త్రినాథరావు నక్కిన, రావు రమే‹శ్, అన్షు, రీతూ వర్మ, సందీప్ కిషన్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.
అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన.
త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment