hanuman
-
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్‌కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్‌తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్‌లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్‌కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్‌లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్‌లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్‌తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్‌గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రోడక్ట్ డిజైన్‌లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్‌లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్‌గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్‌ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్‌లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
నేడు హనుమాన్ ఆలయానికి సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులలో ఉత్సాహం కనిపించింది. వర్షంలో తడుస్తూనే వారంతా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. సీఎం హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు.శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వెలుపల అభిమానులు గుమిగూడారు. కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువులు, నృత్యాలు, కేజ్రీవాల్‌కు మద్దతుగా పలికే నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పార్టీ సీనియర్ నేతలు తదితరులు సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.ఇది కూడా చదవండి: ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు
అమెరికాలోని టెక్సాస్‌లోగల హనుమంతుని భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక్కడి హ్యూస్టన్‌లో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్‌లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. This is the “Third Tallest Statue” in the United States 🇺🇸. A grand Pran Pratishtha ceremony was held in Houston, Texas, on Aug 18, where a 90 foot tall Hanuman statue was inaugurated.pic.twitter.com/Ng7W4CFewV— Gems of Engineering (@gemsofbabus_) August 20, 2024 -
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం!
సుమిత్ర చెప్పిన కథ: వాసుకి పిచ్చి పిల్ల. నాకన్నా ఎనిమిదేళ్ళే చిన్నది. అయినా, నా కూతురు స్థానంలోకి వచ్చింది. పొరబాటుగా అంటున్నాను, ఆమె పీడకలలో కూడా ఊహించని మారుటి అమ్మ స్థానంలోకి నేనే బలవంతంగా చొరబడిపోయాను. నా దురదృష్ట జీవితం గురించి చెప్పుకోవటం నా అభిమతం కాదు. నా మూలంగా అతలాకుతలమైన అమాయకురాలు వాసుకి గురించి చెప్పటానికే నా ప్రయత్నం.తనకో బుల్లి తమ్ముడిని ఇచ్చే క్రమంలో, పసిగుడ్డుతో సహా ఆమె తల్లి పై లోకాలకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వాసుకి పసి మనసు తల్లడిల్లిపోయిన ఘడియలు అవి. రెండేళ్లపాటు ఆమెకి ఇంక తన నాన్నతోనే లోకం అయిపోయింది. మాయమైపోయిన అమ్మ మీది ప్రేమ కూడా నాన్న మీదకి మళ్లించుకుని, నాన్న ఇంట్లో ఉన్నంతసేపూ వెన్నంటే ఉండేది. ధన్వంతరిగారు, అంటే వాసుకి నాన్న, ఉద్యోగరీత్యా తరుచూ టూర్లు తిరగవలసి ఉండేది. ఆయన ఊళ్ళోలేనన్ని రోజులూ భయంకరమైన ఒంటరితనం వాసుకిని వణికిస్తూ ఉండేది. అలాగని ఎవరినీ తోడు పిలుచుకోవటమూ ఇష్టం ఉండేది కాదు. ఒక్కతే తన లోకంలో తను బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండేది. ధన్వంతరిగారు ఉద్యోగరీత్యా తరచూ వచ్చే ఊళ్ళలో మాదీ ఒకటి. నా మేనమామ నాగఫణి ఆయనకి సన్నిహితుడు. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా యింట్లోనే ఉండేవారు. ఆయన మాటల్లో అస్తమానూ వాసుకి విషయాలే దొర్లేవి. వాసుకిని నేను చూడకపోయినా, ఆ విధంగా తన విషయాలన్నీ తెలుస్తూనే ఉండేవి. తల్లీ, తండ్రీ లేని నేను నా మేనమామ పెంపకంలో ఉండేదాన్ని. మొదటి నుంచీ చదువు సంధ్యల మీద శ్రద్ధలేకపోవటంతో, టెన్త్ఫెయిలయ్యాక ఇంటికే పరిమితమైపోయాను. చదువుకోవటం లేదనీ, పనీపాటా కూడా సరిగ్గా చేయటంలేదనీ ఎప్పుడూ విసుక్కుంటూ, అడపా దడపా చెయ్యి చేసుకుంటూ ఉండే మామయ్య, నైన్త్సెలవుల్లో నాలో శారీరకంగా మార్పులు చోటు చేసుకోవటం మొదలైనప్పటినుంచీ తిట్టటం, కొట్టటం తగ్గించాడు. నా పట్ల ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుని, హద్దులు మీరిన చొరవనీ ‘అభిమానం’ అనే భావించాను. అయితే, అలా ఎన్నాళ్ళో సాగలేదు. ఒక రోజున జరిగిన పెద్ద గొడవ తరవాత మామయ్య దుబాయి పారిపోయాడు.ఆ విషయం కూడా ధన్వంతరిగారు చెబితేనే నాకు తెలిసింది. ఎప్పటిలాగానే ఏదో టూర్ వెళ్లాడనుకున్న మామయ్య నన్ను వదిలించేసుకుని వెళ్లిపోయాడని తెలిశాక, నేనున్న పరిస్థితికి ఆత్మహత్య తప్ప మరోదారి తోచలేదు. ధన్వంతరిగారే అడ్డు పడకపోతే, అదే నా దారి అయ్యేది. నెల రోజులపాటు తర్జన భర్జనలు పడ్డాక, ధన్వంతరిగారు నన్ను తన జీవితంలోకి తీసుకుపోయారు.ఇదేమిటీ, నా ప్రియమైన వాసుకి గురించి మొదలెట్టి, నా సొదలోకి వెళ్లిపోయాను?నేను వాళ్ళింట్లో ప్రవేశించటం, అదీ ఆమెకి అమ్మగా వెళ్ళటం వాసుకికి పెద్ద షాక్. ఆమెకి నా మీద ద్వేషంతో పాటూ, తన తండ్రి మీద కూడా అసహ్యం జనించింది. నేనూ, ధన్వంతరిగారూ ఏం చెప్పబోయినా వినిపించుకోనంతగా తన చెవులను శాశ్వతంగా మూసి వేసుకుంది. నాతో మాటలే ఉండేవి కావు. వాళ్ళ నాన్నతో కూడా అత్యవసరమయితేనే అతి క్లుప్తంగా మాట్లాడేది. ఇంట్లో తక్కువగా ఉండేలా చూసుకునేది. వెళ్తే కాలేజీ, లేదా ఫ్రెండ్స్ ఇళ్ళలో గడిపేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తనగదికే పరిమితమైపోయేది.ఆఖరికి వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది నెలలకి, నేను చావు బతుకుల్లో హాస్పిటల్ పాలైనప్పుడు, నన్ను చూడటానికి కూడా వాసుకి రాలేదు. ఇంటికి వచ్చాక అయినా పలకరించలేదు. అందుకు నేను ఏమీ అనుకోలేదు, నేనది ఆశించలేదు గనుక. గతుకులబాటలో అతకని బతుకు అలాగే పదేళ్ళ పాటు గడిచింది. వాసుకి చదువు పూర్తయి ఉద్యోగం సంపాయించుకుంది. ఉద్యోగంలో చేరటానికి ఊరు వెళ్ళే ముందు రోజున తన పెళ్లి విషయం ప్రస్తావించారు ఈయన.‘నా పెళ్లి గురించీ, నా బతుకు గురించీ ఇంక మీరు ఆలోచించవద్దు. అసలు కల్పించుకోవద్దు’ అని కరాఖండిగా చెప్పేసింది వాసుకి. నేను మ్రాన్పడిపోయాను. ఆయన దిగులుపడిపోయారు. మర్నాడు వాసుకి వెళ్ళిపోయింది. ఏడాది గడిచింది. ఈ ఏడాదిలోనూ, వాసుకి ఒక్కసారి కూడా తొంగిచూడలేదు. ఫోన్ చేసినా తీసేది కాదు. నాది రాతి గుండె కాబోలు, ఇంకా బతికే ఉన్నాను. ఆయన గుండె మాత్రం అది తట్టుకోలేక ఆగిపోయింది. తండ్రి చివరి చూపుకోసం, చివరిసారిగా ఇంటికి వచ్చింది వాసుకి. దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది, ఇంక నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. ...వాసుకి చెప్పిన కథ:నేను నాన్న గురించి చెప్తాను.. ముందు నేను అమితంగా ప్రేమించిన నాన్న, తరవాత అంతకన్నా ఎక్కువగా ద్వేషించిన నాన్న గురించి. నేను చేసిన దిద్దుకోలేని తప్పు గురించి! తమ్ముడిని తెస్తానని ప్రామిస్ చేసిన అమ్మ, హాస్పిటల్ నుంచి రాకుండా మోసం చేసి, తమ్ముడితో సహా పైకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ నేనూ, ఓదారుస్తూ నాన్నా మిగిలాం. అమ్మంటే నాకు ఆరోప్రాణం. అందరికీ అంతేనేమో! కానీ, అందరమ్మల్లా కాకుండా, తొందరగా వెళ్లిపోయిందని బాధ. అందుకే, అమ్మ మీది ఆరవ ప్రాణాన్ని నాన్న మీదికి మళ్లించుకున్నాను. ఇంక నాకు మిగిలింది నాన్నేగా! అమ్మ చనిపోతే నాన్న దిగులుపడ్డాడా? ఏమో! పడినట్టు కనిపించేవాడుకాదు. ‘నీ కోసమే మీ నాన్న దిగులు దిగమింగుకుని బతుకుతున్నాడు’ అనేవాళ్లూ చుట్ట పక్కాలూ, ఇరుగుపొరుగూ.‘అవునేమో’అనుకున్నాను నేనూనూ, కొన్నేళ్ళ దాకా. ‘ఏమంత వయసు మీరిపోయిందని ఇలా మిగిలిపోతావ్? ఆ పిల్లకయినా ఓ తల్లిని తెచ్చే ఆలోచన చెయ్యి’ అంటూ అయినవాళ్ళు ఇచ్చే సలహాలను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసేవాడు నాన్న.‘దానికి అమ్మ చేతిలో పెరిగే యోగం ఉంటే, వాళ్ళమ్మ అర్ధాంతరంగా కన్ను మూసేది కాదు. మిగిలింది వాసుకి నేనూ, నాకింక వాసూ. ఇదే రాసిపెట్టాడు భగవంతుడు. ఇదే నిర్ణయం నాది కూడా’ అని చెప్పేసేవాడు మారు ఆలోచన లేకుండా. అలాంటి మాటలు వింటున్నప్పుడల్లా నేను నాన్నని గట్టిగా కౌగలించుకుని ఏడిచేసేదాన్ని.అటువంటి నాన్న హఠాత్తుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లు కాదు, నాలుగేళ్ళు గడిచాయేమో, అంతే. ఉద్యోగం పని మీద అప్పుడప్పుడూ ఊరు వెళుతూ ఉండే నాన్న ఓసారి ఊరి నుంచి మా ఇద్దరి మధ్య నిలిచేలా ఓ పెద్ద అడ్డు గోడని తెచ్చాడు. అది ‘అమ్మ’ అని చెప్పాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. పట్టరాని ఏడుపు వచ్చింది. ఆ వ్యక్తి ముందర ఏడవటానికి కూడా అసహ్యం వేసింది.వెంటనే నాగదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాను. అంతటితో ఆగకుండా నా మనసు కూడా మూసేసుకున్నాను. ఆ రోజు నుంచీ నాన్నంటే కూడా అసహ్యం వేసింది. ‘భార్య పోయిన నాలుగేళ్ళకి మరో భార్య మీదికి మనసు పోయింది! మగాళ్ళంతా ఇంతేనా? నాన్నలాంటి మగాళ్లు కూడా ఇంతేనా? నేననుకునే లాగా ఏ నాన్నలూ ఉండరా? రామావతారంతోనే, రాముడి గుణాలూ లోకంలో అంతరించిపోయాయా?’ నాన్న అంత తేలికగా ఎలా బలహీనపడిపోయాడో అర్థం కాలేదు. గీత దాటాడని తెలిశాక, కారణాలు, సంజాయిషీలు వినాలన్న కోరిక కూడా మిగల్లేదు. ఆయన పెట్టిన అడ్డుగోడ మీద నుంచి తొంగి చూడాలని కూడా అనిపించలేదు. నేనే గనక మగపిల్లవాడినయి ఉంటే, ఆరోజే ఇంట్లోంచి పారిపోయేవాడిని. ఆడపిల్లగా నాకు కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయి గనుక, ఆ పని చేయలేదు. ఇంట్లోనే నా చుట్టూ ఇనుప చట్రాన్ని బిగించుకున్నాను. మూతికి చిక్కం కట్టుకున్నాను. అత్యవసరమైతే తప్ప వాటిని సడలించకుండా నెట్టుకు వచ్చాను.అయ్యో, నేను చెప్పదలుచుకుంది నాన్న గురించి కదా, అదే చెప్తాను. నా అభిప్రాయం మారి ఉండకపోతే, నాన్నని అసలు తలుచుకునేదాన్నే కాదు. నాన్న సుమిత్ర పిన్నిని మా ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు కలిగిన ద్వేషం ఆయన పోయాక కూడా తగ్గలేదు, ఇన్నేళ్ల వరకూ.. ఆ ఉత్తరం .. ఇన్నేళ్ళూ అజ్ఞాతంలో ఉండిపోయిన ఆ ఉత్తరం నా కంట పడేవరకూ!ఇప్పుడు నా తొందరపాటు, దురుసుతనం, పెడసరి ప్రవర్తనతో జీవితంలో నేనేం కోల్పోయానో, నన్ను అమితంగా ప్రేమించిన నాన్నకి ఎంత అన్యాయం చేశానో తెలుస్తుంటే, పశ్చాత్తాపంతో మనసు కాలిపోతోంది. నాన్నకి ఇప్పటికైనా ఆత్మశాంతి కలగాలంటే ఏం చేయాలో మాత్రం స్పష్టంగా బోధపడింది. ఆ బోధ కూడా అన్యాపదేశంగా తన ఉత్తరం ద్వారా నాన్న చేసినదే! ∙∙ ధన్వంతరి చెప్పిన కథ: నేనిలా మీతో మాట్లాడవచ్చో, మీకు నా మాటలు చేరతాయో లేదో తెలియదు. మనుషులు మాట్లాడుకుంటారు. నేనిప్పుడు మనిషిని కాదు. ఒకప్పటి మనిషికి ఆశలు తీరని ఆత్మని! అయినా, నా ప్రయత్నం చేస్తాను. నా మిగిలిన ఆశలేమిటో మీకు చెప్పుకుంటాను. నేను ముందుగా చెప్పబోయేది అభాగిని సుమిత్ర గురించి. సుమిత్ర నాకు పరిచయమయ్యింది నాగఫణి దగ్గర. నాగఫణి, తన ఊళ్ళో ఉన్న మా కంపెనీ బ్రాంచ్‌కి హెడ్. నేను కంపెనీ పని మీద తరచూ ఆ ఊరు కూడా వెళ్తుండటం మూలాన నాకు సన్నిహితుడయ్యాడు. సన్నిహితుడయ్యాక అతడి అలవాట్ల వలన దూరమయ్యాడు.. మానసికంగా!నాగఫణికి ఆ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో ఒక గది మా కంపెనీకి గెస్ట్ రూమ్‌గా లీజుకి ఇచ్చాడు నాగఫణి. అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు, కంపెనీ నిబంధనల ప్రకారం ఆ రూమ్‌లోనే నా బస. ఆ ఇంట్లోనే నాగఫణి మేనకోడలయిన సుమిత్ర పరిచయం అయింది. అమాయకంగా ఉండే సుమిత్రకి తల్లిదండ్రులు లేరని తెలిసి బాధ పడ్డాను. ఆమె మీద నాకు జాలిగా ఉండేది. మొదట్లో, నాగఫణి ఆమె చేత ఇంటిపనులన్నీ చేయిస్తూ కూడా, ఆమె మీద దాష్టీకం చలాయిస్తున్నట్టు తోచేది. సొంత మేనకోడలు, అతడి సంరక్షణలో ఉంది కనుక అది సహజం అనుకుని సరిపెట్టుకున్నాను. రెండు మూడేళ్ళ తరవాత ఆమె పట్ల నాగఫణి ప్రవర్తనలో కొంత వికృతి కనిపించసాగింది. అయితే, నాకు సంబంధంలేని విషయం అనుకుని ఊరుకుండిపోయాను. ఉన్నట్టుండి ఆఫీసులో దుమారం చెలరేగింది. నాగఫణి బ్రాంచ్ అకౌంట్ల విషయంలో పెద్ద మొత్తం తేడా కనబడింది. అ బ్రాంచ్ పరిధిలోకి వచ్చే కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు సవ్యంగా కంపెనీ అకౌంట్‌కి జమ కావటంలేదని తేలింది. యాజమాన్యం అతడి నుంచి తేడా వచ్చిన మొత్తం డబ్బు వసూలు చేయటమే కాక, అతడిని ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఆ ఆర్డర్స్ వచ్చేసరికి నేను అతడి ఇంట్లోనే ఉన్నాను. ఆ రాత్రి సుమిత్ర, నాగఫణి మధ్య ఏదో ఘర్షణ జరగటం వినపడింది. మర్నాడు ఉదయమే నేను బయలుదేరి వచ్చేశాను. ఒక వారం తరవాత ఆఫీస్‌లోని నాగఫణి సన్నిహితుల ద్వారా తెలిసింది, ముందునుంచే ప్రయత్నంలో ఉన్న నాగఫణి, ఇది జరగగానే దుబాయి వెళ్లిపోయాడని. సుమిత్ర విషయం తెలియలేదు. ‘ఆమెని కూడా తీసుకు వెళ్లాడేమో’ అనుకున్నాను. తరవాతి వారం ఆ ఊరు వెళ్లినప్పుడు తెలిసింది, నాగఫణికి ఆపాటి ఔదార్యం కూడా లేదని! సుమిత్రను కలిశాను. నాగఫణి ఉద్యోగం పోయిన విషయం గానీ, అతడు దేశం విడిచి వెళ్ళిన విషయం గానీ ఆమెకి తెలియదు! నేను చెప్పగానే భోరుమంది. అప్పుడు చెప్పుకొచ్చింది తన పరిస్థితి. సుమిత్ర అమాయకత్వాన్నీ, నిస్సహాయతనీ ఆసరాగా తీసుకుని, నాగఫణి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. తగిన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి, గత రెండేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగించాడు. కష్టాలు కలిసికట్టుగా వస్తాయన్నట్టు, ఇప్పుడామె గర్భవతి. ఆ విషయం తెలిసి, జాగ్రత్తలు తీసుకోలేదని ఆమెనే నిందించి, ఆ రాత్రి ఘర్షణ పడ్డాడు. ఆమెకి చెప్పకుండా పలాయనమై పోయాడు. విషయం వినగానే నిర్ఘాంతపోయాను. ఏం చేయగలనో తోచలేదు. ‘తొందరపడి ఏమీ చేసుకోవద్దనీ, నేను మళ్ళీ పై వారం వస్తాననీ, ఆలోచించి ఒక దోవ చూపిస్తాననీ’ చెప్పి వచ్చాను.స్వంత ఇల్లు కాబట్టి, నాగఫణి వెళ్లిపోయినా గూడు మిగిలింది సుమిత్రకి. తరవాతి వారం వెళ్ళినప్పుడు, ఆమెను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాను. అప్పటికే సమయం మించిపోయిందనీ, సాధ్యపడదనీ చెప్పింది డాక్టర్. సుమిత్రని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ‘నా పరువు బజార్న పడిపోయింది. ఇంక నాకు చావు తప్ప గత్యంతరం లేదు’ అని హిస్టీరికల్గా ఏడ్చేసింది. నాతో వచ్చేయమన్నాను. ‘వచ్చి, ఏం చేయాలని?’ సూటిగా అడిగింది. వెంటనే సమాధానం దొరకలేదు. ఎంతో ఆలోచించాక చెప్పాను, ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను.. బయటివాళ్ళ కోసం. నీ బిడ్డకి తండ్రిని అవుతాను.. నీ పరువు నిలవటం కోసం. అంతవరకే మన సంబంధం!’ఆమె అంగీకరించింది. మర్నాడు ఇంట్లోనే దేవుడి పటం ముందు ఆమె మెళ్ళో తాళి కట్టి, మా ఇంటికి తీసుకు వెళ్ళాను. చిన్నదైన వాసుకికి సర్దిచెప్పగలను అనుకున్నాను. ఎంత తప్పుగా ఆలోచించానో వాసుకి రియాక్షన్ చూశాక తెలిసివచ్చింది. సుమిత్రని ఆదుకున్నానుగానీ, నన్ను నేను నిప్పుల్లోకి నెట్టుకున్నాను. నా చిన్నారి వాసుకిని అంతులేని క్షోభకి ఆహుతి చేశాను.ఇంతా చేస్తే, సుమిత్రకి తన బిడ్డ కూడా దక్కలేదు. నెలలు నిండుతుండగా తెలియని ఆరోగ్య సమస్య ఏదో ముంచుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడటమే గగనమైపోయింది. అంతవరకూ, ఆ తరవాతా కూడా సుమిత్ర నా యింట్లో మనిషిగా ఉందే గానీ, నా భార్యగా కాదు. ఒక్కనాడు కూడా ఆమె స్పర్శ నేనెరగను. ఆ విషయం నా కూతురికి ఎలా తెలుస్తుంది? నేనేదో వయసు ప్రలోభంలో పడి సుమిత్రని చేసుకున్నాననే ఆమె అభిప్రాయం మార్చలేక పోయాను. చివరికి ఉద్యోగం పేరుతో నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది నా ఏకైక ప్రాణం. తట్టుకోలేకపోయాను.నా నోరు కట్టేసింది. చేతులు కాదుగా! ఒకనాటి రాత్రి కూర్చుని, జరిగినదంతా వివరంగా పెద్ద ఉత్తరం రాశాను. మర్నాడు కొరియర్ చేయాలని అనుకున్నాను. ఉత్తరం మడిచి, టేబుల్ మీద ఉన్న పుస్తకంలో పెట్టాను. అది చదివితే, నా చిన్నారి తల్లి నన్ను అర్థం చేసుకుంటుందనే విశ్వాసం కలిగింది. మనసు తేలిక పడింది.‘ఈ పని ఇన్నాళ్ళూ ఎందుకు చేయలేదా’ అనిపించింది. ‘వెర్రివాడా, నీ మాటలే వినని నీ కూతురు నువ్వు రాసే రాతలు చదువుతుందని అనుకుంటున్నావా? అందగానే చించి పారేస్తుంది’ నా అంతరాత్మ వెక్కిరించింది. నిజమేనేమో!మళ్ళీ నా గుండె బరువెక్కింది. ‘అది తేలికపడితే, ఇక కలిసేది గాలిలోనే’ అని తెలిసే సరికి అంతపనీ జరిగింది. నా ఉత్తరం పుస్తకంలోనే నిక్షిప్తమైపోయింది. ముహూర్తం మంచిది కాదని, నా ఇంటిని ఏడాది పాటు మూసిపెట్టారు. మూసే ముందు కింది వస్తువులనీ, టేబుల్ మీది పుస్తకాలనీ తీసి అటకల మీద సర్దేశారు. నా చివరి ఆశ అక్కడే మూలబడిపోయింది. సుమిత్ర తన ఊరికి వెళ్ళిపోయింది.. వితంతువు హోదా అయినా దక్కిందిగదా!ఏడాది దాటాక ఇల్లు అమ్మకానికి పెట్టింది వాసుకి. అమ్మే ముందు అటకలు ఖాళీ చేస్తుంటే ఆ పుస్తకంలో నుంచి జారిపడిన నా ఉత్తరం, చివరికి చేరవలసిన చేతుల్లోకి చేరింది! ‘నాన్న దస్తూరీ’ అనుకుంటూ ఆబగా ఆ కాయితాలన్నీ చదివేసిన నా చిట్టితల్లి కళ్ళలో ధారాపాతంగా నీళ్లు! ఆత్మకి కనులుంటే నా కళ్ళలోనూ ఊరేవేమో నీళ్ళు!∙∙ రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. పాలసంచీ బయటి గడియకు తగిలించి, తలుపు మూసేసి, తాళం పెట్టుకోబోతున్న సుమిత్ర కాంపౌండ్ గేటు కిర్రుమంటూ మోగిన చప్పుడుకి మూయబోతున్న తలుపు కొద్దిగా తెరిచి, ‘ఇంత రాత్రి వేళ తన ఇంటికి వచ్చేది ఎవరా’ అన్నట్టు ఆ చీకట్లోకి చూసింది.గేటుకీ, వరండాకీ ఉన్న దూరాన్ని దాటి, వరండాలో వెలుగుతున్న నైట్ బల్బ్ వెలుగులోకి వచ్చిన స్త్రీ మూర్తి వాసుకి! సుమిత్ర నివ్వెరపోయింది. తల వంచుకునే మెట్లెక్కి, వరండాలో నిలబడిపోయింది వాసుకి. మాటలు రాని సుమిత్ర ఓరగా తెరిచి ఉన్న తలుపు బార్లా తెరిచి, వాసుకికి దారి ఇస్తున్నట్టు తను ఒక పక్కకి ఒత్తిగిలింది. తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది వాసుకి. తలుపు వేసుకుని వెనక్కి తిరిగిన సుమిత్ర భుజం మీదకు ఒక్క ఉదుటున వాలిపోయింది. ఆమె కన్నీళ్లతో సుమిత్ర భుజం తడిసిపోయింది. సుమిత్ర వాసుకిని రెండు చేతులతో చుట్టేసి, దగ్గరగా హత్తుకుంది. – పి. వి. ఆర్. శివకుమార్ -
కేజ్రీకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపు ప్రచారం కూడా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంకటమోచన హనుమాన్ ఆలయ దర్శన సమయంలో, అతని భార్య, ఇతర నేతల ఆయన వెంట ఉండనున్నారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఈ ఆలయానికి వెళుతుంటారు. ఈ ఆలయంలో వెలసిన హనుమంతునిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో తొలిసారిగా ఆయన ఈ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడి 49 రోజులు సీఎంగా కొనసాగారు. దీని తర్వాత 2015లో ఢిల్లీలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యాక మరోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు.2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు ముందు కూడా సీఎం కేజ్రీవాల్ ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. నాడు ఆయన పార్టీ మరోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
వీకెండ్లో సినిమాల జాతర..ఓటీటీల్లో ఒక్కరోజే 7 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. వేసవి సెలవులు రావడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేదందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో ప్రాజెక్ట్-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే ఈ వీకెండ్లో ఓటీటీలోనూ సందడి చేసేందుకు భీమా, హనుమాన్ రెడీ అయిపోయాయి. గోపీచంద్ నటించిన భీమా, హనుమాన్ మూవీ తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 05 స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 05 అమెజాన్ ప్రైమ్ హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భీమా (టాలీవుడ్ చిత్రం) -ఏప్రిల్ 05 హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 జీ5 ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05 యాపిల్ టీవీ ప్లస్ సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 -
రెండు ఓటీటీల్లో హనుమాన్..
-
Hanu Man: అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్ (ఫోటోలు)
-
జై హనుమాన్తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను
‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వర్క్ ఆరంభమైంది. ‘హనుమాన్’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ‘హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్’ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్ఫుల్ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్‌గారి విజన్’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
'హనుమాన్' మూవీ 50 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హనుమాన్ జెండా తొలగింపు వివాదం.. మాండ్యా జిల్లాలో ఉద్రిక్తత
బెంగళూరు: హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు విరమించారు. గ్రామ పంచాయతీ అనుమతితో కెరగోడు గ్రామంలో గ్రామస్థులు 108 అడుగుల ధ్వజస్తంభంపై హనుమాన్ జెండాను ఎగరవేశారు. ఇందుకు సమీప 12 గ్రామాల ప్రజల నుంచి నిధులు సమీకరించారు. ధ్వజస్తంభంపై హనుమాన్ జెండా ప్రాణప్రతిష్ట కూడా పూర్తి అయ్యాక తొలగించాలని అధికారులు ఆదేశించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా ఎగురవేసిన ప్రదేశం గ్రామ పంచాయతీ భవనం పరిధిలోకి వస్తుందని, ఆ జెండాను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నేడు గ్రామంలోకి వచ్చి ఆ జెండాను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీఛార్జీ చేశారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఆ ప్రదేశంలో హనుమాన్ జెండాను ఎగురవేయడం సరికాదని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌ల కుట్రపూరిత చర్యగా ఆయన ఆరోపించారు. జిల్లా ఇంఛార్జీ చెలువరాయస్వామి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేసిన ప్రదేశం పంచాయతీ భవనం ప్రదేశం పరిధిలోకి వస్తుందని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు ప్రదేశంలో హనుమాన్ జెండా ఎగురవేయాలని కోరారు. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
హనుమాన్ దెబ్బకు రికార్డులన్నీ ఉఫ్..
-
ఈ సినిమా తరువాత నా లైఫ్ మారిపోయింది
-
నా టీం జోలికి వస్తే ఒక్కొక్కడికి టెంకాయలు ప్పగిలిపోతాయ్
-
వాళ్ళ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది..పాదాభివందనం
-
మీరు నన్ను ట్రోల్ చేయవచ్చు..కానీ ఆ సినిమా తీసి చూపిస్తా..
-
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్‌లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్‌లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్‌కృష్ణ తెలిపారు. -
'హనుమాన్' చూసి సంచలన కామెంట్స్ చేసిన సమంత
-
హనుమాన్ తో హిట్. ప్రశాంత్ వర్మ కు షాక్!