ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపు ప్రచారం కూడా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంకటమోచన హనుమాన్ ఆలయ దర్శన సమయంలో, అతని భార్య, ఇతర నేతల ఆయన వెంట ఉండనున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఈ ఆలయానికి వెళుతుంటారు. ఈ ఆలయంలో వెలసిన హనుమంతునిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో తొలిసారిగా ఆయన ఈ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడి 49 రోజులు సీఎంగా కొనసాగారు. దీని తర్వాత 2015లో ఢిల్లీలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యాక మరోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు.
2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు ముందు కూడా సీఎం కేజ్రీవాల్ ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. నాడు ఆయన పార్టీ మరోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment