టీ.నగర్: సత్ప్రవర్తన కింద శశికళ (చిన్నమ్మ)ను ముందస్తుగా విడుదల చేయడం వీలుకాదని ఐజీ రూప మంగళవారం వెల్లడిం చారు. అన్నాడీఎంకే హయాం (1991–96)లో జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు గత 2017 ఫిబ్రవరి 14న తీర్పు నిచ్చింది. జయ మృతిచెందిన స్థితిలో శశికళ, ఇళవరసి, సుధారన్ అనే ముగ్గురిని నిందితులుగా సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. విచారణ కోర్టు అందజేసిన నాలుగు ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసి శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే ముగ్గురు 2017 ఫిబ్రవరి 15న బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నిర్బంధించారు. ఇలావుండగా ఈ ముగ్గురు జైలు నిర్బంధానికి గురై రెండున్నర ఏళ్లు కావస్తున్నది. సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పబడింది. దీనిగురించి కర్ణాటక జైళ్లశాఖ అధికారి రూప మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నేరస్తులను సత్ప్రవర్తన కారణంగా ముందస్తుగా విడుదల చేసే అవకాశం ఉందని, అయితే శశికళ విషయంలో ఇది వీలుకాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment