Teaser Release
-
కావాలని మాట్లాడలేదు: దర్శకుడు నక్కిన త్రినాథరావు
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన. త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు. -
'వీర ధీర శూరన్'గా విక్రమ్.. టీజర్ ఎలా ఉంది..?
విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. హెచ్ఆర్ పిక్చర్స్‌పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా విడుదల చేసిన టీజర్లో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్స్, యాక్టింగ్, పోలీస్ ఆఫీసర్‌గా ఎస్జే సూర్య పెర్ఫామెన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఈ జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
స్కెచ్ వేస్తారా?
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
ప్రేమలో పడ్డాక...
నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. -
రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
-
అందరికి నచ్చేలా ‘ఐ - 20’
సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. తాజాగా ఈ మూవీ పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!!తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు. -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు. -
టీజర్ రెడీ
‘పుష్ప : ది రూల్’ సినిమా టీజర్‌కు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రూల్’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక ‘పుష్ప’ సినిమా ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమా సక్సెస్ కావడంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల అప్డేట్స్ కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న వచ్చే అవకాశం ఉంది. ఇంకా అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లోని కొత్త సినిమా ప్రకటన కూడా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. -
అయోమయం.. ఆశ్చర్యం
విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామమూర్తి లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘దో ఔర్ దో ప్యార్’. శీర్ష గుహ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నేను వీగన్... పాలతో తయారైన వాటిని తినను (విద్యాబాలన్)’, ‘మరి.. మీ ఫేస్వాష్లలో మిల్క్ ఉంటుంది కదా (ప్రతీక్ గాంధీ)!’, ‘మనం డేటింగ్లో ఉన్న వారిలా లేము.. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటున్నాం (ఇలియానా)’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘ప్రేమ కన్ఫ్యూజ్ చేస్తుంది. సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నవి కూడా టీజర్లో కనిపించాయి. -
సైకలాజికల్ థ్రిల్లర్
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్ బాగుంది. టీజర్ చూస్తుంటే విజువల్స్‌తో పాటుగా సౌండ్‌కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్ కార్తీక్. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్ రెడ్డి. -
ఆకట్టుకుంటున్న ‘డియర్ ఉమ’ టీజర్
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేశ్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: రాజ్ తోట. -
లవ్ డ్రిల్
‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో డాక్టర్‌గా బిజీగా ఉన్నా సినిమాలపై ఇష్టంతో ‘కెప్టెన్ రాణా ప్రతాప్, టిక్ టిక్, చంద్రహాస్’ వంటి 8 సినిమాలు తీయడంతో పాటు నటించాను. అయితే తెలుగులో ఇప్పటివరకూ లవ్ జిహాదీపై ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఆ కథాంశం ఎంచుకుని ‘డ్రిల్’ తీశా’’ అని హరనాథ్ పోలిచెర్ల అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్. డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజవుతోంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్... ‘‘అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డ హరనాథ్‌గారు ఇండియా వచ్చి తెలుగు సినిమాలు తీయడం హ్యాపీ’’ అన్నారు. -
బస్తర్ మూవీ టీజర్ రిలీజ్
-
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్‌లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్‌కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్‌లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
Operation Valentine: గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. రాడార్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. సోమవారం ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్ తేజ్) వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఊతకొట్టుడు కొట్టేశాడు!
‘ఏం చేస్తాన్నాడెంటి.. మీవోడు.. ’ (ఆషికా రంగనాథ్), ‘నిన్నే మావిడితోటలో ఇరవైమందిని ఊతకొట్టుడు కొట్టేశాడు (‘అల్లరి’ నరేశ్)’, ‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా..కొంచెం తగ్గమను (ఆషికా)’...అన్న డైలాగ్స్‌తో విడుదలైంది ‘నా సామిరంగ’ సినిమా టీజర్. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ‘ఏం అడగాలో దానికి తెలియదు. ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏం చేయాలో నాకు తెలియదు’ (నాగార్జున) అన్న డైలాగ్స్‌తో ఈ టీజర్ సాగుతుంది. ‘‘సినిమాలో నాగార్జునగారి గోదావరి యాస చాలా బాగుంటుంది. రొమాన్స్, స్నేహం, యాక్షన్ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి. -
టీజర్ ఆసక్తికరంగా ఉంది
సంబీత్ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్4ఎమ్’. నిర్మాత మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్ హాలీవుడ్‌లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. ఎంఆర్సీ చౌదరి, రాహుల్ అడబాల మాట్లాడారు. -
అన్నపూరణి
అన్నపూరణి (తెలుగులో అన్నపూర్ణ)గా మారారు నయనతార. ఆమె కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రానికి ‘అన్నపూరణి’ టైటిల్‌ను ఖరారు చేసి, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతి అన్నపూరణి పాత్రలో నటిస్తున్నారు నయనతార. అన్నపూరణి పుస్తకం చదువుతూ, ఆ పుస్తకం పేజీల మధ్యలో నాన్ వెజ్ వంటకాల రెసిపీలను చూస్తుండటం, ఆమె అభిరుచులు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వంటి అంశాలు టీజర్లో కనిపిస్తాయి. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్‌లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్‌లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్‌గారితో సురేష్ ప్రొడక్షన్స్‌లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ‘‘మోడ్రన్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్ మదిరాజు. -
Bubblegum Teaser Launch Event Pics: యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్గమ్’చిత్రం టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని
‘‘బబుల్గమ్’ టీజర్ చూస్తే చాలా బలమైన కథ అనిపించింది. రోషన్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా కనిపించాడు. మరో సక్సెస్ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడని నమ్మకంగా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది’’ అని హీరో నాని అన్నారు. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానసా చౌదరి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘రవికాంత్‌కి ఒక యునిక్ స్టయిల్ ఉంది. అది టీజర్లో కనిపిస్తోంది. తెలుగులో క్వాలిటీ ఫిలిమ్స్‌కి మారుపేరుగా మారిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి ‘బబుల్గమ్’ మరో హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన పని (సినిమాలు) చేయడానికి ప్రోత్సహించిన అమ్మానాన్నలకి థ్యాంక్స్’’ అన్నారు రోషన్ కనకాల. ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రవికాంత్ పేరెపు. ‘‘బబుల్గమ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. హీరోయిన్ మానస, నటుడు రాజీవ్ కనకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సురేష్ రగుతు, క్రియేటివ్ప్రోడ్యూసర్: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక. -
సమాజానికి ఉపయోగపడే సినిమా
‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్ . శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రిత్ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి. -
యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..వరుస సినిమాతో తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కి ఎదిగింది. బాలీవుడ్ పెద్దలను ఎదురించి ఫైర్ బ్రాండ్‌గా మారింది. అందరి హీరోయిన్లలా కమర్షియల్‌గా కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చంద్రముఖి 2 విడుదలైంది. త్వరలోనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘తేజస్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా కనిపించనుంది. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని షూరూ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.