భాగల్‌పూర్: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.
విగ్రహాల ధ్వంసం దరిమిలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా సంహౌలా ప్రధాన మార్కెట్‌ను మూసివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రమేయమున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
భాగల్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంహౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని, పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. వదంతులకు దూరంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి: నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు
Comments
Please login to add a commentAdd a comment