tournament
-
హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.స్కోరు వివరాలు:హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0 -
మహిళల హాకీ ఇండియా లీగ్ వేలం... ఉదిత దుహాన్‌కు రూ. 32 లక్షలు
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి మంగళవారం వేలం కార్యక్రమం జరిగింది. భారత జట్టు డిఫెండర్ ఉదిత దుహాన్‌కు అత్యధికంగా రూ. 32 లక్షలు లభించాయి. శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు ఉదితను కొనుగోలు చేసింది. ఉదిత తర్వాత రెండో అత్యధిక మొత్తం నెదర్లాండ్స్ డ్రాగ్ ఫ్లికర్ యిబ్బీ జాన్సన్‌కు దక్కింది. ఒడిశా వారియర్స్ జట్టు రూ. 29 లక్షలకు యిబ్బీ జాన్సన్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు సభ్యులు లాల్రెమ్సియామి (రూ. 25 లక్షలు; శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్), సునెలితా టొప్పో (రూ. 24 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్), సంగీత కుమారి (రూ. 22 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్)లకు కూడా పెద్ద మొత్తమే లభించింది. భారత సీనియర్ జట్టు కెపె్టన్ సలీమా టెటెను ఒడిశా వారియర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఇషిక (రూ. 16 లక్షలు), నేహా గోయల్ (రూ. 10 లక్షలు)లను కూడా ఒడిశా వారియర్స్ కొనుగోలు చేసింది. సూర్మా హాకీ క్లబ్ భారత మాజీ కెప్టెన్ సవితా పూనియా (రూ. 20 లక్షలు), షర్మిలా దేవి (రూ. 10 లక్షలు), నిక్కీ ప్రధాన్ (రూ. 12 లక్షలు)లను దక్కించుకుంది. హెచ్ఐఎల్ టోర్నీ డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్‌లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చివరకు విజయం నిఖత్నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది. 75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్‌లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది. -
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మెగా టోర్నీ ’ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో సీఎం కప్ పోటీలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలో సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. మురళీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4700 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతోపాటు పలు కళాశాలల్లోనూ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 8గంటల నుంచే క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆ మేరకు క్రీడాకారులకు అవసరం అయిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
కార్ల్‌సన్‌కు ‘చెక్’
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్‌లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్‌ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
JIO: ఇ గేమింగ్ టోర్నమెంట్.. భారీ క్యాష్‌ప్రైజ్
MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్వర్క్! ఇండియాలో ఇ గేమ్స్ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ జియో, చిప్సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్ మాస్టర్ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్లో గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. క్యాష్ ప్రైజ్ గేమింగ్ మాస్టర్ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్, ఇ గేమింగ్‌లో ఉత్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. రిజిస్ట్రేషన్లు గేమింగ్ మాస్టర్ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్ https://play.jiogames.comకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్ మాస్టర్ 2.ఓ టోర్నమెంట్ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్ యూజర్లు ఈ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదు. ఇలా చూడొచ్చు గేమింగ్‌మాస్టర్ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్డీ ఈస్పోర్ట్స్ ఛానల్, ఫేస్బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛాన్సల్‌లో చూడవచ్చు. మీడియాటెక్ జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్ అందిస్తోన్న హెలియో జీ సిరీస్ చిప్సెట్లపై గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్సెట్లను అందుబాటులోకి తెచ్చింది. -
జార్జియాలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
అట్లాంటా : జార్జియాలోని కమ్మింగ్ సిటీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జార్జియాలోని అట్లాంటా రిక్రియేషన్ క్లబ్లో ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో 11 నుంచి 19 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహిస్తున్నారు. కోవిడ సంక్షోభం తర్వాత జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి టోర్నమెంట్ ఇదే. అట్లాంటా రిక్రియేషన్ క్లబ్ అనేది ఉత్తర అట్లాంటా జార్జియన్లకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ ప్లే మరియు కోచింగ్ అరేనాతో సేవలందించే ప్రీమియం సౌకర్యం. ఇక్కడ జరుగుతున్న పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
హృదయ విదారకం: పిచ్‌పైనే కుప్పకూలిన క్రికెటర్
పుణె: ఆరోగ్యంతోనే ఉంటే క్రీడల్లో ఆడాలి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ వంటి ఆటల్లో జాగ్రత్తగా పాల్గొనాలి. లేకపోతే దారుణ పరిస్థితులు వస్తాయి. తాజాగా ఓ క్రికెటర్ క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీంతో తోటి ఆటగాళ్లంతా విషాదంలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఫీల్డర్ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన ఎంపైర్ ఆటగాళ్లను పిలిచారు. వారు వచ్చి చూసేసరికి నల్వాడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో హృదయాలను పిండేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అయితే గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. फलंदाजी करताना मैदानावरच आला हार्ट अटॅक... पुणे जिल्ह्यातील स्थानिक क्रिकेटपटूचा उपचारापुर्वीच मृत्यू... अंगावर काटा आणणारा व्हायरल व्हिडिओ... pic.twitter.com/fHuvTSygrb — Pranali Kodre (@Pranali_k18) February 17, 2021 గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ -
ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా
మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్బోర్న్లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఓ కార్మికుడికి కోవిడ్–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. -
‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
గ్రీకు వీరుడు
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లోకి వేగంగా దూసుకొచ్చిన గ్రీస్ యువ సంచలనం స్టెఫనోస్ సిట్సిపాస్ ప్రతిష్టాత్మక విజయంతో సత్తా చాటాడు. వరల్డ్ టాప్–8 ఆటగాళ్లు పాల్గొన్న సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సిట్సిపాస్ విజేతగా నిలిచాడు. కెరీర్లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా నెగ్గకపోయినా... దిగ్గజ ఆటగాళ్లను దాటి అతను ఈ ఏడాది చివరి టోర్నీ అయిన ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ సిట్సిపాస్ 2 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–6 (7/4) స్కోరుతో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన సిట్సిపాస్... 2001 (నాడు 20 ఏళ్ల లీటన్ హెవిట్) తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్స్ చేరిన తొలి సీజన్లోనే సిట్సిపాస్ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనల్ పోరులో తొలి సెట్ సుదీర్ఘ ర్యాలీలతో సాగింది. ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ పోరుతో సెట్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో దాడి చేసిన థీమ్ దూసుకుపోయాడు. 5–6 వద్ద సిట్సిపాస్ ఒక సెట్ పాయింట్‌ను కాపాడుకోగలిగినా, ఆ తర్వాత థీమ్ పదునైన సర్వీస్‌ను రిటర్న్ చేయలేక సెట్ కోల్పోయాడు. అయితే సిట్సిపాస్ రెండో సెట్లో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న అనం తరం చక్కటి వాలీ, ఫోర్ హ్యాండ్ విన్నర్లతో ‘డబుల్ బ్రేక్’ సాధించాడు. ఈ ఒక్క సెట్లోనే అతను 10 విన్నర్లు కొట్టడం విశేషం. తుది ఫలితం మూడో సెట్‌కు చేరిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పోటా పోటీగా తలపడ్డారు. ముందుగా 1–1తో స్కోరు సాగగా, బ్యాక్‌హ్యాండ్ విఫలం కావడంతో ఒత్తిడికి లోనైన థీమ్ 1–3తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే వరుసగా మూడు గేమ్ లు గెలుచుకొని 4–3తో ముందంజలో నిలిచాడు. కానీ స్కోరు మళ్లీ టైబ్రేక్‌కు చేరింది. ఇక్క డా 4–0తో సిట్సిపాస్ ఆధిక్యంలో నిలిచిన తర్వాత స్కోరు మళ్లీ 4–4తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సిట్సిపాస్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్ ఓడిన తర్వాత ఒక ఆటగాడు టైటిల్ సాధించడం 2005 (నల్బందియన్–అర్జెంటీనా) తర్వాత ఇదే మొదటిసారి. సిట్సిపాస్‌కు 26 లక్షల 56 వేల డాలర్లు (రూ.19 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్థానం...ప్రశంసనీయం సాక్షి క్రీడావిభాగం: రెండేళ్ల క్రితం ఇటలీలోని మిలాన్‌లో జరిగిన నెక్ట్స్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌ను సిట్సిపాస్ ప్రేక్షకుడిగా చూశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ అండర్–21 ఆటగాళ్ల కోసం ఏటీపీ కొత్తగా ప్రవేశపెట్టిన టోర్నీ అది. సరిగ్గా ఏడాది తర్వాత అదే టోర్నీలో బరిలోకి దిగిన అతను విజేతగా నిలిచాడు. ఇప్పుడు మరో సంవత్సరం తిరిగేలోగా అసలైన ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను చేజిక్కించుకొని సగర్వంగా నిలిచాడు. ఈ గ్రీక్ ఆటగాడి ప్రస్థానం ఎంత వేగంగా సాగిందో తాజా ఫలితంతో అర్థమవుతుంది. 2018లో జనరేషన్ నెక్ట్స్ ట్రోఫీ నెగ్గాక రాబోయే ఏడాది కోసం అతను తనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు. అందులో ఏటీపీ ఫైనల్స్‌లో ఆడాలనేది తన కల అంటూ చాలా సార్లు అతను చెప్పుకున్నాడు. గత నెలలో షాంఘై ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించిన తర్వాత అతనికి ఫైనల్స్‌లో చోటు ఖాయమైంది. సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడమే కాదు సిట్సిపాస్ చాంపియన్‌గా కూడా నిలవడం విశేషం. 2016లో జూనియర్ వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు ఇదే టోర్నీకి స్పేరింగ్ (ప్రాక్టీస్) పార్ట్నర్గా కూడా సిట్సిపాస్ వచ్చాడు. నాడు తనతో కలిసి ఆడిన థీమ్‌పైనే ఆదివారం ఫైనల్లో అతను గెలుపొందాడు. 2019 సిట్సిపాస్‌కు అద్భుతంగా సాగింది. టాప్–10లో ఉన్న ఆటగాళ్లలో 9 మందిపై అతను విజయాలు సాధించడం చెప్పుకోదగ్గ ఘనత. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించడంతో ఈ గ్రీస్ ఆటగాడిపై అందరి దృష్టీ పడింది. తాజా ఏటీపీ ఫైనల్స్ గ్రూప్ విభాగంలో మెద్వెదేవ్, జ్వెరేవ్లపై నెగ్గి నాదల్ చేతిలో ఓడిపోయాడు. అయితే సెమీస్‌లో ఫెడరర్‌పై సాధించిన చక్కటి విజయం అతనికి ఊపు తెచ్చింది. తమ దేశ ప్రధాని కిరియాకొస్ మిట్సొటకిస్ స్వయంగా మ్యాచ్‌కు హాజరై ప్రోత్సహిస్తుండగా అదే జోరులో టైటిల్ కూడా గెలుచుకున్నాడు. రాబోయే 2020లో సిట్సిపాస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టగలడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ 6వ ర్యాంక్‌తో అతను ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. తాజా ఫామ్ చూస్తే అంతర్జాతీయ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేయగల సామర్థ్యం అతనిలో ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు 7 ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్ సిట్సిపాస్. గతంలో దిమిత్రోవ్ (బల్గేరియా–2017లో), అలెక్స్ కొరెత్యా (స్పెయిన్–1998లో), జాన్ మెకన్రో (అమెరికా– 1978లో), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా–1974లో), ఇలీ నస్టాసే (రొమేనియా–1971లో), స్టాన్ స్మిత్ (అమెరికా–1970లో) ఈ ఘనత సాధించారు. 2 వరుసగా నాలుగేళ్లు ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో కొత్త ప్లేయర్ విజేతగా నిలువడం ఇది రెండోసారి. ఆండీ ముర్రే (2016), దిమిత్రోవ్ (2017), జ్వెరెవ్ (2018) గత మూడేళ్లలో చాంపియన్స్‌గా నిలిచారు. 1988 నుంచి 1991 మధ్య ఇలాగే జరిగింది. గతంలో బోరిస్ బెకర్ (1988), స్టెఫాన్ ఎడ్బర్గ్ (1989), ఆండ్రీ అగస్సీ (1990), పీట్ సంప్రాస్ (1991) ఈ టైటిల్స్‌ను గెలిచారు. రెండో సెట్లో నేను అంత బాగా ఎలా ఆడగలిగానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా తుది ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఆడటం వల్ల అలాంటి ప్రదర్శన వచ్చిందేమో. అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్స్ ఆరంభంలో నా ఆటపై నేనే అసహనానికి గురయ్యాను. బ్రేక్ పాయింట్లు కోల్పోయాను. సర్వీస్ నిలబెట్టుకోలేకపోయాను. టై బ్రేక్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అయితే చివరకు అత్యుత్తమంగా నిలవడం సంతోషం. ప్రేక్షకులు నాకు మద్దతు పలకడం కూడా నాలో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ట్రోఫీని అందుకోవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. – సిట్సిపాస్ -
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ కాల్పులు
-
ఫ్లోరిడాలో భారీ కాల్పులు
జాక్సన్విల్లే: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్ నగరాన్ని ఆదివారం తుపాకీ కాల్పులు వణికించాయి. జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక అనుమానితుడు మరణించాడు. ‘ప్రజలు జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతానికి దూరంగా ఉండండి. ప్రస్తుతం అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు’ అని స్థానిక పోలీసు అధికారి ఒక ట్వీట్లో హెచ్చరించారు. మ్యాడెన్ వీడియోగేమ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో కాల్పులు జరిగాయని దాని నిర్వాహకులు ఒక ట్వీట్లో తెలిపారు. సెయింట్ జాన్స్ నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం వినోద కార్యక్రమాలకు పేరుగాంచింది. -
జాతీయస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం
తొలిరోజు ఆతిథ్య ‘అనంత’ జట్టు విజయంతో బోణీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫస్ట్ ఇన్విటేషన్ హాకీ అకాడమీస్ చాంపియన్ షిప్ - 2017 టోర్నీ ప్రారంభమైంది. హాకీ ఇండియా పర్యవేక్షణలో జూన్ మూడో తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్లో ఢిల్లీ, ఎర్నాకులం, ఊటీ, చెన్నై, తిరుచ్చి, కోవెల్పట్టీ, గుంటూరు, ధర్మవరం, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు పాల్గొంటున్నాయి. మొదటి మ్యాచ్ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మిటీ హాకీ అకాడమీ (ఎర్నాకులం) జట్లు తలపడ్డాయి. మొదట ఎమ్మిటీ జట్టు గోల్ సాధించి ముందంజలో ఉండగా తర్వాత అనంతపురం జట్టు పుంజుకుని మొదటి హాఫ్‌లో ఏకంగా 4–1 గోల్స్ సాధించింది. అనంతరం సెకండ్ హాఫ్‌లోను 3 గోల్స్ సాధించి అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 7–1తో విజయం సాధించింది. జట్టులో సాయికుమార్ ఏకంగా 4 గోల్స్ సాధించి విజయాన్నందించాడు.›రెండవ మ్యాచ్‌లో ధర్మవరం, ఊటీ జట్లు తలపడగా ఊటీ జట్టు 3–1తో విజయం సాధించింది. క్రీడలను ఆస్వాదించండి క్రీడాకారులు క్రీడలను ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. సోమవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయనతోపాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ దామోదర్, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, టోర్నీ డైరెక్టర్ డాన్నీకెన్నీ, ఆడిటర్ వేణుగోపాల్‌రెడ్డి, సప్తగిరి క్యాంఫర్ హనీఫ్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు సూర్యప్రకాష్, గోపీనాథ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఘని, ట్రెజరర్ బాబయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, పీఈటీ నాగరాజు, కోచ్‌లు లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, చౌడేశ్వరప్రసాద్, వైద్యులు సయ్యద్ హుస్సేన్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజు 8 మ్యాచ్‌లు
భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ వైద్య విద్యాలయం ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అంతర్ వైద్యకళాశాలల క్రికెట్ పోటీల్లో మూడో రోజైన బుధవారం వివిధ కళాశాలల జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో 8 జట్లు ఇంటిబాట పట్టాయి. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు పోటీలను పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు పోటీలను రంగరాయ ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రారంభించారు. మూడోరోజు విజేతలు వీరే మమత డెంటల్ కళాశాల( కర్నూలు)పై రంగరాయ వైద్య కళాశాల (కాకినాడ), నారాయణ మెడికల్ కాలేజ్ (నెల్లూరు) పై ఆశ్రం వైద్య కళాశాల( ఏలూరు), కోనసీమ మెడికల్ కళాశాల (అమలాపురం)పై కాటూరి మెడికల్ కాలేజ్ ( గుంటూరు), సీకేఎస్ తేజ డెంటల్‌కాలేజ్ తిరుపతిపై గుంటూరు మెడికల్ కళాశాల, నిమ్రా మెడికల్ కళాశాల (విజయవాడ)పై శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల (తిరుపతి), ప్రభుత్వ డెంటల్ కళాశాల విజయవాడపై ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల విశాఖ పట్నం, లెనోరా డెంటల్ కాలేజ్(రాజానగరం)పై ఉస్మానియా మెడికల్ కళాశాల (హైదరాబాద్)లు, రిమ్స్ కాకతీయ మెడికల్ కళాశాల వరంగల్‌పై రిమ్స్ కడప విజయం సాధించాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు స్పర్జన్‌రాజు పేర్కొన్నారు. -
అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్‌రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్‌రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
క్రికెట్ టోర్నీ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారక ఉద్యోగుల క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. మొత్తం 22 జట్లు పాల్గొంటున్నాయి. తొలిరోజు ఎనిమిది జట్లు తలపడ్డాయి. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు పగడాల మల్లికార్జున, కార్యదర్శి బీఆర్ ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీలు ప్రతి ఆదివారం అనంత క్రీడా మైదానం, నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు జొన్నా జయప్రకాష్, ఆర్డీటీ ఏడీ నాగప్ప, సభ్యులు మధుసూదన్ ఆచారి, అలీ పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. = గుంతకల్లు రైల్వేస్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేశారు. జట్టులో శ్రీకాంత్‌రెడ్డి 61, శివ 54 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. జట్టులో జగన్ 48 పరుగులు సాధించాడు. = రెండవ మ్యాచ్ ఏపీ ట్రాన్స్‌కో, ఇరిగేషన్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఏపీ ట్రాన్స్ కో జట్టు 174 పరుగులు చేసింది. జట్టులో రమణ 66 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇరిగేషన్ జట్టు 145 పరుగులు చేసింది. జట్టులో కిషోర్ 55 పరుగులు సాధించాడు. = మూడవ మ్యాచ్‌లో ఎలక్ట్రిక్, రిలయన్స్ జట్లు తలపడ్డాయి. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రిక్ జట్టు 132 పరుగులు సాధించింది. జట్టులో దినేష్ 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిలయన్స్ జట్టు 129 పరుగులు చేసింది. జట్టులో యోగి 35 పరుగులు సాధించాడు. = చివరి మ్యాచ్ టీచర్స్, సాంఘిక సంక్షేమ శాఖ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీచర్స్ జట్టు 165 పరుగులు చేసింది. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ జట్టు 65 పరుగులకే కుప్పకూలింది. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: కాపు రిజ్వరేషన్ సాధికారిక వింగ్ చైర్మన్ పెమ్మా అంకమ్మరావు అధ్వర్యంలో అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో నిర్వహిస్తున్న వంగవీటి మోహన్ రంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లను మాజీ శాసనసభ్యుడు లింగంశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొరివి వినయ్ కుమార్, నిర్వాహకులు పెమ్మా అంకమ్మరావు, ఎస్.నరేష్, పెమ్మా శ్రీనివాసరావు, శృంగారపు శ్రీనివాసరావు, బి.వీరయ్య, తోట మధు, తల్వాకర్ జట్టు కెప్టెన్ ఎండి జావీద్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్ ఫలితాలు.. ఉదయం జరిగిన మ్యాచ్‌లో తల్వాకర్ జట్టు 41 పరుగుల తేడాతో మనోజ్ జట్టుపై విజయం సాధించింది. బ్యాటింగ్ చేపట్టిన మనోజ్ జట్టు 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి పరాజయం పాలైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఫణి జట్టు 8 వికెట్ల తేడాతో మెడికల్ మేనేజర్స్ జట్టుపై విజయం సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫణి జట్టు 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విజయం సాధించింది. -
హోరాహోరీగా ఫైనల్ పోరు
- ముగిసిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ పోటీలు - విజేతలకు ట్రోఫీలు ప్రదానం కర్నూలు (టౌన్): స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు పోటీలు హోరాహోరిగా సాగాయి. ఫైనల్ పోరులో క్రీడాకారులు విజయం కోసం నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఈ నెల 7 నుంచి నగరంలోని ఇండోర్‌స్టేడియం, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించారు. అండర్ -15 బాలుర విభాగంలో ఏపీకి చెందిన సాయిచరణ్ కోయా విన్నర్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో ఆయన ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అయూష్ రాజ్ గుప్తపై 21=16, 21–13 పాయింట్లతో విజయం సాధించారు. అండర్-13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మేఘనారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయపై, డబుల్స్ విభాగంలో మేఘనారెడ్డి (తెలంగాణ), తస్నీమ్ మీర్ (గుజరాత్).. శ్రేయా చిత్తూరు (తెలంగాణ), ప్రవీణా (తమిళనాడు)పై గెలిచారు. అండర్-13 బాలుర విభాగంలో శంకర్ ముత్తుస్వామి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆకాష్ సింగ్‌పై, డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీక్రిష్ణ రాజ్, ఉనీత్ క్రిష్ణ తెలంగాణకు చెందిన సాతా„Š సింగ్ (ఢిల్లీ), సాయి సత్య సర్వేష్ యాకలా (పంజాబ్)పై గెలిచారు. అండర్ -15 బాలికల సింగిల్స్‌లో రిచా ముక్తిభోద్ (కర్ణాటక) మేధా శశిధరణ్ (కర్ణాటక)పై, డబుల్స్‌లో తెలంగాణకు చెందిన కేయూరా మోపతి, పంజాబ్‌కు చెందిన కవిప్రియాలు కర్ణాటకకు చెందిన తన్య హేమంత్, కీర్తన షరాఫ్‌పై గెలిచారు. డబుల్స్ బాలుర విభాగంలో ఎడ్విన్ జాయి, ఆరవింద్ వి. సురేష్ (కేరళ) బైద్యసాగర్ సలామ్, పున్షిభ ఎంగోమ్ (మణిపూర్)పై గెలిచారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం ముగింపు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఎస్పీ ఆకె. రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, డీఎస్డీఓ మల్లిఖార్జున, ఇండియన్ బాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసభట్, కోశాధికారి డాక్టర్ రవికళాధర్ రెడ్డి హాజరయ్యారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫిలు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జాతీయస్థాయి గెలుపు ఆనందంగా ఉంది: సాయి చరణ్ కోయా గుంటూరుకు చెందిన సాయి చరణ్ హైదరబాదులో ఐడియల్ గ్రామర్స్కూలులో 10 వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా హైదరబాదు బోంగులూరులోని భాస్కర్‌బాబు లీనింగ్ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జాతీయస్థాయిలో గెలుపొందడం ఆనందంగా ఉందని తెలిపాడు. విన్నర్‌గా రాణించడం వెనుక కోచ్ బాస్కర్‌బాబు కృషి ఉన్నట్లు పేర్కొన్నాడు. -
సత్తాచాటిన పశ్చిమ
నారాయణపురం (ఉంగుటూరు) : సపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. బాలుర జట్టు విజేతగా నిలిచింది. నారాయణపురం బాపిరాజు స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న అండర్–19 సపక్ తక్రా బాల, బాలికల టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన తుది పోటీల్లో కర్నూలు జట్టు ద్వితీయ స్థానం దక్కించుకోగా కడప జట్టు తృతీయస్థానం పొందింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు ఛాంపియ¯ŒSగా నిలిచింది. శ్రీకాకుళం దిృతీయ, పశ్చిమ గోదావరి తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వి.సోమశేఖర్ అధ్యక్షత వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తిరుపణ్యం, సపక్‌తక్రా రాష్ట్ర పరిశీలకుడు ఎ. సుబ్బరాజు, ఈ పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి అద్దంకి ఐజాక్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, జీఎంఎస్ కుమార్, రాజా, మూర్తి, శ్రీను, పాల్గొన్నారు. -
టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం, జిల్లా టెన్నిస్ సంఘం, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో అండర్–14, 16 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలుత అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకొని టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి చారి, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, రాష్ట్ర పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ సంఘం కార్యదర్శి సంగీతరావు పాల్గొన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ
నంద్యాల: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్–19 తైక్వాండో టోర్నమెంట్‌ను స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చలపతిరావు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 13 జిల్లాలకు చెందిన బాలురు, బాలికల జట్లు హాజరవుతాయని, ఒక్కో జట్టులో 8మంది క్రీడాకారులు కోచ్, మేనేజర్ ఉంటారని చెప్పారు. మూడు రోజుల పాటు టోర్నీ నిర్వహిస్తామన్నారు. టోర్నీలో ప్రతిభ చూపిన వారిని వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. -
నేటి నుంచి జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ
సాఫ్ట్‌బాల్ జాతీయ టోర్నీని అనంతలో జరపడం ఆనందదాయకమైన విషయమని జాతీయ సాఫ్ట్‌బాల్ సీఈఓ ప్రవీణ్ అనౌకర్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం అవుతుందన్నారు. జాతీయ క్రీడల నిర్వహణకు అనంత క్రీడాగ్రామం చాలా అనువైనదన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అంతర్జాతీయ జట్టు ఎంపిక టోర్నీ అనంతరం జరుగుతుందన్నారు. క్రీడాకారులను ఎంపిక చేయడంతో పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుతం జరిగే టోర్నీకి సాఫ్ట్‌బాల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏమీబ్రాండ్ హాజరవుతారన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అంతర్జాతీయ జట్టు ఎంపిక ఉంటుందన్నారు. 2012 లో అనంత జాతీయ క్రీడకు వేదికగా నిలిచిందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద టోర్నీకి మొదటిసారి వేదికగా మారిందని తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే బాల, బాలికల జట్లను ఎంపిక చేశామన్నారు. -
ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు
హన్మకొండ చౌరస్తా : క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ సూ చించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సిటీజ¯ŒSక్లబ్లో శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల జూడో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 వరకు జరగనున్న పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి రాష్ట్రంలో జూడో అభివృద్ధికి తన వం తుగా కృషి చేస్తానన్నారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్‌యాదవ్ మాట్లాడుతు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ద¯ŒSరెడ్డి, ఎంఏ అజీజ్, కోశాధికారి బాలరాజు, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ చక్రపాణి, నర్సంపేట మున్సిపల్ కమిషనర్మల్లికార్జునస్వామి, కార్పొరేటర్ సోబియా సబహత్, నవనీతరావు, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణులు క్రీడల్లో రాణించాలి
వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముగిసిన వాలీవాల్ టోర్నీ జేగురుపాడు (కడియం) : గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్, గంగిరెడ్డి నర్సింగ్‌హోం అధినేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. కడియం మండలం జేగురుపాడులో నిర్వహించిన మద్దుకూరి శాంతకుమారి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గురువారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పార్టీ నాయకుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పెద్దఎత్తున క్రీడా పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. టోర్నీ విజేతగా నిలిచిన ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన జట్టుకు రూ.10 వేలు, రన్నర్స్‌గా నిలిచిన కడియం మండలం బుర్రిలంక జట్టుకు రూ. 6 వేలు అందించారు. అనంతరం మద్దుకూరి బాలు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో దూర్వాసుల సాయిబాబు, పుట్టా బుజ్జి, మద్దుకూరి పుల్లయ్య, పెనుమాక ఆనంద్‌కుమార్, రంకిరెడ్డి సుబ్రహ్మణ్యం, అంబేద్కర్ యూత్ సభ్యులు మెల్లిమి చంటిబాబు, కోలమూరి అశోక్, వర్షాల నాని పాల్గొన్నారు. -
7 నుంచి రాష్ట్ర బ్యాడ్మింటన్ టోర్నీ
lఅండర్–13, 15 పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులు పోటీలకు హాజరు కానున్న 150 మంది క్రీడాకారులు టోర్నీ వేదికగా సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియం ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్ –13, 15 బాలబాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కాటమనేని రమేష్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీలకు ముందురోజైన 7వ తేదీన క్వాలిఫైయింగ్ ఉంటుందని, 8 నుంచి 10 వ తేదీ వరకు అధికారిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలనుంచి 150 మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లు చెప్పారు. వారందరికీ నగరంలోని పలుహోటళ్లలో వసతితో పాటు ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలి పారు. పోటీలకు వేదికగా నగరంలోని సర్ధార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని వివరించారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఎండీ దినకర్ బాబు, జేసీ దివ్య హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలసాని ఆనంద్ మాట్లాడుతూ క్రీడాకారుల సౌకర్యార్థం టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం అన్ని వసతులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి కె. శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్యదర్శి నల్లమోతు రఘులు పాల్గొన్నారు. -
రాజమండ్రిలో టీటీ టోర్నీ ప్రారంభం
-
బాస్కెట్‌బాల్ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థి
కె.కోటపాడు: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు ఎ.కోడూరు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి యడ్ల ప్రసాద్ ఎంపికయ్యాడు. ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన అండర్ 17 విభాగం రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలో ప్రసాద్ మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో రాష్ట్రస్థాయి జట్టులో పాల్గొననున్నాడు. ప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.అనురాధ, పీఈటీ కె.చిట్టిప్రసాద్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
21న అండర్–16 క్రికెట్ టోర్నమెంట్
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 21న వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో అండర్–16 సిటీ స్కూల్స్ స్థాయి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం మాత్రమే నిర్వహించే టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినరోజు సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలతో, స్కూల్ లెటర్‌ప్యాడ్‌పై రాసి ఈ నెల 18లోపు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. క్రీడాకారులు తెల్లని యూనిఫాం ధరించి, పూర్తి కిట్‌తో హాజరుకావాలని తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 98495 70979 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
క్రికెట్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: ప్లేయర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకోని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోటీలలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించటం కీలకమన్నారు. ఉదయం జరిగిన మ్యాచ్‌లో నాగేశ్వరరావు లెవెన్ జట్టు 34 పరుగుల తేడాతో మనోజ్ లెవెన్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన నాగేశ్వరరావు జట్టు 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ జట్టు 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. -
రెండో రోజూ స్నూకర్ టోర్నమెంట్
మారీసుపేట(తెనాలి): కోగంటి శివప్రసాద్‌రావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం కొనసాగింది. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణ మండపంలో జరుగుతున్న టోర్నమెంట్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రౌండ్లో ప్రతాప్‌పై రమాకాంత్ 0–3, నానిపై గంగాధర్ 0–3 మార్కుల తేడాతో ఉన్నారని నిర్వాహకులు కొగంటి రోహిత్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్‌కు నలుగురు క్రీడాకారులు చేరుకున్నారని చెప్పారు. శనివారం ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. కోగంటి రోహిత్, ఎస్ నరేంద్ర, భార్గవ్, శ్రీధర్ తదితరులు పర్యవేక్షించారు. -
స్నూకర్స్ టోర్నమెంట్ ప్రారంభం
తెనాలి (మారీసుపేట): నేటి సమాజంలో క్రీడల ప్రాధాన్యం తగ్గిందని, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెనాలి 1వ అదనపు న్యాయమూర్తి జి.ప్రభాకర్ సూచించారు. కోగంటి శివప్రసాదరావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్‌ను కొత్తపేటలోని కనికిచర్ల కల్యాణ మండపంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఈ క్రీడను తెనాలిలో నిర్వహించడం ముదావాహం అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు రావడం ఆనందకరమన్నారు. నిర్వాహకులు కోగంటి రోహిత్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, శాఖమూరి సురేంద్ర, చలసాని బాబు, కోగంటి నవీన్, ఎ.భార్గవ్, వి.మురళీ పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మాచర్ల: విద్యార్థులు విద్యనభ్యసించటంతో పాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. శనివారం స్థానిక సెయింట్‌ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పునీత అన్నమ్మ పేరుతో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సాప్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వెనుకబడిన పల్నాటిలో సెయింట్ ఆన్స్ విద్యాసంస్థ ఉత్తమ బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. ఆర్సీఎం చర్చి పాస్టర్ పెట్ల మరియదాసు, ఎంఈవో వేముల నాగయ్య, జిల్లా సాప్ట్‌బాల్ కార్యదర్శి నరసింహారెడ్డికి పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పోటీల్లో జిల్లా నుంచి వచ్చిన 14 టీంలు పాల్గొన్నాయి. -
జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి
నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్‌కు విజయాన్ని అందించారు. -
‘పట్టు’ వదలని పోరాటం!
► ఆస్ట్రేలియా తరఫున రియోకు అర్హత సాధించిన భారత రెజ్లర్ వినోద్ ► మృత్యువు అంచునుంచి బయటపడి ► ఒలింపియన్‌గా ఎదిగిన వైనం దాదాపు పదిహేనేళ్ల క్రితం ఆ టీనేజ్ రెజ్లర్ అప్పుడప్పుడే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఇతని ఎదుగుదల చూసిన మరో ఆటగాడి తండ్రి కుర్రాడిపై పగను పెంచుకున్నాడు. టోర్నమెంట్లో ఆడటం కోసం మరో రాష్ట్రానికి వెళుతున్న సమయంలో మత్తు మందు ఇచ్చి క్రూరంగా రైల్లోంచి తోసేశాడు. అడవిలో పడిపోయిన ఆ అబ్బాయి చావుకు చేరువగా వెళ్లి అదృష్టవశాత్తూ బతికిపోయాడు. అయితే ఆ రెజ్లర్ అంతటితో ఆగిపోలేదు. ఏడాది పాటు మంచంపైనే ఉన్నా తన పోరాటం ఆపలేదు. తనకు తగిలిన రాళ్లను పునాదిగా మార్చుకొని మరింత ఎదిగాడు. క్రీడా ప్రపంచమంతా పాల్గొనాలని కలలుగనే ఒలింపిక్స్‌లో అతను సగర్వంగా అడుగు పెట్టబోతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున రియో బరిలోకి దిగనున్న 31 ఏళ్ల భారత రెజ్లర్ వినోద్ కుమార్ విజయ గాథ ఇది. ఏ సినిమా స్టోరీకి తగ్గని మలుపులు ఉన్న వీర కథ ఇది. సాక్షి క్రీడా విభాగం :- న్యూస్ పేపర్ హ్యాకర్... కొరియర్ బాయ్... ఫ్యాక్టరీలో ప్యాకేజ్ బాయ్... బార్లో బౌన్సర్... బతుకుతెరువు కోసం వినోద్ కుమార్ ఆస్ట్రేలియాలో చేయని పని లేదు. మన తెలుగు సినిమాల్లో హీరోలా ఒక్కపాటలోనే అతను ఐశ్వర్యవంతుడిలా మారిపోలేదు. ఇంగ్లీష్ భాషలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దేశం కాని దేశం వెళ్లి ఒలింపియన్‌గా ఎదగడం అసాధారణం. అతని జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆస్ట్రేలియాలో ఉన్న ఆరేళ్లలో అతను తనకు తెలిసిన ఒకే విద్య కుస్తీనే నమ్ముకున్నాడు. ఉదయం, సాయంత్రం ఎలాంటి పని చేసినా రెజ్లింగ్‌పై మాత్రం ప్రాణం పెట్టాడు. అదే అతడి జీవితాన్ని మార్చింది. సుశీల్, యోగేశ్వర్లతో కలిసి... హర్యానాలోని సోనేపట్‌కు చెందిన వినోద్, ఆ ప్రాంతంలోని చాలా మందిలాగే రెజ్లింగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఢిల్లీకి వెళ్లి ప్రముఖ కోచ్ సత్పాల్ సింగ్ వద్ద శిక్షణలో చేరాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్దత్లతో కలిసి అతను అక్కడే సాధన చేసేవాడు. జూనియర్ స్థాయిలో చురుకైన రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకొని వేర్వేరు టోర్నీలలో రాణించడంతో వినోద్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 16 ఏళ్ల వయసులో పెద్ద స్థాయిలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న దశలో రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైనా పోటీ ఉంటే అది రెజ్లింగ్‌లోనే చూపిస్తారని అతను అనుకున్నాడు గానీ ఇలా ప్రాణాలే తీసేంత కక్ష వారిలో ఉందని అతను ఊహించలేకపోయాడు. పోరాటం మొదలు రైల్లోంచి పడటంతో అతని శరీరంలో అనేక భాగాలు బాగా దెబ్బతిన్నాయి. మరుసటి ఉదయం పట్టాల పక్కన రైల్వే ఉద్యోగులు చూడటంతో ప్రాణం దక్కింది. చికిత్సతో కొంత కోలుకున్నా... దాదాపు ఏడాది పాటు మంచం మీదనుంచి లేవలేకపోయాడు. తీవ్రమైన నొప్పులతో రాత్రంతా మేలుకోవాల్సి వచ్చేది. బతికితే చాలనే ఇలాంటి స్థితిలో ఇక కుస్తీ గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఈ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి తన జీవితంపై ఆశలు పెంచుకున్నాడు. పవన్ కుమార్ అనే మాజీ రెజ్లర్ అండగా నిలవడంతో వినోద్‌లో కొత్త ఆశలు చిగురించాయి. మళ్లీ బరిలోకి... పూర్తి ఫిట్‌గా లేకపోయినా పవన్ సూచనతో ఢిల్లీకి చేరుకొని మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కొద్ది రోజులకు మళ్లీ ఆడగలననే నమ్మకం ఏర్పడింది. అయితే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దేశవ్యాప్తంగా ఎక్కడ సాంప్రదాయ కుస్తీ పోటీలు (దంగల్) జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాడు. అక్కడ టైటిల్స్ గెలిస్తే వచ్చే డబ్బుతో మళ్లీ ప్రాక్టీస్. అయితే ఇన్నేళ్ల విరామంలో రెజ్లింగ్ అకాడమీలో చాలా మంది ఆటగాళ్లు ఎదిగిపోవడంతో తాను అక్కడ ఏమీ చేయలేనని అర్థమైంది. మరో వైపు తనపై హత్యాప్రయత్నం చేసినవారిపై కేసు పెట్టినా అవి సుదీర్ఘ కాలం సాగాయి. దాంతో దేవుడే చూసుకుంటాడు... అంటూ కేసు వెనక్కి తీసుకున్నాడు. ఇది అతని కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో విసిగిపోయి ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకున్న సమయంలో పవన్ కుమారే మళ్లీ ఆదుకున్నాడు. రెజ్లర్లకు మంచి అవకాశం ఉందంటూ తనకు ఉన్న పరిచయాలతో వినోద్‌ను ఆస్ట్రేలియా పంపించాడు. కంగారు కంగారుగా... ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత భాష రాకపోవడంతో పాటు డబ్బులు లేకపోవడంవంటి అనేక సమస్యలు వినోద్‌ను చుట్టుముట్టాయి. దాంతో ఏదైనా ఉద్యోగం కావాల్సిందేనంటూ పేపర్ బాయ్‌గా చేరాడు. ఎక్కువ డబ్బుల కోసం ఉదయం పూటనే నడుస్తూ దాదాపు 800 ఇళ్లకు పేపర్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు భారత్‌లో చేసిన అప్పులను మెల్లగా తీర్చుకుంటూ పోయాడు. మెల్బోర్న్లో స్థానిక క్లబ్ సహకరించడంతో రెజ్లింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాడు. ఏ ఉద్యోగం చేసినా తన ప్రాక్టీస్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఆస్ట్రేలియాలో వివిధ స్థాయిలలో వరుస విజయాలు దక్కడంతో పాటు ఆరు సార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు పతకాలు సొంతం చేసుకున్న వినోద్... ఏప్రిల్‌లో అల్జీరియాలో జరిగిన ఆఫ్రికా/ఓషియానియా క్వాలిఫయర్స్ పోటీల్లో రజతం సాధించి ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో అతను పోటీ పడతాడు. 2010 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్న అతనికి ఏడాది క్రితమే పౌరసత్వం దక్కింది. అమ్మ లేకుండా... వినోద్ తండ్రి చాలా కాలం క్రితమే చనిపోగా... రెండేళ్ల క్రితం తన సొంత ఊరులో తల్లి జన్నోదేవిని కలిసొచ్చాడు. ఆ తర్వాతనుంచి ప్రాక్టీస్‌లో బిజీ కావడంతో ప్రతీ వారాంతంలో ఫోన్ చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఏప్రిల్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాక ‘అమ్మా... చాలా మంది ఒలింపిక్స్ వెళుతున్నారంట. నువ్వెప్పుడు వెళతావురా అని అడిగేదానివి. ఇప్పుడు నీ కొడుకు కూడా ఒలింపియన్ అయ్యాడని గర్వంగా చెప్పుకో’ అని ఫోన్ చేయడంతో ఆమె ఎంతో సంతోషంతో ఊరంతా చాటింపు వేసింది. అయితే రెండు వారాల క్రితమే అకస్మాత్తుగా చనిపోయిన ఆ అమ్మకు ఇప్పుడు కొడుకును రియో వేదికపై చూసే అదృష్టం లేదు! -
తైక్వాండో సమరం
-తాడేపల్లిగూడెంలో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ -నేటి నుంచి పోటీలు తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్-2016 పోటీలు గురువారం సాయంత్రం స్థానిక డీఆర్ గోయంకా మహిళా కళాశాలలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు తరలివచ్చారు. సబ్ జూనియర్ (అండర్-12), క్యాడెట్ (అండర్-14), జూనియర్ (అండర్-17), సీనియర్ (17+) విభాగాల్లో, బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం అధికారికంగా పోటీలు ప్రారంభమవుతాయి. తొలిరోజు పూమ్సే (విన్యాసాలు), రెండో రోజు కురోగి (యుద్ధ విన్యాసాలు) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఏఆర్‌కే వర్మ, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు విలేకరులకు తెలిపారు. ప్రధాన రిఫరీగా అసోసియేషన్ కార్యదర్శి గుణ్ణం కృష్ణమోహన్ వ్యవహరిస్తారు. ప్రతి కోర్టుకు ముగ్గురు కార్నర్ రిఫరీలు, ఒకరు సెంట్రల్ రిఫరీ ఉంటారని వివరించారు. -
భారత్- జపాన్ మ్యాచ్ డ్రా
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత్, జపాన్ మహిళల హాకీ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. భారత్ తరఫున పూనమ్ రాణి (7వ ని.) గోల్ చేయగా... హాజుకీ నగయ్ (19వ ని.) జపాన్‌కు గోల్‌ను అందించి స్కోరును సమం చేసింది. శుక్రవారం జరిగే చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
అజ్లాన్ షా సిల్వర్ జూబ్లీ
♦ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనమైన ఏర్పాట్లు ♦ నేడు జపాన్‌తో భారత్ పోరు ఇపో (మలేసియా): ఎంతో మంది కుర్రాళ్లకు భవిష్యత్‌ను ఇచ్చిన వేదిక... దిగ్గజ ఆటగాళ్ల కెరీర్‌ను మలుపు తిప్పిన టోర్నమెంట్... ఒకప్పుడు రెండేళ్లకొకసారి పోటీలు... కానీ ఇప్పుడు ప్రతి ఏడాది కచ్చితంగా ఈవెంట్... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక క్యాలెండర్లో ప్రత్యేకమైన చోటు... 1983లో చిన్నగా ఏ ర్పాటైన ‘అజ్లాన్ షా’ హాకీ కప్ ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా అవతరించింది. ఎన్నో ఒడిదుడుకులు... మరెన్నో సవాళ్లను అధిగమించి నేడు (బుధవారం) 25వ టోర్నీకి శ్రీకారం చుడుతోంది. హాకీ అంటే అమితంగా ఇష్టపడే మలేసియా రాజు దివంగత సుల్తాన్ అజ్లాన్ షా ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్ఐహెచ్ ఉపాధ్యక్షుడిగా, ఆసియా హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయన 2014లో మరణించే వరకు ప్రతి టోర్నీకి హాజరయ్యేవారు. ప్రస్తుతం రహీమ్ మహ్మద్ ఆరిఫ్... ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న అజ్లాన్ షా కప్ టోర్నీ ప్రారంభోత్సవం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. సుల్తాన్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆరిఫ్ వెల్లడించారు. 2002లో మలేసియా హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. కింగ్ అజ్లాన్ షా నేతృత్వంలో ఈ టోర్నీని కౌలాలంపూర్‌లో అద్భుతంగా నిర్వహించారు. దీంతో ఆ ఒక్క ఏడాది మాత్రం అజ్లాన్ షా కప్ పోటీలు జరగలేదు. ఇక టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకు, క్రమంగా ఏడాదికోసారి ఘనంగా పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. మొదట కౌలాలంపూర్‌లో జరిగే ఈ టోర్నీని సుల్తాన్ కోరిక మేరకు శాశ్వతంగా ఇపోకు మర్చారు. ‘రియో’ లక్ష్యంగా భారత్ మరో ఐదు నెలల్లో జరగనున్న రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలన్న లక్ష్యంతో భారత్ అజ్లాన్ షా కప్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో నేడు తన తొలి మ్యాచ్‌లో జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా జూనియర్లను రంగంలోకి తెచ్చింది. రియో తుది జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉన్నందున కుర్రాళ్ల సత్తాను పూర్తి స్థాయిలో పరీక్షించాలని కోచ్ రోలెంట్ ఆల్ట్‌మన్స్ ప్రయత్నిస్తున్నారు. అలాగే గతేడాది ఈ టోర్నీలో కాంస్యంతో సంతృప్తిపడ్డ భారత్ ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. వాళ్లు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. పెద్ద టోర్నీల్లో రాణించేందుకు అజ్లాన్ షా కప్ ఓ మంచి వేదిక. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టిపెట్టుకుంటూ ముందుకెళ్తాం. ఈ దశలో ఏ జట్టునూ తేలికగా తీసుకోం’ అని ఆల్ట్‌మన్స్ పేర్కొన్నారు. ఆసీస్‌తో అసలు సవాలు భారత్‌తో పాటు ఆతిథ్య మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, జపాన్, కెనడాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 8 సార్లు, భారత్ ఐదుసార్లు ట్రోఫీలను సాధించాయి. టీమిండియా ఆఖరిసారి 2010లో టైటిల్‌ను నెగ్గింది. వర్షం కారణంగా ఫైనల్ రద్దు కావడంతో దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. -
పాక్ జట్టుకు పచ్చ జెండా
► టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అనుమతి ► నేడు భారత్‌కు రాక ► ఆదివారం లంకతో ప్రాక్టీస్ మ్యాచ్ ఇస్లామాబాద్: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. టోర్నమెంట్లో పాల్గొనేందుకుగాను భారత్‌కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని పాక్ బృందం భారత్‌కు రానుంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరీ నిసార్ అలీఖాన్‌తో జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత తమ జట్టును భారత్‌కు పంపుతున్నామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజమ్ సేథీ ప్రకటించారు. ‘క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. పాక్ జట్టు భారత్‌కు వెళ్లేందుకు మా అంతర్గత వ్యవహారాల మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌తో సంప్రదింపుల తర్వాత భద్రతపై భారత్ గట్టి హామీ ఇచ్చింది. భద్రతా అంశాలపై భారత హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి కూడా చర్చలు జరిపారు. వీటిపై మేం సంతృప్తిగా ఉన్నాం. దీంతో మా జట్టు శుక్రవారం రాత్రి దుబాయ్‌కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా శనివారం కోల్‌కతాకు చేరుకుంటుంది’ అని సేథీ పేర్కొన్నారు. మరోవైపు భద్రతపై చర్చల అనంతరం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని వెల్లడించింది. పాక్ హై కమిషనర్... కేంద్ర హోంశాఖ కార్యదర్శితో జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని ఎంఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాక్ ప్రధాని అనుమతితోనే... భద్రతపై లిఖితపూర్వక హామీ కావాలని పాక్ పట్టుబట్టడంతో ఉదయం నుంచి రెండు దేశాల మధ్య పెద్ద స్థాయిలోనే చర్చలు జరిగాయి. అయితే అన్ని జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడం, ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాక్ జట్టుకు అత్యున్నత ఏర్పాట్లు చేస్తామని నేరుగా పీసీబీకి ట్వీట్ చేయడంతో పాక్ ప్రభుత్వం మెట్టు దిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పాక్ హై కమిషనర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని సౌదీ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నిసార్ అలీఖాన్ నివేదించారు. దీంతో షరీఫ్ పాక్ జట్టు పర్యటనపై ఆమోద ముద్ర వేశారని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. తొలి ‘ప్రాక్టీస్’ రద్దు పాక్ జట్టు భారత్‌కు రావడం ఆలస్యం కావడంతో శనివారం బెంగాల్ రంజీ జట్టుతో జరగాల్సిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. అయితే ఆదివారం కోల్‌కతాలో శ్రీలంకతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. -
యూకీ పరాజయం
దుబాయ్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ వరుసగా రెండో టోర్నమెంట్లోనూ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. గతవారం ఢిల్లీ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన ఈ ఢిల్లీ ఆటగాడు... తాజాగా దుబాయ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన యూకీ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో 6-2, 6-7 (2/7), 0-6తో ప్రపంచ 51వ ర్యాంకర్ లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో చేజార్చుకున్న యూకీ నిర్ణాయక మూడో సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడం గమనార్హం. భూపతి జంట ఓటమి: పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మహేశ్ భూపతి (భారత్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జంట 4-6, 2-6తో సిమోన్ బొలెలీ-ఆండ్రియా సెప్పి (ఇటలీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భూపతి జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు చేజార్చుకుంది. గతవారం ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో యూకీ బాంబ్రీతో కలిసి ఆడి డబుల్స్ టైటిల్ నెగ్గిన భూపతి ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం. -
టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటా: సైనా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వ రల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందే భుజం నొప్పి నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 10 నుంచి జకార్తాలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సైనాకు వ రల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా క్వార్టర్స్ దాటి ముందుకెళ్లలేదు. ‘ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. అయితే టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటానన్న నమ్మకముంది. ఇక డ్రా విషయానికి వస్తే కఠినంగానే ఉంది. నా శిక్షణ ఆశాజనకంగా సాగుతోంది. అత్యున్నత టోర్నీలో ఆడేటప్పుడు మనం అన్ని విభాగాల్లోనూ రాటుదేలాల్సి ఉంటుంది’ అని సైనా తెలిపింది. -
సోమ్‌దేవ్ ఓటమి
చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లోనే భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 3-6, 4-6తో ఆరో సీడ్ యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. సోమ్దేవ్తోపాటు రామ్‌కుమార్ రామనాథన్, విజయ్ సుందర్ ప్రశాంత్ కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. రామ్‌కుమార్ 3-6, 3-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో; ప్రశాంత్ 2-6, 1-6తో జిరీ వెసిలి (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 6-4తో ఆండ్రియా హైదర్ (ఆస్ట్రియా)-లుకాస్ లాకో (స్లొవేకియా) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
అరుంధతి అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గుంటూరులో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో తమిళనాడును చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 33.3 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. మహాలక్ష్మి (51 బంతుల్లో 22; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. హైదరాబాద్ కెప్టెన్ అరుంధతి రెడ్డి 9 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. శ్రావణికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 16.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్నేహా మోరె (32 బంతుల్లో 28; 4 ఫోర్లు), రమ్య (52 బంతుల్లో 26 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. ఈ విజయంతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు దక్కాయి. ఇక ఐప్యాడ్ స్కోరింగ్... శుక్రవారం ప్రారంభమైన సౌత్‌జోన్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్‌తో బీసీసీఐ కొత్త సాంకేతిక విధానానికి శ్రీకారం చుట్టింది. మైదానంలోని స్కోరర్లు నేరుగా అప్డేట్లు చేసేందుకు వీలుగా తొలిసారి ఐప్యాడ్ల ద్వారా స్కోరింగ్ చేసే పద్ధతిని ప్రారంభించింది. దీని వల్ల బోర్డు పరిధిలో నిర్వహించే అన్ని దేశవాళీ మ్యాచ్‌ల వివరాలను ‘లైవ్’గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం బీసీసీఐ, అన్ని క్రికెట్ అసోసియేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యంతో ఆరు చొప్పున ఐప్యాడ్లు అందజేసింది. ఇటీవలే చెన్నైలో జరిగిన స్కోరర్ల సెమినార్లో ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీకి సంబంధించి అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ లేని సమయంలో ఏదైనా అప్డేట్ చేసినా అది అందుబాటులోకి వచ్చిన అనంతరం దానంతట అదే మార్పులు చేసుకోవడం ఈ సిస్టం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ సహా అన్ని మ్యాచ్‌లకు దీనిని అమల్లోకి తీసుకు రానున్నారు. ‘కలం, కాగితాన్ని పక్కన పెట్టి ఐప్యాడ్‌తో స్కోరింగ్ చేయడాన్ని కొత్త సాంకేతిక ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇకపై క్రికెట్ వీరాభిమానులు అండర్-19 స్థాయిలో కూడా ప్రతీ బంతి ఎలా సాగిందనే విషయం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మరే బోర్డు చేయని విధంగా బీసీసీఐ ఈ తరహాలో ప్రయోగం చేయడం సంతోషకరం’ అని సీనియర్ స్కోరర్ పి. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. -
ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ
ఎల్బీ స్టేడియుం: ఇంటర్ యుూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉస్మానియూ యుూనివర్సిటీ (ఓయుూ) జట్టు కెప్టెన్‌గా పి.రవ్యుకృష్ణ వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ పోటీలు ఈనెల 29 నుంచి సేళంలోని పెరియూర్ యుూనివర్సిటీలో జరుగుతారుు. ఓయుూ హ్యాండ్‌బాల్ జట్టు: పి.రవ్యుకృష్ణ (కెప్టెన్), వైష్ణవి భట్, కె.వి.శరణ్య, కె.ప్రియూంక, కె.లక్ష్మీప్రసన్న, పి. ద్వారక, డి.శ్రావణి రెడ్డి (భవాన్స్ కాలేజి), వి.రాణి, ఝాన్సీ (సెరుుంట్ ఆన్స్ కాలేజి), నిషా కువూరి, నిస్సి వుర్నాతి (సెరుుంట్ పారుుస్ కాలేజి), కార్తీక (సెరుుంట్ ఫ్రాన్సిస్ కాలేజి), వువుత (కస్తూర్బా గాంధీ కాలేజి), రవళి, అంకిత (లయోలా అకాడమీ), కె. దీపక్ ప్రసాద్ (కోచ్), గంగాధర్ (మేనేజర్). -
‘షటిల్’ స్పీడ్‌తో....
సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్....అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఎక్కడ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగినా మన ఆటగాళ్లదే హవా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సాధించే పతకాలన్నీ మన రాష్ట్ర క్రీడాకారులు అందించినవే. సీనియర్ స్థాయిలో ఒలింపిక్ మెడల్ వరకు మన ప్రభ వెలిగితే...జూనియర్ స్థాయిలోనైతే అనేకానేక విజయాలు దక్కాయి. ఒక వైపు స్టార్ ప్లేయర్లు తమ జోరును కొనసాగిస్తుంటే...మరో వైపు వర్ధమాన, యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా మన వద్ద బ్యాడ్మింటన్ ఒక్కసారిగా పాపులర్ క్రీడగా మారిపోయింది. ఆట నేర్చుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు అవకాశాలు పెరగడం కూడా అందుకు కారణం. మన రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ అకాడమీలు, కేంద్రాల్లో బ్యాడ్మింటన్‌లో చక్కటి శిక్షణ లభిస్తోంది. మన రాష్ట్రంలో ఈ ఆటలో అందుబాటులో ఉన్న శిక్షణా సౌకర్యాలపై ఒక దృష్టి... - మొహమ్మద్ అబ్దుల్ హాది పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ... దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ నంబర్‌వన్‌గా ఉన్న అకాడమీ ఇది. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నవారే. భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ నేతృత్వంలో సైనా, సింధు, కశ్యప్‌లాంటి ఎందరో ఆటగాళ్లు వరుస విజయాలు సాధించారు. అనేక మంది వర్ధమాన షట్లర్లు ఇక్కడినుంచే వెలుగులోకి వస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, కోర్టులు, శిక్షణతో ఈ అకాడమీ తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది. ప్రవేశం గోపీచంద్ అకాడమీలో ప్రధానంగా అగ్రశ్రేణి ఆటగాళ్లే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక లేదా జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినవారు ఇక్కడ చేరితే మరింత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. వారి పూర్వ ప్రదర్శనను బట్టి ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా కొత్తవారికి కూడా పరిమిత సంఖ్యలో శిక్షణ లభిస్తుంది. అయితే అందుకోసం ఇక్కడి నిపుణులైన కోచ్‌లు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాథమిక పరిజ్ఞానం, చురుకుదనాన్ని బట్టి ఎంపిక చేస్తారు. వివరాలకు గచ్చిబౌలిలోని అకాడమీ కేంద్రంలో సంప్రదించవచ్చు. నంద్యాల అకాడమీ... జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఈ ప్రైవేట్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నంది పైప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ అకాడమీలో ప్రస్తుతం 60 మంది ఆటగాళ్లకు ఇద్దరు కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. ఇతర వివరాలకు నంది స్పోర్ట్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇతరత్రా... మే నెలలో కొత్తగా మరో 3 ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. పుల్లెల గోపీచంద్ సహకారంతోనే, చిట్టూరి సుబ్బారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా అకాడమీ ప్రారంభం కానుంది. గతంలో శాప్‌లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో (షేక్‌పేట్, ఏఎస్‌రావునగర్)లలో కొత్తగా అకాడమీలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇది నగరంలోని బండ్లగూడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు కావచ్చు. ప్రభుత్వం తరఫున... ఖమ్మం శాప్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో హాస్టల్ సదుపాయంతో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఖమ్మంలో ఉంది. ఇక్కడినుంచి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో షట్లర్లు వెలుగులోకి వచ్చారు. 12-18 ఏళ్ల మధ్య వయసువారికి అవకాశం కల్పిస్తారు. గరిష్టంగా 20 మందిని తీసుకుంటారు. ఒక కోచ్ అందుబాటులో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు అప్పటికే జూనియర్ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులను అకాడమీలోకి తీసుకుంటారు. అయితే గత కొన్నాళ్లుగా టాలెంట్ సెర్చ్ కార్యక్రమం నిలిచిపోయింది. సాధారణంగా జూన్‌లో ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు ఖమ్మంలోని జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో గానీ హైదరాబాద్‌లోని శాప్ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించవచ్చు. స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ (సరూర్‌నగర్) రాజధాని నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ అకాడమీలో 12-18 ఏళ్ల మధ్య వయసు ఆటగాళ్లను కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు. ముగ్గురు కోచ్‌లు పని చేస్తున్నారు. కనీసం జిల్లా స్థాయిలో ఆడిన షట్లర్లను వివిధ దశల్లో వడపోతల అనంతరం ఎంపిక చేస్తారు. అయితే పూర్తిగా కొత్తగా ఉండే లెర్నర్స్ను కూడా 6-8 ఏళ్ల మధ్య వయసు వారిని ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వివరాలకు సరూర్‌నగర్ స్టేడియంలో సంప్రదించవచ్చు. ఎల్బీ స్టేడియం... శాప్ ప్రధాన కార్యాలయం ఉన్న లాల్‌బహదూర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ సాధన చేస్తారు. ఎల్బీ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చిన్నారులకు శాప్ నియమించిన కోచ్ శిక్షణ ఇస్తారు. శాప్ పరిధిలోని యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో కూడా పే అండ్ ప్లే పథకం కొనసాగుతోంది. అయితే ఎల్బీ స్టేడియంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కోచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి గలవారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించవచ్చు. విజయవాడలో.... ఒకప్పుడు అత్యుత్తమ క్రీడాకారులను అందించిన విజయవాడలో ఇప్పుడు బ్యాడ్మింటన్ కళ తప్పింది. కొన్నాళ్ల క్రితం చేతన్ ఆనంద్ అకాడమీని ప్రారంభించినా... వివిధ కారణాలతో అందులో శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు కోచింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నారులకు ఆటలో బేసిక్స్ నేర్పించేందుకు అవకాశం ఉంది. -
ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు. దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు. శభాష్ విరాట్... భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది. -
నేడు భారత్, పాక్ ఫైనల్
సింగపూర్: టోర్నమెంట్ ఏదైనా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. ఒకప్పుడు జాతీయ జట్లకే పరిమితమైన పోటీ ఇప్పుడు తృతీయ శ్రేణి జట్లకు కూడా పాకింది. ఇలాంటి నేపథ్యంలో మరో హోరాహోరీ పోరుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ టోర్నీ ఫైనల్ వేదిక కానుంది. నేడు (ఆదివారం) కళింగ మైదానంలో భారత్, పాక్ అండర్-23 జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇదే టోర్నీలో లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది -
నిఖత్ బానుకు రెండు టైటిల్స్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో నిరుటి విజేత అంతర్జాతీయ క్రీడాకారిణి నిఖత్ బాను యూత్, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను నిలబెటుకుంది. గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నిఖత్ బాను 11-9, 6-11, 11-7, 11-8, 11-6 స్కోరుతో ఎం.మౌనిక (జీఎస్ఎం)పై విజయం సాధించింది. యూత్ బాలికల సింగిల్స్ ఫైనల్లో నిఖత్ బాను 1-11, 8-11, 11-8, 11-9, 11-7తో మౌనిక (జీఎస్ఎం)పై గెలిచింది. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు సబ్ జూనియర్ బాలుర సింగిల్స్: 1.హరికృష్ణ (ఎస్‌పీటీటీఏ), 2.ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ), సబ్ జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.కె.వి.వి.వైశాలీ (అనంతపురం). జూనియర్ బాలుర సింగిల్స్: 1.హర్ష్ లహోటి (నారాయణగూడ వైఎంసీఏ), 2.ఆలీ మహ్మమద్(ఎస్‌పీటీటీఏ). జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.ఎం.మౌనిక (జీఎస్ఎం). యూత్ బాలుర సింగిల్స్: 1.హర్ష్ లహోటి(నారాయణగూడ వైఎంసీఏ), 2. పీయూష్ అగర్వాల్(ఎస్‌పీటీటీఏ). పురుషుల సింగిల్స్: 1.విఘ్నయ్రెడ్డి (ఎస్‌పీటీటీఏ), 2.కృష్ణ కిరిటీ (ఏజీ ఆఫీస్).