber who came to the event for interaction. As soon as he asked those questions, he was sent out by the management. pic.twitter.com/obaHPExbU4 — Movies4u (@Movies4uOfficl) February 23, 2024 చదవండి: మా సంసారంలో అల్లకల్లోలమయ్యే గొడవలే లేవు.. మా అనుబంధమే వేరు! -
టాక్ ఏమో అలా.. 'భైరవకోన' కలెక్షన్స్ మాత్రం కళ్లు చెదిరేలా!
ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలేం లేవు. ఈ శుక్రవారం రిలీజైన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి తొలుత యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఏముంటాయిలే అని అందరూ అనుకున్నారు. కానీ టాక్‌తో సంబంధం లేకుండా కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీకి వస్తున్న వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్‌తోపాటు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. 'గుంటూరు కారం', 'నా సామి రంగ' పాసైపోయాయి. 'సైంధవ్'కి పెద్ద దెబ్బ పడింది. గతవారం రవితేజ 'ఈగల్' వచ్చింది కానీ రెండు మూడు రోజుల్లోనే సైలెంట్ అయిపోయింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ పెద్దగా ఏం ఉండవులే అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజు రూ.6.03 కోట్లు రాగా.. రెండో రోజు ఏకంగా రూ 7 కోట్లు వరకు వచ్చాయి. తద్వారా రెండు రోజుల్లో రూ.13.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ వరకు ఈ జోష్ కొనసాగేలా ఉంది. సోమవారం నుంచి ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) The magic of #OoruPeruBhairavakona is spreading at the worldwide box office❤️🔥 Grosses1️⃣3️⃣.1️⃣0️⃣Cr in 2 Days 🔥 Enjoy this Sunday at the cinemas with the Magical Entertainer ❤️ - https://t.co/OV3enwDhNJ@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy… pic.twitter.com/0M2IekIiud — AK Entertainments (@AKentsOfficial) February 18, 2024 -
‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ
టైటిల్: ఊరు పేరు భైరవకోన నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవి శంకర్ తదితరులు నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ బ్యానర్ నిర్మాత: రాజేష్ దండా సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: విఐ ఆనంద్ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ విడుదల తేది: ఫిబ్రవరి 16, 2024 కథేంటంటే.. బసవ లింగం అలియాస్ బసవ (సందీప్ కిషన్) ఓ స్టంట్ మాస్టర్. యాక్షన్ సీన్లలో హీరోలకు డూప్‌గా పని చేస్తుంటాడు. ఓ సారి అతని స్నేహితుడు జాన్(వైవా హర్ష)తో కలిసి పెళ్లి ఇంట్లో వధువు నగల్ని దొంగిలించి అనుకోకుండా భైరవ కోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. వీరిద్దరితో పాటు మరో దొంగ అగ్రహారం గీత(కావ్య థాపర్) కూడా ఆ గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ వీరికి విచిత్రమైన పరిస్థితుల ఏర్పడుతాయి. బసవ కొట్టేసిన బంగారాన్ని రాజప్ప(రవి శంకర్) దొంగిలిస్తాడు. దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు బసవ ఏం చేశాడు? స్టంట్ మాస్టర్ అయిన బసవ ఎందుకు దొంగగా మారాడు? అసలు రాజప్ప ఎవరు? భైరవకోనలో ఉన్న పెద్దమ్మ(వడివుక్కరసి), డాక్టర్ నారప్ప(వెన్నెల కిశోర్) ఏం చేశారు. గిరిజన యువతి భూమి(వర్ష బొల్లమ్మ), బసవకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఈ భైరవ కోనకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ ఊరి నుంచి బసవ గ్యాంగ్ ఎలా బయటపడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' లాంటి హారర్ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఇలాంటి డైరెక్టర్ నుంచి ఫాంటసీ థ్రిల్లర్ వస్తుందంటే అంచనాలు ఏర్పడడం సాధారణం. ఇక ట్రైలర్ విడుదలయ్యాక ఊరిపేరు భైరవకోన’పై ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే ట్రైలర్ చూసినంత ఆనంద్ గత సినిమాల మాదిరే ఇది కూడా నవ్విస్తూనే కొన్ని చోట్ల భయపెడుతుంది. మంచి ప్రేమ కథతో పాటు తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో మిస్టీరియస్ థ్రిల్లర్‌గా సినిమాను తీర్చిదిద్దారు. అయితే సినిమాలోని ప్రధానమైన అంశాలను ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. హీరో హీరోయిన్ల ప్రేమ కథను మరింతగా బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాడు. అలా అని ఈ చిత్రంలో ఎంగేజింగ్ కంటెంట్ లేదని చెప్పలేం. కడుపుబ్బా నవ్వించడంతో పాటు భయపెట్టే సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. సినిమ చూస్తున్నంతసేపు కొత్త ప్రపంచలోకి వెళ్తాం. కానీ అక్కడ జరిగే సంఘటనలు మాత్రం వాస్తవికతకు చాలా దూరంగా ఉంటాయి. ఎంత ఫాంటసీ జానార్ అయినా..తెరపై చూస్తే కొంచెం అయినా నమ్మేలా ఉండాలి. భైరవకోనలో అది మిస్ అయింది. అలాగే కథ సీరియస్ మూడ్‌లోకి వెళ్లగానే మళ్లీ దానికి కామెడీ టచ్ ఇవ్వడం కూడా.. దెయ్యాలనే బురిడీ కొట్టించడం లాంటి సీన్స్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు అటూ భైరవకోన ఊరిని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత మూడు నెలలు వెనక్కి వెళ్లి.. హీరోని పరిచయం చేశాడు. ఆ తర్వాత కథనం సాదా సీదాగా సాగుతుంది. హీరో గ్యాంగ్ ఎప్పుడైతే బైరవకోన గ్రామంలోకి ప్రవేశిస్తుందో..అప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అక్కడ వైవా హర్ష, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక పెద్దమ్మ, రాజప్ప క్యారెక్టర్ల ఎంట్రీతో బైరవకోణలో ఏదో జరుగబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో ఇంట్రెస్టింగ్ సాగినా.. కథలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నకొద్ది ఆ ఆసక్తి తగ్గిపోతుంది. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. బసవ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో చక్కగా నటించాడు. భూమిగా వర్ష బొల్లమ్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు బలమైన సన్నివేశాలు మాత్రం లేవు. కావ్య థాపర్ కీలక పాత్ర పోషించి మెప్పించింది. తెరపై అందంగానూ కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్షల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. బ్రహ్మాజీ కనిపించేంది కాసేపే అయినా.. నవ్విస్తాడు. రవిశంకర్, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికపరంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ‘నిజమే నే చెబుతున్నా..’సాంగ్‌తో పాటు అన్నీ పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఊరు పేరు భైరవకోన ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. తాను హీరోగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’, కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’..రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక విడుదలకు రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 14న వేసిన పెయిడ్ ప్రీమియర్స్‌కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 16) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ ఎలా ఉంది? సందీప్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు. ఎక్స్‌లో ‘ఊరి పేరు భైరవకోన’కు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్ ఫిల్మ్ అని మరికొంత మంది అంటున్నారు. #OoruPeruBhairavaKona A Subpar Fantasy Thriller that only works in a few parts! The first half holds interest with a unique concept despite a dull narration style. However, the second half goes off-track after a while and into a predictable mode. Pre-Interval sequence stands… — Venky Reviews (@venkyreviews) February 16, 2024 సూపర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవ కోన’లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్ కొంత సమయం తర్వాత ట్రాక్ నుండి బయటపడి ఊహాజనిత మోడ్‌లోకి వెళుతుంది. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. కథనం సీరియస్‌గా సాగుతున్న సమయంలో దర్శకుడు కామెడీ చొప్పించే ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ కాలేదు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అంటూ ఓ నెటిజన్ 2.25-2.5/5 రేటింగ్ ఇచ్చాడు. #OoruPeruBhairavaKona 3.25/5 Good triller with all elements Dont know why reviews are about this@sundeepkishan nails every bit especially in emotional scenes Heroines are good in their role And #VIAnand is jem for these unique story tellings and direction — Richi (@ruthvikrichi007) February 15, 2024 గుడ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. అన్ని అంశాలను కలిపి తీశారు. రివ్యూలు నెగెటివ్‌గా ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు. సందీప్ కిషన్ అద్భుతంగా నటిచాడు. హీరోయిన్లు ఇద్దరు తమ పాత్రకు న్యాయం చేశారు. వీఐ ఆనంద్ జెమ్. యూనిక్ స్టోరీతో ప్రేక్షకులను అలరించారంటూ మరో నెటిజన్ 3.25/5 రేటింగ్ ఇచ్చాడు. First half was super quick #OoruPeruBhairavaKona and thanos snap recalling moment was thrilling. @sundeepkishan ‘s confidence on screen was amazing. Amazing film. Loved watching it. Thanks for not disappointing. pic.twitter.com/kORVWfHYgj — Kotesh (@koteshtn) February 16, 2024 #OoruPeruBhairavaKona ipude chudatame jarigindi. First half is too good Kaani second half as usual recent movies laage undi but the twist reveal at the end mathram"prathi scene prathi shot Mind pothundi lopala" @sundeepkishan "Blockbuster Hit" kottesav Anna. pic.twitter.com/iGPCM6zg9b — AitheyEnti (@Tweetagnito) February 15, 2024 #OoruPeruBhairavaKona first half starts well and pre interval is good but second half below avg 🙏🏻 #OoruPeruBhairavaKonaReview My Rating: 2.25/5 ⭐️⭐️ https://t.co/K5JiRRfzHM — Daniel Sekhar (@rk_mahanti) February 15, 2024 #OoruPeruBhairavaKona is such a remarkable film. A ‘masala fantasy’ venture that exudes spirituality as well as redemption. Absolutely enjoyed the experience… The songs are lovely. @sundeepkishan loved the way you portrayed Basava, especially during the climax portion. That was… — Anuj Radia (@AnujRadia) February 15, 2024 #OoruPeruBhairavaKona is well written and executed movie by @Dir_Vi_Anand The interval is a blast. The story,music,visuals and comedy are the major strengths of the film.Congratulations @sundeepkishan anna for blockbuster. And @VarshaBollamma just stole the show. pic.twitter.com/En76MD7q81 — M.Rithesh Reddy (@RitheshReddy4) February 15, 2024 -
ఆ నమ్మకానికి రుణపడి ఉన్నాం : సందీప్ కిషన్
‘‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి దాదాపు వంద ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్స్. మా మూవీ పాటలు, ట్రైలర్, ప్రీమియర్‌కు మీరు (ప్రేక్షకులు) ఇచ్చిన స్పందన, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి రుణపడి ఉన్నాం’’ అన్నారు సందీప్ కిషన్. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు. ఈ సినిమా నేడు రిలీజజ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్మీట్లో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘మా సినిమా ప్రీమియర్సే కోటి రూపాయల వసూళ్లు సాధించడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ‘‘ఈ రోజు రిలీజవుతున్న మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు వీఐ ఆనంద్, రాజేశ్ దండా. -
ఇండస్ట్రీలో ముగ్గురమ్మాయిలను ప్రేమించా.. వర్కవుట్ కాలే!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా హీరోగా నటించిన మైఖేల్ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారి హారర్, థ్రిల్లర్ కాన్సెప్టును ఎంచుకున్నాడు. అలా అతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను పంచుకున్నాడు. నా లైఫ్‌లో మూడు బ్రేకప్స్.. 'నా జీవితంలో ఇప్పటివరకు ముగ్గురమ్మాయిలను ప్రేమించాను. ఎంతో సీరియస్‌గా లవ్ చేశా.. ఒకరితో నాలుగేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాను. మరో అమ్మాయితో రెండేళ్లు, మరొకరితో రెండున్నరేళ్లు సీరియస్ లవ్‌లో ఉన్నాను. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఈ రోజు నేనున్న పొజిషన్లో ఒక్కసారి ఆలోచిస్తే.. అవేవీ నా జీవితంలో అంత ప్రాముఖ్యం కావనిపిస్తున్నాయి. అయితే నేను ప్రేమించిన ముగ్గురూ కూడా ఇండస్ట్రీకి చెందినవారే! నేను ఏళ్ల తరబడి ప్రేమలో ఉన్నా వారెవరు? అనేది బయటకు రానివ్వలేదు. మా లవ్ మ్యాటర్‌ను అంత సీక్రెట్‌గా ఉంచాను. ఇకపోతే రెజీనా, నేను లవ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ.. తనకు, నాకు మధ్య అలాంటి లవ్ ట్రాక్ ఏం లేదు. తను నాకు బెస్ట్ ఫ్రెండ్. పెళ్లంటేనే భయమేస్తోంది కాలేజీ చదువుకునే రోజుల నుంచీ తను నా స్నేహితురాలు. నా బ్రేకప్స్, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు.. అన్నీ చూసింది. తనకు, నాకు మధ్య ఏమీ లేదు. ఇక పెళ్లెప్పుడంటారా? ఈ వైవాహిక బంధాన్ని నమ్మడం ఈ మధ్యే ప్రారంభించాను. అదే సమయంలో బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఎవరూ పోరు పెట్టడం లేదు. కాబట్టి దానికింకా టైముంది.' అని చెప్పాడు. చదవండి: Aishwarya Rajinikanth: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో
సోషల్ మీడియాలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకునే కుమారి అనే మహిళ చాలా ఫేమస్ అయిపోయింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కడ చూసినా ఆమెనే కనిపించింది. గత కొన్నేళ్లు నుంచి ఈమె షాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. తాజాగా పోలీసులు మాత్రం ఈమె వ్యాపారాన్ని మూయించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'బాబు మొత్తం మీ బిల్లు వెయ్యి అయింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా' అనే ఒక్క లైన్‌తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ దగ్గరకు జనాలు గట్టిగా వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వీడియోలు, ఇంటర్వ్యూలు తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్య తన కొత్త సినిమా 'ఊరు పేరు భైరవకోన' ప్రమోషన్లలో భాగంగా హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా వచ్చిన భోజనం చేశారు. తాజాగా ట్రాఫిక్ సమస్య అవుతుందని చెప్పి హైదరాబాద్ పోలీసులు.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూయించారు. ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ ఆమెకు అండగా ట్వీట్ చేశాడు. 'ఈమె ఎంతో మందికి స్పూర్తి.. తన కాళ్ల మీద తాను నిలబడి వ్యాపారం చేసుకుంటోంది.. ఆమెను ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఆమెతో నా టీం టచ్‌లో ఉంటుంది. వీలైన సాయం చేస్తాను' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?) Not Fair at all..Just when she was turning out be a inspiration to many Women to start their own bussiness to support their family…was one of the Strongest Female empowerment examples I have seen in the recent past .. My Team and I are getting in touch with her to do what Best… https://t.co/HJexa3bhNd — Sundeep Kishan (@sundeepkishan) January 30, 2024 -
రోడ్డు పక్కన ఆంటీ ఫుడ్ స్టాల్.. భోజనం చేసిన హీరోహీరోయిన్లు
ఇంటి ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కమ్మని భోజనాన్ని అమ్మ ప్రేమగా వడ్డిస్తుంటే కడుపునిండా తినాలనిపిస్తుంది. బయట రెస్టారెంట్లలో, వీధి పక్కన ఫుడ్ స్టాల్స్‌లో భోజనం దొరుకుతుంది కానీ ఆ ప్రేమ దొరకదు. ఓసోస్.. అదంతా ఒకప్పుడు.. ఈ మహిళ రాకతో అంతా మారిపోయింది. సాయికుమారి అనే మహిళ హైదరాబాద్‌లో కొంతకాలం క్రితం ఓ ఫుడ్‌స్టాల్ తెరిచింది. సంపాదన మామూలుగా లేదు రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటల్ని జనాలకు అందిస్తోంది. అంతేనా, వాటికి తోడు కన్నా, నాన్నా, చిన్నా అంటూ ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. అంత ఆప్యాయత కురిపిస్తూ భోజనం వడ్డించే ఈవిడ నెలకు రెండున్నర లక్షల పైనే సంపాదిస్తోందట. సోషల్ మీడియాలో తన రీల్స్ కూడా తెగ పాపులర్ అవుతుంటాయి. దీంతో ఊరు పేరు భైరవ కోన టీమ్ వెంటనే అక్కడికి వెళ్లిపోయి ఆమె చేతి వంట రుచిచూసింది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ అక్కడి భోజనాన్ని తిని ఆస్వాదించారు. ఫేమస్ ఫుడ్ స్టాల్లో హీరోహీరోయిన్ల భోజనం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. Spreading smiles & savoring flavours ❤️ Team #OoruPeruBhairavaKona had a delightful visit to meet the viral lady "Sai Kumari", renowned for her charming food selling skills👌🏻 - https://t.co/wiHExfBtaJ@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy 💥… pic.twitter.com/yDn2ArfIjA — BA Raju's Team (@baraju_SuperHit) January 20, 2024 చదవండి: అమ్మ అప్పుడు ఏడ్చేసింది.. నేను నచ్చజెప్పినా.. -
రెండున్నరేళ్లు బాధ్యతతో పని చేశాం: సందీప్ కిషన్
‘‘ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్లు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా యూనిట్‌కి చాలా అవసరం. ఆ బాధ్యతని, అవసరాన్ని గుర్తు చేసుకుంటూ పని చేశాం’’ అని సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. (చదవండి: రవితేజ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్ కిషన్) హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ఊరు పేరు భైరవకోన’ కమర్షియల్లీ ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా కెరీర్లో ఓ సవాల్. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ మూవీలో ప్రేమకథ, కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలున్నాయి. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు రాజేశ్ దండా. ‘‘గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే మూవీ ఇది. థియేటర్స్‌లోనే ఈ సినిమా చూడండి’’ అన్నారు వర్ష, కావ్య. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
Ooru Peru Bhairavakona Trailer Launch: సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
రవితేజ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్ కిషన్
సందీప్‌కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా వంటి చిత్రాలకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు.తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన చిత్రం ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అనే డైలాగుతో ట్రైలర్ మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'ఈగల్' చిత్రం కూడా ఫిబ్రవరి 9న విడుదల అవుతుంది. దీంతో రవితేజ చిత్రంతో వస్తున్న క్లాష్ గురించి సందీప్‌కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 'ఊరు పేరు భైరవకోన' చిత్రాన్ని వాస్తవంగా సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నాం. ఆ తేదీలలో చాలా సినిమాలు ఉండటం చూసి వెనక్కు తగ్గాం. దీంతో ఫిబ్రవరి 9న వెళ్దాం అనుకున్నాం. అప్పటికే ఫిబ్రవరి 9న 'టిల్లు స్క్వేర్' రేసులో ఉంది. ఆ సమయంలో ఆ చిత్ర యూనిట్‌తో మాట్లాడుకుని మేము రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఈ సినిమా వివషయంలో ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. రవితేజతో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ కూడా పని చేశారు. అయన్ను ఎవరైనా అభిమానిస్తారు. 'ఈగల్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మా చిత్ర నిర్మాతకు మంచి స్నేహమే ఉంది. 'ఈగల్' రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. వాళ్లు మాతో టచ్‌లోకి రాలేదు. వారి నుంచి ఫోన్ వచ్చింటే స్పందించేవాళ్లమే.. ఎన్ని జరిగినా ఫిబ్రవరి 9వ తేదీనే రావాలని ఫిక్స్ అయ్యాం. మరోసారి విడుదల తేదీ మారిస్తే మాకు ఎన్నో సమస్యలున్నాయి. సంక్రాంతి రేసులో ఎక్కువ చిత్రాలు ఉండటంతో ఈగల్ తప్పుకోవాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సమావేశం పెట్టి కోరింది. అందుకుగాను ఈగల్ చిత్రానికి సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పింది. అప్పటకే ఫిబ్రవరి 9న విడుదలకు రెడీగా ఉన్న 'టిల్లు స్క్వేర్' వాయిదా వేసుకుంది. కానీ ఆ సమయంలో 'ఊరు పేరు భైరవకోన' చిత్రం టీమ్‌తో చర్చలు జరిగినట్లు లేదని తెలుస్తోంది. దీంతో ఊరు పేరు భైరవకోన,ఈగల్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. వీఐ ఆనంద్ డైరెక్షన్లో ఇప్పటికే టైగర్ చిత్రంలో సందీప్‌కిషన్ నటించాడు. సందీప్ సరసన కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కనిపించనున్నారు. రాజేశ్ దండా నిర్మాత. అనిల్ సుంకర సమర్పకులు. -
Ooru Peru Bhairavakona: ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. లవ్ ఫీల్ తో, రొమాంటిక్ యాంగిల్‌తో ట్రైలర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా భైరవకోన అనే ఫాంటసీ ప్రపంచంలోకి కథ మళ్లుతుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’.. ‘భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం’, ‘లిఖించబడిందే జరుగుతుంది.. రక్త పాతం జరుగనియ్’ వంటి ఆసక్తికర డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు.. వాటిని దాటుకుంటూ వెళ్లి.. తనకు కావాల్సిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దైవశక్తి.. క్షుద్రశక్తి తో పాటు వైపు కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ కథ అల్లుకున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
భారీ యాక్షన్ సీన్స్‌తో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ తెలుగులో విడదల కావడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. తాజాగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ విడుదలైంది. ధనుష్‌తో పాటు చిత్ర బృందం కూడా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమ ఎక్స్ పేజీలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్ నటించాడు. ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. దీంతో పార్ట్-2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ వచ్చింది. -
ఊరు పేరు భైరవకోన సినిమా మేకింగ్ వీడియో
-
ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' టీజర్ రిలీజ్
సౌత్ ఇండియా స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'కెప్టెన్ మిల్లర్'. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. సందీప్ కిషన్‌తో పాటు శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు (జులై 28) ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అందులో ధనుష్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ను చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించాడు. ఈ టీజర్ నిడివి 100 సెకన్స్ లోపు మాత్రమే ఉన్నా.. ఈ సినిమాకు చెందిన ప్రధాన పాత్రలు అన్నిటినీ చూపించారు. ధనుష్ గొడ్డలితోనే కాకుండా తుపాకీతో తూటాలు విదిల్చిన తీరు కూడా అమోఘం. డిసెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ధనుష్కెరీయర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దానికి తోడు పీరియాడిక్ నేపథ్యం సినిమా కాబట్టి మరిన్ని అంచనాలు పెంచింది. -
ఊరు పేరు భైరవకోన టీజర్ లాంచ్.. సందీప్ కిషన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఊరు పేరు భైరవకోన.. గరుడ పురాణంలో మిస్ అయిన పేజీలే..
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదివారం (మే 7) సందీప్ కిషన్ బర్త్‌డే పురస్కరించుకుని ఊరు పేరు భైరవకోన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో చలామణీలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అన్న వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. 'ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకు పోయే దారే లేదు', 'గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' అన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్లో విజువల్స్, బీజీఎం అదిరిపోయాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాను రాజేశ్ దండ నిర్మించారు. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి! చదవండి: బెంజ్ కారు కొన్న బుల్లితెర నటి, ఎన్ని లక్షలో తెలుసా? -
సిద్ శ్రీరామ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్‌ని విన్నారా?
టైగర్(2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్,దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వర్ష బొల్లమ్మ, కావ్యా థావర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌సుంకర ఏజే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని 'నిజమే నే చెబుతున్నా'.. అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ రొమాంటిక్సాంగ్ను సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మలపై చిత్రీకరించారు. సంగీత దర్శఖుడు శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ 'మైఖేల్' చిత్రం
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు.రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల3న విడుదలైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కు మైఖేల్ కూడా నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నెల కూడా గడవక ముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో నేడు(శుక్రవారం)నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేయండి మరి. Roses are red but soaked in blood. The Ultimate Gangsters Love story!! 🔥⚡#MichaelOnAHA Streaming Now ▶️ https://t.co/OJuM7oP6SN pic.twitter.com/TZHVcEseRl — ahavideoin (@ahavideoIN) February 23, 2023 -
ఓటీటీలోకి సందీప్ కిషన్ మైఖేల్..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే
సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టుకోలేకపోయింది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేదు. థియేటర్లలో ఓ మోస్తారుగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. 'మైఖేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 'ఆహా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల 24న ఈ సినిమా ఆహాలోకి రానుంది.దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. The non-stop action entertainer Michael is all ready to set your screens on fire. Ready ga undandi picchekinche action tho rabothunnadu mana Michael.#MichaelOnAHA Premieres Feb 24. @sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @jeranjit @SamCSmusic @Dir_Lokesh pic.twitter.com/3573UmkClD — ahavideoin (@ahavideoIN) February 17, 2023 -
అప్పుడే ఓటీటీలోకి పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టుకోలేకపోయింది. ఇక థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. మాములూగా అయితే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. . కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
బ్రేకప్ జరిగింది.. నాకు రిలేషన్షిప్స్ సెట్ కావు : సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి తాను రిలేషన్షిప్లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని పేర్కొన్నాడు. 'నేను చాలా ఎమోషనల్ పర్సన్. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాను. నాలాంటి వ్యక్తికి రిలేషన్షిప్స్ చాలా డేంజరస్. అవి నాకు సెట్ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో లవ్‌లో ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. కాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో సందీప్ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు. -
రెజీనాతో లవ్? స్పందించిన సందీప్ కిషన్
యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా లవ్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇటీవల రెజీనా బర్త్‌డేను పురస్కరించుకుని సందీప్ కిషన్.. 'హ్యాపీ బర్త్‌డే పాప, ఐ లవ్ యూ.. ఎప్పుడూ నీకు మంచే జరగాలి' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రెజీనాతో క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసి వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని తమిళనాట ప్రచారం జోరందుకుంది. తాజాగా దీనిపై సందీప్ కిషన్ స్పందించాడు. 'మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ మెంబర్‌లాగా! తను పని మీద బాంబే వచ్చినప్పుడు మా సోదరి గదిలోనే ఉంటుంది. 12 సంవత్సరాలుగా మేం ఒకరికొకరం తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! సందీప్- రెజీనా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. వీళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్ప్రైజ్ అవుతారు. అందుకని చెన్నై మీడియా మాగురించి తెలియక అలా రాసేశారు' అని క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) December 13, 2022 చదవండి: కాపురాలు కూల్చడం మాకు రాదు: సీనియర్ నటి -
Michael Movie Review: మైఖేల్ మూవీ రివ్యూ
టైటిల్: మైఖేల్ నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ తదితరులు నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు సమర్పణ: నారాయణ్ దాస్ కె. నారంగ్ దర్శకత్వం: రంజిత్ జయకొడి సంగీతం: శ్యామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. మైఖేల్(సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అనాథలా పెరుగుతాడు. పదేళ్ల వయసులో ముంబైలోనే అతి పెద్ద డాన్‌గా చలామణి అవుతున్న గురునాథ్(గౌతమ్ మీనన్)కు దగ్గరవుతాడు. రెండు సార్లు అతని ప్రాణాలు కాపాడడంతో మైఖేల్‌ని తన ప్రధాన అనుచరుడిగా నియమించుకుంటాడు. అయితే ఇది గురునాథ్ భార్య చారు(అనసూయ), కొడుకు అమర్ నాథ్(వరుణ్ సందేశ్)కు నచ్చదు. కొడుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోపం ఇద్దరికీ ఉంటుంది. మరోవైపు తనపై దాడి చేసిన ఆరుగురిలో ఐదుగురిని దారుణంగా చంపేస్తాడు గురునాథ్. మిగిలిన ఒక్కడు ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని చంపే బాధ్యత మైఖేల్‌కి ఇస్తాడు. ఢిల్లీ వెళ్లి మైఖేల్ ..అక్కడ తీర(దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు. అసలు తీర ఎవరు? గురునాథ్‌ని చంపడానికి ప్లాన్ చేసిన ఆరో వ్యక్తి ఎవరు? బాస్ అప్పగించిన పనిని మైఖేల్ పూర్తి చేశాడా లేదా? గురునాథ్‌కు, మైఖేల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీల పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనాథలా పెరిగే ఓ కుర్రాడు ఓ పెద్ద డాన్ని దగ్గరవ్వడం... ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఒకనొక దశలో అతనికే ఎదురు తిరుగుతాడు. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్.. చివర్లో ఓ ట్విస్ట్... ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఇదే కాన్సెఫ్ట్‌కి మదర్ సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన కేజీయఫ్ చిత్రం రికార్డులు సృష్టించింది. బహుశా ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొనే మైఖేల్ కథను అల్లుకున్నాడేమో దర్శకుడు రంజిత్ జయకొడి. కేజీయఫ్ తరహాలోనే హీరో గురించి ఓ వ్యక్తి వాయిస్ ఓవర్ ఇవ్వడం.. పెద్ద పెద్ద డైలాగ్స్..ఎలివేషన్స్‌తో సినిమాను ప్రారంభించాడు. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కేజీయఫ్ తరహాలో తెరపై పండలేదు. పైగా అతి చేశారనే భావనే కలుగుతుంది తప్పా.. ఎక్కడా వావ్ మూమెంట్స్ ఉండవు. సినిమా చూసినంత సేపు కేజీయఫ్, పంజా, బాలు చిత్రాల తాలుకు సీన్స్ గుర్తుకు వస్తాయి. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. రెట్రో స్టైల్లో సినిమాను తెరకెక్కించారు. విజువల్స్ పరంగా, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సందర్భంలోనూ దర్శకుడు హ్యండిల్ చేసిన పద్ధతి ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్‌ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మైఖేల్ నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. మైఖేల్ పాత్ర కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తెరపై కనపడింది. మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆకట్టుకున్నాడు. నటుడిగా సందీప్ కిషన్‌ని ఒక మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఇందులో గౌతమ్ మీనన్ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించాడు. గ్యాంగ్‌స్టర్ గురునాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తీర పాత్రకు దివ్యాంశ కౌశిక్ న్యాయం చేసింది. నెగిటివ్ షేడ్ ఉన్న అమర్నాథ్ పాత్రలో వరుణ్ సందేశ్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.సెకండాఫ్‌లో వచ్చే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. గురునాథ్ భార్య చారుగా అనసూయ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శ్యామ్ సీఎస్ సంగీతం పర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
వెనక్కి తగ్గిన స్టార్స్.. దూసుకెళ్తున్న యంగ్ హీరోలు
స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం టాలీవుడ్ హద్దులు దాటుతున్నారు. పాన్ ఇండియా హీరోలం అనిపించుకోటానికి తహ తహ లాడిపోతున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పు..మహా అయితే మరో సారి ట్రై చేస్తాం అనుకుంటు..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగుతో పాటు..ఇతర భాషల్లో విజయం సాధించాలి అనుకుంటున్న ఈ హీరోలపై ఓ లుక్కేయండి మేజర్ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసాడు అడివి శేష్. ఇక కార్తికేయా 2 తో నిఖిల్ కూడా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరికొందరు యువ హీరోలు కూడా ..పాన్ ఇండియా సినిమాలతో లక్ పరిక్షించుకోబోతున్నారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది. నాని శ్యామ్ సింగరాయ్ సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సారి ‘దసరా’తో మాత్రం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డెవిల్ సినిమా రాబోతుంది. విశ్వక్ సేన్ రెండో సారి మెగాఫోన్ పట్టుకొని దాస్ క ధమ్కీ మూవీ రూపొందించాడు. ఈ సారి తనను తాను దర్శకుడిగా,హీరోగా పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరో తేజా సజ్జా,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటుతున్నా.. పాన్ ఇండియాపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేయలేదు. త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా..తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుందట. అలాగే పలువురు సీనియర్ హీరోల సినిమాలు కూడా స్వచ్చంగా తెలుగులోనే విడుదల అవుతున్నాయి. అయితే యువ హీరోలు మాత్రం పాన్ ఇండియా రిలీజులపై జోరు చూపిస్తున్నారు. -
సందీప్ కిషన్ ‘మైఖేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రిలీజ్‌కు రెడీ అయిన సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్
నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మైఖేల్. దివ్యాంష కౌషిక్ హిరోయిన్‌గా చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసయ భరద్వాజ్, వరలక్ష్మి శరత్ కువర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రంజిత్ జయక్కొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. శ్యాం సీఎస్ సంగీతాన్ని, కిరణ్ కౌశిక్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాచిత్రంగా ఫిబ్రవరి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్థానిక చెట్‌పేట్‌లోని లేడీ అండ్ స్కల్ ఆవరణలో మీడియాసమావేశాన్ని నిర్వహింంది. దర్శకుడు రంజిత్ జయక్కొడి మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రకు ఎలాంటి ఎమోషనల్, డైలాగులు లేకుండా రూపొందించాలని భావించామన్నారు. దానికి నటుడు సందీప్ కిషన్ అద్భుతంగా నటించారన్నారు. అదేవిధంగా యాక్షన్ సన్నివేశాలు శక్తివంతంగా ఉండటానికి ఫైట్ మాస్టర్ చాలా శ్రమించారన్నారు. ఇందులో ఒక క్యామియో పాత్ర ఉందని దానికి అన్ని భాషలకు తెలిసిన నటుడు అవసరమయ్యారని దీంతో తన మిత్రుడు విజయ్ సేతుపతిని నటించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించాలని చెప్పారు. చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత భరత్ చౌదరినే తమకు ఉద్వేగాన్ని కలిగించారన్నారు. తమ కలను ఇప్పుడు మైఖేల్‌గా మార్చింది కూడా ఆయనేనని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించారని అన్నారు. దర్శకుడు రంజిత్ జయక్కొడి మం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయ్ సేతుపతి మంచి మిత్రుడు అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. -
మా నమ్మకం నిజమైంది : సందీప్ కిషన్
‘‘మైఖేల్’ కథని, దర్శకుడు రంజిత్ని బలంగా నమ్మాం. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన మా నమ్మకాన్ని నిజం చేసింది. కథ, కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’ యూనివర్సల్‌గా రీచ్ అయ్యే సినిమా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుసూ్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ జయకొడి మాట్లాడుతూ– ‘‘నేను తమిళ్లో మూడు సినిమాలు తీశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ కిషన్‌కి సినిమా తప్ప మరో తపన ఉండదు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ట్రైలర్లోనే తెలుస్తోంది. ‘మైఖేల్’తో సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘రంజిత్ ‘మైఖేల్’ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పా’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘మైఖేల్’ లాంటి మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను బాలయ్య రిలీజ్ చేశారు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. -
సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
మరో పాన్ ఇండియా చిత్రంలో అనసూయ... పోస్టర్ అవుట్
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓవైపు స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే, మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనతో పాటు అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యాడ్ ఆఫ్ క్వీన్ అంటూ పవర్ ఫుల్ గెటప్‌లో అనసూయ కనిపిస్తుంది. మరి ఈ సినిమా అనసూయ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మైఖేల్ సినిమాలో సందీప్‌కిషన్‌కు జోడీగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. Meet the Man who Loved the Hardest #MICHAEL 🖤 Worldwide only in Theatres on Feb 3rd, 2023 🔥#MichaelfromFEB3rd 👊🏾@VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/5NEnI0KZgW — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) January 3, 2023 -
'మైఖేల్' మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ సాంగ్ విన్నారా?
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్లాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. దివ్యా కౌశిక్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎస్పీ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రాయ్ మోహన్రావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కాగా తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ సాంగ్‌ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. -
హీరో సందీప్ కిషన్‌తో రెజీనా డేటింగ్? వైరల్‌గా మారిన పోస్ట్
తమిళసినిమా: ప్రస్తుతం వార్తల్లో ఉన్న నటి రెజీనా కసాండ్రా. ఈ చెన్నై అమ్మాయి బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్ ముదల్ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ బ్యూటీ ఎక్కువ చిత్రాలు చేయడం, కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాలర్గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురిం రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా నటుడు సందీప్ కిషన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్ కిషన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022 -
మైఖేల్ సినిమా కోసం 24కిలోల బరువు తగ్గాను : సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మాస్ యాక్షన్ సీన్స్‌తో సందీప్ కిషన్ అదరగొట్టాడు. మొదటిసారి పూర్తిగా యాక్షన్ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడు సంవరత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఇందుకోసం దాదాపు 24 కిలోల బరువు తగ్గాను. మైఖేల్ సినిమా మీద అంచనాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. -
సందీప్ కిషన్ 'మైఖేల్' టీజర్ డేట్ ఫిక్స్
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశా కౌశిక్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీపై భరత్ చౌదరి, పుసుకర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మైఖేల్’. సందీప్ కిషన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. విజయ్ సేతుపతి యాక్షన్ రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివచెర్రీ. -
ఊర మాస్‌గా వరుణ్ సందేశ్.. వినూత్న కథతో ‘యద్భావం తద్భవతి’
‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఆ రెండు చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు కానీ.. నటుడిగా తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు(జులై 21) సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.ఇందులో వరుణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్‌లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నారు.‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి గారికి థ్యాంక్స్’అని వరుణ్ సందేశ్ అన్నారు. మిహిరమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఊరు పేరు భైరవకోన’ పోస్టర్ రిలీజ్
హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు (07.05.) సందర్భంగా ఆయన తాజా చిత్రాల (మైఖేల్, ఊరు పేరు భైరవకోన) నుంచి లుక్స్ రిలీజయ్యాయి. పాన్ ఇండియా మైఖేల్ .. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివ చెర్రీ. ఊరు పేరు భైరవకోన.. సందీప్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర. -
నా నిన్నలలో కన్నులలో.. మెలోడీ సాంగ్ విన్నారా?
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ “రిచి గాడి పెళ్లి” సినిమా నుంచి రెండో సాంగ్‌ను రిలీజ్ చేశారు. నా నిన్నలలో కన్నులలో వెన్నెలలో.. అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా శక్తి శ్రీ గోపాలన్, సత్యన్ ఆలపించారు. ఈ పాట చాలా బాగుందని సందీప్ కిషన్ ప్రశంసలు కురిపించారు. “రిచిగాడి పెళ్లి”లోని రెండో సాంగ్ నా నిన్నలలో కన్నులలో చూశాను సాంగ్‌ను శక్తిశ్రీ గోపాలన్, సత్య ఇద్దరు అద్భుతంగా పాడారు. సాంగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. విజువల్ ట్రీట్‌లా అనిపించింది. క్యూట్ అండ్ స్వీట్ సాంగ్. సినిమాటోగ్రఫి పనితనం కూడా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశం. దర్శకుడు కె యస్ .హేమరాజ్ మాట్లాడుతూ “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ శ్రీమణి రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మా డివోపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది” అని అన్నారు. చదవండి: కొమురం భీముడో ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది సోనాక్షి సిన్హాతో డేటింగ్‌పై స్పందించిన హీరో.. -
బాలీవుడ్ హీరోయిన్‌తో టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమాయణం!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నాడట. బాలీవుడ్ నటి సోనియా రాధేతో సందీప్ రిలేషన్లో ఉన్నట్లు నెట్టింట ఓ కథనం వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. సందీప్, సోనియా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. తక్కువ కాలంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారిందట. అంతేకాదు, ముంబై వీధుల్లో ఈ ఇద్దరూ షికార్లు కొడుతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ ప్రేమ కథనాలపై అటు సందీప్ కానీ, ఇటు సోనియా కానీ ఇంకా స్పందించలేదు. కాగా సోనియా 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆమె నటించిన 'తారా వర్సెస్ బిలాల్' త్వరలో రిలీజ్ అవుతోంది. సోనియా మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్ కూడా! గతంలో ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గానూ పని చేసింది. అటు సందీప్ విషయానికి వస్తే అతడు చివరగా 'గల్లీ రౌడీ' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'మైఖెల్'లో నటిస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయితోనే నా పెళ్లి: మహేశ్ -
మైఖెల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్
విలన్ గ్యాంగ్‌లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్... ఇలా నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్లతో దూసుకెళుతున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ‘మైఖెల్’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్ కిషన్ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బిగ్‌బాస్ షోలో నాకు నచ్చిన వ్యక్తి అతడే!: సందీప్ కిషన్
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంటున్నాడు. ఎక్కడా ఆవేశానికి పోకుండా ప్రతి విషయాన్ని చాలా సెన్సిటివ్‌గా డీల్ చేస్తున్నాడు. ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా తన సహనాన్ని కోల్పోకపోవడం అతడిలో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మానస్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. అతడికి ప్రముఖ టాలీవుడ్ హీరో నుంచి మద్దతు లభించింది. సందీప్ కిషన్ మానస్‌కు సపోర్ట్ చేయమని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేశాడు. నిజానికి ఈ వీడియో బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందే చేసినప్పటికీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో సందీప్ కిషన్ ఏమన్నాడంటే.. 'హలో అందరికీ , నేను మీ సందీప్ కిషన్‌ను. బిగ్‌బాస్ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్ నాగులపల్లి పాల్గొన్నాడు. ఎంతో మంచి మనసున్న అతడు మీ అందరికీ నచ్చుతాడనుకుంటున్నాను. మానస్ చాలామంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్, లవ్ యూ..' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
‘గల్లీ రౌడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : గల్లీ రౌడీ నటీనటులు : సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, వెన్నెల కిషోర్, పొసాని కృష్ణ మురళి, మైమ్ గోపి తదితరులు నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ నిర్మాతలు : యమ్.వి.వి సత్యనారయణ, కోన వెంకట్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి సంగీతం : రామ్ మిరియాల, సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది : సెప్టెంబర్ 17,2021 సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్‌గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. గల్లీరౌడీ కథేంటంటే..? విశాక పట్నానికి చెందిన వాసు(సందీప్ కిషన్)ని పెద్ద రౌడీని చేయాలని కలలు కంటాడు తాత మీసాల సింహాచలం(నాగినీడు). దానికి కారణం తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)తో ఉన్న పాత కక్షలే. అయితే వాసుకు మాత్రం కొట్లాటలు అంటే అసలు నచ్చదు. కానీ తాత కోరిక మేరకు చదువు మధ్యలోనే ఆపేసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతాడు. అయినప్పటికీ గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) కోసం ఓ వీధి రౌడీని కొట్టడంతో వాసుపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఇలా సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు.. ఆమె కుటుంబం కోసం బైరాగిని కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా బైరాగి హత్యకు గురవుతాడు. ఈ కేసు విచారణ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సీఐ రవి(బాబీ సింహ) చేతికి వెళ్తుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రవి తనదైన శైలీలో విచారణ సాగిస్తాడు. ఇంతకీ హంతకుడిని సీఐ రవి పట్టుకున్నాడా లేదా? అసలు ఆ హత్య చేసిందెవరు? హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్) ఫ్యామిలీకి , బైరాగి హత్యకు ఏం సంబంధం? సీఐ రవి ఈ కేసును ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాడు? బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? తాత కోరికను వాసు ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే..? గల్లీరౌడీ వాసుగా సందీప్ కిషన్ అదొరకొట్టేశాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్వేర్ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్ చేయడం.. ప్రతి సీన్లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్వేర్ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి తనదైన నటనతో మెప్పించాడు. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. ‘గల్లీ రౌడీ’మూవీ అందరికి తెలిసిన పాత కథే. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకునే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయలనేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి కథలో తెలుగు చాలానే వచ్చాయి. కథలో బలమైన పాయింట్ ఉన్ననప్పటికీ.. కథనం హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్ డ్రామా కూడా రోటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు మ్యానేజ్ చేశాడు కోన వెంకట్. ఇంటర్వెల్ సీన్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం కామెడీకి స్కోప్ దొరికింది.సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా రీరికార్డింగ్ అదిరిపోయింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గల్లీ రౌడీ’ని లాంచ్ చేయనున్న ‘స్టేట్ రౌడీ’
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. ‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నటుడు ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ‘రోటీన్ లవ్‌స్టోరీ’ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి మంచి హిట్లను అందుకున్నా ఈ కుర్ర హీరో అనంతరం ఎన్నో సినిమాల్లో నటించిన ప్రేక్షకులను మెప్పిచడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. దీంతో మంచి హిట్ కొట్టాలనే కసితో గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ తరుణంలో తన కొత్త సినిమా ‘గల్లి రౌడీ’పై సందీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శనివారం (సెప్టెంబర్ 11న) సాయంత్రం 5:04 నిమిషాలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రొడ్యూసర్ బీవీ రాజ్ టీం అఫిషీయల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ లాంచ్ చేయనున్న ‘స్టేట్ రౌడీ’ అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నేహా శెట్టి హీరోయిన్గా పరిచయం అవుతోంది. కోన వెంకట్ సమర్పణలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, తమిళ నటుడు బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని ఈ నెల 17న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. Laugh riot #GullyRowdy trailer launch by our own #StateRowdy Megastar @KChiruTweets garu on 11th sept at 5:04PM#GullyRowdyOnSept17th@sundeepkishan @actorsimha #NehaShetty @Ram_Miriyala @iamsaikartheek #GNageswaraReddy @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp pic.twitter.com/WT6Vfk8o0p — BA Raju's Team (@baraju_SuperHit) September 9, 2021 -
బిల్డప్ రౌడీగా వచ్చేస్తున్న సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గల్లీరౌడీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 17న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్గా నటించగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రధారి. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కోన వెంకట్ స్క్రిన్ ప్లే కూడా అందించిన ఈ సినిమాకు జీవీ సహ నిర్మాత. ‘‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తానొక పెద్ద రౌడీనని బిల్డప్ ఇచ్చుకున్న ఓ యువకుడి ప్రేమకథ చివరకు ఏమైంది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
'మైఖేల్'గా సందీప్ కిషన్.. పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ యమ జోరుమీదున్నాడు. ఇప్పటికే గల్లీ రౌడీతో రెడీగా ఉన్న ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సందీప్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు 'మైఖేల్' అనే టైటిల్‌ను ప్రకటించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రక్తంతో తడిసిన చేతులకు బేడీలు వేసినట్లున్న పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Making our Special Day a reMARKable one🙌 Proudly Presenting our Pan India film 🇮🇳 Titled #MICHAEL 🌟ing Young & Promising🌟 @sundeepkishan💥 & MakkalSelvan @VijaySethuOffl🔥 🎬 @jeranjit @KaranCoffl #SundeepKishan29 మైఖేల్ மைக்கேல் माइकल ಮೈಕೆಲ್ മൈക്കിൾ#HBDSunielNarang pic.twitter.com/4LniqalbAD — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 27, 2021 చదవండి : తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి అమితాబ్ బాడీగార్డు జీతం ఎంతో తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే! -
నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్
‘‘కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇబ్బంది పడుతున్నారు. నిర్మాతగా అర్థం చేసుకోగలను. కానీ ‘వివాహ భోజనంబు’ను లాక్డౌన్ టైమ్‌లోనే ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే నేను హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ సినిమా మాత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అన్నారు సందీప్ కిషన్. సత్య, ఆర్జావీ రాజ్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రామ్ ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఈ నెల 27 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి ఇంట్లో అతని బంధువులు 16 మంది లాక్డౌన్ వల్ల ఉండిపోవాల్సి వస్తుంది. వారిని పోషించేందుకు ఆ పిసినారి యువకుడు ఎలాంటి పనులు చేశాడనే అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రంలో నేను అంబులెన్స్ డ్రైవర్ పాత్ర చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నటుడిగా 12 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. మంచి ప్రాజెక్ట్స్ కుదురుతున్నాయి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ సిరీస్‌లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా, మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అన్నారు. చదవండి: 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు' మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్ -
వెనక్కి తగ్గిన ‘గల్లీ రౌడీ’ కారణం అదేనట
‘పోటీ వద్దు.. స్నేహమే ముద్దు’ అన్నట్లుగా ‘గల్లీ రౌడీ’ నిర్మాతలు ఇండస్ట్రీలో స్నేహపూరిత వాతావరణం ఉండాలని తమ చిత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. (చదవండి: బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) అయితే ఇప్పుడు వాయిదా వేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకేరోజు సినిమాలు పోటీపడకుండా వేరే రిలీజ్ డేట్ కోసం ఆగితే మంచిదనుకున్నాం. అందుకే మా సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయట్లేదు. అయితే సెప్టెంబర్‌లోనే రిలీజ్ చేస్తాం. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
Gully Rowdy: ‘ఛాంగురే ఐటమ్ సాంగురే’ ప్రోమో అదిరింది
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేహా శెట్టి హీరోయిన్గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘ఛాంగురే ఐటమ్ సాంగురే...’ అంటూ సాగే పాటను హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురువారం విడుదలచేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తీక్, దత్తు ఆలపించారు. సందీప్, స్నేహా గుప్తాలతో డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ హుషారైన స్టెప్పులు వేయించారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్. -
ఆ చిన్నారులకు నేనున్నా అంటున్న సందీప్!
కంటికి కనిపించని కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అటు జనాలకు, ఇటు ప్రభుత్వాలకు కంటిమీద కనుకు లేకుండా చేసింది. ఆర్థిక వ్యవస్థను, అమయాకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతోమందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాధలుగా మారారు. వారి ఆలనాపాలనా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కోవిడ్‌తో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ఇటీవలే నటుడు సోనూసూద్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. తాజాగా టాలీవుడ్ హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, శృతి హాసన్ కోవిడ్ కారణంగా కన్నవారికి దూరమైన వారిని ఆదుకునేందుకు నడుం బిగించారు. ఆలనా పాలనా మాత్రమే కాదు..: సందీప్ కిషన్ 'దురదృష్టవశాత్తూ కరోనా వల్ల కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. వారి వివరాలను sundeepkishancovidhelp@gamil.comకి పంపించండి. నేను, నా టీమ్ వారికి ఆహారాన్ని అందించడంతో పాటు సంరక్షణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటాం. అలాగే కొన్నేళ్ల పాటు విద్యను అందిస్తాం.. ఈ కష్ట సమయంలో అందరం ఒకరికొకరు తోడుగా నిలబడటం అత్యంత అవసరం. కాబట్టి మీరు కూడా మీ పరిసరాల్లో కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సహాయం చేయండి' అని పేర్కొంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. Please Pass on the word.. Love you All ❤️ SK pic.twitter.com/tsgRsgJtSz — Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021 Some people just love to take the 1st given opportunity to be a Know it all Online..lol My team & I reasonably educated & are in touch with the concerned officials to figure the best way to do this,we are all trying to do our bit here...so if possible help,if not pls keep calm 🤟🏽 https://t.co/ugebcCXl0W — Sundeep Kishan (@sundeepkishan) May 4, 2021 వారిని మంచి మనుషుల చేతులో పెడదాం..: శృతీహాసన్ "అందరికీ నమస్కారం.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. వారికి ఏమీ కాదు, ఆ చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. అందుకు ఒక పరిష్కారమార్గం ఉంది. 1098 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి. వారిని మంచి మనసున్నవారికి దత్తతివ్వండి" అని శృతీ హాసన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: A1 Express: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది -
A1 Express: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ ఆటగాడుగా నటించిన చిత్రం "ఏ1 ఎక్స్‌ప్రెస్". లావణ్య త్రిపాఠి హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో అలవోకగా హిట్లు కొట్టిన సందీప్‌కు ఈ మధ్య చేసిన ఏ సినిమాలు కూడా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నష్టాలను చవిచూడక తప్పలేదు. మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించింది. మే 1 నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసే అవకాశం ఉంది. ఇదిలా వెంటు థియేటర్లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీలో హిట్టు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనైనా సక్సెస్‌ను సాధిస్తుందేమో చూడాలంటున్నారు సినీ ప్రేమికులు. All set to watch the match? A1 express is premiering on May 1st on #SUNNXT Download the SUN NXT app and get ready to enjoy this blockbuster Telugu movie!@sundeepkishan #LavanyaTripathi @hiphoptamizha #DirectorDennisJeevanKanukolanu #A1ExpressOnSUNNXT #MoviesOnSUNNXT pic.twitter.com/AVb8SNYGoT — SUN NXT (@sunnxt) April 28, 2021 చదవండి: A1 Express Review: సందీప్ కిషన్ ‘స్పోర్ట్స్ డ్రామా’ -
కొట్టడం అంటే ఓకే కానీ.. కిడ్నాప్ అంటే రిస్క్
విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటీవల తను నటించిన `ఏ1 ఎక్స్‌ప్రెస్’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం గల్లీ రౌడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ను మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా ట్విటర్లో.. ‘ఈ సినిమా మీ అందరిని నవ్విస్తోంది. సందీప్ కిషన్, కోనవెంకట్, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశాడు. ఇక టీజర్ విషయానికొస్తే.. ‘బాబుని రంగంలోకి దింపు. బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం అలరించే విధంగా ఉంది. హీరో చెప్పే ఫన్నీ డైలాగులు, కిడ్నాప్ సీన్లు మూవీపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఓ కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ కథలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పండించనున్నారు. మరి ఈ గల్లీ రౌడీ కథేంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా కలయికలో ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: అందుకు కారణం సీఎం వైఎస్ జగన్: కోన వెంకట్ Launching the teaser of #GullyRowdy 😊https://t.co/gMz9WrQCIa A movie that was made to make you laugh! I wish the team behind it, my man @sundeepkishan, @konavenkat99 sirrr and everyone all laughter, happiness and success! Big hugs and love from me 🤗🤍 — Vijay Deverakonda (@TheDeverakonda) April 19, 2021 -
రౌడీ బేబీ.. గల్లీ రౌడీ అయ్యాడు!
రౌడీ బేబీలో మార్పొచ్చింది. ఏం మార్పు అంటే.. పేరు మార్చుకున్నాడు. ‘గల్లీ రౌడీ’ అని పిలవమంటున్నాడు. అసలు విషయంలోకొస్తే.. సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా ఆ మధ్య ‘రౌడీ బేబీ’ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం టైటిల్‌ని ‘గల్లీ రౌడీ’గా మార్చామని గురువారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం ఈ ఫన్ రైడర్ షూటింగ్ వేగంగా జరగుతోంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. చదవండి: నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్ గౌతమ్ తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు: కాజల్ -
‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏ1 ఎక్స్ ప్రెస్ జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను సంగీతం : హిప్ హాప్ తమిళ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్ విడుదల తేది : మార్చి 05, 2021 టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో, ఆతర్వాత తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేయడం, సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకు ఎంత వరకు తోడైంది? సందీప్ కిషన్ కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్ అంటే కోచ్ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్(రావు రమేశ్)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్ ఫర్ఫార్మింగ్ లిస్ట్‌లో వేస్తాడు. మరోవైపు.. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే.. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే... హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్(సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్ విని షాకవుతారు. అసలు సందీప్ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్ మరళికి సందీప్ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. నటీనటులు నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం సందీప్ కిషన్ పడ్డ కష్టం ప్రతీ సీన్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా సందీప్ కిషన్ అవలీలగా నటించేశాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్ బాయ్ రోల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఇటీవల విడుదలయిన ‘చెక్’ సినిమా కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిందే. అయితే ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే.. హాకీ క్రీడా నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే వచ్చిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. హీరో ప్లాష్‌బ్యాక్‌లో వచ్చిన సీన్లలో నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హీరో స్నేహితులులు హాకీ జట్టుకు ఎంపికకాకపోవడానికి చూపించిన కారణాలు కూడా అంత కన్విన్స్‌గా అనిపించవు. గేమ్ కంటే లోకల్ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన భావన కలుగుతుంది. ఇక ప్రత్యర్థి హాకీ టీం కోచ్ రోల్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. అతని స్థానంలో ఒక ఫేమస్ నటుడిని తీసుకొని ఉంటే రెండు టీమ్స్ మధ్య జరిగే పోటీ సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేవి. అయితే, సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మర్చిపోయి హాకీ ఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. ఇక సినిమాకు ప్రధాన బలం హిప్ హాప్ తమిళ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకుడికి ఉత్కంఠను పెంచుతాడు. కెవిన్ రాజ్ సినిమటోగ్రాఫి బాగుంది. గ్రౌండ్ విజివల్స్ సినిమాకే హైలెట్. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ సంగీతం సినిమా చివరి 20 నిమిషాలు మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్ రొటీన్ స్టోరీ ప్రత్యర్థి హాకీ టీం కోచ్ బలంగా లేకపోవడం - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆటగాళ్లకు కనీస గౌరవం లేదు: హీరో
హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. తెలుగులో హాకీ మీద వస్తున్న తొలి చిత్రమిదేనని హీరో గతంలోనే ప్రకటించగా ఇందులో 'సింగిల్ కింగులం' పాట యువతచెవుల్లో ఇప్పటికీ మోగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. వందేమాతరం అన్న నినాదంతో మొదలైన ఈ ట్రైలర్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ ప్రపంచ హాకీ కప్ గెలిచిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ప్రభుత్వం హాకీని జాతీయ క్రీడగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక ఈ సారి కప్పు మనమే కొడుతున్నామని ట్రైలర్లో రావు రమేష్ ధీమాగా చెప్తున్నాడు. ఆ కప్పు కొట్టే సత్తా హీరోకు ఒక్కడికే ఉన్నట్లుగా అతడి ఎంట్రీ చూపించారు. (చదవండి: రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా?) అయితే కప్పు మాత్రమే కాదు, తనకు తప్పనిపిస్తే మనుషులను కూడా కొడతానని నిరూపిస్తున్నాడు సందీప్ కిషన్. సింగిల్ కింగులం.. అని పాడిన హీరో లావణ్య త్రిపాఠి అంటే ఇంట్రస్ట్ లేదంటూనే ఆమెతో ముద్దుల్లో మునిగిపోయాడు. మరోవైపు ఆటగాళ్లకు ఈ దేశంలో కనీస గౌరవం లేకుండా పోయిందని బాధను వెళ్లగక్కుతూనే, స్పోర్ట్స్ ఎప్పుడో బిజినెస్‌గా మారిపోయిందన్న చేదునిజాన్ని చెప్పుకొచ్చాడు. ఎలాగైనా గెలవాలన్న కసి హీరోలో కనిపిస్తుండగా అతడిని ఓడించాలని చూస్తున్నట్లున్నాడు రావు రమేష్. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారో? సినిమా రిలీజైతే కానీ చెప్పలేం. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హిప్హాప్ తమిజ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 12 రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం (చదవండి: ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?) -
ఏ1 ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టేదప్పుడే!
'ప్రస్థానం'తో వెండితెర మీద ప్రయాణాన్ని మొదలు పెట్టిన హీరో సందీప్ కిషన్. వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నా సరైన హిట్లు పడటం లేదు. దీంతో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదేనని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్లో ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని, మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించాడు హీరో. (చదవండి: 30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!) షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు సందీప్. కుదిరితే ఫిబ్రవరి 12వ తేదీని మార్క్ చేసుకోండి అంటూ అభిమానులకు హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్గా నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించారు. మరోవైపు రౌడీ బేబీ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. ఇందులో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: తల్లిలా పెంచుకున్న.. పెళ్లి చేశా: వితిక భావోద్వేగం) Kudirithe Feb 12th kooda Mark chesukondi Bro 😉🤟🏽 https://t.co/lnuZsW2mhJ — Sundeep Kishan (@sundeepkishan) January 12, 2021