అట్లాంటా : జార్జియాలోని కమ్మింగ్ సిటీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జార్జియాలోని అట్లాంటా రిక్రియేషన్ క్లబ్‌లో ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో 11 నుంచి 19 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహిస్తున్నారు. కోవిడ సంక్షోభం తర్వాత జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి టోర్నమెంట్ ఇదే.
అట్లాంటా రిక్రియేషన్ క్లబ్ అనేది ఉత్తర అట్లాంటా జార్జియన్లకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ ప్లే మరియు కోచింగ్ అరేనాతో సేవలందించే ప్రీమియం సౌకర్యం. ఇక్కడ జరుగుతున్న పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment