Rupa
-
శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ
ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు దిల్నా, రూపా అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్వి తారిణి పేరున్న సెయిల్ బోట్లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.ఐదు అంచెల యాత్రయాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్ బోట్ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. ⇒ గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ 3. న్యూజిల్యాండ్ నుంచి ఫాక్‌ల్యాండ్ ఐలాండ్స్ (దక్షిణ పసిఫిక్ సముద్రం) 4.ఫాక్‌ల్యాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా 5. సౌత్ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా సారథ్యం వహిస్తున్నారు.మైక్రోప్లాస్టిక్స్‌పై పరిశోధన‘నావికా సాగర్ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్ ముందు భాగంలో మాస్ట్సెయిల్స్ ఉంటాయి.వెనుక భాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్వో ప్లాంట్ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టం సైతం బోట్లో ఉన్నాయి. బోట్ తయారీలో అధికభాగం ఫైబర్ గ్లాస్‌ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్ విధానం ద్వారా ట్రాక్ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో ‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్పాన్ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్‌సాగన్ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఈ సందర్భంగా.అమ్మ చేసిన ఊరగాయలతో‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్‌ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్ చిప్స్, టాపియోకా చిప్స్ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం -
NAVIKA SAGAR PARIKRAMA II: కడలి అలలిక వాళ్ల కాళ్ల కింద...
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి. ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.→ ఆటల నుంచి సాగరంలోకి...‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.→ నన్ను నేను తెలుసుకోవడమే‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.→ కఠిన శిక్షణ‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. 56 అడుగుల సెయిల్ బోట్. 40000 కిలోమీటర్ల దూరం250 రోజుల ప్రయాణంరాకాసి అలలు... భీకరగాలులువీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్కు చెందిన డెల్నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి... -
భర్తకు ఫోన్ చేసి...!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ /అల్వాల్ /గాం«దీఆస్పత్రి/మేడ్చల్: రూపాదేవి(40) తన భర్త ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగానే రూపాదేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ డోర్ తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తీయగా, అప్పటికే రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.చనిపోవడానికి ముందు తన కూతురు భర్తతో మాట్లాడిందని భూలక్ష్మమ్మ చెప్పింది. విషయంగా తెలియగానే నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన తనే కారు నడుపుకుంటూ సిటీకి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యంను మార్యమధ్యలో ఆపి, ఆస్పత్రికి తన కారులో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు.దీంతో ఆయనకు ఆదే ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూపాదేవి అంత్యక్రియలు శుక్రవారం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గధామంలో జరిగాయి. గురువారం రాత్రి నుంచి రూపాదేవి అంత్యక్రియలు అయ్యే వరకు పొన్నం ప్రభాకర్ సత్యం వెంటే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సుద్దాల దేవయ్య తదితరులు మేడిపల్లి సత్యంను పరామర్శించారు.పీజీ చదువుతుండగా ప్రేమలో... రంగారెడ్డి జిల్లాకు చెందిన రూపాదేవి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యంలది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న సత్యం దంపతుల కాపురం అన్యోన్యంగా సాగింది. వీరికి కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక (9)లు ఉన్నారు. వృత్తిరీత్యా రూపాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వికారాబాద్ నుంచి మేడ్చల్ మండలంలోని రావల్కోల్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. రెండు నెలల క్రితం అల్వాల్ పంచశీల కాలనీకి నివాసం మార్చారు. గురువారమే బయల్దేరిన సత్యం.. చొప్పదండిలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలాకాలంగా ప్రయతి్నంచిన సత్యం 2014, 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2023లో ఎట్టకేలకు విజయం సాధించారు. సత్యం కరీంనగర్‌లోని వీపార్క్ సమీపంలో నివాసముంటున్నారు. భార్య టీచర్ కావడంతో పిల్లలతో కలిసి అల్వాల్‌లోనే నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే అల్వాల్ నుంచి సత్యం చొప్పదండి చేరుకున్నారు. రోజంతా నియోజకవర్గ పరిధిలోని మల్యాల మండలంలో షాదీముబారక్ చెక్కుల పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకటి రెండుసార్లు మినహా.. సత్యం ఎమ్మెల్యే అయ్యాక రూపాదేవి నియోజకవర్గంలో చాలా తక్కువగా కనిపించేవారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో, కొండగట్టు సమీపంలోని నల్లగొండ ఆలయంలో మొక్కులు అప్పజెప్పిన సమయంలో సత్యం సతీసమేతంగా కనిపించారు. ఫిబ్రవరి 23న కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు నరేశ్ దంపతుల నాలుగు నెలల చిన్నారికి గుండె చికిత్సకు రూ.లక్ష అందజేసిన సమయంలో రూపాదేవి సత్యంతో కలిసి వచ్చారు. ఇటీవల సత్యం దంపతులు, కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రూపాదేవి సోదరుడు తోట అనిల్ కూడా ఎమ్మెల్యే సత్యం వద్దనే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ఆమె అనారోగ్యమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రావల్‌కోల్‌లో విషాదఛాయలు మేడ్చల్ మండలం రావల్కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూపాదేవి రెండేళ్లుగా సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మరణవార్తతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూల్లో ఏనాడు రూపాదేవి వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు కాదని, పేద పిల్లలు బాగా చదవాలని ఆరాటపడేవారని, తోటి ఉపాధ్యాయులు చెప్పారు. రావల్‌కోల్‌కు చెందిన ఓ విద్యారి్థని చదువుకు కూడా ఆమె ఆర్థికసాయం చేశారు. మూడురోజుల క్రితమే సెలవు పెట్టారని, అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారుతున్నానని తనతో చెప్పారని హెచ్ఎం తెలిపారు. గాంధీలో పోస్టుమార్టం రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించింది. చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ భద్రత ఏర్పాట్లు పర్య వేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు గాం«దీమార్చురీకి చేరుకుని రూపాదేవి మృతదేహం వద్ద నివాళులరి్పంచి మేడిపల్లి సత్యం, కుటుంబసభ్యులను పరామర్శించారు. -
నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!
బాల్య వివాహాల కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చిదిగిపోతున్నాయి. వయసుకు మించిన కుటుంబ బాధ్యతలతో అనారోగ్యం పాలై జీవితాలను కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని కట్టడి చేసేలా చట్టాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా భారత్‌లోని ఇంకా కొన్ని గ్రామాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే రూపా యాదవ్ అనే మహిళకు ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లైపోయింది. నిజానికి రూపా చిన్ననాటి నుంచే మంచి మెరిటి స్టూడెంట్ కావడంతో ఉన్నత చదువులు చదవాలని ఎన్నో కలలకు కంది. కానీ ఈ పెళ్లితో తన ఆశలన్నీ కల్లలైపోకుండా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అనుకున్నది సాధించింది. పైగా తన గ్రామానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది.రాజస్థాన్‌లోని కరిరి అనే చిన్న గ్రామానికి చెందిన రూపా యాదవ్ ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వివాహం అయిపోయింది. ఆమె పెదనాన్న రూపా మామాగారి ఇద్దరు కొడుకులకు తనను, ఆమె అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని వాగ్దానం చేశారు. దీంతో రూపాకి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. అయితే రూపా తండ్రికి ఆమెను బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ తన అన్న ఇచ్చిన మాట కారణంగా ఏమి చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే ఆమె చిన్నిపిల్ల కావడంతో మెచ్యూర్ అయ్యేంత వరకు పుట్టింట్లోనూ ఉండేలా పెద్దలు నిర్ణయించడంతో పదోతరగతి వరకు పుట్లింట్లో హాయిగా నిరాటకంగా చదువుకుంది. పదోతరగతిలో ఏకంగా 86 శాతం మార్కులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ గ్రామంలో ఎవరికి ఇన్ని మార్కులు రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా రూపాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. అంతేగాదు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. బాగా చదివించమని గ్రామ ప్రజలంతా రూపా తండ్రిని ప్రోత్సహించారు. ఇంతలో రూప పెద్ద మనిషి అవ్వడం అత్తారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరగడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఇక్కడితో ఆమె చదువు ఆగిపోతుందని తండ్రి బాగా దిగులు చెందాడు. అయితే రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వమని ఆమె తండ్రికి హామి ఇచ్చారు.ఆ వాగ్దానాన్ని రూపా మెట్టినిల్లు నిలబెట్టుకుంది. అప్పులు చేసి మరీ ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా చేస్తున్నందుకు సమజం నుంచి హేళనలు, అవమానాలు ఎదురయ్యేవి కూడా. అయినా వాటిని పట్టించుకోకుండా కోచింగ్ క్లాస్‌లకు పంపించి మరి మంచి చదువులు చదివించారు. అలా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో చేరి చదువుకుంటూ నీట్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అయ్యింది. ఆమె ఫీజుల కోసం రూపా భర్త, బావగారు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చేది కూడా. అంతలా రూపాకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సహం లభించింది. వారి ప్రోత్సహానికి తగ్గట్టుగానే రూపా బాగా చదివి నీట్లో పాసై బికినీర్‌లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందింది. అలా తన తన అత్తమామలు, భర్త, బావగారి సాయంతో డాక్టర్ అవ్వాలనే కలను సాకారం చేసుకుంది. ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సును ఆ కళాశాలలో సాగిస్తుండగా..రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఇంటి వచ్చాక మూడో ఏడాది ఫైనల్ పరీక్షల టైంలో ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆమె ఇంకా రెండేళ్ల చదువు సాగించాల్సి ఉంది. అయినా ఆమె చదువుని, మాతృత్వాన్ని రెండింటిని వదులుకోకుడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఫైనలియర్ పరీక్షల టైంలో రూపా కుమార్తె వయసు కేవలం 25 రోజులు. అలానే బాలింతరాలిగా కాలేజ్‌కి వచ్చి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యింది. తన కూతురు పుట్టిన రోజున శస్త్ర చికిత్సకు సంబంధించిన చివరి పరీక్ష..మూడు గంటల్లో పరీక్ష రాసి వచ్చి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకుంది రూపా. ఎక్కడ అటు కుటుంబ బాధ్యతలను, కెరీర్ పరంగా తన చదవుకి ఆటంకం రానివ్వకుండా రెండింటిని చాలచక్యంగా బ్యాలెన్స్ చేసింది. అలా ఆమె 2022లో సర్టిఫైడ్ డాక్టర్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సన్నద్దమవుతూనే డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుంది. ఈ మేరకు రూపా మాట్లాడుతూ..మనం కోరుకున్నది చేయాలి అనుకుంటే ఎలాంటి స్థితిలోనూ వదిలిపెట్టని పట్టుదల ఉంటే అనుకున్నది సాకారం చేసుకోగలరు. అంతేగాదు ఆ పట్టుదలే ఆ ఆటంకాలు, అవాంతరాలని పక్కకు పోయేలా చేస్తుంది అని చెబుతోంది రూపా యాదవ్. చివరిగా ఎవ్వరికీ ఏది కష్టం కాదని, ప్రతిఒక్కరూ అన్ని సాధించగలరని అందుకు తానే ఓ ఉదాహరణ అని అంటోంది రూపా. రియల్లీ రూపా గ్రేట్ కదూ.! తన కలను సాకారం చేసుకుంది, అలాగే తన అత్తమామలకు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తెచ్చుకుంది.(చదవండి: సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్! కోచింగ్ లేకుండా తొలి..) -
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
లోదుస్తులకు ‘బ్రాండెడ్’ మార్కెట్..‘రూప’తో కమాల్..!
లోదుస్తుల తయారీకి సంఘటిత మార్కెట్‌ను ఏర్పాటు చేసిన సంస్థగా రూప అండ్ కంపెనీని చెప్పుకోవాలి. అప్పటి వరకు చాలా చిన్న కంపెనీలే లోదుస్తులను తయారు చేసి, స్థానికంగా మార్కెట్ చేసుకునేవి. దీంతో బ్రాండెడ్ లోదుస్తులతో కస్టమర్ల మనసు గెలవాలన్న ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్ ఆలోచనే.. 1969లో కోల్‌కతా కేంద్రంగా రూప అండ్ కంపెనీ ఏర్పాటుకు పునాది పండింది. ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్‌తోపాటు ఘనశ్యామ్ ప్రసాద్ అగర్వాల్, కుంజ్ బిహారి అగర్వాల్ సంయుక్తంగా కంపెనీని స్థాపించారు. నేడు దేశంలోనే అతిపెద్ద లోదుస్తుల బ్రాండ్ ఇది. రూప బ్రాండ్‌తో తొలుత లోదుస్తుల తయారీని చేపట్టినా, ఆ తర్వాత వింటర్వేర్, కిడ్స్‌వేర్, ఫుట్‌వేర్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. జాన్, ఫ్రంట్‌లైన్, యూరో ఇలా 18 పాపులర్ బ్రాండ్లు ఈ కంపెనీకి ఉన్నాయి. ‘‘నాణ్యమైన, బ్రాండెడ్ ఇన్నర్‌వేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని మాకు అనిపించింది. దీంతో ‘రూప’ పేరుతో సొంత బ్రాండ్ ఏర్పాటు చేశాం. అంతే ఇంక వెనుదిరిగి చూసింది లేదు. కస్టమర్లకు మంచి అనుభవాన్ని ఇస్తూ మార్కెట్‌ను పెంచుకున్నాం’’ అని వ్యవస్థాపకులు చెప్పారు. 2020–21లో రూ.1,311 కోట్ల టర్నోవర్‌ను ఈ సంస్థ నమోదు చేసింది. చదవండి: వీధి కుక్కలు.. శంతన్‌నాయుడు.. రతన్‌టాటా.. ఓ ఆసక్తికర కథ ! -
రూ. 620 కోట్ల ప్రాజెక్టు: ఐపీఎస్‌ల మధ్య వార్!
బెంగళూరు: నిర్భయ పథకం కింద చేపట్టిన బెంగళూరు సేఫ్ సిటి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఐపీఎస్ అధికారిణి రూపా ఆరోపణలను నగర అదనపు పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్ కొట్టిపారేశారు. తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని, ఎవరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. టెండరింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. కాగా మహిళలు, చిన్నారుల భద్రత పర్యవేక్షణకై 7 వేలకు పైగా సీసీటీవీల ఏర్పాటు సహా ఇతర సురక్షిత చర్యలకై సుమారు రూ. 620 కోట్ల భారీ వ్యయంతో బెంగళూరు సేఫ్ సిటి ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించే, స్క్రూటినీ చేసే కమిటీకి హేమంత్ నింబాళ్కర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో ఒక కంపెనీకి హేమంత్ అనుకూలంగా పనిచేస్తున్నారంటూ రూపా సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన హేమంత్ నింబాళ్కర్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘జనవరి 8 నాటికి టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడే ఎవరు టెండర్ వేశారన్న విషయంపై ఒక స్పష్టత వస్తుంది. ఇదొక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. టెండరింగ్‌కు సంబంధించి కొందరికి లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. టెండర్ల విషయంలో మేం పూర్తి పాదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ప్రతీ అంశాన్ని రికార్డు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్రమ పద్ధతుల్లో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి కీలక విషయాలు సేకరిస్తున్నారంటూ రూపాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. సాంకేతిక అర్హత పొంది తక్కువ ధరకు నమోదు చేసిన వారికే బిడ్ దక్కుతుందని స్పష్టం చేశారు. ఇక ఇందుకు రూపా సైతం దీటుగా బదులిచ్చారు. ఈ మేరకు.. ‘‘హేమంత్ నింబాళ్కర్, ఐపీఎస్, నిర్భయ టెండర్ ఇన్వైటింగ్ కమిటీ, టెండర్ స్క్రూటిని కమిటి చైర్మన్ ఈరోజు అంటే 27.12.20న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని, ప్రసార మాధ్యమాలు, ప్రజలను తప్పుదోవపట్టించేలా మరోసారి అసత్యాలు చెప్పారు’’ అని ప్రకటన విడుదల చేశారు. కాగా టెండర్ల విషయంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.(చదవండి: రూ.250 భోజనం ఆర్డర్.. రూ.50 వేలు మాయం) -
చిన్నమ్మ విడుదల వీలుకాదు
టీ.నగర్: సత్ప్రవర్తన కింద శశికళ (చిన్నమ్మ)ను ముందస్తుగా విడుదల చేయడం వీలుకాదని ఐజీ రూప మంగళవారం వెల్లడిం చారు. అన్నాడీఎంకే హయాం (1991–96)లో జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు గత 2017 ఫిబ్రవరి 14న తీర్పు నిచ్చింది. జయ మృతిచెందిన స్థితిలో శశికళ, ఇళవరసి, సుధారన్ అనే ముగ్గురిని నిందితులుగా సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. విచారణ కోర్టు అందజేసిన నాలుగు ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసి శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే ముగ్గురు 2017 ఫిబ్రవరి 15న బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నిర్బంధించారు. ఇలావుండగా ఈ ముగ్గురు జైలు నిర్బంధానికి గురై రెండున్నర ఏళ్లు కావస్తున్నది. సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పబడింది. దీనిగురించి కర్ణాటక జైళ్లశాఖ అధికారి రూప మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నేరస్తులను సత్ప్రవర్తన కారణంగా ముందస్తుగా విడుదల చేసే అవకాశం ఉందని, అయితే శశికళ విషయంలో ఇది వీలుకాదన్నారు. -
మరో రూప కథ
చాలా సందర్భాల్లో... చాలా కుటుంబాల్లోసంబంధం కలుపుకునే ప్రహసనం... సహనం చచ్చేలా ఉంటుంది.అత్తామామల ఆంక్షలు పాము బుసల్లా వినిపిస్తుంటాయి.రూల్ నంబర్ వన్... ‘ఇకపై నువ్వు ఉల్లి, వెల్లుల్లి తినకూడదు!’తాను తినడం తినకపోవడం వేరే సంగతి. కానీ...ఒక విషయాన్ని ఆంక్షలాగా భరించాల్సి వస్తే ఆ మాటలు వెల్లుల్లి కంటే ఘాటుగా ఉంటాయి. ‘పవిట ఎప్పుడూ తలమీదే ఉండాలి. రూల్ నెంబర్ రెండుతో అతి పల్చటి ఆ కొంగు టన్నులకొద్దీ బరువనిపించవచ్చు. కొంగు బంగారమైతే ఓకేగానీ... భారమైతే ఎలా?విషయం ఏంటంటే... ‘పెళ్లికాగానే ఉద్యోగం మానేయాలి’... అనే‘మంచి కాఫీలాంటి ఓ సినిమా’లోని సంఘటనేఅచ్చంగా ఆ అమ్మాయి జీవితంలోనూ చోటుచేసుకుంది.సినిమాలోని ‘మంచి కాఫీ’ రుచి నిజ జీవితంలో ‘చేదు’గా పరిణమించినఓ యువతి నిజమైన కథ ఇది. ‘ఆనంద్’.. మంచి కాఫీలాంటి సినిమా.. గుర్తుండే ఉంటుంది. అందులో కథానాయిక.. రూపను ఎప్పటికీ మర్చిపోలేం. ఆత్మగౌరవం, సొంత వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్లా మరిచిపోదు. రూప.. కునాల్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కునాల్ కూడా అంతే ప్రేమిస్తాడు రూపని. ఆమె బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటుంది ఓ కార్ యాక్సిడెంట్లో. కునాల్‌కు అమ్మ ఉంటుంది. అమ్మకు రూప గురించి చెప్తాడు. వాళ్లిద్దరి పెళ్లికి ఆమె ఒప్పుకుంటుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.రూప ఇండివిడ్యువాలిటీ ఉన్న అమ్మాయి. ఇండిపెండెంట్. పెళ్లికి ముందు నుంచే అత్తగారు ఆమె మీద పెత్తనం చేయడం మొదలుపెడ్తుంది. ‘‘నాకే కాదు.. మా బంధువులకూ కాళ్లు మొక్కాలి... ఎర్ర చీరే కట్టుకోవాలి.. నెమ్మదిగా మాట్లాడాలి.. తల వంచుకునే ఉండాలి.. భర్తకే కాదు.. పెద్దవాళ్లెవరికీ ఎదురు చెప్పకూడదు.. మేము తినే వంటలే వండాలి.. రాకపోతే నేర్చుకోవాలి.. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకూడదు..’’ వంటి అత్తగారి ఉత్తర్వుల జాబితా పెద్దగానే ఉంటుంది. అన్నిటికీ కునాల్ వంక చూస్తుంది రూప. ‘సర్దుకుపో’ అన్నట్టు చూడ్డమే కాదు.. చెప్తాడు కూడా! హతాశురాలవుతుంది రూప. వాళ్లమ్మ ఇన్వాల్వ్ కాకముందు వరకు తన అభిప్రాయాలకు విలువ ఇచ్చిన మనిషి, తన వ్యక్తిత్వాన్ని గౌరవించిన మనిషి.. తన మనిషి... ఇప్పుడు ఇలా అమ్మ మాటకు వంత పాడడం ఆమెకు వింతగా అనిపించింది. ఆత్మగౌరవానికి ఇబ్బందిలేని చాలా విషయాల్లో సర్దుకుపోవాలనే ప్రయత్నిస్తుంది.. కాని తనకు ఆత్మగౌరవమే ఉండకూడదు అన్న అత్తగారి అభిప్రాయం, ప్రవర్తనతో రాజీ పడకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఆ విషయంలో కునాల్ సపోర్ట్ చేస్తాడనీ ఆశిస్తుంది. కాని అతనూ అమ్మ మాటే వినాలి అనేసరికి కునాలే తనకు సరైనవాడు కాదని అతనితో పెళ్లి వద్దనుకుంటుంది.తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ అప్రస్తుతం.. అందుకే ఈ కథను ఇక్కడ ఆపేసి.. దీన్ని పోలిన ఓ నిజ జీవిత గాథను చెప్పుకుందాం. ఫేస్‌బుక్‌లోని ‘‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’’ పేజీలో రూపలాంటి అమ్మాయే (అందులో ఆమె తన పేరును ప్రస్తావించలేదు) తన రియల్ లైఫ్ స్టోరీని షేర్ చేసింది. ఆమె మాటల్లోనే..‘‘ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అనుభవ్‌ను చూశాను.అతని చదువు, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ నచ్చాయి. అతనికీ నా చదువు, ఉద్యోగం. బ్యాక్‌గ్రౌండ్ అన్నీ నచ్చాయి. అతను ఢిల్లీ బేస్డ్.. కాని ఉద్యోగం మాత్రం బాంబేలోనే. అతను పనిచేసే ఆఫీస్, మా ఆఫీస్‌కు దగ్గర్లోనే. కలిసిమాట్లాడాలనుకున్నాం. కలిశాం.. దాదాపు ఆరు గంటలు మాట్లాడుకున్నాం. మా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మొదటి అమ్మాయిని నేనే. కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతాను. గర్వంగా కూడా ఉంటుంది. సో.. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలి.. చేస్తాను. ఈ మాటను అనుభవ్తోనూ చెప్పాను. ‘‘వై నాట్..’’ అన్నాడు. నా ఇండిపెండెన్స్‌ను, నా వ్యక్తిత్వానికి సంబంధించి ఇంకా చాలా విషయాలను గౌరవించాడు. పెళ్లి తర్వాతా నేను నాలాగే ఉండొచ్చు అన్నాడు. నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికాడని సంతోషడ్డా. మా పెళ్లికి మా ఇద్దరికీ వేరే ఆబ్జెక్షన్స్ ఏవీ కనిపించలేదు. మా ఇద్దరి పేరెంట్స్ మీటింగ్‌నీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అనుభవ్ తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి రావడం కష్టమవడంతో మా పేరెంట్స్‌నే ఢిల్లీ తీసుకెళ్లా. వాళ్లను కలిసిన మరుక్షణం నుంచే.. అనుభవ్ వాళ్ల నాన్న చెప్పడం మొదలుపెట్టాడు.. పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో! తమింటి కోడలు ఫలానా విధంగా ఉండాలని ఆయనకు కొన్ని అభిప్రాయాలున్నాయట.పెళ్లయిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి తినడం మానేయాలని, ఉద్యోగం మానేసి ఢిల్లీలో అత్తామామలతోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిలో రాత్రి ఎనిమిదింటికి వాళ్లతో కలిసి నేను డిన్నర్ చేయాలనీ, యేడాదిలోపు బిడ్డను కనాలని.. ఇలాంటి చాంతాడంత లిస్ట్ చదివాడు. నేను కాదు.. మా పేరెంట్సూ షాక్ అయ్యారు. ఎంగేజ్మెంట్ కాలేదు. రెండు కుటుంబాల మధ్య క్లోజ్‌నెస్ పెరగలేదు.. కనీసం పరిచయమూ పాతబడలేదు.. నేను ఆ ఇంటి బానిసనైపోయినట్టు ఆర్డర్లు వేస్తూనే ఉన్నాడు. చివరకు మేం ఆ గదిలోంచి బయటకు వచ్చేశాం అనుభవ్‌తో కూలంకషంగా చర్చించాలని. దాంతో అనుభవ్నూ బయటకు పిలిచాం. మేం ఏం చెప్పబోతున్నామో అతనికి అర్థమై .. వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడాడు. నన్ను లోపలికి పిలిచాడు. కాబోయే భార్యాభర్తలుగా పెళ్లి తర్వాత మేం ఎలా ఉండాలో మమ్మల్ని డిసైడ్ చేసుకోనివ్వండి.. ఆ స్పేస్ ఇవ్వండి అని అనుభవ్ వాళ్ల అమ్మను రిక్వెస్ట్ చేశా. అది ఆమెకు ధిక్కారంగా.. అమర్యాదగా అనిపించిందట. నచ్చలేదట. తెల్లవారి మేం ముంబై ప్రయాణమయ్యాం. వారం తర్వాత..! అనుభవ్ ముంబై వచ్చాడు. కలిశాను. జరిగినదాని మీద చర్చించుకున్నాం. విస్తుపోయాను ఆయన మాటలు విని. మ్యాట్రిమోనియల్లో చూసి.. కలిసి.. మాట్లాడింది ఇతనితోనేనా? ఇతనేనా పెళ్లి తర్వాత కూడా నేను నేనులాగే ఉండొచ్చు అని చెప్పింది.. ఇతనేనా నా స్వతంత్య్ర వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్తున్నాను.. గౌరవిస్తున్నాను అని చెప్పింది? ఇతనేనా నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి అని అనిపించింది. ముంబై వచ్చాక అతను చెప్పిన మొదటి మాట.. ‘‘పెళ్లయ్యాక నువ్ జాబ్ మానేయాలి’’ అని. తర్వాత చెప్పిన నిజాలు.. ‘‘నాకు మా పేరెంట్స్‌తో కలిసి ఉండడం ఇష్టం. పెళ్లయ్యాక మనం ఢిల్లీలోనే ఉంటాం. నీకన్నా నా సంపాదనే ఎక్కువ కాబట్టి.. నీ కెరీర్ మీద కాంసంట్రేట్ చేయాల్సిన పనిలేదు నీకు. అదీగాక.. త్వరలోనే నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా.. అందుకని.. నీకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ లేదు. హాయిగా మా పేరెంట్స్‌ని, ఇంటిని చూసుకో చాలు. ఇక ఉల్లి, వెల్లుల్లి మానేయడం పెద్ద ఇష్యూ కాదు. అవి లేకుండా కూడా భోజనం చాలా రుచిగా ఉంటుంది’’ అన్నాడు. నిజమే ఉల్లి, వెల్లుల్లి మానేయడం ఏమంత బిగ్ డీల్ కాకపోవచ్చు. కాని ఆ ఇంట్లో వాళ్ల మెదళ్లలో ఈ డోంట్స్.. ఉల్లివెల్లుల్లితోనే ఆగిపోలేదు.. ఆగిపోవు కూడా!‘‘నేను అతనితో పెళ్లికి నో చెప్పా! నా వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి నాకు కావాలి.. జీవితంలో మోర్ అచీవ్మెంట్స్కి సపోర్ట్ ఇచ్చే లైఫ్ పార్టనర్ కావాలి కాని.. కిందకు తోసే భర్తకాదు. పెళ్లి లేదా కెరీర్ అని ఎంచుకునే చాయిస్ అమ్మాయిలకే ఎందుకు? ఇదేం న్యాయం?’’ అంటూ ప్రశ్నిస్తోంది ఆ అమ్మాయి! పెళ్లి లేదా కెరీర్.. ఏదో ఒకటే! నిజమే అమ్మాయిలకే ఎందుకు ఇలా చాయిస్ పెడ్తారు? పెళ్లి తర్వాతా అబ్బాయి కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా.. అలాగే అమ్మాయి విషయంలోనూ ఎందుకు ఆలోచించరు? అబ్బాయికి సపోర్ట్‌గా నిలిచినట్టే అమ్మాయికి ఎందుకు నిలబడరు?ఒక మాట్రిమోనియల్ యాడ్‌లో.. కొడుకు, కోడలిని చూడ్డానికి వస్తారు తల్లిదండ్రులు. పొద్దున్నే కోడలు ఆఫీస్‌కు వెళ్లిపోతోంది ఆదరాబాదరాగా. సాధ్యమైనంత వరకు పెద్దవాళ్లతో అబ్బాయే గడుపుతుంటాడు. ఇది చూసి ఆ అబ్బాయి తండ్రి ‘‘ఒరేయ్.. నువ్వు బాగానే సంపాదిస్తున్నావ్ కదరా.. ఇంకా అమ్మాయి ఉద్యోగం చేయడం అవసరమా?’’అని అడుగుతాడు. ‘‘అవసరం కాదు నాన్నా.. ఆమె ఆసక్తి’’ అని వాళ్ల నాన్నకు చెప్తాడు.మాట్రిమోనియల్ ద్వారా వాళ్ల సంబంధం కుదిరినప్పుడు ఆమె .. అతనితో అంటుంది.. పెళ్లయ్యాక కూడా నేను ఉద్యోగం చేస్తాను.. అని. దానికి ఆయన సరే అంటాడు. అనడమే కాదు పెళ్లయ్యాక ఆ మాటను నిలబెట్టుకుని భార్యను గౌరవిస్తాడు.. తద్వారా తనను తాను గౌరవించుకుంటుంటాడు! ఇది సదరు మాట్రిమోనీ గిరాకీని పెంచే ఒక ప్రకటన మాత్రమే కాదు.. ఈ తరం అబ్బాయిలు.. వాళ్ల తల్లిదండ్రులు మారాలని చెప్పే సూచన కూడా! – సరస్వతి రమ ►కాబోయే భార్యాభర్తలుగా పెళ్లి తర్వాత మేం ఎలా ఉండాలో మమ్మల్ని డిసైడ్ చేసుకోనివ్వండి.. ఆ స్పేస్ ఇవ్వండి అని అనుభవ్ వాళ్ల అమ్మను రిక్వెస్ట్ చేశా. అది ఆమెకు ధిక్కారంగా.. అమర్యాదగాఅనిపించిందట. ►నా వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి నాకు కావాలి.. జీవితంలో మోర్ అచీవ్మెంట్స్కి సపోర్ట్ ఇచ్చే లైఫ్ పార్టనర్ కావాలి కాని.. కిందకు తోసే భర్తకాదు. పెళ్లి లేదా కెరీర్ అని ఎంచుకునే చాయిస్ అమ్మాయిలకే ఎందుకు? ఇదేం న్యాయం? -
సెల్ఫీ విక్టరీతో బ్యాంక్ ఖాతా ఖాళీ..
యశవంతపుర: సెల్పీ తీసుకోవటం వరకు బాగానే ఉంది. కానీ చేతి వేళ్లను ఎందుకు చూపిస్తారో తెలియటంలేదు. అదే వేలి ముద్రలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులకు కోత పడుతుందని ఐపీఎస్ అధికారి డి.రూపా నెటిజన్లను హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకొనేటప్పుడూ ఎవరూ కూడా వేలిని చూపించి సెల్ఫీ తీసుకోవద్దంటూ హెచ్చరిస్తూ తను మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమం ట్విట్టర్లో ఆప్‌లోడ్ చేశారు. అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ విక్టరీ మార్కులో రెండు వేళ్లను చూపించి సెల్ఫీలను తీసుకుంటున్నారు. మరికొందరు బొటన వేలును చూపిస్తూ డన్ అనే సంకేతంతో ఫొటోలు దిగుతున్నారు. ఇలా ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటం కూడా తప్పే. ఇలా సామాజిక మాధ్యమాలలో వేలి ముద్రలను చూపుతూ పాలు పంచుకోవటం చాలా ప్రమాదమని రూపా తన వీడియోలో హెచ్చరించారు. ప్రస్తుతం అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్లోడు అవుతున్న ఫోటో వేలి ముద్రతో అదే మాదిరిలో నకిలీని సృష్టించి బ్యాంక్ ఖాతా తెరిచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా వీడియో తీసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటంపై ప్రశంసలు వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోండి.. పర్వాలేదు, అయితే చేతి వేళ్లను చూపించే పద్దతి వద్దని ఆమె నెటిజన్లకు ఆమె సలహా ఇచ్చారు. రూ. 4.50 లక్షల నగదు చోరీ యశవంతపుర : రాజాజీనగర 22వ క్రాస్‌లో దొంగలు తెగబడ్డారు. ఇక్కడ ఓ వ్యక్తి దుకాణం ఏర్పాటు చేశారు. ఐస్‌క్రీం, జ్యూస్, కాఫి, టీ పొడులకు సంబంధించి వివిధ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దుండగులు షట్టర్ ఎత్తి లోపలకు చొరబడి రూ. 4.50 లక్షల నగదును దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
క్షమాపణ చెప్పకపోతే రూ.50 కోట్లకు దావా
డీఐజీ రూపకు కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీజీపీ లీగల్ నోటీసులు సాక్షి, బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాల వివాదం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీపీ సత్యనారాయణరావ్ ప్రస్తుత బెంగళూరు నగర ట్రాఫిక్ కమిషనర్, జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప మౌద్గిల్‌కి బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు మూడ్రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. సెంట్రల్జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ నుంచి రూ.2 కోట్ల ముడుపులు తీసుకుని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని సత్యనారాయణరావ్పై రూప ఇటీవల ఆరోపణలు చేయడం, సర్కారుకు నివేదికలు పంపడం తెలిసిందే. -
విశాఖ అమ్మాయి గుంతకల్లులో ప్రత్యక్షం
గుంతకల్లు : తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదిలి వచ్చిన విశాఖపట్నం సమీప వాలే్తరు గ్రామానికి చెందిన రూప (22) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల చొరవతో క్షేమంగా తల్లితండ్రుల వద్దకు చేరింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 14 గాయపడి అపస్మారకస్థితిలో గుంతకల్లు రైల్వే స్టేషన్లో పడి ఉన్న రూపను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. 108 వాహనంలో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. వైద్యులు ఆమె వివరాలను ఆరా తీశారు. తన పేరు, స్వగ్రామం తెలిపింది. రైలులో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చి పడిపోయానని చెప్పింది. వైద్యులు కళ్యాణ్, ప్రవీణ్ ఆమె ఫొటోను వాట్సాప్ ద్వారా విశాఖపట్నంలోని తమ స్నేహితులకు పంపారు. ఈ సమాచారం యువతి తల్లిదండ్రులు అప్పారావు, సుగుణకు చేరడంతో ఆదివారం వారు గుంతకల్లు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె తండ్రి విశాఖపట్నంలోని రైల్వే కార్యాలయంలో కమర్షియల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ తన కుమార్తెకు మేనమామతో పెళ్లి నిశ్చయం చేశామన్నారు. ఆ అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో రూప మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితిలో ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిందని వివరించారు. వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇజంతకర్ చంద్రశేఖర్, జీఆర్పీ పోలీసులు సమక్షంలో రూపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు వైద్యులకు, ఆస్పత్రి సిబ్బందికి, సెక్యూరిటీ గార్డు శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు. -
న్యాయం జరగకపోతే చావే శరణ్యం
కోలారు : తమ కుమార్తె మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మాకు న్యాయం జరిగే అవకాశం లేదని, తమకు చావే శరణ్యమని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. వివరాలు.. తాలూకాలోని కాళహస్తి పురానికి చెందిన నారాయణస్వామి, మునిరత్నమ్మ దంపతుల కుమార్తె ఎన్.రూపా జూన్ నెల 5న ఆత్మహత్య చేసుకుంది. తన సహచరులు నందిని, శీనల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆత్మహత్యకు ముందు లేఖ రాసింది. అంతేగాకుండా వీరిద్దరి వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోదరుడు విజయకుమార్ మొబైల్‌కు మెసేజ్చేసింది. ఈ ఆధారాలన్నింటితోపోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని, తమకు దయా మరణానికైనా అనుమతించాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో చర్చించి నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పణలో భారతీయ యువ రక్షణా ప్రధాన కార్యదర్శి అంబరీష్, జిల్లాధ్యక్షుడు ఎల్ మంజునాథ్‌గౌడ తదితరులు ఉన్నారు.