Georgia
-
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
జార్జియా అధ్యక్షునిగా సాకర్ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?
టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్ యూనియన్)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు. 1990 ప్రాంతంలో ఇంగ్లిష్ సాకర్ టీమ్ మాంచెష్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్‌ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.నేను ఇక్కడే ఉన్నా.. !మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్ యూనియన్ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.అసలు ఏం జరిగింది..?యురోపియన్ యూనియన్‌లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి.వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్‌డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
చెస్ ఒలింపియాడ్: నేడు చైనా, జార్జియాలతో భారత్ పోరు
చెస్ ఒలింపియాడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్లు విరామం తర్వాత తదుపరి పోటీలను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం పురుషుల జట్టు చైనాను ఢీకొంటుండగా, మహిళల జట్టు జార్జియాతో తలపడుతుంది. భారత జట్లు ఈ టోర్నీలో వరుసగా ఆరు రౌండ్లలోనూ విజయాలు సాధించాయి. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్ ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ కీలక పాత్ర పోషిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. చైనా గట్టి ప్రత్యర్థి కావడంతో ఈ మ్యాచ్ ఫలితం భారత్ పతక వేటను శాసించనుంది. తర్వాత అమెరికా, ఉజ్బెకిస్తాన్లతో భారత పురుషుల జట్టు తలపడుతుంది. మహిళల ఈవెంట్లో జార్జియా కూడా కఠినమైన ప్రత్యర్థే కావడంతో ఏడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లకు కష్టమైన సవాళ్లు ఎదురవనున్నాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి భారత జట్లు 12 పాయింట్లతో పురుషుల, మహిళల కేటగిరీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నినో... నీకు సలాం!
ఒలింపిక్స్‌కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్ నినో సాలుక్వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్ ఇయాన్ మిల్లర్ కూడా 10 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. 2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!
ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్ ప్లాన్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్ వెయిట్ లాస్ ఫిట్నెస్ కొచ్చ్ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!. జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్‌లో ఎక్కువ వర్కౌట్లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్ వ్యాయామాలు జోష్‌ఫుల్‌గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట. దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్లో ఒక్కో ఫ్రూట్ వెరైటీని యాడ్ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది. కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్‌గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. పైగా స్పీడ్‌గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్‌గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..! View this post on Instagram A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee) (చదవండి: ఆ ఒక్క ఎక్క్ర్సైజుతో..అధిక బరువుకి చెక్ పెట్టిన నర్సు!) -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
ఆ గుహలోకి వెళ్తే అంతే సంగతులు..!
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్స్క్కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
NRI: జాలి చూపడమే అతని తప్పైంది!
న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రయం లేని వ్యక్తిపై జాలి చూపించిన క్రమంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన ఆ వ్యక్తి.. భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్ వద్ద అతనికి జూలియన్ ఫాల్కెనర్ అనే వ్యక్తి కన్పించాడు. అతడిని చూస్తే నిలువ నీడలేనట్టు కనిపించాడు. దీంతో చలించిపోయిన వివేక్ మానవత్వంతో అతన్ని చేరదీశాడు. రెండు రోజుల పాటు తినడానకి ఫుడ్ ఇస్తూ సాయం చేశాడు. ఇక.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో వేసుకొనేందుకు తనవద్ద ఉన్న జాకెట్‌ను కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న వివేక్.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. వివేక్ మాటలను అతను పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జూలియన్ తన వెంట ఉన్న సుత్తితో విచక్షణారహితంగా వివేక్ తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వివేక్ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జూలియన్ మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివేక్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: మాల్దీవుల పర్యాటకం.. తగ్గిన భారత టూరిస్టులు -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..
పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్ టిక్‌టాక్ వీడియో, టీవీ షోలు వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది. అసలేం జరిగిందంటే..యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్‌టాక్ వీడియో ఆమెకు చేరింది. వీడియోలో ఉన్న అమ్మాయి తన కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్‌కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు. ఎందుకు వేరయ్యారంటే.. అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది. ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్ ఆదేశాలు జారీ
అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు. జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
ట్రంప్ అరెస్ట్.. మగ్‌షాట్‌తో చరిత్ర సృష్టించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్న నేపథ్యంలో స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. నిబంధనల ప్రకారం పోలీసులు ట్రంప్‌ను అరెస్ట చేసి జైలులోకి తీసుకెళ్లారు. ట్రంప్‌కు జైలు అధికారులు P01135809, ఖైదీ నెంబర్ కేటాయిచారు. పోలీసు రికార్డుల కోసం కెమెరా ముందు ఆయన ఫొటోను (మగ్‌షాట్) కూడా తీశారు. ఫుల్టన్ కౌంటీ రికార్డుల ప్రకారం ట్రంప్ ఎత్తు 6.3 అడుగులు. 97 కిలోల బరువు ఉన్నారు. ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 2లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను(భారత కరెన్సీ ప్రకారం రూ.1.65 కోట్లు) సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. ఆ వెంటనే బెయిల్ రావడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ఆయన జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు. చదవండి: ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా ఆ దేశంలో దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. ఇక అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్‌షాట్) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకు నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. https://t.co/MlIKklPSJT pic.twitter.com/Mcbf2xozsY — Donald J. Trump (@realDonaldTrump) August 25, 2023 కాగా తన మగ్ షాట్ ఫోటోను ట్రంంట్ ట్విటరల్లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.అయితే 2021 జనవరి 6వ తేదీన ట్రంప్‌ను ట్విటర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ యాజమాన్య పగ్గాలు ఎలాన్ మస్క్ తీసుకున్నా గత నవంబర్‌లో ట్రంప్‌పై బ్యాన్ తొలగించారు. కానీ ట్రంప్ ట్విటర్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. నేడు అరెస్టు తర్వాత తొలిసారి తన ఖాతాలో మగ్‌షాట్‌ను పోస్టు చేశారు.. ‘ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూ లొంగను..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్‌ను కేవలం 2గంటల్లో 4.2 కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల సార్లు రీట్వీట్ చేశారు. -
ట్రంప్‌పై మరో తీవ్రమైన అభియోగం
వాషింగ్టన్: రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది. మరోసారి అధ్యక్షపీఠంపై కూర్చుకునేందుకు తహతహలాడుతున్న ట్రంప్‌పై అభియోగాలు నమోదవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ సోమవారం తన 41–చార్జ్ అభియోగాల పత్రంలో సంబంధిత వివరాలను పొందుపరిచింది. ట్రంప్‌తోపాటు మరో 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు తోటి వ్యక్తులు కుట్ర పన్నారని జ్యూరీ పేర్కొంది. ఆగస్ట్ 25వ తేదీలోపు ఈ 19 మంది స్వచ్ఛందంగా సరెండర్ కావాలని ఫుల్టన్ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్ సోమవారం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్ మాజీ న్యాయవాది రూడీ గిలియానీ, శ్వేతసౌధం మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్, అధ్యక్షభవనం మాజీ న్యాయవాది జాన్ ఈస్ట్‌మన్, న్యాయశాఖ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ క్లార్క్ ఉన్నారు. రాజకీయ దురుద్దేశం: ట్రంప్ ‘ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభియోగాలను అధికార డెమొక్రటిక్ పార్టీ నేతలు సమర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ పన్నిన కుట్రను ఈ అభియోగాలు బట్టబయలుచేస్తున్నాయి’ అని సెనేట్ మెజారిటీ లీడర్ షూమర్, హౌజ్ మైనారిటీ లీడర్ హకీమ్ అన్నారు. -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..
విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్ సైనికుడు సీపీఎల్ లూథర్ హెర్షెల్ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్ 1న జరిగిన కొరియన్ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా. ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. కొరియన్ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్ సత్కారమని యూస్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. (చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..) -
భారత్‌కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్‌తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్‌లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్‌జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్‌ఎన్‌ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్‌ఎన్‌ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్‌ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్‌డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్‌ఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్‌ఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు)