ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్‌లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్‌కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్‌లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం.
వీఎఫ్‌ఎక్స్‌ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్‌ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్‌ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్‌కృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment