
జాగ్రత్తగా చూస్తే ఈ ఫొటోలో కొండశిఖరంపై ఒక కట్టడం కనిపిస్తోంది కదూ! కొండశిఖరంపై వెలసిన ఈ కట్టడం ఒక చర్చి. కొండశిఖరంపైకి ఎక్కి దీనిని చేరుకోవడానికి లోహపు నిచ్చెన మెట్లదారి మాత్రమే దిక్కు. ఇది జార్జియాలో ఉంది. ‘కాటస్కీ పిల్లర్’గా ప్రసిద్ధి పొందింది. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎలాంటి ఆధారాలు లేవు. తొలిసారిగా పద్దెనిమిదో శతాబ్దిలో జార్జియన్ ప్రిన్స్ వాఖుస్తి తన పుస్తకంలో ఈ నిర్మాణం గురించి ప్రస్తావించాడు.
తర్వాత 1944లో అలెగ్జాండర్ జాపారిడ్జ్ అనే పర్వతారోహకుడు తన బృందంతో కలసి ఈ కట్టడాన్ని సందర్శించాడు. చాలాకాలంగా దీనిని ఎవరూ ఉపయోగించకుండా విడిచిపెట్టేశారు. అయితే, 1999 నుంచి వివిధ దేశాలకు చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. దీని నిర్మాణ శైలిని బట్టి, ఈ చర్చిని పదమూడో శతాబ్దిలో నిర్మించి ఉంటారని వారి అంచనా.
Comments
Please login to add a commentAdd a comment