ఫైన్‌ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే! | Sasikala to Serve 13 More Months in Jail if Fine is Not Paid | Sakshi
Sakshi News home page

ఫైన్‌ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే!

Published Tue, Feb 21 2017 3:35 PM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

ఫైన్‌ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే! - Sakshi

ఫైన్‌ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే!

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలు శిక్షను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న శిక్షాకాలం కంటే మరో 13 నెలలు అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు శశికళ మరికొందరికి జైలు శిక్షను ప్రకటించింది. దీని ప్రకారం శశికళ మూడు సంవత్సరాల 11నెలలపాటు జైలు కాలాన్ని పూర్తి చేయాలి.

అదే సమయంలో రూ.10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు విధించింది. ఈ జరిమానాను శశికళ చెల్లించకుంటే మాత్రం మరో 13 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ రూ.10 కోట్ల జరిమానా కట్టాలి. అలా చేయలేకపోతే మరో 13 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’ అని జైళ్ల సూపరింటెండెంట్‌ కృష్ణ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement