Bidar
-
నింగి నుంచి ఊడిపడ్డ భారీ యంత్రం..ఉలిక్కిపడ్డ గ్రామస్తులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బీదర్(Bidar)లోని జల్సంగి గ్రామ వాసులకు శనివారం(జనవరి 18) ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద బెలూన్(Baloon) పడింది. బెలూన్‌కు పెద్ద పేలోడ్ యంత్రం కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి తోడు బెలూన్‌కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్ లైట్ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తులకు భయం ఎక్కువైంది. వెంటనే బెలూన్‌తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్ తాలూకా పోలీసులు స్పాట్‌కు చేరుకుని బెలూన్ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్ యంత్రం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(Tifr)కు చెందినదని పోలీసులు తేల్చారు. విషయం క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్ఆర్ ఆకాశంలోకి బెలూన్ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్ పోలీసులు బెలూన్ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్ఆర్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. A satellite payload #baloon of #TIFR , #Hyderabad fell on a house from sky in Bidar with a huge machine.A huge size balloon (looks like an airbag) fell from the sky, created panic among the villagers Jalsangi village in #Homnabad Taluk, #Bidar district, #Karnataka , early… pic.twitter.com/Dri4CikSdE— Surya Reddy (@jsuryareddy) January 18, 2025 -
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్‌లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్‌కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, బిహార్‌ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్‌పూర్ వెళ్లడానికి అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
బీదర్ గ్యాంగ్ కోసం పోలీసుల వేట.. హైదరాబాద్ హై అలర్ట్
-
అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇక, ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. దీంతో, నిందితుల కోసం పోలీసుల దర్యప్తు కొనసాగుతోంది.అఫ్జల్‌గంజ్ కాల్పుల కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందినట్లు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్ పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు. దీంతో, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఏం జరిగిందంటే..?కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్‌లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
కాల్పుల కలకలం.. అప్జల్‌గంజ్‌లో బీదర్ ఏటీఎం దొంగలు
సాక్షి, హైదరాబాద్: అప్జల్ గంజ్(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దుండుగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్‌లో రూ.93 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.దుండగులు ఏటీఎం సొమ్ముతో బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దుండుగులు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రావెల్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.ఇదీ చదవండి: కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్! -
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
ఒంటిపై 20 లక్షల బంగారం, 5 లక్షల క్యాష్.. 30 సార్లు కత్తితో పొడిచి..
-
బీదర్‌లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్‌లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్‌సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్‌తో పోలికా? సరిపోయింది -
సమీపిస్తున్న ఎన్నికల తేదీ.. ‘హైదరాబాద్ కర్ణాటక’లో దిగ్గజ నేతల ఢీ
బీదర్ నుంచి కల్వల మల్లికార్జున్ రెడ్డి: ఉత్తర కర్ణాటకలో అంతర్భాగమైన ‘హైదరాబాద్ కర్ణాటక’లోని బీదర్ జిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీ (ఎస్) నుంచి దిగ్గజ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న జేడీ (ఎస్) అభ్యర్థి బందెప్ప కాశెంపూర్ (బీదర్ దక్షిణ), కాంగ్రెస్ అభ్యర్థులు రహీమ్ ఖాన్ (బీదర్ ఉత్తర), ఈశ్వర్ ఖండ్రే (బాలీ్క), రాజశేఖర పాటిల్ (హుమ్నాబాద్), బీజేపీ అభ్యర్థి ప్రభు చౌహాన్ (ఔరాద్– ఎస్సీ) నుంచి తమ రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు. మరోవైపు సూర్యకాంత నాగమరపల్లి (జేడీఎస్– బీదర్ ఉత్తర), విజయ్ సింగ్ (కాంగ్రెస్– బసవకళ్యాణ్), సిద్ధూ పాటిల్ (బీజేపీ– హుమ్నాబాద్), సీఎం ఫైజ్ (జేడీ ఎస్– హుమ్నాబాద్), భీంసేన్రావు సింధే (కాంగ్రెస్– ఔరాద్) వంటి కొత్తతరం నేతలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ధీటైన సవాలు విసురుతున్నారు. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, కళ్యాణరాజ్య ప్రగతిపక్ష, కర్ణాటక రాష్ట్ర సమితి వంటి పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. బీదర్ ఉత్తర కాంగ్రెస్‌కు పట్టు ఉన్న బీదర్ ఉత్తర నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీ (ఎస్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2009, 2016 ఉప ఎన్నికలతో పాటు 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రహీమ్‌ఖాన్ ప్రస్తుత ఎన్నికలోనూ బీదర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి బరిలో నిలిచారు. అయితే రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సూర్యకాంత నాగమరపల్లికి ఈసారి టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో జేడీ(ఎస్) నుంచి బరిలోకి దిగారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి న ఈశ్వర్ సింగ్ ఠాకూర్‌కు బీజేపీ అభ్యర్థిగా టికెట్ దక్కింది. కాంగ్రెస్‌కు చెందిన శేషి పాటిల్ చావ్లీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీదర్ దక్షిణ 2008, 2018 ఎన్నికల్లో జేడీ (ఎస్) నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి బందెప్ప కాశెంపూర్ మరోమారు అదే పార్టీ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిన డాక్టర్ శైలేంద్ర బెల్దాలే, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ పోటీలో ఉన్నారు. బాల్కీ కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన బాల్కీలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ నడుమ సాగుతోంది. బాల్కీ నుంచి వరుసగా నాలుగోసారి విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పోటీ చేస్తున్నారు. ఈశ్వర్ ఖండ్రే తండ్రి భీమన్న ఖండ్రే 1962, 1967, 1978, 1983లో, సోదరుడు విజయ్ ఖండ్రే 1989, 1994లో గెలుపొందారు. ఇక ఈశ్వర్ ఖండ్రే 2008, 2013, 2018లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఐదుసార్లు ఓటమి పాలైన ప్రకాశ్ ఖండ్రే బీజేపీ నుంచి, రవూఫ్ పటేల్ జేడీ(ఎస్) నుంచి పోటీ చేస్తున్నారు. బసవకల్యాణ్ బీజేపీ సిట్టింగ్ స్థానమైన బసవకళ్యాణ్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు, స్థానికేతరుడైన విజయ్ సింగ్‌ను బరిలోకి దించింది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బి.నారాయణరావు కరోనాతో మరణించడంతో 2021లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన శరణు సలగర గెలుపొందారు. ప్రస్తుతం శరణు సలగర మరోమారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్టీవో సంజయ్ వడేకర్ జేడీ (ఎస్) నుంచి పోటీ చేస్తున్నారు. ఔరాద్ (ఎస్సీ రిజర్వుడు) బీజేపీ కంచుకోట ఔరాద్లో వరుసగా నాలుగో విజయం కోసం పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహన్ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలు కొత్త ముఖాలను బరిలోకి దింపాయి. విద్యావంతుడైన డాక్టర్ భీంసేన్‌రావ్ సింధే కాంగ్రెస్ నుంచి, జే సింగ్ రాథోడ్ జేడీ (ఎస్) నుంచి బరిలో ఉన్నారు. హుమ్నాబాద్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న హుమ్నాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్) నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 2013 ఉప ఎన్నికతో పాటు 2008, 2013, 2018లో వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి రాజశేఖర పాటిల్ మరోమారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వరుస ఓటములు పొందుతూ వచ్చి న సుభాష్ కల్లూర్ స్థానంలో తొలిసారిగా సిద్ధూపాటిల్ పోటీ చేస్తున్నారు. జేడీ (ఎస్) కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం కుమారుడు సీఎం ఫైజ్ జేడీ (ఎస్) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫలితాలను శాసించేది డబ్బే పార్టీల కంటే వ్యక్తుల మీద ఆధారపడే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ధన ప్రభావం బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. రైతులు, పేదలకు మేలు చేసే ఉచిత పథకాలు పెద్దగా లేవు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. – శ్రీనివాస్ భురే, ఆనంద్‌వాడీ, బాల్కీ -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్‌కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ
బెంగళూరు: కాంగ్రెస్ తనను పదే పదే తిడుతోందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 91 సార్లు తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తాను అవేం పట్టించుకోనని, ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అలాగే తనను తిట్టిన ప్రతిసారి కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూస్తోందని మోదీ సెటైర్లు వేశారు. కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. ప్రధాని మోదీ విష సర్పం, తాకితే ఖతం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన వివర్శలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని మరోసారి గెలిపించాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీకి 113 సీట్లు అవసరం. చదవండి: రాజకీయాల్లో నటీనటులు -
మరోసారి రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరును పరిశీలించేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే గత నెల 10న నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన షా.. ఈ నెల 11న రాత్రి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అదేరోజు మరోసారి హైదరాబాద్‌లో కోర్‌కమిటీతో ఆయన భేటీకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 12న ఉదయం హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో మేధావులతోనూ ప్రత్యేకంగా సమావేశమై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అమిత్ షా దృష్టిసారిస్తున్నారు. 12న రాష్ట్రంలో సమావేశాలు ముగించుకున్నాక కర్ణాటకలోని బీదర్‌కు పయనమవుతారు. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసే దాకా నెలకు రెండు, మూడుసార్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ పర్యటనలకు వచ్చినప్పుడల్లా తెలంగాణపైనా దృష్టిపెట్టి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. వచ్చే నెలలో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. ముఖ్యనేతల మధ్య సమన్వయమే ప్రధానం మార్చి, ఏప్రిల్‌లలో రాష్ట్ర పార్టీ నాయకులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధమైంది. అయితే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య చోటుచేసుకుంటున్న సమన్వయలోపంపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ మినీ కోర్‌కమిటీ భేటీలోనూ దీనిపైనే అమిత్ షా, నడ్డా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులున్నా, ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత ఉన్నా రాష్ట్ర నేతలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతు న్నారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్ర కోర్‌కమిటీ నేతలు కనీసం వారం, పది రోజులకోసారి కలుసుకొని పార్టీ కార్యక్రమాలపై చర్చించాలని, సమష్టిగా ముందుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జ్ సునీల్ బన్సల్‌కు అప్పగించినట్లు తెలిసింది. చేరికలు ఆగడంపై జాతీయ నాయకత్వం ఆరా ఇతర పార్టీల నుంచి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇది ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి కారణాలేమిటని బీజేపీ జాతీయ నాయకత్వం ఆరాతీసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యనేతల నుంచి జిల్లాల వారీగా జాబితాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్ డాగ్ ప్రధాన పాత్ర
సాక్షి, కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ, వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి.. పోలీస్ డాగ్ది ప్రధాన పాత్ర కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం. ఏడుగురూ రక్త సంబంధీకులే కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం. 24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు కొండగట్టు చోరీ కేసును చాలెంజ్‌గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. -
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా, చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ నుండి బీదర్ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు!
యశవంతపుర(బెంగళూరు): బస్టాండ్‌లో బ్యాగ్, మొబైళ్లు చోరీ కావటం వినే ఉంటాం. అయితే ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సును దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు... కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (కెకె ఆర్టీసీ) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్‌లో బీదర్ డిపో–2కు చెందిన బస్ (కెఎ–38, ఎఫ్–971)ను సోమవారం రాత్రి నిలిపారు. మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సును ముగ్గురు వ్యక్తులు మిరియాణ, తాండూరు మార్గంలో తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చించోళి పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కోసం గాలింపు చేపట్టారు. చదవండి లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు. -
వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్ నుంచి సిటీకి..
సాక్షి, బంజారాహిల్స్: నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్లూసీఎస్)కు ఈ నెల 21వ తేదీన ఫోన్ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్, గణేష్ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్‌లో బీదర్ చేరుకున్నారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అల్వాల్ మిలటరీ డెయిరీఫామ్ రోడ్డులో ఉన్నో ఆంచల్ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు. శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్ పైప్‌ను సర్జరీ ద్వారా తొలగించారు. జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పనసపొట్టు.. షుగర్ ఆటకట్టు) -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేట్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్(45), అనిత(30), ప్రియ(15), మహేష్(2), డ్రైవర్ జగదీష్(30)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హర్షవర్దన జిల్లా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక కలబురిగి జిల్లా గంగాపూర్ దైవదర్శనానికి వెళ్లిన క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: యువతి చేష్టలతో విమానంలో గందరగోళం -
షాకింగ్ వీడియో: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు
Train Rams Into A Truck On A Railway Crossing.. రైల్వే గేట్ క్రాసింగ్ వద్ద ట్రాక్‌పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీదర్‌లోని భాల్కీ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్‌పై ఓ ట్రక్కు నిలిచిపోయింది. అయితే, ట్రక్కు పట్టాలపైకి రాగానే ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. ఇంతలో ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు ట్రక్కును ఢీకొట్టింది. కాగా, రైల్వే అధికారులు, స్థానికులు లోకోమోటివ్ పైలట్‌కు సకాలంలో సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ మృతి చెందకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Freak accident at a railway crossing in Bidar's Bhalki. Train rams into a truck that broke down at the railway track. Railway officials & locals managed to inform the locomotive pilot just in time to slow down averting a major tragedy. No injuries. More details awaited. pic.twitter.com/Q1g5QXsV0T — Deepak Bopanna (@dpkBopanna) July 7, 2022 ఇది కూడా చదవండి: జోర్దార్ వీడియో: జోరు వానలోనూ.. నీ యవ్వ తగ్గేదే లే! -
చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి
బెంగళూరు: బీదర్ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జునైద్(16), కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు. చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..? అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్లో విషాదం నెలకొంది. కుటుంబభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన యువకులు ఇక లేరనే బాధను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి -
అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్
సాక్షి, రాయచూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్‌లో ఇద్దరు సోదరులు ఉన్నత హోదా ఉద్యోగాలు పొందారు. వివరాలు... స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న నదీముద్దీన్‌కు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మహ్మద్ నదీముద్దీన్ గత ఏడాది నిర్వహించిన యూపీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలో శిక్షణ పొందుతున్నారు. ఇక రెండో కుమారుడు మహ్మద్ హ్యారీస్ కూడా అన్న బాటలో నడి చాడు. తాజాగా వచ్చిన యూపీఎస్సీలో 270 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. కుమారులు ఇద్దరు సివిల్స్ విజేతలు కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది. -
చూడముచ్చటగా ఉన్నారు.. ఎంత పనై పోయింది
యశవంతపుర: సెల్ఫీ మోజులో ఎంతోమంది ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. సెల్ఫీ వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకుండా విగతజీవులవుతున్నారు. బీదర్ నుండి వచ్చిన విద్యార్థులు నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించారు. బీదర్‌లోని కర్ణాటక కాలేజ్‌లో బీఏ విద్యార్థి పురుషోత్తమ పాటిల్, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రక్షిత స్నేహితులు. రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివేది. వీరిద్దరూ ప్రేమికులు కూడా. వరుస సెలవులు కావడంతో పర్యాటక యాత్రకు వచ్చారు. సోమవారం బాడుగ ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరూ లేని సమయంలో మొబైల్ ఫోన్లో ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొంటుండగా జారి వంతెన పైనుండి కాళీ నదిలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు తెచ్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరు నిజంగానే ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే..