Mandir
-
ఇందూరులో హింగుళాదేవి ఆలయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగుళాదేవి(Hinglaj Mata Mandir) ప్రధాన ఆలయం పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్(balochistan) ప్రాంతంలో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుళ పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగుళా మాత అసలు పేరు కోటరి. హింగుళ పర్వతంపై ఉండటంతో హింగుళాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వతంపై గుహలో హింగుళామాత నిత్యం జ్వలిస్తూ దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగుళాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శక్తిస్వరూపిణి ఆలయాన్ని నిజామాబాద్ జిల్లా ఇందూరులో 1982లో నిర్మించారు. రెండు నెలల కిందట ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. రంగరి (వస్త్రాలకు రంగులు వేసే) కులానికి చెందిన ‘భావసార్ క్షత్రియ సమాజ్’వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశవిభజన సమయంలో వచ్చిన భవసార్ క్షత్రియ సమాజ్.. దేశవిభజన సమయంలో రంగరి (భవసార్ క్షత్రియ సమాజ్) కులస్తులు బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి రాజస్తాన్‌కు వలస వచ్చారు. తర్వాత కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వీరు వెయ్యి కుటుంబాలకు పైగా ఉన్నారు. ప్రాచీన చరిత్ర ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరారు. హింగుళాదేవి వీరిని కాపాడింది. అలాగే వీరికి వ్రస్తాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్ పెద్దలు తెలిపారు. వీరు కొలిచే హింగుళా దేవి ఆలయాలు రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ సమాజ్ వారుండే ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఇందూరులోని హింగుళా మాత ఆలయంలో ప్రతిరోజూ అభిõÙకం నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం భజనలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం చేస్తారు. దసరా నవరాత్రులు నిర్వహిస్తారు. ఇందూరులో ఊరపండుగ అయ్యాక వారం రోజుల తర్వాత పసుపు, కుంకుమ, కాగడాలతో పాటలు పాడుతూ గోందాల్ ఉత్సవాలు నిర్వహిస్తారు. -
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
మేం చెప్పేదాకా సర్వేలపై ఉత్తర్వులు, తీర్పులు ఆపండి
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్‌చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే. కేంద్రానికి 4 వారాల గడువు ‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి. కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి. -
విగ్రహాల ధ్వంసంపై ఆందోళన.. నిందితుడు అరెస్ట్
భాగల్పూర్: బీహార్‌లోని భాగల్పూర్లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.విగ్రహాల ధ్వంసం దరిమిలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా సంహౌలా ప్రధాన మార్కెట్‌ను మూసివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రమేయమున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.భాగల్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంహౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని, పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. వదంతులకు దూరంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్‌కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
కేజ్రీకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపు ప్రచారం కూడా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంకటమోచన హనుమాన్ ఆలయ దర్శన సమయంలో, అతని భార్య, ఇతర నేతల ఆయన వెంట ఉండనున్నారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఈ ఆలయానికి వెళుతుంటారు. ఈ ఆలయంలో వెలసిన హనుమంతునిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో తొలిసారిగా ఆయన ఈ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడి 49 రోజులు సీఎంగా కొనసాగారు. దీని తర్వాత 2015లో ఢిల్లీలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యాక మరోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు.2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు ముందు కూడా సీఎం కేజ్రీవాల్ ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. నాడు ఆయన పార్టీ మరోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
మరో బాలరాముని విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. యోగిరాజ్ ట్విట్టర్లో తాను రాతితో రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్‌లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్‌నాథ్‌లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు. -
10 ప్రముఖ రామాలయాలు.. వీటి గొప్పదనం ఇదే..
అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే దేశంలోని 10 ప్రముఖ రామాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం (ఉత్తరప్రదేశ్) ఈ ఆలయ గొప్పదనం జగద్విదితం. అయోధ్యను రామజన్మభూమి అని అంటారు. ఇది సరయూ నది ఒడ్డున ఉంది. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం (కేరళ) ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని చెబుతారు. కేరళలోని చెట్టువా ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు. తరువాతి కాలంలో ఆ ప్రాంత పాలకుడు వక్కయిల్ కైమల్ ఆ విగ్రహాన్ని త్రిపయార్ ఆలయంలో ప్రతిష్టించాడు. ఇక్కడికి వచ్చిన భక్తుడు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు. కాలారామ్ ఆలయం (నాసిక్) మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కాలారామ్ ఆలయం ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తయిన రాముడి నల్లని విగ్రహం కనిపిస్తుంది. సీత, లక్ష్మణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. గోదావరి నదిలో రాముని నల్లని విగ్రహం ఉన్నట్లు అతనికి కల వచ్చింది. దీంతో ఆయన మరుసటి రోజు ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించారు. సీతా రామచంద్రస్వామి ఆలయం (తెలంగాణ) ఈ ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉంది. లంక నుండి సీతామాతను తీసుకువచ్చే క్రమంలో.. శ్రీరాముడు గోదావరి నదిని దాటిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలోని శ్రీరాముని విగ్రహం విల్లు, బాణాలతో కూడివుంటుంది. చేతిలో కమలం పట్టుకున్న సీతామాత శ్రీరాముని పక్కన నిలుచుని ఉంటారు. రామరాజ దేవాలయం (మధ్యప్రదేశ్) ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. భారతదేశంలో శ్రీరాముని దేవునిగా కాకుండా రాజుగా పూజించే ఏకైక ఆలయం రామరాజ ఆలయం. ఇక్కడ ప్రతిరోజూ శ్రీరామునికి ఆయుధ వందనం చేస్తుంటారు. కనక్ భవన్ ఆలయం (అయోధ్య) అయోధ్య రాముని జన్మస్థలం. ఇక్కడే ఉన్న కనక్ భవన్ ప్రముఖ రామాలయాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆలయంలోని బంగారు సింహాసనాలపై ఆభరణాలతో అలంకృతమైన సీతారాములు ఉన్న కారణంగా ఈ ఆలయానికి కనక్ భవన్ ఆలయం అనే పేరు వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయ గోడలు అద్భుతంగా కనిపిస్తాయి. శ్రీ రామ తీర్థ మందిర్ (అమృత్సర్) ఈ ఆలయం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. లంక నుండి వచ్చిన తరువాత సీతామాతను శ్రీరాముడు విడిచిపెట్టినప్పుడు, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఈ ఆలయం అదే స్థలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇక్కడే సీతామాత కవలలకు జన్మనిచ్చిందని అంటారు. కొందండ రామస్వామి దేవాలయం (చిక్కమగళూరు) ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. హిరమగళూరులో పరశురాముడు.. శ్రీరాముని వివాహ దృశ్యాలను చూపించమని ఆయనను అభ్యర్థించాడట. దీనికి ప్రతిగా కోదండరామస్వామి ఆలయంలోని విగ్రహాలు హిందూ వివాహ అలంకారంలో కనిపిస్తాయి. రాముడు, లక్ష్మణునికి కుడి వైపున సీతామాత నిలుచునివున్న ఏకైక ఆలయం ఇదే. రామస్వామి దేవాలయం (తమిళనాడు) రామస్వామి దేవాలయం తమిళనాడులో ఉంది. రామస్వామి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని అయోధ్య అంటారు. భరతుడు, శత్రుఘ్నునితో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠితమైన ఏకైక ఆలయం ఇదే. రఘునాథ్ ఆలయం (జమ్మూ) ఈ ఆలయం జమ్మూలో ఉంది. ఇది ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయ సముదాయంలో దాదాపు ఏడు ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంలోని ఇతర దేవతలకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం మొఘలల నిర్మాణ శైలిలో ఉంటుంది. -
రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు. ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన! -
ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు. -
కాన్పూర్ జంగ్లీదేవి ఆలయంలో భారీ చోరీ
-
గిరిజనుల భారీ ర్యాలీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ శ్రీకృష్ణ విద్యా మందిర్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం వనవాసీ కళ్యాణాశ్రమ్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర గిరిజన మహాసభ’ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు, మహిళలు ప్రేమసమాజం నుంచి శ్రీకృష్ణ విద్యా మందిర్ సమావేశ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ద్వారకానగర్ సభాస్థలికి చేరుకున్నారు. సభకు శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, అఖిల భారత సంఘటన ప్రతినిధి పి.సోమయాజులు, వనవాసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గణబాబు, డాక్టర్ ఎన్.ఎస్.రాజు, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర , పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. బాలాసాహెబ్దేశ్పాండే శత జయంతిని పురస్కరించుకొని ‘వనవాణి’గిరిజన మాసపత్రిక ప్రత్యేక సంచికను పూజ్యస్వామిజీ ఆవిష్కరించారు. అశోక్ బీకే స్టీల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి ముఖేష్ బస్సల్వనవాసీ కళ్యాణాశ్రమ్కు విరాళంగా ఇచ్చిన సంచార వైద్యశాలను స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. అనంతరం వనహేల వనవాస విద్యార్థులకు గతంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గణబాబు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వనవాసి సేవలు,ప్రముఖుల ఫొటోలు, స్వామి వివేకానంద సంచార పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.