
సోదాల్లో రూ.2 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వాదీనం
వలసదార్ల పేరిట భూముల రిజిస్ట్రేషన్లకు సహకరించినట్లు ఆరోపణలు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్‌కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.
ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్‌గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్‌పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.

ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్‌ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్‌నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్‌పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.