బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు.
ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment