Mob
-
ఢాకాలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత దేశానికి,హిందువులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే అక్కడ హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తాజాగా బంగ్లాదేశ్‌లో మున్నీ షా అనే మహిళా జర్నలిస్టును రాజధాని ఢాకాలోని కార్వాన్‌బజార్‌లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి.చుట్టుముట్టడమే కాకుండా ఆమెను కొంత సేపు వేధించారు. అయితే పోలీసులు ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూక భారీ నుంచి కాపాడారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. ను అల్లరి మూక నుంచి కాపాడారు.భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. -
అత్యాచార నిందితునిపై మూక దాడి.. హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య నిందితునిపై కొందరు దాడి చేసి హత్య చేశారు.అక్టోబరు 4న బాధితురాలు పొలాల్లో ఆవులు, మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో అత్యాచార ఘటన జరిగిందని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పొలాల నుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లారని, ఆ తర్వాత మహిళ వివస్త్రగా కనిపించిందని, ఆమెకు విషం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నిందితుని ఇంటిపై దాడి చేసి, అతడిని బయటకు తీసుకుచ్చి దాడి చేశారు. మహిళలు, పురుషులు నిందితునిపై వెదురు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేలోపే నిందితుడిని స్థానికులు చావబాదారు. పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు బాధితుడు అప్పటికే మరణించాడని తేల్చిచెప్పారు.ఇది కూడా చదవండి: HYD: బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి -
దైవ దూషణ నెపం.. పాకిస్తాన్లో మరో దారుణం
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్‌లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్ కంబార్ అనే వైద్యుడు పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ పోలీసు ఆ వైద్యునిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ఆ వైద్యుడు మృతిచెందాడు. కంబార్ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పగించారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. అయితే వైద్యునిపై కాల్పులు జరిపిన పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నియాజ్ ఖోసో ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఆ వైద్యునితో పాటు అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ నేపధ్యంలోనే తాము ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.స్థానిక పోలీసు అధికారి షకుర్ రషీద్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన జాన్హీరోలో వైద్యునికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో కొందరు ఆ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి భయపడిన మృతుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీంతో ఆ అల్లరి మూక వైద్యుని మృతదేహనికి నిప్పు పెట్టిందని రషీద్ తెలిపారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉమర్కోట్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు సోషల్ మీడియాలో దైవ దూషణతో కూడిన ఒక పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 సీ కింద ఆ డాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు వచ్చిన తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు -
గుర్‌గ్రామ్‌కు పాకిన అల్లర్లు.. రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన అల్లరిమూకలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆందోళనలు ప్రారంభమై 18 గంటలు గుడుస్తున్నా ఏమాత్రం చల్లారడం లేదు. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లా నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్షాపూర్ ప్రాంతంలో తాజాగా నిరసనకారులు రెచ్చిపోయారు. దుకాణాలను ఆందోళనకారులు కూల్చేస్తున్నారు. ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దాదాపు 200 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. షాపులను, మాంసం దుకాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లలో దాదాపు నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 44 కేసులు నమోదు కాగా.. 70 మందిని అరెస్టు చేశారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శోభాయాత్రపై ఓ వర్గం ప్రజలు రాళ్లదాడి జరిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన అల్లర్లు నుహ్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లరిమూకలు ఇప్పటికే వందల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణలను అదుపు చేయడానకిి కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్‌ని కూడా నిలిపివేసింది. సంయమనం పాటించాలని ప్రజలను సీఎం కోరారు. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు. -
క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో నడుస్తున్న గబ్బు దందాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న ఇన్స్పెక్టర్లపై వేటు పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొత్వాల్ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంలో అప్పటి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున బయటపడిన క్లబ్ టెకీల వ్యవహారంలో మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) ఇన్స్పెక్టర్ ఎస్.సైదులుపై బదిలీ వేటు పడింది. సైదులును కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదనపు ఇన్స్పెక్టర్ గడ్డం కాశికి బాధ్యతలు అప్పగించారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
కిందపడ్డ వ్యక్తిని దొంగ అనుకొని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని చేరదీయాల్సిందిబోయి.. పశువుల దొంగని కొట్టి చంపారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో పిలఖువా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాసీం(45), అతని స్నేహితుడు సమీయుద్దీన్ ఇద్దరు పశువుల ఉండే చోట ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. పశువుల పాకలోని గేదె, దూడను దొంగిలించేందుకు వచ్చారనే అనుమానంతో వారిద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో 45 ఏళ్ల ఖాసీం తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జనమంతా చుట్టుముట్టగా బాధితుడు ఖాసీం తీవ్రగాయాలతో దాహం వేస్తుందని నీళ్లు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఆ వీడియో తమకు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. -
పోలీస్ స్టేషన్ నుంచి లాక్కొచ్చి మరీ చంపేశారు
ఇటానగర్ : చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ ఇద్దరిని ప్రజలు కొట్టి చంపిన షాకింగ్ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ నుంచి లాక్కొచ్చి మరీ ప్రజలు ఈ ఘటనకు పాల్పడ్డారు. సుమారు 400 నుంచి 1000 మంది ప్రజలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాక్రో సర్కిల్లోని నామ్గో గ్రామంలో ఓ చిన్నారి(12) ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఐదురోజుల తర్వాత సమీపంలోని టీ గార్డెన్లో నగ్నంగా చిన్నారి శవం లభ్యమైంది. పోస్టుమార్టంలో బాలిక పైశాచికంగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఘటనపై ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అస్సాంకు చెందిన వలస కూలీలు సంజయ్ సబర్(30), జగదీశ్ లోహర్(25)లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహాంతో ఉన్న నామ్గో గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకున్నారు. కర్రలతో ఒక్కసారిగా స్టేషన్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకోవటానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ ఖండించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ.. ఎస్పీని బదిలీ చేసింది. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడేళ్లలో జరిగిన రెండో ఉదంతం ఇది. 2015లో దిమాపూర్(నాగాలాండ్)లో ఇలాగే ఓ రేప్ నిందితుడిని జనాలు కొట్టి చంపారు. -
కుషాయిగూడలో కాల్పుల కలకలం
హైదరాబాద్ : కుషాయిగూడలోని ఈసీ నగర్లో కాల్పులు కలకలం రేగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వర్గం వారు, స్థానికంగా ఉన్న ఓ వర్గం వారు ఘర్షణ పడ్డారు. కూరగాయల మార్కెట్ స్థల వ్యవహారంలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన వర్గంతో స్థానిక వర్గీయులుతో ఘర్షణకు దిగారు. వివరాలు..ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన గజేందర్ సింగ్ స్థానికంగా వారంతపు సంత నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వారాంతపు సంత విషయమై హెచ్‌బీ కాలనీకి చెందిన తులసి(41) అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశం పట్టలేక తన దగ్గర ఉన్న లైసెన్స్‌లేని రివాల్వర్‌తో బెదిరింపులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన గజరాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల తోపులాటలో గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్ కాల్పులు జరుపుతుండగా అడ్డుకుని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డిని సీపీ మహేష్ భాగవత్ అభినందించారు. -
డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!
ముంబైః ఉత్తమ నృత్య దర్శకుడు, ఫిల్మ్ మేకర్ రెమో డిసౌజా కు ఫ్లాష్ మాబ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. యాక్టర్ ఫైసల్ ఖాన్, డ్యాన్సర్స్ కున్వర్ అమర్, సిద్ధేష్ పాయ్ లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో.. 'డ్యాన్స్ ప్లస్' సీజన్ టు సెట్ లో ఆర్టిస్టులకు సైతం ప్రత్యేక అనుభూతిని పంచారు. డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షో.. సీజన్ టు సెట్ కు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాను సహ నృత్యకారులు ఫ్లాష్ మాబ్ ప్రదర్శనతో సర్ ప్రైజ్ చేశారు. మెంటర్స్ శక్తి మోహన్, పునిత్ జె పాఠక్, ధర్మేష్ యలండే కూడా ఫ్లాష్ మాబ్ లో చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ తోపాటు, ఆర్టిస్టులు, హోస్ట్.. రాఘవ్ జూయల్ సైతం ఫ్లాష్ మాబ్ లో పాల్గొని రెమో పాపులర్ సాంగ్స్.. 'బడ్తమీజ్ దిల్', 'దిల్లీవాలీ గర్ట్ ఫ్రెండ్' కు హుషారెత్తించేట్టు స్టెప్పులేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డ్యాన్స్ ప్లస్ నిర్వాహకులు నన్ను పిలిచి రెమో గారి ఫ్లాష్ మాబ్ గురించి చర్చించారని, ఆమాట అనడమే అదృష్టంగా భావించిన తాను వెంటనే సరేనని చెప్పేశానని డ్యాన్సర్ అమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను, కొరియోగ్రాఫర్లను తయారు చేసిన రెమో డిసౌజా కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆయనకోసం ఫ్లాష్ మాబ్ అంటే మరోమాట లేకుండా ఒప్పేసుకున్నానని అమర్ ఓ ప్రకటనలో చెప్పారు. స్పెషల్ పెర్ఫామెన్స్ గురించీ ఏమీ తెలియకపోయినా.. గొప్ప నృత్యకారుడైన రెమో, సూపర్ జడ్జి.. డ్యాన్స్ ప్లస్ సీజన్ 2 లో ఉండటం కంటెస్టెంట్లకు అదే గొప్ప వరం అంటూ అమర్ అభివర్ణించారు. అయితే తనకోసం డ్యాన్సర్లు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఎంతో ఆనందాన్నిస్తుందంటూ ఈ సందర్భంలో రెమో తెలిపారు. విద్యార్థులంతా తనకు కేవలం స్టూడెంట్స్ గా మాత్రమే కాదని, వారంతా తన పిల్లల్లాంటివారని, తన జీవితంలో ఓ భాగమని రెమో అన్నారు. తనవల్లే ఇక్కడవరకూ వచ్చామని విద్యార్థులు చెప్పినా.... వారివల్లే నేనిక్కడున్నానని నేనంటాను అంటూ చెప్పడం.. ఆయన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. -
వనస్థలిపురంలో ఆకతాయిల హల్చల్
వనస్థలిపురం (హైదరాబాద్): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కర్నూలు జిల్లాలో పొక్లెయిన్‌కు నిప్పు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి వద్ద నీరు-చెట్టు పనుల్లో భాగంగా ముల్లకంపలు తీసేందుకు ఉపయోగిస్తున్న ప్రొక్లైన్‌కు మంగళవారం వేకువజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. వంకలో పనులు చేసేందుకు ఉపయోగించి రాత్రి పొలంలోనే వదిలిపెట్టగా ఎవరో నిప్పు పెట్టడంతో ప్రొక్లైన్ టాప్ మొత్తం కాలిపోయింది. ఉదయం గమనించిన కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో చర్చిపై దాడి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చర్చిలో కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. భజరంగ్‌దళ్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న 15-20 మంది యువకులు రాయ్‌పూర్ నగర శివార్లలోని కచ్నా గ్రామంలోని చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న వారిపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా కొట్టారని ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ చెప్పారు. వారు తలకు కాషాయరంగు బ్యాడ్జీలు పెట్టుకున్నారన్నారు. ఆగంతకులు చర్చిలోని కుర్చీలను, ఫ్యాన్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని రాయ్‌పూర్ ఏఎస్పీ నీరజ్ చంద్రాకర్ చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు పారిపోయారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెల రోజుల్లో నాలుగు చర్చీలపై దాడులు జరిగాయని పన్నాలాల్ తెలిపారు. -
బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు
పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బిహార్‌లోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 1.70 లక్షలు దోచుకొని పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దుండగుడు గ్రామస్తులకు చిక్కాడు. పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు కూడా పాల్పడటంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. పోలీసులు గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు పాట్నా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. -
జైల్లోంచి లాక్కొచ్చి కొట్టి చంపారు
పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో దారుణం చోటుచేసుకుంది. బంగారం వ్యాపారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు నిందితులను ప్రజలు జైల్లోంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపారు. గినియాలోని కురోస్సా అనే చిన్న పట్టణంలో కబా కమరా అనే వ్యక్తి బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. పోలీసులు హత్య కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 16 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఇంతలోనే హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణంలో వదంతులు వ్యాపించాయి. అంతే.. ప్రజలు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. జైలుపై దాడి చేసి.. హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న నలుగురిని బయటకు లాక్కొచ్చారు. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు నలుగురిని చావబాదారు. నలుగురిలో ముగ్గురు దెబ్బలకు తాలలేక మృతి చెందగా, ఒకరిని ప్రాణాలతో ఉండగానే తగులబెట్టారు. నలుగురి మృతదేహాలు బహిరంగ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని గినియా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఫారెస్ట్ ఆఫీసుపై మూకుమ్మడి దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోతీపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆపీసుపై మూకుమ్మడి దాడి చేసి, నిందితుడిని విడిపించుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఫారెస్ట్ రేంజర్ సహా ఆరుగురిని సిబ్బందిని గాయపర్చిన దుండగులు, రేంజ్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు. అటవీ అధికారుల సమాచారం ప్రకారం అడవిలోని చెట్లను అక్రమంగా నరికేస్తున్నాడనే ఆరోపణలపై సల్మాన్ అనే వ్యక్తిని అటవీశాక అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త విన్న కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా రేంజ్ ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దుండగులను నిరోధించడానికి ప్రయత్నించిన రేంజర్ ఖుర్షీద్ ఆలం, డిప్యూటీ రేంజర్ రామ్ సహా ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం లాకప్‌లో ఉన్న సల్మాన్ అక్కడి నుంచి తప్పించుకుని ఉడాయించారు. ఈ దాడిపై అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
మదనపల్లెలో దారుణం
- దొంగ అనుకొని మూగ యువకుణ్ని చావగొట్టిన జనం మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. సోదరిని పలుకరించేందుకు వెళ్లి వస్తున్న మూగ యువకుడిని అనుమానితుడిగా భావించి జనం కొట్టి చంపిన సంఘటన మదనపల్లె శివారు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబుకాలనీలో ఉంటున్న లారీడ్రైవర్ షేక్ అన్వర్‌బాషా కుమారుడు షేక్ చాన్‌బాషా(24) మాటలు రావు. శుక్రవారం రాత్రి అమ్మచెరువుమిట్ట సమీపంలోని రంగనాథ పెట్రోల్ బంకు వెనుక ఇందిరమ్మ కాలనీలో ఉన్న తన అక్క షాహీన వద్దకు వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో గొర్రెల మంద వద్ద ఉన్న కాలనీవాసులు యువకుడిని అడ్డగించారు. చాన్‌బాషా మూగవాడు కావడంతో మాట్లాడలేక సైగలు చేశాడు. దీంతో వారు చోరీ చేసేందుకు వచ్చాడని భావించి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన చాన్‌బాషా ఇంటికి వె ళ్లి తండ్రి అన్వర్‌బాషాకు జరిగిన విషయాన్ని సైగలతో చెప్పి పడిపోయి ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతికి కారకులైన లారీ లోడర్ మస్తాన్, మరో వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
గ్యాంగ్‌స్టర్‌ను కొట్టి చంపిన గ్రామస్తులు
మీరట్: ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్‌స్టర్‌ను గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు. ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమధ్యనే పోలీసుల కస్టడీనుంచి తప్పించుకున్న హస్మత్ తమ అరెస్టులకు కారణం షాబీర్ అని కక్ష పెంచుకున్నాడు. తన గ్యాంగ్ రహస్యాలను పోలీసులకు చేరవేస్తున్నాడనే కోపంతో, అనుమానంతో రగిలిపోయాడు. అంతే....షాబీర్ గ్రామం ఇంద్రిష్పూర్కి వెళ్లి అతినిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో షాబీర్ అక్కడిక్కడే చనిపోయాడు. కాల్పుల శబ్దం విన్నగ్రామస్తులు, విగతజీవిగా మారినషాబీర్ ను చూసి కోపోద్రిక్తులై హస్మత్ను చుట్టుముట్టి కట్టెలతో దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరేలోపే హస్మత్ ప్రాణాలొదిలాడు.