రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చర్చిలో కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. భజరంగ్‌దళ్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న 15-20 మంది యువకులు రాయ్‌పూర్ నగర శివార్లలోని కచ్నా గ్రామంలోని చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న వారిపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా కొట్టారని ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ చెప్పారు.
వారు తలకు కాషాయరంగు బ్యాడ్జీలు పెట్టుకున్నారన్నారు. ఆగంతకులు చర్చిలోని కుర్చీలను, ఫ్యాన్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని రాయ్‌పూర్ ఏఎస్పీ నీరజ్ చంద్రాకర్ చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు పారిపోయారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెల రోజుల్లో నాలుగు చర్చీలపై దాడులు జరిగాయని పన్నాలాల్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో చర్చిపై దాడి
Published Mon, Mar 7 2016 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement