'హనుమాన్‌' టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ | Prashanth Varma Update On Hanuman Teaser Date | Sakshi
Sakshi News home page

Prashanth Varma: 'హనుమాన్‌' టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ

Published Fri, Nov 4 2022 4:55 PM | Last Updated on Fri, Nov 4 2022 4:55 PM

Prashanth Varma Update On Hanuman Teaser Date - Sakshi

అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజసజ్జా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్‌. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై  కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో కీలక అప్‌డేట్‌ను వదిలారు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 7న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపాడు ప్రశాంత్‌ వర్మ. కాగా ఈ చిత్రానికి  అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్ కీలక పాత్రలో నటించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement