arrest
-
ఇదేనా సో కాల్డ్ ప్రజాపాలన: హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
వైఎస్ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఆటోపై వైఎస్ జగన్ ఫొటో ఉందని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడనే కారణంతో కూటమి ఎమ్మెల్యే ఉడికిపోయారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసి.. ఆటోను సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన దౌర్జన్యకాండ శుక్రవారం తణుకులో సంచలనం రేకెత్తించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీకి అనుకూలంగా, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్న దుర్గారావును టార్గెట్ చేసిన ఎమ్మెల్యే నడిరోడ్డుపై ఒక సామాన్య ఆటో డ్రైవర్ అని కూడా చూడకుండా వెంటాడి వీరంగం చేసిన ఘటనను ప్రజలు చీదరించుకుంటున్నారు. బెదిరించి, ఇష్టానుసారంగా దూషించిన తర్వాత పోలీసులకు అప్పగించడం, ఆపై స్టేషన్లో నడిచిన హైడ్రామాపై పలువురు విమర్శిస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావును స్టేషన్లో ఎవరూ కలవకుండా నిర్బంధించడం, వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన ప్రముఖులు స్టేషన్‌కు రావడం, అధికారులతో మంతనాలు జరపడం, లీగల్ బృందంతో సంప్రదింపులు జరపడం వెనుక భారీ కుట్రపూరిత వ్యవహారం నడుస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏ కేసులు నమోదు చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారోననే ఉత్కంఠ నడిచింది. రాత్రి 10.30 గంటలు గడిచినా దుర్గారావును స్టేషన్లోనే ఉంచడం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేయాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతుండటం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి.కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలుతన భర్త దుర్గారావును చూసేందుకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్య నాగలక్ష్మి, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డల రోదనలు తణుకువాసులను కదిలించాయి. తాజాగా దుర్గారవు భార్య పంజా నాగలక్ష్మి మాట్లాడుతూ..‘ఆటో నడుపుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. నిన్న నా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త ఎవరికి అన్యాయం చేశాఆడని పోలీసులు తీసుకువెళ్లారు?. ఏం పోస్టులు పెట్టాడని తీసుకువెళ్లారు?. ఆటో తీసుకెళ్లి నా భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారు. మేము మధ్యతరగతి ప్రజలం.. ఎలా బతకాలి?. మాకు వైఎస్ జగన్ అంటే అభిమానం. వైఎస్ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టులు చేస్తారా?. నా భర్తకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాధ్యుడు అవుతాడు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. విడ్డూరంగా ఆర్టీఓ తీరుసామాన్య ఆటోడ్రైవర్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్టీఓ హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు రావడం, వెంటనే దుర్గారావు ఆటోను స్వాధీనం చేసుకుని నిమిషాల వ్యవధిలోనే తణుకు ఆర్టీసీ బస్‌డిపోకు తరలించడం విడ్డూరంగా మారింది. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, జిల్లా మారి హైవేపైకి ఆటో వచ్చిందని తదితర కారణాలు చూపించి రూ.3,400 జరిమానా విధించడం, రవాణా కార్యాలయం నుంచి పనిగట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ అధికారం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు చూపిస్తున్న అధికార దర్పాన్ని చూసిన తోటి ఆటోడ్రైవర్లు ముక్కున వేలేసుకున్నారు. -
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్
-
సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
-
ద.కొరియా అధ్యక్షుడి అరెస్ట్
సియోల్: ప్రజాపాలనకు వ్యతిరేకంగా డిసెంబర్లో అత్యయిక స్థితి(మార్షల్ లా) విధించిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిరోజులుగా యూన్ అరెస్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అధ్యక్ష కార్యాలయం భద్రతా సిబ్బంది నుంచి తొలుత తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనా సరే దర్యాప్తు అధికారులు చిట్టచివరకు అధ్యక్షభవనం లోపలికి వెళ్లి యూన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తొలుత బుధవారం తెల్లవారుజామున అవినీతినిరోధక దర్యాప్తు అధికారులు, పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెంట్రల్సియోల్లోని అధ్యక్షుడి నివాస భవనానికి చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన అధ్యక్షుడి భద్రతాబలగాలు ముందువైపు బస్సులను, చుట్టూతా బ్యారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటుచేశాయి. తొలుత బస్సులను దర్యాప్తు అధికారులు నిచ్చెనల సాయంతో ఎక్కి వాటిని దాచేశారు. తర్వాత గోడలను ఇలాగే నిచ్చెనల సాయంతో ఎక్కిదిగారు. అడ్డుగా ఉంచిన పెద్ద బ్యారికేడ్లనూ ఇలాగే దాటేశారు. తర్వాత ముళ్ల కంచెలను కత్తిరించి ముందుకుసాగారు. ఇలా దాదాపు 1,000 మందితో కూడిన బృందం ముందుకు దూసుకువచ్చినా భద్రతాబలగాలు అడ్డుపడి ఈ బృందాన్ని ముందుకెళ్లకుండా నిలువరించాయి. దీంతో అధ్యక్షభవన బలగాలకు, దర్యాప్తు బలగాలకు మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ఎలాగోలా నివాసంలో లోపలికి వెళ్లి అధ్యక్షుడిని అరెస్ట్‌చేసింది. ముందు జాగ్రత్తగా ఇంకో దర్యాప్తు బృందం అధ్యక్షభవనం వెనుక వైపు ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని ట్రెక్కింగ్త రహాలో ఎక్కి వచ్చింది. మార్షల్‌లా కారణంగా దేశంలో అస్థిరతకు కార ణమయ్యారంటూ యూన్‌పై విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టి నెగ్గించుకోవడం తెల్సిందే. అభిశంసన నేపథ్యంలో ఆయన తన అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికైన తాత్కాలిక అధ్యక్షుడినీ విపక్షాలు అభిశంసించాయి. 🇰🇷BREAKING NEWS:South Korea's ousted President Yoon has been arrested on charges of treason. pic.twitter.com/IX3hXCfPJe— Update NEWS (@UpdateNews724) January 15, 2025మార్షల్ లా విధించడానికి గల కారణాలపై సంజాయిషీ ఇచ్చుకునేందుకు దర్యాప్తు అధికారులు యూన్‌కు అవకాశం ఇవ్వడం ఆయన స్పందించకపోవడంతో అరెస్ట్‌కు కోర్టు నుంచి గతంలోనే అనుమతి తెచ్చుకున్నారు. ఇటీవల అరెస్ట్‌కు ప్రయత్నించి విఫలమైన దర్యాప్తు అధికారులు బుధవారం మరోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. ‘‘ చట్టబద్ధపాలన దేశంలో కుప్పకూలింది’’ అని అరెస్ట్‌కు ముందు రికార్డ్ చేసిన ఒక వీడియో సందేశంలో అధ్యక్షుడు యూన్ వ్యాఖ్యానించారు. At 4 a.m., the Corruption Investigation Office and the Special Investigations Unit are attempting to execute a second arrest warrant for the president, mobilizing over 1,000 police officers. In response, citizens in South Korea have gathered in front of the presidential residence… pic.twitter.com/jTGjxkGV9z— 김정현 (Alfred J Kim) (@AJKim38836296) January 14, 2025 పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి దక్షిణకొరియా అధ్యక్షుడిగా యూన్ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే కొన్ని వారాలపాటు ఆయన కస్టడీలనే ఉండిపోనున్నారు. దేశంలో తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై ఆయనను అరెస్ట్చేయదలిస్తే 48 గంటల్లోపు ఆమేరకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆయనను మళ్లీ విడుదలచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ అరెస్ట్‌గా ఆయనను అదుపులోకి తీసుకుని ఉంటే నేరాభియోగాలు మోపేలోపు మరో 20 రోజులపాటు ఆయనను తమ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఆయన అరెస్ట్‌ను ఆయన తరఫు లాయర్లు తప్పుబట్టారు. దేశద్రోహం సెక్షన్ల కింద నమోదైన కేసులను అవినీతినిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేయలేరని, అరెస్ట్ అన్యాయమని వాదించారు. BREAKING : Update South KoreaPolice & Officials begin moving barriers in new attempt to arrest President Yoonsupporters of Yoon are gathered to stop them pic.twitter.com/ULsGjZnm3t— Gio DeBatta 🍸 (@GDebatta) January 14, 2025 -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
సాక్షి, కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్‌లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్(BRS) లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్, హరీష్‌రావు హౌస్ అరెస్ట్కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్‌రావులను హౌస్ అరెస్ట్ చేశారు.వన్ టౌన్లో మూడు, త్రీ టౌన్లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
సాక్షి హైదరాబాద్/సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ క్రైం: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మూడు కేసులు నమోదు.. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆందోళన.. హైడ్రామా.. కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సమాధానం చెప్పలేకే అణచివేత: కేటీఆర్ రైతు రుణమాఫీని ఎగవేసి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేక సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అక్రమం, అత్యంత దుర్మార్గమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది. సీఎం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎంపై చర్య తీసుకోవాల్సిందిపోయి, ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే విడుదల చేయాలి: హరీశ్‌రావు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశి్నస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ బెదరదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ దురుసుగా మాట్లాడారు: గంగుల కరీంనగర్: సమీక్షా సమావేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటికి లాక్కెళ్లారని.. ఆయనే గొడవకు కారణమంటూ అక్రమ కేసులు పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లోని తన నివాసంలో సోమవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక సమావేశానికి ఆహ్వనిస్తేనే నేను, కౌశిక్‌రెడ్డి వెళ్లాం. సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే సంజయ్ తన పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డిని మాటలతో అసహనానికి గురిచేశారు. దీనితో ఆగ్రహించిన కౌశిక్‌రెడ్డి ముందు నీది ఏ పార్టీనో చెప్పి ప్రసంగించాలని నిలదీశారు.ఈ సమయంలో కౌశిక్రెడ్డిపైనే సంజయ్ దురుసుగా ప్రవర్తించారు’’ అని తెలిపారు. అక్కడే ఉన్న మంత్రులు దీనిని అడ్డుకోకపోగా.. క్షణాల్లో వచ్చిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లి బయటకు నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా..: ఎమ్మెల్యే సంజయ్ గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్, కేటీఆర్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాడి చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఆయన కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి తన హక్కులకు భంగం కలి్పంచారని, చేతిపై కొట్టారని, అవమానించారని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి కౌశిక్‌రెడ్డి ఒక్కడి పనేనా, ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? అనేది తెలియాలన్నారు.కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు కరీంనగర్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుమతి మేరకు తాను మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తనను తోసివేశారని, దాడికి యత్నించారని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం -
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు -
19 ఏళ్ళ తరువాత దొరికారు.. కావలపిల్లలను తల్లిని హతమార్చిన హంతకులు
-
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
యూన్‌కు అరెస్ట్ వారెంట్
సియోల్: దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్‌లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఆఫీసు, నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది.. అయితే, అధికారికంగా యూన్‌ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. యూన్ ఈ సమన్లను పట్టించుకోరని చెబుతున్నారు.ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కనబెట్టేశారని, అధ్యక్షునికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులెవరినీ ఆయన నివాసంలోకి గానీ ఆఫీసులోకి గానీ రానివ్వడం లేదని సమాచారం. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుబడుతున్నారు. ఈ విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్ట్‌కు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.అయితే, విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో, అవినీతి ఆరోపణలెదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయెన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలను రుజువు చేయగలిగిన పక్షంలో యూన్‌కు మరణ శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలైతే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణలు, మినహాయింపులు ఉండవు.మార్షల్ లా విధించిన ఆరోపణలపై ప్రతిపక్షం మెజారిటీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యూన్‌ను అభిశంసించింది. అయితే, ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యూన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తరచూ ఉన్నతస్థాయి నేతలపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెడుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకే మార్షల్ లా పెట్టినట్లు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైనదా కాదా అనే అంశంపై దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది. -
ద.కొరియా అధ్యక్షుడికి కోర్టు షాక్
సియోల్:సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్ డిసెంబర్3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. -
త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?
సియోల్:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్‌కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్‌ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన -
శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు
-
కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీ
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందున ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కేందుకు రేవంత్ ప్రయతి్నస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా గురువారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలనే విష సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పేరిట డబ్బా కొడుతూ, సీఎం రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ సమాజమే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. -
త్వరలో ఢిల్లీ సీఎం అరెస్టు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(DelhiElections) సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvindkejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి(Atishi)ని త్వరలోనే ఏదో తప్పుడు కేసులో అరెస్టు చేస్తారన్నారు. ఈ మేరకు బుధవారం(డిసెంబర్25) ఎక్స్(ట్విటర్)లో కేజ్రీవాల్ ఒక పోస్టు చేశారు.సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన,మహిళా సమ్మాన్ యోజన పథకాలు ప్రకటించడంతో కొందరు వణుకుతున్నారని అందుకే ఆమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందే పలువురు ఆమ్ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లలో సోదాలు జరగవచ్చని కేజ్రీవాల్ తెలిపారు.కాగా, ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ ఏదీ లేదని, స్కీమ్ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని ఢిల్లీ మహిళా,శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఓ వైపు ఆమ్ఆద్మీపార్టీ ఈ స్కీమ్ కింద అర్హుల వివరాలు సేకరిస్తున్న వేళ మహిళా,శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రకటన రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ మరో విధంగా స్పందించింది. కేజ్రీవాల్ అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్ స్కీమ్‌పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఆరోపించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ గెలిస్తే మహిళా సమ్మాన్యోజనతో పాటు సంజీవని స్కీమ్ అమలు చేస్తామని తదితర హామీలిచ్చింది. ఈ స్కీమ్‌లపై బీజేపీ,ఆప్‌ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. -
సంధ్య థియేటర్ ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోనీని పోలీసులు గుర్తించారు. పలు ఈవెంట్స్‌కు బౌన్సర్ల ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?
గతకొన్నిరోజుల నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం ఎంతలా రచ్చ రచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు మూడు రోజుల్లో అయితే పీక్‌కి చేరిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏకంగా అసెంబ్లీలో బన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఇది జరిగిన కాసేపటికే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి వాటిని ఖండించడం హాట్ టాపిక్ అయిపోయింది.ఇదలా ఉంచితే బన్నీకి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. రీసెంట్గా లైంగిక ఆరోపణల కేసులో జైలుకెళ్లొచ్చిన జానీ మాస్టర్ని (Jani Master) తాజాగా మీడియా ప్రతినిధులు కలిశారు. అల్లు అర్జున్ అరెస్ట్ (Arrest) గురించి ప్రశ్నించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)'ఈ విషయంలో నేనేం మాట్లాడుదలుచుకోలేదు. నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై నాకు నమ్మకముంది. అందరికీ మంచి జరగాలి' అని జానీ మాస్టర్ చెప్పాడు.'జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని జానీ మాస్టర్ సమాధానమిచ్చాడు. గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా బాగానే ఉంది అని అన్నాడు' అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?) -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మాజీ క్రికెటర్ ఊతప్పపై వారెంటు
సాక్షి బెంగళూరు: ఉద్యోగుల ఈపీఎఫ్ డబ్బులను జమ చేయలేదనే కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై ఈ నెల 4న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉత్తప్ప బెంగళూరు పులకేశి నగర పోలీసు స్టేషన్ పరిధిలోని నివాసి కావడంతో ఆయనను అరెస్టు చేయాలని అక్కడి పోలీసులకు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ షడాక్షరి గోపాలరెడ్డి లేఖ రాశారు. వివరాలు.. సెంచురీస్ లైఫ్‌స్టైల్ ప్రై.లి. అనే కంపెనీకి రాబిన్ ఉత్తప్ప సహ యజమానిగా ఉన్నారు. కంపెనీలో సిబ్బంది జీతం ఉంచి ఈపీఎఫ్ డబ్బులు కట్ చేశారని, కానీ ఖాతాలోకి వేయలేదని, మొత్తం రూ. 23 లక్షల మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. -
KSR Live Show: చంద్రబాబు ఎఫెక్ట్.. ఏపీ పోలీసులపై NHRC ఫైర్
-
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
యూట్యూబర్స్@ జైల్!
బంజారాహిల్స్/ఘట్కేసర్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసులు... రాచకొండ కమిషనరేట్‌లోని ఘట్కేసర్ అధికారులు.. బుధవారం ఇద్దరు యూట్యూబర్స్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఒకరు సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల్లోకి చేరగా... మరొకరు ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్ఆర్) న్యూసెన్స్ క్రియేట్ చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇతడి అరెస్టు ద్వారా పోలీసులు రీల్స్, మీమ్స్ పేరుతో ఓవర్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. Irresponsible Instagram Content Creator ArrestedRecently a viral video surfaced showing an individual throwing ₹20,000 bundle on the roadside of ORR and challenging viewers to a #MoneyHunt. This irresponsible act caused chaos, inconvenience, and posed a significant threat… pic.twitter.com/tpypMB6lnQ— Rachakonda Police (@RachakondaCop) December 18, 2024 మారానంటూ మళ్లీ మొదటికి... మణికొండ పంచవటి కాలనీలో నివసించే సినీ నటికి ఏడాదిన్నరగా యూట్యూబర్ ప్రసాద్ బెహరాతో పరిచయం ఉంది. ఇతడు యూట్యూబ్, కొన్ని చిత్రాల ద్వారా ప్రాచుర్యం పొందాడు. సదరు నటి ‘పెళ్లివారమండీ’ వెబ్ సిరీస్‌లో ప్రసాద్‌తో జత కట్టారు. షూటింగ్ సమయంలో ప్రసాద్ ప్రవర్తన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తట్టుకోలేక వెబ్ సిరీస్ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆపై ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. నిజమని నమ్మిన ఆమె ఏడాది తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా నటిస్తోంది. తన ప్రవర్తన మార్చుకోని అతగాడు అసభ్యంగా మాట్లాడటం, తాకడం చేశాడు. ఆమె అడ్డు చెప్పగా... షూటింగ్స్‌లో ఇవన్నీ సహజమని, కాదంటే నీకే నష్టమని హెచ్చరించాడు. అతడి ప్రవర్తన, మాటలు, చేష్టలతో విసిగిపోయిన పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. దుర్భాషలాడాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా... ప్రసాద్‌పై బీఎన్ఎస్లోని 75 (2), 79, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కట్ట విసిరి కట్టలు సంపాదించాలని... మనీ హంట్ చాలెంజ్ పేరుతో ఓఆర్ఆర్పై ఓ నోట్ల కట్ట విసిరి, ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పెట్టి, సబ్స్క్రైబర్లను పెంచుకోవడం ద్వారా యూట్యూబ్ నుంచి భారీ ఆదాయం పొందాలని ప్రయతి్నంచిన మరో యూట్యూబర్ రాయలపురం భానుచందర్ జైలుకు వెళ్లాడు. బాలానగర్‌కు చెందిన ఇతగాడు ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 సమీపంలో ఓ రీల్ చేశాడు. రూ.20 వేల కట్టను చెట్ల పొదల్లో పడేసి ఎవరైన వచ్చి తీసుకోవచ్చంటూ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. ఇలా చేయడం న్యూసెన్స్ కిందికి వస్తుందని, ప్రయాణికులకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించడమే అని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతడిపై బీఎన్ఎస్లోని 125, 272, ఐటీ యాక్ట్‌లోని 66 సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడంతో పాటు అతడి దగ్గర ఉన్న ఐ ఫోన్ 13 ప్రో సీజ్ చేశారు. ఓఆర్ఆర్, జాతీయ రహదారులపై రీల్స్ చేస్తే ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, ఇలా చేస్తే జైలుకు పంపుతామని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి హెచ్చరించారు.