sasikala
-
చిన్నమ్మ రీఎంట్రీ.. ఆమె వెనుక ఎవరున్నారు?
శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు. ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు. ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్‌గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
స్టే ఉండగా.. పీటీ వారెంట్ ఎలా జారీ చేస్తారు?
సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్‌జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్‌కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్ చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో.. ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది. ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది. అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు. -
పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతుదారులే టార్గెట్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్ మద్దతు దారులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ముగ్గురు మినహా తక్కిన నాయకులు అందరూ పార్టీలోకి రావాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఆయా జిల్లాలోని పార్టీ నేతల ద్వారా మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం మదురై వేదికగా మహానాడును పళణి స్వామి విజయవంతం చేసుకుని మంచి జోష్ మీదున్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న దక్షిణ తమిళనాడులో తన బలాన్ని నిరూపించుకునే విధంగా పళణి స్వామి సఫలీకృతులయ్యారు. మహానాడుకు 15 లక్షల మంది వచ్చినట్టుగా స్వయంగా పళణిస్వామి ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యా రు. పార్టీ కిందిస్థాయి కేడర్ అంతా తన వెన్నంటి ఉండడంతో, ద్వితీయ శ్రేణి, జిల్లాస్థాయిలో కీలకంగా ఉన్న పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతు నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు నాయకులు మినహా తక్కిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదురై కోటలో పళణి స్వామి తన బలాన్ని నిరూపించుకు వెళ్లడంతో ఆయన వెన్నంటి నడిచేందుకు పన్నీరు, టీటీవీ, శశకళ మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. వీరందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే బాధ్యతలను ఆయా జిల్లాలోని నేతలకు పళణి స్వామి అప్పగించారు. -
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్‌ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
చిన్నమ్మ.. ఎవరా జ్యోతిష్కుడు?
సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో నవంబర్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్‌ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్‌ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, పళనిస్వామి డ్రైవర్‌గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్‌కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం. -
శశికళ, దినకరన్‌కు ఆహ్వానం
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు. ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు. పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు. -
కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికల్లోకి..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని అందరూ కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నం అవుతోందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె నాగపట్నం, తిరువారూర్లలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా అన్నాడీఎంకే విభేదాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదికపై వివాదాలు శోచనీయమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించవచ్చునని, అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడానికి వీలుందన్నారు. అయితే, పన్నీరుసెల్వంను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తాను ఖండించినంత మాత్రాన పన్నీరుకు మద్దతు ఇచ్చినట్టు కాదన్నారు. అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు ఉంటుందో అన్నది కేడర్ ఆలోచించాలని, సమాధానం కేడర్ చెప్పాలని కోరారు. త్వరలో తనను పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు ఈసారి గెలుపు కష్టమేనని, ఆ మేరకు తాము వ్యూహాలకు పదును పెడతామన్నారు. -
నా వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించింది: పులివెందుల మాజీ ఎంపీటీసీ శశికళ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ఎంపీ అవినాష్రెడ్డిగానీ మరెవరూ గానీ తనతో చెప్పలేదని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ స్పష్టం చేశారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఆమె ఖండించారు. కనీసం తనతో సంప్రదించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పేరును ఉటంకిస్తూ అవాస్తవాలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. పులివెందులలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఉదయం తమ స్థలాలకు సంబంధించిన విషయంపై కలిసేందుకు వెళ్లిన మాట వాస్తవమన్నారు. అక్కడ కొంతమంది పనివాళ్లు ఉన్నారని, వివేకానందరెడ్డిని కలవాలని సమాచారం ఇవ్వగా సమాధానం చెప్పలేదన్నారు. దాంతో కాసేపు వేచి చూశానన్నారు. కొద్దిసేపటికి కొన్ని కార్లు వచ్చాయని తెలిపారు. ‘అందులో నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన మరికొంతమంది అనుచరులు ఇంటి లోపలికి వెళ్లారు. ఐదు నిమిషాల్లోనే అవినాష్‌రెడ్డి బయటకు వచ్చి ఆందోళనగా వివేకా ఇంటి లాన్లో ఫోన్లో మాట్లాడారు. అక్కడ గుమికూడిన వారు వివేకా సార్ చనిపోయారని మాట్లాడుకోవడం విన్నా. వెంటనే లోపలికి వెళ్లి చూడగా వివేకానందరెడ్డి చనిపోయి కనిపించారు. అక్కడ అంతా రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపించింది. కొందరు గుండె నొప్పి అని, మరికొందరు రక్తపు వాంతులతో చనిపోయారని చర్చించుకున్నారు. అనంతరం బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయా. అంతేకానీ వివేకా ఇంటి వద్ద అవినాష్‌రెడ్డి నాతో మాట్లాడలేదు. నేను కూడా ఆయనతో ఏమీ మాట్లాడలేదు. సిట్, సీబీఐ అధికారులు విచారణకు పిలిచినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా’ అని శశికళ పేర్కొన్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డేనని తనతో సహా జిల్లాలో అందరికి తెలుసన్నారు. వైఎస్ వివేకాను పని విషయమై కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఎంపీగా వైఎస్ అవినాష్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచేలా మీరంతా కృషి చేయాలని తమతో చెప్పేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ వివేకా ఉంటే అవినాష్‌రెడ్డికి ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టం లేదన్నారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు ఎందుకు జరిగాయి? దాని వెనుక రహస్యాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందన్నారు. -
చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ!.. దత్తపుత్రుడి వల్లే గొడవలచ్చాయని..
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ – మేన కోడలు దీప జయకుమార్ మధ్య వివాదం ముదిరింది. చిన్నమ్మ శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో జయలలిత మేన కోడలు దీప శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం విషయంలోనే.. తన మేనత్త జయలలిత కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. శశికళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించిన తరువాత ఆస్తికి వారసులుగా ఆమె అన్న కుమార్తె దీప, కొడుకు దీపక్ తెరపైకి వచ్చారు. కోర్టు సైతం వీరినే జయ వారసులుగా ధ్రువీకరించింది. అదే సమయంలో దీప ఓ రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు సాగినా, చివరికి వెనక్కి తగ్గింది. అదే సమయంలో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీప తరచూ వ్యాఖ్యల చేసేవారు. తాజాగా శశికళను ఢీకొట్టే విధంగా పలు ఆరోప ణాలు గుప్పిస్తూ.. ఓ ఆడియోను బుజ్జమ్మ దీప విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా వివాదానికి నేపథ్యం ఇదేనా..? జయలలిత మృతి నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని విచారించిన ఆర్ముగ స్వామి కమిషన్‌కు శశికళ లిఖిత పూర్వకంగా సమర్పించిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇందులో దీప కుటుంబం, ఆమె తల్లి విజయలక్ష్మి గురించి శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసిందనే వార్తలొచ్చాయి. దీనిపై దీప తీవ్రంగా మండిపడుతూ ఆడియోను విడుదల చేయడం విశేషం. అనుమానాలెన్నో.. ఇప్పుడున్న మర్యాదను చెడ గొట్టుకోవద్దని, ఏ తప్పు చేయనప్పుడు, నిరూపించుకునేందుకు సిద్ధమా..? అని శశికళకు దీప సవాల్ విసిరారు. సుధాకరన్ పెళ్లి తర్వాత తన తండ్రి జయకుమార్ మరణించారని, ఏ కారణంతో ఈ మరణం సంభవించిందో.. నేటికీ వెల్లడి కాలేదన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే లేనిపోని చాడీలను మేనత్త వద్ద శశికళ నూరి పోసిందని మండిపడ్డారు. అందుకే శశికళపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలుత తన సోదరుడు దీపక్‌ను బలవంతంగా తన గుప్పెట్లోకి శశికళ లాక్కుందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మేనత్త జయలలిత మరణం సందర్భంగా శశికళ వ్యవహరించిన తీరు, తమ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించాయని వెల్లడించారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న శశికళ, మేనత్తను చూసేందుకు తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, సీసీ కెమెరాలన్నీ ఎందుకు ఆపేయించారని ప్రశ్నించారు. వారి స్వలాభం, ఆదాయం కోసం తన మేనత్త జయలలితను తప్పుదారి పట్టించి వాడుకున్నారని ఆరోపించారు. నిజాలు, రహస్యాలను మరెన్నో రోజులు దాచి పెట్ట లేరని, త్వరలో అన్ని బయటకు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. ఆడియో రూపంలో.. వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తే.. తన మేనత్త జయలలిత మృతిపై అనుమానం అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదని ఆడియోలో దీప పేర్కొన్నారు. తన తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడేందుకు మూడో వ్యక్తిగా ఉన్న శశికళకు ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావును కలిసి అప్పట్లో తన తల్లి విజయలక్ష్మి మేనత్త జయలలితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు శశికళ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవానికి తన మేనత్తకు శశికళ రూపంలోనే ప్రమాదం పొంచి ఉండేదని, ఆమెను రక్షించేందుకే తన తల్లి ప్రధానిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం కారణంగానే మేనత్తతో తన కుటుంబానికి మనస్పార్థలు వచ్చినట్లు వివరించారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిందలను తమ మీద వేయడం శశికళకు కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయలక్ష్మి గతంలో కలైంజ్ఞర్ కరుణానిధి, వాలప్పాడి రామమూర్తి వంటి నేతలను కలిసిన సందర్భాలు లేవు అని, ధైర్యం ఉంటే తనతో చర్చకు శశికళ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మౌనంగా ఉండకుంటే గుట్టు విప్పుతాం.. తన కుటుంబం, తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని శశికళను దీప హెచ్చరించారు. శశికళ నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఆమెకే మంచిదని.. లేనిపక్షంలో గుట్టు విప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన కడుపులో ఉన్న బిడ్డను చిదిమేశారని, తన తల్లి భౌతిక కాయాన్ని కూడా చూడనివ్వకుండా జయలలితను అడ్డుకున్నది శశికళే కదా.. అని ఆరోపించారు. మధ్య తరవాతి స్థాయికి కూడా నోచుకోని శశికళకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే విషయంపై.. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇకనైనా ఈ విషయంపై శశికళను అన్నాడీఎంకే కేడర్ ప్రశ్నించాలని, రాష్ట్ర ప్రజలు సైతం నిలదీయాలని కోరారు. తనకు శశికళ రూపంలో ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాగా ఈ దీప వ్యాఖ్యలపై చిన్నమ్మ శశికళ ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఇలవరసి కుమారుడు వివేక్ సతీమణి కీర్తన ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: శశికళ వదిన ఇలవరసి కుమారుడు వివేక్. ఇతడి భార్య కీర్తన గురు వారం ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని ఆమె వదినమ్మ ఇలవరసి కూడా అనుభవించారు. శశికళ అన్న జయరామన్ సతీమణే ఈ ఇలవరసి. ఆమె కుమారుడు వివేక్. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ఇతడి కనుసన్నుల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది. దీంతో వివేక్‌ను ఈడీ, ఐటీ వర్గాలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వివేక్ తన సతీమణి కీర్తనతో గత కొంత కాలంగా తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. వివేక్ వేధింపుల గురించి పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వివేక్‌ను ఎవ్వరూ ప్రశ్నించక పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పలు రకాల మాత్రలను మింగేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను అర్ధరాత్రి వేళ అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వివేక్, కీర్తన మధ్య బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు విచారణలో వెలుగు చూసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన కీర్తన ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది. -
అన్నీ రహస్యాలే.. జయ లలిత కేసులో అసలేం జరిగింది?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదని.. ఆమె మరణం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని జయ అభిమానులు ఆరేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ డెత్ మిస్టరీ కేసును పరిశోధించిన జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. శశికళ పాత్రపై దర్యాప్తు జరపాల్సిందేనన్న కమిటీ సిఫారసు కొత్త మంటలు రాజేసింది. చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ 2016 సెప్టెంబరు 22న నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ లతో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు తెలిసినా.. అంతా నిగూఢమే. సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బానే ఉందని రెండు మూడు రోజుల పాటు చెప్పుకొచ్చినా.. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెప్పారు. రోజుకో మలుపు నవంబరు 13న అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఆమె తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొనడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమవుతానని వెల్లడించినట్టు పేర్కొన్నారు. రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బానే ఉందని చెబుతూ వచ్చారు. పక్కా స్క్రిప్టింగ్ ప్రజలను ఊరడించడానికన్నట్లు రోజుకో సమాచారాన్ని కొద్దికొద్దిగా విడుదల చేశారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని.. వెల్లడించారు. నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది. చిత్రంగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. పుకార్లు షికార్లు ఇన్ని మలుపులు తిరగడంతో తమిళనాట రక రకాల పుకార్లు షికార్లు చేశాయి. జయలలితపై విష ప్రయోగం చేసిందని కొందరు ప్రచారం చేశారు. రోజుల తరబడి స్లో పాయిజన్ ఇచ్చి జయలలితను మట్టుబెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని పార్టీలో జయ విధేయులు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి. ఇంట్లో గొడవ జరిగిందా? జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా కుట్రలు జరిగాయని పుకార్లు పుట్టాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళపైనే ఎక్కుపెట్టారు. చెలి నెచ్చెలి జయలలితకు శశికళ తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే జయలలితను అడ్డు పెట్టుకుని శశికళ కుటుంబం ప్రభుత్వంలో చొచ్చుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పించడానికి కుట్ర పన్నినట్లు నిఘా బృందాలు ఉప్పందించాయి. ఈ పరిస్థితుల్లో శశికళ కుటుంబాన్ని ఇంటి నుండి సాగనంపారు జయలలిత. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మన్నార్ గుడి మాఫియాకు అడ్డుకట్ట వేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత శశికళకు మళ్లీ ఇంట్లో చోటిచ్చారు జయ. అదే జయలలిత కెరీర్ లో అతి పెద్ద తప్పిదమని శశికళను వ్యతిరేకించే వర్గాలు అంటాయి. నివేదికలో ఉన్నవేంటీ? ♦జయలలిత డిసెంబరు 4న మరణిస్తే డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు. ♦జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేదానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొన్నారు. ♦వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు ఎందుకు చేయలేదో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ♦ఆమెకు సరైన వైద్యం అందలేదని కూడా అన్నారు. ♦జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది లగాయితు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీగానే ఉంది జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. శరీరంపై గాట్లేంటీ? జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి? ఏమైనా గాయాలా? గాయాలైతే ఎవరు చేశారు? అన్న అనుమానాలు చక్కర్లు తిరిగాయి. అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అన్నారు. అంతలోనే రాజకీయమా? జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళ నాట అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రజలకైతే నిజాలు కావాలి. జయలలితను జీవితాంతం ఆదరించిన అభిమానులకు ఏం జరిగిందో తెలియాలి. తమ అభిమాన నాయకురాలి మరణ వార్త వెనుక కుట్ర ఉందంటేనే వారు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తేనే వారికి కొంతైనా తృప్తి ఉంటుంది. -
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్‌కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
తమిళనాట శశికళకు మరో ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: తమిళనాడు పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు ఎంజీఆర్ బంధువులు షాక్ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. దీంతో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను రామాపురం తోటలోని పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎంజీఆర్ నివాసం ఆవరణలో నిర్వహించాలని శశికళ శిబిరం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అయితే, హఠాత్తుగా ఎంజీఆర్ బంధువులు చిన్నమ్మకు షాక్ ఇచ్చారు. రామాపురం తోటలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని, తాము అనుమతి ఇవ్వబోమ ని మంగళవారం తేల్చి చెప్పారు. దీంతో మరో వేదికను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మ మద్దతు దారులకు ఏర్పడింది. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి కేసుకు సంబంధించి చిన్నమ్మ శశికళ, మాజీ మంత్రి విజయ భాస్కర్, మాజీ సీఎస్ రామ్మోహన్‌రావును విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. నేపథ్యం ఇదీ.. అమ్మ జయలలిత 2016 డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను రంగంలోకి దిగింది. ఈ కమిషన్ రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. మంత్రి వర్గ సూచనలో.. ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు. ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్ రామమోహ్మన్ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ విచారణతో పాటూ ఆర్ముగ స్వామి కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. తూత్తుకుడి వ్యవహారం మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. -
పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు?
సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు క్యూలో.. చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్‌తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్ ప్రకటించారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు. చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
టోల్గేట్ సిబ్బందిపై 'చిన్నమ్మ' ఫైర్
చెన్నై : చిన్నమ్మ శశికళకు కోపం వచ్చింది. టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ రోడ్డుపై నిరసనకు దిగారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పురట్చి పయనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తృతంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ, మద్దతుదారుల్ని ఏకం చేస్తూ, తన బలాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి విల్లుపురం పర్యటన ముగించుకుని తిరుచ్చి వైపుగా బయలు దేరి వెళ్లారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వాహనాలతో కూడిన ఆమె ప్రైవేట్ కాన్వాయ్ తిరుచ్చి తువ్వాకుడి టోల్ గేట్‌కు చేరుకుంది. ముందుగా వెళ్లున్న వాహనం టోల్ ‘గేట్’ను దాటింది. అయితే, చిన్నమ్మ వాహనానికి అడ్డుగా గేట్ పడటంతో వివాదం రేగింది. ఆమె ఉన్న వాహనం అద్దాలను తాకుతూ గేట్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే టోల్ గేట్లో తనకు రెండుసార్లు అవమానం జరిగిందని, మరో మారు అదే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మద్దతుదారులు సైతం తగ్గేది లేదంటూ వాహనాలను రోడ్డు మధ్యలో ఆపేశారు. నిరసన.. బుజ్జగింపులు చిన్నమ్మ మద్దతుదారులు ఒక్క సారిగా టోల్గేట్ వైపు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది ప్రాణభయంతో పారిపోయారు. దీంతో టోల్లోని అన్ని గేట్లు మూత పడ్డాయి. వాహనాలు బారులు తీరడమే కాకుండా, కారులో నుంచి చిన్నమ్మ శశికళ నిరసనకు దిగారు. ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి చిన్నమ్మను, ఆమె మద్దతు దారులను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టోల్ గేట్ మేనేజర్ అమర్నాథ్ చిన్నమ్మకు క్షమాపణలు చెప్పినా చిన్నమ్మలో ఆగ్రహం తగ్గలేదు. తనపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొనడంతో చిన్నమ్మ శాంతించారు. గంట తర్వాత ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. ఇదీ చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు
సాక్షి , చెన్నై : ‘‘ప్రధాన కార్యదర్శి పదవి ఇంకా నా చేతుల్లోనే ఉండగా, ఆ పీఠం కోసం మీలో మీకు ఘర్షణలేల’’.. అని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీపై ఆధిపత్యం కోసం ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా, మధ్యలో శశికళ నేనున్నాంటూ వచ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుసుకుంటున్న చిన్నమ్మ విళుపురంలో మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ఏ ఒక్కరి సొత్తు, ప్రయివేటు సంస్థ కాదని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎంజీ రామచంద్రన్ ఆ పార్టీని స్థాపించారని ఆమె గుర్తు చేశారు. జయలలిత రాజకీయ జీవితంలో వెన్నంటి నిలిచిన కాలంలో ఆమె ఆనేక విషయాలు తనతో పంచుకున్నారని చిన్నమ్మ వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానేనని, ప్రజలు చూపిన మార్గంలో తాను పయనిస్తున్నానని చెప్పారు. కొత్తగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం వ్యక్తిగత హోదాలో కుదరదు, పార్టీ కార్యకర్తలే తీర్మానించాలని స్పష్టం చేశారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు, ద్రోహులను ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. అదును చూసి సరైన బదులిస్తానని వ్యాఖ్యానించారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి ఆ పదవుల కాలం చెల్లిపోలేదు : కోర్టు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామిల పదవీకాలం ముగిసిపోలేదని మద్రాసు హైకోర్టు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఆయా పదవుల్లో వారిద్దరూ కొనసాగుతున్నట్లేనని తెలిపింది. ఈనెల 11వ తేదీన తాము తలపెట్టినది సర్వసభ్య ప్రత్యేక సమావేశమని, పార్టీలో కన్వీనర్, కో కన్వీనర్ పదవులు ప్రస్తుతం లేవని ఎడపాడి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయానికి అదనపు బందోబస్తు.. అన్నాడీఎంకేలో వర్గపోరు రోజురోజుకూ వేడెక్కుతున్న దశలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ బందోబస్తును పెట్టింది. యధావిధిగా బందోబస్తులో ఉండే పోలీసులు కాకుండా ఎస్ఐ నేతృత్వంలో 10 మందితో కూడిన సాయుధ పోలీసులు బుధవారం రాత్రి నుంచి బందోబస్తుగా నలిచి ఉన్నారు. సర్వసభ్య సమావేశంలో గొడవలు లేవనెత్తేలా అసాంఘిక శక్తులు జొరబడకుండా ఎడపాడి పళనిస్వామి జాగ్రత్త పడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఆ పత్రికను స్కాన్ చేస్తేనే ప్రవేశం కల్పించేలా తీసుకున్న ఈ చర్యలు ఎడపాడి వర్గీలను సంతోష పెడుతుండగా, పన్నీర్ మద్దతుదారులు డీలాపడిపోయారు. పిల్‌పై రూ.25 వేల జరిమానా రెండాకుల గుర్తుపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన వ్యక్తిపై మద్రాసు హైకోర్టు రూ.25 వేల జరిమానా విధించింది. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై నిషేధం విధించాలని ఆ పార్టీ మాజీ నేత పీఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక వారపత్రికలో వార్త వచ్చింది. ఈనెల 11వ తేదీన జరగనున్న సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కోసం ఆయన మరో రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్‌ల మధ్య సాగుతున్న రాజకీయపోరు కులపరమైన పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ కారణంగా అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై నిషేధం విధించి పార్టీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’.. అని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనా«థ్ భండారీ, న్యాయమూర్తి ఆర్ మాలా బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. మీరసలు పార్టీ సభ్యులా అంటూ తొలుత ప్రశ్నించారు. ప్రచారం కోసం పిల్ వేసిన జోసెఫ్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు. -
అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు. జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్), ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్‌ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్ సైతం కోర్టు మెట్లెక్కారు. ముచ్చటగా మూడో నేత.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్‌సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు. చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య స్టే కోసం ఓపీఎస్ పిటిషన్ ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్‌బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్‌కోడ్‌తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్‌సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్‌సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం పంపడం విశేషం. -
సాక్షి కార్టూన్: 09-06-2022
జయలలిత అని పెట్టేసుకోండి మేడమ్! -
‘త్వరలో వస్తున్నా.. ఇక్కడే కదా ఉంటారు, వెయిట్ చేయండి’
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్త పర్యటనను త్వరలో ప్రారంభించి చురుకైన రాజకీయాల్లో దిగుతున్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళను ఇంకా పలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కేసు, విదేశీ మారకద్రవ్యం, కొడనాడు ఎస్టేట్, బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులకు రూ.2 కోట్ల లంచం కేసుల విచారణలో ఆమె తలమునకలై ఉన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి, అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం కోసం ఆమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి తిరుచ్చిరాపల్లికి ప్రయాణం అవుతూ విమానాశ్రయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్నానని వెల్లడించారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే క్రీయాశీలక రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులపై త్వరలో అప్పీలు చేస్తానని స్పష్టం చేశారు. కొడనాడు హత్య, దోపిడీ నేర ఘటనలపై ఎవైనా అనుమానాలు ఉన్నాయా ని మీడియా ప్రశ్నించగా బదులివ్వకుండానే వెళ్లిపోయారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ రణక్షేత్రంలో ఒంటరిగా దిగుతారా..? పార్టీలతో పొత్తపెట్టుకుంటారా అని ప్రశ్నించగా మీరంతా ఇక్కడే కదా ఉంటారు, వేచి చూడండి అంటూ బదులిచ్చారు. మీకు స్వాగతం చెప్పేవారిని టీటీవీ దినకరన్ బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతున్నదని ప్రశ్నించగా, ప్రస్తుతం ఆలయానికి వెళుతున్నా, తరువాత బదులిస్తానంటూ వెళ్లిపోయారు. -
చిన్నమ్మకు చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించడం సబబే అంటూ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. నేపథ్యం ఇదీ.. సుదీర్ఘకాలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశారు. తరువాత ఆ బాధ్యతల్లో శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఎంపికైనట్లు ఆపార్టీ 2016 డిసెంబర్ 19న ప్రకటించింది. ఇక ఆ తరువాత సీఎం సీటుపై కన్నేసిన జయలలిత శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక్కయ్యారు. అయితే అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకెళ్లారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్‌ను తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, ఉప కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్‌లో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆ తీర్మానాలు చెల్లవంటూ.. ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి సమక్షంలో జరగని (సర్వసభ్య సమావేశంలో) తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ శశికళ, దినకరన్ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ 2016లో చేసిన తీర్మానానికి పార్టీ సభ్యుల హోదాలో పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి బద్దులై ఉండాలని, కన్వీనర్, కో– కన్వీనర్ పదవులను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని శశికళ తన పిటిషన్లో పేర్కొన్నారు. శశికళ వేసిన పిటిషన్‌ను నిరాకరించాల్సిందిగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పార్టీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్నికల కమిషన్ సమర్ధించిందని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని.. న్యాయస్థానంలో శశికల అబద్ధమాడారని వివరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో సొంతగా పార్టీ స్థాపించినందున తాను వేసిన పిటిషన్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ మరో పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే సోమవారం విచారణ సాగింది. శశికళ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరిస్తున్నట్లు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుతుంది కాబట్టి ఆమె వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెన్నై సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జె. శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. సివిల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం.. సేలం: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడం సబబే అంటూ చెన్నై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని చిన్నమ్మ సోమవారం స్పష్టం చేశారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఆర్ధనారీశ్వర స్వామి ఆలయానికి శశికళ సోమవారం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారు, నవగ్రహాల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే తనకు ఆధారమన్నారు. ఎంజీఆర్ రూపొందించిన విధి విధానాల ఆధారంగా కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. దేశంలోని మరే పార్టీలోనూ ఈ షరతు లేదని, అన్నాడీఎంకే విధి విధానాల్లో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. -
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్‌లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు.