
కేజీఎఫ్ నూతన ఎస్పీగా కేఎం శాంతరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
కేజీఎఫ్: కేజీఎఫ్ నూతన ఎస్పీగా కేఎం శాంతరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ ధరణీదేవి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈయన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ సందర్భంగా సహాయక పోలీస్ పాలనాధికారి జి విశ్వనాథ్ తదితరులు కొత్త ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.