ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్‌లోకి.. | Sasikala prefers to be left alone | Sakshi
Sakshi News home page

ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్‌లోకి..

Published Wed, May 3 2017 11:51 AM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్‌లోకి.. - Sakshi

ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్‌లోకి..

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత శశికళ ఇప్పుడు ప్రత్యేక సెల్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటరిగానే ఉండాలని యోచిస్తున్నట్లు జైలు వర్గాల సమాచారం. ఇదే కేసులో జైలులోని 2వ సెల్‌లో తన వదిన ఇళవరసితో కలిసి ఉంటున్న శశికళ.. ప్రస్తుతం 4వ నెంబర్‌ సెల్‌లోకి మారినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. పరప్పన అగ్రహారలోని సెంట్రల్‌ జైలులో శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె చాలామందిని జైలులో కలుస్తున్నారు.

ఆమె జైలు కారిడార్‌లో నడుస్తూ పలువురిని కలిసేందుకు వెళుతున్న సమయంలో ఇతర ఖైదీలకు ఇబ్బందవుతుందని, రక్షణపరమైన సమస్యలు వస్తాయని చెప్పడం, ఇక నుంచి వీలయినంత తక్కువమందిని కలవాలని ఆమె నిర్ణయించుకోవడం తదితర కారణాలతో ఆమె ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకొని ప్రత్యేక సెల్‌లోకి వెళ్లారట. కారిడార్‌లో కూడా మునుపటిలాగా ఆమె కనిపించడం లేదంట. ఇటీవలె ఆమెకు ఒక పెద్ద దోమ తెర కూడా ఇచ్చారంట. అందులోనే కూర్చుని ఆమె భోజనం చేస్తూ తమిళ వార్తా చానెళ్లకంటే సినిమాలే ఎక్కువగా చూస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో తమిళ పేపర్లు మాత్రం చదువుతున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement