విక్టరీ మార్కు , ఐపీఎస్ అధికారి డి.రూపా
యశవంతపుర: సెల్పీ తీసుకోవటం వరకు బాగానే ఉంది. కానీ చేతి వేళ్లను ఎందుకు చూపిస్తారో తెలియటంలేదు. అదే వేలి ముద్రలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులకు కోత పడుతుందని ఐపీఎస్ అధికారి డి.రూపా నెటిజన్లను హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకొనేటప్పుడూ ఎవరూ కూడా వేలిని చూపించి సెల్ఫీ తీసుకోవద్దంటూ హెచ్చరిస్తూ తను మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఆప్‌లోడ్ చేశారు. అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ విక్టరీ మార్కులో రెండు వేళ్లను చూపించి సెల్ఫీలను తీసుకుంటున్నారు.
మరికొందరు బొటన వేలును చూపిస్తూ డన్ అనే సంకేతంతో ఫొటోలు దిగుతున్నారు. ఇలా ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటం కూడా తప్పే. ఇలా సామాజిక మాధ్యమాలలో వేలి ముద్రలను చూపుతూ పాలు పంచుకోవటం చాలా ప్రమాదమని రూపా తన వీడియోలో హెచ్చరించారు. ప్రస్తుతం అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌లోడు అవుతున్న ఫోటో వేలి ముద్రతో అదే మాదిరిలో నకిలీని సృష్టించి బ్యాంక్ ఖాతా తెరిచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా వీడియో తీసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటంపై ప్రశంసలు వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోండి.. పర్వాలేదు, అయితే చేతి వేళ్లను చూపించే పద్దతి వద్దని ఆమె నెటిజన్లకు ఆమె సలహా ఇచ్చారు.
రూ. 4.50 లక్షల నగదు చోరీ
యశవంతపుర : రాజాజీనగర 22వ క్రాస్‌లో దొంగలు తెగబడ్డారు. ఇక్కడ ఓ వ్యక్తి దుకాణం ఏర్పాటు చేశారు. ఐస్‌క్రీం, జ్యూస్, కాఫి, టీ పొడులకు సంబంధించి వివిధ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దుండగులు షట్టర్ ఎత్తి లోపలకు చొరబడి రూ. 4.50 లక్షల నగదును దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment