church
-
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్‌గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్‌లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రహస్యగదిలో బంగారు నిధి
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. -
క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్ చర్చి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/చిలిప్చేడ్: మెదక్ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు ఈ ఆలయం నిదర్శనమని, శాంతిని కోరుకునే వారికి మార్గ నిర్దేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) సంఘ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.గవర్నర్ రాక పురస్కరించుకుని ప్రెసిబెటరి ఇన్చార్జి శాంతయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు కేవలం వందేళ్ల సంబరమే కాదని, మానవ విశ్వాసం, దేవుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టమని అభివర్ణిం చారు. ఈ సందర్భంగా బైబిల్లోని.. ‘ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారో.. అక్కడ నేను ఉంటాను..’అనే క్రీస్తు వచనాలను గవర్నర్ ఉటంకించారు. ఈ చర్చి శతాబ్దంగా దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందని, ఒక విశ్వాసాన్ని పెంపొందించిన స్థలం గానే కాకుండా, అనేకమంది జీవితాలను మార్చిన ప్రదేశంగా నిలిచిందని చెప్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనకు ఇచి్చనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్ చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలి విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వారని, వారు సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, కలలు సాకారం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మంచి నాగరికతను పుణికి పుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలని కోరారు. కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు ఆదర్శమని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్‌డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
అర్ధరాత్రి భూ అక్రమార్కుల అరాచకం!
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వేకోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్భూములు, వంకపోరంబోకులు, ఆర్అండ్బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్అండ్బీ జాగాను కబ్జా చేయడానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
USA: డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జూన్27న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు. తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
రష్యాలో మరో ఉగ్రఘాతుకం
మాస్కో: రష్యాలోని ముస్లిం ప్రాబల్య దక్షిణ ప్రాంత దగెస్తాన్ రిపబ్లిక్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆదివారం సాయంత్రం ఏకకాలంలో దగెస్తాన్ రాజధాని మఖచ్కాలా లోని ఓ చర్చి, ఓ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్‌పైనా కాల్పులు జరపడంతోపాటు డెర్బెంట్ నగరంలోని ఒక చర్చి, ఒక యూదు ప్రార్థనా మందిరంలో దాడి చేసి నిప్పుపెట్టారు. ఉగ్రవాదులు డెర్బెంట్ ట్రినిటీ సండే చర్చిలో ఉన్న రెవరెండ్ నికోలాయ్ కొటెల్నికోవ్ (66)గొంతుకోసి చంపడంతోపాటు ఆ చర్చికి నిప్పుపెట్టారని అధికా రులు తెలిపారు. రెండు ఘటనల్లో 15 మంది పోలీసులు, ఒక బోధకుడు సహా 20 మంది చనిపోయారు. క్షతగాత్రులైన 46 మందిలో 13 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. నలుగురు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల ఎదురు దాడిలో ఆరుగురు ఉగ్రవా దులు హతమ య్యారన్నా రు. అయితే, ఈ ఘటనల్లో ఎందరు ఉగ్రవా దులు పాల్గొన్నదీ వారు వివరించలేదు. హతమైన వారిలో ఉగ్రవాదుల్లో ముగ్గురిని రష్యాలోని ప్రధాన యునైటెడ్ రష్యా పార్టీకి దగెస్తాన్ హెడ్‌గా ఉన్న మగొమెద్ ఒమరోవ్ ఇద్దరు కుమారులు, బంధువుగా అధికారులు గుర్తించారు. -
భారీ ఉగ్రదాడితో దద్దరిల్లిన రష్యా
రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ డాగేస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ముష్కరుల దాడుల్లో 15 మందికి పైగా పోలీసులు, పలువురు పౌరులు మృతి చెందారని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు.ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 15 దాటిందని సమాచారం. దాడి చేసిన వారిపై రష్యా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. డాగేస్తాన్ పబ్లిక్ మానిటరింగ్ కమిషన్‌కు చెందిన అధికారి షామిల్ ఖదులేవ్ మాట్లాడుతూ చర్చిపై జరిగిన దాడిలో ఒక ఫాదర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారని తెలిపారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్‌ను 66 ఏళ్ల నికోలాయ్‌గా గుర్తించారు. అలాగే చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు.ఈ ఉగ్రవాద దాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. ఆదివారం మూడు చోట్ల దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మఖచ్కల నగరంలో పోలీసుల ట్రాఫిక్ స్టాప్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడుల తీరు చూస్తుంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. డెర్బెంట్ నగరంపై దాడి జరిగిన సమయంలోనే మఖచ్కలలోని పోలీసు ట్రాఫిక్ పోస్ట్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక పోలీసు గాయపడినట్లు సమాచారం. -
కూలిన చర్చి స్లాబ్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందంది. కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కూలిపోయింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలి పోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిజిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా సమాచారం. చదవండి: సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు -
ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
భారీగా చేరి.. బారులు తీరి..!
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హఫీజ్‌పేట్(హైదరాబాద్): మియాపూర్ కల్వరి టెంపుల్లో సోమవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్‌కుమార్ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. -
మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. బాత్రూమ్కు వెళ్లి బయటకు రాని వరుడు!
విశాఖపట్నం: అంతటా సందడి వాతావరణం.. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న ఆ జంటను చూసి ఇరు కుటుంబాల సంతోషానికి అవధుల్లేవు. పాస్టర్లు ప్రార్థనలు చేసి, క్రీస్తు దీవెనలు అందజేశారు. నూతన జంట కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉంగరాలు మార్చుకునే క్షణం రానేవచ్చింది. ఇంతలో బిగ్ ట్విస్ట్. పెళ్లి కొడుకు బాత్రూమ్కు అని చెప్పి వెళ్లాడు. అక్కడి నుంచి ఎంతకీ రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా అతను తెరవలేదు. చివరకు బతిమలాడటంతో బయటకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. ఏవో కుంటిసాకులు చెప్పుకొచ్చాడు. దీంతో బంధువులు, పెళ్లి పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కొడతారేమోనన్న భయంతో వరుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్‌కు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, వారి బంధువులను పిలిపించారు. వరుడు, వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అర్థం పర్థం లేని వరుడి తీరును చూసి వధువు, ఆమె బంధువులు వివాహానికి నిరాకరించారు. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది. ఈ ఘటన బుధవారం పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.3 లక్షలు, తులమున్నర చైన్, ద్విచక్రవాహనం లాంఛనంగా ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు. బుధవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. వరుడు తీరుతో రద్దయింది. పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది. -
కరుణాపురం ‘క్రీస్తుజ్యోతి’కి అంతర్జాతీయ గుర్తింపు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం శివారులోని ‘క్రీస్తుజ్యోతి’ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కరుణాపురంలో 40 వేల మంది కూర్చొని ఏకకాలంలో ప్రార్థనలు చేసే అతిపెద్ద చర్చి నిర్మాణం చేపట్టినందుకు డెన్నీ కె.డెవిస్ పీస్ 2023 అవార్డును సాధించింది. అమెరికన్ మల్టీ ఎత్నక్ కోయలిషన్ 7వ కాంగ్రేషనల్ మల్టీ ఎత్నక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ప్రెసిడెంట్ క్రీస్తుజ్యోతి మినిస్ట్రీ ఫౌండర్ డాక్టర్ సంగాల పాల్సన్‌కు ఆదివారం ఆ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పాల్సన్ మాట్లాడుతూ..తమను గుర్తించి అవార్డు ఇచి్చన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఈ అవార్డు రావడంపై సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ డాక్టర్ జయప్రకాశ్ గోపు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రపంచంలోని టాప్ 10 అందమైన చర్చిలు
-
ఆసియాలో అతిపెద్ద చర్చి కరుణాపురంలో
ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు.. ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. అద్భుత కట్టడంగా.. కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్‌లోని జున్హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్‌తో అనుబంధంగా ఉండటం విశేషం. ప్రత్యేకతలు ఇవీ.. ♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫ్ మెటీరియల్ అద్దారు. ♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. ♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు. ♦ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు. ♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్‌ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్‌లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన పతనంతిట్టా జిల్లాలోని కిజవళ్లూర్ వద్ద శనివారం జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కారును బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో కారు దూరంగా ఎగిరిపడి రోడ్డు పక్కన ఆగిపోగా.. కారును తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్‌ను ఎడమ వైపు తిప్పగా.. రోడ్డుకు ఆనుకొని ఉన్న చర్చి గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చర్చి ఆర్చి కుప్పకూలింది. అదే విధంగా పలువురికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షపు డ్రైవింగ్యే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. #WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR — ANI (@ANI) March 11, 2023 -
చికాగోలో సీయోను తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలో అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ మాథ్యూస్ వట్టిప్రోలు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్‌లు, కారల్ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్లలకు బహుమతులు అందచేశాడు. యేసు ప్రభు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేంలో జన్మించినది స్కిట్‌గా ఆవిష్కరించిన రీతి ఈ వేడుకలకు హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో ప్రారంభమై ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలతో అమెరికాలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేస్తోందన్నారు. క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది ఎంత అధ్బుతమనేది వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు!
జాగ్రత్తగా చూస్తే ఈ ఫొటోలో కొండశిఖరంపై ఒక కట్టడం కనిపిస్తోంది కదూ! కొండశిఖరంపై వెలసిన ఈ కట్టడం ఒక చర్చి. కొండశిఖరంపైకి ఎక్కి దీనిని చేరుకోవడానికి లోహపు నిచ్చెన మెట్లదారి మాత్రమే దిక్కు. ఇది జార్జియాలో ఉంది. ‘కాటస్కీ పిల్లర్’గా ప్రసిద్ధి పొందింది. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎలాంటి ఆధారాలు లేవు. తొలిసారిగా పద్దెనిమిదో శతాబ్దిలో జార్జియన్ ప్రిన్స్ వాఖుస్తి తన పుస్తకంలో ఈ నిర్మాణం గురించి ప్రస్తావించాడు. తర్వాత 1944లో అలెగ్జాండర్ జాపారిడ్జ్ అనే పర్వతారోహకుడు తన బృందంతో కలసి ఈ కట్టడాన్ని సందర్శించాడు. చాలాకాలంగా దీనిని ఎవరూ ఉపయోగించకుండా విడిచిపెట్టేశారు. అయితే, 1999 నుంచి వివిధ దేశాలకు చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. దీని నిర్మాణ శైలిని బట్టి, ఈ చర్చిని పదమూడో శతాబ్దిలో నిర్మించి ఉంటారని వారి అంచనా. -
మేడ్చల్ జిల్లా : అంబేద్కర్ నగర్ చర్చ్ లో మహిళ మృతదేహం
-
చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
నాగోలు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు రూ. లక్ష నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్‌క్లేవ్‌లో ఉండే లాలయ్య, మాదాపూర్‌లో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్‌పూర్‌మెట్ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్‌కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. లాలయ్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, పోలీస్ డాగ్స్‌తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కోళ్ల చోరికి వచ్చిన యువకుడిపై దాడి) -
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
70 ఏళ్లపాటు బ్రిటన్ను ఏలిన రాణి ఎలిజబెత్–2కు హైదరాబాద్ మహానగరంతో అనుబంధం ఉంది. చారిత్రక భాగ్యనగరాన్ని ఆమె ఒకసారి సందర్శించి ముగ్ధులయ్యారు. వందల ఏళ్ల నాటి చారి్మనార్, గోల్కొండ కట్టడాలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎలిజబెత్–2 తన పాలనా కాలంలో మూడుసార్లు భారత్‌కు వచ్చారు. అందులో భాగంగా 1983 నవంబర్ 20న ఆమె హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె నానమ్మకు నానమ్మ అయిన విక్టోరియా మహారాణి తన సొంత డబ్బుతో ఈ చర్చిని కట్టించారు. అందుకే ఎలిజబెత్–2 ప్రత్యేకంగా ట్రినిటీకి విచ్చేశారు. ట్రినిటీ చర్చిని క్వీన్స్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే ఆమె రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్, గోల్కొండ కుతుబ్‌షాహీ టూంబ్స్, చార్మినార్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలిజబెత్–2తోపాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా ఆమె వెంట ఉన్నారు. అప్పుడు ఆర్కియాలజిస్ట్‌గా విధులు నిర్వహించిన ఎంఎ ఖయ్యూం వారి వెంట ఉండి నగరంలోని చారిత్రక ప్రదేశాలను పరిచయం చేశారు. చదవండి: ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు -
బోన్ చర్చ్.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం
భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్లో కుట్నా హోరాలోని సెడ్లెక్‌లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు కూడా వచ్చింది. -
ఒంగోలు జేఎంబీ చర్చిలో గొడవలు బాధాకరం: బాలినేని
-
నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
అబూజా: నైజీరియాలోని రివర్స్ రాష్ట్రం హర్కోర్ట్ నగరంలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కింగ్స్ అసెంబ్లీ పెంటెకొస్టల్ చర్చిలో శనివారం ఉదయం 9 గంటలకు పేదలకు పలు వస్తువులను ఉచితంగా అందజేస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, ఉదయం 5 గంటలకే భారీ సంఖ్యలో జనం చర్చి వద్ద క్యూ కట్టారు. రద్దీ పెరిగి, చర్చిగేట్లు విరగ్గొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 31 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు ఉచిత పంపిణీని రద్దు చేశారు. చదవండి: టెక్సాస్ నరమేధం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
భక్తి శ్రద్దలతో ఈస్టర్ (ఫోటోలు)
-
క్యాథడ్రెల్ కేక్!.. ఆ కుటుంబం ఏది చేసినా రిచ్‌గా ఉంటుంది
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి అందమైన భవనం పక్కన కూర్చుని ఫొటో తీసుకుంది. మనం కూడా ఒక ఫొటో తీసుకుంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది నిజమైన భవనం కాదు. అక్షరాల వంద కేజీల కూల్ కేక్. అవునా! అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. చూడగానే నోట్లో నీళ్లూరించే కేక్ డెకరేషన్లతో కేక్ ఆర్టిస్ట్‌లు తెగ ఆకట్టుకుంటుంటారు. కేక్ ఆకృతిని చూసి ధరకూడా చూడకుండా కొనేస్తుంటారు కొందరు. కానీ ఈ కేకు వాటన్నింటిలోకి చాలా భిన్నమైనది. అచ్చం ఇలాంటి కేకులు రూపొందించే ఆర్టిస్టే పూనేకు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్. వినూత్న ఆలోచనతో ఏకంగా లండన్ వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపును తెచ్చుకుంది. బ్రిటన్ రాయల్ కుటుంబం ఏది చేసినా ఎంతో రిచ్‌గా ఉంటుంది. వారు నివసించే భవనాల నుంచి ధరించే దుస్తుల వరకు అంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఎంతో ప్రత్యేకమైన బ్రిటన్‌కు చెందిన ఓ పురాతన చర్చ్‌ను వీగన్ కేక్‌తో రూపొందించింది ప్రాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేక్ ఐకాన్ ఎడ్డీస్పెన్స్ మార్గదర్శకత్వంలో రాయల్ ఐసింగ్ కళను నేర్చుకుని 1500ల కేకు ముక్కలతో మిలాన్ క్యాథడ్రెల్ చర్చ్‌ను నిర్మించింది. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేకు ముక్కలను డిజైన్ చేసింది ప్రాచీ. ముక్కలన్నింటిని కలిపి చర్చ్రూపం తీసుకురావడానికి ప్రాచీకి నెలరోజులు పట్టింది. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవైన నిర్మాణమే ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల పది అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకు బరువు వందకేజీలపైనే. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్‌లుగా రూపొందించడంలో ప్రాచీకి నైపుణ్యం ఉండడంతో.. గతేడాది ఫెమినా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది. -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్‌లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్‌కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్‌కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్‌రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్‌లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్‌లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్‌కాలనీ -
చర్చికి వెళ్లినంత మాత్రాన.. ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు
సాక్షి, న్యూఢిల్లీ: గోడలకు శిలువ తగిలించుకోవడం, చర్చికి వెళ్లినంత మాత్రాన... వాటిని కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందు పల్లన్ సామాజికవర్గానికి (ఎస్సీ) చెందిన పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకొన్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎం.దురైస్వామిల ధర్మాసనం పక్కనబెట్టింది. ‘‘పిటిషనర్ అయిన మహిళ హిందు పల్లన్ తల్లిదండ్రులకు జన్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు. పిటిషనర్‌ను ఓ క్రైస్తవుడు వివాహం చేసుకోవడం.. వారి పిల్లలు భర్త మతానికి చెందిన వారుగా గుర్తించడంతో పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు గుర్తించాం. పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె క్లినిక్‌ను సందర్శించామని గోడలకు క్రాస్ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రాలేం. పిటిషనర్ తన భర్త, పిల్లలతో చర్చికి వెళ్లినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించలేం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. -
ఇండోనేసియా చర్చి వద్ద ఆత్మాహుతి దాడి
మకస్సర్: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఆదివారం ఓ చర్చి వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. దక్షిణ సులవేసి ప్రావిన్సు రాజధాని మకస్సర్‌లోని సాక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ కెథెడ్రల్లోకి ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి లోపలికి ప్రవేశించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. సిబ్బందితో వారు వాదులాటకు దిగారు. అదే సమయంలో, అగంతకుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే తునాతునకలయ్యారు. నలుగురు భద్రతా సిబ్బందితోపాటు చర్చిలో పామ్ సండే సామూహిక ప్రార్థనలు ముగించుకుని వస్తున్న భక్తులు గాయాలపాలయ్యారు. అగంతకుల్లో ఒకరు మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారులెవరో తెలియాల్సి ఉంది. ఇండోనేసియా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వాటికన్ సెయింట్ పీటర్స్ బసిలికాలో పామ్ సండే ప్రార్థనల సందర్భంగా బాధితుల కోసం ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!) -
ఫ్రాన్స్‌లో ఉగ్ర దాడి : ముగ్గురు మృతి
పారిస్ : ఫ్రాన్స్ నగరం నీస్‌లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని మరో ఇద్దరు ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ ఘటన జరిగిందని, దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్‌గా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం గమనార్హం. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్‌ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది. చదవండి : ఫ్రాన్స్‌లో టీచర్ తలనరికిన యువకుడు -
కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
-
ఏపీలో కుట్రలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, విజయవాడ: మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కుట్రపూరిత చర్యలకు పాలడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు గౌతం సవాంగ్. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం) రాజకీయ లబ్ధి కోసమే గుడివాడ ఘటన: రవీంద్రనాథ్ బాబు నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. హుండీలో 600 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఉన్న మతాలకు సంబంధించిన అన్ని ప్రార్థనామందిరాల దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని సూచించామన్నారు. ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య వివాదాలు రాజేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే చర్యలు తప్పవని రవీంద్రనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. -
కొండయ్యపై హత్యాయత్నానికి కారణం అదే..
ఒంగోలు: కందుకూరు పట్టణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన చదలవాడ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసుకు కారణం పాత వివాదాలేనని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. కొండయ్య కేసులో పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. జేడీబీఎం చర్చి ఎదురుగా ఉన్న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ షాపులో ఉన్న కొండయ్యపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కొండయ్యకు ఏకంగా 42 కుట్లు పడ్డాయి. లాక్డౌన్ డ్యూటీలో ఉన్నా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐలు రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందుకు టెక్నికల్ సపోర్టు తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో చింతం రూప్‌కుమార్ అలియాస్ రూప్ (కావలి వైకుంఠపురం), నాదెండ్ల భాస్కర్(కావలి మద్దూరుపాడు). వీరు పూర్తి నేరస్వభావం ఉన్న వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తి కొండూరి రామస్వామి అలియాస్ రాము కూడా చిన్న చిన్న వివాదాల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన ఇనుప రాడ్డు, హీరో గ్లామర్ మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లతో పాటు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి పులుకూరి సుజయ్‌కు చెందిన ప్యాంటు, బెల్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు కథ వెలుగులోకి.. కందుకూరు పట్టణంలోని జేడీబీఎం టౌన్ చర్చి నిర్వహణ విషయంలో 2015లో ఎన్నికలు జరిగాయి. దీని అనంతరం సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పులుకూరి సుజయ్ ఒక గ్రూపుగా, చదలవాడ కొండయ్య మరో గ్రూపుగా విడిపోయారు. 2016లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కమిటీలు విడివిడిగా ప్రార్థనలు చేసుకునేలా చర్చలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 20న జేడీఎం టౌన్ చర్చి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. ఈ క్రమంలో చర్చి కార్యదర్శి పులుకూరి కొండయ్య.. రెండో వర్గానికి చెందిన సుజయ్ వర్గంలోని మహిళలను చర్చి నుంచి బయటకు పంపాడు. దానిపై కక్ష కట్టిన సుజయ్.. ఎలాగైనా కొండయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కందుకూరుకు చెందిన తాటిపర్తి అశోక్‌కుమార్, దరిమడుగు శ్రీరాం, చనమల బాలాజీ అలియాస్ బాలు అనే వ్యక్తులతో కలిసి వారి ద్వారా కావలికి చెందిన చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్‌తో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రాథమికంగా సుజయ్ నుంచి అశోక్‌కుమార్ రూ.50 వేలు తీసుకుని మిగిలిన మొత్తం పని పూర్తి అయిన తర్వాత తీసుకునేందుకు అంగీకరించాడు. తాను తీసుకున్న మొత్తంలో రూ.4 వేలు అశోక్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని చనుమల బాలాజీ, దరిమడుగు శ్రీరాంలకు ఇచ్చాడు. వారు చెరో రూ.3 వేలు తీసుకుని మిగిలిన రూ.40 వేలను కందుకూరులోని మెర్సీ స్కూల్ వద్ద చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్లకు అందించారు. అనంతరం ఫిబ్రవరి 29న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న కొండయ్యపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆయన అపస్మార్థక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం రూప్‌కుమార్ తన వద్ద ఉన్న రూ.40 వేలలో రామస్వామికి రూ.10 వేలు, నాదెండ్ల భాస్కర్‌కు రూ.6 వేలు ఇచ్చి మిగితాది రూప్‌కుమార్ ఉంచుకున్నాడని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. ఒక వైపు కోవిడ్ విధుల్లో పాల్గొంటూనే మరోవైపు హత్యాయత్నం కేసును ఛేదించిన కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయ్‌కుమార్, టౌన్ ఎస్ఐ కేకే తిరుపతిరావు, హెడ్ కానిస్టేబుల్ ఎంఎం బేగ్, కానిస్టేబుళ్లు జి.దయానంద్, హరిబాబు, వీవీ లక్ష్మణస్వామి, ఎస్కే బాషా, ఎస్కే ముక్తార్‌బాషా, టి.ఆనంద్‌ను ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. -
భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి
వాగాడౌగా : ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్‌తో సహా.. 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది. బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు. -
చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి
దారెస్సలామ్: టాంజానియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. టాంజానియాలో ప్రముఖ పాస్టర్ బోనిఫెస్ వాంపోసా ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అందులో ఆయన ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోశారు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అది తాకితే రోగాల నుంచి విముక్తి పొందుతామని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడం తొక్కిసలాటకు దారితీసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనకు కారణమైన పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విధేయులైన పామరులతోనే మహాద్భుతాలు
గమలీయేలు పౌలు వంటి ఎంతో మంది ఉన్నత విద్యాధికుల్ని తయారు చేసిన గొప్ప మేధావి, మహోపాధ్యాయుడు, నాటి యూదుల సన్ హెడ్రిన్ చట్టసభలో ముఖ్యుడుగా,. యేసుప్రభువును సిలువ వేయాలన్న తీర్మానం అతని కనుసన్నల్లోనే జరిగింది. అయితే, పిరికివాడు, పామరుడైన పేతురు, యేసుప్రభువు పునరుత్థానం తర్వాత ఎంతో ధైర్యంగా సువార్త బోధిస్తుంటే, యూదయ, యెరూషలేము ప్రాంతాల సామాన్య ప్రజలంతా క్రైస్తవంలోకి వేల సంఖ్యలో చేరుతున్న రోజులవి. సామాన్యులందరికీ అదంతా పండుగలా ఉంటే, యేసును చంపిన యూదుమతపెద్దలకేమో చాలా అవమానకరంగా ఉంది. ప్రభువు పునరుత్థాన శక్తిని పొందిన పేతురు తదితరుల ప్రసంగాలు, పరిచర్యతో క్రైస్తవం ఇలా ఉపిరి పోసుకొని విస్తరిస్తోంది. ‘మీరంతా కలిసి యేసును చంపారు, కాని దేవుడాయనను తిరిగి సజీవుని చేశాడు, దానికి మేమంతా సాక్షులం’ అంటూ యూదుపెద్దలను దుయ్యబట్టుతూ పేతురు సువార్త ప్రకటించాడు (అపో.కా.3:15). అది విని తట్టుకోలేక ఇక వాళ్ళందరినీ చంపాల్సిందేనంటూ యూదుమత పెద్దలు నిర్ణయించారు. అయితే ‘పేతురు పరిచర్య దేవుని వల్ల కలిగినదైతే మీరు అడ్డుకోలేరు, అలా కాకపోతే, గతంలో ఇలా వచ్చి అలా మాయమైన చాలామంది కోవలోకి వాళ్ళు కూడా చేరుతారు. కాబట్టి మీరు కంగారుపడొద్దు’ అంటూ గమలీయేలు ఇచ్చిన సలహాతో, వాళ్ళు పేతురును ఇతరులను చంపకుండా, కేవలం దెబ్బలు కొట్టి వదిలేశారు(అపో.కా.5:33–40).. పేతురు ప్రసంగాలు విని యేసుప్రభువును అంగీకరించిన వాళ్ళు, పేతురు ప్రసంగాలతో రెచ్చిపోయి అతన్ని చంపాలనుకున్నవాళ్ళు ఆనాడు వేలల్లో ఉన్నారు. కాని కర్రవిరక్కుండా పాము చావాలనుకునే గమలీయేలు లాంటి మూడవ తెగ వాళ్ళు కూడా కొందరున్నారు. మేధావి వర్గం అంటే ఇదే!! ‘నువ్వు జోక్యం చేసుకోకు, దేవుడే చూసుకుంటాడు’ అన్నది వీళ్ళ ఊతపదం!! సువార్తకన్నా, సిద్ధాంతాల మీద వీళ్లకు శ్రద్ధ, పట్టు ఎక్కువ. చర్చిల్లో, పరిచర్యల్లో కళ్లెదుటే అపవిత్రత, అనైతికత కనిపిస్తున్నా అందుకు వ్యతిరేకంగా ఉద్యమించరు, కాని వాటిని ‘విశ్లేషిస్తూ’, ఉద్యమించేవారికి ఉచిత సలహాలిస్తూ ‘బ్రేకులేసే’ పరిచర్య వాళ్ళది. గమలీయేలు నాటి యూదులందరికీ పితామహునిలాంటి వాడు.పాత నిబంధననంతా అధ్యయనం చేసి, అందులోని యేసుప్రభువు ఆగమన ప్రవచనాలు, ఆనవాళ్ళన్నీ ఎరిగిన మేధావిగా గమలీయేలు, ‘యేసుప్రభువే మనమంతా ఎదురుచూసే మెస్సీయా’ అని ఆనాడు ధైర్యంగా ప్రకటించి ప్రభువు పక్షంగా నిలబడి ఉంటే ఎంత బావుండేది. చాందస యూదులంతా పశ్చాత్తా్తపం పొంది క్రైస్తవులై ఉండేవారు కదా!! గమలీయేలు అలా పరలోకానికి వెళ్లి ఉండేవాడు, దేవుడు ఉజ్వలంగా వాడుకున్న సువార్తికుడుగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కాని గమలీయేలు, ఉచితాసలహాలిచ్చే పాత్రతో సరిపెట్టుకున్నాడు. అతని వద్దే విద్యనభ్యసించిన పౌలు మాత్రం గొప్ప సువార్తోద్యమకారుడై గురువును మించిన శిష్యుడయ్యాడు.. పేతురులాంటి పామరులు లోకాన్నంతా దేవుని కోసం జయించే పనిలో ఉంటే, గమలీయేలు లాంటి వారు పూలదండలు, సన్మానాలు, తాము పెట్టుకున్న దుకాణాలే తమకు చాలనుకున్నారు. అలా జీవితకాలపు ఒక మహత్తరమైన అవకాశాన్ని గమలీయేలు చేజార్చుకున్నాడు. అర్థం కాని శాస్త్రాలెన్నో చదివిన మేధావుల వల్ల క్రీస్తుకు, క్రైస్తవ ఉద్యమానికి ఒరిగేదేమీ లేదు. దేవుని ఆదేశాలకు విధేయులైన పామరుల వల్లే దేవుని రాజ్యం అద్భుతంగా నిర్మితమవుతుందన్నది చారిత్రక సత్యం. దేవుని రాజ్య స్థాపనకు కావలసిందల్లా దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన విధేయతే తప్ప, సకలశాస్త్ర పాండిత్యం, మేధోసంపత్తి కానేకాదు !! రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం మాసపత్రిక ఈమెయిల్: prabhukirant@gmail.com -
సర్వమానవ సార్వత్రిక దార్శనికుడు ఫిలిప్పు...
ఆదిమ చర్చిలో సామాజిక పరిచర్య కోసం ఎంపిక చేయబడి అభిషేకం పొందిన ఏడుగురిలో ఫిలిప్పు ఒక పరిచారకుడు. అయితే యెరూషలేములోని ఆదిమ చర్చి ఎంతో వేగంగా, బలంగా విస్తరించడం చూసిన యూదు మత ఛాందసులు అసూయచెంది నూతనంగా చర్చిలో చేరుతున్న క్రైస్తవ విశ్వాసులను హింసించడం ఆరంభించడంతో యెరూషలేములోని విశ్వాసులంతా యూదా దేశం వదిలి పలు ప్రాంతాలకు చెదిరిపోయారు. అక్కడి ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడై దేవుని ప్రేమను ప్రకటించడంతో చెదిరిపోయిన వారి ద్వారా సువార్త కొత్త ప్రాంతాలకు వ్యాపించి చర్చిలు, విశ్వాసుల సంఖ్య మరింత విస్తరించింది. అంటే చర్చిని, విశ్వాసులను కట్టడి చేయడానికుద్దేశించిన యూదుల చిత్రహింసల వ్యూహం ఎంతగా విఫలమైందంటే, అది చర్చిని అణిచివెయ్యలేకపోయింది సరికదా, చర్చి మరింత ఉధృతంగా విస్తరించడానికే ఇలా దోహదపడింది.ఆ కాలంలో ఫిలిప్పు మాత్రం యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వెళ్లి అక్కడి అసంఖ్యాకులైన సమరయులకు సువార్త ప్రకటిస్తే వాళ్లంతా ఇనుమడించిన ఉత్సాహంతో క్రైస్తవ విశ్వాసులయ్యారు. ఇది నిజంగా విప్లవాత్మకమైన పరిణామం. ఎందుకంటే సమరయులు యూదులకు అస్పృశ్యులు, ఆ కారణంగా వాళ్లంటే చిన్న చూపు. యూదా సామ్రాజ్యాన్ని అషూరులు పాలిస్తున్నప్పుడు, కొందరు యూదులు అషూరు స్త్రీలను వివాహమాడిన కారణంగా పుట్టినవారే సమరయులు. అలా వాళ్ళు మిశ్రమ జాతికి చెందినవారన్న నెపంతో వారికి యెరూషలేము దేవాలయ ప్రవేశాన్ని కూడా చాందస యూదులు నిషిద్ధించారు. అయినా సమరయులు మాత్రం యూదు మతవిధులే పాటిస్తూ, ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ మెస్సీయా ఆగమనాన్ని కాంక్షించేవారు. అలా వారిని దూరం పెట్టిన యూదులే ఇపుడు క్రైస్తవ విశ్వాసులై ఫిలిప్పు నాయకత్వంలో తమవద్దకొచ్చి యేసు సువార్త చెబుతుంటే అత్యుత్సాహంతో వాళ్లంతా కొత్త విశ్వాసంలో చేరారు. యూదులకు, సమరయులకు మధ్య 800 ఏళ్లుగా నెలకొన్న వైషమ్యాన్ని, అగాథాన్ని ఇలా క్రైస్తవం దూరం చేసి సమరయులను విశ్వాసులను చేసి వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది, వారిలో అత్యానందాన్ని నింపింది.ఫిలిప్పుతో దేవుడొకసారి దర్శన రీతిన మాట్లాడి దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలో ఒక వ్యక్తిని కలుసుకొమ్మని ఆదేశించాడు. ఇథియోపియా రాణి గారి ఖజానాదారుడు, ఇథియోపియా దేశపు ఉన్నతాధికారియైన ఒక నపుంసకుడు అక్కడ ఫిలిప్పుకు తారసపడ్డాడు. అతను యెరూషలేముకొచ్చి దేవుని ఆరాధించి రథంలో తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదవడం ఫిలిప్పు కనుగొన్నాడు. యేసుప్రభువు సిలువ ఉదంతాన్నంతా యెషయా తన గ్రంథంలో పరోక్షంగా చెప్పిన 53వ అధ్యాయాన్ని అతడు చదువుతుండగా ఫిలిప్పు ఆ భాగాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువు సువార్తను అతనికి ప్రకటిస్తే, అతను అక్కడికక్కడే మారు మనసు పొంది విశ్వాసియై ఇథియోపియా వెళ్ళాడు. అంటే యెరూషలేములో శత్రువులు విశ్వాసులు హింసిస్తే సువార్త సమరయకు, అక్కడినుండి ఈ విశ్వాసి ద్వారా ఇథియోపియా దేశానికి అంటే మొదటిసారిగా ఆఫ్రికా ఉపఖండానికి కూడా వ్యాపించిందన్న మాట. అస్పృశ్యులైన జాతివిహీనులు, నపుంసకులు అనే తారతమ్యం లేకుండా సర్వమానవ సార్వత్రిక దర్శనంతో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని నిర్మించాడు. విశ్వాసి ఆత్మపూర్ణుడైతే ఎంత బలంగా అతన్ని దేవుడు వాడుకొంటాడన్నదానికి ఫిలిప్పు నిదర్శనం. విశ్వాసులు ఫిలిప్పు లాగా ఆత్మపూర్ణులైతే సువార్త వ్యాప్తికి సరిహద్దులు లేవు, దాన్ని అడ్డుకోగల అవరోధాలు కూడా లేవు.యెరూషలేములో అతనెప్పుడూ ప్రసంగాలు చెయ్యలేదు. ఎందుకంటే అతని పరిచర్యలో ఇతరులకు సహాయం చెయ్యడమే తప్ప ప్రసంగాలుండవు. కానీ సమరయలో అతను సువార్త ప్రకటించే మహా వక్త అయ్యాడు, వేలాది మందికి దేవుని ప్రేమను ప్రకటించి వారికి ఆత్మీయ తండ్రి అయ్యాడు. సమరయ, ఇథియోపియా దేశాలకు తొలిసారిగా సువార్త చేరవేసిన ఆద్యుడయ్యాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి
ఔగడొగొ: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోకు ఉత్తరాన ఉన్న డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రార్ధనలు జరుగుతుండగా సాయుధులైన కొందరు చర్చిలోకి చొరబడ్డారని డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. చర్చిలో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని జోంగో వివరించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని దోపిడీ చేశారని, చీఫ్ నర్స్ వాహనాన్ని తగులబెట్టారని చెప్పారు. దేశంలో క్రైస్తవ, ముస్లిం మత గురువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. -
నోటర్–డామ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
పారిస్: ప్రఖ్యాత నోటర్–డామ్ కేథడ్రల్‌లో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్సు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. దాదాపు 15 గంటలపాటు శ్రమించిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఒక వైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మించేందుకు రూ.4వేల కోట్ల మేర సాయం అందజేస్తామంటూ ఫ్రాన్సుతోపాటు ఇతర దేశాల నుంచి కూడా దాతలు ముందుకువచ్చారు. ఈ ఘటన చాలా విచారకరమంటూ బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 పేర్కొనగా, నోటర్–డామ్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పోప్ ఫ్రాన్సిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఫ్రాన్సు వ్యాప్తంగా బుధవారం రాత్రి 6.50 గంటలకు అన్ని కేథడ్రల్‌లలో గంటలు మోగించాలని నిర్ణయించారు. ప్రమాదం తీవ్రత.. సోమవారం నాటి మంటల్లో కేథడ్రల్ పైకప్పు పూర్తిగా కాలి కూలిపోయింది. పెద్ద సంఖ్యలో సంఖ్యలో చిత్రాలు, కళాఖండాలు బూడిదయ్యాయి. దాదాపు 8 వేల పైపులతో కూడిన ఆర్గాన్ అనే భారీ సంగీత పరికరం కూడా బాగా దెబ్బతింది. అయితే, ఏసుక్రీస్తును శిలువ వేసిన సమయంలో ధరించినట్లుగా భావిస్తున్న ముళ్ల కిరీటం ‘ది హోలీ క్రౌన్ ఆఫ్ థోర్న్’ తదితరాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చర్చి గోడలు, గంట గోపురం, ప్రసిద్ధ గాజు కిటికీలు చెక్కుచెదరలేదు. చర్చిలో మంటలను ఆర్పేందుకు 400 మంది ఫైర్ సిబ్బంది 15 గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. మంటలకు కారణం.. 850 ఏళ్లనాటి ఈ కట్టడంలో ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 2022 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సిబ్బంది సీసం పూతను తొలగిస్తుండగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఈ పనుల్లో పాల్గొన్న ఐదు నిర్మాణ కంపెనీల సిబ్బందిని 50 మందితో కూడిన అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. చర్చిలో మంటల వెనుక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పర్యాటకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు..విరాళాలు..: సోమవారం రాత్రి ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రజాభీష్టం మేరకు నోటర్–డామ్‌ను పునర్నిర్మిస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను అందజేయాలని ఆయన కోరిన కొద్ది గంటల్లోనే ఫ్రాన్సుతోపాటు జర్మనీ, ఇటలీ, రష్యా నుంచి పలువురు ముందుకు వచ్చారు. ఫ్రాన్సు కోటీశ్వరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్, అతని ఎల్వీఎంహెచ్ కంపెనీ, కెరింగ్, టోట్ ఆయిల్, లోరియల్ కంపెనీలు తలా రూ.780 కోట్ల మేర అందిస్తామని ప్రకటించాయి. విరాళాల కోసం ప్రత్యేకంగా ఫ్రెంచి హెరిటేజ్ ఫౌండేషన్ ప్రత్యేకంగా www.fondation&patrimoine.org వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేథడ్రల్‌ను ఏటా 1.30 కోట్ల మంది సందర్శించుకుంటారు. -
పారిస్ నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో అగ్ని ప్రమాదం
-
పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
-
పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టించింది. 850 సంవత్సరాల అతిపురాతనమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు గాయపడ్డారనీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. 12వ శతాబ్దానికి చెందిన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చర్చి భవనంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను అక్కడనుంచి దూరంగా తరలించారు. కానీ 93 మీటర్ల (305 అడుగుల) శిఖరం కూలిపోయింది. అయితే అనేక అమూల్య కళాఖండాలు, చారిత్రక చిహ్నాలను భద్రపరిచారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్‌తో పాటు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదితర ప్రపంచ నేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు, లేడీ ఆఫ్ ప్యారిస్ మంటల్లో చిక్కుకుందంటూ ఇమ్యాన్యూల్ ఒక భావోద్వేగ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. పూర్తిగా కలపతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం యూరప్‌లో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. 1991లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. పురాతన చర్చిని పునరుద్దరించేందుకు ఫ్రాన్స్ చేపట్టే చర్యలకు సహాయం అందిస్తామని యునెస్కో వెల్లడించింది. The moment #NotreDame’s spire fell pic.twitter.com/XUcr6Iob0b — Patrick Galey (@patrickgaley) April 15, 2019 -
కొంచెం శక్తితోనే కొండంత ఫలితం....
‘నీకున్న శక్తి కొంచెమే అయినా నా వాక్యాన్ని అనుసరించావు, పైగా నన్ను ఎరుగనని అనలేదు’ అన్నది ప్రకటన గ్రంథంలోని ఫిలడెల్ఫియా చర్చికి పరిశుద్ధాత్ముడిచ్చిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’!! అందుకు బహుమానంగా, ఎవరూ మూయలేని ఒక తెరిచిన ద్వారాన్ని ఆ చర్చికి దేవుడు అనుగ్రహించాడు (ప్రక3:7–13). ప్రకటన గ్రంథంలోని ఏడు చర్చిల్లో ఫిలడెల్ఫియా చాలా చిన్నది. ఇప్పటి టర్కీ దేశంలో, రోమ్ నుండి ఆసియా కు వెళ్లే రహదారులన్నీ కలిసే ఒక ప్రాముఖ్యమైన కూడలి ప్రాంతమైన ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న చర్చి అది. ఎన్నో ప్రతికూలతలు, లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెల లేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చర్చి దేవుని ప్రసన్నుని చేసి ఆయన ప్రేమను సంపాదించుకొంది. ప్రతికూలతలను, శత్రువులను ఎలా ఎదుర్కొంటుందన్నదే ఏ చర్చి విశ్వాసానికి, విజయానికైనా గీటురాయి. అయితే ఆసుపత్రిలో రోగులున్నట్టే చర్చిలో పాపులు, ఆత్మీయంగా బలహీనులు, దీనులు తప్పక ఉంటారు. కాకపోతే తాము ఒక రోజున రోగవిముక్తులం కావాలన్న బలమైన ఆశ ఉన్న ఆసుపత్రి రోగుల్లాగే, తాము తప్పక పాపవిముక్తులం కావాలన్న ప్రార్థ్ధన, పట్టుదల, ప్రయాస కలిగిన పాపులున్న చర్చి దేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది. ‘పాపులముగానే చేరాము, పాపులముగానే చనిపోతాము’ అన్న మార్పులేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వల్ల చర్చికి, దేవునికి కూడా ప్రయోజనం లేదు. లోకంలో అంతా పాపులే, కాకపోతే క్షమించబడిన పాపులు కొందరు, ఇంకా క్షమించబడని పాపులు మరి కొందరు. పాపక్షమాపణానుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అలా జరుగక పోతే, చేరిన తర్వాతైనా పాపక్షమాపణను పొందితే ఆనందం. కాకపోతే చర్చిలో అంతా పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతిపరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమడలేరు. యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్లంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఫిలడెల్ఫియా చర్చికి ప్రభువు వెల్లడించాడు. అబ్రాహాము విశ్వాసవారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధంగా ఆయన వంశానికి చెందిన వారమని చెప్పుకొనే పరిసయ్యులను ఆనాడు యేసుప్రభువు ‘మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులు, అతని క్రియలు చేయగోరేవారు’ అంటూ ఘాటుగా విమర్శించాడు( యోహాను 8:44). నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా, తమ తాతలు తండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనని చెప్పుకొనే నామకార్ధపు తరతరాల క్రైస్తవులతో ఈరోజుల్లోనూ చర్చికి సమస్యలున్నాయి. అయితే వారిని విమర్శించడం, పరిహసించడం, వెళ్లగొట్టడం, సూటిపోటి మాటలనడం అందుకు పరిష్కారం కానే కాదు. యేసుప్రభువు అనుచరులమని చెప్పుకునే వాళ్లంతా యేసు ప్రేమకు, ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు!! మన ప్రేమ, క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపునకు తీసుకెళ్ళాలి. బైబిల్ కన్నా, దేవునికి సంబంధించి మనకున్న అనుభవ జ్ఞానం, దాని మూలంగా ఏర్పడిన విశ్వాసం, క్షమ, ప్రేమాపూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపర్చి ప్రభువు వద్దకు నడిపిస్తుంది. అందుకు ఎంతో జ్ఞానం, మరెంతో శక్తి అవసరం లేదు. సాత్వికత్వంతో తలవంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగల మన ‘కొంచెం శక్తి’ చాలు, ఫిలడెల్ఫియా చర్చిలాగా గొప్ప దేవునికోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసులమనిపించుకోవడానికి. సూపర్ మార్కెట్లో ఉండే వందలాది కొవ్వొత్తులకు చీకటి ఏ మాత్రం భయపడదు. కానీ పూరిగుడిసెలో మూలన వెలిగే ఒక చిన్నకొవ్వొత్తికి కారు చీకటి కూడా వణికి పారిపోతుంది. క్రైస్తవుడు కూడా సూపర్ మార్కెట్లో కొవ్వొత్తి కాదు, అతను వెలిగే కొవ్వొత్తి... అందుకే మరి, క్రైస్తవులెప్పుడూ మైనారిటీలే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడి సాక్షిగా మాట మార్చిన లోకేశ్..!
సాక్షి, తాడేపల్లిరూరల్: ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం చంద్రబాబు.. మేం తక్కువ తిన్నామా అంటూ ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మంత్రి ఆది.. మాదిగలు చదువుకోరంటూ వర్ల రామయ్య.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు అంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో తిరుగుతుండగానే.. సీఎం కుమారుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి దళితులను ఘోరంగా అవమానించారు. మంగళవారం మండలంలోని నవులూరులో లోకేశ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాప్టిస్ట్‌పేట చర్చిలోకి రావాల్సిందిగా సంఘపెద్దలు, పాస్టర్ ఆహ్వానించగా తాను రానని, చర్చిలోని వారే బయటకు రావాలంటూ లోకేశ్ హుకుం జారీ చేశారు. కంగుతిన్న సంఘ పెద్దలు, పాస్టర్, మరికొందరు దళితులు ‘దేవుడి దగ్గరకు మీరు రారా.. దేవుడే మీ దగ్గరకు రావాల్నా’ అంటూ ప్రశ్నలు కురిపించడంతో అవాక్కయిన లోకేశ్ మాట మార్చి ఎన్నికల కోడ్ ఉన్నందున చర్చిలోకి రాలేనని చెప్పి వెనుతిరిగారు. అయితే అక్కడి నుంచి బేతపూడి వెళ్లిన లోకేశ్ కారు దిగి రామాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న అనుచరుడు అక్కడ చర్చిలోకి వెళ్లలేదు కాబట్టి ఇక్కడ వెళ్లవద్దంటూ ఆపివేశాడు. అయితే ఇదే కోడ్ కొనసాగుతుండగా ఈ నెల 16వ తేదీన తాడేపల్లి మండలం గుండిమెడలోని వేణుగోపాలస్వామి ఆలయంలోపలికి ఎవరినీ అనుమతించకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని మరీ లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని దళితులు గుర్తు చేసుకున్నారు. గుడిలోకి వెళ్లి పూజలు చేసినప్పుడు ఎన్నికల కోడ్ గుర్తుకు రాలేదా, చర్చిలోకి రమ్మంటే మాత్రం ఎన్నికల కోడ్ గుర్తు వచ్చిందా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను టీడీపీ నాయకులు చిన్నచూపు చూడడం, అవమానించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు తమ మనసులో ఉన్న ద్వేషాన్నే దళితులపై చూపిస్తున్నారన్నారు. అది వారి తప్పు కాదని, తమను ఇంతగా అవమానిస్తున్నా ఇంకా టీడీపీలో ఉన్న దళితులే సిగ్గుపడాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరమదేవుని నివాస స్థలమది
మహా గోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. మన గురించి మనమేమనుకొంటున్నామన్నదానికన్నా, మన గురించి దేవుడేమనుకొంటున్నాడన్నది చాలా ముఖ్యమైన అంశం. లవొదికయలో నున్న చర్చికి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖ ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేవుని సాన్నిధ్యానికి, దేవుని ప్రసన్నతకు, పవిత్రతకు, ముఖ్యంగా దేవుని ప్రేమకు నిలయంగా దేవుడే నిర్దేశించిన స్థలం చర్చి. ఆదిమకాలంలో దేవుని ప్రేమను యేసుక్రీస్తులో సంపూర్ణంగా చవిచూసిన ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు ఆ ప్రేమనే లోకానికి ఆచరణలో చాటడానికి, ఆయన సాన్నిధ్యంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని లోకానికి రుచిచూపించేందుకు భూదిగంతాలకు వెళ్లి అనేక ప్రాంతాల్లో స్థాపించినవే ఆ చర్చిశాఖలు. అందువల్ల చర్చి దేవుని నివాసస్థలం, ఆశ్రితులు, నిరాశ్రయులు, నిరుపేదలు, సమాజంలోని బలహీనులు అక్కడి విశ్వాసుల సహవాసంలో వారి ఆదరణను, సహాయాన్ని, అనునయాన్ని పుష్కలంగా పొంది దేవుని ప్రేమను అనుభవించే పరలోకానందానికి సాదృశ్యస్థలం. అందుకే దేవుడు లవొదికయలోని చర్చికి రాసిన లేఖలో తన బాధనంతా వ్యక్తం చేశాడు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై, ఉన్నతవిద్యలనభ్యసించి, ఒక గొప్పసంస్థను స్థాపించి, సమాజంలో అత్యున్నతస్థానాన్ని, పేరుప్రఖ్యాతులను సంపాదించి, తన ఔన్నత్యానికి కారకులైన తల్లిదండ్రులనే చివరికి మర్చిపోతే అదెంత విషాదకరం? లవొదికయ చర్చిలో సరిగ్గా జరిగిందదే.‘నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అని నీవనుకొంటున్నావు కాని ఎంతోకాలంగా నేను బయట నిలబడి నీ తలుపు తడుతున్నాను కాని నీవు తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించడం లేదు’ అని దేవుడు తన లేఖలో ఆహ్వానించడం లేదన్నది ఆ చర్చిపై దేవుడు చేస్తున్న అభియోగం(ప్రక 3:14–21). మన భాషలో చెప్పాలంటే సెల్‌ఫోన్ అదేపనిగా మోగుతుంటే, ఎవరో అవతల మన తలుపు పదే పదే తడుతూ ఉంటే మనం స్పందించకుండా ఉండగలమా? కాని ఆ స్పందనే కరువైన చర్చి లవొదికయలోని చర్చి!! అందువల్ల ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ‘నీవు ఎదిగినా, నీకు ఎంత ధనమున్నా నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవే. ఎంతో సింగారంగా దుస్తులు ధరించుకున్నా పవిత్రత లేని దిగంబరివే. నీకు లోకమంతా ఎరిగిన జ్ఞానమున్నా నీది దైవత్వాన్ని ఎరుగని అంధత్వమే !!’ అని వాపోతున్నాడు దేవుడు. లోకాన్నంతా లోపలి తెచ్చుకొని అన్నింటికీ కారకుడైన దేవుణ్ణి మాత్రం తలుపు అవతల పెట్టిన ‘దేవుడే లేని చర్చి’ అది. అంతకన్నా మరో విషాదం ఉంటుందా?ఎన్ని ఉన్నా, అది దేవుడు లేని చర్చి అయినా, కుటుంబమైనా, విశ్వాసి అయినా వాళ్ళు ఏమీ లేనివారికిందే లెఖ్ఖ!! మహాగోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. చర్చిని చందాలతో కాదు, విశ్వాసుల సాక్ష్యంతో, వారి ప్రేమపూర్వకమైన పరిచర్య, క్రియలు, త్యాగంతో నిర్మించాలి. అలాంటి చర్చి యేసుక్రీస్తు పునరాగమనానికి లోకాన్ని సిద్ధం చేస్తుంది. చర్చిని ఆదిమ అపొస్తలులు స్థాపించడంలో ఉద్దేశ్యం కూడా అదే!! యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కృపను చర్చి తన పరిచర్య ద్వారా లోకానికి పరిచయం చేసి ఆయన రెండవ రాకడకోసం లోకాన్ని సిద్ధం చేయాలన్నదే చర్చి ముఖ్య లక్ష్యం. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పరిశుద్ధాత్మశక్తిలో ఐక్యత, పరిపూర్ణత...
‘మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అపుడు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, పిదప భూదిగంతాల దాకా మీరు నాకు సాక్షులై ఉంటారు’ అన్నది ఆదిమ అపొస్తలులకు, విశ్వాసులకు యేసుప్రభువు తన ఆరోహణానికి ముందు చేసిన వాగ్దానం(అపో.కా 1:8). యెరూషలేములో పెంతేకొస్తు నాడు మేడగదిలో ఆరంభమైన చర్చి అతి త్వరలోనే బాగా వ్యాప్తి చెందింది. అయితే ఉన్నట్టుండి చర్చి శ్రమలకు లోనైంది. క్రైస్తవం వ్యాప్తిని అడ్డుకోవాలన్న కంకణం కట్టుకున్న సౌలు అనే యూదు మతచాందసుడు, పరిసయ్యుడు, స్తెఫను అనే చర్చి పరిచారకుణ్ణి, దైవదూషకుడన్న నేరారోపణపై దగ్గరుండి మరీ రాళ్లు రువ్వించి చంపించాడు. యెరూషలేములోని చర్చికి, అక్కడి విశ్వాసులకు ‘పరిశుద్ధాత్మ శక్తి’ ఎలా ఉంటుందో, అసలదేమిటో అప్పుడర్ధమైంది. అద్భుతాలు చేసే శక్తిని మాత్రమే కాదు, ఆనందంగా ప్రభువు కోసం హత సాక్షి అయ్యే శక్తిని కూడా ఆ పరిశుద్ధాత్ముడే ఇస్తాడని, అది పరిశుద్ధాత్మశక్తిలో అంతర్భాగమని స్తెఫను మరణంతో చర్చికి అర్థమయింది, చర్చిని అందుకు సిద్ధపర్చింది కూడా !!! ఎందుకంటే తగాదాల్లో తలలు నరకడానికి అవసరమయ్యే శక్తి కన్నా వెయ్యిరెట్ల ఎక్కువ శక్తి మంచికోసం పాటుపడేందుకు, పదిమందికీ సాయం చేసేందుకు, ముఖ్యంగా ప్రభువు కోసం శ్రమపడేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనే నాణేనికి భాషల్లో మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం ఒక వైపైతే, శ్రమలు అనుభవించడం దానికి మరో వైపు. ఇందులో ఒకటి మాత్రం కావాలి, మరొకటి నాకొద్దు అనుకోవడానికి వీలు లేదు. నిజమైన పరిచారకుని జీవితంలో అద్భుతాలుంటాయి, శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమల కారణంగా యెరూషలేము చర్చి, విశ్వాసులు పలు ప్రాంతాలకు చెదిరిపోయి, ఆయా కొత్తప్రాంతాల్లో క్రైస్తవాన్ని ప్రకటించి పలు కొత్త చర్చిలు స్థాపించారు. ప్రపంచం నలుమూలలకు చర్చి వ్యాప్తి చెందేందుకు దేవుడు వాడుకున్న ఒక విధానం శ్రమలు. అలా చెదిరిపోయిన విశ్వాసులు యెరూషలేము చర్చి పరిచారకుడైన ఫిలిప్పు నాయకత్వంలో, నాటి దేవుని వాగ్దానం మేరకు సువార్త వ్యాప్తి కోసం సమరయ ప్రాంతానికి వెళ్లారు. సమరయలో ఫిలిప్పు ఎంత అద్భుతంగా, విజయవంతంగా సేవ చేశాడంటే ఆయనకు సహాయంగా యెరూషలేము చర్చి పేతురును, యోహానును కూడా సమరయకు పంపగా, వారందరి సేవతో సమరయలో చర్చి అక్కడ గొప్పగా విస్తరించింది. వాళ్ళు ఎవరి మీద చేతులుంచితే వారిమీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. మహా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. అసలు అపొస్తలులు సమరయకు వెళ్లడమే పరిశుద్ధాత్ముడు చేసిన ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే, ఒకే దేవుణ్ణి విశ్వసించేవారైనా సమరయులు యూదులకు అంటరాని వారు, వాళ్ళ మధ్య వందల ఏళ్లుగా సైద్ధాంతిక విభేదాలున్నాయి, ఆత్మీయంగా ఎంతో వైరముంది. అయినా ఆ విభేదాలను అధిగమించి అంటరానివారిని కూడా తమకు ఆప్తులైన వారుగా పరిగణించే అవగాహనను, ప్రేమను పరిశుద్ధాత్ముడు అపొస్తలులలో, ఆదిమ విశ్వాసుల్లో రగిలించాడు. వారికి సువార్త ప్రకటించి యేసుప్రభువులో అంతా సమానమేనని వారు ప్రకటించారు. పోతే అంతకుమునుపు అక్కడ సీమోను అనే గారడీవాడు తన కనికట్టువిద్యలతో అందరినీ భ్రమింపజేస్తూ బోలెడు పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. అయితే తన కార్యాలకు మించిన కార్యాలు అపొస్తలుల పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్నాయని చూసి, ముందు వారితో కలిసి తిరిగాడు. ఆ తర్వాత కొంత ద్రవ్యాన్ని వారికివ్వజూపి తాను కూడా పరిశుద్ధాత్మశక్తి ని పొందేలా చెయ్యమని కోరితే అపొస్తలులు అతన్ని తీవ్రంగా మందలించారు. మతాసక్తి, ధన సంబంధమైన దురాశ కలిసైనా నకిలీ పరిచారకులకు గారడీవాడైన సీమోను ఒక ఉదాహరణ. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో సీమోనులాంటి వారి కుతంత్రాలను తిప్పి కొట్టారు. అదే పరిశుద్ధాత్మ శక్తి అంటే!! అన్ని అంతరాలను, విభేదాలను, అడ్డుగోడలనూ ఆ శక్తి కూల్చేస్తుంది. అన్ని కుతంత్రాలనూ అది తిప్పి కొడుతుంది. ఇప్పుడు కూడా ఎవరైనా ‘మా చర్చే మంచిది, మాదే నిజమైనది’ అన్నట్టుగా మాట్లాడుతున్నా,వ్యవహరిస్తున్నా, వారికి పరిశుద్ధాత్మశక్తికి చెందిన వాస్తవాలు అర్థం కాలేదన్నది ఈ పరిణామాలను బట్టి తెలుస్తుంది. విడిపోవడానికి వంద కారణాలున్నా, అందరమూ ఆరాధించే దేవుడు యేసే అన్న ఒక్క కారణాన్ని బట్టి కలిసుండాలంటాడు పరిశుద్ధాత్ముడు. విభేదాలేర్పడి విడిపోవడం కన్నా, విడిపోవాలనుకొని విభేదాలు వెదుక్కునే ధోరణి, ధనార్జన కోసం ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకొనే స్వార్థం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అందుకే దేవుడొక్కడే అని చాటే క్రైస్తవంలో ఈనాడు ఇన్ని వర్గాలు, శాఖలు, ఇన్నిన్ని సిద్ధాంతాలు అన్న అపవాదు!! పరిశుద్ధాత్మునిలో ఐక్యతే ఉంటుంది తప్ప అనైక్యత ఉండదు, బీదా, గొప్ప, చిన్న, పెద్ద అన్న తారతమ్యాలుండవు (అపో.కా.1.8 అధ్యాయాలు). ఒకవేళ తప్పక అవసరార్థం విడిపోయినా వారి మధ్య వైషమ్యానికి తావు లేదు. శత్రువులను కూడా ప్రేమించాలన్న దేవుడు, సైద్ధాంతిక విభేదాలతో పక్క చర్చివాళ్లను ద్వేషించమని చెబుతాడా? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
స్పూర్తి కథలు
క్రిస్మస్ ప్రత్యేకం పవిత్ర గ్రంథం మనకు చెప్పేది కరుణలో, క్షమాగుణంలో, ప్రేమలో, ఆదరణలో, త్యాగంలో, సేవలో పవిత్రత ఉంటుందని. మన జీవితాలను నలుగురికి పనికి వచ్చేలా కొందరికి ఉదాహరణగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు అందిస్తున్న కొన్ని స్ఫూర్తికథలు... పంచదార మానేశాడు! కలకత్తాలో ఒకసారి పంచదారకు కొరత ఏర్పడింది. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో, నాలుగేళ్ల పసివాడు తన తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లం ఉంది. మదర్ థెరిసాకు ఆశ్చర్యమేసింది.‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు’’అని వాళ్లను అడిగారు మదర్.‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’.. చెప్పింది తల్లి.‘‘తన కోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్‌లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి.పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప,ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది.‘‘భగవంతుడు మనిషి మనసును ఎంత అందంగా సృష్టించాడు!’’ అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు మదర్.ఆ పిల్లవాడు అలా చేశాడంటే నమ్మాలని అనిపించకపోవచ్చు.దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పదనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. ‘‘గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అన్నది మదర్ చెప్పిన మాటే. ఎన్నో గుండెల తడి నారాయణరావుది శ్రీకాకుళం. చాలా రోజుల నుంచి గుండెనొప్పి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చి పెద్ద డాక్టర్‌కు చూపించుకోవాలనుకున్నాడు. మంచి పేరున్న ఓ డాక్టర్ గారి క్లినిక్‌కు కొడుకుతో పాటు వచ్చాడు. సరిగ్గా క్లినిక్ ముందు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్ వాళ్లు నారాయణరావును దగ్గర్లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.. ఉచితంగానే! పెద్దాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స మొదలుపెట్టాక గుండె స్పందనలు కాస్త బలహీనంగానే మొదలైనట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే స్పృహతప్పి ఉండటంతో మెదడు చేతనంగా ఉందో లేదో తెలియదు. కానీ తన తండ్రిని ఎలాగైనా బతికించమని కోరిన కొడుకు కన్సెంట్ మేరకు నారాయణరావుకు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన పేదరికం గమనించిన ఆసుపత్రివర్గాలు అత్యవసరమైన కొన్ని ఖర్చులకు తప్ప దాదాపుగా ఫీజు మాఫీ చేశాయి. ఇంతలో మరో కాంప్లికేషన్. అతడి కిడ్నీ ఫెయిలయ్యింది. నెఫ్రాలజిస్ట్ వచ్చారు. ఆయనా తన సేవల్ని చాలావరకు ఉచితంగానే అందించారు. మిగతా చికిత్సకోసం ఉస్మానియాకు తీసుకెళ్లమని, అక్కడ చికిత్సలన్నీ ఉచితంగానే జరిగేలా చూస్తామంటూ డాక్టర్లు సూచించారు. కానీ ఒకసారి చూపించుకొని వెళ్దామనుకున్న తాము ఇప్పటికే చాలా రోజులు హైదరాబాద్‌లో ఉండిపోవాల్సి వచ్చిందనీ, విశాఖపట్నానికి వెళ్తే తమకు ఒకింత సౌకర్యంగా ఉంటుందంటూ రోగి బంధువులు ఆయన్ని విశాఖకు తీసుకెళ్లారు. మొట్టమొదట చికిత్స అందించిన డాక్టర్ అతడి గురించి మరచిపోయారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒకరోజు నారాయణరావు తన కొడుకుతో కలిసి డాక్టర్గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నారాయణరావు కొడుకు డాక్టర్‌కు పాదాభివందనం చేశాడు. దాదాపు మృత్యువు ఒడిలో ఉండి, కిడ్నీలు దాదాపుగా పూర్తిగా విఫలమైన అతడు బతుకుతాడని అప్పుడెవరూ అనుకోలేదు. కానీ నారాయణరావు బతికి అలా నడిచివస్తుండటం చూసి డాక్టర్గారికి చాలా సంతోషంగా అనిపించింది. మొదట తాను, తర్వాత అంబులెన్స్‌వారు, పిమ్మట ఆసుపత్రి యాజమాన్యం, ఆ తర్వాత నెఫ్రాలజిస్ట్ చేయగలిగినంతా చేసి, రోగికి ఖర్చులు తగ్గించారు. విశాఖలోనూ అతడికి సేవల్ని చాలామంది దయతో అందించారని తెలిసింది. ఆ కొడుకు కూడా తనకు ఉన్నదంతా తండ్రి వైద్యం కోసం తెగనమ్మేశాడు. విలువలు లుప్తమైపోయాయని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ.. మనిషిలో మానవత్వం,కళ్లలో దయ, గుండె కింద తడి, మనసులో ఆర్ద్రత ఇంకా ఉన్నాయనీ ఈ సంఘటనతో మరోమారు రుజువైంది. తరాలుగా కృతజ్ఞత 1955 –1960ల నాటి రోజులు. ఒక పెద్దాయన తన కొడుకును చూడటానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి వస్తున్నాడు. గమ్యం మరో 50 కి.మీ. ఉందనగా బస్సు ఫెయిలయ్యింది. అప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. మరో రెండు గంటల్లో చీకటి పడితే బస్సులుండవు. పైగా చుట్టూ అడవి. చేసేదేమీ లేక ఆ పెద్దాయన తన తలపాగా బిగించికట్టి గమ్యం వైపునకు నడవడం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఒక మోటారు కారు ఆయన పక్కనే ఆగింది. అడవిలో అపరిచితులను నమ్మని ఆ రోజుల్లో కారులోని వారు కిందికి దిగి, ఈ టైమ్‌లో మీరెక్కడికి వెళ్తున్నారంటూ వాకబు చేశారు. పెద్దాయన జరిగింది చెప్పాడు.వాళ్లు నవ్వి.. ‘50 కి.మీ. నడుస్తూ వెళ్లగలరా? అందునా ఈ వయసులో’ అన్నారు. తామూ ఆ ఊరిమీదుగానే నగరానికి వెళ్తున్నామనీ, ఊళ్లో దింపేస్తామంటూ కార్లో ఎక్కించుకుని, కొడుకు దగ్గర దింపేసి వెళ్లారు. ఇప్పుడా పెద్దాయన తాలూకు నాలుగో తరం నడుస్తోంది. అప్పుడు ఆ పెద్దాయనకు సహాయం చేసిన ఆ మోటారు కార్లోని వ్యక్తులు బాగుండాలని, వాళ్ల కుటుంబాల్లోని వాళ్లు చల్లగా ఉండాలని, వాళ్ల తరతరాలూ తరగని వృద్ధిపొందాలంటూ ఈ నాల్గో తరం వారు ఇప్పటికీ ప్రార్థిస్తుంటారు. అలా తమ కృతజ్ఞతను వెల్లడిస్తూనే ఉన్నారు. అవును... మానవత్వం తరతరాలూ సాగితేనే కదా రాబోయే తరాలూ ఆ స్ఫూర్తిని తమ ముందుతరాలకు అందిస్తాయి. ఎవ్వరూ నో చెప్పలేదు! – జయసుధ, సినీ నటి అరుళ్ అనే అబ్బాయి గురించి చెప్పాలి మీకు. ఎప్పటిలాగే చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా ఓ ఐదు వేల రూపాయలు సహాయం చేద్దామనుకున్నాను. ఎవరికి అవసరమో తెలియదు కాబట్టి ‘‘నేనొక ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా సాయం అవసరమైన వాళ్లు ఎవరో కొంచెం చెప్పండి’’ అని అక్కడ ఉన్నవాళ్లను అడిగాను. వాళ్లు తలా ఓ పేరు చెప్పారు.సరే అని అనుకొనేలోపు నా వెనకనుంచి ఎవరో ఒకతను సడెన్‌గా వచ్చి ‘‘ 12 ఏళ్ల ఓ బాబు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. వీలైతే మీరు ఆ అబ్బాయికి సహాయం చేయండి’’ అని ఆ అబ్బాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పి వెళ్లిపోయాడు. నేనెప్పుడూ అతనిని అక్కడ చూడలేదు. ఎవరికైనా ఇద్దామనుకున్నా డబ్బే కదా అని, స్వయంగా ఆ అబ్బాయి వాళ్లింటికి బయలుదేరాను. చూసేసరికి చర్చిలో అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగానే బాబు పరిస్థితి దయనీయంగా ఉంది. నా చేతిలో ఉన్న ఐదు వేలు ఎందుకు ఉపయోగపడతాయి అనిపించింది. హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయి అని వాళ్లమ్మని అడిగాను. ఆమె చెప్పిన నంబర్ (నాలుగు లక్షలు) విని ఏం చేయలో అర్థంకాని నేను కష్టమైనా సరే... నా బడ్జెట్లో లేకపోయినా ఓ 25 వేలు సహాయం చేస్తాను అని చెప్పి ఇంటికొచ్చేశాను. దారి పొడవునా అరుళ్ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాడు. నాలుగు లక్షలే కదా, మీరే ఇవ్వలేరా అని మీరు అనుకోవచ్చు. కాని సడెన్‌గా అంత పెద్ద మొత్తం అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఎవరినన్నా అడుగుదామా అనిపించింది, కానీ నాలో నాకే నువ్వు.. ఇంత పెద్ద ఆర్టిస్టువి, నువ్వు ఎవరికోసమో డబ్బు సాయం చేయమని అడగటమేంటి అని నా మనసుకు అనిపించింది. మళ్లీ అంతలోనే దేవుని మాటలు గుర్తుకొచ్చాయి. ‘నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న మాటలు మళ్లీ మళ్లీ నాకు వినపడ్డాయి. నీకు అంతలేదు, నిన్ను నువ్వు తగ్గించుకొని చూడు, నువ్వు కేవలం జయసుధ అనే మనిషివి మాత్రమే అని దేవుడు అన్నట్లు అనిపించింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. ఏమయితే అది అయిందని మొదట నటుడు ప్రకాశ్‌రాజ్‌కి ఫోన్ చేశాను. ఆయన వెంటనే పాజిటివ్‌గా స్పందించి 25వేల రూపాయలు ఇస్తానన్నారు నిండు మనసుతో.అప్పటికి నాకు ఆయనతో అంత పరిచయం కూడా లేదు. హమ్మయ్యా ఇక ఎవరినైనా అడగొచ్చు అనే ధైర్యం వచ్చింది. వెంటనే హీరో అర్జున్‌కు ఫోన్ చేశాను. తర్వాత రాధిక, సుహాసిని, సీత, విజయశాంతిలతో పాటు లత, వాళ్ల తమ్ముడు రాజ్‌కుమార్ , తమిళ దర్శకుడు కె.యస్ రవికుమార్ ఇలా అందరూ ఎవ్వరూ నో చెప్పలేదు, వీళ్లతో పాటు ఇంకా చాలామంది. ఆ పిల్లాడి ట్రీట్మెంట్కి కావాల్సిన మొత్తం డబ్బు అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు గంటలో సమకూరాయి. నా జీవితంలో ఈ సంఘటను ఎన్నటికీ మరువలేను. కారణం ఏంటంటే ఆ రోజు క్రిస్మస్, దేవుడు నన్ను చూస్తున్నాడేమో అనే ఫీలింగ్.. మనల్ని మనం తగ్గించుకొని (అహం), మనకు చేతనైన సాయం చేయడం కంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఒక్కోసారి మాట సాయం కూడా ఓ జీవితాన్ని నిలబెడుతుంది. మంచినీళ్లమ్మ సత్యవతమ్మ అవకాశం వచ్చినప్పుడల్లా తనకు తోచిన మానవ సేవ చేస్తూండేవారు. ఆవిడకు ఆరు పదులు నిండేటప్పటికే చాలా జబ్బు పడ్డారు. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ‘నేను జబ్బు మనిషిని’ అని అనుకోకుండా, ఓపిక ఉన్నంత వరకు ఇతరులకు సేవ చేయాలి’ అనే భావనతో ఉన్నారు సత్యవతమ్మ. పిల్లలకు వివాహాలు అయిపోయి ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. భర్త కాలం చేయడంతో, ఒంటరి అయిపోయారు. నిత్యం సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా బావురుమంది. ఆత్మస్థైర్యంతో, ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డారు. ఇరుగుపొరుగు వారితోనే కాకుండా, ఆ వీధిలో సంచరించేవారితో సైతం ప్రేమగా ఉంటూ, ఒంటరితనాన్ని మరచిపోయారు. విజయవాడ అంటే ఎండలకు కొదవ ఉండదు. ఎన్ని చలివేంద్రం కేంద్రాలు పెట్టినా మధ్యాహ్నానికి నీళ్లు ఖాళీ అయిపోతాయి. ఒక చిన్న కాలనీలో చిన్న సందులో ఉండే సత్యవతమ్మ, ఆ రోడ్డులో తిరిగే రిక్షావారికి, కూరలు పళ్లు అమ్ముకోవడానికి వచ్చేవారికి మంచినీళ్లు అందించాలనుకున్నారు. నీళ్లు మోయడానికి పనివారి ఆసరా లేదు. మంచి చేయాలనే సంకల్పమే ఆవిడకు బలం చేకూర్చింది. ఒక మట్టి కుండ తీసుకువచ్చి, ఇంటి ముందు గేటు దగ్గర ఉంచారు. ఇంట్లో ఉన్న చిన్న గిన్నెతో పది సార్లు నీళ్లు తీసుకువచ్చి ఆ కుండలో పోశారు. పైన మూత, ఒక స్టీలు గ్లాసు ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకు కుండ నింపేవారు. మధ్యాహ్నం ఓ గంట కునుకు తీసి లేచి వచ్చి కుండ చూసేవారు. అప్పటికి కుండ ఖాళీ అయిపోయేది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయేది. అంతే మళ్లీ కుండ నింపేవారు. సాయంత్రానికి ఖాళీ అయిపోయేది. ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది. అలా మార్చి నెల నుంచి జూన్ వరకు నీళ్లు పెట్టేవారు. ఇలా సుమారు పది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి వేసవి కాలం ఆ ఇంటి ముందర మంచినీళ్లు దొరుకుతాయన్న భరోసా కలిగింది అందరికీ. ఒక రోజు కుండ చిన్నబోయింది. అదేమిటా అని ఆ వీధిలో నిత్యం సంచరించే రిక్షా వాళ్లు, çపండ్ల అమ్మకాల వాళ్లు ఇంట్లోకి తొంగి చూశారు. సత్యవతమ్మగారు ఆ రోజు తెల్లవారు ఝామున తీవ్రమైన గుండెపోటుతో కాలం చేశారని తెలుసుకున్నారు. ‘అయ్యో! నిన్న రాత్రి కూడా ఆ తల్లిని పలకరించి, మంచినీళ్లు తాగాం’ అనుకుంటూ అందరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చేతి నీళ్లు తాగిన వారి కళ్లు వర్షించసాగాయి. బరువెక్కిన గుండెలతో ఆ తల్లిని వేనోళ్ల పొగిడారు. పెద్ద కర్మనాడు వారంతా వచ్చి ‘అమ్మగారి ప్రసాదం’ అని స్వచ్ఛందంగా వచ్చి తిని, ‘మా తల్లి బతికున్నన్నాళ్లు కడుపు నిండా పలకరించే ది, మా దాహం తీర్చింది’ అనుకున్నారు. నెత్తుటి బంధం అప్పుడు జేమ్స్ హారిసన్‌కు పద్నాలుగేళ్లు. అతడిది ఆస్ట్రేలియా. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఛాతీకి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది. దానికిగానూ పదమూడు లీటర్ల రక్తం అవసరమైంది. ఎవరెవరో ఆయనకు రక్తదానం చేశారు. మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.కోలుకున్నాక, హారిసన్ తనకు తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎవరో తనకు పేరు కూడా తెలియనివాళ్లు ఇచ్చిన రక్తం వల్ల తాను బతికినప్పుడు, తాను కూడా మరొకరు బతకడానికి కారణం కావాలని అనుకున్నాడు. అట్లా ఆయన రక్తదానాలు చేయడం మొదలుపెట్టాడు.1936లో జన్మించిన హారిసన్ 1954లో తన తొలి రక్తదానం చేశాడు. కుదిరినప్పుడల్లా ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని దానాల తర్వాత వైద్యులు ఆయన రక్తపు ప్లాస్మాలో ఒక అరుదైన విశేషం ఉందని కనుగొన్నారు.సృష్టిలో కొన్ని ఎందుకు జరుగుతాయో అంతు పట్టదు. ఒక గర్భిణి రక్తంలోని యాంటీ బాడీస్ ఒక్కోసారి గర్భంలో ఉన్న శిశువు రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. దాంతో శిశువుకు రక్తహీనత కలుగుతుంది, కామెర్లు వస్తాయి. దీనికి విరుగుడు ఇవ్వకపోతే ప్రాణాపాయం. ఈ స్థితిని రీసస్ డిసీజ్ అంటారు. అయితే, దీనికి విరుగుడుగా పనికొచ్చే యాంటీ–డీ మెడిసిన్ అందరి రక్తంలో లభించదు. అది హారిసన్ రక్తంలో ఉందని కనుగొన్నారు. అరుదుగా తప్ప దొరకని యాంటీ–డీ హారిసన్ రక్తంలో ఉండటం ఒక విచిత్రమైతే, ఆయన ఎన్నో దానాలు చేయడానికి సంకల్పించుకుని ఉండటం మరో విశేషం. దీనివల్ల లభ్యత శాతం అత్యధికమైంది. 60 ఏళ్ల కాలంలో హారిసన్ అక్షరాలా 1,172 సార్లు రక్తదానం చేశాడు. అయితే, తన 81వ ఏట ఇంకా రక్తం ఇవ్వడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరించిన పిమ్మట, పైగా ఎనభై ఏళ్లు పైబడినవాళ్లు రక్తదానం చేయకూడదని ప్రభుత్వ నిబంధన కూడా ఉండటంతో మొన్న మే 11న తన చివరిదైన 1,173వ రక్తదానం చేసి తన పని నుంచి విరమణ తీసుకున్నాడు.హారిసన్ రక్తం నుంచి సేకరించిన యాంటీ–డీ మెడిసిన్ వల్ల సుమారు 24 లక్షల మంది పసివాళ్లకు ప్రాణాపాయం తప్పిందని అంచనా. ‘మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్’( బంగారం చేయి కలవాడు)గా ఆయన్ని ఆస్ట్రేలియన్లు ముద్దుగా పిలుచుకుంటారు. విడువని చెయ్యి లక్ష్మి గుర్తుందా? యాసిడ్ దాడి జరిగిన లక్ష్మి.. వెంట పడుతున్న ప్రేమకు ‘నో’ అని చెప్పినందుకు ఒంటి మీద యాసిడ్ కుమ్మరించారు. ఆమెతో పాటు దేశాన్నీ భయోత్పతంలోకి నెట్టిన సంఘటన అది.జరిగిన దారుణానికి భీతిల్లినా కుంగిపోలేదు. న్యాయపోరాటం చేసింది లక్ష్మి. ఆ పోరాటంలో ఆమెకు అండగా నిలబడ్డాడు యాక్టివిస్ట్ అలోక్ దీక్షిత్. ఆమెను చూసిన లోకం జడుసుకుని పక్కకు తప్పుకుంటుంటే ఆమె చేయి పట్టుకుని వెన్నంటి ఉన్నాడు. జీవన సహచరుడిగా మారాడు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. సామాజిక అడ్డంకులు ఎదురైనా ఆమె చేయి విడువలేదు. అలోక్ ఇచ్చిన సపోర్ట్‌తో న్యాయపోరాటంలో విజేతగా నిలిచింది. పోయిన సంతోషం తిరిగి ఆమె మొహంలో నవ్వై మెరిసింది. లక్ష్మి.. ఇప్పుడొక బిడ్డకు తల్లి! బాధను పంచుకుని.. ధైర్యాన్నిచ్చి నిజమైన స్నేహితుడిగా.. అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు అలోక్ దీక్షిత్. కైండెస్ట్ బాస్ అలు భత్రానియా... జేఆర్డీ (జహంగీర్ రతన్జీ దాదాభాయి)కి పదిహేనేళ్లుగా సెక్రటరీగా పనిచేశారు. కింది ఉద్యోగుల పట్ల ఆయన ఉండే తీరు, ఇచ్చే గౌరవం, చూపించే ఆపేక్ష గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజ్‌లో ఆమె ఇలా షేర్ చేసుకున్నారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పనిచేయడం నేర్పారు మా వాళ్లు. కాలేజ్‌లో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ నాన్నకు హెల్ప్ చేసేదాన్ని. 1961లో గ్యాడ్యుయేషన్ పూర్తయ్యాక టాటా స్టీల్‌లో చేరాను టెంపరరీ ఎంప్లాయ్‌గా. తర్వాత పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఈలోపే ఉద్యోగం చేస్తూనే లా కూడా కంప్లీట్ చేశాను. 1970ల చివర్లో ‘బాంబే హౌజ్’ ఫోర్త్ ఫ్లోర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. జేఆర్డీ టాటాకు సెక్రటరీగా రిక్రూట్ చేస్తున్నట్టు. నమ్మలేకపోయా. అప్పటి దాకా ఆయన గురించి వినడమే.. ఫొటోల్లో చూడ్డమే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన దగ్గర పనిచేయడం. ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.. ఆయన దగ్గర ఫస్ట్ డిక్టేషన్ తీసుకుంటున్నా.. చెమటతో అరచేతులు తడిసి ముద్దయిపోయాయి. అది ఆయన గ్రహించి వెంటనే చాలా క్యాజువల్‌గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. నా పట్లే కాదు కింది ఉద్యోగుల అందరిపట్లా ఆయనలాగే ఉండేవారు. అంతే కేరింగ్ చూపించేవారు. కైండెస్ట్ బాస్. ఫారిన్‌కి వెళ్లినప్పుడల్లా తోటమాలి పిల్లల కోసం చాక్లెట్స్ తెచ్చేవాళ్లు. లెక్కలేనంత మందికి ఆయన సహాయం చేయడం కళ్లతో చూశా. సాఫ్ట్ అండ్ హంబుల్ పర్సన్. బిజినెస్ పనులతో ఊపిరిసల్పనంత బిజీగా ఉన్నా.. చుట్టూ ఉన్న మనుషులతో గడిపేవాళ్లు. తనను నమ్ముకున్న వాళ్ల క్షేమాన్ని కాంక్షించేవాళ్లు. ఆయనతో కలిసి పనిచేయడమంటే ప్రతి రోజూ ఇన్స్పైర్ అవడమే. నిజాయితీ, హార్డ్‌వర్క్, పరులకు హెల్ప్ చేయడం.. ఆయనను చూసి.. తెలుసుకుని అలవర్చుకోవాల్సిన క్వాలిటీస్. ప్రపంచానికి ఆయన బిజినెస్‌మన్.. బట్ ది పర్సన్ హి వజ్ ట్రూలీ ఎ జెమ్. ఈ రోజుల్లో అలాంటి వాళ్లు కనిపించరు. ఆయనలో హాస్య చతురత కూడా అంతే.ఒకసారి నా బర్త్‌డేకి మా ఫ్యామిలీని ఒబేరాయ్లోని ఫ్రెంచ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. భోజనం అయిపోయాక బిల్ తెమ్మని అడిగారు. హోటల్ మేనేజర్ పరుగుపరుగున వచ్చి.. ‘‘మీరు బిల్ పే చేయడం ఏంటీ సర్’’ వద్దు అన్నాడు. ‘‘అయ్యో.. ఆ ముక్క ముందే చెబితే ఇంకొన్ని ఆర్డర్ చేసేవాళ్లం కదా’’ అన్నారు టాటా ఇన్నోసెంట్‌గా. ఆయనకు సెక్రటరీగా పదిహేనేళ్లు ఆయనకు సెక్రటరీగా పనిచేయడం నిజంగా నా బిగ్గెస్ట్ ప్రివిలేజ్. జేఆర్డీ టాటా సర్.. యూ ఆర్ స్పెషల్ బియాండ్ వర్డ్స్!’’ అని రాసుకున్నారు అలు భత్రానియా. శిబి, కర్ణుడు చిన్నబోయారు – ఆర్. నారాయణమూర్తి, నటుడు మానవత్వం అనగానే నలభై ఏళ్ల క్రితం నేను ఆమె పాదాలకు దణ్ణం పెట్టడం మాత్రమే గుర్తుకు వస్తుంది. అది 1970 ల ప్రాంతం. నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజి ప్రెసిడెంట్‌గా, సోషల్ సర్వీస్ సెక్రటరీగా చాలా యాక్టివ్‌గా తిరుగుతుండేవాడిని. ఆ టైమ్‌లో బీహార్‌లో బీభత్సమైన వరదలు వచ్చాయి. భారత ప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా పరిగణించింది. అప్పుడు మా కాలేజికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా కాలేజ్ పెద్దాపురంలో ఉండేది. కాలేజీ తరపున విద్యార్థులందరం వీధి వీధికి వెళ్లి అందరినీ బియ్యం, బట్టలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలా అన్ని వీధులు తిరిగిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ కొంతమందిమి కళావంతుల వీధికి వెళ్లాం. అక్కడ ఉన్న ఓ మహిళ దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని అడిగారు. మేము జరిగిన విషయం చెప్పాం. అయ్యో! అవునా పాపం, ఆగండి అని చెప్పి ఇంట్లోకి వెళ్లి , ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు తెచ్చి ఇచ్చింది. తర్వాత అందరిలో ఉన్న నన్ను కొద్దిగా పక్కకు పిలిచి ‘‘నేను దేవదాసి పనిచేస్తాను. రాత్రి బేరాలు ఏమీ రాలేదు.అందుకే డబ్బులు ఇవ్వలేక పోయాను. మీరు ఓ పని చెయ్యండి, రేపు ఉదయం వచ్చి నన్ను కలవండి. ఈ రోజు మంచి బేరాలు చూసుకుని వచ్చిన డబ్బంతా మీకే ఇస్తాను’’ అని అన్నది. సరే అనుకుని మా దారిన మేము వెళ్లిపోయాం. తర్వాత రోజు మేము సేకరించినవన్నీ తీసుకుని కాలేజీకి వెళ్లాం. అక్కడ నా స్నేహితుడు ఒకడు ‘‘మూర్తీ నిన్న మనం కళావంతుల వీధీలో ఒకామె డబ్బులు ఇస్తాను అన్నది కదా. ఓసారి వెళ్లి అడుగుదామా’’ అన్నాడు. అలాగే అంటూ ఇద్దరం కలిసి వెళ్లాం. ఆమె మాకు ఎదురొచ్చి ‘‘మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వస్తారా, రారా అనుకుంటున్నాను. రాత్రి బాగా బేరం జరిగింది. ఇవిగో తీసుకోండి’’ అంటూ ఆమె దగ్గరున్న మొత్తం డబ్బు నా చేతిలో పెట్టింది. అంతే నా కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా ఆమె కాళ్లమీద పడి దణ్ణం పెట్టాను. ‘‘ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవటం కంటే మంచి పని ఏదీ ఉండదు బాబూ. అదే మనల్ని కాపాడుతుంది’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆవిడలో ఉన్న దయ, కరుణ, మానవత్వం ముందు శిబి చక్రవర్తి, కర్ణుడు చిన్నగా కనిపించారు. నలభై ఏళ్లుగా ఈ విషయం గుర్తొస్తూనే ఉంటుంది. అయ్యో.. ఆమె పేరు అడగడం మర్చిపోయానే అని బాధతోపాటు. ఆమెలో కరుణ, దయ, మానవత్వం చూశాను. ఇద్దరు అతిథులు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే కేరళ రాజ్‌భవన్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రపతికున్న అధికారానుసారం ఆయన ఓ ఇద్దరిని తన అతిథులుగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలి. ఆ సమయంలో కలాం ఆహ్వానించిన అతిథులు ఎవరో తెలుసా.. తిరువనంతపురంలోని ఓ రోడ్డు పేవ్మెంట్ మీద చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ చిన్న హోటల్ ఓనర్. ఈ ఇద్దరూ అబ్దుల్‌కలాం మిత్రులు. తిరువనంతపురంలో ఆయన సైంటిస్ట్‌గా పనిచేసినప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరే చెప్పులు రిపేర్చేయించుకునేవారు. ఆ హోటల్లో తినేవారు. ఆ స్నేహమే ఆ ఇద్దరినీ రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి అతిథులను చేసింది. ఇంకొక సందర్భం. ఒకసారి వారణాసిలోని ఐఐటిలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు అబ్దుల్‌కలాం. వేదిక మీద అయిదు కుర్చీలు వేశారు. మధ్యలో పెద్దగా.. ప్రత్యేకంగా ఉన్న కుర్చీని కలాంకు కేటాయించారు. మిగిలిన నాలుగు యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ల కోసం. ఆ ప్రత్యేకతను గమనించిన కలాం ఆ కుర్చీలో కూర్చోడానికి తిరస్కరించి.. మిగిలిన నాలుగింటిని పోలిన కుర్చీనే తెప్పించి అందులోనే ఆసీనులయ్యారు. ఈ రెండు సంఘటనలు.. ఎదిగినకొద్దీ ఒదగమనే విషయాన్ని చెప్తున్నాయి. వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చారు ‘‘ఒకపక్కనేమో చీకటి పడుతోంది... ఇంటికెళదామంటే కారు టైర్ పంక్చర్. వయసా 80 దాటుతోంది పక్కనే 75 ఏళ్ల శ్రీమతి. పోనీలే ఎవరికైనా ఫోన్ చేసి రమ్మందామా అంటే సిగ్నల్ అస్సలు లేదు. ఐదేళ్ల క్రితం ధార్వాడ శివార్లలో ఉండే కెల్గేరి సరస్సు వద్ద ఇదీ నా పరిస్థితి. సాయంకాలం అలా కాసేపు తిరిగి వద్దామని సరస్సు వద్దకు వెళ్లామా.. కారు పార్క్ చేసి ఇల్లాలితో మాట కలిపి నాలుగు అడుగులేశామో లేదో.. టైమ్ అస్సలు తెలియలేదు. తిరిగి కారు దగ్గరకొచ్చి చూస్తే టైర్ పంక్చర్. ఏం చేయాలబ్బా అనుకుంటూ తలగోక్కున్నా.. ఏదైతే అది అయిందనుకున్నాం. కారు హెడ్లైట్లు వేసిపెట్టాలని తీర్మానించుకున్నాం. కాసేపటికే ఓ ట్రక్కు రయ్యి మంటూ దూసుకెళ్లిందిగానీ.. మా కేకలు వినిపించాయో లేదో... ఆగలేదు. బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న టైమ్ వచ్చారు వాళ్లునలుగురు ఉన్నారు. రెండు బైక్‌లపై మమ్మల్ని దాటుకుంటూ కాస్త దూరం వెళ్లిన వాళ్లు కాస్తా వెనుదిరిగారు. దగ్గరికి వచ్చారు. ‘‘తాతా ఏమైనా ఇబ్బందా?’’ అని అడిగారు. ప్రాణం లేచొచ్చినట్లు అయింది నాకు. విషయం చెప్పా. ‘‘కార్లో కిట్ ఉందేమో చూడండ్రా’’ అని వాళ్లల్లో ఒకరు బైక్ దిగాడు. డిక్కీ ఓపెన్ చేస్తూంటే వాళ్లు తమని అనిల్, సునిల్, ప్రతీక్, వికాస్‌లుగా పరిచయం చేసుకున్నారు. దగ్గరలోని ఊళ్లో మంచానపడ్డ తాతను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారంట. అనిల్, సునీల్‌లు బైక్ హెడ్‌లైట్ ఆన్ చేసి కారుపై ఫోకస్ చేస్తే.. ప్రతీక్, వికాస్‌లు డిక్కీలోని కారు బయటకు తీయడం.. పంక్చరైన టైర్ స్థానంలో బిగించడం టకటకా జరిగిపోయాయి. సమయానికి దేవుళ్లలా వచ్చారయ్యా అంటూ కాసిన్ని డబ్బులు వాళ్ల చేతుల్లో పెట్టబోయో... ‘‘మా తాతతోనైతే డబ్బులు తీసుకుంటామా?. ఒద్దు పెద్దాయన’’ అనేశారు. వాళ్లదారిన వాళ్లు.. నా దారిన నేను వచ్చేశాం. ఐదేళ్లు అవుతున్నా.. ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా... మనసంతా హాయిగా అనిపిస్తుంది’’ – అమృత్ రావు కాలే, బెంగళూరు గాజు పెంకులు డిఆర్డివో ప్రాజెక్ట్ బిల్డింగ్ పూర్తయ్యాక అబ్దుల్‌కలామ్ దాని ప్రారంభోత్సవానికి వచ్చాడు. ప్రహరీ గోడ మీదుగా చూసిన ఆయన ఆశ్చర్యపోతూ అక్కడే ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్‌తో ‘ఆ గోడ మీదుగా గాజు పెంకులన్నీ ఎందుకలా అమర్చి పెట్టారు చుట్టూతా అన్నాడు.’ రక్షణ కోసం అలా గాజు పెంకులను అమర్చాం’ అన్నాడు అతను మరింత నైపుణ్యాన్ని చూపామని గర్వంగా! ‘మన రక్షణ అనుకున్నది మరొకరి పాలిట శిక్ష అవుతుంది. ఆ గాజు పెంకుల మీద పక్షులు వాలితే ..’ అని ఆగిపోయాడు అబ్దుల్‌కలామ్. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ వెంటనే ఆ గాజు పెంకులను తొలగించడానికి మనుషులను పురమాయించాడు. డబ్బులే తీసివ్వాలా? రెడ్ సిగ్నల్ కనిపించడంతో ఫుట్‌పాత్ సపోర్ట్ తీసుకుంటూ బండిని ఆపా. సరిగ్గా సిగ్నల్‌కు ఎదురుగా.. ఫుట్‌పాత్ ఎండింగ్లో ఏదో గొడవ జరుగుతోంది. ఏంటా గొడవ? ముందున్న వ్యక్తిని అడిగా.. ఏమో తెలియదన్నాడు. బండి మీదే కాస్త పైకి లేచి చూశా... ముసలాయన, ఓ యువకుణ్ని పట్టుకొని తిడుతున్నాడు.. రేయ్.. నీకు సిగ్గులేదా? చూడ్డానికి ఆంబోతులా ఉన్నావ్..! తల్లిని రోడ్డు మీద అడుక్కోమని కూర్చోబెడుతున్నావ్! అసలు నువ్వు మనిషివేనా? అని. దానికి ఆ యువకుడు సమాధానమేదీ చెప్పకుండానే నవ్వుతూ వెళ్లిపోయాడు. ముసలాయన తిట్లు మాత్రం ఆగడం లేదు. అలా తిట్టుకుంటూ నావైపే వచ్చాడా ముసలాయన. ఏం తాతా.. ఎందుకు తిడుతున్నావని అడిగా. ‘లుచ్చాగాడు’.. కాళ్లు లేని తల్లిని తీసుకొచ్చి, అడుక్కోమని ఇక్కడ కూర్చుండబెట్టి వెళ్తున్నాడు. మళ్లీ వస్తాడు.. డబ్బులన్నీ తీసుకొని పోతాడు. లుచ్చాగాడు.. లుచ్చాగాడు. తిట్టుకుంటూ వెళ్లిపోయాడు తాత. ముసలాయన అంతగా తిట్టినా.. ఆ యువకుడు మాత్రం నవ్వుకుంటూ వెళ్లడం నాకెందుకో ఆశ్చర్యం కలిగించింది. తిరిగి చూశా.. ఆ యువకుడి ఎక్కి వెళ్లిపోతున్న ఆటో ఎంతో దూరం పోలేదు. వెంటనే బండి యూటర్న్చేసి ఆటో వద్దకు వెళ్లా. అరేయ్.. బాబు, ఆ పెద్దాయన అంతగా ఎందుకు తిట్టాడు నిన్ను? అని అడిగా.సమాధానం చెప్పలేదు. మీ అమ్మను అడుక్కోవడానికి రోజూ ఇక్కడ కూర్చోబెతావట.. నిజమేనా? అని అడిగా. సమాధానం చెప్పలేదు! నేనెవరో తెలుసా? రిపోర్టర్‌ను.. పోలీసులకు చెప్పి, లోపలికి పంపించమంటావా? అని బెదిరించా. అప్పుడు ఆ యువకుడు చెప్పిన మాట విని.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా!‘ఆమె మా అమ్మకాదు.. మా అపార్ట్మెంట్ పక్కన రేకుల ఇంట్లో ఉంటది. రెండు కాళ్లు లేవు.. ఏ పనీ చేయలేదు. మొన్నటిదాకా అమెతోపాటు ఓ పిల్లగాడుంటుండే. రోజూ వాడే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి, తీసుకెళ్లెటోడు. వారం కిందట.. ఇంట్లో పైసలన్నీ తీసుకొని పరారైండట. ముసల్ది.. లబోదిబోమంటూ ఏడుస్తుంటే.. వారం రోజులుగా నేనే ఇక్కడికి తీసుకొచ్చి దించుతున్నా. ఆమెకు ఇయ్యడానికి నా దగ్గర పైసల్లేవ్..! నేనే.. పైసల కోసం స్విగ్గీల పనిచేస్తున్నా. కమ్ సె కమ్ ఇడదాక దించుతేనైనా ఆమెకు బతకనీకి కొన్ని పైసలొస్తయ్’ అని చెప్పడంతో నా నోట మాట రాలేదు. మరి ఆ ముసలాయన అంతగా తిడుతుంటే.. చెప్పొచ్చుగా? అని అడిగితే.. ‘ఆ పెద్దాయన తిట్టి ఎళ్లిపోయిండు. నిన్న ఒకోడైతే చెంపమీదనే కొట్టిండ’ని చెబుతుండగానే ఆటో కదిలింది. ఆ యువకుడు వెళ్లిపోయాడు. జర్నలిస్టును కదా.. వాడు చెప్పిన దాంట్లో నిజమెంతో? అబద్ధమెంతో? తెలుసుకుందామని.. సిగ్నల్దగ్గర అడుక్కుంటున్న ఆమె దగ్గరకు వెళ్లి అడిగా.. ఆ యువకుడు చెప్పింది అక్షరాలా నిజమే! చెంపదెబ్బతో సహా. సాయం చేయాలంటే జేబులో నుంచి డబ్బులే తీసియ్యాలా? మనసులోని దయా, కరుణను కాస్త ఖర్చుచేసినా చాలనిపించింది! – సుధాకర్, హైదరాబాద్ పిట్టలకు ప్రాణమిచ్చాడు అసలే ఆయన ఓ రైతు.. పేరు అశోక్ సోనులే. ఉండేదేమో మహారాష్ట్రలో. అది కూడా కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో! ఉన్నదేదో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మరీ ఖర్చుపెడతాడని అనుకునేందుకు ఇంతకంటే పెద్ద వివరాలు అక్కరలేదు. కానీ.. నిజం ఇది కాదు. అరకొర వర్షాలతో పంటలు పండని దుస్థితి ఉన్నా... చేసిన అప్పులు తీరక తోటిరైతులు అంత విషం తీసుకుని నేలకు ఒరుగుతున్నా...తనకున్న పిసరంత ఆసరాను కూడా పాలపిట్టలకు, పిచ్చుకలకు వదిలేసిన గొప్పమనసు అశోక్ సోనులేది. కొల్హాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని గడ్మడ్షింగీలో ఇద్దరు సంతానంతో కలిసి పొలం పనులకెళ్లే అశోక్‌కు తండ్రుల నుంచి వచ్చిన భూమి ఓ పావు ఎకరం మాత్రం ఉంది. ఎప్పట్లానే ఆ ఏడాది కూడా జొన్నలైతే విత్తాడు కానీ.. వర్షాభావంతో పంటపై ఆశమాత్రం పెట్టుకోలేదు. చిత్రమో.. మహత్యమో తెలియదుగానీ.. ఆ ఏడాది అశోక్ పంట విరగకాసింది. హమ్మయ్యా.. ఏళ్ల తరువాతైనా ఒక్క పంట చిక్కింది కదా అనుకున్నాడు. కోతలకు సిద్ధమయ్యాడు. పొలం మధ్యలో ఉన్న బాబూల్ చెట్టును కూడా కొట్టేస్తే నాలుగు గింజలు ఎక్కువ దొరుకుతాయి కదా అని గొడ్డలితో బయలుదేరాడు. తొలి వేటు వేసేలోపు... చెట్టుపైనే గూడు కట్టుకున్న పిట్టలు కువకువలు మొదలుపెట్టాయి. వాల్మీకికి పక్షుల శోకం నుంచి శ్లోకం పుట్టుకొచ్చినట్లు.. బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్లు అశోక్ మదిలో చెట్టు కొట్టేస్తే.. పిట్టల పరిస్థితి ఏమిటన్న ఆలోచన మొదలైంది. గొడ్డలి పక్కకు ఒరిగిపోయింది.తన కష్టాలు తనకెలాగూ ఉన్నాయి. చెట్టు కొట్టేస్తే పిట్టల గూళ్లు చెదరిపోతాయి. పంట తీసేస్తే కాసిన్ని గింజలూ దొరకవు కదా? అనుకున్నాడు. కోతలకు స్వస్తి చెప్పేశాడు. కుటుంబంతో కలిసి ఆ పక్షులకు కాసిన్ని నీళ్లు అందేలా ఏర్పాట్లు చేసేశాడు. అమ్మకు అన్నం పెట్టాలన్నా లక్ష లెక్కలేసుకునే ఈ రోజుల్లో అశోక్ వంటి వారు అరుదే! చిట్టి చేతులు అది పెంపుడు కుక్క కాదు. చెత్త కుప్ప దగ్గర కడుపు నింపుకునే వాటిలో అదీ ఒకటి. చలాకీగా ఉండేది. ఊరంతా తనదే అయినట్టు తిరిగేది. అలాంటిది అది తల నేలకేసి పదే పదే బాదుకుంది. ముందరి కాళ్లతో టపీ టపీమని ముఖాన్ని కొట్టుకుంది. కానీ, ముఖానికి పట్టుకున్న భూతాన్ని వదిలించుకోవడం దాని వల్ల కావడంలేదు. పొడవాటి తెల్లటి డబ్బా అది. మెడ నుంచి మూతిని దాటి నాలుగు అంగుళాల ముందుకు పొడుచుకువచ్చింది. దాని శక్తి కొలదీ బాదుతూ ఉండటం వల్ల డబ్బా అడుగు భాగం అయితే పూర్తిగా పగిలింది కానీ, ఆ డబ్బా ఊడిరాలేదు. బహుశా చెత్త కుప్ప దగ్గర పడి ఉన్న డబ్బాలోని ఆహారం తినడానికి అందులో మూతి పెట్టి ఉంటుంది. వీలుకాక మూతి బయటకు తీసేటప్పుడు దానికి తెలియలేదు ఆ డబ్బా తన తలను మింగేసిందని. తను విశ్వ ప్రయత్నం చేసింది. డబ్బా ఊడిరాలేదు.వాడవాడలా తిరిగింది. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని రోజులయ్యిందో గుక్కెడు నీళ్లు తాగి. ఒంట్లో శక్తి లేక ముందరి కాళ్లతో మాత్రమే అతి కష్టంగా అడుగులు వేస్తూ వెనక కాళ్లను ఈడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. చివరాఖరకు తన చావు ఖాయం అనుకుంది. ఓ పాడుబడిన గోడ కనిపిస్తే ఎలాగోలా దేహాన్ని ఈడ్చుకుంటూ దాని దాపుకు చేరింది. తల నిలబెట్టే శక్తిలేక నేలకు వాల్చింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ తలను ఓ రెండు చేతులు ఎత్తిపట్టుకున్నాయి. దాని కళ్లు మెరిశాయి. ఒంట్లోకి ఏదో శక్తి వచ్చినట్టు తల పైకెత్తింది. తన తలను పట్టుకున్న చేతులు డబ్బాను చీల్చుతున్నాయి. తనకు పట్టిన భూతంతో ఏ దేవుడో యుద్ధం చేస్తున్నాడు. అపురూపంగా చూస్తోంది అది. డబ్బా ముందు భాగమంతా తీసేసిన ఆ చేతులు మెడకు పట్టిన మిగతా భాగాన్ని కూడా జాగ్రత్తగా విరగ్గొట్టాయి. పోయిందనుకున్న ప్రాణం లేచొచ్చింది. ప్రాణం పోసిన ఆ చిట్టి చేతులను భక్తిగా నాలుకతో స్పర్శించింది అది. తోటి పిల్లలతో ఆడుకుంటూ, పడిపోయిన బాల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ ఐదేళ్ల పిల్లాడి ముఖం విప్పారింది. జానే కహా గయే వో దిన్ పాటలో భావం, రాగం మాత్రమే కాదు కనికరం కూడా ఉంటుంది. ముఖేశ్ పాటలు దయగా, వాత్సల్యంగా, వేదనలో సహబాటసారుల్లా ఉంటాయి. ‘కిసీకా దర్ద్ మిల్ సకేతో లే ఉధార్’ అన్నాడాయన ఒక పాటలో. అంటే ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని అప్పుగా అయినా అడిగి తీసుకో అని అర్థం. అలా తీసుకోవడాన్నే జీవితం అంటారనీ ‘జీనా ఇసీకా నామ్ హై’ అని కూడా అన్నాడు.ముఖేశ్ అప్పట్లో స్టార్డమ్లో ఉన్నాడు. ఆయనకు శివుడంటే ప్రీతి. ఆయన పేరు కూడా శివునిదే కదా. ఒకసారి ఆయన అభిమానులను కలుస్తూ నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించాలని అనుకున్నాడు. ఆయన వస్తున్న కబురు ముందే అందింది. కాని ఆయన రాక మాత్రం ఆలస్యమైంది. దాదాపు రాత్రి పది గంటలు దాటేశాయి. అప్పటికే ఆలయం మూసేయాల్సిన సమయం కానీ ముఖేశ్ వస్తున్నాడని అధికారులు తెరిచిపెట్టారు. అప్పటికి అది చలికాలం. డిసెంబర్ నెలలో ఆ ప్రాంతంలో చలి గడ్డ కట్టించేలా ఉంటుంది. ముఖేశ్ ఆలయానికి చేరుకున్నాడు. అందరూ ఎదురొచ్చి స్వాగతం చెపుతూ లోపలికి తీసుకెళ్లబోయారు. ఆయన మెట్లెక్కుతూ ఆ మెట్ల మీద ఉన్న బిచ్చగాళ్లను చూసి ఆగిపోయాడు. వాళ్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేక చలికి వొణుకుతున్నారు. ‘వీళ్లంతా ఇలా పడుకున్నారేమిటి? దుప్పట్లు లేవా?’ అని అడిగాడు ముఖేశ్. ‘వాళ్లకది మామూలే. మీరు పదండి’ అన్నారు నిర్వాహకులు.‘లేదు.. లేదు.. వీళ్లిలా వణుకుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా. ముందు దుప్పట్లు, కంబళ్లు తీసుకురండి. డబ్బిస్తాను’ అని డబ్బులు తీశాడు.నిర్వాహకులు ఇరకాటంలో పడ్డారు.‘సార్... ఇప్పుడు దుకాణాలు ఉండవు. రేపు ఉదయం తెచ్చి ఇస్తాం. ముందు మీరు పదండి. దర్శనానికి ఆలస్యం అవుతుంది’ అన్నారు.‘ముందు మానవ సహాయం... తర్వాతే దైవ సేవ’ అన్నాడు ముఖేశ్.నిర్వాహకులు పడుతూ లేస్తూ ఊళ్లో తెరిచిన వారి దుకాణం తెరిపించి దుప్పట్లు, కంబళ్లు ముఖేశ్ డబ్బుతో కొని తెచ్చారు. ముఖేశ్ వాటిని ఆ బిచ్చగాళ్లందరికీ పంచాడు. వాళ్లు వాటిని తీసుకుని కప్పుకోవడం చూసే తృప్తిగా గుడిలోకి అడుగు పెట్టాడు. ఇలా చేసిన వాడి పాట దేవుడు వినకుండా ఉంటాడా? పెద్ద మచ్చ 1961లో రాజ్‌కపూర్ తాష్కెంట్ టూర్ చేశాడు. అప్పటికే అతడు సోవియెట్ రష్యాలో కూడా సూపర్‌స్టార్. తాష్కెంట్ సోవియెట్‌లో భాగం. అక్కడ తన ట్రూప్‌తో షోలు చేయడానికి వెళ్లాడు. తనతో పాటు అప్పుడప్పుడే గుర్తింపు పొందుతున్న గాయకుడు మహేంద్ర కపూర్‌ను కూడా తీసుకెళ్లాడు. రాజ్ కపూర్ ప్రతి షోలో ‘మేరా జూతా హై జపానీ’ పాడితే జనం వెర్రెత్తి పోయేవారు. కాని మహేంద్ర కపూర్ అప్పటికే తనకు హిట్‌గా నిలిచిన ‘హే... నీలే గగన్ కే తలే’ పాటను రష్యన్ భాషలో అనువదించి తమ స్లాట్ వచ్చినప్పుడు హిందీ వెర్షన్ కాకుండా ఆ రష్యన్ వెర్షన్ పాడటం మొదలెట్టాడు. ఆ దెబ్బకు అక్కడి జనం మహేంద్ర కపూర్‌కు జేజేలు పలకడం మొదలెట్టారు. రాజ్‌కపూర్‌కు ఒకటి అర్థమైంది. షోస్ తన వల్ల హిట్టేగానీ మహేంద్ర కపూర్ వల్ల ఇంకా హిట్ అయ్యాయని. ఆ రోజు రాత్రి హోటల్‌ను మహేంద్ర కపూర్ కలిసినప్పుడు ‘నువ్వు రావడం మంచిదయ్యింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి ఏదైనా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను. కాని నిన్ను నా గాయకుడిగా పెట్టుకోలేను. ఎందుకంటే ముకేశే నా పాటలన్నీ పాడతాడు. కాని నేను వెంటనే తీయబోయే సినిమాలో సెకండ్ హీరోకి మాత్రం నీచే ఒక పాటైనా పాడిస్తాను’ అన్నాడు. రాజ్ కపూర్ సినిమాలో పాట అవకాశం అంటే చాలా పెద్ద లాటరీ కిందే లెక్క.మహేంద్ర కపూర్ నవ్వి ‘సార్.. మీరు చాలా పెద్దవారు. ఇప్పుడు ఈ ఉద్వేగంలో ఇలా అంటారు. కాని ఇండియా వెళ్లాక మీ పనుల్లో పడి ఇచ్చిన మాటను మర్చిపోతారు’ అన్నాడు.రాజ్ కపూర్ ఒక నిమిషం ఆగి మహేంద్ర కపూర్‌ని చూశాడు. ఆ క్షణంలో తను తాగుతున్న సిగరెట్‌ను నోట్లో నుంచి బయటకు తీసి వెంటనే మణికట్టు మీద చిన్నగా కాల్చుకున్నాడు.మహేంద్ర కపూర్ ఉలిక్కి పడ్డాడు.‘చూడు... ఇక్కడ మచ్చ పడింది. ఈ మచ్చ నీకిచ్చిన మాట నాకు గుర్తు చేస్తుంది. ఈ మచ్చ కంటే కూడా పెద్ద మచ్చ ఏమిటో తెలుసా? ఇచ్చిన మాటను మర్చిపోవడం. మాట నిలబెట్టుకోవడం కూడా ఒక రకమైన దైవారాధనే’ అన్నాడు.ఇండియాకు తిరిగి వచ్చాక రాజ్ కపూర్ తీసిన సినిమా ‘సంగమ్’.అందులో మహేంద్ర కపూర్ ఏ పాట పాడాడో మీరే గుర్తించండి. ‘మీరే వీఐపీలు’ అది 1990 ఎండాకాలం. లీనాశర్మది అస్సాం. ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తున్న లీనా తన స్నేహితురాలితో కలిసి లక్నోలో ఢిల్లీ వెళ్తున్న ట్రెయిన్ ఎక్కారు. వీళ్ల బోగీలో ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ఎంపీలతో పాటు రిజర్వేషన్లేని మరో పన్నెండు మంది మగవాళ్లు ఉన్నారు. వాళ్లు అతిగా అరవడం, దుర్భాషలాడటం, వీళ్ల సీట్లలో వీళ్లను కూర్చోలేకుండా చేయడం, ఇంత జరుగుతున్నా ఆ ఎంపీలు నోరు మెదపకపోవడం జరిగింది. ఆ రాత్రి దుర్భరంగా గడిచాక తెల్లారి వీళ్లు ఢిల్లీలో దిగారు.అక్కడినుంచి అహ్మదాబాద్ ట్రెయిన్ పట్టుకున్నారు. కానీ రిజర్వేషన్ చేయించే వీలు లేదు. వీళ్లు టీటీఈని కలిసి తమ పరిస్థితి చెప్పుకున్నారు. ఆయన ఒక కూపె దగ్గరికి తీసుకెళ్లి, ‘ప్రస్తుతానికి ఇందులో కూర్చోండి’ అన్నాడు. ఆ కూపెలో ఇద్దరు కూర్చున్నారు. వాళ్ల ఖాదీ బట్టలను చూస్తే రాజకీయ నాయకులని అర్థమవుతోంది. పెద్దాయనేమో నలభైల్లో ఉన్నాడు. చిన్నాయన ముప్పైల్లో ఉన్నాడు. రాత్రే మరో అనుభవం జరిగివున్న దృష్ట్యా ఈ యువతులు తటపటాయిస్తుంటే టీటీఈ, ‘ఏం ఫర్లేదు, వీళ్లు ఈ రూట్లో రెగ్యులర్ ప్యాసెంజర్లే’ అని భరోసా ఇచ్చాడు.ఆ నాయకులిద్దరూ తాము మూలకు సర్దుకుని బెరుగ్గా ఉన్న యువతులను వీలైనంత సౌకర్యంగా కూర్చునేలా చూశారు. నెమ్మదిగా మాటలు కలిశాయి. వాళ్లు గుజరాత్ బీజేపీ నాయకులని తెలిసింది. చరిత్ర, రాజకీయాలు, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ దాకా చర్చ సాగింది. ఇంతలో నాలుగు ప్లేట్ల భోజనం వచ్చింది. బిల్లు వీళ్లను కట్టనీయకుండా ఆ యువనాయకుడు చెల్లించాడు.ఈలోపు టీటీఈ తిరిగొచ్చి, ‘ఎక్కడా బెర్తులు లేవు, ఏమీ చేయలేను’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఆ యువతులు ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటే, ఆ ఇద్దరు నాయకులు ‘మరేం ఫర్లేదు, మేము సర్దుకుంటాం’ అని చెప్పి, ఈ ఆడవాళ్లకు బెర్తులు ఇచ్చేసి వాళ్లు కింద బట్టలు పరుచుకుని పడుకున్నారు. తెల్లారి వీళ్లు దిగేముందు, అహ్మదాబాద్‌లో ఎక్కడ బస చేశారనీ, అవసరమైతే తమ ఇంటికి రావొచ్చనీ పెద్దాయన వీళ్లను ఆహ్వానించాడు. తాను దిమ్మరిని కాబట్టి తనకో ప్రదేశమంటూ లేదనీ, కానీ పెద్దాయన ఆహ్వానాన్ని మీరు అంగీకరించవచ్చనీ చిన్నాయన వత్తాసు పలికాడు. వసతికి తమకే ఇబ్బంది లేదని చెప్పి, దిగేముందు మరిచిపోకుండా రాసుకుందామని వాళ్లపేర్లు అడిగారు లీనాశర్మ. అప్పుడు వాళ్లు చెప్పిన పేర్లు: శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ. శుద్ధమైన కోరిక గాయకుడు రఫీ భారతదేశంలో చాలా గొప్పవాడు అయి ఉండవచ్చు. గొప్ప గాయకుడు అయి ఉండవచ్చు. లక్షలాది మంది అభిమానులు అతడికి ఉండవచ్చు. కాని దైవం ముందు అతడొక మామూలు భక్తుడు. మక్కాలో కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శతకోటి మంది భక్తులలో అతనూ ఒక్కడు. అందరికంటే ఎక్కువ మంది అభిమానులను సకల చరాచర సృష్టి ఆరాధనను కలిగి ఉన్నది ఒకే ఒక్కడు– ఈశ్వరుడు. అతని ముందు విమన్రంగా ఉండక తప్పదు. 1969లో రఫీ హజ్ యాత్ర చేశాడు. ఆయనతో పాటు నాటి పాకిస్తాన్ స్టార్ సింగర్ మసూద్ రాణా కూడా ఉన్నాడు. హజ్‌కు వెళితే ఆ నియమాలను పాటించి తిరిగి రావాలి ఎవరైనా. కాని రఫీకి కాబా గృహం దగ్గర నమాజు వేళకు అధికారికంగా ఇచ్చే అజాన్‌ను తనకు ఇవ్వాలనిపించింది. ఇంత మధురమైన గాయకుణ్ణి, పెద్ద గాయకుణ్ణి నేను అజాన్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా అని వెళ్లి హజ్ నిర్వాహక కమిటీని అడిగాడు. కమిటీ ఒక్క నిమిషంలో అతడి కోరికను కొట్టిపడేసింది. ఇక్కడి పద్ధతుల అనుసారం బయటి వాళ్లు అజాన్ ఇచ్చే ఆనవాయితీ లేదని చెప్పేసింది. రఫీ నిరాశగా తిరిగి వచ్చాడు. ఈసారి తన గాయక హోదాతో మరెవరినో తీసుకుని కమిటీ దగ్గరకు వెళ్లాడు. మళ్లీ అనుమతి నిరాకరించబడింది. మళ్లీ ఇంకేదో రికమండేషన్‌తో వెళ్లాడు. అదీ నడవ లేదు. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి. ఒకరోజు తెల్లవారుజామున రఫీ కాబా చుట్టూ ప్రదిక్షిణం చేస్తూ– ప్రభూ... నేను గాయకుణ్ణి కాదు.. ఒత్త నీ విశ్వాసిని... నీ జీవుడిని... నీ పట్ల అపారమైన ఆరాధన కలవాడిని... ఒక మామూలు భక్తుడిగా అడుగుతున్నాను... నీ పుణ్యక్షేత్రంలో నాకు అజాన్ ఇచ్చే అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. అలా అనుకుని మళ్లీ కమిటీ దగ్గరకు వెళ్లాడు. కమిటీ వాళ్ల ఎదురుగా నిలుచుని ఉన్నది గాయకుడు కాదు సెలబ్రిటీ కాదు ఒక మామూలు ముసల్మాన్. వాళ్లు అనుమతి ఇచ్చారు. ఆ తెల్లవారుజాము నమాజు కోసం రఫీ ఇచ్చిన అజాన్ అక్కడ ఉన్నవాళ్లందరినీ ఎంత కరుణలో ముంచెత్తిందంటే దైవస్పృహలో వారందరి కళ్లు ధారాపాతం అయ్యాయి. అలాంటి అజాన్‌ను వారు ఇంతకు ముందు వినలేదు. వాళ్లు రఫీని ఆలింగనం చేసుకున్నారు.అంతేనా? రఫీ అక్కడ ఉన్నన్నాళ్లు ప్రతిరోజూ తెల్లవారుజాము అజాన్ ఇచ్చే అనుమతి అతనికి లభించింది. అహం వదులుకుంటే కరుణ దొరికే తీరుతుంది. ఒక్క చిరునవ్వు 19వ శతాబ్దిలో అమెరికన్ నవలా రచయితలలో పేరెన్నికగన్నవాడు మార్క్‌ట్వెయిన్. మార్క్ చదివే స్కూల్లో విద్యార్థులకు టీచర్ జనరల్ నాలెడ్జికి సంబంధించిన పరీక్ష పెట్టారు. ఆ ప్రశ్నాపత్రంలోని చివరి ప్రశ్న ‘రోజూ ఈ స్కూల్‌ని శుభ్రపరిచి, ఆయాగా పనులు చేసే ఆమె పేరు ఏమిటి?’ అని ఉంది. పిల్లలందరికీ ఆమె రూపం జ్ఞప్తికి వచ్చింది. రోజూ ఆమెను తమందరూ చూస్తారు. ఆమె పొడుగ్గా ఉంటుంది, నల్లటి జుట్టు ఉంటుంది, యాభై ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. కానీ, పిల్లలెవెరికీ ఆమె పేరు తెలియదు. టీచర్ తమను ఆటపట్టించడానికే ఆ ప్రశ్న ఇచ్చారని, ఇదెందుకు పనికివస్తుందని విద్యార్థులందరూ అనుకున్నారు. క్లాస్ చివరలో ఒక విద్యార్థి లేచి ‘సర్ ఈ ప్రశ్నకు సమాధానం రాయకపోయినా మా ర్యాంకు తగ్గదు కదా’ అన్నాడు. టీచర్ ‘కచ్చితంగా తగ్గదు’ అంటూనే ‘మీ జీవితంలో ఎంతో మంది మీకు తారసపడుతూ ఉంటారు. మరెంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎంతోమంది మీకు ఏదో రూపంలో సేవలు చేస్తూనే ఉంటారు. వారిలో నిరుపేదలే ఎక్కువ. వారందరూ గుర్తించదగినవారే! వారు మీ నుంచి కోరుకునేది ఒక్క చిరునవ్వు, చిన్న పలకరింపు. అదే మిమ్మల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది’ అని చెప్పాడు. ‘ఆ రోజే ఆ ఆయా పేరు డోరతి అని తెలుసుకున్నానని, ఈ పాఠం జీవితంలో తనెప్పుడూ మర్చిపోలేద’ని డైరీలో రాసుకున్నాడు మార్క్. నాన్నకు ప్రేమతో.. క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. అతను ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే, అతన్ని అడ్డుకట్ట వేస్తూ, ‘మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు. రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం.అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా. వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు. కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి. – బండారు శ్రీనివాసరావు, పాత్రికేయుడు గ్లాసెడు పాలు ఒక రోజు ఒక నిరుపేద పిల్లవాడు తల్లి అమ్ముకురమ్మన్ని ఇచ్చిన కొన్ని బొమ్మలున్న బుట్టను తల మీద పెట్టుకొని దారుల్లో తిరుగుతున్నాడు ఎవరైనా ఒక్క బొమ్మనైనా కొనకపోతారా అని. ఒక్క బొమ్మా అమ్ముడుపోలేదు. ఆకలికి కళ్లు తిరుగుతున్నాయి. శోష వచ్చేలా ఉంది. ‘ఈసారి వెళ్లే ఇంట్లో వాళ్లని కొంచెం భోజనం పెట్టమని అడుగుదాం’ అనుకొని ఓ ఇంటి తలుపు తట్టాడు. ఒక యువతి తలుపు తీసింది.భోజనం అడుగుదామనుకున్న ఆ పిల్లవాడు అడగలేక ‘తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలరా..’ అన్నాడు. ఆ పిల్లవాడు ఆకలిగా ఉన్నాడేమో అనిపించిన ఆమె పొడవాటి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ గ్లాసు అందుకొని నెమ్మదిగా ఆ పాలు తాగి ‘మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’ అన్నాడు. ఆమె సన్నగా నవ్వుతూ ‘దయ చూపడంలో తల్లి ధరను కోరుకోదు’ అంది. ‘మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఆ పిల్లవాడు అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒక నడి ఈడు స్త్రీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చింది. ఆ నగరంలోనే ప్రముఖుడైన డాక్టర్ హావర్డ్ కెల్లీనే ఈ జబ్బును నయం చేయగలడని అతని వద్దకు పంపించారు స్థానిక డాక్టర్. డాక్టర్ హావర్డ్ కెల్లీ ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశాడు. ఆమెకు జబ్బు పూర్తిగా నయమయ్యేదాక ఆసుపత్రిలోనే ఉంచి, ఆమె ఆసుపత్రి బిల్లును ఆ డాక్టరే చెల్లించాడు. ఆమె ఆశ్చర్యపోతూ డాక్టర్ చెల్లించిన ఆ బిల్లును చూసింది. ఆ బిల్లు అడుగున ‘గ్లాసెడు పాల రుణం ఇప్పుడు తీర్చుకున్నాను’ ఇట్లు డాక్టర్హావర్డ్ కెల్లీ అని రాసుంది. ఆమె కళ్లు సంతోషంతో వర్షించాయి. -
ప్రేమను పంచండి
కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ రోజు మధ్యాన్నం భోజనం చేశాక నా బృందంతో పాటు విశాఖపట్నం బయలుదేరాను. కొద్దిరోజుల క్రితమే కొనుక్కున్న కొత్త కారులో ప్రయాణం చాలా ఆహ్లాదంగా, ఉత్సాహభరితంగా ఉంది. రాత్రి జరగబోయే మీటింగ్ పైనే నా ఆలోచనలు దొర్లుతున్నాయి. నిజమైన క్రిస్మస్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నదే నా ఆలోచన. సరిగ్గా ఆ సమయంలో ఒకచోట రోడ్డు మీద జనం గుమిగూడారు. కారును వేగం తగ్గించి, అద్దంలో నుండి బయటకు చూసేసరికి ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరూ తండ్రీకొడుకులని తర్వాత తెలిసింది. స్పృహలో లేరు. వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గబగబా బయటకు వచ్చి చుట్టూ చూశాను. ‘‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’’ అన్న క్రీస్తు మాటలు మదిలో మెదిలాయి. ఇంతమంది చుట్టూ ఉన్నారుగా, మనకెందుకు అనుకోలేదు. ఎంతమంది ఉన్నా సహాయం చేయడానికి ఒక్క అడుగు ముందుకేద్దాం అంటూ సహాయం అందించాం. అందరూ చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న ఆ క్షణంలో పడి ఉన్న ఆ ఇద్దరినీ మా కారులో ఎక్కించాము. కొత్తకారంతా రక్తపు మరకలే! అయినా ప్రాణం కన్నా విలువైనది ఏముంది? మీరలా తీసుకెళ్లద్దు. అనవసరంగా సమస్యల్లో చిక్కుకుంటారు అనే హెచ్చరికలు నన్ను ఏమాత్రం వెనక్కు లాగలేదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టరు చేతికి వారిని అప్పగించాను. కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాను. కొద్దిగా ఆలస్యమైతే ఏమయ్యేదో అని ఆ వైద్యబృందం మాట్లాడుకుంటుంటే మనస్సులోనే దేవుణ్ణి స్తుతించాను. ఇంకేం ఫర్వాలేదు అని తెలిసిన తర్వాత నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాను. అది క్రిస్మస్ రోజు. మా చర్చిలో వేలాదిమంది క్రీస్తును ఆరాధించేందుకు సిద్ధమయ్యారు. ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడమే నిజమైన క్రిస్మస్’ అంటూ నా సందేశం కొనసాగింది. భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే ప్రేమమార్గమే సరైనదంటూ నేను చేసిన ప్రసంగం అనేకులను ఆలోచింపజేసింది. క్రిస్మస్ అనంతరం ఇద్దరు భార్యాభర్తలు పుష్పగుచ్ఛంతో ముందుకు వచ్చి నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి కన్నీళ్లు కారుస్తున్నారు. అనురాగంతో వారిని హత్తుకుని కారణం అడిగాను. ‘ఆనాడు మీరు చూపిన ప్రేమను మర్చిపోలేకపోతున్నాము. మేమెవరమో తెలియకపోయినా మీరు చేసిన సహాయం రెండు బతుకులను నిలబెట్టింది. ప్రాణాలు దక్కించుకున్న మా కుమారుడు నేడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు’ అని చెబుతుంటే ఎంత సంతోషించానో! అవును! దేవుని పేరిట మనస్ఫూర్తిగా చేసే ఏ చిన్న కార్యమైనా అపరిమితమైన ఆనందాన్ని మోసుకొస్తుంది. సాటివ్యక్తి బాధలను గుర్తించక ఏరులై పారుతున్న కన్నీళ్లను అవహేళన చేస్తూ, దైవప్రేమను గుర్తించక దారితప్పిపోతున్న సమాజానికి ఓ అమూల్యమైన దిశానిర్దేశం చేసే పండుగే క్రిస్మస్. భూమికి మధ్య ప్రాంతమైన బెత్లెహాములో దేవుడు శరీరధారిగా రావడం ద్వారా మనిషికి ఎన్నో మేళ్లు చేకూర్చబడ్డాయి. చితికిపోయిన జీవితాలను పునఃప్రతిష్ఠ చేసి వారిని నిలబెట్టాలనే సదాశయంతో దేవుడు భూమ్మీదకు వచ్చాడు. కర్కశలోకంలో కారుణ్యం విరబూసింది. సొమ్మసిల్లిన బతుకులకు ఆశ్రయం లభించింది. ‘ఓ దేవా! నేను అసత్యంలో ఉన్నాను. నన్ను సత్యంలోనికి నడిపించు! చీకటిలో ఉన్నాను. వెలుగులోనికి నడిపించు! మరణంలో ఉన్నాను. జీవంలోనికి నడిపించు!’ అని మనిషి చేస్తున్న ప్రార్థనకు జవాబివ్వడానికి పరమాత్ముడు పశుశాలలో పవళించాడు. దీనులైన సామాన్య గొర్రెల కాపరులకు సృష్టికర్తను చూడగలిగే భాగ్యం లభించింది. మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి దేవుడే మనిషిగా వచ్చాడు. పశువుల శాల వంటి జీవితాలలో జన్మిస్తూ, పాపాన్ని పారద్రోలుతూ, మనిషిని పావనం చేస్తున్నాడు. మానవత్వం రెండు కళ్లూ మూసుకుపోయి పైశాచికంగా బతుకీడుస్తున్న మనిషికి ‘నిజమైన మనిషి’గా ఎలా బతకాలో చేసి చూపించడానికి క్రీస్తు నరావతారుడయ్యాడు. జడత్వంలో నిండిన ఇంద్రియాలను చైతన్య పరచి సమ సమాజ నిర్మాణానికి బాటలు వేశాడు. క్రిస్మస్ అనగా ప్రేమను వ్యక్తీకరించే పండుగ. క్షణికమైన అనురాగాలు, ఆవిరి వంటి ఆప్యాయతలు. అవసరాల అభిమానాలు. నిలిచిపోయే అనుబంధాలు నేటి ప్రపంచానికి స్వచ్ఛమైన, నిత్యమైన ప్రేమను కనబరచడానికి క్రీస్తు వచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమేగాక ఆ ప్రేమను క్రియల్లో నెరవేర్చాడు. ‘ఉత్తమ వ్యక్తిత్వం అంటే అందచందాలు కాదు! భౌతికమైన భోగభాగ్యాలు కాదు! దేవుని ప్రేమతో నింపబడి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడే ఉత్తమ వ్యక్తిత్వం కలవాడు. ప్రేమతోనే ప్రపంచంలో ఓ గొప్ప మార్పును తీసుకురాగలము’ అని మదర్ థెరిస్సా చెప్పిన మాటలు కచ్చితంగా అభినందనీయం. ఆచరణీయం. ‘‘మనుష్యులు మీకెలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి’’ ‘‘మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును?’’‘‘మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి’’అని క్రీస్తు బో ధించాడు. ఆ బోధనలను అనుసరించడమే నిజమైన క్రిస్మస్! మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, ప్రతి ఒక్కరినీ సన్మానిస్తూ, ప్రేమిస్తూ దేవుడు మెచ్చే క్రిస్మస్ను జరుపుకుందాం! జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
క్రిస్మస్కు.. ఆ ఆరు ప్రాంతాలు
క్రైస్తవులు తమ దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును స్మరించుకుంటూ జరుపుకునే క్రిస్మస్ వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. డిసెంబర్ ప్రారంభమవగానే చర్చ్‌లు, ఇళ్లు, పలు దుకాణాలు క్రిస్మస్ హడావిడితో నిండిపోతాయి. శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) దుస్తులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన క్రిస్మస్ చెట్లు, వీధివీధికి రకరకాల రంగులతో నిలిచే క్రిస్మస్ స్టార్లతో (నక్షత్రాలతో), యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి గుర్తుగా తయారు చేసే పశువుల పాక వంటి వాటితో నెలంతా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, ప్రత్యేక బహుమతులను అందించి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారు. చాలాసార్లు ఒకే చోట క్రిస్మస్ పండుగ జరుపుకొని కొత్తదనం కొరవడితే ఇండియాలోని కింది ప్రాంతాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. 1. గోవా అత్యధికంగా కతోలిక క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతం కావడంతో డిసెంబర్ మొదటి వారంలో వచ్చే ఆడ్వెంట్ నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. పట్టణమంతా క్రిస్మస్ పూలతో (పోయిన్సెట్టియా), రంగురంగుల విద్యుద్దీపాలతో, అలంకరిస్తారు. చర్చ్‌లు అన్నింటి మీదా పెద్ద స్టార్లను అమరుస్తారు. బీచ్‌ల దగ్గర హోటళ్లు, రెస్టారెంట్లు క్రిస్మస్ గంటల మ్యూజిక్‌తో పాటు పలు రకాల క్రిస్మస్ వంటకాలను తయారుచేస్తారు. క్రిస్మస్ ముందు రోజు రాత్రంతా చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. 2. కేరళ చర్చ్‌లకు పుట్టినిల్లుగా పిలిచే కేరళలో క్రిస్మస్ను ఘనంగా నిర్వహిస్తారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ తోమాస్ రాక తర్వాత ఇక్కడ ఈ పండుగ జరపడం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతి వీధిలో ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్ల మీద కూడా స్టార్లను అమర్చి అందులో రంగులను చిమ్మే లైట్లను అమరుస్తారు. చర్చ్‌లలో కారోల్స్ నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు ప్రత్యేక గంటలను మోగిస్తారు. ప్లమ్ కేక్స్‌ను క్రిస్మస్ ప్రత్యేక వంటకంగా తయారు చేసుకుంటారు. పలు హోటళ్లలో ప్రత్యేక రాయితీలను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. 3. మనాలి మంచు కురిసే ప్రదేశంలో క్రిస్మస్ (వైట్ క్రిస్మస్) జరుపుకోవాలన్నది మీ కోరికా..! అయితే మనాలి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతం తెల్లని మంచుతో పండుగను వేరే దేశంలో జరుపుకున్న అనుభూతిని అందిస్తుంది. ఇక్కడకు క్రిస్మస్కు వచ్చేవారు తమ మిత్రులు, కుటుంబ సభ్యుల మీద మంచు ముద్దలు విసురుకొని ఆనందిస్తుంటారు. పండుగ అర్ధరాత్రి జరిగే ప్రార్థనల్లో పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చలికాలంలో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ను జరుపుకోవాలి అనుకునే వారు ముందుగానే హోటళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 4. పుదుచ్చేరి గోవాలాగే పుదుచ్చేరి కూడా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పట్టణంతా డిసెంబర్ ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి అలుముకుంటుంది. ఈ ప్రాంతం మీద ఫ్రెంచ్‌వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహజంగానే వారి ఆచారాలు, వంటకాలు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇతర ప్రదేశాలతో పోలిస్తే పుదుచ్చేరిలో క్రిస్మస్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న యేసు తిరుహృదయ బసిలికా దేవాలయంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. 5. షిల్లాంగ్ ఎక్కువ తాకిడి లేకుండా ప్రశాంతంగా క్రిస్మస్ జరుపుకోవానుకుంటే షిల్లాంగ్ అనువైన ప్రదేశం. ఇక్కడ క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ పండుగను మాత్రం ఉత్సుకతతో కొనియాడుతారు. వీధులను, చర్చ్‌లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పాటలను ఆలపిస్తూ ప్రార్థనలను చేస్తారు. 6. కొచ్చి గోవా, పుదుచ్చేరిలాగే కొచ్చిలో కూడా ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. చారిత్రాత్మకమైన చర్చ్‌లు ఉన్నప్రాంతం కావడంతో క్రిస్మస్ను ఇక్కడ ఘనంగా కొనియాడుతారు. అన్ని ప్రాంతాల్లోలాగే ఇక్కడ కూడా చర్చ్‌లను, ఇళ్లను, వీధులను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. పండుగ ముందురోజు రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు హోరెత్తుతాయి. వీధుల్లోని దుకాణాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన యేసుక్రీస్తు, ఆయన తల్లి మరియమ్మ చెక్క స్వరూపాలను అమ్ముతారు. క్రిస్మస్తో పాటు స్థానికంగా జరిగే పండుగ తోడవడంతో షాపింగ్ మాల్స్ అన్నీ ప్రత్యేక రాయితీలు కల్సిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్తే షాపింగ్‌కు, ఆటపాటలతో ఆనందంగా గడపడానికి ఇది ఉత్తమ ప్రదేశం. -
కోమలి.. విషాద ఝరి
కోమలి(పిట్టలవానిపాలెం): నవంబర్ 19.. గత 41 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆ తేదీ కోమలి గ్రామంలో ప్రతి ఒక్కరిని పుట్టెడు దుఃఖంలో ముచ్చెత్తుతోంది. ప్రకృతి ప్రకోపమో... మానవ తప్పిదాలో ఆ గ్రామ ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. పేరుకు తగ్గట్టుగానే కోమలి భౌగోళికంగా చాలా సున్నితమైన ప్రాంతం. నిజాంపట్నం సముద్రతీరానికి కూతవేటు దూరంలో ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడల్లా కోమలి గ్రామం ఉలిక్కిపడుతుంది. సరిగ్గా 41 ఏళ్ల క్రితం 1977 నవంబర్ 19న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన దివిసీమ తుఫాన్ కోమలి గుండెలపై చెరగని ముద్రవేసింది. తుఫాన్ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామానికి చెందిన దళితులు సమీపంలోని ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. బిక్కుబిక్కుమంటూ క్షణం ఒక యుగంలా గడిపారు. భయంకర తుఫాన్ వీరికి ఎలాంటి హాని కలిగించలేదు. కానీ ప్రార్థనా మందిరం ఒక్కసారిగా కూలిపోవడంతో ఎందరో మృత్యువాత పడ్డారు. సుమారు 99 మంది ఈ శిథిలాల కింద తుదిశ్వాస విడిచారు. ఈ దురదృష్ట ఘటనకు ప్రతీకగా ప్రార్థనా మందిరం కూలిన ప్రదేశంలోనే స్థూపం నిర్మించారు. ప్రతి ఏడాది నవంబర్ 19 వ తేదీన స్థూపం వద్ద నివాళుల ర్పించే దళితులు దేవుడా మళ్లీ ఇలాంటి పరిస్థితిని రానివ్వకు ప్రభు అంటూ వేడుకుంటారు. ఏడేళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌పై శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పిట్టలవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో తెనాలి–నిజాంపట్నం కాలువలో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టిన ఘటనలో గ్రామానికి చెందిన 11 మంది మృత్యువాత పడ్డారు. స్వల్ప గాయాలతో బయట పడ్డాను అప్పట్లో నా వయస్సు 8 ఏళ్లు. తుఫాను సమయంలో మా అమ్మతో కలిసి ప్రార్థనా మందిరంలోకి వెళ్లాం. ఆ సమయంలో చర్చి కూలుతుండగా మా అమ్మ చాకచక్యంగా మమ్మల్ని కాపాడింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాం. అయితే ఏడేళ్ల క్రితం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది. –పల్లెకోన సుబ్బారావు, స్థానికుడు ఘటన దురదృష్టకరం 1977, నవంబర్ 19న తుఫాను సమయంలో ప్రార్థనా మందిరంలో కూలడం చాలా దురదృష్టకరం.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం అదే రీతిలో ట్రాక్టర్ ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోవడం తీరని లోటు .ప్రతి ఏడాది వారి జ్ఞాపకార్థంగా 19 నవంబర్ రోజున స్థూపం వద్ద ప్రార్థన చేసి వారిని స్మరించుకుంటాం. – ప్రభుదాసు, స్థానికుడు -
హరిత గ్రామ కథ
మండోవి నది మధ్య ఉందీసెయింట్ ఎస్తేవం. ఉత్తర గోవాలోని ఆ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. పొట్టకొచ్చిన వరి పైరు ఇప్పుడు ఆ ఊరికి సరికొత్త శోభనిస్తోంది. చర్చి ఫాదర్ ప్రభాత ప్రవచనాల్లో పంట చేల తాలూకూ తాజా విశేషాల్ని భాగం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరి పంట పండబోతోంది.అక్టోబర్‌లో వరి పంట చేతికి రాబోతోంది. మరి ఇన్నాళ్లూ పంటలకు వారు ఎందుకు దూరంగా ఉన్నట్లు? రియల్ ఎస్టేట్ వద్దు.. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా గోవాలో వరి సాగు బాగా క్షీణించింది. సెయింట్ ఎస్తేవం అంతటా బీడు భూములే. ఊళ్లో సగం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. లేదంటే ఓడల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కుటుంబాలకు (నిన్న మొన్నటి వరకు) తమ పొలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ భూములకు వారు మూడో తరం వారసులు. తమ చిన్న చిన్న కమతాలను వదిలేస్తే అవి ‘రియల్’ వ్యాపారుల పరమవుతాయనే భయం వారిని ఆలోచింపచేసింది. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే హరిత గ్రామ సంఘం (గ్రీన్ విలేజ్ క్లబ్) ప్రాజెక్టు. సమష్టి వ్యవసాయ ఆలోచన. ఊరి జనం ఈ ప్రాజెక్టుకు మొదట అంగీకరించలేదు. భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. జనవరిలో జరిగిన మొదటి సమావేశంలో వ్యవసాయదారులు, భూ యజమానులు సమష్టి వ్యవసాయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కొంత కాలానికి చర్చలు జరిగాయి. చివరికి సంసిద్ధత వ్యక్తమైంది. భూ సమీకరణ మొదలైంది. 50 హెక్టార్లలో వరి వేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులకు అనువైన గోవా ధన్–1 రకాన్ని సాగు చేస్తున్నారు. 175 మెట్రిక్ టన్నుల పంట చేతికి రావొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఊళ్లో ఉన్న మొత్తం 250 హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలని భావిస్తున్నారు. ఇంటింటికీ తిరిగారు.. ఈ గ్రామంలో నివసించేది ప్రధానంగా నావికులే. వారు వ్యవసాయం గురించి ఆలోచించేలా చేయడం పెద్ద సవాలు. ‘భూమి పత్రాలు, రికార్డులు వెతికి పట్టుకోండి. హక్కుదారులు ఎక్కడున్నారో విచారించండి’ అంటూ ఉదయం సమావేశాల్లో అక్కడి చర్చి ఫాదర్ యుసికో పెరీరా ప్రజలకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు ఓ బృందం గ్రామస్తులు, వారి భూముల వివరాలు సేకరించగలిగింది. అశ్విన్ వరేలా అనే 20 ఏళ్ల కుర్రాడు.. భూముల విషయంలో గ్రామస్తులకు చాలా సాయపడ్డాడు. ‘రాత్రి వేళల్లో ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి అన్ని రికార్డులూ డౌన్లోడ్ చేశాం. విషయాలు నిర్ధారించుకోవడం కోసం ప్రతి ఇంటికీ వెళ్లాం. సాయపడ్డాం. మేం తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేవాళ్లం. విదేశాల్లో, ఓడల్లో ఉన్న వాళ్లను సంప్రదించేందుకు ఫేస్బుక్ వాడాం’ అని చెబుతున్నాడు అశ్విన్. గోవా వ్యాప్తంగా ఇలాంటి పరిణామం చేసుకోవడం ఇదే తొలిసారంటారు అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు హెడ్ సంజీవ్ మయేకర్. ఇప్పుడు గోవా మొత్తం సెయింట్ ఎస్తేవం వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయాలని భావిస్తోంది. అస్తిత్వ పోరాటంలో భాగమే.. తమ అస్తిత్వం, భాష, సంస్కృతి, పండుగలను కాపాడుకునేందుకు గోవావాసులు పోరాడుతున్నారనీ, సెయింట్ ఎస్తేవం పరిణామాల్ని ఈ కోణం నుంచే చూడాలని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో చెబుతున్నారు. ‘వలసదారులను ఆహ్వానిస్తాం. కానీ ఈ భయం కూడా ఒక నిజం’ అంటారాయన. అనేక కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలి, తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయాయి. వారు భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి వివాదాల్లో చిక్కుకోవచ్చు. లేదంటే కబ్జాకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి చిక్కొచ్చు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు అభినందించదగ్గదేనని మౌజో చెబుతున్నారు. -
చర్చ్‌కు వెళ్తున్నారని.. సామాజిక బహిష్కరణ
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణలు ఇప్పటీకి కొనసాగుతున్నాయి. చర్చికి వెళ్తున్నారంటూ 12 కుటుంబాలను సైనీ కమ్యూనిటికి చెందిన పెద్దలు కుల పంచాయతీ పెట్టి సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన యూపీలోని మోరానాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మోరానాబాద్‌కు చెందిన 12 సైనీ కుటుంబాలు ఇటీవల క్రీస్టియన్ మతంలోకి మారి, చర్చికి వెళ్తున్నారని సైనీ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. తమ కుల కట్టుబాట్లకు ఇది విరుద్దమని అందుకే వారిని బహిష్కరించినట్లు కుల పెద్ద శివలాల్ సైనీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వారు చర్చ్‌కి వెళ్తున్నారని, దీనిపై కులంలోని 300 మంది సభ్యులతో చిర్చించిన అనంతరం వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబంపై ఐదువేల జరిమాన కూడా విధించినట్లు ఆయన తెలిపారు. బహిష్కరణకు గురైన కుటుంబంలో ఏలాంటి కార్యక్రమాలు జరిగిన ఎవరు హాజరు కావద్దని, వారితో ఎవరు కూడా మాట్లాడవద్దని కుల పంచాయతీ తీర్మానించినట్లు సైనీ వెల్లడించారు. షాపుల్లో ఏలాంటి సమాన్లు కూడా వారికి విక్రయించకూడదని గ్రామంలోని షాపులను హెచ్చరించారు. తాము క్రీస్టియన్ మతంలోకి వెళ్లలేదని, కేవలం ప్రశాంతత కోసమే చర్చ్‌కి వెళ్తున్నామని బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం తప్పుడు సమాచారంతోనే తమ కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. -
రెండు రోజుల పసిబిడ్డను చర్చిలో వదిలి వెళ్లారు
-
పసికందును చర్చిలో వదిలేశారు..
కొచ్చి: నవ మాసాలు మోసిన ఆ తల్లికి పుట్టిన రెండు రోజులకే పాప నచ్చలేదో.. ఆ తండ్రికి ఆ బిడ్డ ఏం పాపం చేశాడో..లేక ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ రెండు రోజుల పసికందుని చర్చిలో వదిలేసి వెళ్లారు ఓ జంట. ఈ విచార ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళలోని త్రిశూర్ సమీపంలోని సెయింట్ జార్జ్ ఫోర్నే చర్చి వద్ద శుక్రవారం సాయంత్రం ఓ జంట రెండు రోజుల పసికందుని వదిలి వెళ్లారు. వారు వెళ్లాక కొద్ది సేపటికి అక్కడి భద్రత సిబ్బందికి పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూసే సరికి చర్చి ప్రాంగణంలో పసికందు ఏడుస్తూ కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ పాపను ఆసుపత్రికి తరలించారు.సీసీ పుటేజీ పరిశీలించగా శుక్రవారం సాయంత్రం 8.15గంటలకు ఆ జంట మరో బిడ్డతో వచ్చి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్లారు. వెళ్లే ముందు పాప నుదిటిపై ఓ ముద్దు కూడా పెట్టారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా పాప తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను వదిలి వెళ్లాడానికి గల కారణాలు విచారణ తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. -
ఇండోనేషియాలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
-
యోగా.. ‘మత విశ్వాసానికి విరుద్ధం’
కొట్టాయం : యోగ, క్రైస్తవ మతాచారాలు రెండు వేర్వేరని కేరళలోని సైరో మలబార్ చర్చ్ ప్రకటించింది. యోగా ఏకత్వాన్ని విశ్వసిస్తుందని, కానీ క్రైస్తవ మత విశ్వాసాలు సృష్టికర్తకు, సృష్టింపబడినవారు మధ్య తేడా ఉంటుందని విశ్వసిస్తుంది. యోగాను వ్యాయామంగా మాత్రమే చూడవచ్చు తప్ప యోగా సాధన వల్ల భగవంతుడిని చేరుకోలేమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడంతో ఈ విషయం గురించి మతసంస్థలు ఏమనుకుంటాన్నాయో విచారించడానికి సైరో మలబార్ చర్చ్ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం యోగా క్రైస్తవ విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం అని తెలిపింది. యోగా వల్ల ఆరోగ్యం పరంగా లాభాలు ఉంటాయి కానీ దేవుడిని చేరడానికి మార్గం చూపదు అన్నారు. యోగా ద్వారా ఎటువంటి ఆధ్యాత్మికతను పొందలేము, అలానే యోగాలోని కొన్ని భంగిమలు కూడా క్రైస్తవ మతాచారాలకు విరుద్ధంగా ఉంటాయి అని కమిషన్ విడుదల చేసిన రికార్డులో వెల్లడించింది. సంఘ్ పరివార్ తన హిందూత్వ ఎజెండాను, హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడం, యోగాను భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన అంశంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తుండటంతో ఇప్పుడు ఈ అంశం గురించి పరిశీలించవలసి వచ్చింది అని చర్చి అధికారులు అన్నారు. కేరళలోని సైరో మలబార్ చర్చ కాథలిక్ చర్చ్. దీనిపై పూర్తి అధికారం పోప్‌కే ఉంటుంది. వీటి కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. -
రష్యా చర్చిలో కాల్పులు
మాస్కో: రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలోని కిజ్లయార్ పట్టణంలో ఆదివారం ఓ చర్చిలో ఇస్లాం ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులు నిందితుడిని హతమార్చారు. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో కన్ను మూసినట్లు అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుండగుడి వయసు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు స్థానికుడేనని ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘అల్లాహు అక్బర్’ అని నినదిస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి రైఫిల్, కత్తితో చర్చిలోకి చొచ్చుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫాదర్ పావెల్ చెప్పారు. చెచెన్యాకు సరిహద్దుగా ఉన్న దగెస్తాన్ రష్యాలోని కల్లోలిత ప్రాంతాల్లో ఒకటి. -
చర్చిని డైనమైట్‌తో పేల్చేసిన చైనా
-
చర్చిని డైనమైట్‌తో పేల్చేసిన చైనా
హాంకాంగ్ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి. షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్ ల్యాంప్‌స్టాండ్ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది. -
శాంతి సౌధాలు..చారిత్రక సౌరభాలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చారిత్రక చర్చిలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని ప్రార్థనాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల కోసం సిద్ధమైన అబిడ్స్‌లోని సెయింట్ జార్జి చర్చి.. బ్రిటిషర్ జార్జి యూలే సతీమణి 1865లో అబిడ్స్‌లో ఈ చర్చిని నిర్మించారు. 1867లో అధికారికంగా ప్రారంభించారు. నిజాం ప్రధాన ఇంజినీర్ జార్జి విలియమ్ మర్రెట్ దీనికి రూపకల్పన చేశారు. నిజాం, బ్రిటిష్ రెసిడెన్సీ సిబ్బంది ఇచ్చిన విరాళాలతో ఇది నిర్మితమైంది. ఇలాంటి ఎన్నో చారిత్రక చర్చిలపై ప్రత్యేక కథనం.. గారిసన్ వెస్లీ.. 1853లో తిరుమలగిరిలో గారిసన్ వెస్లీ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1883లో వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబీకులు మాత్రమే ఇక్కడ ప్రార్థనలు చేసేవారు. తొలి రోమన్ క్యాథలిక్ చర్చి.. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ తొలి రోమన్ క్యాథలిక్ చర్చి. ప్రతిష్టాత్మకంగా భావించే ‘బాసలికా’ హోదా కల్గిన పురాతన చర్చి. 2008లో ఈ గుర్తింపు దక్కింది. ఫాదర్ డేనియల్ మర్ఫి 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ హైస్కూలు కొనసాగుతోంది. మెథడిస్ట్.. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో సికింద్రాబాద్‌లో మెథడిస్ట్ చర్చిని నిర్మించారు. దీనిని 2001లో పునర్నిర్మించాక మిలీనియమ్ మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చిని గన్‌ఫౌండ్రీలో నిర్మించేందుకు 1870లో పునాది రాయి వేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మాణానికి మార్బల్ బహూకరించారు. 1891లో దీని నిర్మాణం పూర్తయింది. అద్దె రూమ్‌లో ప్రారంభం.. రాంనగర్ డివిజన్\ బాకారంలోని వెస్లీ చర్చి 10 మంది భక్తులతో ప్రారంభమైంది. 1930లో ఇంగ్లండ్‌కు చెందిన రెవరెండ్ ఈబర్ ప్రెస్లీ ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకొని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు. 1938లో ఇంగ్లండ్‌కు చెందిన మెగ్నిల్ అదే ప్రాంతంలో చిన్న ఇళ్లులా నిర్మించారు. 1961లో పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వెయ్యికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసుకునే వీలుంది. సేవా విస్తరణ.. గాంధీనగర్‌లోని బాలాజీ ఇంద్రప్రస్థాన్ సమీపంలో 1969లో సెయింట్ గ్రెగోరియన్ చర్చిని నిర్మించారు. కేరళకు చెందిన పరుమళ కొచిర్ తిరుమనేని రెవరెండ్ జీనన్ దీనిని స్థాపించారు. ఇందులో గ్రెగోరియన్ ఆర్థటిక్స్ స్కూల్‌నూ ఏర్పాటు చేశారు. నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో నాలుగు చర్చిలు నిర్మించారు. పంజాబీ నిర్మించిన హెబ్రోన్ క్రైస్తవ బోధకుడిగా మారిన పంజాబీ భక్తసింగ్ 1954లో నగరానికి వచ్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో హెబ్రోన్ చర్చిని ఏర్పాటు చేశాడు. తర్వాత దేశవ్యాప్తంగా హెబ్రోన్ చర్చిలు వెలిశాయి. భక్తసింగ్, అగస్టిన్, బెంజుమన్లు ఇందుకు కీలకంగా పనిచేశారు. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సుమారు 5వేల మంది పాల్గొంటారు. వెస్లీ చర్చి.. సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ దగ్గర బ్రిటిష్ మిషనరీస్ రెవరెండ్ విలియం బర్గెస్, రెవరెండ్ బెంజిమిన్ ప్రాట్ల ఆధ్వర్యంలో 1916లో వెస్లీ చర్చిని నిర్మించారు. సీఎస్ఐ అనుబంధంగా కొనసాగుతోంది. అతి పురాతనం.. సెయింట్ బాప్టిస్టు జంటనగరాల్లోనే అతి పురాతన చర్చి సికింద్రాబాద్‌లోని సెయింట్ బాప్టిస్టు. 1813లో దీనిని నిర్మించారు. 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. దీనికి అనుబంధంగా స్కూల్, కాలేజీ కొనసాగుతున్నాయి. చర్చి అధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేది. కాలక్రమేణా చాలా వరకు స్థలం అన్యాక్రాంతమైంది. ఆర్మీ స్పెషల్.. ఆల్ సెయింట్స్ ఆర్మీ అధికారుల కోసం ప్రత్యేకంగా తిరుమలగిరిలో 1860లో చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో ఆల్ సెయింట్స్ చర్చిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం సీఎస్ఐ (చర్చి ఆఫ్ సౌతిండియా) పరిధిలోకి వచ్చింది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం ఇదే కావడం గమనార్హం. సెయింట్ జాన్స్ సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ చర్చికి 200ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో దీనిని నిర్మించారు. ఇది 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. సెంటినరీ బాప్టిస్టు బాప్టిస్ట్ చర్చిగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిని రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో నిర్మించారు. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో జంటనగరాల్లో 35 చర్చిలు కొనసాగుతున్నాయి. వందేళ్ల చరిత్ర.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో ఉన్న ఎంబీ చర్చికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1898లో మిషనరీస్ ఆధ్వర్యంలో ఈబర్ట్ దంపతులు మలక్‌పేట్‌లో చర్చి ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మలక్‌పేట్ ఏరియా పోలీస్ ఆసుపత్రిగా కొనసాగుతోంది. తర్వాత నగరంలో విద్యా, వైద్య సేవలు విస్తరించాలని రెవరెండ్ ఫాంక్రాట్స్ ఆధ్వర్యంలో 1904లో ఇక్కడి గాంధీనగర్‌లో చర్చి, గోల్కొండ చౌరస్తాలో స్కూల్‌ను ప్రారంభించారు. అయితే 1952లో చర్చిని కూడా గోల్కొండ చౌరస్తాకు తరలించారు. లూథరన్ చర్చి 1990లో రెవరెండ్ సి.ఏసుపాదం లక్డీకాపూల్‌లో కొండపై లూథరన్ చర్చికి పునాది వేశారు. ఆంధ్రా ఇవాంజలికల్ లూథరన్ చర్చి (గుంటూరు) కేంద్రంగా ఇది కొనసాగుతోంది. ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు చేసుకునే విధంగా విశాల ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ 5వేల మంది భక్తులు సభ్యత్వం తీసుకున్నారు. -
పండుగ సంబరాల్లో క్రైస్తవ యువత
-
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి
-
ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులపై దాడి
కైరో : వందల మంది ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఈజిప్టులోని ఓ చర్చిలోకి దూసుకెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులపై దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరో చేరువలో గల గీజాలో గత శుక్రవారం చోటు చేసుకుంది. కాప్టిక్ చర్చిని కూల్చివేయాలంటూ నినాదాలతో అక్కడికి చేరుకున్న ముస్లింలు చర్చిలో ఉన్న పవిత్ర వస్తువులను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన చర్చి భద్రతా సిబ్బంది ఛాందసవాదుల గుంపును చెల్లాచెదురు చేశారు. అనంతరం గాయపడిన క్రైస్తవులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈజిప్టులో ఇస్లాం మత ప్రభావం ఎక్కువ. అక్కడి జనాభాలో క్రైస్తవులు కేవలం 10 శాతం మాత్రమే. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి లేదు. 2016లో చర్చిలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా కూడా చర్చిల నిర్మాణానికి వచ్చే అర్జీలను అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇస్లాం మత ఛాందసవాదులు ఆందోళనలు చేస్తారనే భయమే ఇందుకు కారణం. దీంతో క్రైస్తవులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రార్ధనా మందిరాలను నిర్మించుకుంటున్నారు. వీటిపై దాడులు చేస్తున్న ఇస్లాం మత ఛాందసవాదులు వాటిని కూల్చేందుకు కూడా యత్నిస్తున్నారు. 2016 డిసెంబర్ నుంచి ఇలా జరిగిన కల్లోలాల్లో 100 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. కాప్టిక్ చర్చిపై దాడులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో పలుమార్లు ముస్లింలు ఈ చర్చిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. -
చర్చిలో ఆత్మాహుతి దాడులు.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. కల్లోలిత బెలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలోని ఓ చర్చిపై ఆత్మాహుతి బంబార్లు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. 20మందికిపైగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. క్వెట్టా నగరంలోని జార్ఘూన్ రోడ్డులో ఉన్న బెథెల్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఆత్మాహుతి బాంబర్లు చర్చిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ ఆత్మాహుతి బాంబర్‌ను గేటు వద్దే భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో బాంబర్ చర్చి ప్రాంగణంలోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు జరగాల్సిన ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. చర్చిలో మరికొంత ఉగ్రవాదులు నక్కి ఉండొచ్చునని భావిస్తున్నామని, ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా ఆపరేషన్ కొనసాగుతున్నదని బెలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మీడియాకు తెలిపారు. ఆదివారం కావడంతో సహజంగా ఇక్కడి చర్చిలో 300 నుంచి 400 మంది ప్రార్థనలకు వస్తారని ఆయన తెలిపారు. -
గన్ సేఫ్టీపై చర్చిస్తూనే.. చర్చిలో కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో జనరల్‌గా నిర్వహించుకునే థాంక్స్ గివింగ్ మీల్ అనుకోని ప్రమాదానికి దారితీసింది. ఇటీవల టెక్సాస్ చర్చిలో జరిగిన కాల్పుల దుర్ఘటన నింపిన విషాదాన్ని తలుచుకుంటూ ఉండగా..మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. పెరుగుతున్న గన్ కల్చర్, ముఖ్యంగా చర్చిలో జరుగుతున్న కాల్పులు, హింసపై అక్కడ కొంతమంది పెద్ద వాళ్లు( సీనియర్ సిటిజన్స్) చర్చిలో సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం కాల్పులు, తదనంతర పరిణామాలు, గన్ సేఫ్టీపై చర్చించుకుంటున్నారు. కానీ తామూ తుపాకి కాల్పుల బాధితులమవుతామని...ఆ ఆహ్లాదకరమైన మధ్యాహ్నం ..భయంకరమైన మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు వారిలో ఓ వృద్ధ జంట. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల శరీరంలోకి దూసుకుపోయాయి. వివరాల్లోకి వెడితే.. న్యూయార్క్‌లోని ఈస్ట్ టెన్నెసీ చర్చ్‌లో థాంక్స్ గివింగ్ విందును ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది సీనియర్ సిటిజన్లు ఈ విందు హాజరయ్యారు. వారిలో యునైటెడ్ మెథడిస్ట్ చర్చి సభ్యుడు పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి, దాని వాడాలో అక్కడున్న వారికి వివరించాడు. 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్ గన్ను ఓపెన్ చేసి ,మ్యాగజైన్ లోడ్ చేసి అక్కడున్నవారికి చూపించాడు. దాన్ని అలాగే పక్కన పెట్టాడు. ఇంతలో మరో సభ్యుడు తనకూ చూపించమంటూ..వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అంతే క్షణాల్లో బుల్లెట్ పెద్దాయన అరచేతిలోంచి...పక్కనే వీల్ చైర్లో కూర్చుని వున్న భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకుపోయింది. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన భార్యాభర్తలిద్దరి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ, ఎవరిమీదా కేసు నమోదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి రుస్ పార్క్స్ తెలిపారు. ఇటీవలి మాస్ షూటింగ్ నేపథ్యంలో స్థానిక చర్చిలలో సెమినార్లు నిర్వహించాలని కౌంటీ షెరీఫ్ విభాగం నిర్ణయించడంతో వీరు కూడా సమావేశమయ్యారని తెలిపారు. కాగా టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ఆగిన పెళ్లి.. ప్రధాని హర్షం!
► పెళ్లికి అడ్డంకిగా మారిన ఫేస్బుక్ పోస్ట్ సిడ్నీ: సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్ ఏకంగా తన పెళ్లినే ఆపేస్తుందని ఆ యువతి భావించలేదు. ఆమె ఫేస్బుక్ పోస్టును సాకుగా చూపిస్తూ చర్చి నిర్వాహకులు మరికాసేపట్లో జరగబోయే యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో చోటుచేసుకుంది. ఇంతకు యువతి చేసిన పోస్ట్ ఏంటంటారా.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్ధతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో షేర్ చేయడమే. విక్టోరియాలోని బల్లారట్లో ఓ చర్చిలో యువతి, తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి వచ్చింది. చర్చి పెద్దలు వారి వివరాలు కనుక్కున్నారు. మరికాసేపట్లో వివాహం జరగనుండగా స్వలింగ సంప్కర వివాహానికి (గే మ్యారేజ్) మద్ధతుగా వధువు చేసిన ఫేస్బుక్ పోస్ట్ గురించి తెలుసుకున్న మత పెద్దలు కార్యక్రమాన్ని రద్దుచేశారు. వివాహాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని తన పోస్ట్‌లో ఆమె పేర్కొంది. ఇలాంటి తరహా వివాహాలకు (గే, లెస్బియన్ వివాహాలు) ఇక్కడ చట్టబద్ధత లేదని చర్చి మినిస్టర్ ఎబెనజర్ సెయింట్ జాన్ వెల్లడించారు. వివాదానికి కారణమైన యువతి ఎఫ్బీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించారు. పెళ్లిని నిలిపివేస్తూ చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతించాలి. ఇంకా చెప్పాలంటే చర్చికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారు ఆ వధువు పెళ్లిని నిలిపివేశారని చెప్పారు. క్యాథలిక్ చర్చిలో అయితే రెండోపెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారి వివాహాన్ని సమ్మతించరని వెల్లడించారు. -
ఇళ్ల మధ్యలో ఖననం.. అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్‌సిటీ: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సెయింట్ నిస్సి చర్చ్ పాదర్ పురుషోత్తం చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఖననం చేయడానికి వాళ్ల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వారు అడ్డుకుని జనావాసాల మధ్య మృతదేహాన్ని ఖననం చేయడం ఏమిటని ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మల్కాజిగిరి పోలీసులు హుటాహుటిన అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో మల్కాజిగిరి ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా వచ్చి ఇండ్ల మధ్యన ఖననం లాంటివి చేయకూడదని తెలిపారు. చివరికి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. -
చర్చిల్లో మత గురువులుగా పెళ్లయినవారు!
బెర్లిన్ : పెళ్లయిన పురుషులను కూడా చర్చిలలో మత గురువులుగా నియమించే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ గురువారం చెప్పారు. మతాచార్యుల కొరత వేధిస్తున్నందున గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడే పెళ్లయిన పురుషులకు అవకాశం లభించవచ్చని ఆయన ఒక జర్మనీ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అనేకచోట్ల మతాచార్యుల కొరత ఉన్నందున, వారి నియామకానికి కొత్త పద్ధతులు అవలంబించాలని చర్చిల్లో చాలా మంది భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మచర్యం పాటించేవారితోపాటు చర్చిల్లో పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉండే వయసు మళ్లిన, పెళ్లయిన పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలని చర్చిల్లోని వారు అనుకుంటున్నారని పోప్ పేర్కొన్నారు. -
చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు
ఆందోళనకు దిగిన గ్రామస్తులు కాకినాడ క్రైం : గొడారిగుంటలో చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా నగరపాలక సంస్థ ప్రణాళిక అధికారులు పోలీసులతో వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పాస్టర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష¯ŒSకు తరలించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే...కొత్త కాకినాడ గొడారిగుంటలో సర్వే నంబర్ 42లో 2008 సంవత్సరంలో ముగ్గురు లబ్థిదారులకు చెరో 50 గజాలు వంతున పట్టాలిచ్చింది. ముగ్గురు లబ్థిదారుల్లో ఇద్దరు పాస్టర్ ఇసాకు ( మైలపల్లి సూరిబాబు), కుమారుడు సామ్యూల్ పేరుమీద పట్టా ఉంది. గత కొన్నేళ్లుగా పాకలో క్రీస్తు సువార్త సహవాస సంఘం (చర్చి)ని పాస్టర్ ఇసాకు నిర్వహిస్తున్నారు. దుండగులు పాక తగలబెట్టేయడంతో రేకులషెడ్డు నిర్మించాడు. ప్రస్తుతం పక్కా భవనం నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు జరుగుతుండగా మంగళవారం టౌ¯ŒS ప్లానింగ్ అ«ధికారులు వచ్చి ప్లా¯ŒS మంజూరు లేదు, పైగా ఇది సామాజిక స్థలమని, నిర్మాణ ఆపాలని చెప్పి, మెటీరియల్‌ను తీసుకెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ‘అధికారులతో మాట్లాడతాను నిర్మాణ పనులు చేసుకోండ’ని చెప్పడంతో పనులు చేపట్టామన్నారు. బుధవారం సాయంత్రం మళ్లీ అధికారులు టూటౌ¯ŒS పోలీస్‌లు, జేసీబీతో వచ్చి పునాదులను కూల్చేందుకు యత్నించగా, ప్రతిఘటించామని, వినకుండా పాస్టర్ ఇసాకును పోలీస్‌స్టేష¯ŒSకు తీసుకెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ«ధ్యాత్మిక భావంతో చర్చి నడుపుతుంటే వర్గ వైషమ్యాలు తలెత్తేలా అధికారులు, పోలీస్‌లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్‌ను విడిచిపెట్టేదాకా ఇక్కడ నుంచి కదిలేది లేదని చర్చికి చెందిన సుమారు 300 మంది ఆందోళనకు దిగారు. ఏ విషయంపై పాస్టర్‌ను పోలీçసులు అరెస్టు చేశారు? ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది తేలా దాకా సంఘటనా స్థలం నుంచి కదలమని స్పష్టం చేశారు. టూటౌ¯ŒS సీఐ ఉమర్‌ని వివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, పనులను ఆపాలని అధికారులిచ్చిన ఫిర్యాదుపై పనులు ఆపించామన్నారు. -
అగ్నిప్రమాదంలో చర్చి దగ్ధం
కోడుమూరు రూరల్ : స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చర్చి శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. శనివారం చర్చి నిర్వాహకులు కుమార్ వ్యక్తిగత పనులపై ఇతర ఊళ్లకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో మంటలు చెలరేగి ఫర్నీచర్, మైక్ సిస్టమ్, బీరువా, సోలార్‌సిస్టమ్, వంటసామగ్రి కాలిపోయాయి. జనసంచారం లేని ప్రాంతంలో చర్చి ఉండడంతో అగ్ని ప్రమాద విషయాన్ని త్వరగా పసిగట్టలేకపోయారు. చర్చి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. -
ఆయనలో భాగమే... కొత్త ఏడాది!
మధ్యలో పరుగులో చేరినా చివరికి మెడల్ సాధించాడు అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు. ఆయన గొప్ప మేధావి, మహా వేదాంతి, కరడుగట్టిన యూదుమత ఛాందసుడు (క్రీ.శ. 5–67). క్రైస్తవ్యాన్ని కాలరాసేందుకు భీకరోద్యమాన్ని నడిపి హత్యలు, విధ్వంసాల దౌర్జన్యకాండతో యెరూషలేము ప్రాంతాన్నంతా హడలెత్తించాడు. పిదప సిరియాలో కూడా క్రైస్తవులపై దహనకాండను జరిపేందుకు వెళ్తుండగా రాజధాని దమస్కు పొలిమేరల్లో ఆకాశ దర్శనరూపంలో యేసు ఆయనకు సాక్షాత్కరించాడు. యేసు మరణించి సజీవుడయ్యాడన్న క్రైస్తవుల విశ్వాసం ఉత్త బూటకమని నమ్మే సౌలుకు యేసు సాక్షాత్కారంతో వెంటనే కనువిప్పు కలిగింది. అప్పటి నుండి పౌలుగా మారి క్రైస్తవాన్ని ప్రకటిస్తూ, చర్చిలు నిర్మించాడు. తన 62 ఏళ్ల జీవితంలో 32 ఏళ్లు దైవపరిచారకుడిగా గడిపాడు. దానికి ముందు 30 ఏళ్లు దైవ వ్యతిరేకిగా జీవించాడాయన. జీవితం చివరి సగభాగంలో పౌలు అద్భుతమైన వక్తగా, రచయితగా, మచ్చలేని విశ్వాసిగా, క్రైస్తవోద్యమ నాయకుడిగా బలమైన ముద్ర వేశాడు. తాను స్థాపించిన ఫిలిప్పీ చర్చికి రాసిన లేఖలో పౌలు తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ‘నా గతాన్నంతా వెనుకే వదిలేసి, దేవుడు నా ముందుంచిన గురివైపు దీక్షతో పరుగెత్తుతున్నా’ అంటాడు పౌలు (ఫిలిప్పీ 3:13, 14). అపరాధాలు, అవమానాలు, వైఫల్యాలకుప్పగా ఉన్న ‘గతం’ చాలామంది దృష్టిలో ఒక గుదిబండ. పౌలుకు కూడా అలాంటి గతం ఉంది. క్రైస్తవుల్ని చంపి, చర్చిల్ని ధ్వంసం చేసిన తన గతాన్ని తలుస్తూ కృంగిపోయి, అపరాధభావనతో నిర్వీర్యంగా పౌలు తన శేషజీవితాన్ని గడపవచ్చు. కానీ దేవుడిచ్చిన వినూత్నపథంలో, గతాన్ని వదిలేసి దేవుడు పెట్టిన గురి వైపు దృష్టంతా పెట్టి జీవితం చివరి సగభాగంలో కూడా పౌలు అద్భుతంగా పరుగెత్తాడు. జీవితానికొక లక్ష్యమంటూ ఎంచుకున్నాక చివరి సగభాగాన్ని ప్రతిక్షణం విలువైనదన్నట్టు అర్థవంతంగా గడిపాడు. ఉదాత్తమైన లక్ష్యమంటూ లేని వారికి జీవితాన్ని వ్యర్థం చేసుకునేందుకు వెయ్యి కారణాలు. కాని కాలం విలువ ఎరిగి ఒక సమున్నత లక్ష్యం కోసం జీవించే వారికి జీవితంలో ప్రతి రోజూ పండుగే! దేవుని తీర్పు సింహాసనం ముందు దోషిగా తలవంచుకు నిలబడినప్పుడు వ్యర్థం చేసుకున్న మన జీవితం విలువ అర్థమవుతుంది. దేవుని చేతికి గడియారం ఉండదు. దేవునిదంతా ఆయనతో నిండిన అనంతమైన కాలమే! అందులోని సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక భాగం ఆయన మనకిచ్చిన జీవిత కాలం! దేవుని అనంత కాలంలోని ఒక ఖండమే ‘పాత ఏడాది’గా ముగిసి ‘కొత్త ఏడాది’ అనే మరో ఖండపు ముంగిట్లో నిలబెట్టింది. ఈ ఏడాదిని చివరి దాకా ఆనందంగా అనుభవించే అపురూపమైన విధానాన్ని దేవుడు వివరిస్తున్నాడు. ‘జీవితం’ అనే ఈ గొప్ప బహుమానం విలువ తెలియాలంటే ముందుగా దాన్నిచ్చిన దేవుని విలువ మనకర్థం కావాలి. ఆ దేవునిలో ఎదగడానికి ఈ ఏడాది ప్రయత్నిద్దాం. కొందరు అభాగ్యుల జీవితాల్లోనైనా ఆనందం నింపడానికి ఉన్నదాంట్లోనే కొంతైనా వెచ్చిద్దాం. పగ, కోపం, మోసం, స్వార్థం, అసూయ వంటి అమానవీయ లక్షణాలకు దూరమై ప్రేమ, క్షమాపణ, త్యాగం, నిస్వార్థం, పరోపకారం వంటి దైవిక లక్షణాలకు దగ్గరవుదాం. జీవితమంతా సౌలులా బతికినా, ఈ ఏడాది కొన్నాళ్లైనా పౌలులా బతుకుదాం. ‘నూతన సృష్టి’గా (2 కొరింథీ 5:17) ఈ లోకంపై మనదంటూ ఒక ముద్ర వేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్! – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
ఉదయించిన కరుణ.. హృదయ ఆలాపన
ఏసుండు జన్మించే రేయిలో... లాలీ లాలెమ్మ లాలీ... రక్షకుడు ఉదయించినాడు లోకమంతటా వెలుగు... వంటి కీర్తనలతో ఆదివారం ఉదయం నుంచి చర్చీ ప్రాంగణాలు మార్మోగాయి. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు గుండె నిండుగా చేసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఏసు జననం వృత్తాన్ని వివరించేలా ప్రార్థనా మందిరాల్లో పశువుల పాకను అలంకరించి ఊయలలో బాల ఏసును ఉంచి ప్రత్యేక పాటలు పాడారు. శనివారం అర్ధరాత్రి కేక్‌లను కట్ చేశారు. ఆయా చర్చీల్లో బిషప్‌లు, ఫాదర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. -
కరుణోదయం
-
చర్చినే కాదు, జీవితాన్నీ సరిగ్గా కట్టుకోవాలి
యూదా రాజైన యోవాషు జీవితం దేవుని అద్భుతాలకు ప్రతిరూపం. అతల్యా అనే దుర్మార్గురాలు యూదా రాజవంశీయులందరినీ చంపి ఆ దేశాన్ని పాలిస్తున్న కాలంలో, యోవాషును దేవుడు పసివాడుగా ఉండగానే కాపాడాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా భార్య ఏడాది కూడా నిండని యోవాషును కాపాడి దేవుని మందిరంలోనే అతన్ని దాచింది. అప్పటికే మందిరం ప్రజల నిరాదరణకు గురై పాడుదిబ్బగా మారడంతో ఎవరూ దానివైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అందువల్ల యోవాషును ఉంచడానికి అదే సురక్షిత స్థలమయింది. అతల్యా హతమైన తర్వాత యెహోయాదా పర్యవేక్షణలో ఏడేళ్లకే యోవాషు యూదా దేశాన్ని ఏలడం ఆరంభించాడు. ప్రధాన యాజకుడు భక్తిపరుడైన యెహోయాదా సూచనల మేరకు యోవాషు ఎంతో దైవభయంతో జీవించాడు, పాలించాడు. ప్రజల నుండి ద్రవ్యం పోగుచేసి మందిర పునరుద్ధరణ కార్యం ఆరంభించాడు. ఆరాధనలు, దహనబలులు నిరంతరం జరిగే పూర్వవైభవాన్ని మందిరానికి తెచ్చాడు. పునరుద్ధరణ తర్వాత ఇంకా డబ్బు మిగిలితే ఆలయానికే కొత్త బంగారు, వెండి వస్తువులు చేయించాడు. ఈలోగా ప్రధాన యాజకుడైన యెహోయాదా 130 ఏళ్ల వయసులో మరణించాడు. అప్పటినుండి మార్గనిర్దేశం చేసేవారు లేక యూదా రాజ్యప్రజలు, యోవాషు కూడా దారి తప్పి దేవతాస్తంభాలు స్థాపించి విగ్రహారాధనలు ఆరంభించారు. ఆ విధంగా ఆత్మీయంగా పతనమయ్యారు. యూదా రాజ్యాన్ని తలుచుకుంటేనే జడిసిపోయే సిరియా సైన్యం, చిన్న గుంపుతో వచ్చి దాడి చేసి అసంఖ్యాకమైన యూదా సైన్యాన్ని ఓడించింది. నిజమే, ఆత్మీయంగా పతనమైనప్పుడు, చిన్న సవాళ్లు, చిన్నవాళ్లే విశ్వాసులకు పెనుసవాళ్లుగా మారడం చూస్తూంటాం. దుర్మార్గతను వాడమని చెప్పడానికి దేవుడు యెహోయాదా కుమారుడైన జెకర్యానే వారికి ప్రవక్తగా పంపాడు. అతడు వారిని చాలా గట్టిగా హెచ్చరించాడు కూడా! అయితే యెహోయాదా అతని కుటుంబం తనకు చేసిన మేలు మర్చిపోయి, యోవాషు రాజు జెకర్యాను రాళ్లతో కొట్టించి చంపించాడు. అలా దేవునికి రోజు రోజుకూ దూరమై చివరికి 47 ఏళ్ల వయసులోనే తీవ్రమైన రుగ్మతలకు లోనై మరణించాడు. అయితే అతని దుర్మార్గతను బట్టి, రాజుల సమాధులుండే స్థలంలో కాక ప్రజలతన్ని మరోచోట పాతిపెట్టారు (2దిన 23–24). అత్యద్భుతంగా సాగి ఎంతో వైభవంగా ముగియవలసిన యోవాషు జీవితం అలా అర్ధాంతరంగా అధ్వానంగా ముగిసింది. శిథిల మందిరాన్ని తిరిగి కట్టగలిగిన యోవాషు అతి ప్రాముఖ్యమైన తన జీవితాన్ని కట్టుకోవడంలో విఫలమయ్యాడు. మందిరాన్ని నిర్మిస్తే చాలు దేవుడు నాకు వంద మార్కులు వేస్తాడనుకున్నాడు యోవాషు. కాని దేవుడు చూసేది, చూసి ఆనందించాలనుకునేది తన జీవితాన్ని అన్న చిన్న వాస్తవాన్ని మర్చిపోయాడు. చర్చిలైనా మరే ఆరాధనా స్థలాలైనా, అక్కడి పవిత్రతను ప్రాంగణాల్లో కాదు, భక్తుల హృదయాల్లో దేవుడు చూస్తాడు. ఆదివారం నాడు ఆరాధనలో కనిపించే పరిశుద్ధత సోమవారం నుండి శనివారం దాకా విశ్వాసుల జీవితాల్లో లోపిస్తే, ఆ ఆరాధనకు దేవుని దృష్టిలో విలువ లేదు. పాలరాతితో చర్చిని నిర్మించిన వారి గుండెల నిండా పాపాల గుట్టలు పేరుకు పోయివుంటే దేవుడు చర్చిని చూసి మురిసిసోవాలా, భక్తుల్ని చూసి బాధపడాలా? – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
వెంకన్న గుడిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాం చిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణ చే యించి.. పిల్లనగ్రోవితో పాటలు పాడించారు. గోమాతకు పసుపు, కుంకుమలు చల్లి మహిళలు పూజలు చేశారు. శ్రావణ మాసం కావడంతో మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మి వత్రాలను ఆచరించారు. శ్రీకృష్ణాష్టమి జన్మదిన ప్రాధాన్యతను భక్తులకు అర్చకులు వివరించారు. చిన్నారులకు వేసిన శ్రీకృష్ణుడి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ.రమణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి, అర్చకులు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
చర్చిలో విదేశీయుల ప్రార్థనలు
ఇంగ్లాండ్‌లోని గ్లౌస్టర్ చర్చికి చెందిన పది మంది విదేశీయులు ఈనెల 6 నుంచి డోర్నకల్ అధ్యక్ష మండల పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం వారు డోర్నకల్‌లోని ఎఫిఫనీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో మొక్కలు నాటి సందడి చేశారు. కార్యక్రమంలో డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు, గ్లౌస్టర్ చర్చి ప్రతినిధులు డాక్టర్ మైక్ పర్సన్స్, డాక్టర్ రూత్ పర్సన్స్, షానన్ పాకర్తోపాటు మరో ఏడుగురు సభ్యులు పాల్గొన్నారు. – డోర్నకల్