disproportionate assets
-
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
ఉద్ధవ్‌పై కేసు.. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు) -
నెలకు 4వేల జీతంతో మొదలైన ‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!
భోపాల్: భోపాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోట్ల ఆస్తిని కూడబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అతని ఇంట్లో దొరికిన నగదు, ఇతర ఆస్తి పత్రాలు చూసిన నివ్వెర పోయారు. స్థిరాస్తులు, ఇతర కోట్ల రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ 85 లక్షలకు పైగా నగదు లభించినట్టు అధికారులు వెల్లడించారు. లెక్కింపు, పత్రాల వెరిఫికేషన్ తర్వాతే అతడి మొత్తం విలువ తెలుస్తుందని ఈఓడబ్ల్యు ఎస్పీ రాజేష్ మిశ్రా తెలిపారు. (ఇదీ చదవండి: అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!) నెలకు నాలుగువేల రూపాయల జీతంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖలో అప్పర్ డివిజన్ క్లర్క్‌గా కరియర్ ప్రారంభించిన హీరో కేశ్వాని ప్రస్తుతం నెలకు దాదాపు రూ.50 వేల జీతం తీసుకుంటున్నాడు. అక్రమ ఆస్తులు ఫిర్యాదుల విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నోట్ లెక్కింపు యంత్రాన్ని సాయంతో డబ్బును లెక్కించినట్టు ఈఓడబ్ల్యు అధికారి తెలిపారు. అలాగే కోట్లాది రూపాయల పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఖరీదైన అలంకార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేస్వానీ నివాసం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని అంచనా వేశారు. కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన కేశ్వాని భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. బైరాగఢ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే అధికారుల సోదాలను ప్రతిఘటించిన కేశ్వానీ, తన ఎత్తులు సాగకపోయేసరికి బాత్రూమ్ క్లీనర్‌ను తాగేశాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ మిశ్రా తెలిపారు. #WATCH | MP:Around Rs 80 Lakhs cash, property documents & gold-silver recovered from residence of Hero Keswani, sr clerk of Medical Education Dept in Bhopal. Economic Offences Wing conducted a raid at his residenc. He was hospitalised after his health deteriorated when raid began pic.twitter.com/FgK73jBMQx — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 3, 2022 -
హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలుశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(86)కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారులు ఆయన్ను శుక్రవారం తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రెండో నంబర్ జైలులో మరో ఇద్దరితో కలిపి ఆయనకు గదిని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ గత వారమే చౌతాలాను దోషిగా నిర్ధారించారు. చౌతాలా ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని ఆదేశించారు. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది. హరియాణా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది. -
కేసుల నమోదులో ఏసీబీ డీలా!
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన ఏసీబీ వెనక్కి తగ్గిందా? కేవలం లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన పెద్ద చేపలను ఊచల్లోకి నెట్టాల్సిన అవినీతి నిరోధక శాఖ ఎందుకు సైలెంట్ అయ్యింది? ఏడాదిలో కనీసం ఒక్క అవినీతి అధికారిపై కూడా డీఏ (డిస్ప్రొపార్సినేట్ అస్సెట్స్) కేసు నమోదు చేయకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? నిజంగానే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులు లేరని ఏసీబీ భావిస్తోందా? లేక అలాంటి అధికారులపై ఫిర్యాదు రాకపోవడం వల్ల కేసులు నమోదు చేయడం లేదా? ఈ ప్రశ్నలు, అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఉన్న ఊపేది... తెలంగాణ ఏర్పడిన కొత్తలో పలు సంచలనాత్మక కేసులను డీల్ చేసిన అవినీతి నిరోధక శాఖ నెమ్మదించినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో ఏసీబీ విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఈఎస్ఐ స్కాంలో వందల కోట్లు నొక్కేసిన వ్యవహారంలో ఉద్యోగులతో పాటు పలు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న వ్యవహారంలో రాష్ట్ర స్థాయి హోదా ఉన్న అధికారులను ఊచలు లెక్కబెట్టేలా దూకుడుతో వ్యవహరించింది. అంతటి ఏసీబీ ఇప్పుడు పెద్దగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కేవలం ట్రాప్ కేసులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఏసీబీ, ఒక్క ఆదాయానికి మించిన కేసు గానీ, నిధుల దుర్వినియోగంతో సొమ్ము చేసుకున్న కేసులు గానీ నమోదు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 63 ట్రాప్ కేసులు మాత్రమే ఏసీబీ నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రెవెన్యూ, పోలీస్ శాఖలే ప్రధానంగా ఉన్నాయి. గతేడాది పది వరకు డీఏ కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనేక ఆరోపణలకు తావిస్తోంది. కీసర నాగరాజు వ్యవహారమే కారణమా? గతేడాది ఆగస్టులో రాంపల్లి భూముల వ్యవహారంలో కీసర ఎమ్మార్వో రూ. కోటి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజుతో పాటు సర్పంచ్ అంజిరెడ్డి, వరంగల్‌కు చెందిన రియల్టర్ శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఓ సాయిరాజులను అరెస్ట్ చేసింది. అదే ఎమ్మార్వోపై రోజుల వ్యవధిలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగానే అక్టోబర్ 14న ఎమ్మార్వో నాగరాజు చంచల్‌గూడ జైళ్లో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసు మరింత హీటెక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి అనే వ్యక్తి నవంబర్ 8న కుషాయిగూడలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం దుమారానికి తెరదీసింది. ఒక్క కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో నిందితుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో ఏసీబీ కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నుంచి సైతం ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి అవినీతి తిమింగళాల వేటకు ఏసీబీ స్పీడ్ బ్రేకర్ వేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రాసిక్యూషన్ అనుమతి కూడా కారణమేనా? ఏసీబీ కేసుల్లో నిందితుల విచారణకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాకపోవడం కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేయకపోవడానికి ప్రధాన కారణమని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన వేలాది కేసుల్లో కనీసం పదుల సంఖ్యలో కూడా నిందితుల విచారణ కోసం ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాలేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావు నివాసాల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో ఆయన నివాసాల్లో దాదాపు 36 గంటలపాటు సోదాలు జరుగుతున్నాయి. ఇక మాజీ మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు కిలారి రాజేష్ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. (చదవండి : చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు) విజయవాడలోని శ్రీనివాస్‌రావు ఫ్లాట్‌లో పలు కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో సోదాలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని చంపాపేట్ గ్రీన్‌పార్క్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్‌కు ఆయన్ను తరలించారు. సీఆర్పీఎఫ్ పహారాలో ఆ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు శ్రీనివాస్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
-
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
-
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. (చదవండి : అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?) కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచే స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే, హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. (చదవండి : ఆదాయం వేలల్లో.. కోట్లు ఎలా సంపాదించారు?) -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్ న్యాయవాది కోకా శ్రీనివాస్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపారు. రూ.వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు కొద్ది కాలానికే కోట్లకు ఎలా పడగెత్తారో వివరించలేదన్నారు. ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలి’ అని కోర్టును కోరారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నేటికీ ఈ కేసులో స్టే ఉన్నట్లు వెబ్సైట్లో ఉండటంతో పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కేసు నేపథ్యం ఇదీ.. : ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి స్టే పొందారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్ 18న విచారణ ప్రారంభించింది. -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు; విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విచారణ జరిపించాలని 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ ఏసీబీ కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించింది. పిటిషన్‌పై విచారణకు సంబంధించి లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. గతంలో అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేస్తూ స్టే ఉత్తర్వులిచ్చారు. అయితే స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న స్టే గడువు ముగియడంతో ఏసీబీ కోర్టు విచారణను పునఃప్రారంభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్టే 10 సంవత్సరాలు దాటితే ఎత్తివేయబడుతుంది. -
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్
సాక్షి, అమరావతి : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసి న ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీ కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు. పూర్వాపరాలు పరిశీలించి.. ఈ కేసు ప్రస్తుత దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు నిబంధనలు అంగీకరించవని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. కేసు విచారణకు స్వీకరించడానికి ముందు దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు వీలులేదన్న ఆ ఉత్తర్వుల్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు 2005లో తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తున్నప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం పరిపాటి.. అయితే చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్థన్‌రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణ వాయిదా వేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే గోవర్థన్‌రెడ్డి బదిలీ అయ్యారు. -
మురళీగౌడ్ వద్ద వందకోట్ల ఆస్తులు..!
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారి బాలగౌని మురళీగౌడ్ సుమారు వంద కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఆస్తులపై మూడు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్, నంద్యాలల్లో రెండు భవనాలు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, తిరుపతిలోని మురళీగౌడ్ బంధువుల ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్ బావమరుదుల ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుతో బెంగళూరులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మురళీగౌడ్ భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్ పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులు పొంది, తిరుపతిలో అసిస్టెంట్ సిటీప్లానర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. నాటి ఫిర్యాదులతో ఈ సోదాలు జరిగాయి. తిరుపతి ద్వారకానగర్‌లోని నివాసముంటున్న మురళీ గౌడ్ బంధువు ఇంట్లో 14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే తిరుపతి రూరల్ పేరూరులోని బిల్లు కలెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, లక్షా యాభైవేల రూపాయల నగదు లభించింది. మురళీగౌడ్‌తో కలిసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఇళ్లలోనూ సోదాలు చేశామని ఏసీబీ సీఐ ప్రసాద్‌రెడ్డి చెప్పారు. -
రాష్ట్రంలో భారీగా ఏసీబీ దాడులు
సాక్షి, బెంగళూరు : కర్నాటకలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెగా దాడులకు దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్యూడీ, ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జ్యుయాలజీ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ధార్వాడ్, బెళగావి, ధండేలి, జోయిడా చిత్ర దుర్గ తదితర ప్రాంతాలలోని ఉన్నత అధికారుల ఇళ్లలో భారీగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో వివిధ పత్రాలను, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కర్నాటక యూనివర్శిటీ ప్రొఫెసర్ మహదేవప్ప, మైన్స్ అండ్ జ్యుయాలజీ అధికారి ఉదయ్ డి చబ్బీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి ఇళ్లలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ సంపాదన ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి వుంది. K'taka: Anti-Corruption Bureau is conducting searches at premises of a Professor in Karnataka University, an official of Dept Of Mines & Geology, Mangaluru & an Asst Executive Engineer of PWD in Joida, Uttara Kannada. Raids on at Dharwad, Belagavi, Dandeli & two more locations. — ANI (@ANI) June 12, 2019 -
ములాయంకు సీబీఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును 2013 ఆగస్టు 7న ముగించామనీ, ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలేవీ తమకు లభించలేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. ములాయం, ఆయన కొడుకు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మరో కుమారుడు ప్రతీక్ యాదవ్, అఖిలేశ్ భార్య డింపుల్ తదితరులపై అక్రమాదాయ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా 2007లో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణను నిలిపివేయాలంటూ ములాయం, ఆయన కొడుకులు వేసిన పిటిషన్‌ను 2012లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటికీ డింపుల్ ప్రభుత్వ పదవిలో లేనందున ఆమెపై మాత్రం విచారణ నిలిపేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము విచారణ కొనసాగించగా, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనేందుకు తమకు ప్రాథమిక ఆధారాలేవీ లభించలేదని సీబీఐ తన 21 పేజీల అఫిడవిట్లో పేర్కొంది. 2013 ఆగస్టు 7 నాటికే ఈ కేసులో విచారణను ముగించామంది. ప్రాథమిక ఆధారాలు కూడా లేనందున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సీబీఐ తెలిపింది. -
అక్రమాస్తుల కేసు : ములాయం, అఖిలేష్‌లకు క్లీన్చిట్
లక్నో : అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఊరట లభించింది. గురువారం ఈ కేసులో సీబీఐ తండ్రికొడుకులిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. అంతేకాక అఖిలేష్, ములాయంల మీద రెగ్యూలర్ కేసు నమోదు చేసేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ములాయం సింగ్ అధికారంలో ఉన్న రోజుల్లో వారి ఆస్తులు అనూహ్యంగా పెరగాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ చేపట్టాలంటూ విశ్వనాథ్ చతుర్వేదీ అనే వ్యక్తి 2005లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2012లో కోర్టు ఈ కేసు నుంచి డింపుల్ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది. అయితే ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటంతో విశ్వనాథ్ మరోసారి సుప్రీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది మార్చిలో మరోసారి విచారణ చేపట్టిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్‌ల కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో తెలుపుతూ.. రెండు వారాల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాంతో సీబీఐ నేడు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. -
మాజీ మంత్రికి అయిదేళ్లు, భార్యకు రెండేళ్లు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ మంత్రికి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో ఎఐఎడిఎంకెకు చెందిన మాజీ మంత్రి సత్యమూర్తికి, ఆయన భార్యకు జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. మాజీ మంత్రి సత్యమూర్తికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. అలాగే ఆయన భార్యకు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతోపాటు ఇద్దరూ రూ. 5లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించడంలో విఫలమైతే ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ కేసులో ఆగస్టు, 2000లో సత్యమూర్తిని, ఆయన భార్యను నిర్దోషులుగా నిర్ధారించి దిగువ కోర్టు విడుదల చేసింది. తాజాగా ఈ తీర్పును కొట్టివేసిన జస్టిస్ జి.జయచంద్రన్ ఈమేరకు సంచలన తీర్పునిచ్చారు. విజిలెన్స్ డైరెక్టరేట్ అండ్ యాంటీ కరప్షన్ శాఖ దాఖలు చేసిన అప్పీల్‌ను సమర్ధించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం యొక్క సెక్షన్ 13 (1) (ఇ) కు సంబంధించిన వివరణను కింది కోర్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో 1993-1996 మధ్య వాణిజ్య పన్నుల మంత్రిగా సత్యమూర్తి పనిచేశారు. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. -
మాయావతి పార్టీకి మరో తలనొప్పి
లక్నో: మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 4 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో బీఎస్పీ యూపీ అధ్యక్షుడు రామ్ ఆచల్ రాజ్‌భర్‌పై ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ విభాగం చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆయనపై కేసు నమోదు చేసే అవకాశముందని తెలిపాయి. 2007-2012లో తన ఆదాయం రూ. 34 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్న రాజ్‌భర్ ఎన్నికల్లో రూ. 4 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలో యూపీలో బీఎస్పీ అధికారంలో ఉంది. ఆయనపై 2012లో రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలైంది. తనపై విచారణను అడ్డుకునేందుకు అంబుడ్స్‌మన్ ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. తర్వాత వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం దర్యాప్తు గురించి పట్టించుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. -
ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్‌లోకి..
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత శశికళ ఇప్పుడు ప్రత్యేక సెల్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటరిగానే ఉండాలని యోచిస్తున్నట్లు జైలు వర్గాల సమాచారం. ఇదే కేసులో జైలులోని 2వ సెల్లో తన వదిన ఇళవరసితో కలిసి ఉంటున్న శశికళ.. ప్రస్తుతం 4వ నెంబర్ సెల్‌లోకి మారినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె చాలామందిని జైలులో కలుస్తున్నారు. ఆమె జైలు కారిడార్‌లో నడుస్తూ పలువురిని కలిసేందుకు వెళుతున్న సమయంలో ఇతర ఖైదీలకు ఇబ్బందవుతుందని, రక్షణపరమైన సమస్యలు వస్తాయని చెప్పడం, ఇక నుంచి వీలయినంత తక్కువమందిని కలవాలని ఆమె నిర్ణయించుకోవడం తదితర కారణాలతో ఆమె ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకొని ప్రత్యేక సెల్‌లోకి వెళ్లారట. కారిడార్‌లో కూడా మునుపటిలాగా ఆమె కనిపించడం లేదంట. ఇటీవలె ఆమెకు ఒక పెద్ద దోమ తెర కూడా ఇచ్చారంట. అందులోనే కూర్చుని ఆమె భోజనం చేస్తూ తమిళ వార్తా చానెళ్లకంటే సినిమాలే ఎక్కువగా చూస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో తమిళ పేపర్లు మాత్రం చదువుతున్నారని సమాచారం. -
చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. బెంగళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు ఒక్క విజిటర్ నైనా ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది. 31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చినట్టు తెలిసింది. రోజుకు ఓ విజిటర్ అయినా ఆమె దగ్గరకు రావడం బెంగళూరు జైలు మాన్యువల్ ప్రకారం కఠోర ఉల్లంఘన. కానీ ఆ రూల్స్ ను బెంగళూరు జైలు ఉల్లంఘిస్తోంది. మరోవైపు సాధారణ ఖైదీల్లా కాకుండా... శశికళ టీమ్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు ఇండియా టుడే తెలిపింది. జైలు మాన్యువల్ ప్రకారం.. ఖైదీలను చూడటానికి విజిటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే రావాలి. కొన్ని సందర్భాల్లో శశికళను, ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఇల్లవరసి, సుధాకరన్ లను చూడటానికి వచ్చే విజిటర్లు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వస్తున్నారని తెలిసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖులు వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇల్లవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియా టుడే రాబట్టింది. ఆ జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 18 వరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి శశికళను కలిసినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇల్లవరసి, సుధాకరన్ లు ప్రస్తుతం బెంగళూరులోని పరపణ్ణ అగ్రహార జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
అంతా ఆయనే చేశారు..
ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారు.. టీడీపీ నేతపై ఏసీబీ అధికారుల వద్ద భీమిలి తహసీల్దార్ మొర విచారణలో దేశం నాయకుడిపై ఆరోపణలు? విశాఖపట్నం : అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో అరెస్టయిన తహసీల్దార్ బి.టి.వి.రామారావు ఏసీబీ విచారణలో భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఈనెల 22వ తేదీన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి భీమిలి తహసీల్దార్ రామారావు ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో అవినీతి, అక్రమార్జనకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో ఒక రోజంతా విచారించి 23న రిమాండ్‌కు పంపారు. ఏసీబీ అధికారుల విచారణలో రామారావు భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడిపై బలంగానే ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పాస్ పుస్తకాలు మంజూరు మొదలు... ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారని, బీచ్ ఒడ్డున ఆక్రమణలను క్రమబద్ధీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసేవారని రామారావు ఏసీబీ అధికారుల వద్ద ఏకరవుపెట్టినట్టు సమాచారం. రామారావుపై ఏసీబీ అధికారులకు అందిన 12 ఫిర్యాదుల్లో పది కేసులు సదరు టీడీపీ నేత సిఫార్సు చేసిన పైరవీలేనని తెలుస్తోంది. రామారావు ఏకరవు పెట్టిన విషయాలు, చేసిన ఆరోపణలను ఓ నివేదిక రూపంలో ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. కాగా, ఏసీబీకి అడ్డంగా దొరికిన తర్వాత టీడీపీ నాయకుడే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న రామారావు.. స్వతహాగా కూడా చేయి తడపందే పనులు చేసే బాపతు నియోజకవర్గ నాయకుడు ఏరికోరి ఇక్కడ తహశీల్దార్‌గా వేయించుకున్నట్టు స్పష్టమవుతోంది. మంగమారిపేట టీడీపీ నేత ఎక్కడ? ఇక భీమిలి తహసీల్దార్ రామారావు అండతో రెండేళ్లు హల్చల్ చేసిన మంగమారిపేట టీడీపీ నాయకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం చర్చాంశనీయమైంది. భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడికి ప్రధాన అనుచరుడైన మంగమారిపేట గ్రామ నేత తహసీల్దార్‌కు ప్రతి అక్రమ పనిలోనూ చేదోడువాడోదుగా ఉండేవాడన్న వాదనలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు దాడి చేసిన రోజు ఉదయం కూడా సదరు మంగమారిపేట నేత తహసీల్దార్‌కు రూ. 20 లక్షల నగదు ఇంటికి తీసుకువెళ్లి అందించినట్టు చెబుతున్నారు. మంగమారిపేటలో సర్వే నెంబర్ 293లో బీచ్ ఒడ్డున పది ఎకరాలకు పైగా స్థలాన్ని టీడీపీ నేత అనుచరులు ఆక్రమించి ఫెన్సింగ్ కూడా వేసేశారు. ఆ స్థలం జోలికి రాకుండా ఉండేందుకే టీడీపీ నేత తహసీల్దార్‌కు రూ.20 లక్షలు ముడుపులు అందించినట్టు చెబుతున్నారు. ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు కూడా అదేనని అంటున్నారు. మొత్తంగా రెండేళ్లుగా తహసీల్దార్‌తో ఎన్నో అక్రమాలు చేయించిన మంగమారిపేట టీడీపీ నేత రెండు రోజులుగా పత్తా లేకపోవడం చర్చాంశనీయమైంది. ఆ కేసులు మా పరిధిలోవి కావు : ఏసీబీ డీఎస్పీ తహసీల్దార్ రామారావు అవినీతి, అక్రమాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. మేం దాడులు నిర్వహించి అరెస్టు చేసిన దరిమిలా ఆయన బాధితులు పెద్దసంఖ్యలో ఏసీబీ ఆఫీసుకు వస్తున్నారు.. భూ వివాదాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి ఆ కేసులన్నీ మా పరిధిలోవి కావు.. ఆ ఫిర్యాదులను మేం ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు పంపిస్తాం.. అని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ఆదివారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏసీబీ విచారణలో రామారావు ఏం మాట్లాడారో తాము బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. -
ఫైన్ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే!
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలు శిక్షను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న శిక్షాకాలం కంటే మరో 13 నెలలు అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు శశికళ మరికొందరికి జైలు శిక్షను ప్రకటించింది. దీని ప్రకారం శశికళ మూడు సంవత్సరాల 11నెలలపాటు జైలు కాలాన్ని పూర్తి చేయాలి. అదే సమయంలో రూ.10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు విధించింది. ఈ జరిమానాను శశికళ చెల్లించకుంటే మాత్రం మరో 13 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ రూ.10 కోట్ల జరిమానా కట్టాలి. అలా చేయలేకపోతే మరో 13 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’ అని జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.