ఐఏఎస్ సాధించిన మహ్మద్ హ్యారీస్, ఐపీఎస్ శిక్షణలో అన్న మహ్మద్ నదీముద్దీన్
సాక్షి, రాయచూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్‌లో ఇద్దరు సోదరులు ఉన్నత హోదా ఉద్యోగాలు పొందారు. వివరాలు... స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న నదీముద్దీన్‌కు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మహ్మద్ నదీముద్దీన్ గత ఏడాది నిర్వహించిన యూపీఎస్‌సీలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలో శిక్షణ పొందుతున్నారు. ఇక రెండో కుమారుడు మహ్మద్ హ్యారీస్ కూడా అన్న బాటలో నడి చాడు. తాజాగా వచ్చిన యూపీఎస్‌సీలో 270 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. కుమారులు ఇద్దరు సివిల్స్ విజేతలు కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment